యూఎస్‌ ఓపెన్‌ నుంచి వీనస్ విలియమ్స్ ఔట్‌ | Venus Williams Withdraws From US Open Due To Injury | Sakshi
Sakshi News home page

US Open 2021: యూఎస్‌ ఓపెన్‌ నుంచి వీనస్ విలియమ్స్ ఔట్‌

Published Thu, Aug 26 2021 5:37 PM | Last Updated on Thu, Aug 26 2021 6:14 PM

Venus Williams Withdraws From US Open Due To Injury - Sakshi

ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ కు టెన్నిస్ స్టార్  వీనస్ విలియమ్స్  దూరమవుతున్నట్లు ప్రకటించింది. మోకాలి  గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని వీనస్‌ తెలిపింది. చెల్లి బాటలోనే అక్క కూడా ప్రయాణించింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో ను లో ట్విట్టర్‌ పోస్ట్‌ చేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తన ఫేవరెట్ అని,ఈ టోర్నమెంట్‌లో ఆడకపోవడం తనకు ఎంతో నిరాశ కలిగించదని ఆమె పేర్కొన్నారు. యూఎస్ ఓపెన్‌లో తనకు కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది.

మళ్లీ రాకెట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టులో కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తానని, వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు. ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న వీనస్ విలియమ్స్ కేవలం ఈ ఏడాది 12 మ్యాచ్‌లే ఆడింది. కాగా వైల్డ్ కార్డ్‌తో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్‌2021లో ఎంట్రీ ఇచ్చారు. 

కాగా , ఇప్పటికే.. టెన్నిస్ స్టార్  సెరెనా విలియమ్స్  ఈ ఏడాది  యూఎస్‌ ఓపెన్‌ కు  దూరమవుతున్నట్లు ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. మరో వైపు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌ యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు లేవ‌ని సోష‌ల్ మీడియాలో తెలిపాడు.

చదవండి: IND Vs ENG 3rd Test Day 2: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. హసీబ్‌ హమీద్‌(68) బౌల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement