
యాంకర్ శ్యామల
బిగ్ బాస్ నుంచి శ్యామల ఎలిమినేట్ అయిందని ఆదివారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో వార్తలు హాల్‌చల్ చేశాయి. అనుకున్నట్లే నాల్గోవారం శ్యామల ఎలిమినేట్ అయ్యింది. కానీ, శ్యామలపై సోషల్‌మీడియాలో అభిమానం వెళ్లువెత్తుతోంది. ఎలిమినేట్ అనంతరం శ్యామల చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘బై బై బిగ్ బాస్.. ఇట్స్ టైమ్ టు ఇషాన్. బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అల్ మై ప్రేయర్స్ టు మై హేటర్స్.. లవ్ యు అల్’ అని పోస్టు చేశారు.
ప్రస్తుతం శ్యామలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. అసలు ఎలిమినేట్ కావాల్సింది మీరు కాదు అక్క అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. వేరే వాళ్ల స్థానంలో మిమ్మల్ని ఎలిమినేట్ చేశారని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మీరు మరోసారి బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తిరిగి రావాలి.. మా మద్దతు మీకు ఉంటుందని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
బిగ్ బాస్ 2 మొదటి రెండు వారాల్లో సామాన్యులు ఎలిమినేట్ కాగా, మూడో వారం కిరిటీ దామరాజు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తనదైన శైలితో హోస్ట్ నాని పిట్ట కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment