వీనస్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం | Venus Williams at fault in fatal June 9 car crash | Sakshi
Sakshi News home page

వీనస్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం

Published Fri, Jun 30 2017 9:40 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

వీనస్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం - Sakshi

వీనస్ నిర్లక్ష్యంతోనే ఆ ప్రమాదం

ఫ్లోరిడా :
టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నెల 9న జరిగిన ఘోర కారు ప్రమాదంలో వీనస్దే తప్పు ఉన్నట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వీనస్ రెడ్ సిగ్నల్ పడినా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో అవతలి వైపు వస్తున్న మరో కారును ఢీ కొట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో వీనస్కు ఎలాంటి గాయాలు కాలేదు. మరో కారులో ఉన్న జెరోమ్ బార్సన్(78) తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వారాల తరువాత మరణించారు.

వీనస్ ఇంటి సమీపంలోని పామ్ బీచ్ గార్డెన్లోని కూడాలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన మరో కారును లిండా బార్సన్ అనే మహిళ డ్రైవ్ చేశారు. తాను సిగ్నల్ను అనుసరించి ప్రయాణిస్తుండగా వీనస్ కారు హఠాత్తుగా రావడంతో కారు వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయానని, అందుకే ప్రమాదం జరిగిందని లిండా తెలిపారు. ఈ ప్రమాదంలో లిండా భర్త జెరోమ్ బార్సన్ తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, లిండాకు స్పల్పగాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో వీనస్ విలియమ్స్ తప్పిదం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వీనస్ డ్రగ్స్, మద్యం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని పామ్ బీచ్ గార్డెన్ పోలీసులు తెలిపారు.  

'ఈ ప్రమాదం దురదృష్టకరం. ఈ ఘటనలో లిండా తన భర్తను కోల్పోవడంపై వీనస్ తీవ్ర సంతాపం తెలిపారు' అని విలియమ్స్ అటార్నీ మాల్కామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement