Tejaswi Madivada
-
ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. ఆ ఒక్క పని వల్ల కెరీర్ ఖేల్‌కతం! (ఫోటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
సోమాజిగూడ జ్యువెలరీలో మెరిసిన నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
Tejaswi Madivada: ఈ తెలుగందాన్ని ఎవరూ పట్టించుకోరే..! (ఫోటోలు)
-
ఎలిమెంట్రి హోమ్ గిప్టింగ్ స్టోర్‌లో సందడి చేసిన నటి తేజస్వి మదివాడ (ఫొటో గ్యాలరీ)
-
JKJ జ్యువెలరీ వారి గ్రాండ్ లాంచ్ డైమండ్ పోల్కీ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో నటి తేజస్వి మదివాడ ఇంకా ప్రముఖులు హాజరయ్యారు. (ఫోటోలు)
-
కత్తిలాంటి ఫోజులతో కవ్విస్తున్న తేజస్వి..ఎప్పుడైనా ఇలాంటి లుక్ లో చూశారా..? (ఫోటోలు)
-
కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నటి తేజస్విని ఓ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే నవదీప్ కి గాయమైందని ఆమె బాధపడటం సంగతి అటుంచితే.. అతడిని తెగ ఏడిపించింది. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ అనుకుంటున్నారు. 'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాలు చేశాడు గానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆర్య 2, బాద్ షా తదితర చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల ముందు పలు షోల్లో జడ్జిగా, పార్టిసిపెంట్ గానూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) ఏమైందో ఏమో గానీ ఈ మధ్య నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతడిని పరామర్శించడానికి వచ్చిన నటి తేజస్విని.. ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నటీనటులు.. నవదీప్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్గా 'న్యూసెన్స్' సిరీస్ లో, తేజస్విని 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ లో నటించారు. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ
టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ నిర్మాత: బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్ సంగీతం: అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల విడుదల తేదీ: 30 జూన్ 2023 తెలుగులో ఓటీటీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆహా'నే. మిగతా వాటిల్లో తెలుగు సినిమాలు, సిరీసులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ దీనిలో మాత్రం ప్రతివారం ఓ సినిమా లేదంటే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తుంటాయి. అలా ఈసారి 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అనే వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలని హైదరాబాద్‌కి వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరుతాడు. ఇతడి టీమ్ లీడ్ జై మాత్రం అరుణ్‌ని బానిసలా చూస్తుంటాడు. ఓ పందెం వల్ల అరుణ్.. షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్‌లోకి వచ్చిపడతాడు. కొన్నిరోజుల్లోనే ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఏకంగా ఆమెతో పర్సనల్ రిలేషన్లోకి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పల్లవి(అనన్య) పాత్ర ఏంటి? ఫైనల్‌గా అరుణ్ ఏం తెలుసుకున్నాడు? అనేది 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే? ఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు టీమ్ లీడర్ షాలినీ అందరికీ పార్టీ ఇస్తుంది. అరుణ్ కూడా ఆ పార్టీకి వస్తాడు. డ్రింక్ చేస్తాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సెల్లార్ లోని కారులో అరుణ్-షాలినీ కాస్త అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వీళ్లిద్దరిని మరో ఇద్దరు చూస్తారు. అసలు వీళ్లెందుకు కారులో ముద్దుముచ్చట వరకు వెళ్లారు. అరుణ్-షాలినీని చూసిన ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే సిరీస్ చూడండి. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్'.. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు అధికారిక రీమేక్. ఓటీటీలో ఎపిసోడ్స్ తర్వాత చాలామందికి ఇది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ లో ఓ బ్యాచిలర్ రూమ్‌లో ఉంటాడు. ఉదయమే లేచి ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడేమో టీలు చేసే పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్లారు. కార్పొరేట్ వరల్డ్ లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? పని వల్ల ఎలాంటి సంఘర్షణ అనుభవించాడు? చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది తొలి సీజన్ లోని ఐదు ఎపిసోడ్లలో చూపించారు. ఇందులో అరుణ్ కుమార్ కి ఓ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ కూడా ఉంటుందండోయ్. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిమిషాలే ఉంటుంది. అలా ఆడుతూ పాడుతూ సిరీస్ ని చూసేయొచ్చు. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' లో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తగా ఏం లేదు. అలా సాఫ్ట్ గా వెళ్లిపోతూ ఉంటుంది. బాగాలేదు అని చెప్పలేం అలా అని బాగుందని కూడా చెప్పలేం. ఈ సీజన్ అంతా కూడా అరుణ్ కుమార్ చుట్టూనే నడుస్తుంది. అనన్య, తేజస్వి పాత్రలని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా తర్వాత సీజన్లలో వీళ్లకు ప్రాధాన్యం దక్కుతుందేమో? ఎవరెలా చేశారు? అరుణ్ కుమార్ గా నటించిన హర్షిత్ రెడ్డి.. ఇంటర్న్ పాత్రలో సెట్ అయిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, అందరు చెప్పిన పనులు చేస్తూ బాగానే మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగుంది. పల్లవిగా నటించిన అనన్య బాగానే నటించింది. ఈమె పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది. డామినేషన్, స్వార్థం కలగలిపిన టీమ్ లీడర్ షాలినీ పాత్రలో తేజస్వి ఓకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీకి తగ్గట్లు డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. చాలావరకు ఆఫీస్ లో ఒకే చోట సీన్లన్నీ తెరకెక్కించారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యిండకపోవచ్చు. నిర్మాణ విలువులు డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. సిరీస్ ని ఇంకాస్త ఎమోషనల్ గా తీసుంటే బాగుండేది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలోపే సీన్లన్నీ చకచకా పరుగెడుతుంటాయి! ఈ వీకెండ్ ఏదైనా సిరీస్ తో టైమ్‌పాస్ చేద్దామంటే 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' ట్రై చేయొచ్చు! -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
బిగ్‌బాస్ ఫేం అఖిల్‌కు గాయం.. ఆసుపత్రిలో చేరిక
బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థ్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రెండుసార్లు(బిగ్‌బాస్-4, బిగ్‌బాస్ ఓటీటీ)లలో రన్నరప్‌గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొని డ్యాన్స్ దుమ్మురేపుతున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్‌కు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అఖిల్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎప్పటినుంచో నాకు ఈ బాధ ఉంది. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాంగ్ పర్ఫెర్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నొప్పితోనే చేశాను. నా గాయాలు బయటకు కనపించనందున ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. నా కడుపు కింది భాగంలో తీవ్రవైన నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పటికే ఆలస్యం చేయడంతో అది మరింత నన్ను బాధిస్తుంది. నేను, తేజు మా సాయశక్తులా కష్టపడ్డాం. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను షో నుంచి బయటకు వచ్చేశాను. ఇంకా షాకింగ్ విశేషమేమిటంటే మేం బాటమ్2లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు. మరో అద్భుతమైన షోతో మళ్లీ మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాను అంటూ అఖిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
తేజస్వినితో ప్రేమలో పడ్డ అఖిల్ సార్థక్?
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్ తర్వాత ఓటీటీకి కూడా వెళ్లాడు. అక్కడ కూడా తన ఆటతో, మాట తీరుతో అభిమానులను అలరించిన అతడు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)లోనూ రన్నరప్‌గా అవతరించాడు. రెండుసార్లు తనను ఆదరించి, ఓటేసిన ప్రేక్షకులకు ఎన్నివేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఉప్పొంగియేవాడు అఖిల్. ప్రస్తుతం అతడు బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొంటున్నాడు. డ్యాన్స్‌తో స్టేజీ గడగడలాడిస్తున్న అఖిల్ తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తేజుతో డేటింగ్ చేస్తున్నావా? అని ముక్కుసూటిగా అడిగేశాడు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. జనాలు చాలా త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. మేము మంచి స్నేహితులమని ఎందుకు అనుకోరు? మేము కలిసి షో చేస్తున్నంత మాత్రాన ఇద్దరం ప్రేమించుకున్నట్లు కాదు అని నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. చదవండి: ఏయ్.. డోంట్ టచ్‌మీ.. నాకు పెళ్లైపోయింది: నటి సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మరణం -
కౌశల్ ఆర్మీ టార్చర్ వల్ల తాగుడుకు బానిసయ్యా: తేజస్వి
'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మదివాడ. కేరింత, ఐస్‌క్రీమ్ వంటి చిత్రాలతో పాపులర్ అయిన తేజస్వి బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొని నెగిటివిటిని మూటగట్టుకుంది. ఆ తర్వాత చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజస్వి బిగ్‌బాస్ విన్నర్ కౌశల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్ మరోక ఎత్తు. కౌశల్ ఆర్మీ కారణంగా చాలా మనోవేధనకు గురయ్యాను. నాపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు. చెత్తమీమ్స్తో నన్ను బ్యాడ్ చేశారు. కౌశల్ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపించారు. బిగ్‌బాస్ తర్వాత కూడా వదల్లేదు. ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియా వదిలి వేరే దేశాలకి వెళ్లిపోయాను. సోషల్ మీడియాలో నామీద కౌశల్ ఆర్మీ చేస్తున్న ట్రోలింగ్ చూసి ఫ్రస్ట్రేషన్‌తో తాగుడుకు బానిసయ్యాను. కానీ తర్వాత దాన్నుంచి బయటికొచ్చాను. నాపై ఇంత చేశారు. చివరికి వాళ్లకి ఏమొచ్చింది? కౌశల్ ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడా? ఆఖరికి హోస్ట్ నాని కూడా హౌస్‌లో నన్నే తిట్టేవాడు. ఇవన్నీ చూసి బిగ్‌బాస్ తర్వాత ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ఈ కమిట్మెంట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా అంటూ వెల్లడించింది. -
30 మంది ఫుల్‌గా తాగి నన్ను అటాక్ చేశారు: తేజస్వి
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ హీరోయిన్గా నటించిన చిత్రం కమిట్మెంట్. తేజస్వితో పాటు అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 19న) రిలీజైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో తేజు తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది. 'ఓసారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి నన్ను అటాక్ చేశారు. నేను ఏదోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది నన్ను కమిట్మెంట్ అడిగారు. కొందరు ఫోన్లో అడిగారు, మరికొందరి నేరుగా చూపులతోనే అడిగేవారు. అది ఈజీగా తెలిసిపోయేది. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు. అదే ఇప్పుడు ఏదైనా జరిగితే పేరుతో సహా సోషల్ మీడియాలో అన్నీ బయటపెట్టొచ్చు' అని తేజస్వి చెప్పుకొచ్చింది. చదవండి: మొన్నే కదా బిడ్డ పుట్టింది, అప్పుడే మళ్లీ ప్రెగ్నెంటా? స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ -
సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించాం: నిర్మాత
Commitment Movie Pre Release Event: "టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ "కమిట్ మెంట్". తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19న థియేటర్స్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది. నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.. "కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కోసం ఎంతదూరం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కోసం వెళ్లినప్పుడు సొసైటీలో మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు'' అని తెలిపాడు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము. ఈ సినిమా పోస్టర్స్ చూసో, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మహిళలు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయికి కచ్చితంగా నచ్చుతుంది'' అని పేర్కొన్నారు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా : తేజస్వి మదివాడ
బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తేజస్వీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా చాన్స్ అవకాశాల కోసం తిరిగేది.ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఈ సినిమా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను . సినిమా ఇండస్ట్రీని బద్నామ్ చేయొద్దు అని చెప్పేదే ఈ మూవీ మెసేజ్. కమిట్మెంట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో ప్రతిదీ నేచురల్‌గా ఉంటుంది. ► ఒక సినిమా కి ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి. బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను . ఈ సినిమాలోనూ రొమాన్స్ ఉంటుంది. ఈ మూవీలో శ్రీనాథ్ నాతో రొమాన్స్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ..) ► ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్మెంట్ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. నన్ను కమిట్మెంట్ అడగాలి అంటే బయపడేవాళ్లు . ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి కానీ.. చాలా మంది అక్క, చెల్లి క్యారెక్టర్స్ అని చెబుతున్నారు. లేదంటే బోల్డ్ క్యారెక్టర్స్ తీసుకొస్తున్నారు. ‘కేరింత’లాంటి క్యారెక్టర్స్ ఎవరూ ఇవ్వడం లేదు(నవ్వుతూ) ► సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అన్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా(నవ్వుతూ..) ► బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆ షో కారణఃగానే ఇల్లు, కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల ఆఫర్స్ మిస్ అయ్యాయని ఎవరైనా అంటే కూడా ఐ డోంట్ కేర్. , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం. నేను చాల స్మార్ట్.. లైఫ్‌ని ఎలా రన్ చేయాలో బాగా తెలుసు. ► ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇతర భాషల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. -
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ 'కమిట్మెంట్'.. బోల్డ్‌గా ట్రైలర్
Tejaswi Madivada Commitment Trailer Released: బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ వివాదానికి గురి కాగా డైరెక్టర్ లక్ష్మీ కాంత్ క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం (ఆగస్టు 3) విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్న కమిట్మెంట్ ఇవ్వాలన్న పరిస్థితులు నెలకొన్నట్లు ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 'సమాజంలో ఒక మగాడు ఎలాగైనా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతది' అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషుల్ల సంగతే మరిచిపోతున్నారు, కాస్త మనుషుల్లా ఆలోచించండి' వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్‌ను పలు బోల్డ్ సీన్లతో కట్ చేసిన అమ్మాయిలు 'కమిట్మెంట్' అనే విషయంతో ఎలా నలిగిపోతున్నారనే విషయాన్ని చూపించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించిన 'కమిట్మెంట్' ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. -
తేజస్వి 'కమిట్మెంట్' మూవీపై కరాటే కల్యాణి ఫిర్యాదు
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ సినిమా ట్రైలర్‌పై కేసు నమోదైంది. మూవీ ట్రైలర్లో భగవద్గీత శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వాడింది చిత్రయూనిట్. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ట్రైలర్ ఉందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి! కాగా కమిట్మెంట్ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
తేజస్వి మదివాడ 'కమిట్మెంట్' రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రస్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్”. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా పనిచేసిన ప్రతి ఒక్క నటి నటులు టెక్నిషియన్ సపోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. చదవండి: అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా? శాడిస్టులు, బతికుండగానే నాకు సమాధి కడుతున్నారు.. -
తండ్రి అనుకున్న వ్యక్తే కాటేశాడు: తేజస్వి ఎమోషనల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ఆదరించేవాళ్లు చాలామందే ఉన్నారు. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. టాస్కులు, నామినేషన్ల పర్వం, అప్పుడప్పుడూ గెస్టుల రాకతో బాగానే నెట్టుకొస్తున్నారు కానీ ఎలిమినేషన్లే ఎవరికీ అంతు చిక్కడం లేదు. టాప్ 5లో లేదా టాప్ 10లో ఉంటారనుకునే కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా ఆమె గత వారమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రెండో వారం శ్రీరాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఐదో వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అవడం చాలామందికి ఇప్పటికీ మింగుడుపడటం లేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను ఇలా సడన్‌గా ఎలా పంపించేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుంచి వచ్చేసిన తేజస్వి బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ రవి దగ్గర హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అఖిల్ హీరో, స్రవంతి మిర్చి, మిత్ర కాకరకాయ, నటరాజ్ మాస్టర్ రాడ్, అనిల్ కేటుగాడు అని తెలిపింది. అవకాశం ఇస్తే ఎవరిని తుపాకీతో లేపేస్తావంటే క్షణం ఆలోచించుకోకుండా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. నటరాజ్ మాస్టర్ లాంటి తండ్రి తనకు వద్దంది తేజస్వి. పక్కనవాళ్లను తొక్కుకుంటూ పోయేవాళ్లు నచ్చరంటూ బిందుమాధవి ఫొటోను చించేసింది. గతంలో బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక తనకు పనివ్వడమే మానేశారని, ట్రోలింగ్ వల్ల ఏడుస్తూనే ఉన్నానంది. దీన్నుంచి బయటపడేందుకు ట్రావెలింగ్ చేసి మళ్లీ నార్మల్ అయ్యానంది. ఈసారి బిగ్‌బాస్‌లో నటరాజ్ మాస్టర్ అనే వ్యక్తి ఒక్కడే నామినేట్ చేసి పంపించేశాడని. తండ్రి అనుకున్న వ్యక్తి కాటేశాడు అంటూ బాధపడింది. -
Bigg Boss Non Stop: నామినేషన్స్‌లో 12 మంది!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ల భవిష్యత్తును చెప్పేది నామినేషన్సే. ఈ ఒక్క గండం నుంచి బయటపడ్డారంటే ఆ వారం నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చారంటే వీకెండ్ వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే! విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లకు ఆ చింత అక్కర్లేదనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ముచ్చటగా మూడో నామినేషన్స్ జరిగాయి. పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్ బ్యూటీ అరియానాను నామినేట్ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా ఇక నామినేషన్స్‌లో చైతూ ఎవరివో కాళ్లు పట్టుకుంటానంటూ నామినేట్ చేశాడు. యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య మహేశ్, అనిల్ మధ్య కూడా ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే అఖిల్, బిందుమాధవికి అస్సలు పడలేదు. మొత్తంగా ఈ మూడో వారం సరయు, అషూ రెడ్డి, కెప్టెన్ అనిల్ మినహా మిగతా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. -
బిగ్‌బాస్ ఓటీటీ ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎదురైన అవాంతరాలకు చెక్ పడింది. నాన్‌స్టాప్ అన్న పేరుకు తగ్గట్టుగానే రోజుకి 24 గంటలు హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌస్‌లో తొలివారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, అరియానా గ్లోరీ, మిత్ర శర్మ, హమీదా, ఆర్జే చైతూ ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. ఆమె నటరాజ్ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకున్న అషూ రెడ్డి కనీసం కంటెండర్‌గా కూడా పోటీ చేయలేపోవడంతో బాధతో ఏడ్చేసింది. మరి తేజస్వి కెప్టెన్‌గా బిగ్‌బాస్ హౌస్‌ను, హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుందో చూడాలి! -
మీ రుణాన్ని తీర్చేస్తానంటోన్న ఐస్‌క్రీమ్ హీరోయిన్
హీరోయిన్ తేజస్వి మదివాడ ఎన్నో కష్టాలు పడింది. చిన్నప్పుడే తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోగా తండ్రి ఆర్మీ ఆఫీసర్ అయినా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తినడానికి కూడా తిండి లేక పస్తులున్న రోజులున్నాయి. అలాంటి దీన స్థితి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె హార్ట్ ఎటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ వంటి పలు సినిమాల్లో నటించింది. రామ్‌గోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంతో హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి గతంలో బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలో అడుగు పెట్టిన ఆమె అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానని, ఎంటర్టైన్ చేస్తూ ఆ రుణాన్ని తీర్చేసుకుంటానంది. మరి ఈసారైనా ఈ రియాలిటీ షో తేజస్వికి కలిసి వస్తుందా? లేదా? చూడాలి! -
‘సర్కస్ కార్-2’లో హీరోయిన్గా తేజస్వి మదివాడ
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కస్ కార్-2’.నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ ఇది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘తేజస్వి మదివాడ’ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ... ‘నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన "సర్కస్ కార్" చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ‘సర్కస్ కార్-2’లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్’ అన్నారు. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె ృమాట్లాడుతూ... ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ‘సర్కస్ కార్-2’ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ ‘సర్కస్ కార్-2’కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి’ అన్నారు. బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నారు. -
హల్చల్ : మిలియనీర్ అషూ..సంతోషం అంటున్న అనుపమ
♦ తలనొప్పి పోతే సంతోషం అంటున్న అనుపమ ♦ అది పోయాక ఇక సంతోషమే అంటున్న అనుపమ ♦ బర్త్‌డే వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ ♦ లెహంగాలో బ్యూటీఫుల్ శివానీ రాజశేఖర్ ♦ అను ఇమాన్యుయెల్ క్యూట్ లుక్స్ ♦ శారీలో అదిరిపోయిన బిగ్‌బాస్ ఫేం హారిక ♦ మిలియనీర్ అయిపోయిన అషూరెడ్డి ♦ ఫోటో డంప్ చేసిన మాళవిక మోహన్ ♦ అవి ఎప్పటికీ అంతరించిపోవంటున్న తేజస్వి View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
పానీపూరి బండి వాడ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా : నటి
'ఐస్‌క్రీమ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపును సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత 'లవర్స్', 'మనం', 'హార్ట్ ఎటాక్' సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే 2018లో వచ్చిన బిగ్‌బాస్-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా కౌశల్‌తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్ బారిన పడి ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది. ఆ తర్వాత కారణాలు ఏవైనా సినిమా ఆఫర్లు మాత్రం తగ్గుతూ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో హాట్ ఫోటో షూట్లలో పాల్గొనే తేజస్వీ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. 'చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్ అయ్యాను' అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)