Tejaswi Madivada Sensational Comments On Bigg Boss Kaushal Army And Nani, Deets Inside - Sakshi
Sakshi News home page

Tejaswi Madivada: 'ఆడపిల్లను ఇంత టార్చర్‌ చేశారు.. ఇప్పుడు కౌశల్‌ ఏమయ్యాడు'?

Published Fri, Aug 26 2022 12:56 PM | Last Updated on Fri, Aug 26 2022 1:48 PM

Tejaswi Madivada Made Sensational Comments On Kaushal Army And Nani - Sakshi

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మదివాడ. కేరింత, ఐస్‌క్రీమ్‌ వంటి చిత్రాలతో పాపులర్‌ అయిన తేజస్వి బిగ్‌బాస్‌ సీజన్‌-2లో పాల్గొని నెగిటివిటిని మూటగట్టుకుంది. ఆ తర్వాత చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజస్వి బిగ్‌బాస్ విన్నర్‌ కౌశల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్‌ మరోక ఎత్తు. కౌశల్‌ ఆర్మీ కారణంగా చాలా మనోవేధనకు గురయ్యాను. నాపై సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవాళ్లు. చెత్తమీమ్స్‌తో నన్ను బ్యాడ్‌ చేశారు. కౌశల్‌ మండా ఆర్మీ నన్ను టార్గెట్‌ చేసి మరీ టార్చర్‌ చూపించారు. బిగ్‌బాస్‌ తర్వాత కూడా వదల్లేదు. ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియా వదిలి వేరే దేశాలకి వెళ్లిపోయాను.

సోషల్‌ మీడియాలో నామీద కౌశల్‌ ఆర్మీ చేస్తున్న ట్రోలింగ్‌ చూసి ఫ్రస్ట్రేషన్‌తో తాగుడుకు బానిసయ్యాను. కానీ తర్వాత దాన్నుంచి బయటికొచ్చాను. నాపై ఇంత చేశారు. చివరికి వాళ్లకి ఏమొచ్చింది? కౌశల్‌ ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడా? ఆఖరికి హోస్ట్‌ నాని కూడా హౌస్‌లో నన్నే తిట్టేవాడు. ఇవన్నీ చూసి బిగ్‌బాస్‌ తర్వాత ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ఈ కమిట్‌మెంట్‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా అంటూ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement