మత్తుమందు ఇస్తున్నారు.. మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదు..! | YSRCP MLC Varudu Kalyani Meets Girls Who Protesting Against Their Sadan In Visakhapatnam, More Details Inside | Sakshi
Sakshi News home page

Visakha Girls Sadan Issue: మత్తుమందు ఇస్తున్నారు.. మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదు..!

Published Thu, Jan 23 2025 12:12 PM | Last Updated on Thu, Jan 23 2025 12:59 PM

YSRCP MLC Varudu Kalyani Meets Girl Who Protest Against Their Sadan
  • ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వద్ద  బాలికల ఆవేదన
  • ఇది దుర్మార్గమైన చర్య: వరుదు కల్యాణి
  • ఏపీలో మహిళలకు రక్షణ లేదు
  • బాలికల సదన్‌ ఘటనపై విచారణ జరిపించండి

విశాఖ : తమకు మూడు రోజుల నుంచి  భోజనం పెట్టడం లేదని జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ(Visakha) వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహం(Girls Hostel)లోని బాలికలు నిరసనకు దిగారు. తమకు నిద్రమాత్రలు ఇచ్చి మానసికంగా రోగులుగా మారుస్తునన్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంటికి పంపించేయాలంటూ మరోసారి హాస్టల్‌ గోడదూకి  రోడ్డుపైకి వచ్చారు.

అయితే ఈరోజు(గురువారం)మరోసారి హాస్టల్‌ వద్ద ఆందోళన చేపట్టిన బాలికల్నిజజ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani) పరామర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాలికల శరీరంపై ఉన్న గాయాలు చూసి వివరాలు తెలుసుకున్నారు.

తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని  ఆ బాలికలు.. వరుదు కళ్యాణకి తెలిపారు. అంతే కాకుండా మత్తు మందు ఇస్తున్నారని బాధిత బాలికలు స్పష్టం చేశారు.

బాలికకు మత్తుమందు ఇవ్వడం దుర్మార్గం: వరుదు కళ్యాణి
ఈ ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘బాలికలకు మత్తు మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో  మహిళలకు రక్షణ లేదని,  బాలికల సదన్‌ ఘటనపై విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఐదుగురు బాలికల ఆందోళన

కాగా, జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్‌ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. 

విషయం తెలుసుకున్న రూరల్‌ తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్‌ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్‌ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.

దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు.  

మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. 
తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement