Leg Injury
-
రష్మిక కాలికి గాయాలు
-
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్‌లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్‌ప్యాక్ పెట్టడం. ఐస్‌క్యూబ్స్‌ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్‌తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్!
ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్‌లో నటించి చాలా కాలమైంది.ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)A bond for life with #sivakumar anna, who came to see me as I am recovering from a leg procedure.shared so much on drawings , pictures and our travel 🙏🙏🙏🙏 pic.twitter.com/qxwuBMZD4q— Radikaa Sarathkumar (@realradikaa) May 18, 2024 -
ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి
-
వీల్ ఛైర్లో యాంకరింగ్.. అదీ తెలుగు షోలోనే!
కామెడీ చూడటానికి హాయిగా ఉంటుంది. కానీ చేసేవాళ్లని అడిగితే అదెంత కష్టమో చెబుతారు. ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ ఉన్నంతమంది లేడీస్ లేరు. టీవీ షోల వల్ల ఇప్పుడిప్పుడే పలువురు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమ్ తెచ్చుకుంది రోహిణి. ఉత్తరాంధ్రకు చెందిన ఈమె... తొలుత సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసింది. 'జబర్దస్త్'లో చేసి ఓ రేంజు క్రేజ్ సంపాదించింది. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) షోలు, సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రోహిణి.. సరిగ్గొ కొన్నాళ్ల ముందు ఆస్పత్రిలో చేరింది. కాలికి పెద్దకట్టుతో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. 2016లో విజయవాడ నుంచి కారులో వస్తుండగా రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమె కాలిలో రాడ్ పెట్టారు. ఇప్పుడు అది తీయించుకుందామని వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంది. షోలు చేయడం మొదలుపెట్టేసింది. రోహిణి కాలి నుంచి రాడ్ నుంచి కొన్ని నెలలు అయినా కాలేదు. అప్పుడే తెలుగులోని ఓ ఛానెల్లో ప్రసారమైన షోలో కనించింది. వీల్ ఛైర్లోనే స్టేజీపైకి వచ్చి రవితో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. తాజాగా ఆదివారం ఈ షో టెలికాస్ట్ అయింది. అయితే ఈ షోని చాలా నెలల క్రితమే ఒప్పుకొందని, వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆరోగ్యం కుదటపడనప్పటికీ షో చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!) -
కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!
ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్లో కనిపించాడు. కాలికి సర్జరీ జరగ్గా, పెద్ద కట్టుతో కనిపించాడు. భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!) ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన 'పటాస్' కామెడీ షోతో యాదమ్మ రాజు వెలుగులోకి వచ్చాడు. తనదైన పంచులు, టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ప్రస్తుతం 'జబర్దస్త్'లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రతివారం స్కిట్స్‌తో నవ్వించే ఇతడు ఇప్పుడు సడన్‌గా కాలికి కట్టుతో కనిపించాడు. అయితే ఈ మధ్య ఏమైనా మెట్లపై నుంచి కాలు జారాడా? లేదా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. వీడియో మాత్రమే పోస్ట్ చేసిన యాదమ్మ రాజు.. ఏం జరిగింది? ఏంటనేది బయటపెట్టలేదు. బహుశా ఏం జరిగిందనేది యూట్యూబ్‌లో వీడియోగా పెడతాడేమో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని యాదమ్మ రాజు గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నటి తేజస్విని ఓ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే నవదీప్ కి గాయమైందని ఆమె బాధపడటం సంగతి అటుంచితే.. అతడిని తెగ ఏడిపించింది. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ అనుకుంటున్నారు. 'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాలు చేశాడు గానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆర్య 2, బాద్ షా తదితర చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల ముందు పలు షోల్లో జడ్జిగా, పార్టిసిపెంట్ గానూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) ఏమైందో ఏమో గానీ ఈ మధ్య నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతడిని పరామర్శించడానికి వచ్చిన నటి తేజస్విని.. ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నటీనటులు.. నవదీప్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్గా 'న్యూసెన్స్' సిరీస్ లో, తేజస్విని 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ లో నటించారు. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్!
ప్రమాదంలో కాలు పోగొట్టుకొని, తల్లిదండ్రులకు భారమై, లోకమంతా శూన్యంలా అనిపించిన రోజుల నుంచి తేరుకొని, అహ్మదాబాద్‌లో ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నేహ. మోటివేషనల్ స్పీకర్‌గానూ తన జీవన అనుభవాలను చెబుతోంది. ఆంప్ టీ కి దేశవ్యాప్త గుర్తింపు తేవడానికి కృషి చేస్తోంది. ఓడిపోయిన రోజుల నుంచి ఒంటికాలితో గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వివరిస్తుంది నేహ. ‘‘మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ,నాన్న, ఇద్దరు అన్నదమ్ములు. నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. గుజరాత్‌లోని భవానీ నగర్లో పుట్టి పెరిగాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఓ చిన్న ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వెతుక్కొని, కొన్నాళ్లు గడిపాను. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలక్రమంలో అన్ని ఇష్టాలను వదులుకుంటూ రావాల్సి వచ్చింది. ఇలాగే ఉంటే నా కలల రెక్కలు విప్పుకోలేననిపించింది. ఉద్యోగంతో పాటు కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాను. ఉదయం టీచర్‌గా చేస్తూ, సాయంత్రం కాలేజీలో చదువుకునేదాన్ని. స్కూల్లో పాఠాలు చెబుతూనే నా బలహీనతల గురించి కూడా తెలుసుకున్నాను. నేను ముందుకు వెళ్లాలంటే నా బలహీనతలపై పనిచేయడం నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొంత కాలం అంతా బాగానే జరిగింది. కానీ, కాలంతో పాటు డబ్బు అవసరం కూడా పెరగడం మొదలైంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అహ్మదాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 2012లో అహ్మదాబాద్ వచ్చి, కాల్సెంటర్లో పనిచేశాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత మళ్లీ టీచర్ జాబ్ సంపాదించుకున్నాను. ఎక్కువ మొత్తంలోనే నెల జీతం వచ్చేది. కల చెరిపిన ప్రమాదం అంతా బాగుంది అనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. ట్రీట్మెంట్ తీసుకోవడంలో జాప్యం కావడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. దాంతో తీవ్ర నిరాశతో డిప్రెషన్‌కు గురయ్యాను. దీని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కృత్రిమ కాలు ఏర్పాటయ్యాక నాలో మళ్లీ ఆశలు చిగురించాయి. స్నేహితుల సహకారంతో.. ధైర్యం తెచ్చుకొని, ముందున్న జీవితం గురించి ఆలోచించాను. టీ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో మా ఇంట్లో వాళ్లకి ఓ కేఫ్ తెరుస్తానని చెప్పాను. కానీ, నా ట్రీట్మెంట్కి అప్పటికే చాలా ఖర్చయింది. షాప్ అద్దెకు తీసుకునేంత డబ్బు నా దగ్గర లేదు. మా బంధువులు ఎవరూ సపోర్ట్ ఇచ్చేవారు లేరు. కానీ, నా స్నేహితుల సహకారంతో టీ స్టాల్ ప్రారంభించాను. టీ స్టాల్‌కు షార్ట్ మీదనే వెళ్లేదాన్ని. చాలా మంది నా డ్రెస్ గురించి కూడా తిట్టేవారు. ‘కాలు లేదు, పైగా నలుగురు తిరిగే చోట ఇలా షార్ట్స్ వేసుకొని తిరుగుతావా? బుద్ధిలేదా’ అనేవారు. ఈ వెక్కిరింపులు బాధ కలిగించేవి. కానీ, నాకు నేను బలంగా ఉన్నాను అని తెలుసు. వాస్తవికతను అంగీకరించాను. నేను ధరించిన డ్రెస్ నాకేమీ ఎబ్బెట్టుగా లేదు. పైగా అందరూ అంతగా తిట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నా పని ద్వారానే సమాధానం చెబుతాను అనుకునేదాన్ని. టీ స్టాల్ వైరల్ ‘కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయి’ అని నాకు నేనే చెప్పుకుంటూ ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ నడపడం మొదలుపెట్టాను. విజయం సాధిస్తానని కచ్చితంగా తెలుసు. కానీ, ప్రజల నుండి ఇంత ప్రేమను పొందుతానని తెలియదు. కేవలం పది రోజులలో నా టీ స్టాల్ వద్ద జనం గుమిగూడటం ప్రారంభించారు. ఫుడ్ బ్లాగర్లు నా గురించి రాసి, ప్రచారం చేశారు. నా టీ స్టాల్‌ను బ్రాండ్‌గా మార్చాలని పోరాడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కొందరు అధికారులు నా స్టాల్ దగ్గరకు వచ్చి, ఇది అక్రమమని, తొలగిస్తామన్నారు. నేను వారితో చాలా పోరాడాను. ఎవరో తీసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతోమంది తమ ప్రేమతో నాకు మద్దతు తెలిపారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ‘ఆంప్ టీ నేహా’ని మంచి బ్రాండ్‌గా మార్చి నాలాంటివారికి ఓ మార్గం చూపాలన్న నా కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’ అని చెబుతోంది నేహా. (చదవండి: ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!) -
ప్లేట్ ఫామ్, రైల్వే ట్రాక్ మధ్య ఇరుక్కుపోయిన మహిళా
-
నడవలేని స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. ఫోటో వైరల్
కొంతమంది హీరో,హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా ఇట్టే గుర్తిండిపోతారు. అలాంటి వారిలో నటి కనిహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కనిహా తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును కనిహా అని మార్చుకుంది. తెలుగులో ఒట్టేసి చెపుతున్నా,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వంటి సినిమాల్లో నటించింది. 2008లో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కనిహా గాయపడింది. ఫ్రాక్చర్ కారణంగా నడలేని స్థితిలో ఉంది. వాకర్ పట్టుకొని ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. బ్యాలెన్సింగ్‌గా అడుగులు వేయడం నేర్చకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కనిహా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) -
నడవలేని స్థితిలో బుట్టబొమ్మ.. ఫోటో వైరల్..!
అందాల భామ, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెకు కాలుకు బలమైన గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఎడమకాలి పాదం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఆమె వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా షూటింగ్ సమయంలో నటి పూజా హెగ్డేకు గాయమైంది. ఆమె చివరిసారిగా విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రంలో కనిపించింది. (చదవండి: పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!) ఆ ఫోటోలో పూజా హెగ్డే.. నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వాకర్ పట్టుకుని స్టెప్స్ వేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాలో హ్యాండిల్లో రాస్తూ..' నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది బుట్టబొమ్మ. పూజా హెగ్డే తదుపరి చిత్రం మహేష్ బాబుతో జతకట్టనుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఆమె రణ్వీర్ సింగ్ నేతృత్వంలోని హిందీ మూవీ 'సర్కస్'లోనూ కనిపించనుంది. -
హీరోయిన్ త్రిషకు ప్రమాదం.. కాలికి ఫ్రాక్చర్, ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్‌తో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో త్రిష ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలె విదేశాలకు వెళ్లిన త్రిష గాయంతో తిరిగొచ్చింది. టూర్లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. ఈ క్రమంలో కాలికి పట్టి వేసి ఉన్న ఫోటోని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక త్రిష షేర్ చేసిన ఫోటో చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. జారీ పడడంతో ఎడమకాలి మడమ చీర మండలంలో క్రాక్ ఏర్పడింది. దీంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్‌కు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఇవాళ కింద పడిపోయాను. ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో చూడటానికి మంచి ఓటీటీ షోలు ఏం ఉన్నాయో సలహా ఇస్తారా?’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా రేపు(ఆదివారం) కేటీఆర్ పుట్టిన రోజు. బర్త్‌డేకు ఒక రోజు ముందే గాయపడటంతో అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం తెలదిసిందే . భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁 Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX — KTR (@KTRTRS) July 23, 2022 -
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత..
Hero Vishal Got Accident In Lathi Movie Shoot: సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు. పోరాట సన్నివేశాలకోసం డూప్ లేకుండా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఎంత సహజంగా చిత్రీకరిస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుందని నమ్మే హీరో విశాల్. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్. అయిన కూడా సినిమా కోసం కాంప్రమైజ్ కాడు విశాల్. అయితే తాజాగా మరోసారి సినిమా షూటింగ్లో విశాల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. విశాల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'లాఠీ'. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తెరకెక్కుస్తుండంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విశాల్ కాలికి గాయామైనట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. ఇదివరకు హైదరాబాద్‌లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్ చేతికి, చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే షూటింగ్ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన విశాల్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. అయితే గతంతో పోలిస్తే ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్ షాట్లు ఇకపై చేయొద్దని కోరుకుంటున్నారు. చదవండి: కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి Actor @VishalKOfficial once again got injured on the sets of #Laththi . The Night Shoot was cancelled as #Vishal got a leg injury during shoot of climax fight sequence happening at chennai. The shoot will resume once the actor recovers. pic.twitter.com/xnPAx8THHW — Sreedhar Pillai (@sri50) July 3, 2022 -
మాల్లో గుచ్చుకున్న మేకు.. రూ.75 కోట్ల పరిహారం
అమెరికాలో ఓ మహిళ షాపింగ్ కోసం వాల్‌మార్టు మాల్‌కు వెళ్లితే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె మాల్‌లోకి ప్రవేశించి షాపింగ్ చేస్తున్న సమయంలో కాలికి తుప్పుపట్టిన ఇనుప మేకు గుచ్చుకుంది. చిన్న గాయం కాస్త ఇన్ఫెక్షన్గా మారటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ కాలును కోల్పోవటంతో ఆరేళ్లపాటు వీల్‌ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఘటన 2015 సౌత్ కరోలినాలోని వాల్ మార్టులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలైన ఏప్రిల్ జోన్స్ అనే మహిళ 2017లో వాల్‌మార్టు యాజమాన్యంపై నష్టం పరిహారం కేసును ఫ్లోరెన్స్ కౌంటీలోని కోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 10 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని వాల్ మార్టును ఆదేశించింది. ఆమె తరఫున వాదనలు జరిపిన అనస్టోపౌలో న్యాయ సంస్థ న్యాయవాదులు.. ఏప్రిల్ జోన్స్ ఆరేళ్లపాటు వీల్ ఛైర్‌కే పరిమితమైందని, ఆమె జీవితం ఈ ఘటన ద్వారా చెల్లాచెదురై ఇబ్బందులు ఎదుర్కొందని కోర్టుకు వివరించారు. వారి వాదనలను సమర్ధిస్తూ బాధిత మహిళకు 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 75 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ప్రొస్తెటిక్ కాలును కొనుగోలు చేయడానికి.. భవిష్యత్తు వైద్య బిల్లులను కవర్ చేయడానికి నష్టం పరిహారం డబ్బును ఉపయోగిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయసంస్థ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
వైద్యపరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడికాలుకు గాయం అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ వాపు రావటంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ అనిల్‌కుమార్, మణిపాల్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సీఎం జగన్‌కు సాధారణ వైద్యపరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. -
యూఎస్ ఓపెన్ నుంచి వీనస్ విలియమ్స్ ఔట్
ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని వీనస్ తెలిపింది. చెల్లి బాటలోనే అక్క కూడా ప్రయాణించింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో ను లో ట్విట్టర్ పోస్ట్ చేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తన ఫేవరెట్ అని,ఈ టోర్నమెంట్లో ఆడకపోవడం తనకు ఎంతో నిరాశ కలిగించదని ఆమె పేర్కొన్నారు. యూఎస్ ఓపెన్‌లో తనకు కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది. మళ్లీ రాకెట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టులో కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తానని, వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు. ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న వీనస్ విలియమ్స్ కేవలం ఈ ఏడాది 12 మ్యాచ్‌లే ఆడింది. కాగా వైల్డ్ కార్డ్‌తో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్2021లో ఎంట్రీ ఇచ్చారు. కాగా , ఇప్పటికే.. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు దూరమవుతున్నట్లు ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. మరో వైపు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. చదవండి: IND Vs ENG 3rd Test Day 2: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హసీబ్ హమీద్(68) బౌల్డ్ Not the best news everyone. I am joining @serenawilliams @RafaelNadal and @rogerfederer on the injured list. It’s still going to be a great US Open & many thanks to the @usta for the wild card. I was so looking forward to it, but it was not meant to be this year. I will be back! pic.twitter.com/s0PRgdSSx2 — Venus Williams (@Venuseswilliams) August 25, 2021 -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు
లాస్ ఏంజిలెస్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ (45) కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్ కౌంటీలో ఉన్న రాంచో పాలో వర్జిస్ వద్ద మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక) జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వుడ్స్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లి పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. -
మిషెల్ మార్ష్ అవుట్!
దుబాయ్: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో కీలక ఆటగాడిని కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ మొత్తం లీగ్‌కు దూరం కావచ్చని సమాచారం. సన్‌రైజర్స్ దీనిని అధికారికంగా ప్రకటించకపోయినా... అతని చీలమండ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసింది. తన బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్ షాట్‌ను ఆపబోయి గాయపడిన మార్ష్ మరో రెండు బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే అవుటయ్యాడు. అతను ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, మరో మ్యాచ్ కూడా ఆడటం కష్టమేనని రైజర్స్ వర్గాలు వెల్లడించాయి. అతని స్థానంలో మరో ఆసీస్ ఆల్‌రౌండర్ డానియెల్ క్రిస్టియాన్ పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు కేన్ విలియమ్సన్ కూడా తొడ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. విలియమ్సన్ ఎప్పటివరకు కోలుకుంటాడనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. -
ఎమ్మెల్యే ఆర్కేకి గాయం
సాక్షి, గుంటూరు/మంగళగిరి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. వధూవరులను ఆశీర్వదించేందుకు స్టేజీపైకి వెళ్లిన ఆర్కేతో కరచాలనం కోసం స్థానికులు కూడా వేదికపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయమైంది. వెంటనే గుంటూరు అరండల్‌పేటలోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్కేను కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పరామర్శించారు. (జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా: పవన్ కళ్యాణ్) -
విధి వంచితుడు..!
సాక్షి, నల్లగొండ: కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉపాధి కోసం వెళ్తే.. అతనికి శాశ్వత వైకల్యం మిగిలింది. తలరాతో.. లేక విధి వెక్కిరించిందో.. కానీ అతని కుటుంబంలో మాత్రం తీరని విషాదం నింపింది. తన పిల్లలను ఎత్తుకుని ఆడుతూ పాడుతూ వారిని లాలించాలి్సన తండ్రి ఇప్పుడు వాకర్ సాయం లేనిదే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి దాపురించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక కండక్టర్‌గా పనిచేస్తున్న అతడిని తాను డ్యూటీ చేస్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో కాలు నుజ్జునుజ్జయింది. మోకాలి కింది వరకు కాలు తొలగించారు. 23 రోజులు అతనితో పని చేయించుకున్న ఆర్టీసీ సంస్థ అతన్ని పట్టించుకున్న పాపానపోలేదు. బస్టాండ్‌లో ఘటన జరిగినా కనీసం మందలించిన వారు కూడా లేరు. దీంతో తనను ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్‌లో ఇన్చార్జ్ కలెక్టర్ ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన పురం జానయ్య. వైద్యానికి రూ.4.70 లక్షల ఖర్చు.. జానయ్య పొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక కార్మికులు కావాలని పత్రికల్లో ప్రకటించడంతో మిర్యాలగూడ డిపోలో దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్‌గా ఎంపికై 23 రోజుల పాటు విధులు నిర్వర్తించాడు. మిర్యాలగూడ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో జానయ్య ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి మొదట పాదం వరకు పూర్తిగా తొలగించారు. తరువాత కూడా కాలుకు గాయాలు ఏ మాత్రం మానకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేసి మోకాలి కింది భాగం వరకు తొలగించారు. ఇలా రెండుసార్లు ఆపరేషన్ చేయడంతో రూ.4.70 లక్షల ఖర్చు అయింది. రెక్కాడితేగానీ డొక్క నిండని ఆ కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర అప్పు తెచ్చి.. వైద్యం చేయించారు. నయా పైసా ఇవ్వని ఆర్టీసీ... జానయ్య చేత 23 రోజులు పని చేయించుకుని ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నా.. ఆ సంస్థ అధికారులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. జానయ్య భార్య స్వాతి వీబీకేగా పని చేస్తే నెలకు రూ.3 వేలు మాత్రమే వస్తున్నాయి. ఆ మొత్తంతో కుటుంబ పోషణకు కూడా భారంగా మారిందని బాధితుడు కన్నీరుమన్నీరవుతున్నాడు. డిగ్రీ వరకు చదివిన తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకున్నాడు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన పురం జానయ్య -
మెసేజ్ పంపారు.. సాయం మరిచారు..
అతడు చదువుల్లోనే కాదు..ఆటల్లోనూ ఫస్టే. అయితే రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని కకావికలం చేసింది. ఇంజినీర్ కావాలన్న అతడి కలలను చిదిమేసింది. తల్లిదండ్రులు అతడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. మరికొన్ని ఆపరేషన్ల కోసం సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె : పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి తన కుమారుడు భరత్‌సింహారెడ్డి చదువుకోసం ఉన్న ఊరిని వదిలి మదనపల్లెకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబా న్ని పోషిస్తున్నారు. పదోతరగతిలో 9.0 పాయింట్లతో ఉత్తీర్ణుడైన భరత్‌సింహారెడ్డి ఇంటర్మీడియెట్ ఏపీఆర్జేసీ గ్యారంపల్లెలో సీటు పొందా డు. 2016లో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్ పూర్తిచేశాక పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. 2017నవంబర్ 5న స్నేహితుడు ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకువస్తున్న భరత్నసింహారెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో స్నేహితుడు అక్కడికక్కడే మరణించగా, భరత్‌సింహారెడ్డికి ఎడమకాలు నుజ్జు నుజ్జైంది, చేయి, భుజం పూర్తిగా దెబ్బతినడంతోపాటు మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామంలోని నాలుగెకరాల వ్యవసాయభూమిని విక్రయించి ఆ సొమ్ముతో భరత్‌సింహారెడ్డికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక అప్పట్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం త్వరలోనే చెక్కును పంపనున్నట్లు కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపింది. అయితే ఆ సాయం అందలేదు. చివరకు స్నేహితులు, దాతలు, బంధువులు చేసిన సాయం మూలాన చేయించిన చికిత్సతో భరత్ కొంతవరకు కోలుకున్నాడు. అతడికి నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే నడిచే అవకాశం ఉందని, రూ.3.5 లక్షల నుంచి 5లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుమిలిపోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించదలిస్తే 9676520586, 9493871077 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. ఎస్బీఐ, ఎన్టీఆర్ సర్కిల్ అకౌంట్ నంబర్ 30757452216, ఐఎఫ్ఎస్సీ కోడ్..ఎస్బీఐఎన్0012727కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నా బలం తెలిసింది
కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్నారు హీరోయిన్ మంజిమా మోహన్. ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె కాలికి గాయం కావడమే ఇందుకు కారణం. మంజిమా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ కోలుకునే క్రమంలో ఆమె అనుభవాలను ఓ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘నేను గాయపడి ఇంట్లో ఉన్న ఖాళీ సమయంలో నాలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అవి నన్ను ఆందోళనకు గురి చేశాయి. మళ్లీ మామూలుగా నడవగలనా? నాకు ఎంతో ఇష్టమైన నటనకు దూరం అవుతానా? నేను ప్రేమించే డ్యాన్స్‌ను వదులుకోవాల్సి వస్తుందా? అనే ఆలోచనలు నన్ను కంగారు పెట్టాయి. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో నాపై నాకు నమ్మకం ఉండేది కాదు. భయం వేసింది. అప్పుడు నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ ‘నీపై నీకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలవు. నువ్వు ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడగలవు’ అని చెప్పి మళ్లీ నాలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. మెల్లిగా నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టాను. మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నాను. ఈ అనుభవం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నా బలం ఏంటో నాకు తెలిసేలా చేసింది. ఇప్పుడు నా ఆలోచనల్లో భయం, ఆందోళన, అనుమానాలకు చోటు లేదు. గతంలో ఎందరో నటీనటులు నాలానే గాయపడి తిరిగి కోలుకున్నారు. వారి ధైర్యాన్ని ఎంతో గౌరవిస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా మోహన్. నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా. -
చికిత్స కోసం వస్తే వికలాంగురాలిని చేశారు..
సనత్‌నగర్: కాలికి గాయమైన తమ కుమార్తెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె శాశ్వతంగా కాలును కోల్పోవాలి వచ్చిందని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఎస్ఆర్నగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, పావని దంపతుల కుమార్తె అక్షర (5) గత నెల 13న ఇంట్లో ఆడుకుంటుండగా కబోర్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పాప కాలిని ఎక్స్‌రే తీయించిన వైద్యులు.. పాపకు ఎలాంటి ప్రమాదం లేదు..కాలికి ఫ్రాక్చర్ అయినందున ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటికి తాత్కాలికంగా సిమెంట్ పట్టీ వేసి మరుసటి రోజు మే 14న ఉదయం ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మర్నాడు ఉదయం పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్లోకి అక్షరను తీసుకువెళ్లిన వైద్యులు రెండు గంటల తర్వాత పాపను బయటికి తీసుకువచ్చి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. సీటీస్కాన్ చేయగా కాలికి రక్తప్రసరణ జరగడం లేదని, సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతెఓ వారు పాపను తీసుకుని యశోద ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి పాప కాలికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆరు గంటల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగినందున కాలు తీసేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో పాప ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు. దీంతో వారు సెకండ్ ఒపీనియన్ కోసం సన్‌షైన్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ చిన్న పిల్లలను చేర్చుకోరని చెప్పడంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా. అక్కడి వైద్యులు కూడా కాలు తీయాల్సిందేనని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఆపరేషన్‌కు అంగీకరించడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాలును తొలగించారు. నీలిమ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె కాలిని కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే పోలీసులు నీలిమ ఆస్పత్రి యాజమాన్యానికే కొమ్ము కాస్తున్నారని, తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు చిన్నారి అక్షర కేసులో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు. చిన్నారిని తీసుకువచ్చినప్పుడు తగిన చికిత్స అందించాం. అయితే పాప తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం, వారితో చర్చలు జరుపుతున్నాం...–నీలిమ ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాస్ -
పగోడికీ..ఈ కష్టం వద్దు!
కుటుంబ పోషణ కోసం పొట్ట చేతబట్టుకుని నైజాం వెళ్లింది ఆ కుటుంబం. ఇంటి యజమాని బేల్దారి పని చేసుకుంటూ భార్య, పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. ఇంతలో విధి ఆ కుటుంబంపై పగ బట్టింది. బేల్దారి పని చేసే సమయంలో నాలుగో అంతస్తు నుంచి పరంజా విరిగి కింద పడిపోయాడు. ఫలితంగా వెన్ను, రెండు కాళ్లూ విరిగి ఇప్పుడు మంచానికి పరిమితమయ్యాడు. ఆరేళ్లుగా మంచం పట్టడంతో అండగా ఉండాల్సిన భార్య..భర్తను వదిలి పుట్టింటికి చేరింది. చివరకు ఇద్దరు కుమార్తెలు చదువుకు ఫుల్స్టాప్ పెట్టి తండ్రికి బాసటగా నిలిచారు. పగోడికీ మా కష్టం వద్దని దేవుడిని వేడుకుంటున్నారు. గార్లపేట (మర్రిపూడి): గార్లపేట గ్రామానికి చెందిన బింగినపల్లి లక్ష్మణ్ చిన్ననాటి నుండి బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతడికి దర్శి పట్టణానికి చెందిన కోటమ్మతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. దూదేకుల సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌కు ఎలాంటి భూమి లేదు. చిన్న తనంలోనే తండ్రి పెద సిద్ధయ్యను పోగొట్టుకున్నాడు. తల్లి సుభానమ్మ వద్ద ఉంటూ హైదరాబాద్ వెళ్లి బేల్దారి పని నేర్చుకున్నాడు. వివాహం అనంతరం భార్య, బిడ్డలతో పొట్ట చేతబట్టుకుని బేల్దారి పని కోసం నైజాం వెళ్లాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ బండ మైసమ్మ వద్ద పని కుదుర్చుకున్న లక్ష్మణ్ నాలుగో అంతస్తులో తాపీ పని చేస్తున్నాడు. పని చేస్తుండగా పరంజా విరిగి అమాంతం కింద పడ్డాడు. ఇక్కడి నుంచే కష్టాలు ప్రమాదంలో లక్ష్మణ్ వెన్నుపూస, రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్ష్మణ్‌ను తీసుకెళ్లిన మేస్త్రి మస్తాన్ వైద్యానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. పనిచేయించుకున్న ఇంటి యజమాని మరో రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేదు. లక్ష్మణ్ నడవలేక ఆరేళ్లు మంచంలోనే పడి ఉన్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుటుంబ పోషణ భారం కావడంతో తన ఇద్దరి పిల్లలు, భర్తను వదిలేసి భార్య కోటమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ భారం పెద్ద కుమార్తె మహేశ్వరిపై పడింది. రోజూ కూలికి వెళ్లి తండ్రిని పోషించుకుంటోంది. చిన్న కుమార్తె హైమా తండ్రి వద్దే ఉంటూ అన్నం పెట్టడం, మూత్రం పైపు మార్చడం, శరీరం తుడవడం వంటి సపర్యలు చేస్తోంది. బాల్యంలో చదువుకోవాల్సిన ఆ చిన్నారులపై మోయలేని భారం పడింది. ఆరో తరగతిలో చదువు ఆపేసి తండ్రికి సాయంగా మంచి చెడులు చూసుకుంటోంది. కుటుంబ భారాన్ని మోయాల్సిన తండ్రి లేవలేని స్థితిలో మంచం పట్టడం ఆ చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రిని చూసుకుని కుమార్తెలు మౌనంగా రోదించని రోజు లేదు. ఆపన్న హస్తం కోసం తండ్రి వైద్యానికి ప్రతి నెలా రూ.4 వేలు ఖర్చు కావడంతో కుటుంబ భారాన్ని మేయలేకపోతున్నామని కుమార్తెలు మహేశ్వరి, హైమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కనిగిరి వెళ్లి మల్లికార్జున వైద్యాశాలలో చికిత్స చేయించుకుంటున్నామని చెబుతున్నారు. ఇక ఆర్థిక స్థోమత లేదని, వైద్యం చేయించలేక పోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆసర కల్పించకపోవడంతో దాతల సాయంతో గార్లపేటలో ఓ రేకుల ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ తండ్రి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయదలచిన వారు 96660 15375, 98494 25458 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు