![Evicted Syamala Omits Kaushal Name From Bigg Boss Winner List - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/10/shyamala.jpg.webp?itok=wfBop-KE)
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామలపై కౌశల్ ఆర్మీ తీవ్రంగా మండిపడుతోంది. దీనికి గల కారణం కౌశల్ బిగ్‌బాస్-2 విన్నర్ అవుతాడని చెప్పకపోవడమే. ఈ వారం ఎలిమినేట్ అయిన శ్యామలను టాప్ త్రీ కంటెస్టెంట్స్‌లో ఎవరుంటారని అనుకుంటున్నారని నాని అడగారు. శ్యామల సమాధానం చెబుతూ.. గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను సూచించింది. ఆ ముగ్గురిలో కౌశల్ పేరును చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
శ్యామల సమాధానం కౌశల్ ఆర్మీకి ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో శ్యామలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీఎంట్రీ సమయంలో తాము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం విన్నర్లలో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతారా..? అంటూ శ్యామలపై మండిపడుతున్నారు.
బిగ్‌బాస్ టీం స్క్రిప్ట్ ఇస్తే శ్యామల మాట్లాడిందని కొందరు, నాని చెప్పమంటేనే వారి పేర్లు చెప్పిందని మరికొందరు ఫేస్‌బుక్‌లో శ్యామలపై విరుచుపడ్డారు. ‘కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో మీకు బాగా తెలుసు. అయినప్పటికి కౌశల్ పేరు చెప్పలేదు. బిగ్‌బాస్-2 విన్నర్‌పై నీ గెస్సింగ్ తప్పు. నిన్న కౌశల్ ఆర్మీ చేసిన 2-కెరన్ చూసి అయినా నీ ఆలోచన మారాలి’, ‘బైబై మేడమ్. వచ్చే వారం మీ స్నేహితులను కూడా నీ దగ్గరకు పంపిస్తాం. కూర్చొని కబుర్లు చెప్పుకోండి’ అంటూ వ్యంగ్య కామెంట్లతో శ్యామలను విమర్శిస్తున్నారు.
ఇది చదవండి
బిగ్‌బాస్: శ్యామల ఔట్
Comments
Please login to add a commentAdd a comment