shyamala
-
'ఆ ఆలోచన నుంచి బయటికి రండి'.. చిరుకు శ్యామల చురకలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తనలాగే రామ్ చరణ్‌కు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు. మా ఇంట్లో నా చుట్టూ అంతా మనవరాల్లే ఉన్నారని.. ఇళ్లంతా లేడీస్ హాస్టల్‌ను తలపిస్తోందని అన్నారు. చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమనని భయమేస్తోందని సరదాగా అన్నారు. చిరు సరదాగా కామెంట్స్ చేసినప్పటికీ..దీనిపై పలువురు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. వారసుడంటే మగపిల్లాడేనా.. కూతుర్లు వారసురాళ్లు కాకూడదా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.తాజాగా చిరంజీవి చేసిన కామెంట్‌పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించింది. వారసుడు అంటే కొడుకే అవుతాడా?.. కూతురు అవ్వకూడదా? అని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు కానీ..వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అనే ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుంటుందని అన్నారు. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచన సరికాదన్నారు. వారి కోడలు ఉపాసన కూడా ఎంత చక్కగా రాణిస్తున్నారు. కొడుకైనా.. కూతురైనా వారసులు అవ్వొచ్చు అని తెలిపింది శ్యామల.మెగాస్టార్ ఏమన్నారంటే..బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంట్లో నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. -
కిరణ్‌రాయల్‌ను తొక్కి నార ఎప్పుడు తీస్తారు: శ్యామల
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి11) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నా అని కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు.తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.ఏపీలో మహిళలు భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ అన్యాయాలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఆడపిల్లకు అన్యాయం చేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు.ఈరోజు నేరస్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. లక్ష్మిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని మూడు రోజుల ముందే కిరణ్‌రాయల్ ఎలా చెప్పాడు? అసలు ఆ పోలీసులను పిలిపించింది ఎవరు? బాధితులనే అరెస్టు చేయడం ఒక్క ఏపీలోనే జరుగుతోంది. ప్రశ్నించే గొంతులను నులిమేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.అణచి వేయాలని చూస్తే అంతకుఅంతగా ఎదుగుతారని గుర్తుంచుకోండి.పవన్ కళ్యాణ్ సిద్దాంతం ప్రకారం..కిరణ్ రాయల్‌ను తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదు? అదేమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేక పోతున్నారు. ఆడపిల్లల కన్నీటి చుక్కలకు కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.సినిమా ఫంక్షన్లలో కొందరు అనవసర వాగుడు వాగుతున్నారు. వారి వలన సినిమా చచ్చిపోతుంది.సినిమా బతకాలి,దాని ద్వారా వందల కుటుంబాలు బతుకుతున్నాయి.నేను చాలా ఈవెంట్లకు హోస్ట్ చేశాను. కానీ ఎప్పుడూ 23 అనే మాట మాట్లాడలేదు’అని శ్యామల గుర్తుచేశారు. -
చంద్రబాబు మా అక్కచెల్లెమ్మలను మరోసారి నమ్మించి మోసం చేశారు
-
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు. -
సముద్రంలో 150 కి.మీ ఈత
కాకినాడ రూరల్ : సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది ఆసియాలోనే అరుదైన ఘనతను సాధించారు స్విమ్మర్ శ్యామల గోలి. గత నెల 28న విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో ఈత ప్రారంభించిన ఆమె ఏడో రోజైన శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కాకినాడ బీచ్‌కు చేరుకున్న శ్యామలకు కాకినాడ నగర కమిషనర్ భావన, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు. ఐదు పదుల వయసులో అలవోకగా సముద్రాలు ఈదుతూ సాహస యాత్రతో అబ్బుర పరుస్తున్న శ్యామలను చూసేందుకు, ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పట్నుంచీ స్విమ్మర్‌ను కాదని చెప్పారు. జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల మేర స్విమ్ చేసేలా తనను కోచ్ జాన్ సిద్ధిక్ తీర్చిదిద్దారన్నారు. 2021లో శ్రీలంక – ఇండియా మధ్య రామ్‌సేతును ఈదానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానని గుర్తు చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సముద్రంలో దిగి.. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒడ్డుకు వచ్చానని.. ఈ లెక్కన ఆరు రోజుల్లోనే లక్ష్యం చేరానన్నారు. స్విమ్మింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మహిళల్లో గైనిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
కూకట్ పల్లిలో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
హలో పవన్.. సీజ్ దిస్ ప్రాబ్లం శ్యామల మాస్ ర్యాగింగ్..
-
‘రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?’
గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె. సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు! -
మహిళలకు న్యాయం చేయకపోగా .. పంచాయతీ చేస్తారు
-
‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?. ..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు. -
పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని చెప్పారు.బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. -
ఓడిపోయినా నైతికంగా గెలిచిన నాయకుడు జగన్
-
పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు: వైఎస్సార్సీపీ శ్యామల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనంగా చెప్పుకుంటాం. ఇలాంటిది రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. మందుగానే పోలీసులు స్పందిస్తే ఆ పాప బతికేది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి కూటమి ప్రభుత్వం అక్కడ వాలి పోయింది. అప్పటి వరకు మంత్రులు కనీసం ఆవైపు తొంగి చూడలేదు. సాక్షాత్తూ సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి?.అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?. ముచ్చుమర్రి ఘటనలో ఆ చిన్నారి డెడ్‌బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు వాపోతే పట్టించుకోలేదు. పైగా విద్యార్థులకు సెలవులు ఇచ్చి అందర్నీ బయటకు పంపించేశారు. ఈ ఘటనను సైలెంట్‌గా కేసు క్లోజ్ చేశారు. అసలు కెమెరాలు ఉంటే చూపించమని మంత్రి లోకేష్ అనటం బాధ్యతా రాహిత్యం. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఎవరూ ఏమీ అడగరులే అని నిర్లక్ష్యమా?. అఘాయిత్యాలు చేస్తున్న వారికి కూటమి ప్రభుత్వం ధైర్యం ఇచ్చి ప్రోత్సాహమిస్తోంది. పార్టీ పెద్దలు చూసుకుంటారులే అని పేట్రేగిపోతున్నారు. ఏపీలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. 30వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?.నన్ను వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఎంపిక చేశాక టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయి. అత్యంత దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారు. టీడీపీ అఫీషియల్ గ్రూపులో నా గురించి అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. సోషల్ మీడిమాలో అసభ్య పదజాలంతో నాపై పోస్టులు పెట్టారు. నా ఫొటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?. సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?. సినీ పరిశ్రమ నుండి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినిమా నటుడు కాదా?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పనిచేయలేదా?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారా?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. నాకు రాజకీయాలు ఎందుకో వారందరికీ త్వరలోనే తెలుస్తుంది. మమ్మల్ని మానసికంగా దెబ్బ తీయాలనుకున్నా మేము ఎక్కడా వెనక్కు తగ్గం. వైఎస్సార్సీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా -
ఈవిడే శ్యామల.. 19 ఏళ్లకే సప్త సముద్రాలు దాటి..!
-
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
సోషల్ మీడియాలో ట్రోల్స్.. బెదిరింపు కాల్స్.. యాంకర్ శ్యామల ఆవేదన!
తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోనని వెల్లడించారు.అయితే ఎవరినీ కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఎవరి అభిమానం వారిదని.. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తనవంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు వైఎస్సార్సీపీ అప్పగించిన పనిని నిర్వర్తించానని శ్యామల పేర్కొన్నారు. -
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది. -
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
-
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
-
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
-
పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
-
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
-
వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
నటుడు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇది నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది పక్కనబెడితే తాజాగా వైఎస్సార్సీపీ నాయకురాలు, నటి శ్యామల.. పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని కూడా అన్నారు.(ఇదీ చదవండి: పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..)'వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కల్యాణ్.. మిగతా సినిమా వాళ్లని ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. ఆమెని ఓడించడం ఎవరి వల్ల కాదు. గీత.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆమెకు భారీ మెజారిటీ రావాలని నేను కూడా ప్రచారం చేస్తున్నాను. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యం' అని శ్యామల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు) -
కృష్ణంరాజుతో పెళ్లికి అమ్మ ఒప్పుకోలేదు: శ్యామలా దేవి
మంచితనానికి, హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణం రాజు. సాయం కోసం చేయి చాచిన ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారు. చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. మరో మూడు రోజుల్లో (జనవరి 20న) ఆయన పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా అభిమానులు కృష్ణం రాజును తలుచుకుంటున్నారు. తాజాగా ఆయన సతీమణి శ్యామలా దేవి.. కృష్ణం రాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు శ్యామలా దేవి మాట్లాడుతూ.. 'నాకు తల్లీతండ్రీ, గురువు, దైవం, సర్వస్వం అంతా కృష్టం రాజుగారే! నాకు ఆయనే సర్వాంతర్యామి. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు. ఆయన జ్ఞాపకార్థంగా నేను మిగిలున్నానంతే! నేను ఆయన జీవితంలోకి ఎలా వచ్చానంటే... కృష్టం రాజుగారు ఎన్నో దానధర్మాలు చేస్తారని ఇంట్లో మాట్లాడుకుంటే విన్నాను. అలా ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అనుకోకుండా మా చుట్టాల ద్వారా తనతో పెళ్లి సంబంధం కుదిరి ఆయన అర్ధాంగిగా మారాను. కానీ అప్పటికే కృష్ణం రాజుకు ఓసారి పెళ్లయింది. మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఓసారి చెన్నైలో షాపింగ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదంలో ఆమె మరణించింది. నిరాహార దీక్ష.. ఇది ఆయన జీవితంలో మర్చిపోలేని విషాదం. ఆ బాధ తట్టుకోలేకపోయాడు, ఒంటరివాడయ్యాడు. ఇది చూసిన కృష్ణం రాజు తండ్రి ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు కానీ తన ఆకలి తనకు తెలియదు. అడిగి భోజనం పెట్టేది భార్య మాత్రమే అని రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతాదేవిని ప్రాణంగా ప్రేమించిన ఆయన రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మామయ్య.. ఈయన పెళ్లికి ఒప్పుకునేవరకు భోజనం చేయనని నిరాహార దీక్ష చేశారు. తండ్రి బాధ చూడలేక కృష్ణం రాజు రెండో పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి అమ్మాయి కోసం ఆరా తీయగా నా బంధువులెవరో నా పేరు సూచించారు. కానీ ఇక్కడ మా అమ్మ ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించారనుకున్నారు రెండో పెళ్లి.. పిల్లలు కావాలనుకుంటారో, లేదో.. అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. అయితే నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఎందుకంటే అప్పటికే తనపై మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి పెళ్లికి సిద్ధమయ్యాను. నన్ను బలవంతంగా ఒప్పించారేమోనని కృష్ణంరాజు అనుకున్నారు. అసలు విషయం కనుక్కోమని తన కజిన్‌ను నా దగ్గరకు పంపించగా.. నేను ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నానని చెప్పాను. నిజానికి కృష్ణంరాజుకు వారసుడు పుట్టాడు. ఆయన మొదటి భార్యకు ఓ కొడుకు పుట్టి జన్మించాడు. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు మరణించాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి.. ముఖ్య అతిథిగా మోదీ -
ని‘వేదనలు..’ ప్రజావాణికి వినతుల వెల్లువ*
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. రెండేళ్లుగా వేతనాల్లేవ్.. మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు బోర్లకు అడ్డుపడుతున్నరు మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్హత్నూర్ పట్టా చేయడం లేదు నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్ షెడ్లు కేటాయించాలి మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్ అనుమతి లేదని కూల్చేశారు సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల. -
పావలా శ్యామలను ఆదుకున్న కాదంబరి కిరణ్
-
Anchor Shyamala: స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
శ్యామల కేసులో ట్విస్ట్: ముందు వేధింపులు, ఏడాది క్రితం అత్యాచారం.. ఏది నిజం!
అనంతపురం: కళ్యాణదుర్గం మండలం ఈస్ట్కోడిపల్లికి చెందిన శ్యామల కేసుకు సంబంధించి త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలోని కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న ఈస్ట్ కోడిపల్లిలో ఓ ఇంట్లో మహిళ, మరో వ్యక్తి కలసి ఉండగా స్థానికులు తలుపులకు తాళం వేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళం తీసి ఇంట్లో ఉన్న శ్యామల, బోయ హరిలను బయటకు తీసుకువచ్చారు. స్థానికుల సమక్షంలో విచారణ చేపట్టారు. బోయ హరితో పాటు ఇంట్లో ఉన్న మహిళ చేష్టలు మంచివి కావని స్థానికులు తెలిపారు. వీరిలాగే కొనసాగితే ఎవరైనా ఆమెకు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించి తాము ఆ ఇంటికి తాళం వేశామని ఎస్ఐ సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాథమికంగా అన్ని కోణాల్లో ఆరా తీసిన ఎస్ఐ అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించి, ఉదయాన్నే స్టేషన్‌కు రావాలని సూచించి వెళ్లిపోయారు. 11న ఉదయం శ్యామల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ముందు రోజు జరిగిన దానికి భిన్నంగా ఫిర్యాదు చేసింది. బోయ హరి తనను మూడు నెలలుగా వేధిస్తున్నాడని, లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అందులో పేర్కొంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 14న ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘పోలీస్ స్పందన’కు ప్రజా సంఘాల నాయకులతో కలసి వచ్చిన శ్యామల తనను ఏడాది కిందట ఐదుగురు సామూహిక అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. మీడియా ముందు ఇదే విషయాన్ని వెల్లడించింది. సదరు మహిళకు న్యాయం చేయడం కోసం ముందుగా కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలలో భాగంగా విచారణ చేపట్టామన్నారు. శ్యామలకు ఎలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కిందిస్థాయి పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. శ్యామల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ విజయభాస్కరరెడ్డి, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులులు పాల్గొన్నారు. -
ప్రభాస్.. మాకు దేవుడు ఇచ్చిన వరం..!
-
చెల్లెళ్ళు అంటే మహా ఇష్టం ప్రభాస్ కు
-
జూ ఎన్టీఆర్ వస్తే చాలు అల్లరే అల్లరి..!
-
ప్రేమలో అయ్యా కొడుకులు ఎక్కడ తగ్గారు..
-
రామ్ చరణ్ భార్య చాలా హెల్ప్ చేసింది
-
Anchor Shyamala Latest Photos: స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
ప్రభాస్ మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం
-
11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్తున్నావా? అన్నారు: శ్యామల
బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో విలన్‌గా నటించింది శ్యామల. తర్వాత మైక్ పట్టి యాంకరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. ఇటీవల వచ్చిన విరూపాక్షలోనూ ముఖ్య పాత్ర పోషించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను చాలా త్వరగా ప్రేమలో పడ్డాను. 19 ఏళ్లకే కులాంతర వివాహం చేసుకున్నాను. అమ్మానాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా మామయ్య వాళ్లు ఇంట్లో శుభలేఖ ఇచ్చి పిలిచారు. కానీ ఎవరూ రాలేదు. ఇప్పటికీ ఈ విషయంలో నేను బాధపడుతూనే ఉంటాను. నా పెళ్లి మా అమ్మ చూడలేదు.. అదే నా జీవితంలో మిగిలిపోయిన లోటు. ఆమెను ఎలాగోలా ఒప్పించి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఉండుంటే బాగుండేదనిపిస్తుంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత మా అమ్మ ఒక రోజు సడన్‌గా ఇంటికి వచ్చింది. తనను చూసి ఒక్కసారిగా నేను షాకయ్యాను. నా భర్త గురించి, ఆయన కుటుంబం గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నా దగ్గరికి వచ్చింది. నాకు కొడుకు పుట్టిన తర్వాత రాకపోకలు మరింత పెరిగాయి. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. నరసింహ నా ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోడు. ఇద్దరం మా పని మేము చేసుకుంటాం. నేను ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. బాబు పుట్టాక గ్యాప్ వచ్చింది. ఇషాన్‌కు 11 నెలల వయసున్నప్పుడు బిగ్‌బాస్ 2 ఆఫర్ వచ్చింది. అలా ఆ రియాలిటీ షోకి వెళ్లాను. అప్పుడు నాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇంత చిన్న బాబును వదిలేసి డబ్బు కోసం వెళ్తున్నావా? అని నానామాటలు అన్నారు. కానీ నేనేంటో మా ఫ్యామిలీకి తెలుసు, కాబట్టి ఆ మాటలను నేను పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో జరిగిన షాకింగ్ సంఘటన.. ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టడం. ఆమె నాకు తెలుసు. మా ఇంటికొస్తే నా చేతితోనే భోజనం వండి పెట్టాను. చివరకు ఆమె నా భర్త మీదే చీటింగ్ కేసు పెట్టింది. తనతో మాట్లాడాలన్నా నాకు మనసు విరిగిపోయింది. నా భర్త మోసం చేసే వ్యక్తి కాదు. అలాంటిది ఇంత పెద్ద ఆరోపణ మోపింది. ఆయన ఏ తప్పూ చేయలేదు. చివరకు అదే రుజువైంది. మన అనుకునేవాళ్లు కూడా వెన్నుపోటు పొడుస్తారని అప్పుడే అర్థమైంది' అని చెప్పుకొచ్చింది శ్యామల. చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక రియాక్షన్ ఏంటంటే? -
రాఘవ లారెన్స్ తో యాంకర్ శ్యామల స్పెషల్ చిట్ చాట్
-
‘ఒక్క సినిమాతో ఆస్తులన్నీ పోయాయి.. అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది’
కాకినాడ శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె దాదాపుగా 200 సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా నటించింది. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కాకినాడ శ్యామల గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత జీవితంపై శ్యామల మాట్లాడారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ..'నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశా. సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులిచ్చాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత ఆస్తులన్నీ పొగొట్టుకుంది. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు .. బయట కనిపించే స్మిత వేరు. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవు. అయినప్పటికీ సిల్క్‌స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తరువాత ఆమె కెరియర్ బాగానే సాగింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నా. ' అని అన్నారు -
కె విశ్వనాథ్ సతీమణి మృతి బాధాకరం: శ్యామలా దేవి సంతాపం
కె. విశ్వనాథ్ కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మీ కూడా మరణించారని తెలిసి చాలా బాధేసిందని కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలా దేవి అన్నారు. 'తండ్రిని కోల్పోయి బాధలో మునిగిపోయిన ఆ పిల్లలకు తల్లి కూడా దూరం అవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. కృష్ణంరాజు గారు ఆమెను మాతృ సమానురాలిగా గౌరవించేవారు. అలాంటి జయలక్ష్మీ గారు మనల్ని విడిచి వెళ్లి పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా' అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. కాగా అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విశ్వనాథ్ సతీమణి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ దగ్గరలోనే ఉందనిపిస్తోంది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది. అయితే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్ కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది. ఈ ఘనత సాధించిన రాజమౌళికి, చిరంజీవులు రామ్ చరణ్, ఎన్టీఆర్లకు నా శుభాభినందనలు. సంగీతం అందించిన కీరవాణి సహా సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలుఅంటూ ఆమె పేర్కొన్నారు. -
నా భర్తను హత్య చేసి ఆ నింద నాపై వేశారు: నటి
మరో చరిత్ర సినిమాతో వెండితెరకు పరిచయమైంది కాకినాడ శ్యామల. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఇటీవలే తన ఆస్తులు ఎలా కరిగిపోయాయో వెల్లడించిన ఆమె తనపై, తన భర్తపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది. 'నా భర్తను హత్య చేశారు. కానీ ఆ హత్య నేను చేయించినట్లు నాపై నింద వేశారు. దాన్ని నేను తప్పని నిరూపించి హత్య చేసిన వ్యక్తికి 18 ఏళ్లు జైలుశిక్ష పడేలా చేశాను. ఒకరోజు నేను బయటకు వెళ్లి వస్తుంటే ఒకతను నా నెత్తిపై కొట్టాడు. బాధతో నేను తల్లడిల్లుతుంటే నన్ను ఇంకా కొడుతూనే ఉన్నాడు. అలా నన్ను కూడా చంపాలని చూశారు. ఇదంతా చేయించింది మరెవరో కాదు, నాకు వరుసకు కొడుకైన వ్యక్తి! స్వయానా నా భర్త అన్న కొడుకే ఆస్తి కోసం ఇంత కుట్ర పన్నాడు. చివరకు నన్ను అనాధను చేశారు. నాకు పిల్లలు పుట్టకపోవడంతో చెల్లి కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను' అంటూ కంటతడి పెట్టుకుంది కాకినాడ శ్యామల. చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం -
600 ఎకరాలు పోయాయి.. మగాడివే కాదని భర్తను తిట్టాను: నటి
కాకినాడ శ్యామల.. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని దాదాపు 200 భాషల్లో నటించింది. రంగస్థలంలో తన సత్తా చాటిన ఆమె మరో చరిత్ర సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మరో చరిత్ర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, ఆనంద భైరవి, మయూరి, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులో చాలా సినిమాలే చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు ఎలా కరిగిపోయాయనే విషయాన్ని బయటపెట్టింది. 'మరో చరిత్ర మూవీతో నా సినీ కెరీర్ మొదలైంది. నటించడమే కాకుండా నిర్మాతగానూ కొన్ని చిత్రాలు తెరకెక్కించాను. కృష్ణంరాజుతో నిత్య సుమంగళి సినిమా తీశాను. అది బానే ఆడింది, కానీ డిస్ట్రిబ్యూటర్ మోసం చేయడంతో డబ్బులు పోయాయి. పచ్చబొట్టు సినిమా తీశాం. అప్పుడు మళ్లీ డిస్ట్రిబ్యూటర్‌తో విబేధాలు రావడంతో సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. మధ్యలో మా ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. ఆయనకు మా మామయ్యగారు 600 ఎకరాలు రాసిచ్చారు. మా ఆయన రసికుడు, పని పాటా లేదు. ఆరు వందల ఎకరాలను 38 ఎకరాలు చేశాడు. నేను ఆయన్ను చాలా తిట్టేవాడిని.. మగాడివైతే సంపాదించి భార్యాబిడ్డలకు పెట్టాలి. అలాంటి మగాడిని ఇష్టపడతాను. నా దృష్టిలో నువ్వు మగాడివే కాదని ముఖం మీదే తిట్టాను. ఆయన 63 ఏళ్ల వయసులో చనిపోయాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాన్న చనిపోయారనగానే హ్యాపీగా ఫీలయ్యా: జబర్దస్త్ పవిత్ర -
కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పని చేశారు: శ్యామల
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కడసారి ఆయనను కళ్లారా చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు సెలబ్రిటీలు. సోషల్ మీడియా వేదికగా తారలు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కైకాల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆయన భార్య, కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆ మధ్య కృష్ణంరాజు గారు.. ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి.. అని అడిగితే ఖచ్చితంగా వస్తానని, మీరే ఒక టైం చూసి చెప్పమన్నారు. కానీ ఆయన మా ఇంటికి రాలేకపోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజుతో అనేక అద్భుత చిత్రాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. లెజెండరీ నటుడైన కైకాల ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడంటే కేవలం అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరమవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని తెలిపారు శ్యామల. చదవండి: అదే ఆయన చివరి కోరిక.. కానీ అది తీరకుండానే కన్నుమూసిన కైకాల దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే! -
కలిసే చనిపోవాలనుకున్నారేమో!: కృష్ణం రాజు భార్య కంటతడి
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకప్పటి తరం హీరోలందరూ కన్నుమూశారంటూ తెలుగు ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా సీనియర్ హీరోలందరూ మన మధ్య లేకపోవడంతో ఒక తరం శకం ముగిసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా నేడు ఉదయం తెల్లవారుజామున కృష్ణ మరణించారు. ఇండస్ట్రీకి చెందిన పలువురూ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజు భార్య శ్యామ దేవి కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం కన్నీటి పర్యంతమయ్యారు. 'కృష్టం రాజుకి కృష్ణ అంటే ఎంతో అనుబంధం. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసే వెళ్లిపోదాం అనుకున్నారేమో! అందుకే మనందరికీ ఇంత బాధను మిగిల్చి ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహేశ్‌బాబు వరుసగా అన్న, తల్లి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సుల్తాన్ సినిమా దగ్గరి నుంచి కృష్ణగారి కుటుంబంతో నాకూ మంచి అనుబంధమేర్పడింది. షూటింగ్లో భాగంగా అండమాన్‌లో నెల రోజులపాటు ఉన్నప్పుడు విజయ నిర్మల గారు వంట చేసి పెట్టేవారు. మొన్న కృష్ణ బర్త్‌డేకి కూడా కృష్ణం రాజు గారు ఫోన్ చేసి ఇంటికి రా, చేపల పులుసు చేసి పెడతానన్నారు. అలాంటిది.. ఈరోజు వాళ్లిద్దరూ లేరంటే తట్టుకోలేకపోతున్నాం. భూమి, ఆకాశం ఉన్నంతవరకు వారు చిరస్మరణీయులుగా మిగిలిపోతారు' అని చెప్తూ ఏడ్చేసింది శ్యామలా దేవి. కాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తనువు చాలించారు. చదవండి: కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్‌బాబు అదే సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం.. -
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?
నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. -
కృష్ణంరాజుగారు నాకు పెద్ద బహుమతి
మీ పెళ్లయ్యి 23 (2019కి) ఏళ్లు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి... కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. మా జీవితం మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కారణం. కోపాలు ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. అయితే కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది. పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా? శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే పెద్ద బహుమతి. శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి? కృష్ణంరాజు: తనే నాకు గిఫ్ట్. శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను బహుమతిగా ఇచ్చాను (నవ్వుతూ). కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా? శ్యామల: పెళ్లి రోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి చూసుకుంటూ ముఖం చూశాను. కలా? నిజమా అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. నాకు జామకాయలంటే ఇష్టం. విడిది ఇంట్లో జామ చెట్టు ఉంది. నేను జామకాయలు కోస్తుంటే ‘పెళ్లి కూతురివి. కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది. పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతుంటే భయం అనిపించిందా? శ్యామల: వీళ్లది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అంత మందిలో నేను ఇమడగలుగుతానా అని అమ్మ భయపడింది. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని ధైర్యం ఇచ్చారు. మరి.. పెళ్లి చూపుల గురించి? శ్యామల: ఆయన వాళ్ల కజిన్‌ని పంపించి, అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అని అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు. కృష్ణంరాజుగారి ఫస్ట్ భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే సందేహం ఏమైనా? శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. ఆ ఫ్యామిలీలోకి వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను. ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది? కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ అంతే చేస్తాను. శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా అభిప్రాయం. కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మన సులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు. మీకు ముగ్గురి పిల్లల చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి? కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజు డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను. అలా నమ్మి పెంచడంవల్ల పిల్లలు డొనేషన్ కట్టించుకోవడానికి, రికమండేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్ద అమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్టీయూలో సీట్ వచ్చింది. మూడో పాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. అయితే బాగా చదువుకుని తనే సీట్ తెచ్చుకుంది. పిల్లలు చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ? కృష్ణంరాజు: తన పాత్ర ఎక్కువ. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకేం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? అన్నీ తనకు తెలుసు. ఆవిడకి ముగ్గురు పిల్లలు కాదు... నాతో కలిపి నలుగురం. ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబు (కృష్ణంరాజు)ని పెంచడమా? శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో పిల్లల్ని వాళ్ల నాన్న దగ్గర పెట్టి నేను పూజలకు వెళతాను. మా పుట్టింటికి వెళ్లాలన్నా ఒకటీ రెండు రోజులు మాత్రమే. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. మనం తెలుసుకుని పెట్టాలి. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలనేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది. కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీ వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి? శ్యామల: అన్నీ ఇష్టమే. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. మావాళ్లు ఫుడ్ బాగా తింటారు.. అలానే అందరికీ పెడతారు. ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. ఆయన పెద్దక్క నాకు నేర్పించారు. ఆయన చేపల కూర బాగా వండుతారు. మీరు వంట ఎలా నేర్చుకున్నారు? కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పొద్దున్నే పచ్చ పావురాలను వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. లంచ్‌కి కొండ గొర్రె వండించేవాళ్లం. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు పారిపోతే, నేనే వంట చేసేవాడిని. ఆ విధంగా వంట నేర్చుకున్నాను. ఎప్పుడైనా పులిని వేటాడారా? కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు. శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా.. కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంత దూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తెస్తే.. నన్ను గుర్తు పట్టింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌కి కొన్ని టిప్స్? ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొందరు మగపిల్లలు ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అలాగే ‘ఈగో’ సమస్యలతో విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. అలాగే ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అన్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి. – డి.జి. భవాని ప్రభాస్ గురించి? శ్యామల: మా ఆయన్ను ప్రభాస్ ‘పెద్ద బాజీ’ అని పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. తనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు. -
శభాష్.. శ్యామల! సముద్రంపై సాహ'షి'
కలలో కూడా అలలపై ఈదాలనే ఆలోచనే రాలేదు. సప్త సముద్రాలు పేర్లు విన్నప్పుడూ.. వాటిపై తన పేరున రికార్డులు సృష్టిస్తానని అనుకోలేదు. కానీ.. సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్న ఆమె ప్రపంచంలోని సముద్రాలను సైతం అలవోకగా ఈదేస్తున్నారు. అది కూడా 47 ఏళ్ల వయసులో. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఎదురొడ్డుతూ.. కారు చీకట్లలో సైతం నడి సంద్రాన్ని వెనక్కి నెట్టేస్తూ అంతర్జాతీయ స్విమ్మర్లను సైతం అబ్బుర పరుస్తున్నారు స్విమ్మర్ గోలి శ్యామల. సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సామర్లకోట గోలి శ్యామల స్వస్థలం. తండ్రి సాధారణ రైతు. చిన్నప్పటి నుంచి శ్యామలను చదువు వైపే ప్రోత్సహించారు. ఎంఏ సోషియాలజీ చేసిన ఆమె వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కళలపై ఆసక్తితో యానిమేషన్ నేర్చుకుని.. ఒక సంస్థను కూడా స్థాపించారు. ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఆ సంస్థను మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా డిప్రెషన్లోకి వెళ్లిన శ్యామల దానినుంచి బయటపడేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. తన స్విమ్మింగ్ శిక్షణ వృథా కాకూడదనే ఆలోచన ఆమెను శ్రీలంక–భారత్ మధ్య గల పాక్ జలసంధిని అధిగమించేలా చేసింది. గతేడాది మార్చిలో 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని 13.47 గంటల్లో పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ, తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకు ముందు భారత దేశానికి చెందిన ప్రముఖ స్విమ్మర్ అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత బులా చౌదురి 2004లో 35 ఏళ్ల వయసులో 14 గంటల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. కఠినమైన ‘కాటాలినా’లోనూ విజయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సెవన్ ఓపెన్ ఓషన్ వాటర్ స్విమ్లలో (సప్త సముద్రాల్లో ఈత అని కూడా అంటారు) ఒకటిగా పిలిచే కాటాలినా చానల్‌ను గత ఏడాది సెప్టెంబర్ 29న తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు శ్యామల. కాలిఫోర్నియాలోని శాంటా కాటాలినా ద్వీపం నుంచి లాస్ ఏంజెల్స్ మధ్య విస్తరించి ఉన్న 36 కిలోమీటర్ల పొడవైన చానల్‌ను ఈదడం ఆషామాషీ కాదు. 15 డిగ్రీల చల్లని నీరు.. ఎముకలు కొరికే చలి.. సముద్రంలోకి దిగితే రక్తం గడ్డకట్టే వాతావరణం అక్కడ ఉంటాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈదడం అంటే శీతల ప్రాంతాల నుంచి వచ్చిన సాహసికులు సైతం ఐదారు సార్లు ప్రయత్నించక తప్పదు. అలాంటిది ఉష్ణ మండల ప్రాంతం నుంచి వెళ్లిన శ్యామల అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి 19.47 గంటల్లో కాటాలినా లక్ష్యాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. కాటాలినాను అధిగమించిన 10 మంది భారతీయుల్లో ముగ్గురు మహిళలు ఉంటే అందులో తెలుగు గడ్డ నుంచి శ్యామల స్థానం సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ‘కైవీ’ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కైవీ చానల్లో సాహసం చేసిన తొలి ఆసియా మహిళగా శ్యామల రికార్డు నెలకొల్పారు. అమెరికాలోని హవాయి దీవుల్లో 48 కిలోమీటర్ల పొడవైన ‘కైవీ చానల్‌ను ఈదడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామల ప్రయత్నించి విఫలమయ్యారు. కేవలం లక్ష్యానికి 4.5 కి.వీ. దూరంలో ఒక్కసారిగా సముద్రంలో చోటుచేసుకున్న మార్పులు.. ఆరు కిలోమీటర్ల వేగంతో వెనక్కి నెడుతున్న అలల మధ్య నాలుగు గంటలు శ్రమించినా మూడు కిలోమీటర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ప్రయత్నాన్ని అర్ధంతరంగా ముగించుకున్నారు. అయితే కైవీ సాహస యాత్రలో నిర్విరామంగా 22 గంటలపాటు 43.5 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది ప్రశంసలు అందుకున్నారు. ‘ఇంగ్లిష్ చానల్’ దిశగా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లిష్ చానల్ (ఉత్తర ప్రాన్స్–దక్షిణ ఇంగ్లండ్ మధ్య అట్లాంటిక్ సముద్రం)ను ఈదే లక్ష్యంతో శ్యామల కఠోర సాధన చేస్తున్నారు. జూన్‌లో చేసే ఈ సాహస యాత్రకు శ్యామల రోజుకు 8 గంటలు సాధనలో 6గంటలకు పైగానే స్విమ్మింగ్ పూల్‌లో ఉంటున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నేను సముద్రాన్ని ఈదుతా అన్నప్పుడు అన్నిచోట్లా హేళనకు గురయ్యాను. చాలామంది నీ వయసేంటి అన్నారు. కుటుంబ సభ్యులైతే స్విమ్మింగ్ దుస్తుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, నేను ఆత్మ విశ్వాసంతోనే ముందుకు వెళ్లాను. నా దృష్టిలో వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నేను కైవీని అధిగమిస్తున్నప్పుడు అతిపెద్ద వేల్ చేప నన్ను తాకుతూపోతుంటే గుండె ఝల్లుమంది. చాలాచోట్ల షార్క్ పిల్లలు వెంటపడేవి. ఒక్కోసారి భయం వేసేది. ఆర్థిక ఇబ్బందుల్లో ఈదుతున్న నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. – గోలి శ్యామల, అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ -
వైరల్: యాంకర్ శ్యామల గృహ ప్రవేశం వీడియో
Bigg Boss Syamala New House Warming Video Goes Viral: యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో శ్యామల ఒకరు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్‌తో మెప్పిస్తుంది. ఆడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోననూ యాక్టివ్‌గా ఉండే శ్యామల తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇటీవలె కొత్త ఇంట్లోకి మారిన ఈ యాంకరమ్మ తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను షేర్చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. కమెడియన్ అలీ, యాంకర్ సుమ దంపతులు, తనీష్, గీతా మాధురి సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. -
కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్
Anchor Shyamala New House Warming Promo Video Viral: టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇటీవలె యాంకర్ శ్యామల కొత్త ఇంట్లోకి మారింది. దీనికి సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్ కనకాల, తనీష్‌లతో పాటు సింగర్ గీతా మాధురి సహా పలువురు పాల్గొన్నారు. కాగా శ్యామల బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
చీటింగ్ కేసు: నాపై అన్యాయంగా కేసు నమోదు చేశారు
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్ల విలువైన స్థలం అభివృద్ధి పేరుతో ఖాజాగూడ వాసి సింధూర రెడ్డిని నమ్మించి రూ.85 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నర్సింహ్మారెడ్డితో పాటు అరెస్టు అయిన తిలక్‌నగర్ వాసి మట్ట జయంతి గౌడ్ గురువారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. అందులో జయంతి మాట్లాడుతూ... ‘నా తప్పు ఏమీ లేదు. అనుకోని పరిస్థితుల్లో రెండు నెలల క్రితం నర్సింహ్మారెడ్డి నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఓ అమ్మాయి నాకు కాల్ చేసి వేధిస్తోంది అని చెప్తే మాములుగా ఆమెకు కాల్ చేశాను. అప్పుడు ఆ అమ్మాయే నన్ను వేధించిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నర్సింహ్మారెడ్డిని తీసుకువెళ్లి రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఆ అమ్మాయిపై ఫిర్యాదు ఇప్పించా.. మా ఫిర్యాదును పక్కన పెట్టిన పోలీసులు అంతకు ముందు ఆ అమ్మాయి ఇతడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆమె అనేక మంది నుంచి ఇలానే డబ్బులు తీసుకుంటోంది. నేను ఆమెకు రెండుసార్లు కాల్ చేస్తే ఆమె నాకు నాలుగు సార్లు కాల్ చేసింది. ఆమె బండారం బయటపడకుండా ఉండటానికి మాపై కేసు నమోదు చేయించింది. మాకు న్యాయం చేయకపోతే కమిషనర్‌ను కలుస్తానంటూ పోలీసుస్టేషన్లో చెప్పాను. దీంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు ఆమె ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేయకుండా నాపై చర్యలు తీసుకున్నారు’ అని ఆరోపించారు. అయితే జయంతి చేస్తున్న ఆరోపణలను రాయదుర్గం పోలీసులు ఖండిస్తున్నారు. సింధూర రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. చదవండి: దారుణం: రూ.15 వేల కోసం.. అమ్మకానికి కూతురు -
యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా?
టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తుంటుంది. ఇటీవల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసుతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా గురిచేశాడని ఆరోపించింది. తాజాగా ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందిస్తూ.. తనపై తప్పుడు కేసు పెట్టారని, త్వరలో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శ్యామల.. ‘అవునా.. ఈ విషయం నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ సెటైర్ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటూ వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. చదవండి : చీటింగ్ కేసు : వీడియో రిలీజ్ చేసిన యాంకర్ శ్యామల భర్త మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ -
చీటింగ్ కేసు : వీడియో రిలీజ్ చేసిన యాంకర్ శ్యామల భర్త
ఓ మహిళ నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు నుంచి బెయల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, మరో రెండు రోజుల్లో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తుందని చెప్పారు. 'నాకు చట్టాలు, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నాపై పెట్టింది తప్పుడు కేసేనని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మీకే తెలుస్తుంది నాపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని. కొన్నిసార్లు మనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. వీటిలో నిజనిజాలేంటో ఫ్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ నర్సింహారెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకున్న నర్సింహారెడ్డి ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. కాగా బెయల్‌పై విడుదలైన నర్సింహారెడ్డి తాజాగా తనపై పెట్టింది తప్పుడు కేసంటూ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి : మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ 'బిగ్‌బాస్ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు' -
మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది. కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. యాంకర్ శ్యామల, నర్సింహరెడ్డిలది ప్రేమ వివాహం. నర్సింహారెడ్డి సిరియళ్లలో కీలక పాత్రలు పోషిస్తూంటాడు. చదవండి: బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా.. సల్మాన్ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా -
నా శ్వాస.. ధ్యాస.. సంద్రమే!
దేన్ని చూసి భయపడతామో దానితోనే తలపడితే... ధైర్యం విజయసోపానాలతో స్వాగత సత్కారం చేస్తుంది. నీళ్లను చూసి భయపడిన ఆ నీళ్లతోనే ఫైట్ చేసింది రికార్డులను కొల్లలుగా కొల్లగొడుతోంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ నీటి మెరుపుతో ముచ్చటించిన విశేషాలు ఇవి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆడవారిలో సహజంగా ఓ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఆ భయం వెనక దాగున్న వాస్తవం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగిన సాధన విషయంలో అంతగా శ్రద్ధ ఉండదు. ఈ విషయాన్ని తన సంభాషణలో తొలుతగా ప్రస్తావించిన శ్యామల పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. సోషియాలజీ విభాగంలో పట్టభద్రురాలైన శ్యామల నీళ్లు తనతో స్నేహం చేసిన తొలినాళ్ల గురించి చెబుతూ– ‘‘నేను యానిమేషన్ మూవీస్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా ఉండేదాన్ని. దీంట్లో నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. బిజినెస్ క్లోజ్ చేశాను. మైండ్‌ను మరోవైపుకు మళ్లించాల్సిన అవసరం అది. అప్పుడు స్విమ్మింగ్ ఎంచుకున్నాను. ఎవరైనా నీళ్లలో ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు వెయిట్‌లాస్, ఫిట్నెస్ గురించో ఆలోచిస్తారు. కానీ, నేను ఒక లక్ష్యం ఉండాలనుకున్నాను. అయితే, నీళ్లంటే విపరీతమైన భయం ఉండేది. నాలుగేళ్ల క్రితం సమ్మర్ టైమ్‌లోనే మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాను. ఆ రోజు నీళ్లలో దిగినప్పుడు వచ్చిన వణుకు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్ని రోజుల్లో ఏడు అడుగుల దూరం డైవింగ్ బోర్డ్ నుంచి జంప్ చేసినప్పుడు వణికిపోయాను. కానీ, మూడు నెలల్లోనే పోటీలో పాల్గొనేంతగా సాధన చేశాను. మొదటిసారే కాంస్య పతకం వచ్చింది’’ అని తెలిపిన శ్యామల యుద్ధంలో దిగేంతవరకే భయం. దిగితే ఎంతటివారినైనా ఓడించాల్సిందేననే తపనను కనబర్చింది. సంద్రంవైపు గురి నాటి నుంచి పాల్గొన్న ప్రతీ పోటీలో మెడల్స్, అవార్డ్స్ వరిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్తలు కంటబడ్డాయి. ఆ విషయాన్ని శ్యామల ప్రస్తావిస్తూ ‘నేనూ సముద్రాన్ని ఈదుతాను.. అని స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్లు నా వయసు గురించి ప్రస్తావించారు. పాతికేళ్లలోపైతే ఓకే కానీ, నలభై ఏళ్లు దాటాక చాలా కష్టం అన్నారు. ఆ కష్టాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలనుకున్నాను. వయసు అనే అడ్డంకిని దాటాలనుకున్నాను. అయితే, ఇంగ్లిష్ ఛానెల్ కన్నా మన దేశంతో కలిసి ఉన్న సముద్రం అయితే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకు రామసేతు దృష్టిలోకి వచ్చింది. అక్కణ్ణుంచి నా ప్రయత్నం, ప్రయాణం ఆగలేదు. నిరంతరం సాధన. దానికి తోడు ఇప్పటి వరకు ఎవరైనా రామసేతును క్రాస్ చేశారా.. అనే శోధన. అలాంటి వారి కోసం అన్వేషణ.. నిరంతరం సాగుతూనే ఉంది. అప్పుడే రామసేతును క్రాస్ చేసిన రాజా త్రివేది గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రోత్సహించి, తగు సూచనలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన, ఏడాది క్రితమే పూర్తి చేయాలనుకున్నాను. కానీ, కోవిడ్ కారణంగా మరో ఏడాది పట్టింది’ అంటూ సముద్రంపై తను గురిపెట్టిన లక్ష్యాన్ని వివరించారు. సముద్రమంత సాధన! స్త్రీ, పురుషులు ఎవరైనా వారు చేసే పనుల ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఈ విషయం గురించి అడిగితే.. ‘నిజమే, కానీ జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి’ అంటారు శ్యామల. మా వారు ‘ఏం ఫర్వాలేదు. నువ్వు తిరిగి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కి ‘ఇండియా,–శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టాం. ఫెడరేషన్ వాళ్లు ఒక అబ్జర్వేటర్, మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వేటర్ వచ్చారు. కుటుంబ సభ్యులతో శ్యామల క్రూలో 14 మందిమి వెళ్లాం. ఒక డాక్టర్, ఫీడింగ్‌కి సాయం చేయడానికి ఫ్రెండ్‌ని తీసుకెళ్లాను. ఉదయం 4 గంటలకు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. రీచ్ అయ్యేసరికి సాయంకాలం 5:35 గంటలు అయ్యింది. స్విమ్మింగ్ మొదలయ్యే క్షణం నుంచి ధనుష్కోటికి చేరుకునే క్షణం వరకు నా మదిలో ఒకటే ఆలోచన స్విమ్.. స్విమ్.. అంతే! 13 గంటల 43 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ పాక్ జలసంధి ని బులా చౌదరి 13 గంటలు 55 నిమిషాల్లో ఈది రికార్డ్‌లో ఉన్నారు. ఆ రికార్డ్‌కి దరిదాపుల్లో వెళ్లగలనా అనుకున్నాను. కానీ, ఆ రికార్డ్‌ను ్ర»ే క్ చేయాలనే సంకల్పం నన్ను ముందు నిలబెట్టింది’ అని వివరిస్తున్నప్పుడు విజయం తాలూకు ఆనందం ఆ కళ్లలో కనిపించింది. ధైర్యం వెన్నుదన్ను సముద్రాన్ని దూరం నుంచి చూడటం ఓ ఆహ్లాదం. కానీ, సముద్రాన్ని ఈదడం అంటే.. ‘షార్క్స్ ఉంటాయి. ఏ క్షణమైనా అవి దాడి చేయవచ్చు. మింగేయచ్చు. ఇలా వీటి గురించి భయపెట్టి కొందరు కిందటేడాది స్విమ్మర్స్ ఆలోచనను మార్చేశారు. కానీ, చావో రేవో తేల్చుకోవాలనుకున్నాను. ఏమీ సాధించకుండా ఉండేదానికన్నా ఒక ధీరలాగా పోరాడైన పోవాలనుకున్నాను. అందుకే భయానికి ఏ మాత్రం తావివ్వలేదు. నేను గమనించిందేంటంటే స్విమ్మర్స్ని షార్క్స్ దాడి చేసిన ఘటనలైతే ఏమీ లేవు. ఈ రికార్డ్‌లో భాగంగా నీళ్లలో ఉన్నంతసేపు ఏదీ పట్టుకోకూడదు, దేనినీ ముట్టుకోకూడదు. శ్రీలంక నుంచి స్విమ్ చేస్తున్నప్పుడు అక్కడి నీళ్లలో సులువు అనిపించింది. అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటరయ్యేటప్పుడు ముఖ్యంగా చివరి 3 గంటలు చాలా కష్టమనిపించింది. గట్టి అలలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడా కష్టమంతా మర్చిపోయాను. సక్సెస్ ను ఆనందిస్తున్నాను’ అని స్విమ్మింగ్ పూల్ నుంచి సముద్రాన్ని జయించిన విజయ ప్రవాహం గురించి వివరిస్తూనే ఉన్నారు శ్యామల. ఒక దారి మూసుకుపోతే దేవుడు వేయి అవకాశాల దారులను మన ముందుంచుతాడు. ఏ దారిలో వెళ్లినా లక్ష్యం వైపుగా గురి ఉంటే విజయం వరించి తీరుతుంది. 47 ఏళ్ల వయసులో 30 మైళ్ల పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన శ్యామల విజయం ఒక్కనాటితో కాదు నిరంతర సాధనతో, పట్టుదలతో ఆమె సొంతమైంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యాంకర్ శ్యామల న్యూ గ్లామర్ ఫోటోలు
-
యాంకర్ శ్యామలా అదిరే స్టిల్స్
-
అవకాశం వస్తే ఇంగ్లీష్ చానల్ ఈదేస్తా :శ్యామల
గచ్చిబౌలి: ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన. స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది కాని నీళ్లంటే ఎక్కడ లేని భయం కదా .. అయినా సరే ఓ సారి చూద్దాం అనుకొని గోలీ శ్యామల నాలుగేళ్ల క్రితం నిజాంపేట్‌లోని స్విమ్మింగ్ పూల్ వెళ్లింది. దైర్యం చేసి స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంది. తరువాత ఈత నేర్చుకున్న ఆమె అంతటితో ఆగలేదు. పోటీలలో పాల్గొంటే క్రమం తప్పకుండా సాధన చేయవచ్చని భావించింది. అప్పుడు మొదలైన ఆమె ప్రస్థానం ఇంకా కొనసాగుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ వెటరన్ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొంటూ రాణిస్తున్నారు. ఇండోర్ కాకుండా ఓపెన్ వాటర్ పోటీలలోను రాణిస్తున్నారు. వచ్చే మార్చిలో రామసేతు ఈదేందుకు రెడీ అవుతున్నారు. ఇంగ్లీష్ చానల్‌ను ఈదే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నారు. భయంతో మొదలైన సాధన క్రియేటివ్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, లిటిల్ డ్రాగన్ యానిమేషన్ చిత్రం దర్శకురాలు, రచయిత 47 ఏళ్ల గోలి శ్యామల మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలలో రాణిస్తున్నారు. ఈత నేర్చుకునేందుకు 2016లో నిజాంపేట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకున్నారు. మూడు నెలల్లోనే జీహెచ్ఎంసీ మాస్టర్స్ స్టేట్ మీట్ నిర్వహించగా శ్యామల తృతీయ స్థానంలో నిలిచి పోటీలకు సై అన్నారు. 2020 ఫిబ్రవరి 15న స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్ వాటర్ ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. 2020 పిబ్రవరి 21న ఆక్వారేబల్స్ వెల్ఫేర్ అసొసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ రివర్ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు అనేక పోటీల్లో పాల్గొని పట్టుదలతో రాణించారు. 2018లో గోవాలో జరిగిన మాస్టర్స్ నేషనల్ పోటీలకు ఎంట్రీ లబించలేదు. నిరుత్సాహపడకుండా ఆ పోటీలకు వాలంటీర్‌గా పని చేసి పోటీలు ముగిసన అనంతరం నిర్వాహకుల సమక్షంలోనే ఆరేబియా సముద్రంలో ఒక కి లోమీటరు ఓపెన్ వాటర్‌లో కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఫిట్‌నెస్‌కు వయసు అడ్డుకాదు ఫిట్‌నెస్‌కు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు. నిరంతర సాధనతో ఎవరైనా ఫిట్నెస్ సాధించవచ్చు. స్విమ్మింగ్, వాక్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలా ఏదో ఒక క్రీడలో నిత్యం సాధన చేస్తే ఫిట్ నెస్ సాధించవచ్చు. అన్ని వయస్సుల వారు ఆరోగ్యం కోసం ఫిట్నెస్గా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దేశం కూడా ఆరోగ్యం ఉంటుంది. నేను 43 ఏళ్ల వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకొని నిరంతరం పోటీలలో పాల్గొనడం, సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించాను. నేటి యువత కూడా శారీరక, మానసిక ఫిట్నెస్ సాధించేందుకు నిరతంరం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒత్తిడిని అదిగమించి మంచి ఫలితాలు సాధించగల్గుతారు. మార్చిలో రామసేతుకు రెడీ మార్చిలో రామసేతులో 30 కిలో మీటర్లు స్విమ్మింగ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నాను. ఆ తరువాత అవకాశాలను సమకూర్చుకొని ఇంగ్లీష్ చానెల్ క్రాస్ చేయాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను. రామసేతును విజయ వంతంగా ఈదేస్తే ఇక ఇంగ్లీష్ చానెల్ క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తా. నా భర్త మోహన్, కుమారుడు విహారి నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇవీవిజయాలు.. ♦ 2019 జనవరిలో విజయవాడలో ఆక్వా డెవిల్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ రివర్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. ♦ 2019 జూన్‌లో కర్నాటకలోని తోన్నూరు లేక్‌లో ఐదు కిలోమీటర్ల పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ♦ 2019 ఆగస్టు 20న సౌతాఫ్రికలోని గ్వాంగ్జులో ఫినా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ వాటర్‌లో 3 కిలోమీటర్ల పోటీలో 22వ స్థానంలో నిలిచారు. ఇండియా తరుపున తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి మహిళగా గుర్తింపు పొందింది. ♦ 2019 అక్టోబర్‌లో లక్నోలో మాస్టర్స్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానంలో నిలిచారు. ♦ 2019 నవంబర్‌లో పాట్నాలో గంగా నదిలో జరిగిన ఓపెన్ కేటగిరీ 13 కిలోమీటర్లు పోటీలో 6వ స్థానంలో నిలిచారు. ♦ 2019 డిసెంబర్లో కోల్‌కతాలోని హుగ్లీ రివర్‌లో ఓపెన్ కేటగిరీలో 14 కిలోమీటర్ల విభాగంలో 7వ ర్యాంక్ వచ్చింది. 12 డిగ్రీల చల్లని వాతావరణంలో ఈత పోటీలో పాల్గొన్నారు. ♦ 2019లో గురజాత్‌లోని పోర్బందర్లో అరేబియా సముద్రంలో ఓపెన్ వాటర్ 5 కిలోమీటర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ♦ 2020 ఫిబ్రవరి 15న స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్ వాటర్ ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ♦ 2020 పిబ్రవరి 2న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసొసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ రివర్ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. -
ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా.. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. కాగా డార్లింగ్ విషయంలో అందరి మదిలో మెదిలే ప్రశ్నఆయన పెళ్లి. ప్రభాస్ పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్నీ కావు. బాహుబలి తర్వాత, సాహో తర్వాత పెళ్లి అంటూ అనేక కథనాలు రాగా అవన్నీ అబద్ధాలుగానే మిగిలిపోయాయి. ఇక తాము అభిమానించే హీరో పెళ్లి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఈ విషయం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘జాన్’ మూవీ అనంతరం డార్లింగ్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లిపై పెదనాన కృష్ణం రాజు భార్య శ్యామలా దేవీ స్పందించారు. శ్యామల దేవి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. తన వివాహ విషయంలో వస్తున్నవన్నీ పుకార్లు. అవిచూసి మేము చాలా నవ్వుకున్నాం. మాది పెద్ద కుటుంబం. అందరితో కలిసిపోయి ఉండే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాం. దొరకగానే ప్రభాస్ పెళ్లి’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. వెకేషన్లో ఉన్న ప్రభాస్ తిరిగి రాగానే జనవరిలో మళ్లీ షూటింగ్లో పాల్గొనున్నారు. లవ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజ హెగ్డే కనిపించనున్నారు. -
‘సీసీ కెమెరాలు ఉన్నది దాని కోసం కాదు’
సాక్షి, హైదరాబాద్ : సీసీ కెమెరాలను పెట్టింది ఘటన జరిగిన తర్వాత ఉపయోగించడానికి కాదని, వాటి ఆధారంగా నిరంతరం పర్యవేక్షించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డి ఘటనపై శనివారం బేగంపేట హరిత ప్లాజాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పరిధిలతో సంబంధం లేకుండా పోలీసులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు నాణ్యత లేకుండా పెట్టారని, పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రియాంక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ లేదు కాబట్టి, ఘటనను సెక్షన్ 10 ప్రకారం సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని వెల్లడించారు. -
చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే..
సాక్షి, సిటీబ్యూరో :సాహసమే శ్వాసగా.. ఆశయమే ఊపిరిగా లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లు, ప్రతిసవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అమ్మాయిలు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవాలి. ఆడపిల్లలు వంటింటి కుందేలు కాదు... ప్రయత్నిస్తే, సాహసం చేస్తే వారితో కాని పని ఏదీ ఉండదు. పురుషులకు ధీటుగా ఏదైనా సాధించే సత్తా అమ్మాయిల సొంతం. అవకాశాలు ఎవరో ఇస్తారని, ఏదో చేస్తారని ఆశపడడం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీరవనితల లక్షణం. చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, లక్ష్యసాధనలో ఓసారి విఫలమైనా, పలుమార్లు ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవిత పాఠం. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. ఇక మెట్రోలో లోకో పైలెట్‌గా ఎంపికై జాబ్‌లో జాయిన్ అవుతానన్నా ఓకే అన్నారు. ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే అంచెలంచెలుగా ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. డేరింగ్, డాషింగ్ స్పిరిట్‌తో సాగిపోతూ లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా ఫిలాసఫి. నేను అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఇదే. నేనూ బాధితురాలినే... ప్రొఫెసర్ కె.సర్వమంగళగౌరి పని ఏదైనా పనే. ఇది మగవాళ్ల పని, అది ఆడవాళ్ల పని అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నిజానికి ఈ పని విభజనతోనే మహిళలపై వివక్ష మొదలవుతోంది. పురుషులు, మహిళలు ఇద్దరూ సమానమేననే భావన నేటితరం పిల్లల్లో కల్పించినప్పుడే ఆడవాళ్లకు గౌరవం దక్కుతుంది. సాటి మహిళగా నేనూ కొన్ని సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాను. సమస్యఎదురైనప్పుడు సాహసంతో ఎదుర్కోవాలే గానీ.. చతికిలపడకూడదనే సత్యాన్ని బోధించిన మా నాన్న కాశీసోమయాజుల సుబ్రమణ్యం ఇచ్చిన స్ఫూరి ్తతో వివక్షను ఎదుర్కొన్నాను. ధైర్యంగా నలుగురి ముందు నిలబడగలిగాను. ఇప్పటికీ ఇండిపెండెంట్‌గా బతకడానికే ఇష్టపడుతుంటాను. బాస్‌తో గొడవ మాది గుంటూరు. అక్కడే చదివాను. మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ఆ తర్వాత 1986–2013 వరకు ఏపీ స్టడీ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లోనూ పని చేశాను. స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న సమయం లోనే ఓసారి వివక్ష విషయంలోనే మా బాస్‌తో గొడవైంది. అప్పట్లో ఆయనపై ఫిర్యాదు కూడా చేశాను. ధైర్యంగా సమస్యను దుర్కొన్నాను. ఈ వివక్ష పోవాలంటే ముందు పని విభజన పోవాలి. అప్పుడే మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఆడపిల్లలకు ప్రస్తుతం చాలా స్వేచ్ఛ ఉంది. కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు వివరించాలి. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ ఉండదు. -
దేశానికి లిఫ్ట్ ఇచ్చినా దేశం లిఫ్ట్ ఇవ్వలేదు!
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన శ్యామలాదేవికి నేడు సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరువైంది! శిక్షకులు, మార్గదర్శకులు లేకుండా.. పట్టుదల, సాధనే కృషిగా అంతర్జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పటికీ ఏ గుర్తింపు లేకుండా ఆమె అనామకంగా ఉండవలసి వస్తోంది! కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడంతో చిరు ఉద్యోగంతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. శ్యామల 2006లో దక్షిణకొరియాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం సాధించి, భారతదేశ జెండాను రెపరెపలాడించారు. దాంతో పాటు జాతీయ స్థాయిలో 8 రజిత, 16 కాంస్య పతకాలు గెలుపొందారు.శ్యామల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. తండ్రి కిషోర్‌కుమార్. తల్లి విజయలక్ష్మి. తండ్రి అల్యూమినియం వస్తువులు తయారు చేసే పరిశ్రమలో దినసరి కార్మికుడిగా పని చేసేవారు. పెద్ద కుటుంబం, తక్కువ ఆదాయం కావడంతో తండ్రికి అండగా ఉండేందుకు బి.కాం. చదివినప్పటికీ శ్యామల కూడా దినసరి కార్మికురాలిగా వెళ్లేవారు. శ్యామలకు పాఠశాలస్థాయి నుంచే ఆటలపై మక్కువ. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్‌లో ఒడుపు సాధించారు. అలా కళాశాల నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2005లో పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ లక్షల్లో ఖర్చు కనుక ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్యామలకు ఆ అవకాశం చేజారిపోయింది. ‘శాప్’ అధికారులకు విన్నవించుకుంటే.. ‘ఇంతా ఖర్చు చేశాక పతకం తీసుకురాకుంటే!’ అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి సంవత్సరం దాతలు కొందరు ముందుకు రావడంతో పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియాలో పతకం సాధించారు. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో ఆ క్షణం నుంచే ఆటలకు ఆమె స్వస్తి పలికారు. ప్రస్తుతం శ్యామల నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రోత్సహించే వారు కరువవడం, బంగారుపతకం సాధించిన తరువాత ఆమెను మంత్రులు, పెద్ద అధికారులకు పరిచయం చేసే వారు లేకపోవడంతో ఆ ఆణిముత్యం ప్రతిభ అంతటితో అగిపోయింది. పేద కుటుంబంలో జన్మించి దేశం గర్వించే విధంగా పతకం సాధించిన శ్యామలాదేవి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. వెయిట్ ‘లిస్ట్’ ►2004 ఆగస్టులో... సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2004 నవంబర్‌లో... సౌత్ ఇండియాచాంపియన్షిప్లో స్వర్ణం. ►2005 జనవరిలో...జూనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లో 4 కాంస్యాలు. ►2005 ఫిబ్రవరిలో...జూనియర్స్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం. ►2005లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత.అదే ఏడాది...అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో రజతం. ►2006లో...జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్‌లో 4 రజతాలు. ►2006... ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీలలో స్వర్ణం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోపాల్గొనేందుకు అర్హత. -
జోగిని శ్యామల తాజా డిమాండ్స్
సాక్షి, హైదరాబాద్: సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఆర్చిగేటు, దేవాలయం ప్రధాన ద్వారం వద్ద బోనంతో వెళుతున్న తనతో పాటు తన బృందాన్ని అడ్డుకోవడంతో మనస్థాపం చేందానని, అందుకే అలా మాట్లాడానని జోగిని శ్యామల వివరణ ఇచ్చారు. తాను ప్రభుత్వాన్ని నిందించాలనేది తన ఉద్దేశం కాదని, అక్కడున్న అధికారుల తీరుతో వారిని ఉద్దేశించి మాట్లాడానన్నారు. మంగళవారం ఆమె దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలపై బోనాలు పెట్టుకుని శివసత్తులు డ్యాన్సులు చేస్తూ భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతారన్నారు. తాను అనని మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించి ముఖ్యమంత్రి తదితరులను ఉద్దేశించి అన్నట్లు చూపిస్తుండడం బాధకలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో శివసత్తులందరికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు, శివసత్తులు ఏ దేవాలయానికి వెళ్లినా అమ్మవారి సన్నిధికి వెళ్లేలా ప్రత్యేక జీఓ చేయాలని ఆమె కోరారు. శివసత్తులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి తప్పు జరగలేదు: ఈఓ అన్నపూర్ణ జోగిని శ్యామల విషయంలో దేవాలయం నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఈఓ అన్నపూర్ణ తెలిపారు. శ్యామలతో పాటు వచ్చిన వీఐపీలు అందరికి దేవాలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేయించి పంపించామన్నారు. ఈ సంవత్సరం 1008 బోనాలతో కలిసి వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ప్రపంచ రికార్డుగా వివరించారు. ఇంత పెద్ద జాతరలో చిన్నచిన్న తప్పులు జరిగి ఉండవచ్చని, భక్తులు పూర్తిగా సహకరించారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్ అరుణగౌడ్ ప్రత్యేక శ్రద్ధతో అన్ని శాఖల అధికారులను సమన్వయంతో ఏర్పాట్లు చేశారన్నారు. సంబంధిత కథనాలు: తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
బిగ్‌బాస్ హౌజ్‌లో వాళ్లు నచ్చలేదు: శ్యామల
బిగ్‌బాస్ షోలో నాల్గోవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన శ్యామల ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో బాబు గోగినేని కొన్ని విషయాల్లో బోరింగ్‌గా అనిపిస్తారని, తనీష్ కోపం, తేజస్వీ మాట్లాడే విధానం తనకు నచ్చలేదని చెప్పారు. బిగ్‌బాస్ ఇంట్లో ఇంకా మనకు తెలియని విషయాలను, చూడని సంగతులెన్నింటినో సాక్షితో పంచుకున్నారు. బిగ్‌బాస్ విజేతగా గెలవాలని ట్రిక్స్ ప్లే చేయలేదని తనలానే ఉంటూ.. ఎంతవరకు ఉంటే అంతవరకే ఉందామనుకున్నా.. కానీ ఇంకొన్ని వారాలు ఉంటే బాగుండేదని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ వల్లే.. దీప్తి సునయనాతో ఎలిమినేషన్ సమయంలో మాట్లాడి వచ్చానని, కానీ ఆ విషయాన్ని ప్రసారం చేయలేదన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్.. తనీష్ చేసిన యాక్టింగ్ కారణంగా.. శ్యామల వల్లే ఇదంతా జరిగిందని, ఆ కోపంతోనే ఎలిమినేషన్లో తనను నామినేట్ చేశానని దీప్తి సునయనా చెప్పిందని శ్యామల తెలిపారు. దీప్తి సునయనా కూడా నానితో ‘తను నామినేషన్ చేసిన శ్యామల వెళ్లిపోకూడదని, తప్పుగా అనుకొని నామినేట్ చేశాన’ని చెప్పిందంటూ శ్యామల వివరించారు. ఇంట్లోంచి వెళ్లేప్పుడు అందరితో మాట్లాడానని, కానీ దీప్తి సునయనాతో మాట్లాడిన విషయాన్ని ప్లే చేయలేదని వెల్లడించారు. మైక్‌లు తీసేసి మరీ... దీప్తి, గీతా మాధురి, శ్యామల మైక్‌లు తీసేసి బిగ్‌బాస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంపై నాని కూడా వారిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కౌశల్ దీప్తికి చెప్పిన విషయంపై మాతో మాట్లాడాలని దీప్తి చెప్పేసరికి.. అదేంటో తెలుసుకుందామనే ఆతృతలో బిగ్‌బాస్ రూల్స్ మరిచిపోయామని శ్యామల చెప్పారు. బిగ్‌బాస్ ఇంట్లో సీక్రెట్ ప్లేస్ అదొక్కటేనని, ఏడుపు వచ్చినా అక్కడికి వెళ్లాల్సిందేనని వివరించారు. ఎల్లో టీమ్ కానందునే... చెరుకు రసం ఈవెంట్లో నేను ఎల్లో టీమ్ సభ్యురాలిని కానందువల్లే కౌశల్, తేజస్వీ నాకు ఓటు వేయలేదు. ఆ టాస్క్‌లో ఎల్లో టీమ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన ఓటు హక్కును వారి ఎల్లో టీమ్ సభ్యులకే ఉపయోగిస్తామని వారు మాటిచ్చారు. అందువల్లే ఎల్లో టీమ్ సభ్యులైన నందిని, దీప్తిలను ఎలిమినేషన్ నుంచి తప్పించారని శ్యామల తెలిపారు. తనను అసలు చూపించలేదు: శ్యామల భర్త నరసింహా సీరియల్ నటుడు, శ్యామల భర్త నరసింహా మాట్లాడుతూ.. శ్యామలను ఎక్కువ సేపు చూపించలేదని, అందువల్ల తను సేఫ్‌గేమ్ ఆడినట్టు అందరూ అనుకుంటున్నారు. తను హౌజ్‌లో ఉన్నది 28 రోజులైతే.. తనను చూపించింది తక్కువ సమయమేనని పేర్కొన్నారు. శ్యామల ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు భారీగా మద్దతు లభిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శ్యామల మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి రావాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో.. ఎందుకంటే నాని ముందే చెప్పారు కదా.. ఏమైనా జరగొచ్చు అని. -
శ్యామల పోస్టు వైరల్.. భారీ మద్దతు
బిగ్ బాస్ నుంచి శ్యామల ఎలిమినేట్ అయిందని ఆదివారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో వార్తలు హాల్చల్ చేశాయి. అనుకున్నట్లే నాల్గోవారం శ్యామల ఎలిమినేట్ అయ్యింది. కానీ, శ్యామలపై సోషల్‌మీడియాలో అభిమానం వెళ్లువెత్తుతోంది. ఎలిమినేట్ అనంతరం శ్యామల చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘బై బై బిగ్ బాస్.. ఇట్స్ టైమ్ టు ఇషాన్. బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అల్ మై ప్రేయర్స్ టు మై హేటర్స్.. లవ్ యు అల్’ అని పోస్టు చేశారు. ప్రస్తుతం శ్యామలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. అసలు ఎలిమినేట్ కావాల్సింది మీరు కాదు అక్క అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. వేరే వాళ్ల స్థానంలో మిమ్మల్ని ఎలిమినేట్ చేశారని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మీరు మరోసారి బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తిరిగి రావాలి.. మా మద్దతు మీకు ఉంటుందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ 2 మొదటి రెండు వారాల్లో సామాన్యులు ఎలిమినేట్ కాగా, మూడో వారం కిరిటీ దామరాజు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తనదైన శైలితో హోస్ట్ నాని పిట్ట కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. -
బిగ్‌బాస్2: సస్పెన్స్ లేకుండానే ఎలిమినేషన్!
ఏమైనా జరుగొచ్చు అంటూ బిగ్‌బాస్‌లో నాని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఆ జరిగేదేంటో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతే ఎలా ఉంటుందో నాల్గోవారం ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. సోషల్‌మీడియా పుణ్యమా అంటూ బిగ్‌బాస్ ఎంత సస్పెన్స్ మెయింటెన్ చేద్దామనుకున్నా.. అదంతా వృథా అయ్యింది. శ్యామలే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతోందని ఆదివారం ఉదయం నుంచే ప్రచారం జరిగింది. ఈ వార్త సోషల్‌మీడియా ద్వారానే లీకై వైరల్‌గా మారింది. శ్యామల ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లి వెళ్లిగానే.. ఎలిమినేట్ అయినట్లు, ఇంతవరకు సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కు ధన్యవాదాలు, మా బాబుతో కలిసి ఆడుకుంటున్నాను అని పోస్ట్ చేయడం.. అదికాస్తా.. వైరల్ కావడం.. విషయం తెలుసుకున్న బిగ్‌బాస్ బృందం అప్రమత్తం కావడంతో.. శ్యామల అప్పటికప్పుడే ఆ పోస్ట్‌ను తొలగించడం జరిగింది. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆదివారం షో హైలెట్స్ ఆదివారం షో ఆసక్తిగానే జరిగింది. హౌజ్‌మేట్స్‌లో తమకు నచ్చని, విలన్‌గా భావించే వ్యక్తిని విలన్ కుర్చీపై కూర్చోబెట్టే టాస్క్ సరదాగా నవ్వులతో కొనసాగింది. కౌశల్, తనీష్‌లు ఒకరినొకరు సీరియస్‌గా విలన్ సింహాసనంపై కూర్చోపెట్టుకోగా.. దీప్తిసునయన, గణేష్.. కౌశల్‌ను, తేజస్వీ, అమిత్‌ను.. నందిని, సామ్రాట్, బాబు గోగినేనిలు రోల్ రైడాను.. గీతా మాదురి, తనీష్‌ను.. శ్యామల, గీతా మాదురిని కూర్చోబెట్టగా... సీరియస్‌గా సాగే టాస్క్‌లను సరదాగా, సరదాగా సాగే టాస్క్‌లను సీరియస్‌గా చేస్తున్నారని నాని అనడంతో నవ్వులు పూసాయి. అయితే ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగానే కౌశల్, తేజస్వీ, బాబు గోగినేనిలు ప్రొటెక్షన్ జోన్లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ప్రత్యేక ఓటును ఉపయోగించిన తేజస్వీ, కౌశల్ ఈవారం అందరూ ప్రొటక్షన్ జోన్లోకి వెళ్లగా మిగిలిన నందిని, దీప్తి, శ్యామలను ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ తీసుకోగా.. కౌశల్, తేజస్వీకి ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఓ ఇద్దరిని కాపాడవచ్చని బిగ్‌బాస్ తెలపగా.. కౌశల్ నందినిని, తేజస్వీ దీప్తిని కాపాడగా మిగిలిన శ్యామల కంటతడితో బిగ్‌బాస్ ఇంటి నుంచి వెనుదిరిగింది. శ్యామల వెళ్తూ వెళ్తూ.. ఇంటి సభ్యుల అందరి బట్టలు ఉతకాలనే బిగ్‌బాంబ్‌ను దీప్తిపై వేసింది. -
బిగ్‌బాస్: ఎలిమినేట్ అయింది ఆమెనే!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ హౌస్ నుంచి నాలుగోవారం ఎలిమినేటయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది. ఎన్నడు లేని విధంగా ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియకు ఎక్కువ మంది నామినేట్ అయిన విషయం తెలిసిందే. తొలి రెండు వారాల్లో సామాన్యులైన సంజనా, నూతన నాయుడులు హౌస్ నుంచి నిష్క్రమించగా.. గత వారం కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ సారి కౌశల్, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్, దీప్తీ, గణేశ్, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఎలిమినేషన్ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్లో కామన్ మ్యాన్ గణేశ్‌తో పాటు, సింగర్ గీతా మాధురి ప్రొటెక్ట్ అయినట్లు హోస్ట్ నాని ప్రకటించాడు. ఓ సామాన్యుడు హౌస్లోఉండాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు గణేశ్‌కు మద్దతు తెలపగా.. గీతా మాధురి సోషల్ మీడియా క్యాంపైన్తో గట్టెక్కినట్లు తెలుస్తోంది. ఆమెకు మద్దతుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ ఇద్దరు సేఫ్ అవడంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరబ్బా? అని ప్రేక్షకుల తెగ ఆలోచిస్తున్నారు. ఎంత పనిచేశారు పిన్నిగారు? హౌస్‌లో వదినగా పిలిచే దీప్తియే ఎలిమినేట్ కావొచ్చనుకున్నారు. అలా ఊహిస్తే అది బిగ్‌బాస్ ఎందుకవుతోంది.. ముందే చెప్పారుగా ఏమైనా జరుగొచ్చని.. అలానే ఎలాంటి గొడవలు పెట్టకోకుండా.. అందరి మన్ననలు పొందిన పిన్నిగారే ఎలిమినేట్ అయ్యారు. అదేనండి హౌస్‌లో పిన్నిగారినిపించుకున్న యాంకర్ శ్యామలే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపి.. బిగ్‌బాస్ ఆశలపై నీళ్లు చల్లారు. అసలే వీకెండ్.. ఎలిమిటయ్యేది ఎవరా? అనే ప్రేక్షకుల ఆతృతను క్యాచ్ చేసుకొని రేటింగ్స్ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్ టీమ్‌కు శ్యామల చర్య మింగుడు పడటం లేదు. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒకరోజు ముందు జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ వచ్చిందనుకుందో ఎమో కానీ.. ఇంటికి చేరిన వెంటనే ‘ మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.. ఇంటికి వచ్చాను. నాకొడుకు ఇషాన్‌తో ఆడుకుంటున్నాను.’ అని పోస్ట్ చేశారు. అయితే తన తప్పిదాన్ని గుర్తించిన శ్యామల వెంటనే ఆ పోస్ట్‌ను తొలిగించారు. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఎర్ర కుందేలు
పచ్చజొన్న చేనులో ఏదో కదిలినట్టనిపించింది. ఏంటది? పులా? దాని ముఖం. ఈ ఇలాకాలో ఒకటే పులి ఉంది. అది తను. ఒక్క క్షణం కూసుగా చూపు సారించి, కదలిక లేకపోవడంతో చెల్కపార భుజాన పెట్టుకొని చేనుగట్టు మీద తల ఎగరేస్తూ నిలబడింది. ఆకాశం ఇంకా చీకటిని విడిచిపెట్టలేదు. చీకటి విడిచిపెట్టే లోపే– చలి అంటున్నా వినకుండా– ఒక్కదానివే అన్నా వినకుండా– చిన్నపిల్లవు అంటున్నా వినకుండా వచ్చేస్తుంది. వేరుశనగపంట ఎదుగుదలలో ఉంది. చేను నీళ్లు తాగాల్సిన అదను. నీళ్లు తాగకపోతే చచ్చిపోదూ? ఇరుగుపొలం వాళ్లు పొరుగు పొలంవాళ్లు వచ్చేలోపే పాచిపళ్లతో వచ్చి నీళ్లు పారించుకుంటుందని అందరికీ కోపం. ‘ఒసేవ్ దెయ్యం’ అని ఒక జీతగాడంటాడు. ‘ఏమే తాటకి’ అని ఇంకో జీతగాడంటాడు. వాళ్లు ఆలస్యం అయ్యేలోపు నీళ్లు మలుపుకుని చేను తడుపుకుంటుంది. చెరువు కాలువకు అందరూ మొగుళ్లే. అందరూ నీళ్లు మలుపుకుంటే కాలువ పలుచబడి చేను తడవాల్సినంత తడవదు. తడవకపోతే తండ్రి కష్టం చేతికి అందదు. తండ్రంటే చాలా ఇష్టం తనకు. తండ్రికి తనంటే కూడా. ‘నన్ను కని మాయప్ప నాకు చాకిరీ చేసేవాడు. నాకు కూతురులా పుట్టి మళ్లీ చాకిరీ చేస్తున్నాడు’ అని పొంగిపోతుంటాడు. మొన్నటి మొల్కల పున్నమికి పన్నెండు వచ్చాయనీ అప్పుడే అన్ని పనులు చేతనవుతున్నాయని తల్లి దిష్టి తీసి బొగ్గునీ తమలపాకునీ దారిలో పారేసి వచ్చింది. చూసి నవ్వుకుంది. తనకెవరు దిష్టి పెడతారు? దొరికితే ఆ దిష్టిదాని ఊపిరి తీయదూ? పచ్చజొన్న చేనులో మళ్లీ ఏదో కదలిక అయ్యింది. ఉలిక్కిపడి చూసింది. ఏమీ కనిపించలేదు. చీకటి వదలడానికి ఇంకా టైముంది. చలి ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న పచ్చజొన్న చేను జీతగాడు ఈసరికి రావాలి. రాలేదు. చలికి ముడుక్కుని నీళ్లు మలుపుకునే పని మరిచాడా? నిజానికి తను కూడా ఆలస్యం అయినట్టే లెక్క. దానికి కారణం కుందేలు. నిన్న సాయంత్రం చెరువు దగ్గర సోబతు పిల్లలతో గిల్లిదండా ఆడుతూ గిల్లిని లగాయించి కొట్టింది. అది గాలిలో తేలుతూ వంకరలు తిరుగుతూ వెళ్లి తునికి పొదల దగ్గర పడింది. లోపల నక్కి ఉన్న కుందేలు ఒకటే పరుగు. ‘కుందేలు.. కుందేలు’ అన్నారు సోబతులు. అడవి కుందేలు కూరను తండ్రి జన్మకో శివరాత్రి అన్నట్టు కళ్లకద్దుకుని తిని తృప్తి పడటం గుర్తొచ్చింది. ‘దారి మళ్లించండి... దారి మళ్లించండి’ అరిచింది. సోబతులు రెండుగా చీలి ‘ఓ...ఓ...ఓ...ఊ....హూ’ అని మొత్తుకుంటుంటే కుందేలు కంగారు పడి చేన్ల వైపు మళ్లడానికి భయపడి చెరువు వైపు మళ్లి నీళ్లలో దూకింది. ‘ఇంకేంది... చెరువు దాటి అవతలి గట్టుకు వెళ్లిపోతుంది’ అన్నాడు సోబతు. ‘మధ్యలోనే చస్తుంది’ అన్నాడింకొకడు. ఇద్దరూ చెరువులోకెళ్లడానికి భయపడుతున్నారు లోతుకి. కుందేలు వేగంగా ఈదుతోంది. ఏం చేయాలి? లంగాను గోచి పోసి ఒక్క దూకు దూకింది. చేప చాలదు ఈతలో. కుందేలు ఎంత. వెళ్లి వెళ్లి మెడ మీదున్న ఒదులు చర్మాన్ని కతుక్కున పట్టుకుంది. తండ్రి కల్లు సీసాతో ప్రత్యక్షమయ్యాడు ఇది తెలిసి. ఇప్పుడిక చాలా సంతోషంగా ఉంటాడు. రెండు ముద్దలు ఎక్కువ తింటాడు. తండ్రి ఎప్పుడూ పరేషానుగా ఉంటాడని తనకు బెంగ. ‘ఎందుకు పరేషానీ’ అడిగింది ఒకసారి. ‘చేను గురించమ్మా. ఈ చేను మన్ది కాదని దొర అంటాడు. మూడు తరాలకు ముందు బూదానోద్యమం జరిగి వాళ్ల తాత మన తాతకు రాసిచ్చాడట. తిరిగి తీసుకోవచ్చులే అనుకున్నారు. సీలింగు చట్టం వచ్చి ఆ భూమి మనకు మిగిలింది. అప్పటి నుంచి తకరారే. ఇప్పుడున్న దొర కిరికిరీ చేస్తూనే ఉంటాడు దాని కోసం. కొట్టాడు కూడా’... ఆ బాధంతా మరిచి ఇవాళ కూర తింటాడని సంతోషం. తను కూడా పీకల్దాకా తిని పడుకుంది. లేచే సరికి ఆలస్యం. దూరంగా ఏదో పిట్ట నిద్ర లేచి కూత పెడుతూ ఎగిరెళ్లిపోయింది. చేను తృప్తిగా నీరు తాగుతూ ఉంది. దొర చేను కంటే ముందు తన చేను తడుపుకుంటుంది. జీతగాడు బెదిరిస్తుంటాడు దొరకు చెప్తానని... చెప్పుకోపో అని తల ఎగరేస్తుంది. ఏం.. దొరంటే భయమా? పచ్చజొన్న చేను ఈసారి నిజంగానే కదిలింది. చెయ్యెత్తు జొన్నమొక్కలను చీల్చుకుంటూ ఎలుగ్గొడ్డులా దొర ప్రత్యక్షమయ్యాడు. పై ప్రాణాలు పైనే పోయాయి. వచ్చి రెక్క పట్టుకున్నాడు. ‘ఏమే లంజ... మొగోని లెక్క చేనుకు నీళ్లు పారబెడుతున్నావే. మా ఇళ్లలో నీఅంత ఆడపిల్లలు చేను వైపే రారు. ఆడపిల్లలను ఎలా ఉంచాలో మీ మాల మాదిగోల్లకు తెలియదానే. చెప్తా ఉండు’ అని రెండు చేతులు పైన వేసి వెతుకుతున్నాడు. దొర గురించి విన్నదంతా గుర్తుకొస్తోంది. గుండె గుబగుబలాడిపోతోంది. ‘దొర.. ఇడిచిపెట్టు.. ఇడిచిపెట్టు’ గింజుకుంటోంది. దొర రెక్క పట్టి జొన్నచేనులోకి లాక్కు వెళుతున్నాడు. ‘నీ బాబు చేనియ్యమంటే నకరాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపితే కేసయ్యి నేను ఊరిడచాల. నిన్ను చెరిచితే సిగ్గుతో మీ అయ్య ఊరిడుస్తాడు. నిన్నూ’... లాక్కు వెళుతున్నాడు. పన్నెండేళ్ల పిల్ల. పులికి చిక్కిన కుందేలులా ఉన్న పిల్ల. కాని కుందేలు పిల్లా తను? చేయి గట్టిగా కొరికింది. ‘స్స్’.. నేలకు విసిరి కొట్టాడు. కింద పడింది. ‘బాడ్కవ్’.... మళ్లీ పట్టుకోవడానికి రాబోయాడు. పాదాలున్నాయి తనకు. రెండు పాదాలు. మట్టి తొక్కిన పాదాలు. చెట్లెక్కిన పాదాలు. చెరువు గెలిచిన పాదాలు. తేళ్లు, జెర్రెలు కనబడితే నిమిషంలో నలిపిన పాదాలు. దగ్గరకు చేర్చింది. ఒక్క తాపు... ‘చచ్చాన్రో’ దొర విరుచుకుపడ్డాడు. ‘పట్టుకోండి... పట్టుకోండి’ అరుస్తున్నాడు. దొరుకుతుందా తను. ఆ మరుసటి రోజంతా ఊళ్లో ఒకటే గోల. ‘మనూరు తాటకి దొర పిచ్చలు పగలగొట్టింది’ అని వాడ ఆడవాళ్లంతా మూతికి కొంగడ్డం పెట్టుకొని ఒకటే నవ్వడం. కథ ముగిసింది. గోగు శ్యామల రాసిన ‘తాటకి’ కథ ఇది. సామాజిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం కోసం కూడా మొదటి ప్రతీకారం స్త్రీల మీదే తీర్చుకోవాలని చూస్తుంది మగ వ్యవస్థ. యుద్ధాలలో, అల్లర్లలో అందుకే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటాయ్. మగాణ్ణి అణచడానికి స్త్రీని భయభ్రాంతం చేయడం ఒక మార్గం. సరే.. మనింటి ఆడపిల్లలను ఎలా పెంచుతున్నాం. అమ్మో.. అయ్యో.. అక్కడకు వెళ్లకు, ఇక్కడకు వెళ్లకు అని పెంచుతున్నామా? లేదా రెండు పాదాలు ఉన్న అమ్మాయిగా ఆయువు మీద తన్నే అమ్మాయిగా పెంచుతున్నామా? శక్తి కావాలిప్పుడు. - గోగు శ్యామల -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నార్పల : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ రోడ్డులో ఉన్న ఐష్ ఫ్యాక్టరీ నిర్వాహకురాలు శ్యామల(39) విద్యుదాఘాతంతో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన శ్యామల కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నార్పలకు వలస వచ్చి జీవనోపాధికి ఐష్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుక్రవారం శివర్రాతి కావడంతో ఆమె భర్త నారాయణరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల కొండకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామల ఐష్ ఫ్యాక్టరీలో ప్లగ్ వేయబోయి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలో పడిపోయారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్నవారు అది గమనిఽంచి ఆమెను హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామల భర్త నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. -
'వాళ్లే నా ఇంటిపై దాడిచేశారు'
విజయవాడ: బెజవాడ లబ్బీపేటలో గత అర్థరాత్రి అగంతకుడు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఇటీవల కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో చాగర్లముడి బుజ్జిపై ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాల్‌మనీ నిందితులే తన ఇంటిపై దాడి చేశారని శ్యామల మంగళవారం ఆరోపించారు. కాగా ఇంటి ప్రాంగణంలోని సీసీ కెమెరాలో రాళ్ల దాడి దృశ్యాలు రికార్డ్ అయినట్టు సమాచారం.