![Actor Navdeep Leg Injury Tejaswi Madivada Fun - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/6/navdeep.jpg.webp?itok=RIM4pOl-)
టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నటి తేజస్విని ఓ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే నవదీప్ కి గాయమైందని ఆమె బాధపడటం సంగతి అటుంచితే.. అతడిని తెగ ఏడిపించింది. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ అనుకుంటున్నారు.
'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాలు చేశాడు గానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆర్య 2, బాద్ షా తదితర చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల ముందు పలు షోల్లో జడ్జిగా, పార్టిసిపెంట్ గానూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు)
ఏమైందో ఏమో గానీ ఈ మధ్య నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతడిని పరామర్శించడానికి వచ్చిన నటి తేజస్విని.. ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నటీనటులు.. నవదీప్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్‌గా 'న్యూసెన్స్' సిరీస్ లో, తేజస్విని 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ లో నటించారు.
(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment