సాక్షి, విశాఖ: ఏపీలో టీడీపీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, రాష్ట్రంలో పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సీఎం అయ్యాకే అన్ని ధరలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండుగ రాష్ట్రంలో వెలవెలబోతోంది. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కుదేలు అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఉల్లి కొయ్యకుండానే కన్నీరు తెప్పిస్తుంది. పప్పుల ధరలు నిప్పుల్లా మండిపోతున్నాయి. దేశ సగటులో ఏపీలో ధరలు ఎక్కువ. చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.400ల అమ్ముతున్నారు. ఇలా అన్ని నిత్యవసర ధరలు పెరిగిపోతుంటే పేద వారు ఎలా బ్రతుకుతారు.
రాష్ట్రంలో పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి. హోం మంత్రి మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు. 16ఏళ్ల బాలికను టీడీపీ నేత హత్య చేస్తే హోమ్ మంత్రి వెళ్లి పరామర్శించరా?. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతుంటే చంద్రబాబు కాపాడుతారనే ధైర్యం వారిలో ఉంది. అందుకే పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ‘అమ్మాయిలపై అఘాయిత్యాలు.. పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు’
Comments
Please login to add a commentAdd a comment