venus williams
-
నాదల్ జోరు.. తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విలియమ్స్ సిస్టర్స్
యూఎస్ ఓపెన్ 2022లో భాగంగా నాలుగో రోజు పెద్దగా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిని 2-6, 6-4, 6-2, 6-1తేడాతో చిత్తు చేసి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. అయితే తొలి గేమ్ ఓడిన అనంతరం నాదల్ రాకెట్.. అతని ముక్కును చీల్చడంతో రక్తం కారింది. అయితే దీనిని లెక్కచేయని నాదల్ ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడిన నాదల్.. ప్రత్యర్థి ఫోగ్నినిని వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఇక 23 వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు నాదల్ మరింత దగ్గరయ్యాడు. VAMOS pic.twitter.com/6xxFhV4pJC — US Open Tennis (@usopen) September 2, 2022 రికార్డు విజయాలతో అల్కరాజ్.. పరుషుల వరల్డ్ నెంబర్ 3 కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో అర్జెంటీనాకు చెందిన కొరియాను 6-2, 6-2, 7-5తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 46వ విజయం. ఈ క్రమంలోనే సిట్సిపాస్ రికార్డును అధిగమించిన అల్కరాజ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్లో సిట్సిపాస్ 17 పరాజయాలు పొందగా.. అల్కరాజ్ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలయ్యాడు. We see you, @carlosalcaraz 👀 pic.twitter.com/lGEZZin5dS — US Open Tennis (@usopen) September 1, 2022 ఎదురులేని స్వియాటెక్.. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ తన జోరును ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌ను స్వియాటెక్.. 6-3, 6-2తో ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. కాగా 2020, 2022లో స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. It's always crazy hearing yourself for the first time in the world's largest tennis stadium, @iga_swiatek 😆 pic.twitter.com/cWUjhiJSg9 — US Open Tennis (@usopen) September 1, 2022 విలియమ్స్ సిస్టర్స్‌కు షాకిచ్చిన చెక్ రిపబ్లిక్ ద్వయం.. ఇక మహిళల డబుల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా, వీనస్ విలియమ్స్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో చెక్ రిపబ్లిక్ ద్వయం లూసీ హ్రడెకా- లిండా నోస్కోవా చేతిలో 7-6(7-5), 6-4తో విలియమ్స్ సిస్టర్స్ ఓటమి పాలయ్యారు. అయితే సింగిల్స్ మాత్రం సెరెనా దుమ్మురేపింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావిట్ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్ -
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా:సెరెనా విలియమ్స్
-
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా?'
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వార్త విషయంలో సెరెనా ఫోటోను ప్రచురించకుండా.. తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న సెరెనా విలియమ్స్ న్యూయార్క్ టైమ్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. 40 ఏళ్ల టెన్నిస్ స్టార్ ఈ మధ్యనే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్స్‌ను ప్రారంభించింది. దాదాపు 111 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని సేకరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడిస్తూ సెరెనాపై ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. విషయం సరిగ్గానే ఉన్నప్పటికి ఫోటో విషయంలో మాత్రం పెద్ద పొరపాటే చేసింది. సెరెనా ఫోటోకు బదులు తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు. అప్పటి సెరెనా అనుకొని.. వీనస్ ఫోటోను పబ్లిష్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టికల్తో పాటు ఫోటోను ట్యాగ్ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా స్పందించింది. ''జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి. అందుకే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్‌ను ప్రారంభించాం. దానిపై దాదాపు 111 మిలియన్ యూఎస్ డాలర్ల నిధిని సేకరించాం. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడడం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన సెరెనా ఇటీవలే పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ర్యాంకింగ్స్‌లో 2006 తర్వాత తొలిసారి టాప్ 50లో సెరెనా చోటు దక్కించుకోలేకపోయింది. 2021 నుంచి చూసుకుంటే సెరెనా కేవలం ఆరు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంది. వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సెరెనా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఫిట్నెస్ కారణాలతో తప్పుకుంది. చదవండి: Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్ Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! No matter how far we come, we get reminded that it's not enough. This is why I raised $111M for @serenaventures. To support the founders who are overlooked by engrained systems woefully unaware of their biases. Because even I am overlooked. You can do better, @nytimes. pic.twitter.com/hvfCl5WUoz — Serena Williams (@serenawilliams) March 2, 2022 -
యూఎస్ ఓపెన్ నుంచి వీనస్ విలియమ్స్ ఔట్
ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని వీనస్ తెలిపింది. చెల్లి బాటలోనే అక్క కూడా ప్రయాణించింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో ను లో ట్విట్టర్ పోస్ట్ చేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తన ఫేవరెట్ అని,ఈ టోర్నమెంట్లో ఆడకపోవడం తనకు ఎంతో నిరాశ కలిగించదని ఆమె పేర్కొన్నారు. యూఎస్ ఓపెన్‌లో తనకు కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది. మళ్లీ రాకెట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టులో కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తానని, వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు. ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న వీనస్ విలియమ్స్ కేవలం ఈ ఏడాది 12 మ్యాచ్‌లే ఆడింది. కాగా వైల్డ్ కార్డ్‌తో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్2021లో ఎంట్రీ ఇచ్చారు. కాగా , ఇప్పటికే.. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు దూరమవుతున్నట్లు ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. మరో వైపు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. చదవండి: IND Vs ENG 3rd Test Day 2: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. హసీబ్ హమీద్(68) బౌల్డ్ Not the best news everyone. I am joining @serenawilliams @RafaelNadal and @rogerfederer on the injured list. It’s still going to be a great US Open & many thanks to the @usta for the wild card. I was so looking forward to it, but it was not meant to be this year. I will be back! pic.twitter.com/s0PRgdSSx2 — Venus Williams (@Venuseswilliams) August 25, 2021 -
అక్క ఫై చెల్లిదే ఫైచెయ్యి...
లెక్సింగ్టన్ (అమెరికా): కరోనా విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో టైటిల్ దిశగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో అడుగు వేసింది. కెంటకీలో జరుగుతున్న టాప్ సీడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో సెరెనా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 3–6, 6–3, 6–4తో తన అక్క వీనస్ విలియమ్స్ (అమెరికా)పై గెలిచింది. తమ 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముఖాముఖిగా తలపడటం ఇది 31వసారి కాగా వీనస్‌పై సెరెనా గెలవడం ఇది 19వ సారి కావడం విశేషం. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 14 ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి వీనస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక మూడో సెట్లో ఒకదశలో సెరెనా 2–4తో వెనుకబడినా... ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు 40 ఏళ్ల వీనస్ ఈ మ్యాచ్‌లో 11 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన షెల్బీ రోజర్స్‌తో సెరెనా ఆడుతుంది. ‘నా కెరీర్లో తొలి టైటిల్ సాధించేందుకు ఇక్కడకు రాలేదు. విరామం తర్వాత నా ఆటతీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి, నా ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి వచ్చాను’ అని 38 ఏళ్ల సెరెనా వ్యాఖ్యానించింది. -
వరల్డ్ టీమ్ టెన్నిస్‌లో వీనస్
వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ప్రపంచ టీమ్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో పాల్గోనుంది. తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగడం ఇది 15వ సారి. తాజాగా ఆమె వాషింగ్టన్ కాజిల్స్ తరఫున పోటీపడనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 12న ప్రారంభం కానుంది. సాధారణంగా దేశంలోని పలు నగరాల్లో ఈ పోటీలు జరిగేవి. అయితే ఈసారి కరోనా మహమ్మారి దృష్ట్యా ఒకే వేదికలో (వెస్ట్ వర్జీనియా) అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇది డబ్ల్యూటీఏ, ఏటీపీ పరిధిలోని టోర్నీ కాదు. కాబట్టి ఇక్కడి గెలుపోటములతో ఎలాంటి పాయింట్లు జతకావు. ర్యాంకింగ్ ప్రభావితం కాదు. ఔట్‌డోర్ కోర్టులో జరిగే పోటీలకు 500 మంది ప్రేక్షకుల్ని, ఇండోర్ కోర్టులో జరిగే పోటీలకు 250 మందిని అనుమతిస్తారు. వర్షం కురిస్తే మ్యాచ్‌ల్ని ఇండోర్ కోర్టుల్లో నిర్వహిస్తారు. ఫేస్ మాస్క్‌లుంటేనే ప్రేక్షకులకు ఎంట్రీ ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. గతవారం 40వ పడిలోకి ప్రవేశించిన వీనస్ 2011లో అరుదైన కీళ్ల వ్యాధితో బాధపడుతోంది. అప్పట్నుంచి అడపాదడపా కొన్ని ఎంపిక చేసిన టోర్నీల్లోనే ఆడుతోంది. ఈమె ఖాతాలో ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. సోదరి సెరెనాతో కలిసి 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు కూడా గెలుచుకుంది. -
లాక్డౌన్ ముగిసిన వెంటనే బరిలోకి దిగుతా: సెరెనా
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఎప్పుడు లాక్డౌన్ ముగిస్తే అప్పుడు కోర్టులో దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. ‘రియల్ టెన్నిస్’కు తాను సిద్ధమని సోదరి వీనస్‌తో జరిపిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌లో వెల్లడించింది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఈ అమెరికా దిగ్గజం బరిలో దిగేందుకు, ఎప్పట్లాగే టెన్నిస్‌ను అస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వీనస్‌కు తెలిపింది. కరోనా మహమ్మారివల్ల వచ్చిన ఈ విరామంతో తగినంత విశ్రాంతి లభించిందని ఇక ఆట ఆడటమే మిగిలుందని పేర్కొంది. ‘ఇప్పుడైతే నేను చాలా బాగున్నాను. పూర్తి ఫిట్నెస్తో... మరెంతో ఉత్సాహంతో ఉన్నాను. పోటీలు ఎప్పుడు మొదలవుతాయా... ఎప్పుడు కోర్టుల్లో దిగాలా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది. -
వీనస్‌కు షాకిచ్చిన 15 ఏళ్ల కోరి గాఫ్
మెల్బోర్న్: ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం చోటుచేసుకుంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, అమెరికా దిగ్గజ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 6–7(5/7), 3–6తో యువ సంచలనం, 15 ఏళ్ల కోరి గాఫ్ చేతిలో పరాజయం పాలైంది. గతేడాది వింబుల్డన్ తొలి రౌండ్లోనే వీనస్‌ను ఇంటిబాట పట్టించిన గాఫ్ మరోసారి అదే ఫలితం పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలుచుకున్న గాఫ్ రెండో సెట్లో తిరుగులేని ఆటతీరు ప్రదర్శించింది. కాగా, సోమవారం బరిలోకి దిగిన మిగిలిన సీడెడ్ క్రీడాకారులకు శుభారంభం లభించింది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.1, స్థానిక క్రీడాకారిణి ఆష్లే బార్టీ 5–7, 6–1, 6–1తో సురెంకో(ఉక్రెయిన్)పై, వరల్డ్ నెం.4 నవోమీ ఒసాకా(జపాన్) 6–2, 6–4తో మారీ బౌజ్కోవా(చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా, మార్గరెట్ కోర్ట్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ, ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా(రష్యా) ను చిత్తు చేసింది. మాజీ నెం.1 కరోలినా వోజ్నియాకీ(డెన్మార్క్) 6–1, 6–3తో క్రిస్టీ ఆన్(అమెరికా)పై గెలుపొందింది. ఏడో సీడ్ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై నెగ్గగా, స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 5–7, 2–6తో జాంగ్(చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. చెమటోడ్చిన జకోవిచ్.. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ 6–3 6–2 6–2తో స్టీవ్ జాన్సన్(అమెరికా)పై గెలుపొందగా, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్లోనే చెమటోడ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో జకోవిచ్ 7–6, 6–2, 2–6, 6–1తో జాన్–లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)పై నెగ్గాడు. అలాగే ఆరో సీడ్, గ్రీస్ స్టార్ సిట్సిపాస్ 6–0, 6–1, 6–3తో కరుసో(ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మారియో బరెత్తిని(ఇటలీ) 6–3, 6–1, 6–3తో హారిస్(ఆస్ట్రేలియా)పై, వరల్డ్ నెం.18 దిమిత్రోవ్(బల్గేరియా) 4–6, 6–2, 6–0, 6–4తో లోండెరో(అర్జెంటీనా)పై, గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. -
సంచలనం అంటే ఇదే కదా!
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో తొలి రోజే సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), పదో సీడ్ సబలెంకా (బెలారస్), 16వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఐదుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వింబుల్డన్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన పిన్న వయస్కు రాలిగా చరిత్ర సృష్టించిన అమెరికా టీనేజర్, 15 ఏళ్ల కోరి గాఫ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ కెరీర్‌ను చిరస్మరణీయ విజయంతో మొదలుపెట్టింది. 39 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన తొలి రౌండ్లో కోరి గాఫ్ 6–4, 6–4తో గెలుపొంది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో 1991 తర్వాత వింబుల్డన్‌లో తొలి రౌండ్ మ్యాచ్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కోరి గాఫ్ గుర్తింపు పొందింది. 2004 మార్చి 13న కోరి గాఫ్ జన్మించే సమయానికి వీనస్ అప్పటికే రెండుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్‌ను, రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) 7–6 (7/4), 6–2తో ఒసాకాపై, రిబరికోవా (స్లొవేకియా) 6–2, 6–4తో సబలెంకాపై, బ్రింగిల్ (అమెరికా) 6–4, 6–4తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ వొండ్రుసోవాపై సంచలన విజయాలు సాధించారు. #NoTeLoPierdas ¡Cori Gauff, de 15 años, eliminó a Venus Williams de Wimbledon! 😮🎾 Es la tenista más joven en llegar a un cuadro final tras pasar la previa, y desde este lunes la verdugo de la pentacampeona de Grand Slam. 👉https://t.co/kPgdLN537gpic.twitter.com/a2I8QgJNVj — ADN Informativo Qro (@ADNQro) July 1, 2019 జొకోవిచ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. జ్వెరెవ్ 6–4, 3–6, 2–6, 5–7తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో... సిట్సిపాస్ 4–6, 6–3, 4–6, 7–6 (10/8), 3–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 7–5, 6–3తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై నెగ్గాడు. భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–7 (1/7), 4–6, 2–6తో 15వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. -
కెర్బర్, వీనస్ ఇంటిముఖం
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 2002 రన్నరప్ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ కచ్చితమైన సర్వీస్ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–3తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 5–7, 6–2, 6–2తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఫెడరర్... వరుసగా 60వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్ ఫెడరర్ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), 11వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు. ప్రజ్నేశ్‌కు నిరాశ... భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
హలెప్ అలవోకగా..
గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్‌తో తిరిగి వెళ్లాలనే లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ రొమేనియా అమ్మాయి అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్‌పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం వీనస్ సోదరి సెరెనాతో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. హలెప్తోపాటు సెరెనా, ముగురుజా సునాయాసంగా ముందంజ వేయగా... ఇతర సీడెడ్ క్రీడాకారిణులు నయోమి ఒసాకా, కరోలినా ప్లిస్కోవా, ఎలీనా స్వితోలినా మాత్రం మూడో రౌండ్ దాటేందుకు కష్ట పడ్డారు. మెల్బోర్న్: టాప్ సీడ్ హోదాకు తగ్గ ప్రదర్శన చేస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో హలెప్ 6–2, 6–3తో విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హలెప్‌నకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 19వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న వీనస్ మ్యాచ్ మొత్తంలో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. హలెప్ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లు సాధించే అవకాశం వచ్చినా 38 ఏళ్ల వీనస్ ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు 27 ఏళ్ల హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సోమవారం సెరెనాతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హలెప్ వ్యాఖ్యానించింది. ‘నేను ఓ గొప్ప చాంపియన్‌తో తలపడబోతున్నా. ఈ సవాల్‌కు నేను సిద్ధంగా ఉన్నా. ఫలితం ఎలా వచ్చినా కోల్పోయేదేమీ లేదు’ అని తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు సెట్లలో విజయాలను అందుకున్న హలెప్ తెలిపింది. మరోవైపు సెరెనా సునాయాస విజయం సాధించింది. 16వ సీడ్‌గా బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా 6–2, 6–1తో డయానా యెస్ట్రెంస్కా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న డయానాను నెట్ వద్దకు వచ్చి సెరెనా ఓదార్చింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–2తో 12వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, 18వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7–6 (7/5), 6–2తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో 21వ సీడ్ కియాంగ్ వాంగ్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఓటమి దిశ నుంచి... మరోవైపు నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడు సెట్లపాటు పోరాడి మూడో రౌండ్‌ను దాటారు. 28వ సీడ్ సు వె సెయి (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 5–7, 6–4, 6–1తో గెలిచింది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 1–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే గత సంవత్సరం యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాపై గెలిచి పెను సంచలనం సృష్టించిన ఒసాకా పట్టుదలతో పోరాడింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో మాత్రం ఒసాకా ధాటికి సు వె సెయి ఎదురునిలువలేకపోయింది. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో స్వితోలినా 4–6, 6–4, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై, 2 గంటల 11 నిమిషాల పోరులో ప్లిస్కోవా 6–4, 3–6, 6–2తో 27వ సీడ్ కామిల్లా జార్జి (ఇటలీ)పై గెలుపొందారు. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ నిషికోరి (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. జొకోవిచ్ 6–3, 6–4, 4–6, 6–0తో 25వ సీడ్ షపవలోవ్ (కెనడా)పై, జ్వెరెవ్ 6–3, 6–3, 6–2తో అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై, నిషికోరి 7–6 (8/6), 6–1, 6–2తో జోవో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కొరిచ్ (క్రొయేషియా) 2–6, 6–3, 6–4, 6–3 తో క్రాజ్నోవిచ్ (సెర్బియా)పై, 23వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 6–2, 6–4, 2–6, 6–4తో 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై, 15వ సీడ్ మెద్వె దెవ్ (రష్యా) 6–2, 7–6 (7/3), 6–3తో 21వ సీడ్ గాఫిన్ (బెల్జియం)పై, 16వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–4, 6–4, 7–6 (8/6)తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/3), 6–3, 6–7 (10/12), 4–6, 6–3తో పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. పేస్ జంట శుభారంభం మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–4, 7–5తో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే రోహన్ బోపన్న (భారత్)–జావోజువాన్ యాంగ్ (చైనా) జోడీ 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. -
సెరెనా వర్సెస్ వీనస్
న్యూయార్క్: యూఎస్ గ్రాండ్ స్లామ్ ఓపెన్‌లో అక్కా చెల్లెళ్లు సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్‌ల పోరుకు రంగ సిద్దమైంది. ఈ టోర్నీలో మూడో రౌండ్లో వీరిద్దరూ తలపడబోతున్నారు. రికార్డు స్థాయిలో 24వ సింగిల్స్ గ్రాండ్ స్లామ్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్.. రెండో రౌండ్లో 6-2, 6-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి కరినా వితాఫ్ట్‌పై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. మరోపక్క ఇటలీ క్రీడాకారిణి కమిలా జియార్జిపై 6-4, 7-5తో విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది వీనస్. దాంతో వీరిద్దరూ ప్రత్యర్థులుగా మూడో రౌండ్లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు. ఓవరాల్‌గా ప్రత్యర్థులుగా సెరెనా-వీనస్‌లు తలపడటం ఇది 30వ సారి. ఇప్పటి వరకు వీరిద్దరూ 29 సార్లు ప్రత్యర్థులుగా తలపడగా సెరెనా 17 సార్లు... వీనస్ 12 సార్లు విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వీరిద్దరి మధ్య మ్యాచ్ జరగనుంది. వీరిద్దరూ కలిసి 30 గ్రాండ్ స్లామ్ టైటల్స్‌ను సాధించారు. అందులో సెరెనా 23 గ్రాండ్ స్లామ్ టైటల్స్ సాధించగా, వీనస్ ఏడు గ్రాండ్ స్లామ్ టైటల్స్‌ను దక్కించుకుంది. మరొకవైపు పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-3, 6-4, 6-2 తేడాతో కెనాడా ప్లేయర్ వాసెక్ పాస్పిసిల్పై వరుస సెట్లలో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం
పారిస్/రొనాల్డ్ గారోస్: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్ డబుల్స్ విభాగం నుంచి విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం. మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా సెరెనా, రష్యన్ టెన్నిస్ క్వీన్ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు. జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్ జకోవిచ్(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు. -
సెరెనాపై వీనస్ పైచేయి
ఇండియన్ వెల్స్: పునరాగమనంలో అమెరికా టెన్నిస్ తార సెరెనాకు మరో ఓటమి. ఈసారి ఆమెపై అక్క వీనస్ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో వీనస్ 6–3, 6–4తో సెరెనాను వరుస సెట్లలో ఓడించింది. గంటా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పదో సీడ్ వీనస్ ఆరు ఏస్‌లు సంధించింది. సెరెనా నాలుగే ఏస్‌లు కొట్టగా, నాలుగుసార్లు సర్వీస్ కోల్పోయింది. మరో మ్యాచ్‌లో యూఎస్ ఓపెన్ విజేత స్లోన్ స్టీఫెన్స్... 19వ సీడ్ డరియా కసట్కినా (రష్యా) చేతిలో ఓడగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్ వోజ్నియాకి 6–4, 2–6, 6–3తో అలెక్సాండ్రా సస్నోవిచ్పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ 6–2, 6–1తో ఫిలిప్ క్రజినోవిక్ (సెర్బియా)పై విజయం సాధించాడు. డ్రాప్ షాట్లు మేళవిస్తూ ఆరు ఏస్‌లు కొట్టిన రోజర్ ఒక దశలో వరుసగా 17 పాయింట్లు సాధించాడు. 58 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఫెడరర్ ఈసారీ టైటిల్ సాధిస్తే రికార్డు స్థాయిలో ఆరోసారి గెల్చుకున్న ఆటగాడిగా నిలుస్తాడు. -
2014 తర్వాత సెరెనాపై అక్క విజయం
-
సెరెనా ఆడింది... సోదరి జతగా
అషేవిల్లే (అమెరికా): అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆట మొదలైంది. అమ్మ హోదా వచ్చాక అధికారిక టోర్నమెంట్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమెకు పరాజయమే ఎదురైంది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్లో సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన సెరెనా 2–6, 3–6తో లెస్లే కెర్కోవ్–డెమి షర్స్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. 36 ఏళ్ల సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ తర్వాత మళ్లీ రాకెట్ పట్టడం ఇదే మొదటిసారి. వారాల గర్భంతోనే టైటిల్ సాధించిన ఆమె ఇప్పుడు తన గారాలపట్టి ఒలింపియా (ఐదు నెలల కుమార్తె)ను ప్రేక్షకుల గ్యాలరీలో ఉంచి కోర్టులో ఆడింది. ఈ టీమ్ చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ జోడీ కట్టడం మరో విశేషం. 2003 తర్వాత జతగా ఈ ఇద్దరు ఫెడ్‌కప్ ఆడలేకపోయారు. అయితే చివరి సారిగా ఇద్దరు కలిసి ఆడిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (2016)లో మాత్రం డబుల్స్ టైటిల్ నెగ్గారు. మ్యాచ్ ముగిశాక సెరెనా మాట్లాడుతూ ‘కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. తిరిగి నా ఆట నేను తేలిగ్గా ఆడేందుకు సోదరి వీనస్ జత కావడమే కారణం’ అని చెప్పింది. డబుల్స్‌లో అమెరికన్ జోడీ ఓడినప్పటికీ సింగిల్స్‌లో వీనస్... రిచెల్ హొగెన్కెంప్పై విజయం సాధించడంతో అమెరికా జట్టు 3–1తో నెదర్లాండ్స్‌పై గెలిచి సెమీఫైనల్స్ చేరింది. మ్యాచ్ వీక్షిస్తున్న సెరెనా భర్త అలెక్సిస్, కుమార్తె ఒలింపియా -
అమెరికా స్టార్స్‌కు షాక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సంచలన ఫలితాలతో హోరెత్తింది. మహిళల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, ఐదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), పదో సీడ్ కోకో వాండెవె (అమెరికా), 13వ సీడ్, గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), 11వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లో వీనస్ 3–6, 5–7తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో... కోకో 6–7 (4/7), 2–6తో బాబోస్ (హంగేరి) చేతిలో... స్లోన్ స్టీఫెన్స్ 6–2, 6–7 (2/7), 2–6తో షుయె జాంగ్ (చైనా) చేతిలో... మ్లాడెనోవిచ్ 3–6, 2–6తో బొగ్డాన్ (రొమేనియా) చేతిలో ఓడిపోయారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 7–6 (7/5), 6–1తో ఐఅవా (ఆస్ట్రేలియా)పై, మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–4, 6–3తో పొంచెట్ (ఫ్రాన్స్)పై, షరపోవా (రష్యా) 6–1, 6–4తో మరియా (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్లోకి చేరారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ చాంపియన్స్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో టాప్ సీడ్ నాదల్ 6–1, 6–1, 6–1తో బర్గోస్ (డొమినికన్ రిపబ్లిక్)పై, రెండో సీడ్ ఫెడరర్ 6–3, 6–4, 6–3తో బెడెన్ (స్లొవేనియా)పై, 14వ సీడ్ జొకోవిచ్ 6–1, 6–2, 6–4తో యంగ్ (అమె రికా)పై గెలిచారు. అయితే ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా), 11వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), 16వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సుగిటా (జపాన్) 6–1, 7–6 (7/4), 5–7, 6–3తో జాక్ సాక్‌పై... ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 6–4, 3–6, 6–3, 6–3తో ఇస్నెర్‌పై, ఎడ్మండ్ (బ్రిటన్) 6–7 (4/7), 6–3, 3–6, 6–3, 6–4తో అండర్సన్‌పై నెగ్గారు. భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ 6–7 (4/7), 4–6, 3–6తో బగ్ధాటిస్ (సైప్రస్) చేతిలో ఓడిపోయాడు. -
యూఎస్ ఓపెన్: సెమీస్‌కు సానియా.. వీనస్ ఓటమి
సాక్షి, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో సంచలనం నెలకొల్పింది. మహిళల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి, చైనాకు చెందిన షుయె పెంగ్‌తో కలిసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరగిన క్వార్టర్ ఫైనల్లో 7-6(5), 6-4 తేడాతో ఆండ్రియా హ్లావ్కోవా, టిమియా బాబోస్ జోడీపై విజయం సాధించింది. వరుసగా ఐదు యూస్ ఓపెన్లలో సానియా సెమీస్‌కు ప్రవేశించటం ఇది నాలుగోసారి. సెమీస్‌లో వీనస్ అవుట్... ఇక మహిళల సింగిల్స్‌లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రపంచ టెన్నిస్ మాజీ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ టోర్నీ సెమీస్ లో ఓటమి పాలైంది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన స్లోనే స్టీఫెన్స్ చేతిలో 6-1, 0-6, 7-5 తేడాతో ఓడింది. 2002 నుంచి ఒక్క గ్రాండ స్లామ్ కూడా గెలుచుకోలేకపోయిన వీనస్ ను స్లోనే కోర్టులో ముప్పుతిప్పలు పెట్టింది. గత 11 నెలలుగా కాలి గాయంతో కోర్టుకు దూరమైన స్లోనే అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక శనివారం ఫైనల్ లో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్ తో స్లోనే స్టీఫెన్స్ తలపడనుంది. -
వీనస్ వెలుగులు
∙ ఆరేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌కు అర్హత ∙ క్వార్టర్స్‌లో క్విటోవాపై విజయం ∙ యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: తొమ్మిదేళ్లుగా ఊరిస్తోన్న మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకునేందుకు అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ రెండు విజయాల దూరంలో నిలిచింది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తొమ్మిదో సీడ్ వీనస్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరింది. ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల వీనస్ క్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 7–6 (7/2)తో 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 2 గంటల 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడుసార్లు కోల్పోయినా... కీలకమైన టైబ్రేక్‌లో వీనస్ పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో వీనస్ 2011 తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–5లో చోటు సంపాదించనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచిన వీనస్ తాజా ప్రదర్శనతో యూఎస్ ఓపెన్ చరిత్రలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 2001, 2002లలో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వీనస్ సెమీఫైనల్లో అమెరికాకే చెందిన అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్‌తో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ 6–3, 3–6, 7–6 (7/4)తో 16వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. పాబ్లో, అండర్సన్ జోరు...: పురుషుల సింగిల్స్ విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 12వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 28వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో పాబ్లో బుస్టా 6–4, 6–4, 6–2తో 29వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై, అండర్సన్ 7–6 (7/5), 6–7 (9/11), 6–3, 7–6 (9/7)తో 17వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచారు. ఈ విజయాలతో పాబ్లో, అండర్సన్‌లు తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్ చేరే క్రమంలో పాబ్లో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ప్లిస్కోవాకు షాక్... కొత్త నం.1 ముగురుజా మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కరోలినా ప్లిస్కోవా పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ కోకో వాండెవాగె (అమెరికా) 7–6 (7/4), 6–3తో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించి తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గత ఏడాది రన్నరప్ ప్లిస్కోవా క్వార్టర్ ఫైనల్లో ఓటమి కారణంగా... వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కొత్త నంబర్‌వన్‌గా అవతరించనుంది. -
వీనస్ (Vs) ముగురుజా
-
వీనస్ (Vs) ముగురుజా
వింబుల్డన్‌లో మహిళల పోరు చివరి అంకానికి చేరింది. అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజా టైటిల్ పోరుకు అర్హత పొందారు. ఇప్పటికే ఐదు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ తన ఆరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, జోరుమీదున్న స్పెయిన్ స్టార్ ముగురుజా వింబుల్డన్ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది. లండన్: మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్, స్పానిష్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా అమీతుమీకి సిద్ధమయ్యారు. వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో వీరిద్దరు మహిళల టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 14వ సీడ్ ముగురుజా వరుస సెట్లలో 6–1, 6–1తో మగ్దలినా రిబరికోవా (స్లోవేకియా)పై అలవోక విజయం సాధించగా, పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–4, 6–2తో ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)ను కంగుతినిపించింది. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. రెండోసారి ఫైనల్‌కు... ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్, ప్రపంచ 15వ ర్యాంకర్ ముగురుజా రెండోసారి వింబుల్డన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2015లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఇప్పుడు మాత్రం టైటిల్ సాధించాలన్న పట్టుదలను తన మ్యాచ్‌ల్లో చూపింది. సెమీస్‌లో అన్‌సీడెడ్ ప్రత్యర్థిని కేవలం గంట 5 నిమిషాల్లోనే మట్టికరిపించింది. ఆమె ధాటికి రిబరికోవా నిలువలేకపోయింది. రెండు సెట్లలోనూ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి సెట్లో 8 విన్నర్స్‌ను కొట్టిన ముగురుజా రెండో సెట్లో తన జోరు పెంచింది. దీంతో ఏకంగా 14 విన్నర్స్‌ను సాధించింది. ఇద్దరు చెరో 3 ఏస్‌లు సంధించారు. ముగురుజా 11 అనవసర తప్పిదాలు చేసింది. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. రిబరికోవా కూడా 11 అనవసర తప్పిదాలు చేసింది. కానీ కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. ముగురుజా ఫోర్‌హ్యాండ్ షాట్లకు బదులివ్వలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 87వ ర్యాంకులో ఉన్న రిబరికోవా ఒక్క వింబుల్డన్ ఓపెన్ మినహా మరే గ్రాండ్‌స్లామ్‌లోనూ మూడో రౌండ్ దాటలేదు. కానీ ఈ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఆమె 2014లో సెమీఫైనల్స్ చేరింది. ఈసారీ ఆమె పోరాటం సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. వీనస్ జోరు తన సుదీర్ఘ కెరీర్లో 7 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన వీనస్‌కు గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బ్రిటన్ క్రీడాకారిణి జొహానా కొంటా తొలి సెట్లో గట్టిపోటీనిచ్చింది. అనుభవజ్ఞురాలైన వీనస్‌కు ఏస్‌లతో బదులిచ్చింది. ఏస్‌ల్లో వీనస్ పూర్తిగా వెనుకబడగా... జొహానా మాత్రం 7 ఏస్‌లను సంధించింది. విన్నర్స్లోనూ బ్రిటన్ ప్లేయర్‌దే పైచేయి అయింది. జొహానా కొంటా 14 విన్నర్స్ కొడితే వీనస్ ఐదే కొట్టగలిగింది. అయితే పదే పదే అనవసర తప్పిదాలతో పాటు డబుల్ ఫాల్ట్‌లతో జొహానా మూల్యం చెల్లించుకుంది. 13 అనవసర తప్పిదాలు, 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్ మొత్తం మీద ఒకే ఒక్క ఏస్ సంధించిన వీనస్ 4 బ్రేక్ పాయింట్లతో పోరులో నిలిచింది. రెండో సెట్లో జోరు పెంచిన వీనస్ 11 విన్నర్స్ సాధించగా... ప్రత్యర్థి జొహానా 6 విన్నర్స్ కొట్టింది. దీంతో తొలిసెట్లో చెమటోడ్చినప్పటికీ రెండో సెట్‌ను త్వరగానే ముగించింది. గంటా 13 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించి ఫైనల్లోకి ప్రవేశించింది. ►మార్టినా నవ్రతిలోవా (1994) తర్వాత ఏ గ్రాండ్స్లామ్లోనైనా ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కురాలు (37 ఏళ్లు) వీనస్. ► వింబుల్డన్‌లో అత్యధిక విజయాలు సాధించిన మహిళల జాబితాలో మూడో స్థానానికి చేరిన వీనస్ (87)... ఈ క్రమంలో సోదరి సెరెనా (86)నుఅధిగమించింది. నవ్రతిలోవా (120), క్రిస్ ఎవర్ట్ (96) ఈ జాబితాలో ముందున్నారు. ►వింబుల్డన్‌లో వీనస్ ఫైనల్ చేరడం ఇది 9వ సారి. 2009లో ఆఖరిసారిగా ఫైనల్ చేరి సెరెనా చేతిలో ఓడింది. -
‘బ్రా’ను కూడా వదల్లేదు!
లండన్: సంప్రదాయం పేరుతో వింబుల్డన్ నిర్వాహకులు విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా మాజీ వరల్డ్ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్ మెర్టెన్స్తో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్ బయటకు కనిపించింది. ఈ విషయాన్ని టోర్నీ అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్లో విరామం సమయంలో వీనస్ లాకర్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు ‘బ్రా’తో బరిలోకి దిగింది. ‘ఆట సమయంలో బయటకు కనిపించే లోదుస్తులు కూడా పూర్తిగా తెలుపు రంగుల్లోనే ఉండాలి. ఒకవేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా కనిపిస్తుంటే అది ఒక సెంటీమీటర్‌కు మించి ఉండరాదు’ అని వింబుల్డన్ నిబంధనలు చెబుతున్నాయి. లోదుస్తుల అంశంపై మీడియా సమావేశంలో చర్చించడం సభ్యత కాదని మ్యాచ్ అనంతరం వీనస్ దీనిపై వ్యాఖ్యానించింది. గర్భవతిగా కోర్టులో... లక్సెంబర్గ్ క్రీడాకారిణి, ప్రపంచ 82వ ర్యాంకర్ మ్యాండీ మినెలా ప్రస్తుతం నాలుగున్నర నెలల గర్భవతి. అయినా సరే ఆమె వింబుల్డన్‌లో పోటీకి వెనుకాడలేదు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రత్యేకంగా చేయించిన వదులు దుస్తులతో మినెలా బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆమె షివవోని (ఇటలీ) చేతిలో 1–6, 1–6 తేడాతో పరాజయం పాలైంది. -
వీనస్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం
ఫ్లోరిడా : టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నెల 9న జరిగిన ఘోర కారు ప్రమాదంలో వీనస్దే తప్పు ఉన్నట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వీనస్ రెడ్ సిగ్నల్ పడినా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో అవతలి వైపు వస్తున్న మరో కారును ఢీ కొట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో వీనస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మరో కారులో ఉన్న జెరోమ్ బార్సన్(78) తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వారాల తరువాత మరణించారు. వీనస్ ఇంటి సమీపంలోని పామ్ బీచ్ గార్డెన్‌లోని కూడాలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన మరో కారును లిండా బార్సన్ అనే మహిళ డ్రైవ్ చేశారు. తాను సిగ్నల్‌ను అనుసరించి ప్రయాణిస్తుండగా వీనస్ కారు హఠాత్తుగా రావడంతో కారు వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయానని, అందుకే ప్రమాదం జరిగిందని లిండా తెలిపారు. ఈ ప్రమాదంలో లిండా భర్త జెరోమ్ బార్సన్ తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, లిండాకు స్పల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వీనస్ విలియమ్స్ తప్పిదం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వీనస్ డ్రగ్స్, మద్యం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని పామ్ బీచ్ గార్డెన్ పోలీసులు తెలిపారు. 'ఈ ప్రమాదం దురదృష్టకరం. ఈ ఘటనలో లిండా తన భర్తను కోల్పోవడంపై వీనస్ తీవ్ర సంతాపం తెలిపారు' అని విలియమ్స్ అటార్నీ మాల్కామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సెరెనాదే టైటిల్
-
సెరెనాదే టైటిల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా మొత్తం 69 పాయింట్లు సాధించగా, వీనస్ 59 పాయింట్లను మాత్రమే సాధించింది. సుమారు గంటా ముఫ్పై నిమిషాలు పాటు జరిగిన ఫైనల్లో సెరెనా 10 ఏస్‌లను సంధించగా, వీనస్ 7 ఏస్‌లకు మాత్రమే పరిమితమైంది. ఆది నుంచి తన జోరును కొనసాగించిన సెరెనా ఏ దశలోనూ వీనస్ ను తేరుకునే అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను కైవసం చేసుకుంది. తద్వారా ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే జర్మనీ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్(22 గ్రాండ్ స్లామ్) పేరిట ఉన్న రికార్డును సెరెనా సవరించింది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా ఆద్యంతం తన జోరును కొనసాగించి టైటిల్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. ఇది సెరెనాకు ఏడో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్. -
విలియమ్స్ సిస్టర్స్‌కు షాక్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ జోడీ సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్‌లకు ఆదిలోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో లియమ్స్ జోడి 3-6, 4-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జంట లూసీ సఫరోవా-బార్బోరా స్ట్రైకోవా చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఓటమి ఎరుగని విలియమ్స్ జోడికి తొలిసారి చేదు అనుభవం ఎదురైంది. అంతకుముందు ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు సార్లు(2000,08, 12) స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమెరికా జోడీ .. రియోలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. దీంతో రియోకు ముందు వరకూ 15-0 తో ఉన్న సెరెనా జోడి ఒలింపిక్ కెరీర్ రికార్డుకు బ్రేక్ పడింది. గత నెల్లో జరిగిన వింబుల్డన్ టైటిల్ ను గెలవడం ద్వారా 14 వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌ను సెరెనా ద్వయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ లో సెరెనా తొలి రౌండ్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు చేరింది. -
సెరెనా ‘డబుల్’
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన కొన్ని గంటలకే అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. తన అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి సెరెనా మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సెరెనావీనస్ ద్వయం 6-3, 6-4తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై గెలిచింది. సెరెనా-వీనస్ జంటకిది 14వ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. సెరెనా ఒకే ఏడాది వింబుల్డన్‌లో సింగిల్స్‌తోపాటు డబుల్స్ టైటిల్‌ను నెగ్గడం ఇది నాలుగోసారి (2002, 2009, 2012, 2016). * మార్టినా నవ్రతిలోవా-పామ్ ష్రైవర్ జంట (20 టైటిల్స్) తర్వాత ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జోడీగా సెరెనా-వీనస్ గుర్తింపు పొందింది. * తమ కెరీర్లో డబుల్స్ విభాగంలో 23 సార్లు ఫైనల్‌కు చేరుకున్న సెరెనా-వీనస్ జంట 22 సార్లు టైటిల్‌ను సాధించింది. ఈ జంటకు 1999 శాన్‌డియాగో ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఏకైకసారి పరాజయం ఎదురైంది. -
విలియమ్స్ సిస్టర్స్‌దే డబుల్స్ టైటిల్
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ జోడి కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో శనివారం రాత్రి జరిగిన తుది పోరులో సెరెనా సిస్టర్స్ 6-3, 6-4 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)- యారోస్లావా ష్వెదోవా(కజికిస్తాన్)పై గెలిచి టైటిల్‌ను సాధించింది. అంతకుముందు సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం సెంటర్ కోర్టులో జరిగిన మహిళల డబుల్స్‌లో సెరెనా-వీనస్ జోడి ఆద్యంతం ఆకట్టుకుని ఆరోసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది.దాంతో పాటు ఓవరాల్ గా 14వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ ను ఈ జోడి చేజిక్కించుకుంది. దీంతో సెరెనా-వీనస్ ద్వయం తమ గ్రాండ్ స్లామ్ ఫైనల్ రికార్డును 14-0తో మరింత మెరుగుపరుచుకున్నారు. -
అక్కా చెల్లెళ్ల పోరు లేనట్లే..
లండన్:చాలాకాలం తర్వాత వింబుల్డన్ ఫైనల్ కు చేరాలని భావించిన వీనస్ విలియమ్స్ పోరు సెమీ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్లో వీనస్ విలియమ్స్ 4-6, 4-6 తేడాతో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్రమించింది. దీంతో చెల్లెళు సెరెనా విలియమ్స్‌తో అక్క వీనస్ విలియమ్స్ పోరును వీక్షించే అవకాశ దక్కలేదు. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో సెరెనా విలియమ్స్ విజయం సాధించి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. సెరెనా 6-2, 6-0 తేడాతో ఎలెనా ఎస్నినాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. దీంతో సెరెనా మరోసారి కెర్బర్తో పోరుకు సన్నద్ధమైంది. ఈ ఏడాది ఆదిలో జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో సెరెనాపై కెర్బర్ విజయం సాధించి ట్రోఫీని సాధించిన కైవసం చేసుకుంది. దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. వింబుల్డన్ లో చివరి అడ్డంకిని సెరెనా అధిగమిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకూ సెరెనా 303 గ్రాండ్ స్లామ్ విజయాలను సాధించగా, వింబుల్డన్ లో 9వ సారి ఫైనల్ కు చేరింది. ఇందులో ఆరు సార్లు టైటిల్ ను సాధించడంలో సెరెనా సఫలమైంది. -
తైవాన్ ఓపెన్ సెమీస్‌లో వీనస్
కావ్సియాంగ్:టాప్ సీడ్ వీనస్ విలియమ్స్ తైవాన్ ఓపెన్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో వీనస్ 7-5, 6-2 తేడాతో అనాస్తాసిజా సెవాస్తోవాను ఓడించి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో 10 బ్రేక్ పాయింట్లకు గాను ఏడు పాయింట్లను వీనస్ గెలిచి సెవాస్తోవాపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇదిలా ఉండగా మరో మ్యాచ్ లో మూడో సీడ్ పుతిన్త్ సేవా సెమీస్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో పుతిన్త్ సేవా తొలి సెట్ ను 6-3 తేడాతో చేజిక్కించుకున్న అనంతరం స్టెఫనీ వోయిజిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పుతిన్త్ సేవా సెమీస్ కు చేరి వీనస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. -
తొలిరౌండ్లోనే వీనస్‌కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పదో ర్యాంకర్ వీనస్‌కు 47 వ ర్యాంకర్ జొహన్నా కంటె (బ్రిటన్) షాకిచ్చింది. జొహన్నా 6-4, 6-2 స్కోరుతో వీనస్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ముర్రే 6-1, 6-2, 6-3 స్కోరుతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించాడు. -
చెల్లి... మళ్లీ...
♦ అక్క వీనస్‌పై చెల్లెలు సెరెనా గెలుపు ♦ యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశం ప్రత్యర్థి ఎవరైనా తన ప్రతాపం చూపిస్తూ... ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత దారిలో ఉన్న ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ లక్ష్యం వైపు ముందంజ వేస్తోంది. తాజాగా సెరెనా ‘షో’ ధాటికి ఆమె అక్క వీనస్ విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టక తప్పలేదు. జులైలో వింబుల్డన్ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ అక్కా చెల్లెళ్ల పోరాటంలో చెల్లి సెరెనాయే పైచేయి సాధించగా... యూఎస్ ఓపెన్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. న్యూయార్క్ : ‘ఎన్నో ఘనతలు’ తన పేరిట లిఖించుకునేందుకు సెరెనా విలియమ్స్ సిద్ధమవుతోంది. 27 ఏళ్ల తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందేందుకు మరో రెండు విజయాల దూరంలో నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచిన సెరెనా... సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సెరెనా అద్భుత విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-2, 1-6, 6-3తో వీనస్‌ను ఓడించింది. ►ఆర్థర్ యాష్ ప్రధాన స్టేడియంలో ఇద్దరు దిగ్గజాలు సెరెనా, వీనస్ నడుమ జరిగిన పోరును దాదాపు 24 వేల మంది ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు తిలకించారు. సెరెనా ఫైనల్‌కు చేరుతుందనే నమ్మకమో ఏమోగానీ టోర్నీ ప్రారంభానికి ముందే మహిళల సింగిల్స్ ఫైనల్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ►ఇప్పటికే యూఎస్ ఓపెన్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన సెరెనా ఏడోసారి విజయంతో ఓపెన్ శకంలో రికార్డు సృష్టించాలనే పట్టుదలతో ఉంది. సెరెనాను నిలువరించే సత్తాగల క్రీడాకారిణుల్లో ఒకరైనా సోదరి వీనస్ నుంచి ఆమెకు గట్టిపోటీనే లభించింది. రెండుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 33 నిమిషాల్లో దక్కించుకుంది. ►రెండో సెట్లో పరిస్థితి తారుమారైంది. తన చెల్లి ఆటతీరులోని బలహీనతలపై అవగాహన ఉన్న వీనస్ వెంటనే తేరుకుంది. నిలకడగా ఆడుతూ రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వీనస్ రెండో సెట్‌ను 30 నిమిషాల్లో సొంతం చేసుకోవడంతో నిర్ణాయక మూడో సెట్ అనివార్యమైంది. ►1997లో అరంగేట్రంలోనే యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన వీనస్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడినా మూడో సెట్లో సెరెనా జోరును అడ్డుకోలేకపోయింది. కీలకదశలో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 35 నిమిషాల్లో మూడో సెట్‌ను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ►మ్యాచ్ మొత్తంలో సెరెనా 12 ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 35 విన్నర్స్ కొట్టి, 22 అనవసర తప్పిదాలు చేసింది. ►ఈ గెలుపుతో వీనస్‌తో ముఖాముఖి రికార్డులో సెరెనా 16-11తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీనస్‌పై తొమ్మిదిసార్లు నెగ్గిన సెరెనా ఐదుసార్లు ఓడిపోయింది. చివరిసారి 2008 వింబుల్డన్ ఫైనల్లో వీనస్ చేతిలో సెరెనా ఓటమి పాలైంది. ►సెమీస్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి రొబెర్టా విన్సీ (ఇటలీ)తో సెరెనా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో విన్సీ 6-3, 5-7, 6-4తో క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది. తన కెరీర్లో 44వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న విన్సీ తొలిసారి సెమీస్‌కు చేరడం విశేషం. విన్సీతో ముఖాముఖి రికార్డులో సెరెనా 4-0తో ఆధిక్యంలో ఉంది. మరో క్వార్టర్ ఫైనల్లో 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 4-6, 6-4, 6-2తో ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. -
అక్కపై సెరీనా గెలుపు
-
అక్కపై చెల్లెలి ఆధిపత్యం..
గత కొద్ది కాలంగా శారీరక ఆకారంతోపాటు ఆటలోనూ బక్కచిక్కిన అక్క వీనర్ విలియమ్స్‌పై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది చెల్లెలు సెరీనా విలియమ్స్. న్యూయార్క్ వేదికగా జరుగుతోన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2015లో వీనస్ పై మ్యాచ్ గెలిచిన సెరీనా సెమీస్ లోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్ లో సెరీనా.. 6-2, 1-6, 6-3 తేడాతో నెగ్గింది. తొలిసెట్ లో వెనుకబడ్డ వీనస్ మలి సెట్ లో విజృంభించినప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్ లో చతికిలపడింది. దీంతో అక్కపై తన విజయాల రికార్డును (16-11) మరింత పదిలపర్చుకుంది సెరీనా.. గురువారం జరగనున్న సెమీఫైనల్స్‌లో ఇటాలియన్ దిగ్గజం రొబెర్టా విన్సీతో తలపడనుంది. -
అక్కా చెల్లెళ్ల హవా
యువ తారల దూకుడుకు దీటైన సమాధానమిస్తూ మూడు పదుల వయసు దాటినా తమలో వన్నె తగ్గలేదని ‘అమెరికా నల్లకలువలు’ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తమ జోరును ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్లుగా చెల్లెలు సెరెనా నిలకడగా ఆడుతోన్నా... గాయాల కారణంగా కొంతకాలంగా వెనుకబడి పోయిన అక్క వీనస్ తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దాంతో నాలుగేళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరూ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నారు. మెల్బోర్న్: క్లిష్ట సమయంలో అనుభవం అక్కరకు వస్తుందని అమెరికా టెన్నిస్ స్టార్ సిస్టర్స్ వీనస్, సెరెనా విలియమ్స్ నిరూపించారు. యువ క్రీడాకారిణుల నుంచి గట్టిపోటీ లభిస్తున్నా... తమ అనుభవాన్నంతా రంగరించి ఈ ఇద్దరూ స్ఫూర్తిదాయక విజయాలు సాధిస్తున్నారు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా, వీనస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, 33 ఏళ్ల సెరెనా 2-6, 6-3, 6-2తో 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలుపొందగా... 34 ఏళ్ల వీనస్ 6-2, 2-6, 6-1తో ఆరో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)ను బోల్తా కొట్టించింది. ఫలితంగా 2010 తర్వాత వీనస్, సెరెనాలిద్దరూ కలిసి మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. చివరిసారి 2010లో సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గగా... అదే టోర్నీలో వీనస్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. అదే ఏడాదిలో సెరెనా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించి, వింబుల్డన్ టోర్నీ టైటిల్ సాధించింది. వీనస్ మాత్రం ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్, వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో, యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2010 తర్వాత వీనస్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. మరోవైపు సెరెనా మాత్రం గత నాలుగేళ్లలో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)తో సెరెనా; మాడిసన్ కీస్ (అమెరికా)తో వీనస్ తలపడతారు. క్వార్టర్స్‌లో నెగ్గితే ఈ అక్కా చెల్లెళ్లు సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ సిబుల్కోవా 6-2, 3-6, 6-3తో రెండుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై నెగ్గగా... అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ 6-2, 6-4తో మాడిసన్ బ్రెంగెల్ (అమెరికా)ను ఓడించింది. లెక్క సరిచేసింది.... గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే తనను ఇంటిదారి పట్టించిన ముగురుజాపై సెరెనా ప్రతీకారం తీర్చుకుంది. తొలి సెట్‌ను నెగ్గిన 21 ఏళ్ల మురుగుజా మరోసారి సంచలనం సృష్టిస్తుందేమోనని అనుకున్నారు. కానీ సెరెనా అలా జరగనివ్వలేదు. ఏకాగ్రతతో ఆడుతూ మురుగుజా దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ సెట్‌ను 6-3తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. సరిగ్గా 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 17 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మళ్లీ ఫామ్‌లోకి... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వీనస్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఆరో సీడ్ రద్వాన్‌స్కాతో 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆటతీరును చూశాక పాత వీనస్ గుర్తుకొచ్చింది. సుదీర్ఘ ర్యాలీలు, కచ్చితమైన సర్వీస్‌లతో అలరించిన వీనస్ మూడు సెట్లలో ఆత్మ విశ్వాసం పెంచే విజయాన్ని అందుకుంది. తొలి సెట్లో ఏకంగా 15 నిమిషాలపాటు జరిగిన ఏడో గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వీనస్ అదే జోరులో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో తడబడినప్పటికీ... మూడో సెట్లో వీనస్ మళ్లీ విజృంభించి రద్వాన్‌స్కా ఆటను కట్టించింది. కష్టకాలంలోనూ విశ్వాసం కోల్పోకుండా ఉన్నానంటే తన సోదరి సెరెనాయే కారణమని, ఆమెనే ఆదర్శంగా తీసుకుంటున్నానని మ్యాచ్ తర్వాత వీనస్ వ్యాఖ్యానించింది. క్వార్టర్స్‌లో జొకోవిచ్ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)లతోపాటు ఐదో సీడ్ నిషికోరి (జపాన్), ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-4, 7-5, 7-5తో ముల్లర్ (లక్సెంబర్గ్)పై, నిషికోరి 6-3, 6-3, 6-3తో ఫెరర్ (స్పెయిన్)పై గెలి చారు. నాలుగో సీడ్ వావ్రింకా 7-6 (7/2), 6-4, 4-6, 7-6 (10/8) తో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై, రావ్‌నిచ్ 6-4, 4-6, 6-3, 6-7 (7/9), 6-3తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై కష్టపడి నెగ్గారు. క్వార్టర్లో రావ్‌నిచ్‌తో జొకోవిచ్; నిషికోరితో వావ్రింకా ఆడతారు. -
స్ఫూర్తి ప్రదాతలు
సాధారణంగా క్రీడాకారులంటేనే పోరాటయోధులు. ఒక మ్యాచ్‌లో లేదా టోర్నీలో ఓడిపోయినా నీరు గారిపోరు.. కసితో మళ్లీ బరిలోకి దిగుతారు. ఓటమిని జీవన్మరణ సమస్యగా తీసుకుని తాము అనుకున్నది సాధిస్తారు. అయితే ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ స్టార్లు కొందరు నిజ జీవితంలోనూ జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడినా, వాటిని అధిగమించి మళ్లీ మైదానంలో సత్తా చాటారు. మరికొందరు రిటైర్మెంట్ తర్వాత వ్యాధుల బారిన పడి, వాటిని అధిగమించారు. కొందరైతే తాము అనుభవించిన బాధలు ఎదుటివాళ్లు పడొద్దన్న ఉద్దేశంతో చారిటీలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి... - శ్యామ్ తిరుక్కోవళ్లూరు యువరాజ్ క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తూ క్యాన్సర్ బారిన పడిన ఏకైక క్రికెటర్ యువరాజ్.. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ కణితిగా పరీక్షల్లో తేలింది. యువరాజ్ ఎడమ ఊపిరితిత్తిలో కణితి ఉందని గుర్తించడంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లి కీమో థెరపీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇండియానాలోనూ చికిత్స పొందాడు. 2012లో పూర్తిగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఐపీఎల్ ఏడో సీజన్లో రాణించాడు. మొత్తానికి రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న యువరాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక యువరాజ్ ‘యు వియ్ కెన్’ పేరుతో క్యాన్సర్ చారిటీని ఏర్పాటు చేశాడు. ఈ చారిటీ ద్వారా క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నాడు. టిమ్ హోవార్డ్ అమెరికా స్టార్ గోల్ కీపర్. సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియంతో మ్యాచ్‌లో 16 గోల్ ప్రయత్నాలను అడ్డుకుని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ గోల్‌కీపర్‌కు సాధ్యం కాని రీతిలో గోల్‌పోస్ట్ దగ్గర అద్భుతమైన విన్యాసాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా చిత్తయినా... బెల్జియం ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు అతను చేసిన విన్యాసాలు చూసిన వారేవరికైనా సూపర్మ్యాన్లా కనిపించాడు. టిమ్ హోవార్డ్ అద్భుత ప్రదర్శనకు 9 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన టోరెట్టె సిండ్రోమే కారణం. ఈ సిండ్రోమ్ బారిన పడటం వల్ల హోవార్డ్‌కు వెంటనే స్పందించే లక్షణాలు వచ్చాయని న్యూరో స్పెషలిస్టులు చెబుతున్నారు. మెదడులో న్యూరో సెక్రియాట్రిక్ రుగ్మతతో బాధపడిన హోవార్డ్, ఆ తర్వాత దానిని అధిగమించాడు. టోరెట్టె సిండ్రోమ్ నుంచి కోలుకుని గోల్‌కీపర్‌గా రాణించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ వల్లే అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ప్రపంచకప్‌లో హోవార్డ్ అద్భుత ప్రదర్శన అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆకట్టుకోవడమే కాదు.. ఆయన నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌తో అమెరికా ఫుట్‌బాల్‌కు నయా స్టార్ దొరికాడు. మార్టినా నవ్రతిలోవా టెన్నిస్ దిగ్గజాల్లో మార్టినా నవ్రతిలోవా కూడా ఒకరు. ఒకప్పుడు అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన నవ్రతిలోవా.. మార్టినా హింగిస్ లాంటి టెన్నిస్ స్టార్లకు ఆదర్శం. ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న ఈ మాజీ చెక్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి బ్రెస్ట్ కాన్సర్ బారిన పడింది. నాలుగేళ్ల కిందట (2010లో) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ సమస్య నుంచి బయటపడిన మార్టినా నవ్రతిలోవా అందరికీ ఆదర్శంగా నిలిచింది. విల్మా రుడాల్ఫ్ ఈమె జీవితమే ఒక పాఠం.. చిన్నతనంలో పోలియో బారిన పడింది. 12 ఏళ్ల వయసులో రుడాల్ఫ్ కోరింత దగ్గు, తీవ్ర జ్వరం, తట్టు ఇలా అనారోగ్యం నుంచి బయటపడి చివరికి అథ్లెట్‌గా తానేంటో నిరూపించుకుంది. పోలియో కారణంగా ఎడమ కాలులో తేడా ఉండటంతో దాన్ని సరిచేసుకుని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటింది. 1960 ఒలింపిక్స్‌లో రుడాల్ఫ్ మూడు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా అందరి మన్ననలు పొందిన రుడాల్ఫ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. వీనస్ విలియమ్స్ అమెరికా టెన్నిస్ బ్యూటీ... తన చెల్లెలు సెరెనా విలియమ్స్‌తో కలసి టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించింది. 2000 నుంచి 2010 వరకు టెన్నిస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వీనస్.. జగ్రెన్స్ సిండ్రోమ్ అనే అరుదైన స్వయం నిరోధిత లోపంతో బాధపడింది. ఆయాసం, కీళ్లనొప్పి కారణంగా 2011లో యూఎస్ ఓపెన్ మధ్యలోనే నిష్ర్కమించింది. జగ్రెన్స్ నుంచి బయటపడిన ఈ అమెరికా స్టార్.. 2012లో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సెరెనాతో కలసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అదే ఏడాది లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. మళ్లీ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసేందుకు ఈ బ్లాక్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. లో గెహ్రాగ్ అమెరికాకు చెందిన అద్భుతమైన బేస్‌బాల్ ఆటగాడు. అమ్యోట్రోఫిక్ లాటరల్ స్ల్కేరోసిస్(ఏఎల్ఎస్) కారణంగా 37 ఏళ్లకే కన్నుమూసిన గెహ్రాగ్.. తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలోనే బయట పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే గెహ్రాగ్ మాత్రం అలా చేయలేదు. ఏఎల్ఎస్ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అంతా దీన్ని లో గెహ్రాగ్ వ్యాధి అని పిలుస్తుంటారు. అంతేకాదు తనకు వ్యాధి ఉందన్న సంగతిని బయటపెట్టిన తొలి క్రీడాకారుడు కూడా గెహ్రాగే. మొహమ్మద్ అలీ అమెరికాకు చెందిన 72 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ.. కెరీర్ ముగిశాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డాడు. మూడుసార్లు హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన అలీలో తొలిసారిగా 1981లో పార్కిన్సన్ లక్షణాలు కనిపించాయి. అయితే మూడేళ్ల తర్వాత (42 ఏళ్ల వయసులో) అది పార్కిన్సనే అని డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అప్పటికే బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన బాక్సింగ్ దిగ్గజం ఈ వ్యాధిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. 30 ఏళ్లుగా పార్కిన్సన్తో పోరాడుతున్న అలీ తనలా వేరేవాళ్లు ఈ వ్యాధి బారిన పడకుండా... 1997లో పార్కిన్సన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. వ్యాధుల బారిన పడిన ఇతర ప్లేయర్లు... అర్థర్ యాష్ (టెన్నిస్)-ఎయిడ్స్/హెచ్ఐవీ కరీం అబ్దుల్ జబ్బార్ (బాస్కెట్‌బాల్)-లుకేమియా -
‘నల్ల కలువలు’ అవుట్
రెండో రౌండ్లోనే ఓడిన సెరెనా, వీనస్ ష్కిమిద్లోవా, గార్బిన్ సంచలనం ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: యువ తారల దూకుడుకు ‘అమెరికా నల్లకలువలు’ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ చేతులెత్తేశారు. నమ్మశక్యంకానిరీతిలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకేరోజు వీరిద్దరూ ఓటమి మూటగట్టుకొని ఇంటిదారి పట్టారు. ఫలితంగా సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రోజూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా 2-6, 2-6తో ప్రపంచ 35వ ర్యాంకర్, 20 ఏళ్ల గార్బిన్ ముగురుజా (స్పెయిన్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ 6-2, 3-6, 4-6తో ప్రపంచ 56వ ర్యాంకర్, 19 ఏళ్ల అనా ష్కిమిద్లోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం వీనస్, సెరెనా ఇద్దరూ మూడో రౌండ్లో ముఖాముఖిగా తలపడాల్సింది. అయితే ఈ ఇద్దరూ రెండో రౌండ్లోనే ఓడిపోవడంతో అభిమానులకు 25వ సారి అక్కా, చెల్లెలు పోరును ఆస్వాదించే అవకాశం దక్కలేదు. మరోవైపు 12వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 7-5, 4-6, 2-6తో జోనా లార్సన్ (స్వీడన్) చేతిలో ఓడింది. ఏడో సీడ్ షరపోవా 7-5, 6-2తో పిరన్కోవా (బల్గేరియా)పై; ఎనిమిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 7-5తో లెప్చెంకో (అమెరికా)పై, 18వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 2-6, 6-2, 6-1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచారు. గార్బిన్తో 64 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల సెరెనా ఏ దశలోనూ పైచేయి సాధించలేదు. 5 డబుల్ ఫాల్ట్‌లు, 29 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌వద్దకు ఐదుసార్లు దూసుకొచ్చినా ఒక్కసారీ పాయింట్ సాధించలేదు. గార్బిన్ మాత్రం దూకుడుగా ఆడుతూ సెరెనా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు, నెట్‌వద్ద ఏడుసార్లు వచ్చి ఐదు పాయింట్లు నెగ్గింది. ష్కిమిద్లోవాతో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 33 ఏళ్ల వీనస్ తొలి సెట్‌ను నెగ్గినా ఆ తర్వాత తడబడింది. మ్యాచ్ మొత్తంలో 47 అనవసర తప్పిదాలు చేసిన వీనస్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ (సెరెనా), రెండో సీడ్ (నా లీ) క్రీడాకారిణులిద్దరూ మూడో రౌండ్‌కు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. తన కెరీర్లో సెరెనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో అత్యల్పంగా నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా టాప్ సీడ్ హోదాలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోకపోవడం ఇదే ప్రథమం. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒకే రోజున వీనస్, సెరెనా ఓడిపోవడం ఇది నాలుగో పర్యాయం. గతంలో 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో (క్వార్టర్ ఫైనల్), 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో (మూడో రౌండ్), 2011 వింబుల్డన్ (ప్రిక్వార్టర్ ఫైనల్) వీరిద్దరూ ఒకేరోజు ఓడిపోయారు. జొకోవిచ్, ఫెడరర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్లో జొకోవిచ్ 6-1, 6-4, 6-2తో జెరెమి చార్డీ (అమెరికా)పై, ఫెడరర్ 6-3, 6-4, 6-4తో సెబాస్టియన్ ష్వావార్ట్జ్మన్ (అర్జెంటీనా)పై, బెర్డిచ్ 6-7 (4/7), 6-4, 7-5, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)పై, రావ్‌నిక్ 7-6 (7/4), 6-4, 6-1తో వాసెలీ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. 13వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్), 18వ సీడ్ గుల్బిస్ (లాత్వియా), 25వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అయితే 15వ సీడ్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా) 0-6, 3-6, 6-3, 4-6తో స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో, 20వ సీడ్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) 6-1, 6-3, 3-6, 0-6, 2-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. -
కెవ్... ‘కేక’!
రాకెట్ ప్రయోగించినప్పుడు... విమానం టేకాఫ్ అయినప్పుడు... డిస్కోథెక్ లేదా లౌడ్ మ్యూజిక్ (స్పీకర్) విన్నప్పుడు... టపాసులు పేలినప్పుడు... సబ్వే నుంచి రైలు వెళ్లినప్పుడు... సిటీలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు... ఇలా పలు సందర్భాల్లో వెలువడే శబ్దాలను విన్నప్పుడు చెవులు చిల్లులు పడ్డాయేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సరదాగా టెన్నిస్ చూద్దామని వెళితే ఇలాంటి శబ్దాలు వినిపిస్తే..? కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇవే కేకలు, అరుపులను ఒక ఆయుధంగా టెన్నిస్ క్రీడాకారులు ఉపయోగించుకుంటున్నారు. దీనిని ‘గ్రంటింగ్’గా వ్యవహరిస్తారు. ఒకరిని మించి మరొకరు ‘కేక’ల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు టెన్నిస్ క్వీన్.. అరుపులో నంబర్ వన్... మరియా షరపోవా.. ఆటతో పాటు అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది. అయితే ఈ రష్యా అందాల భామ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెవుల్లో దూది పెట్టుకుని మరీ మ్యాచ్‌లు చూడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే షరపోవా అరుపు అలా ఉంటుంది మరి. టెన్నిస్ క్వీన్‌గా పేరొందిన షరపోవా అరుపులోనూ క్వీన్ అనిపించుకుంటోంది. ఈమె మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆమె అరుపు గరిష్టంగా 101.2 డెసిబుల్స్(శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు)గా నమోదైంది. జెట్ టేకాఫ్ అయినప్పుడు (120 డెసిబుల్స్) సింహం గర్జించినప్పుడు (110 డెసిబుల్స్), లౌడ్ స్పీకర్ విన్నప్పుడు(110 డెసిబుల్స్) ఎలా ఉంటుందో షరపోవా మ్యాచ్‌లు ఆడేప్పుడు అరిచే అరుపు దాదాపుగా అలాగే ఉంటుందట. ఇక పోర్చుగల్‌కు చెందిన 21 ఏళ్ల మిచెల్లీ లార్చర్ డి బ్రిటో అయితే అనధికారికంగా షరపోవాను అధిగమించేసింది. ఓ టోర్నీలో మ్యాచ్ ఆడుతూ బ్రిటో 109 డెసిబుల్స్ శబ్దంతో కేక పెట్టింది. బ్రిటో అరుపు భరించలేక కొందరు అభిమానులు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారట..ఇక టెన్నిస్ స్టార్లలో విక్టోరియా అజరెంకా (బెలారూస్), సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ (అమెరికా), ఎలెనా బొవినా, అన్నా కోర్నికోవా, ఎలెనా దెమెంతియేవా (రష్యా), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టించారు. అయితే మొట్టమొదటి మహిళా గ్రంట్ ప్లేయర్ మోనికా సెలెస్.. తన అరుపుతో అప్పట్లో బాగా గుర్తింపు పొందింది. ప్రత్యర్థులను దెబ్బతీసే ఆయుధం..! ఏదైనా మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ప్రతిభతో పాటు మానసికంగా పైచేయి సాధించడం కూడా ముఖ్యమే. క్రికెట్ లాంటి కొన్ని క్రీడల్లో స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థులను రెచ్చగొడతారు. తద్వారా ఎదుటివాళ్లు చేసే పొరపాట్లను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. టెన్నిస్ లాంటి కొన్ని క్రీడల్లో అది సాధ్యం కాదు కాబట్టి కొందరు ప్లేయర్లు కోర్టులో అరుపు అనే ఆయుధాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటు న్నారు. గట్టిగా అరుస్తూ ప్రత్యర్థికి చికాకు పుట్టేలా చేస్తున్నారు. . ఇటీవలి కాలంలో కొందరు ప్లేయర్లు కావాలనే ఎదుటివారి ఏకాగ్రతను దెబ్బతీసేలా అరుస్తున్నారని వింబుల్డన్ మాజీ మ్యాచ్ రిఫరీ అలెన్ మిల్స్ వెల్లడించారు. ‘ఈ మధ్య గట్టిగా అరవడం ప్లేయర్లకు బాగా అలవాటైంది. ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించేందుకు గట్టిగా అరుస్తూ చికాకు పెట్టిస్తున్నారు’అని అలెన్ మిల్స్ అనే అంపైర్ చెప్పారు. కోచింగ్‌లో అరుపు ‘ఫ్రీ’ టెన్నిస్ కోచింగ్‌లో ఇప్పుడు ఆటలో మెళకువలతో పాటు ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఎలా అరవాలో కూడా నేర్పిస్తున్నారట.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. ప్రపంచ వ్యాప్తంగా కొందరు కోచ్‌లు తమ కోచింగ్‌లో అరుపులను కూడా భాగం చేస్తున్నారట. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు అరుపులను ఆయుధాలుగా చేసుకుంటున్నప్పటికీ.. ఆటలో నైపుణ్యం ఉన్న ప్లేయర్లపై అరుపు ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు సైకాలజిస్టుల పరిశోధనలో తేలింది. గాడ్ ఫాదర్... జిమ్మీ కానర్స్.. అమెరికా టెన్నిస్ దిగ్గజం, ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ఏడుసార్లు రన్నరప్‌గా నిలిచిన జిమ్మీ కానర్స్ టెన్నిస్‌లో అరుపులకు ఆద్యుడుగా చెబుతారు. 70, 80 దశకాల్లో టెన్నిస్ కోర్టులో తన ఆటతోనే కాదు.. అరుపుతోనూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ బెరాక్, రఫెల్ నాదల్, డేవిడ్ ఫై తమ అరుపులతో ప్రత్యర్థులకు, అభిమానులకు దడ పుట్టిస్తున్నారు. వీళ్లని ఆపేదెలా... టెన్నిస్ కోర్టులో అరుపులపై అటు ప్లేయర్ల నుంచి, ఇటు అభిమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మహిళల టెన్నిస్ సంఘం స్పందించింది. టెన్నిస్ కోర్టులో అరుపులపై ధ్వని పరీక్షలు మొదలు పెట్టింది. ఇన్డోర్, అవుట్డోర్, గ్రాస్ కోర్టులు, క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు, సింథటిక్ కోర్టులు ఇలా విభిన్నమైన వేదికలు, పరిసరాల్లో ఆటగాళ్ల అరుపులు ఎలా ఉంటున్నాయో పరీక్షిస్తోంది. ఇక 2012 వింబుల్డన్‌లో ప్లేయర్ల అరుపులను నిరోధించేందుకు ప్రయత్నించారు. అంపైర్లకు గ్రంటో మీటర్లను కూడా ఇచ్చారు. అయితే దీనిపై అరిచే ప్లేయర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. చివరికి అరుపులను తేలిగ్గా తీసుకోవాల్సి వచ్చింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో వీనస్ విలియమ్స్ కు చుక్కెదురు
మెల్బోర్న్: మాజీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కు ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ లోనే చుక్కెదురైంది. ఏడు గ్రాండ్ శ్లామ్ లు గెలిచిన వీనస్ విలియమ్స్ 6-2, 4-6, 4-6 తేడాతో ప్రపంచ ఇరవై రెండో సీడెడ్ క్రీడాకారిణి ఎక్తరినా మాకారోవా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ ను గెలుచుకున్న అనంతరం వీనస్ వరుస తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. రెండో సెట్ లో వీనస్ కు సర్వీస్ ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దాన్ని నిలుపుకోకపోవడంతో ఆ సెట్ ను చేజార్చుకుంది. రెండో సెట్ తొమ్మిదో గేమ్ లో మూడు సార్లు డబుల్ ఫాల్ట్స్ చేసిన వీనస్ ఆ సెట్ ను కోల్పోయింది. అనంతరం మూడు సెట్ తొలిభాగంలో మంచి ఊపు మీద కనిపించిన వీనస్ అనవసర తప్పిదాలు కారణంగా ఆ సెట్ ను కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.