అక్కపై చెల్లెలి ఆధిపత్యం.. | US Open 2015: Serena Williams edges Venus Williams | Sakshi
Sakshi News home page

అక్కపై చెల్లెలి ఆధిపత్యం..

Published Wed, Sep 9 2015 8:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

అక్కపై చెల్లెలి ఆధిపత్యం.. - Sakshi

అక్కపై చెల్లెలి ఆధిపత్యం..

గత కొద్ది కాలంగా శారీరక ఆకారంతోపాటు ఆటలోనూ బక్కచిక్కిన అక్క వీనర్ విలియమ్స్పై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది చెల్లెలు సెరీనా విలియమ్స్. న్యూయార్క్ వేదికగా జరుగుతోన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2015లో వీనస్ పై మ్యాచ్ గెలిచిన సెరీనా సెమీస్ లోకి దూసుకెళ్లింది.

బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్ లో సెరీనా.. 6-2, 1-6, 6-3 తేడాతో నెగ్గింది. తొలిసెట్ లో వెనుకబడ్డ వీనస్ మలి సెట్ లో విజృంభించినప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్ లో చతికిలపడింది. దీంతో అక్కపై తన విజయాల రికార్డును (16-11) మరింత పదిలపర్చుకుంది సెరీనా.. గురువారం జరగనున్న సెమీఫైనల్స్లో ఇటాలియన్ దిగ్గజం రొబెర్టా విన్సీతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement