పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు: వైఎస్సార్‌సీపీ శ్యామల | YSRCP Are Syamala Serious Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?: వైఎస్సార్‌సీపీ శ్యామల

Published Tue, Oct 8 2024 4:48 PM | Last Updated on Tue, Oct 8 2024 5:33 PM

YSRCP Are Syamala Serious Comments On Chandrababu And Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనంగా చెప్పుకుంటాం. ఇలాంటిది రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి కూటమి ప్రభుత్వం అక్కడ వాలి పోయింది. అప్పటి వరకు మంత్రులు కనీసం ఆవైపు తొంగి చూడలేదు. సాక్షాత్తూ సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి?.

అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?. ముచ్చుమర్రి ఘటనలో ఆ చిన్నారి డెడ్‌బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు వాపోతే పట్టించుకోలేదు. పైగా విద్యార్థులకు సెలవులు ఇచ్చి అందర్నీ బయటకు పంపించేశారు. ఈ ఘటనను సైలెంట్‌గా కేసు క్లోజ్ చేశారు. అసలు కెమెరాలు ఉంటే చూపించమని మంత్రి లోకేష్ అనటం బాధ్యతా రాహిత్యం. వైఎస్‌ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఎవరూ ఏమీ అడగరులే అని నిర్లక్ష్యమా?. అఘాయిత్యాలు చేస్తున్న వారికి కూటమి ప్రభుత్వం ధైర్యం ఇచ్చి ప్రోత్సాహమిస్తోంది. పార్టీ పెద్దలు చూసుకుంటారులే అని పేట్రేగిపోతున్నారు. ఏపీలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. 30వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?.

నన్ను వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా ఎంపిక చేశాక టీడీపీ ఫేక్‌ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయి. అత్యంత దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారు. టీడీపీ అఫీషియల్ గ్రూపులో నా గురించి అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. సోషల్‌ మీడిమాలో అసభ్య పదజాలంతో నాపై పోస్టులు పెట్టారు. నా ఫొటోలను ఫేక్‌ చేసి దారుణంగా ట్రోల్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?. సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?. సినీ పరిశ్రమ నుండి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ ముందు సినిమా నటుడు కాదా?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పనిచేయలేదా?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారా?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. నాకు రాజకీయాలు ఎందుకో వారందరికీ త్వరలోనే తెలుస్తుంది. మమ్మల్ని మానసికంగా దెబ్బ తీయాలనుకున్నా మేము ఎక్కడా వెనక్కు తగ్గం. వైఎస్సార్‌సీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: పవన్‌ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement