
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.
కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. యాంకర్ శ్యామల, నర్సింహరెడ్డిలది ప్రేమ వివాహం. నర్సింహారెడ్డి సిరియళ్లలో కీలక పాత్రలు పోషిస్తూంటాడు.
చదవండి:
బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..
సల్మాన్ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment