బిగ్‌బాస్‌ హౌస్‌ బయట కౌశల్‌ ఆర్మీ హంగామా | Kaushal Army burst crackers on the sets to celebrate Kaushals daughter Lallis birthday | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌస్‌ బయట కౌశల్‌ ఆర్మీ హంగామా

Published Fri, Sep 21 2018 10:46 AM | Last Updated on Fri, Sep 21 2018 1:45 PM

Kaushal Army burst crackers on the sets to celebrate Kaushals daughter Lallis birthday - Sakshi

హైదరాబాద్‌: బిగ్‌బాస్ తెలుగు-2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బిగ్బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది.

సెప్టెంబర్‌ 20వ తేదీన కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.... బిగ్‍‌బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. బుధవారం రాత్రి గం. 12ని.లకు మొదలైన ఈ క్రాకర్స్ వెలుగులు కొన్ని గంటల పాటు జిగేల్ మన్నాయి. లల్లీ పుట్టిన రోజు సందర్భంగా ఈ క్రాకర్స్ను కాల్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా కౌశల్‌  ఆర్మీ సభ్యుల్లోని కొందరు తెలిపారు. మరొకవైపు లల్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్, కామెంట్స్ దర్శనమిస్తున్నాయి.

కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement