Kaushal Army
-
కౌశల్ ఆర్మీ టార్చర్ వల్ల తాగుడుకు బానిసయ్యా: తేజస్వి
'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మదివాడ. కేరింత, ఐస్‌క్రీమ్ వంటి చిత్రాలతో పాపులర్ అయిన తేజస్వి బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొని నెగిటివిటిని మూటగట్టుకుంది. ఆ తర్వాత చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజస్వి బిగ్‌బాస్ విన్నర్ కౌశల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్ మరోక ఎత్తు. కౌశల్ ఆర్మీ కారణంగా చాలా మనోవేధనకు గురయ్యాను. నాపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు. చెత్తమీమ్స్తో నన్ను బ్యాడ్ చేశారు. కౌశల్ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపించారు. బిగ్‌బాస్ తర్వాత కూడా వదల్లేదు. ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియా వదిలి వేరే దేశాలకి వెళ్లిపోయాను. సోషల్ మీడియాలో నామీద కౌశల్ ఆర్మీ చేస్తున్న ట్రోలింగ్ చూసి ఫ్రస్ట్రేషన్‌తో తాగుడుకు బానిసయ్యాను. కానీ తర్వాత దాన్నుంచి బయటికొచ్చాను. నాపై ఇంత చేశారు. చివరికి వాళ్లకి ఏమొచ్చింది? కౌశల్ ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడా? ఆఖరికి హోస్ట్ నాని కూడా హౌస్‌లో నన్నే తిట్టేవాడు. ఇవన్నీ చూసి బిగ్‌బాస్ తర్వాత ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ఈ కమిట్మెంట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా అంటూ వెల్లడించింది. -
భార్యపై కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానుల ఆందోళన
Kaushal Manda: బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ మండా.. ‘బిగ్‌బాస్’షోతో మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాధించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులన్నీ వృథా చేస్తున్నట్లు తనపై ఆరోపణలు కూడా వచ్చాయి. కౌశల్ భార్య నీలిమపై కూడా ఆరోపణలు వ్యక్తం కాగా ఆ సమయంలో కౌశల్ మండా నీలిమ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. తన భార్య ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని ఒక సందర్భంగా కౌశల్ చెప్పుకొచ్చాడు. తాజాగా కౌశల్ తన భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఏదో సాధించేందుకు బయల్దేరావు.. ఏదో ఒకటి చేసేందుకు నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో అది నువ్ సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నువ్వు కన్న కలల కోసం పోరాడిరా.. లవ్యూ.. మిస్ యూ’ అంటూ కౌశల్ భార్యతో కలిసి ఉన్న వీడియోని పోస్ట్ చేశాడు. ఇది చూసి కౌశల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అన్నా.. వదినకు ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
కౌశల్ ఆర్మీకి ప్రతీ రూపాయికి లెక్క ఉంది..
బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్‌కు.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన కౌశల్ ఆర్మీకి మధ్య వివాదం ముదురుతోంది. ఫౌండేషన్ డబ్బును కౌశల్ ఇష్టం వచ్చినట్టుగా వృధా చేస్తున్నాడంటూ ఆరోపిస్తు ఆర్మీ సభ్యులు ఎదురు తిరగటంతో కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించిన అన్ని వివరాలు జెన్యూన్‌గా ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాను. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్‌బాస్ గేమ్‌ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. అలాంటిది నా మీద ఓ మీడియా సంస్థ (సాక్షి కాదు) నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. 20 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన మంచి అవకాశం బిగ్ బాస్ 2. సామాన్యుడైన కౌశల్ ఈ స్థాయికి రావటం ఇష్టం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్. అన్ని వివరాలు ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసాన’ని తెలిపారు. -
కౌశల్ ఆర్మీని విస్తరిస్తా..
సాక్షి బెంగళూరు: భవిష్యత్తులో కౌశల్ ఆర్మీని మరింతగా విస్తరిస్తానని బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత కౌశల్ మండ స్పష్టం చేశారు. కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కౌశల్ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు మారతహళ్లిలోని తులసి థియేటర్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత అయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్క ఆర్మీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సమాజ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అనంతరం ఐటీపీఎల్‌లో ఉన్న బిర్యానీ జోన్‌కు వెళ్లి అభిమానులతో కలసి భోజనం చేశారు. బిర్యానీజోన్ యజమానులు విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలు కౌశల్‌కు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇక్కడి బిర్యానీ రుచికి ఫిదా అయిన కౌశల్, తెలుగువారి ప్రత్యేక డిష్ అయిన బిరియానిని బెంగళూరు వాసులకు అందజేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలను అభినందించారు. -
డబ్బులిచ్చి బిగ్‌బాస్ విజేత కాలేదు: కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్) తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు. కౌశల్ ఆర్మీని విస్తరిస్తా.. పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు. చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా.. బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్! -
బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌ను సోషల్ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్ ఆడించాయి. (చదవండి: బిగ్‌బాస్ విజేత కౌశల్) తెలుగులో కౌశల్ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్ అబ్దుసమద్ టైటిల్ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..) గత తమిళ బిగ్‌బాస్ సీజన్లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) #BiggBossTamil2 - #Riythvika #RiythvikaArmy #Biggbossmalayalam - #Sabu #SabuArmy #BiggBossTelugu -#Kaushal #KaushalArmy pic.twitter.com/ptTe5pjPcC — Shanu (@shanum8) September 26, 2018 #KaushalArmy #SabumonArmy Sabumon army is voting for Kaushal ✌️✌️💪💪💪💪💪💪💪#BiggBoss2Telugu pic.twitter.com/cAXFfn6gKT — VD7 (@Vishnu7dev) September 27, 2018 -
ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 సీజన్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది. ‘మాటల్లేవ్’అన్న ఫీలింగ్ మాత్రమే ఇక్కడ కౌశల్ ముఖంలో కనిపించింది. ఒకింత ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు కౌశల్. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో భాగంగా టాప్ ఐదుగురు కంటెస్టెంట్లో ముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. బిగ్‌బాస్ విజేత కౌశల్ -
టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా..
-
బిగ్‌బాస్ విజేత కౌశల్
బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్ నిలిచాడు. తుది పోరుకు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్ విజేతగా అవతరించాడు. కౌశల్ అందరికీ కంటే ఎక్కువ ఓట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్ కంటెస్టెంట్లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్ కే పడినట్లు తెలిసింది. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో టాప్ ఐదుగురు కంటెస్టెంట్లోముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. ఈ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు కౌశల్. కౌశల్ ఓ సాధారణ మోడల్‌గా, సీరియల్స్ నటుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధారణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌బాస్ సుదీర్ఘ జర్నీలో ఆది నుంచి చివరి వరకూ ఒంటరి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడనడంలోఎలాంటి అతిశయోక్తి లేదు. కౌశల్ పేరు దేశవిదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట గత వంద రోజులుగా పలుకుతూనే ఉంది. కౌశల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్ సంఘం కూడా ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశల్ ఆర్మీ 2కే రన్ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. కేవలం కౌశల్ ఆర్మీ అనేది సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే ఉన్న పెయిడ్ గ్రూపంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగానే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్ ప్రచారం చేశారు. దీనికి కౌశల్ ఆర్మీ ధీటుగానే బదులిచ్చింది. కొంతమంది తాము కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. వాస్తవ ప్రపంచంలో ఉన్నామని నిరూపించడానికి ఈ ర్యాలీలను చేపట్టారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లాడు. ప్రధానంగా తన పట్టుదల, ఎలాంటి పరిస్థితులకూ తగ్గని నైజం, నిజాయతీ, కష్టపడే తత్వం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యం.. ఇవన్నీ కౌశల్‌లో జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ బిగ్‌బాస్ సీజన్లో కౌశల్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. తొలుత సాధారణ వ్యక్తిలా మాత్రమే అభిమానులు చూసినా క్రమేపీ అతనిపై అభిమానం పెంచుకుంటూ వచ్చారు. ఇలా ఫ్యాన్స్ చూపిన అభిమానమే కౌశల్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. -
బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. సోషల్ మీడియాలో అత్యంత హైప్ క్రియేట్ అయిన ఈ రియాల్టీ షో విన్నర్ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్.. హౌస్మేట్స్ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్ చేశారు. తమే గేమ్ ఆడుతున్నట్లు ఇన్వాల్వ్ అయ్యారు. (చదవండి: కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్) ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్ ఆర్మీ బిగ్‌బాస్ సెట్ ముందు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్ సెట్ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్.. కౌశల్ అని అరుస్తూ హల్చల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్ షూట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్ ఆర్మీ సెట్ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. విన్నర్ కౌశల్.. మరోవైపు హౌస్‌లో తనదైన స్టైల్లో విభిన్నంగా గేమ్ ఆడిన కౌశలే బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్ విన్నర్ అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్బుక్లో కౌశల్ ఆర్మీ అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఆమెనే కాక చాల మంది కౌశల్ విన్నర్ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్ ఆర్మీ అయితే విన్నర్ కౌశలే కానీ రన్నరప్ ఎవరనీ పోస్టులు పెడుతున్నాయి. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్‌కు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తీలు చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారు. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) View this post on Instagram A post shared by Harika Innamuri (@harika_innamuri) on Sep 29, 2018 at 10:35am PDT Patience , hardworking , focused many of them inspired congratulations #Kaushal anna bb2 title ❤❤❤❤❤😎😎#kaushalbbt2sensation #KaushalArmy #Kaushal #BiggBossTelugu2 #KaushalBB2Winner #KaushalManda pic.twitter.com/5UGzyjRWXc — Abhi (@AbhiSai008) September 30, 2018 -
బిగ్‌బాస్: రోల్‌రైడా ప్యాకప్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఈ ఒక్క వారమే. ఇప్పటికే సామ్రాట్ హౌస్మెట్స్ మద్దతుతో డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్‌కు వెళ్లే వారు ఎవరని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్టే రోల్‌రైడా ఈ వారం హౌస్‌ను వీడాడు. ఇన్ని రోజులైనా హౌస్మేట్స్ ఇంటి రూల్స్ సరిగ్గా పాటించకపోవడంతో బిగ్‌బాస్ ఈ వారం అందరిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నామినేట్ అయిన వారిలో సామ్రాట్, రోల్రైడాలకే ప్రేక్షకుల నుంచి తక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సామ్రాట్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రోల్‌రైడా హౌస్‌ను వీడక తప్పలేదు. రైడా ఎలిమినేషన్‌కు కారణం.. నిజానికి రోల్‌రైడా తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. షో ఆరంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రైడా ఎంత సేపు హౌస్ మేట్స్ మద్దతు కోసమే ప్రయత్నించాడే తప్పా ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కువ సార్లు నామినేషన్‌కు రాకపోవడం కూడా రైడాకు ప్రతికూలం అయింది. ఇక ఫైనల్‌కు వెళ్లే సదవకాశాన్ని కూడా రైడా పొగట్టుకున్నాడు. ఎగ్స్ టాస్క్‌లో కౌశల్ మినహా రైడాకు ఎవరు మద్దతివ్వలేదు. దీంతో రైడా ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో సామ్రాట్ తంతే బూరేల బుట్టలో పడ్డట్లు ఫైనల్‌కు చేరాడు. నిజానికి సామ్రాట్ కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్లోకి వచ్చాడు. అప్పుడు కూడా చాలా తక్కువ ఓటింగ్‌తోనే గట్టెక్కాడు. రోల్‌రైడా సామ్రాట్‌ను కూడా ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకుని ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కౌశల్‌తో గొడవ కూడా రోల్రైడాపై మరింత వ్యతిరేకతను పెంచింది. సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ గొడవ పెద్దదయ్యేందుకు మరింత ఆజ్యం పోశాడు. ఇది కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. పైగా గల్లీ పోరడు అని చెప్పుకునే రైడా ఆ గొడవ సందర్భంగా కౌశల్ కాళ్లు పట్టుకోవడం, ఏడ్వడం వారందరికి వెగటు పుట్టించింది. ఇదే అంశంపై శనివారం హోస్ట్నాని సైతం రైడాను మందలించాడు. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) బిగ్‌బాస్‌కు కింగ్ నాగార్జున.. నేటి ప్రోమోను చూస్తే బిగ్‌బాస్ సెట్లో దేవదాస్ యూనిట్ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ షో హోస్ట్ నాని, కింగ్ నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవదాస్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా కింగ్ నాగర్జునతో పాటు హీరోయిన్స్ రష్మికా మండన్నా, ఆకాంక్షసింగ్లు బిగ్‌బాస్ సెట్లో సందడి చేశారు. చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు -
బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ హంగామా
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది. సెప్టెంబర్ 20వ తేదీన కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.... బిగ్‌బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. బుధవారం రాత్రి గం. 12ని.లకు మొదలైన ఈ క్రాకర్స్ వెలుగులు కొన్ని గంటల పాటు జిగేల్ మన్నాయి. లల్లీ పుట్టిన రోజు సందర్భంగా ఈ క్రాకర్స్‌ను కాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఆర్మీ సభ్యుల్లోని కొందరు తెలిపారు. మరొకవైపు లల్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్, కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. over night crackers at @BiggBosstelugu2 sets by @Kaushal_Army wishing his daughter lally #hbdlittleprincesslally pic.twitter.com/02b2mLk3nF — samba (@samba21830145) 20 September 2018 కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్? -
కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్?
హైదరాబాద్: తెలుగు రాష్టాల్లో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్‌బాస్-2. ఈ సీజన్ షోకు అత్యధిక ఆదరణ రావడానికి కారణమైన కంటెస్టెంట్‌ల్లో కౌశల్ ఒకడు. ఇక్కడ కౌశల్ గురించే షో చూస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కౌశల్ ఆర్మీ పేరుతో రెండు భారీ ర్యాలీలు నిర్వహించడం అతనికి షోలో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఒక ర్యాలీ హైదరాబాద్ వేదికగా జరిగితే, మరొకటి విజయవాడ వేదికగా జరిగింది. ఈ రెండు ర్యాలీల్లో కౌశల్ అభిమానులు ఎక్కువగానే పాల్గొనే తమది ఫేక్ ఆర్మీ కాదని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే కౌశల్‌కు పడుతున్న ఓటింగ్ కూడా అత్యధికంగానే ఉంది. ప్రధానంగా కౌశల్ హౌస్‌లో కొనసాగాలనే ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంచితే, బిగ్‌బాస్ షో ఫైనల్ ఫేజ్‌కు చేరుకున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వారం చివరి ఎలిమినేషన్ రౌండ్ కావడంతో ఎవరు బయటకు వెళతారు.. ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఆఖరి ఎలిమినేషన్‌గా కౌశల్‌ను హౌస్ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఓటింగ్ సంగతి పక్కను పెట్టి, కౌశల్‌ను సాగనంపేందుకు నిర్వాహకులు స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతీవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోయేది లీక్‌ల ద్వారా ముందుగా తెలిసినట్లే, ఈ వారం ఇంటి నుంచి వెళ్లబోయే వ్యక్తి కౌశల్‌గా తెలుస్తోంది. ఒక స్క్రిప్ట్ ప్రకారమే కౌశల్‌ను వెళ్లగొట్టడానికి బిగ్‌బాస్ యాజమాన్యం ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసిందని, దానిలో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు మూకుమ్మడిగా కౌశల్‌పై ఎదురుదాడికి దిగి అతన్ని రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియా వేదికగా టాక్ నడుస్తోంది. ఒకవేళ నిజంగానే కౌశల్‌కు ఓటింగ్ శాతం తక్కువ వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతే ఇబ్బంది ఉండదు.. కానీ కావాలనే అతన్ని బయటకు పంపే యత్నం కానీ, పంపడం కానీ జరిగితే మాత్రం బిగ్‌బాస్ షోకు ఉన్న ఆదరణ తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు కౌశల్ అభిమానులు. అదే సమయంలో బిగ్‌బాస్ షోపై ఉన్న విశ్వసనీయత కూడా సన్నగిల్లుతుందనేది కౌశల్ ఆర్మీ వాదనగా ఉంది. ‘ఇసుక’ టాస్క్‌లోనూ కౌశలే టార్గెట్.. ప్రతీవారం కనీసం ఒక టాస్క్‌ను నిర్వహించడం బిగ్‌బాస్ హౌస్‌లో ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ వారం కూడా టాస్క్‌ను నిర్వహించారు. అది ‘ఇసుక’ టాస్క్. ప్రస్తుతం ఉన్న ఆరుగురి కంటెస్టెంట్లకు కలిపి రేస్-1, రేస్-2గా ఈ టాస్క్ నిర్వహించారు. ఇందులో తలో ముగ్గురు రెండు భాగాలుగా విడిపోయి టాస్క్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా కంటైనర్‌లో ఉన్న ఇసుకను కాపాడుకోవడమే ఆయా కంటెస్టంట్లు చేసే పని. అయితే ఈ టాస్క్ లో కూడా కౌశలే టార్గెట్ అయ్యాడు. కౌశల్‌ను గెలవకుండా చేయడంలో మిగతా కంటెస్టెంట్లు సక్సెస్ అయితే, రోల్ రైడాను, సామ్రాట్లు విజయం సాధించడంలో హౌస్ మేట్స్ సహకరించారు. ఈ ఇద్దరికీ ఇవ్వబడిన గుడ్లు టాస్క్‌లో విజయం సాధించే అభ్యర్థి ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అంటే రోల్ రైడా, సామ్రాట్‌లలో ఒకరు నేరుగా ఫైనల్‌కు వెళతారు. నా మీద కుక్కల్లాగ పడుతున్నారు.. ఈ టాస్క్ జరిగే క్రమంలో కౌశల్ నోరు జారాడు. హౌస్‌మేట్స్‌తో జరిగిన వాగ్వాదంలో కౌశల్ తన సహనాన్ని కోల్పోయాడు. అంతా కలిసి తనపై కుక్కల్లాగ పడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఆ వాగ్వాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక్కడ కౌశల్ తన అన్న మాటను డిఫెన్స్ చేసుకునే పనిలో పడ్డా, మొత్తంగా చూస్తే సదరు హౌస్మేట్స్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే సామ్రాట్ కూడా కౌశల్ అన్న అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘మమ్మల్ని కుక్కలు అంటావా’ అని సామ్రాట్ నిలదీయగా, దానికి మిగతా వారి నుంచి మద్దతు లభించడంతో కౌశల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఎవర్నీ ప్రత్యేకించి కుక్కలు అనలేదని, కుక్కల్లాగా పడుతున్నారనే వ్యాఖ్యానించానని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే, బిగ్‌బాస్ షోకు ఏదైనా జరగొచ్చు అనేది ఉప శీర్షిక. దానికి తగ్గట్టే ఈ వారం ఏమి జరుగుతుందనే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కౌశల్‌ను పంపేందుకు ముందుగానే స్కెచ్ సిద్ధం చేశారా.. లేక ఓటింగ్ ప్రకారమే ఒకరు బయటకు వెళతారా అనేది త్వరలో తేలనుంది. ఏం జరుగుతుందో చూద్దాం. చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్ : అమిత్ కథ ముగిసింది
బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడనుంది. ఇంకా హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఒకరి ఎలిమినేషన్‌తో ఇంకా ఆరుగురు సభ్యులు మిగిలారు. మరో వారంలో మరొకరు హౌస్‌ను వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరనున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటివరకు హౌస్‌లో పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ గత రెండు వారాలుగా బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దానికి తోడు శనివారం నాని కౌశల్‌పై సీరియస్ అవ్వడం.. రెడ్ ఫిష్ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది. గత రెండు వారాలు బిగ్‌బాస్ నిర్ణయంతో గట్టెక్కిన అమిత్ ఈ సారి హౌస్‌ను వీడారు. ఈ వారం అమిత్‌తో పాటు ఎలిమినేషన్ జాబితాలో కౌశల్, దీప్తి, రోల్‌రైడా, గీతామాధురిలు ఉన్నా.. వారంత సేఫ్ అయ్యారు. షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమిత్ సేఫ్ గేమే ఆడాడు. కంటెస్టెంట్స్‌తో ప్రేమగా ఉంటూ నామినేషన్ ప్రక్రియలోకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. దీనికి తోడు హీరో కమల్‌హసన్ రెండు వారాలు నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం అమిత్‌కు కల్పించాడు. దీంతో గత రెండు వారాలుగా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అమిత్‌కు తక్కువ ఓట్లే నమోదయ్యాయి. అందరూ అమితే హౌస్‌ను వీడుతాడని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ అతన్ని రెండు వారాలు సేవ్ చేశాడు. ఈ సారి మాత్రం అమిత్‌ను బిగ్‌బాస్ కాపాడలేకపోయాడు. అమిత్ ఎలిమినేషన్‌కు కారణం.. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్‌కు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాల్లో విలన్ అయినా హౌస్‌లో అతని ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉండేది. కొన్నిసార్లు అది కాస్త ఫన్నీగా ఉన్నా మరికొన్నిసార్లు చికాకు పుట్టించేది. ఈ విషయం హౌస్మేట్స్ కూడా చాలా సార్లు చెప్పారు. ఎప్పుడూ సీరియస్ డిస్కషన్ ఇన్వాల్వ్ కాకపోవడం.. ఓ విషయంపై స్టాండ్ తీసుకోని మాట్లాడకపోవడం.. ప్రతి దానికి అతిగా ప్రవర్తించడం జనాలకు చికాకు పుట్టించింది. ఇక కెమెరాల ముందు వచ్చిరాని తెలుగులో మాట్లాడటం నస పుట్టించేలా ఉండేది. ఈ విషయం హోస్ట్ నాని కూడా చెప్పి మందలించాడు. ఇవే అమిత్‌కు ప్రేక్షకుల నుంచి ఓట్లు తెప్పించలేకపోయాయి. టాస్క్‌ల్లో సరిగ్గా ఆడక.. వాటికి ఎవేవో కారణాలు చెబుతూ సమర్ధించుకోవడం కూడా జనాలకు నచ్చలేదు. -
బిగ్‌బాస్ : శ్యామలపై కౌశల్ ఆర్మీ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామలపై కౌశల్ ఆర్మీ తీవ్రంగా మండిపడుతోంది. దీనికి గల కారణం కౌశల్ బిగ్‌బాస్-2 విన్నర్ అవుతాడని చెప్పకపోవడమే. ఈ వారం ఎలిమినేట్ అయిన శ్యామలను టాప్ త్రీ కంటెస్టెంట్స్‌లో ఎవరుంటారని అనుకుంటున్నారని నాని అడగారు. శ్యామల సమాధానం చెబుతూ.. గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను సూచించింది. ఆ ముగ్గురిలో కౌశల్ పేరును చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. శ్యామల సమాధానం కౌశల్ ఆర్మీకి ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో శ్యామలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీఎంట్రీ సమయంలో తాము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం విన్నర్లలో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతారా..? అంటూ శ్యామలపై మండిపడుతున్నారు. బిగ్‌బాస్ టీం స్క్రిప్ట్ ఇస్తే శ్యామల మాట్లాడిందని కొందరు, నాని చెప్పమంటేనే వారి పేర్లు చెప్పిందని మరికొందరు ఫేస్బుక్లో శ్యామలపై విరుచుపడ్డారు. ‘కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో మీకు బాగా తెలుసు. అయినప్పటికి కౌశల్ పేరు చెప్పలేదు. బిగ్‌బాస్-2 విన్నర్‌పై నీ గెస్సింగ్ తప్పు. నిన్న కౌశల్ ఆర్మీ చేసిన 2-కెరన్ చూసి అయినా నీ ఆలోచన మారాలి’, ‘బైబై మేడమ్. వచ్చే వారం మీ స్నేహితులను కూడా నీ దగ్గరకు పంపిస్తాం. కూర్చొని కబుర్లు చెప్పుకోండి’ అంటూ వ్యంగ్య కామెంట్లతో శ్యామలను విమర్శిస్తున్నారు. ఇది చదవండి బిగ్‌బాస్: శ్యామల ఔట్ బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్: శ్యామల ఔట్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో మూడు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడునుంది. దీంతో ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరో అని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం శ్యామల ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నఅమిత్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. గతవారమే అమిత్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించగా బిగ్‌బాస్ నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ కావాలనే నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారని, ఇదొక అన్‌ఫెయిర్ గేమ్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ నిర్వాహకులు, హోస్ట్ నానిపై మండిపడ్డారు. దీనికి హోస్ట్ నాని ట్వీట్‌తో ప్రేక్షకులకు సమాధానం కూడా ఇచ్చాడు. (చదవండి:ట్రోల్స్‌పై స్పందించిన నాని) అలా బతికిపోయిన అమిత్ ఈ సారి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ మళ్లీ అతను సేవ్ అయిపోయాడు. రీఎంట్రీ ఇచ్చిన శ్యామల, నూతన్ నాయుడులా హౌస్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ ఎలిమినేషన్ విషయం కూడా ఎపిసోడ్‌కు ముందే(ఆదివారం ఉదయమే) తెలిసిపోయింది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ విషయంలో ఎంత జాగ్రత్తపడ్డా ఎలిమినేట్ అయ్యింది ఎవరో ముందే తెలిసిపోతోంది. శ్యామలకు, అమిత్‌కు ఓట్లలో స్వల్ప తేడా వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఓట్లపై ఎలాంటి చర్చలేకుండా శ్యామల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాని ప్రకటించారు. ఈ ఆదివారం ఎపిసోడ్లో ‘సిల్లీఫెలోస్’ హీరోలు అల్లరి నరేశ్, సునీల్‌లు హౌస్‌లో సందడి చేశారు. హౌస్ మేట్స్‌తో రెండు గ్రూపులుగా విడిపోయి హోస్ట్ నాని ఇచ్చిన ఓ గేమ్ ఆడుతూ నవ్వులు పూయించారు. (చదవండి: బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) శ్యామల ఎలిమినేషన్ అందుకేనా? గతవారం కొంచెం తెలివిగా ప్రవర్తించి నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న శ్యామలకు.. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా పోయింది. బిగ్‌బాస్ పోలీస్- కిల్లర్ టాస్క్‌లో గీతామాధురి సిక్రెట్ టాస్క్‌కు బలై నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన శ్యామలపై చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బయటి వ్యవహారాలు ఇంట్లో చెప్పి.. నూతన్ నాయుడిని నామినేట్ చేసేలా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని నాని కూడా గత శనివారం ప్రస్తావిస్తూ మందలించాడు. ఇది చాలా మంది ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఇక హౌస్‌ను దాదాపు తమ ఆదీనంలోకి తెచ్చుకున్న కౌశల్ ఆర్మీ ఆమెపై అగ్రహంగా ఉండటం.. కౌశల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండటం ఆమె ఎలిమినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. రీఎంట్రీ అనంతరం ఆమె ప్రవర్తనలో తేడా రావడం కూడా కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. మొత్తానికి రీఎంట్రీతో హౌస్ అడుగుపెట్టిన శ్యామల ఫైనల్ లిస్ట్‌లో ఉండకుండానే వెనుదిరిగింది. వెళ్తూ వెళ్తూ బిగ్‌బాస్ ఇంటికి సేవకుడిగా ఉండాలనే బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై వేసింది. ఇక తన అంచనా ప్రకారం టాప్ రోల్‌రైడా, గీతా మాధురి, తనీశ్లని చెప్పింది. ఇది కౌశల్ ఆర్మీకి ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు. మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ
హైదరాబాద్: బిగ్‌బాస్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ. నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ అంకానికి కొన్ని ఎపిసోడ్లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు వాక్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొన్ని రోజుల క్రితం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులు పిలుపునిచ్చింది. దీనికి ఊహించని మద్దతు లభించింది. సగటు ప్రేక్షకుడే కాదు.. బిగ్‌బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్కు విశేషమైన మద్దతు దక్కడం ఇక్కడ విశేషం. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్ విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం.. ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్కు స్థానిక అభిమానులు ఈ రేంజ్లో హాజరైతే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కంటెస్టెంట్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ.. బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె వాక్ నిర్వహిస్తున్నారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ ప్రారంభమైంది మొదలు ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది.. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. కౌశల్ ప్రభావం బిగ్‌బాస్ షోలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు. బిగ్‌బాస్ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్లో తోటి కంటెస్టెంట్స్ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో ఉన్నారు కౌశల్. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్‌తో.. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణం అని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. -
కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ