బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడనుంది. ఇంకా హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఒకరి ఎలిమినేషన్‌తో ఇంకా ఆరుగురు సభ్యులు మిగిలారు. మరో వారంలో మరొకరు హౌస్‌ను వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరనున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటివరకు హౌస్‌లో పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ గత రెండు వారాలుగా బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దానికి తోడు శనివారం నాని కౌశల్‌పై సీరియస్ అవ్వడం.. రెడ్ ఫిష్ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది.
గత రెండు వారాలు బిగ్‌బాస్ నిర్ణయంతో గట్టెక్కిన అమిత్ ఈ సారి హౌస్‌ను వీడారు. ఈ వారం అమిత్‌తో పాటు ఎలిమినేషన్ జాబితాలో కౌశల్, దీప్తి, రోల్‌రైడా, గీతామాధురిలు ఉన్నా.. వారంత సేఫ్ అయ్యారు. షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమిత్ సేఫ్ గేమే ఆడాడు. కంటెస్టెంట్స్‌తో ప్రేమగా ఉంటూ నామినేషన్ ప్రక్రియలోకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. దీనికి తోడు హీరో కమల్‌హసన్ రెండు వారాలు నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం అమిత్‌కు కల్పించాడు. దీంతో గత రెండు వారాలుగా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అమిత్‌కు తక్కువ ఓట్లే నమోదయ్యాయి. అందరూ అమితే హౌస్‌ను వీడుతాడని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ అతన్ని రెండు వారాలు సేవ్ చేశాడు. ఈ సారి మాత్రం అమిత్‌ను బిగ్‌బాస్ కాపాడలేకపోయాడు.
అమిత్ ఎలిమినేషన్‌కు కారణం..
సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్‌కు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాల్లో విలన్ అయినా హౌస్‌లో అతని ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉండేది. కొన్నిసార్లు అది కాస్త ఫన్నీగా ఉన్నా మరికొన్నిసార్లు చికాకు పుట్టించేది. ఈ విషయం హౌస్‌మేట్స్ కూడా చాలా సార్లు చెప్పారు. ఎప్పుడూ సీరియస్ డిస్కషన్ ఇన్వాల్వ్ కాకపోవడం.. ఓ విషయంపై స్టాండ్ తీసుకోని మాట్లాడకపోవడం.. ప్రతి దానికి అతిగా ప్రవర్తించడం జనాలకు చికాకు పుట్టించింది. ఇక కెమెరాల ముందు వచ్చిరాని తెలుగులో మాట్లాడటం నస పుట్టించేలా ఉండేది. ఈ విషయం హోస్ట్ నాని కూడా చెప్పి మందలించాడు. ఇవే అమిత్‌కు ప్రేక్షకుల నుంచి ఓట్లు తెప్పించలేకపోయాయి. టాస్క్‌ల్లో సరిగ్గా ఆడక.. వాటికి ఎవేవో కారణాలు చెబుతూ సమర్ధించుకోవడం కూడా జనాలకు నచ్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment