బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం సరద సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై నాని రివ్యూ ఇచ్చారు. అందరి నటనపై రివ్యూపై ఇస్తూ... రేటింగ్‌ను ఇచ్చారు. ఇక ఈ వారంలో హైలెట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడారు నాని. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్ గురించి చేసిన హంగామా.. నందిని, కౌషల్ మధ్య జరిగిన సంభాషణలపై నాని చర్చించారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తనీష్‌కు అభినందనలు తెలిపారు నాని.
అయితే ఆరో వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న దీప్తి, తనీష్‌లు ప్రొటెక్షన్ జోన్‌లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ఇక మిగిలిన ఇద్దరి గురించి అందరికి తెలిసిందే. తేజస్వీ, సామ్రాట్‌ల జంట గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తేజస్వీ చేసే చేష్టలతో విసిగి ఉన్న ప్రేక్షకులు ఆమెని పంపిస్తారో లేక తేజస్వీ చుట్టు తప్పా ఇంకేం పట్టదన్నట్లు ఉండే సామ్రాట్‌ను పంపిస్తారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం తేజస్వీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు తేజస్వీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ ప్రవర్తన, ఇంట్లో వీరిద్దరు చేసే అతిని చూడలేక ప్రేక్షకులు చివరికి వీరిద్దరిని విడదీయాలని ఫిక్స్ అయినట్టున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌ను చూస్తే తేజస్వీ బయటకు వేళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో... ఎందుకంటే బిగ్‌బాస్‌లో ఏమైనా జరుగొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment