
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్(కేపీహెచ్‌బీకాలనీ): లేడీస్ హాస్టల్‌లోని యువతి ఫొటోలు తీసేందుకు యత్నించిన ఓ హాస్టల్ నిర్వాహాకుడి కొడుకును కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ధర్మారెడ్డికాలనీకి చెందిన మల్లేశ్వర్ లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. అయితే అతని కొడుకు చంద్రహాస్ హాస్టల్‌లోని బాల్కానీ ద్వారా బాత్‌రూంలోని ఓ యువతిని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసేందుకు యత్నించాడు. విషయాన్ని గుర్తించిన సదరు యువతి షీటీమ్స్‌కు వాట్సప్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేపీహెచ్‌బీ పోలీసులు హాస్టల్‌కు చేరుకొని విచారణ జరిపి నిందితుడు చంద్రహాస్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment