బిగ్‌బాస్‌ సెట్‌ ముందు కౌశల్‌ ఆర్మీ హల్‌చల్‌! | Kaushal Army Buzz At Bigg Boss 2 Telugu Set | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 9:06 AM | Last Updated on Sun, Sep 30 2018 5:07 PM

Kaushal Army Buzz At Bigg Boss 2 Telugu Set - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్ సీజన్‌‌-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. సోషల్‌ మీడియాలో అత్యంత హైప్‌ క్రియేట్‌ అయిన ఈ రియాల్టీ షో విన్నర్‌ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్‌ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్‌.. హౌస్‌మేట్స్‌ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్‌ చేశారు. తమే గేమ్‌ ఆడుతున్నట్లు ఇన్వాల్వ్‌ అయ్యారు. (చదవండి: కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్‌)

ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్‌ ఎవరు.. రన్నర్‌ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్‌ ఆర్మీ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు హల్‌చల్‌ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌.. కౌశల్‌ అని అరుస్తూ హల్‌చల్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్‌ షూట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్‌ ఆర్మీ సెట్‌ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్‌ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం.

విన్నర్‌ కౌశల్..
మరోవైపు హౌస్‌లో తనదైన స్టైల్‌లో విభిన్నంగా గేమ్‌ ఆడిన కౌశలే బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్‌ విన్నర్‌ అయ్యాడని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్‌బుక్‌లో కౌశల్ ఆర్మీ అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్‌ చేశారు. ఆమెనే కాక చాల మంది కౌశల్‌ విన్నర్‌ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్‌ ఆర్మీ అయితే విన్నర్‌ కౌశలే కానీ రన్నరప్‌ ఎవరనీ పోస్టులు పెడుతున్నాయి.  ఫైనల్‌ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్‌ హాజరవుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్‌కు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తీలు చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్‌ అందుకోనున్నారు. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్‌ ముచ్చట్లు)  

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement