గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్‌సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె.
సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.
రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు!
Comments
Please login to add a commentAdd a comment