Serena Williams
-
Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో..
Serena Williams Reveals Second Pregnancy: అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతోంది. తన చిన్నారి కూతురు ఒలింపియా కోరినట్లుగానే తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతోంది. మెట్ గాలా-2023 ఈవెంట్ వేదికగా తాను మరోసారి గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది సెరీనా. బేబీ బంప్ ప్రదర్శిస్తూ భర్త అలెక్సిస్ ఒహనియన్‌తో కలిసి సెరీనా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సందడి చేసింది. నల్లటి గౌన్‌కు తెలుపు రంగు స్కర్ట్ జతచేసిన ఈ అమెరికా నల్లకలువ.. ముత్యాల హారం ధరించి మెరిసిపోయింది. నిండైన అవుట్‌ఫిట్‌లో రెడ్‌కార్పెట్‌పై బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మేము ముగ్గురం ఇక సెరీనా భర్త బ్లాక్ కలర్ టక్సిడో ధరించి ఆమెను మ్యాచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది సెరీనా. ‘‘మా ముగ్గురికీ మెట్ గాలాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించాం’’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. చాంపియన్‌గా సత్తా చాటి కాగా అమెరికాకు చెందిన సెరీనా.. టెన్నిస్ స్టార్‌గా వెలుగొందింది. 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆమె.. ఏకంగా 23 సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో రెండు నెలల గర్భంతో ఉన్న సెరీనా చాంపియన్‌గా నిలిచింది. కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఆమె.. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చినా గాయం కారణంగా 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైంది. ఈ క్రమంలో గతేడాది ఆగష్టు 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఆమె.. తాను రిటైర్ అవ్వలేదంటూ అక్టోబరులో సంకేతాలు ఇచ్చింది. కానీ మళ్లీ ఇంతవరకు కోర్టులో దిగలేదు. రోజర్ ఫెదరర్ సైతం ఇక ఇప్పుడు తన కుటుంబం పెద్దది కాబోతోందంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం ఈ ఈవెంట్లో సందడి చేయడం విశేషం. చదవండి: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్ IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..! View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) -
Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్
క్రీడలు.. జీవనతత్వాన్ని బోధిస్తాయి.. దీన్ని గ్రహించినవారు ఓటమికి కుంగిపోరు.. గెలుపుకి పొంగిపోరు! అసలు గెలుపోటములనేవే లేవని.. ఎదురొడ్డి పోరాడడమే ముఖ్యమని విశ్వసిస్తారు! ఆటల స్ఫూర్తిని బతుకు పోరుకు అన్వయించుకుని ఇటు జీవితంలో కానీ.. అటు మైదానంలో కానీ నిలబడ్డమే అచీవ్‌మెంట్‌గా భావిస్తారు.. అచీవర్స్‌గా మిగులుతారు! వాళ్లను పరిచయం చేసేదే ఈ కాలమ్! ఈ వారం.. సెరీనా విలియమ్స్ ఉరికే జలపాతాన్ని.. ఉత్తుంగ తరంగాన్ని టెన్నిస్ కోర్ట్‌లో చూస్తున్నారంటే.. ఆ క్రీడ సెరీనా విలియమ్స్‌దే! మణికట్టు బలానికి.. చురుకైన కదలికలకు సినినమ్ సెరీనానే!! అమ్మ కడుపులోంచి ఆట భుజమ్మీద చేయ్యేసే భూమ్మీదకు వచ్చింది! నాన్న వేలు పట్టుకుని ప్లే గ్రౌండ్‌కే తొలి అడుగులు వేసింది! తాను కలలు కన్నది.. ఊహించిందీ టెన్నిస్ ప్రపంచాన్నే! అంతెందుకు ఆమె ఉచ్ఛ్వశించింది.. నిశ్వసించిందీ టెన్నిస్‌నే! అలాంటి ఆటకు సెరీనా సెండాఫ్ ఇచ్చింది! ఊపిరి ఆగినంత పనయ్యుండదూ..! ఆమె చేతిలో దర్జా ఒలకబోసిన రాకెట్ తన మనసును రాయి చేసుకుని ఉంటుంది!! ఆమె పాదాల లాఘవానికి ఆసరాగా నిలిచిన మైదానాలు బలహీనపడి ఉంటాయి!! స్టేడియం గ్యాలరీలు నిస్తేజమయ్యుంటాయి!! సెరీనాకు తొమ్మిదేళ్లున్నప్పుడు ‘నీ ఆట ఎలా ఉండాలనుకుంటున్నావ్?’ అని అడిగారు. ‘ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నా’ అని చెప్పింది తొణక్కుండా బెణక్కుండా! చెప్పినట్టుగానే ప్రత్యర్థి ఎంతటి ఘటికులైనా సరే.. తన గెలుపునే ఎయిమ్గా సర్వీస్ చేసింది. ఆ బ్లాక్ పాంథర్.. కాలిఫోర్నియా, కాంప్టన్‌లో తన టెన్నిస్ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2022 సెప్టెంబర్ 2.. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌తో ముగించేసింది. అక్క వీనస్ విలియమ్స్ ఇంకా ఆడుతుండగానే తాను నిష్క్రమించింది. ‘రిటైర్మెంట్ పదం అంటేనే నాకు నచ్చేది కాదు. అదేదో మాట్లాడకూడని విషయంగా అనిపించేది. నా భర్తతో, అమ్మానాన్నతో కూడా దీని గురించి చర్చించలేదు ఎప్పుడూ! చాలామందికి రిటైర్మెంట్ ఒక ఆహ్లాదకరమైన విషయం కావచ్చు. నేనూ అంత తేలికగా తీసుకోగలిగితే ఎంత బావుండు అనిపించింది. ఒక ప్రవాహం నుంచి ఇంకో ప్రవాహానికి మళ్లుతున్న నేను.. అత్యంత ఉద్వేగభరితమైన క్షణాన్ని ఎదుర్కొనే టైమ్ వచ్చినప్పుడు ఏడుపు ఆగలేదు. చెప్పలేనంత బాధ. ఇప్పటి వరకు నా జీవితంలో టెన్నిస్ తప్ప ఇంకోటి లేదు. రిటైర్మెంట్ ప్రకటనప్పుడు ఒంటరిగా వెళ్లేందుకు ధైర్యం చాల్లేదు. తోడుగా నా థెరపిస్ట్‌ను తీసుకెళ్లాను. రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అనిపించింది. కుప్పకూలిపోయాను. ఇలాంటి మలుపులో వచ్చి ఆగుతానని అనుకోలేదు. నా మూడో ఏటనే టెన్నిస్ బ్యాట్‌ను పట్టుకున్నానని మా నాన్న చెప్తూంటాడు. నాకు ఏడాదిన్నరప్పుడు మా అక్క (వీనస్) టెన్నిస్ కోర్ట్‌లో నన్ను తొట్టెలో తోసుకుంటూ వెళ్తున్న ఫొటో ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. నేను పర్ఫెక్షనిస్ట్ని. చిన్నప్పుడు నాకు ‘ఎ’ రాయడం రాకపోతే రాత్రంతా మేల్కొని దాన్ని దిద్దుతూనే ఉన్నా! ఏ పనినైనా కరెక్ట్‌గా నేర్చుకునే వరకు.. పర్ఫెక్ట్గా వచ్చేవరకు వదిలిపెట్టను. ఆటకు సంబంధించి కూడా అంతే! నా శక్తిసామర్థ్యాలపై అపనమ్మకం ఉన్నవారికి వారి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు మరింత ఉగ్రంగా ఆడాను. అవతల నుంచి వచ్చే నెగిటివిటీని నా బలంగా మార్చుకున్నాను. ఇప్పుడు టెన్నిస్‌కు ఆవల నేనేంటో తెలుసుకోవడానికి..నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అని చెప్పింది సెరీనా ఒక ఇంటర్వ్యూలో! రిటైర్మెంట్ అవసరం ఎందుకు వచ్చింది? సెరీనా తన ఐదేళ్ల కూతురు ఒలింపియాతో కార్లో వెళ్తోంది. అమ్మ ఫోన్‌తో ఆటలాడుకుంటోంది పాప. ‘పెద్దయ్యాక ఏమవుతావు’ అని ఫోన్లోని రోబో ప్రశ్న. అమ్మ వినకుండా గుసగుసగా చెప్తోంది ఒలింపియా, ‘నేను ఒక చిన్న చెల్లికి అక్కని అవుతా’ అని. ఆ మాట అమ్మ చెవిన పడనే పడింది. అంతేకాదు ఒలింపియా రోజూ దేవుడి ముందు తనకో చిన్ని చెల్లినివ్వమని వేడుకునే వేడుకోలూ ఆ అమ్మ కంట పడుతూనే ఉంది. ఐదుగురు అక్కల మధ్య పెరిగిన సెరీనాకి ఆ అనుబంధం అంటే ఏంటో బాగా తెలుసు. ఆ బలాన్ని ఒలింపియాకు ఇవ్వాలనుకుంది. ఇంకో బిడ్డకు జన్మనిచ్చే సమయం ఆసన్నమైందని అర్థమైంది. అయినా టెన్నిస్‌ను వీడాలా అనే సందేహం! ‘టెన్నిస్.. కుటుంబం.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి?’ అనే డైలమా! తను స్త్రీ కాబట్టే ఈ సందిగ్ధతా? మగవాళ్లకు ఉంటుందా? కుటుంబమా? కెరీరా అనే గుంజాటనపడే ఆగత్యం ఎదురవుతుందా? అతని అవసరాలు, ఇంటి అవసరాలు చూడ్డానికి, పిల్లల్ని పెంచడానికి భార్య ఉంటుంది. అన్నీ తానై భర్తకు అండగా నిలబడుతుంది. అతని గెలుపు కోసం తను శ్రమిస్తుంది.. ప్రోత్సహిస్తుంది. అలాగని నేను మహిళనైనందుకు చింతించట్లేదు. ప్రతికూల పరిస్థితులనూ అవకాశాలుగా మలచుకోగల సత్తా ఉన్న మహిళగా నిలబడినందుకు గర్విస్తున్నాను. సో.. కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఆటను వదులు కోవాలి.. కుటుంబం గురించి ఓ నిర్ణయం తీసుకోవాలసిన సమయమిది. కాబట్టి టెన్నిస్‌కు దూరం కాక తప్పదు.. దూరమవ్వాల్సిందే’ అని నిశ్చయించుకుంది. అలా రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసేసుకుంది సెరీనా. ఎంటర్ప్రెన్యూర్ సెరీనా కొన్నేళ్ల కిందట సెరీనా వెంచర్స్ అనే క్యాపిటల్ ఫర్మ్‌ను ఆంభించింది. 40 ఏళ్లు దాటిన మహిళలను పక్కన పెట్టేస్తుంది మార్కెట్. కానీ సెరీనా వెంచర్స్ మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కేవలం మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. ఒక ఆలోచనను కాని, డబ్బును కాని సెరీనా వెంచర్స్‌లో పెడితే దాన్ని ఒక ఉత్పత్తి కిందకు మారుస్తామని హామీ ఇస్తోంది ఆ ఫర్మ్. వోగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాపారవేత్తగా తన పాత్రను చక్కగా వివరించారు సెరీనా. తాను ఒక స్పాంజ్ వంటి దాన్నని.. రాత్రి పడుకునే ముందు అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని పిండి.. ఉదయానికి కొత్త ఉత్సాహంతో నిద్రలేస్తానని చెప్తుంది. ఈ టెన్నిస్ లెజెండ్.. ఫ్యాషన్, స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్ కూడా. నైజీరియన్ డాటా, ఇంటెలిజెన్స్ స్టార్టప్, ‘స్టియర్’లో 3.3 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. తన సెరీనా వెంచర్స్ కాకుండా వివిధ స్టార్టప్‌లలో, ముఖ్యంగా మహిళలు, నల్ల జాతీయుల అభివృద్ధికి పాటుపడే రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇలా సెరీనా.. తన విజయాన్ని ఇతర మహిళల జీవితాలను మార్చడానికి వినియోగిస్తూ స్త్రీ, పురుషులనే భేదం లేకుండా అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. – శ్రీదేవి కవికొండల హ్యాంగవుట్ ‘పికిల్ బాల్ ఆట రానురాను మరింత ప్రాభవం సంపాదించుకుంటోంది. ఆ ఆట అంటే నాకు ఇష్టం. ఆడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమో ఇది నా సెకండ్ కెరీర్ అవొచ్చేమో!’ అంటుంది సెరీనా! రిటైర్మెంట్ తర్వాత కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది ఆమె. మెక్సికోలో తన మేనకోడలి బ్యాచిలరేట్ పార్టీకి హాజరు అయి తానే కాబోయే పెళ్లికూతురు అన్నంతగా ఎంజాయ్ చేసింది. టీకప్పు పాటలతో క్యాంప్ ఫైర్ దగ్గర సెరీనా విలియమ్స్ ఆడిపాడిన వీడియో వైరల్ అయింది. సెరీనా జంతు ప్రేమికురాలు. ‘నాకు ఎవరైనా కుక్కపిల్లను బహుమతిగా ఇస్తే హ్యాపీగా ఫీలవుతా. పిల్లి పిల్లలంటే కూడా ఇష్టమే కానీ పిల్లులంటే భయం. జుట్టు ఎక్కువ రాల్చని పెద్ద కుక్క ఏదైనా ఉంటే చెప్తారా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతోంది సెరీనా. సెరీనా కోట్స్... విజయవంతమైన ప్రతి మహిళ ఇంకొకరికి స్ఫూర్తి. మనం ఒకరికొరకం పైకి ఎదగడానికి సహాయం చేసుకోవాలి. సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. ధైర్యంగా, దృఢంగా, ఎంత సాధించినా ఒదిగి ఉండాలి. వయసు అనేది మైండ్‌సెట్ మాత్రమే. చనిపోయేవరకు పని చేస్తూనే ఉండు.. పోరాడుతూనే ఉండు. నువ్వు ఎవరైనా, ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఇతరులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండు!! 1995లో ప్రొఫెషనల్‌గా బరిలోకి దిగిన సెరీనా 1999 యూఎస్ ఓపెన్‌లో మొదటి సింగిల్స్ గెలిచింది. 23 సింగిల్స్ గెలిచి ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిచింది. అక్క వీనస్‌తో కలసి 14 డబుల్స్ గెలిచింది. ప్రపంచంలో డబుల్స్ నెంబర్ 1గా నిలిచారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆటలో వాళ్లను కొట్టేవారే లేరు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన సెరీనా.. గెలిచినా, ఓడినా తన ఆటపై ఆమెకు బోలెడు ప్రేమ, నమ్మకం ఉంటాయి. 2017లో ఆమె ఆటను విమర్శించిన జర్నలిస్టుతో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మహిళల్లో అందరి కంటే గొప్ప ప్లేయర్ ఎవరు అంటే సెరీనా విలియమ్స్ అని బల్లగుద్ది చెప్పవచ్చు. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి. ప్రసవం తర్వాత ఆరోగ్య సమస్యలతో గ్యాప్ తీసుకుని తిరిగి వచ్చినా హ్యామ్ స్ట్రింగ్ దెబ్బ తినడంతో 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి విత్‌డ్రా కావలసి వచ్చింది. ఆఖరి ఆటలో కూడా సెరీనా అపజయాన్ని పొందింది. 2002 ఫ్రెంచ్ ఓపెన్ నుంచి 2003 ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు ముఖ్యమైన నాలుగు సింగిల్స్ గెలుచుకుంది. తర్వాత గాయాల వలన కొంచెం జోరు తగ్గినా 2012లో వింబుల్డన్ చాంపియన్‌షిప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 2016, 2017 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న వందమంది ఫోర్బ్స్ జాబితాలో ఏకైక మహిళగా నిలిచింది సెరీనా. ‘నేను బిలియనీర్‌ని అయినా కూడా నన్ను ప్రజలు సెరీనా భర్తగానే గుర్తిస్తారు’ అంటూ ఆమె భర్త జోక్ చేస్తుంటాడు.. భార్య ఘనతకు మురిసి పోతుంటాడు. మహిళల్లో అందరి కంటే గొప్ప ప్లేయర్ ఎవరు అంటే సెరీనా విలియమ్స్ అని బల్లగుద్ది చెప్పవచ్చు. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి. ప్రసవం తర్వాత ఆరోగ్య సమస్యలతో గ్యాప్ తీసుకుని తిరిగి వచ్చినా హ్యామ్ స్ట్రింగ్ దెబ్బ తినడంతో 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి విత్‌డ్రా కావలసి వచ్చింది. ఆఖరి ఆటలో కూడా సెరీనా అపజయాన్ని పొందింది. -
సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన
అమెరికా నల్లకలువ, 23 గ్రాండ్‌స్లామ్‌ల విన్నర్ అయిన సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన ఈ దిగ్గజ క్రీడాకారిణి.. తన రిటైర్మెంట్ నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. యూఎస్ ఓపెన్-2022లో తన చివరి మ్యాచ్ ఆడిన సెరెనా.. మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం అంటూ తాజాగా వెల్లడించింది. తన వ్యాపార ప్రమోషన్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెరెనా మాట్లాడుతూ.. తాను రిటైర్ కాలేదని, ఆట నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, ఇప్పటికీ తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానని రీఎంట్రీపై హింట్ ఇచ్చింది. వచ్చే ఏడాది (2023) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేయవచ్చని పరోక్ష సంకేతాలు పంపింది. కాగా, యూఎస్ ఓపెన్-2022 మూడో రౌండ్లో నిష్క్రమించిన తర్వాత నిర్వాహకులు సెరెనాకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సెరెనా తాజా నిర్ణయంతో అభిమానులతో పాటు నిర్వాహకులు సైతం అవాక్కవుతున్నారు. 41 ఏళ్ల సెరెనా విలియమ్స్ చివరిగా 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది. చదవండి: 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' -
'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ''24 ఏళ్ల కెరీర్.. 24 గంటలుగా'' అనిపించిందంటూ ఫెదరర్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. కాగా ఫెదరర్ రిటైర్మెంట్పై నాదల్, జొకోవిచ్ సహా టెన్నిస్ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అమెరిన్ టెన్నిస్ దిగ్గజం.. నల్లకలువ సెరెనా విలియమ్స్ కూడా ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించింది. ''రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం... రోజర్ ఫెదరర్'' అంటూ పేర్కొంది. కాగా ఇటీవలే సెరెనా కూడా వింబుల్డన్ అనంతరం ఆటకు లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. లాంగ్ బ్రేక్ అయినప్పటికి ఇప్పటికే 40 ఏళ్లకు చేరుకున్న సెరెనా ఇకపై టెన్నిస్ కోర్టులో కనిపించడం కష్టమేననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని సెరెనా గుర్తుచేసుకుంది. నీ గురించి చెప్పడానికి ఒక కరెక్ట్ దారిని వెతుక్కునేలా చేశారు. ఎందుకంటే నీ ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిపెట్టారు. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్బుత విజయాలు చూసిన నువ్వు కెరీర్‌ను కూడా అంతే గొప్పగా ముగించారు. నీ ఆటతీరును చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను రోజర్ ఫెదరర్. ప్రతి విషయంలోనూ నిన్నే ఫాలో అయ్యాను. నిన్ను ఎంతోగానే అభిమానించాను. మనం ఎంచుకున్న మార్గాలు ఒకేరకమైనవని, దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచావు.. నేను కూడా నిన్నే ప్రేరణగా తీసుకునేలా చేశావు. నిన్నెన్నటికీ మరిచిపోలేను. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి నీ భవిష్యత్తు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నా. రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం ఫ్రెడ్డీ. రోజర్ ఫెదరర్ అనే పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నావు.. అందుకు కృతజ్ఞతలు అంటూ ముగించింది. ఇక సెరెనా విలియమ్స్ అక్క వీనస్ విలియమ్స్ ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ''గ్రేటెస్ట్ ఎవర్.. మిస్ యూ రోజర్ ఫెదరర్'' అని పేర్కొంది. మహిళా టెన్నిస్ దిగ్గజం కోకో గాఫ్ మాట్లాడుతూ.. ''మీ అందమైన ఆటతో టెన్నిస్‌ను కోర్టు లోపల, బయట వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ ఫెదరర్. ఇన్నేళ్లలో మీరు నాకు ఇచ్చిన సలహాలకు థ్యాంక్యూ. నా రోల్ మోడల్‌గా ఉన్నందుకు నేను ధన్యురాలిని. థాంక్యూ ఫర్ ఎవ్రీతింగ్'' అంటూ తెలిపింది. View this post on Instagram A post shared by Serena Williams (@serenawilliams) చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమేనా?(ఫొటోలు)
-
US Open 2022: సరిలేరు సెరెనాకెవ్వరు
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్... ఆ సమయంలో 81వ ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్‌స్లామ్ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్ లాంజ్‌లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్‌స్లామ్స్ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది. అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, రిటర్న్స్‌లో ధాటి, చురుకైన అథ్లెట్ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్‌గా సెరెనాను ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్ గేమ్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి. బాల్యం నుంచి స్టార్‌గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కాంప్టన్ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్‌తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. విజయ ప్రస్థానం... ఓపెన్ శకంలో (1968 నుంచి) సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్డ్ డబుల్స్‌లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్ మిర్నీతో కలిసి వింబుల్డన్ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్ ఇండోర్ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్ టైటిల్ చేరింది. ఆ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది. ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్‌పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్‌గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్ ఓపెన్ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రెండోసారి ఈ ఫీట్‌ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణాలు కెరీర్‌కు అదనపు హంగును జోడించాయి. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్ డబ్ల్యూటీఏ కెరీర్లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్ సిటీలో జరిగిన ‘బెల్ చాలెంజ్’ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్లోనే ఓడింది. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. భారత్‌తో బంధం 2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్‌లో... అదీ ఒక టియర్–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్లో అది 29వ టైటిల్. ఆట ముగిసె... సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్‌స్లామ్ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్‌పై గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే కెరీర్ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్‌ను ముగించింది. కెరీర్లో తాను ఆడిన 1,014వ మ్యాచ్‌లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది. భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్‌కు తెర పడింది. న్యూయార్క్: మహిళల టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్‌లు కూడా గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్ ప్రత్యర్థి పోరాడటంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్‌ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్లో మాత్రం తొమ్లాయనోవిచ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్‌లో ఆరు మ్యాచ్ సెరెనా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్ హ్యాండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్‌తో ఓటమి ఖాయమైంది. కొన్ని వివాదాలూ... ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్‌లో వీనస్ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తండ్రి రిచర్డ్ నిర్ణయించాడని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్ బాయ్‌ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్‌తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్‌ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది. ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా. –సెరెనా –సాక్షి క్రీడా విభాగం -
సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం
పద్నాలుగేళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారి అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ సాధించి అందరిని ఆకట్టుకుంది. అందరిలాగే ఒకటో.. రెండో గ్రాండ్‌స్లామ్‌లు కొట్టి వెళ్లిపోతుందిలే అని అంతా భావించారు. కానీ ఆరోజు తెలియదు.. ఆమె టెన్నిస్‌ను ఏలడానికి వచ్చిన మహరాణి అన్న విషయం. అనతికాలంలో ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది. ఆ కిరీటాన్ని అత్యంత సుదీర్ఘ కాలం ధరించింది. ఆమె పేరే సెరెనా విలియమ్స్. టెన్నిస్ అభిమానులంతా ముద్దుగా ''నల్లకలువ'' అని పిలుచుకుంటారు. 17 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకొని.. ఆ తర్వాత 23 గ్రాండ్‌స్లామ్‌లతో ఈ తరంలో మహిళల టెన్నిస్‌లో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సెరెనా వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏడేళ్లు టెన్నిస్ శ్వాసగా బతికిన ఆమె తాజాగా తన కెరీర్‌కు లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఒక రకంగా రిటైర్మెంట్ అనే చెప్పొచ్చు. ఇకపై ఈ నల్లకలువ టెన్నిస్ కోర్టులో కనిపించే అవకాశం లేదు. అందుకే సెరెనా ఆటకు సలాం చెబుతూ ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ సెరెనా విలియమ్స్ లేని టెన్నిస్‌ను ఊహించడం చాలా కష్టం. ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్లో.. 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 1981 సెప్టెంబర్ 26న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో జన్మించింది. ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పని చేసేవారు. తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరెనా అక్క వీనస్ విలియమ్స్. వీనస్, సెరెనాలకు వారి తండ్రి రిచర్డ్ టెన్నిస్ నేర్పించారు. వాళ్లని ఊర్లో ఉన్న టెన్నిస్ కోర్టులకు తీసుకెళ్లి ఈ ఆట ఆడాలని ప్రోత్సహించారు. కోచింగ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడని చెప్పేవారు. సిస్టర్స్ ఇద్దరూ చాలా సేపు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వీనస్, సెరెనాలు టెన్నిస్ అకాడమీలో చేరటానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాదే అంటే 1995లో సెరునా కూడా అంతర్జాతీయ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. అక్క వీనస్ విలియమ్స్ ఆటను చూసిన అప్పటి టెన్నిస్ అభిమానులు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను వీనస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెల్లి సెరెనా ముందుగా దానిని సాధించింది. 1999 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. అప్పుడు సెరెనా విలియమ్స్ వయసు కేవలం 17 ఏళ్లు. న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో నాటికి ప్రపంచ దిగ్గజాలైన మోనికా సెలెస్‌ను క్వార్టర్ ఫైనల్లో, లిండ్సే డావెన్పోర్ట్ను సెమీ ఫైనల్లో, వరల్డ్ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి.. సెరెనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం విశేషం. ఇక అదే టోర్నమెంట్లో అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అక్కచెల్లెళ్లు తమ కెరీర్ ప్రస్థానంలో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సెరెనా.. ఆ తర్వాత కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. చాలా సందర్భాల్లో తన అక్క వీనస్ విలియమ్స్తోనే గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడి టైటిల్స్ గెలిచి అక్కపై పైచేయి సాధించింది. అలా 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. 2017లో సెరెనా విలియమ్స్.. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను పెళ్లి చేసుకున్నారు.సెరెనా విలియమ్స్ ఎనిమిది వారాల గర్భంతో ఉన్న సమయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలిచి ఔరా అనిపించింది. ఇది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఇదే చివరిది. మహిళల టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్ టైమ్ విజేతల జాబితాలో సెరెనా విలియమ్స్ స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించింది. ఆమెకన్నా పైస్థానంలో మార్గరెట్ కోర్ట్ మాత్రమే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో ఉంది. 2017లో సెరెనా తన కుమార్తె అలెక్సిస్ ఒంపియాకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెరెనా దాదాపు ఆరు వారాల పాటు మంచానికే పరిమితమయ్యింది. 2018లో మళ్లీ టెన్నిస్ మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరినప్పటికి ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. తాజాగా తన చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ అని చెప్పుకున్న సెరెనా.. ఈసారి కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనుకున్న తరుణంలో మూడో రౌండ్‌తోనే ఆమె తన కెరీర్‌ను ముగించింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్‌ను ఎక్కడైతే ఆరంభించిందో అదే టెన్నిస్ కోర్టులో ఇవాళ తుది మ్యాచ్ ఆడింది. చదవండి: ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను' అంటూ భావోద్వేగం -
ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను'
అమెరికన్ మహిళ టెన్నిస్ స్టార్.. నల్లకలువ సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టామ్లానోవిక్ చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న ఆమె కల తీరకుండానే కెరీర్ ముగించింది. కాగా యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు దూరం కానున్నట్లు సెరెనా ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ అనంతరం ఇంటర్య్వూలో మాట్లాడిన సెరెనా విలియమ్స్ కన్నీటి పర్యంతమైంది. ''టెన్నిస్‌లో నా జీవిత ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగింది. కెరీర్ చివరి వరకు తనను ప్రోత్సహించిన అభిమానులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అభిమానుల వల్లే ఇంత దూరం రాగలిగాను. ఇక చిన్నప్పుడే టెన్నిస్‌పై మక్కువ పెంచుకోవడంలో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఆటలోకి వచ్చిన తర్వాత అక్క వీనస్ విలియమ్స్ అండగా నిలిచింది. చెప్పాలంటే వీనస్ లేకపోతే.. సెరెనా అనే వ్యక్తి టెన్నిస్‌లో ఉండేది కాదు.. థాంక్యు అక్క.. నీ సపోర్ట్ ఎన్నటికి మరువలేనిది.. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. నా కళ్ల నుంచి వచ్చి కన్నీళ్లు కావు ఆనందబాష్పాలు'' అంటూ భావోద్వేగంతో ముగించింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ‘రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తారా?’ అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు.. కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. కాగా తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది.2017లో ప్రెగ్నెంట్ ఉన్న సమయంలోనే సెరెనా చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గింది.అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది. A speech worth of the 🐐@serenawilliams | #USOpen pic.twitter.com/0twItGF0jq — US Open Tennis (@usopen) September 3, 2022 చదవండి: అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ! -
US Open 2022: నాదల్ ముందంజ
న్యూయార్క్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొంత ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్లాగే తొలి సెట్‌ను కోల్పోయిన అతను ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ముందంజ వేశాడు. ‘నా కెరీర్లో అతి చెత్త ఆరంభాల్లో ఇది ఒకటి’... యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై విజయం తర్వాత స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ వ్యాఖ్య ఇది. తొలి సెట్లో, ఆ తర్వాత రెండో సెట్లో సగం వరకు కూడా నాదల్ ఆట చూస్తే అలాగే అనిపించింది. అయితే అసలు సమయంలో తేరుకున్న అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. 2 గంటల 43 నిమిషాల పాటు సాగిన పోరులో చివరకు విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాదల్ 2–6, 6–4, 6–2, 6–1తో ఫాగ్నినిపై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోవడంతో పాటు రెండో సెట్లో కూడా ఒక దశలో నాదల్ 2–4తో వెనుకబడ్డాడు. అయితే ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసి నాదల్ సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత తిరుగులేని ఆటతో అతను ఫాగ్నినికి చెక్ పెట్టాడు. మూడో రౌండ్లో నాదల్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–1, 7–5తో ఫెడెరికో (అర్జెంటీనా)ను ఓడించి ముందంజ వేశాడు. తన రాకెట్‌తో ముక్కుకు... ఫాగ్నినితో మ్యాచ్ సందర్భంగా నాదల్కు అనూహ్య రీతిలో స్వల్పంగా గాయమైంది. నాలుగో సెట్లో కుడి పక్కకు జరిగి వైడ్ బ్యాక్‌హ్యాండ్ ఆడే క్రమంలో రాకెట్‌పై నాదల్ పట్టు కోల్పోయాడు. వేగంగా కోర్టును తాకిన రాకెట్ అంతే వేగంగా వెనక్కి వచ్చి అతని ముక్కుకు బలంగా తాకింది. రక్తస్రావం కావడంతో ఆటను నిలిపేసి వెంటనే అతను వైద్య చికిత్స తీసుకున్నాడు. ముక్కుపై బ్యాండేజీతో ఆ తర్వాత ఆటను కొనసాగించి అతను విజేతగా నిలిచాడు. తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ముక్కు పగిలినట్లు భావించానన్న నాదల్... అంత చెత్తగా ఆడుతున్నందుకు తనకు లభించిన చిన్నపాటి శిక్ష అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. విలియమ్స్ సిస్టర్స్‌కు నిరాశ... సొంత ప్రేక్షకుల ముందు చివరిసారిగా ఆడేందుకు నాలుగున్నరేళ్ల తర్వాత డబుల్స్‌లో జోడీ కట్టిన ‘విలియమ్స్ సిస్టర్స్’ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ‘వైల్డ్‌కార్డ్’తో ఈ టోర్నీలో అడుగు పెట్టిన సెరెనా–వీనస్ ద్వయం 6–7 (5/7), 4–6 స్కోరుతో లూసీ హర్డెకా–లిండా నొస్కొవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆడినంత సేపు అభిమానులంతా ‘విలియమ్స్’ నినాదాలతో ఉత్సాహపరిచారు. తొలి సెట్ టైబ్రేకర్‌లో 19 స్ట్రోక్‌ల పాయింట్‌ను వీరిద్దరు గెలుచుకున్నప్పుడైతే దాదాపు 24 వేల సామర్థ్యం గల స్టేడియం మొత్తం హోరెత్తింది. సెరెనా–వీనస్ కలిసి మహిళల డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచారు. కిరియోస్‌కు భారీ జరిమానా ప్రతీ టోర్నీలో క్రమశిక్షణను ఉల్లంఘించి భారీగా జరిమానాలు చెల్లించడంలో ‘డాక్టరేట్ పొందిన’ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) మళ్లీ అదే తప్పు చేశాడు. గ్యాలరీలో కూర్చున్న అభిమానులను ఉద్దేశిస్తూ అసభ్యకర భాష వాడిన అతను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. దాంతో నిర్వాహకులు కిరియోస్‌కు 7,500 డాలర్లు (సుమారు రూ. 6 లక్షలు) జరిమానా విధించారు. బోపన్న ఇంటిదారి భారత ఆటగాడు రోహన్ బోపన్నకు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కూడా నిరాశే ఎదురైంది. డబుల్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) 6–7 (2/7), 2–6 స్కోరుతో సొనెగో–వవసొరి (ఇటలీ) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న–జువాన్ యాంగ్ (చైనా) జోడీ 5–7, 5–7తో దబ్రొస్కీ (కెనడా)–పర్సెల్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో మరో భారత ఆటగాడు రామ్‌కుమార్ –కాసిక్ (సెర్బి యా) 4–6, 4–6తో బొలెలి–ఫాగ్నిని (ఇటలీ) చేతిలో పరాజయం పొందారు. షేక్‌హ్యాండ్‌కు నిరాకరణ... మహిళల సింగిల్స్‌లో అజరెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్ లో ఆమె 6–2, 6–3తో మార్టా కొస్యుక్ (ఉక్రెయిన్)ను ఓడించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సహజంగా ఇద్దరు ప్లేయర్లు చేతులు కలిపే సంప్రదాయానికి భిన్నంగా కొస్యుక్ దూరం జరిగింది. తన దేశంపై రష్యా దాడికి నిరసనగా (రష్యాకు బెలారస్ సహకరిస్తోంది) ఆమె ఈ పని చేసింది. చివరకు ఒకరి రాకెట్‌ను మరొకరు తాకించి ఇద్దరూ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్స్‌లో జబర్ ఐదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో రౌండ్లో జబర్ 4–6, 6–4, 6–3తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలిచింది. గతంలో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన జబర్ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేదు. -
నాదల్ జోరు.. తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విలియమ్స్ సిస్టర్స్
యూఎస్ ఓపెన్ 2022లో భాగంగా నాలుగో రోజు పెద్దగా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిని 2-6, 6-4, 6-2, 6-1తేడాతో చిత్తు చేసి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. అయితే తొలి గేమ్ ఓడిన అనంతరం నాదల్ రాకెట్.. అతని ముక్కును చీల్చడంతో రక్తం కారింది. అయితే దీనిని లెక్కచేయని నాదల్ ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడిన నాదల్.. ప్రత్యర్థి ఫోగ్నినిని వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఇక 23 వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు నాదల్ మరింత దగ్గరయ్యాడు. VAMOS pic.twitter.com/6xxFhV4pJC — US Open Tennis (@usopen) September 2, 2022 రికార్డు విజయాలతో అల్కరాజ్.. పరుషుల వరల్డ్ నెంబర్ 3 కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో అర్జెంటీనాకు చెందిన కొరియాను 6-2, 6-2, 7-5తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 46వ విజయం. ఈ క్రమంలోనే సిట్సిపాస్ రికార్డును అధిగమించిన అల్కరాజ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్లో సిట్సిపాస్ 17 పరాజయాలు పొందగా.. అల్కరాజ్ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలయ్యాడు. We see you, @carlosalcaraz 👀 pic.twitter.com/lGEZZin5dS — US Open Tennis (@usopen) September 1, 2022 ఎదురులేని స్వియాటెక్.. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ తన జోరును ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌ను స్వియాటెక్.. 6-3, 6-2తో ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. కాగా 2020, 2022లో స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. It's always crazy hearing yourself for the first time in the world's largest tennis stadium, @iga_swiatek 😆 pic.twitter.com/cWUjhiJSg9 — US Open Tennis (@usopen) September 1, 2022 విలియమ్స్ సిస్టర్స్‌కు షాకిచ్చిన చెక్ రిపబ్లిక్ ద్వయం.. ఇక మహిళల డబుల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా, వీనస్ విలియమ్స్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో చెక్ రిపబ్లిక్ ద్వయం లూసీ హ్రడెకా- లిండా నోస్కోవా చేతిలో 7-6(7-5), 6-4తో విలియమ్స్ సిస్టర్స్ ఓటమి పాలయ్యారు. అయితే సింగిల్స్ మాత్రం సెరెనా దుమ్మురేపింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావిట్ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్ -
G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సెరెనా.. అందుకు తగ్గ ఆటతీరునే ప్రదర్శిస్తోంది. బుధవారం అర్థరాత్రి తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావెయిట్కు షాక్ ఇచ్చిన సెరెనా అద్భుత ప్రదర్శనతో 24వ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. తొలి సెట్ టై బ్రేక్‌లో నెగ్గిన సెరెనా.. రెండో సెట్‌ను కోల్పోయి కూడా ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. పాత సెరెనాను తలపిస్తూ విజృంభించిన ఆమె సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే క్రీడల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌ను G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తుంటారు. ఇప్పటికే G.O.A.Tగా పిలవబడుతున్న సెరెనాను ఎన్బీఏ(బాస్కెట్‌బాల్) చాంపియన్ లెబ్రన్ జేమ్స్ తనదైన శైలిలో సంబోధించడం వైరల్‌గా మారింది. సెరెనా మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన లెబ్రన్ జేమ్స్.. ఆమె మ్యాచ్ గెలిచిన అనంతరం GOAT పదం ఉచ్చరించేలా.. మేక శబ్ధం అయిన ''మే.. మే..'' అని అరిచాడు. ఒక రకంగా సెరెనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ G.O.A.T అనే పదాన్ని తనదైన స్టైల్లో పిలిచి ఆమె గౌరవాన్ని మరింత పెంచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. LeBron making goat sounds at Serena 😂🐐 (h/t @AhnFireDigital) pic.twitter.com/mpvhmLkU7s — NBACentral (@TheNBACentral) September 1, 2022 చదవండి: వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ -
వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో తన జోరు ప్రదర్శిస్తోంది. యూఎస్ ఓపెన్ అనంతరం లాంగ్‌బ్రేక్ తీసుకోనున్న నేపథ్యంలో సెరెనా 24వ టైటిల్ సాధించేందుకు మరో అడుగు ముందుకేసింది. యూఎస్ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. వరల్డ్ నెంబర్-2 అనేట్ కొంటావెయిట్ను 7-6(7-4), 2-6, 6-2తో చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్(మూడో రౌండ్)కు చేరుకుంది. ఐదేళ్ల నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా నెగ్గని సెరెనా... వయసు మీద పడి, గాయాల కారణంగా మునుపటి లయ కోల్పోయింది. పలు టోర్నీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ రెండో ర్యాంకర్ తో మ్యాచ్ కావడంతో యూఎస్ ఓపెన్ లోనూ సెరెనాకు రెండో రౌండ్ ఆఖరుదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ 41 ఏళ్ల వయసులో సెరెనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్ లో గెలిచిన సెరెనా రెండో సెట్లో మాత్రం వెనుకంజ వేసింది. ఇక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో నిర్ణాయాత్మక మూడో సెట్లో సెరెనా విజృంభించింది. పాత సెరెనాను గుర్తుచేస్తూ బ్యాక్, ఫోర్ హ్యాండ్, ఫార్వర్డ్ షాట్లతో దూకుడు ప్రదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. ''నేను సెరెనా విలియమ్స్. బాగా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కెరీర్లో ఎంతో సాధించా. నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదంతా బోనస్‌గా భావిస్తున్నా. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. అలాగని కోల్పోయేది కూడా ఏమీ లేదు. నా ఆట ఇంకా కొంచెం మిగిలి ఉందని అనుకుంటున్నా'' అంటూ పేర్కొంది. Serena, surprised at her level? 😏 pic.twitter.com/QP41An73FE — US Open Tennis (@usopen) September 1, 2022 చదవండి: Japan Open 2022: తొలి రౌండ్లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు -
రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా
న్యూయార్క్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ప్రకటించిన అమెరికా నల్లకలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్ 2022లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. మాంటెనెగ్రోకు చెందిన డంకా కొవినిక్‌పై 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. That winning feeling. #Serena pic.twitter.com/xJ4YUdi1Fj— US Open Tennis (@usopen) August 30, 2022 కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 40 ఏళ్ల సెరెనా.. తొలి రౌండ్లో ఏమాత్రం తడబాటుకు గురికాకుండా ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెరెనా కెరీర్లో ఇదే చివరి మ్యాచ్ అవుతుందేమోనని ఆమె అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను దాదాపు 23000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు. #TwirlForSerena pic.twitter.com/RCoCSeGB0y — US Open Tennis (@usopen) August 30, 2022 మాజీ వరల్డ్ నంబర్ 1, ప్రస్తుత 605వ ర్యాంకర్ అయిన సెరెనా తొలి రౌండ్లో తన కంటే చాలా మెరుగైన ర్యాంకర్ డంకా కొవినిక్ (80వ ర్యాంక్)పై అలవోకగా విజయం సాధించడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగితేలారు. తమ ఆరాధ్య క్రీడాకారిణి మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గి, అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మ్యాచ్‌తో పాటు కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన సెరెనా.. రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ 2 ఎస్టోనియాకు చెందిన అన్నెట్ కొంటావెట్ను ఢీకొట్టాల్సి ఉంది. చదవండి: US Open 2022: సెరెనాపైనే దృష్టి -
US Open 2022: సెరెనాపైనే దృష్టి
న్యూయార్క్: రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైందని ఇటీవల ప్రకటించిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నేడు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెర లేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగుసార్లు సెమీఫైనల్, మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. 2008 నుంచి యూఎస్ ఓపెన్‌లో సెరెనా కనీసం సెమీఫైనల్ దశ వరకు చేరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 80వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)తో ఆడుతుంది. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సిట్సిపాస్ (గ్రీస్), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), అల్కారజ్ (స్పెయిన్) టైటిల్ రేసులో ఉన్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం విజేతలకు 26 లక్షల డాలర్ల చొప్పున (రూ. 20 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 8:30 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మ్యాచ్‌లను సోనీ సిక్స్, సోనీ టెన్–2, సోనీ టెన్–3 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ
టెన్నిస్‌లో ఆ ఇద్దరిని దిగ్గజాలుగా అభివర్ణిస్తారు. ఒకరు పురుషుల టెన్నిస్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంటే.. మరొకరు మహిళల టెన్నిస్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందుతుంది. ఒకేసారి ఈ ఇద్దరు ఎదురుపడితే అది అద్భుత దృశ్యం కాకుండా ఉంటుందా. అందుకే యూఎస్ ఓపెన్ నిర్వాహకులు..''ఆర్థర్ ఆషే స్టేడియం GOAT Farmగా(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా మారిపోయింది.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆ ఇద్దరే అమెరికన్ నల్లకలువ సెరెనా విలియమ్స్.. మరొకరు స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్. Photo Credit: US Open విషయంలోకి వెళితే.. సోమవారం(ఆగస్టు 29 నుంచి) యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ సమయంలో సెరెనా, నాదల్‌లు ఒకరినొకరు ఎదురుపడ్డారు. నాదల్ ప్రాక్టీస్ చేయడానికి కోర్టులోకి వస్తుంటే.. అదే సమయంలో సెరెనా ప్రాక్టీస్ ముగించుకొని వెళుతుంది. దీంతో ఇద్దరు ఒకరినొకరు పలకరించుకొని హగ్ చేసుకున్నారు. ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్ కలిస్తే మాములుగా ఉంటుందా.. ప్రాక్టీస్ చూడానికి వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్విటర్లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియలో వీడియో వైరల్‌గా మారింది. Photo Credit: US Open ఇక సెరెనా, నాదల్‌లు ఎవరికి వారే సాటి. మహిళల టెన్నిస్‌లో ఓపెన్ శకంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో సెరెనా విలియమ్స్ కొత్త చరిత్ర సృష్టించింది. మరొక టైటిల్ సాధిస్తే.. మహిళల ఆల్‌టైం టెన్నిస్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్(24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సరసన చోటు సంపాదిస్తుంది. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పురుషుల టెన్నిస్ విభాగంలో ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. ఇక యూఎస్ ఓపెన్ అనంతరం సెరెనా టెన్నిస్ నుంచి లాంగ్‌బ్రేక్ తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యూఎస్ ఓపెన్‌లో సెరెనా తొలి రౌండ్లో మోంటెన్గ్రోకు చెందిన డన్కా కోవినిక్తో తలపడనుంది. ఇక 23 గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ ఆస్ట్రేలియాకు చెందిన రింకీ హిజికతాతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇక స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. Arthur Ashe Stadium has become a GOAT farm 🐐@serenawilliams 😍 @RafaelNadal | #USOpen pic.twitter.com/77S3GFibHS — US Open Tennis (@usopen) August 24, 2022 చదవండి: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్‌గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్‌ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచారు. -
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్
టొరంటో: కెరీర్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో 2–6, 4–6తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో సెరెనా పరాజయం చవిచూసింది. ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం’ అని సెరెనా ఉద్వేగంతో తెలిపింది. -
త్వరలోనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
న్యూయార్క్: తన విజయవంతమైన టెన్నిస్ కెరీర్‌కు త్వరలోనే వీడ్కోలు పలుకుతానని అమెరికా టెన్నిస్ దిగ్గజం, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ తెలిపింది. రెండో సంతానం, బిజినెస్ కార్యకలాపాలవైపు దృష్టిసారిస్తాను అని వివరించింది. ‘వచ్చే నెలలో నేను 41వ వసంతంలోకి అడుగుపెడతాను. దీంతో నా జీవితంలో టెన్నిస్ ఆట చాలనుకుంటున్నా. దీన్ని నేను రిటైర్మెంట్గా సంబోధించను. టెన్నిస్‌కు దూరంగా వెళుతున్నా. జీవితంలోని ఇతర ప్రాధాన్యతలవైపు పూర్తిగా మళ్లుతున్నా’ అని సెరెనా తెలిపింది. ప్రస్తుతం ఆమె టోరంటో ఓపెన్ బరిలోకి దిగింది. ఏడాది తర్వాత తొలి విజయం సాధించింది. తొలి రౌండ్లో సెరెనా 6–3, 6–4తో నూరియా (స్పెయిన్)పై గెలిచింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా చివరిసారి నెగ్గింది. సెరెనా మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ సాధించిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. -
పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..!
లండన్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం ఏడాది తర్వాత పునరాగమనం చేసిన టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. గత సంవత్సరం జూన్ 29న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన 40 ఏళ్ల సెరెనా ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టలేదు. ఏడాది తర్వాత వింబుల్డన్ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. ప్రపంచ 115వ ర్యాంకర్ హార్మనీ టాన్ (ఫ్రాన్స్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో సెరెనా 5–7, 6–1, 6–7 (7/10)తో ఓడిపోయింది. 3 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ సెరెనా 54 అనవసర తప్పిదాలు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను 17 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న హార్మనీ... సెరెనా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక టైబ్రేక్‌లో సంయమనం కోల్పోకుండా ఆడిన హార్మనీ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. తనకిదే చివరి వింబుల్డన్ టోర్నీనా కాదా అనేది చెప్పలేనని, ఆగస్టు–సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొంటానని సెరెనా వ్యాఖ్యానించింది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో (2018, 2019–వింబుల్డన్; 2018, 2019–యూఎస్ ఓపెన్) ఫైనల్‌కు చేరుకున్నా నాలుగింటిలోనూ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సంచలనాల మోత వింబుల్డన్ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రెండో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా), తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), పదో సీడ్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. జూలీ నిమియెర్ (జర్మనీ) 6–4, 6–0తో కొంటావీట్‌పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–3తో 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాడుకానూపై, గ్రీట్ మినెన్ (బెల్జియం) 6–4, 6–0తో 2017 వింబుల్డన్ విజేత ముగురుజాపై గెలిచి మూడో రౌండ్‌కు చేరారు. రూడ్ అవుట్... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బి యా) 6–1, 6–4, 6–2 తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 2–6, 5–7, 4–6తో హంబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 3 గంటల 13 నిమిషాల్లో 6–4, 3–6, 5–7, 6–0, 6–2తో మునార్ (స్పెయిన్)పై, 22వ సీడ్ బాషిలాష్విలి (జార్జియా) 7–6 (9/7), 0–6, 7–5, 7–6 (7/5)తో క్వెన్టిన్ హెల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. చదవండి: Malaysia Open 2022: సింధు ముందుకు.. సైనా ఇంటికి -
23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ
23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత, సెవెన్ టైమ్ వింబుల్డన్ ఛాంపియన్ సెరీనా విలియమ్స్‌కు వింబుల్డన్-2022లో ఘోర పరాభవం ఎదురైంది. ప్రపంచ 115 ర్యాంకర్, ఫ్రాన్స్ క్రీడాకారిణి హార్మొనీ టాన్ చేతిలో తొలి రౌండ్లోనే ఆమె ఓటమిపాలైంది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 5-7, 6-1, 6-7 (7)తో ఓటమిపాలై అభిమానులను దారుణంగా నిరాశపర్చింది. అయితే ఓటమి బాధను దిగమింగుతూ ఆమె మైదానంలో ప్రదర్శించిన హావభావాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. పరాజయం అనంతరం సెరీనా చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడటం టెన్నిస్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. "She's beaten a legend."After three hours, 10 minutes, Harmony Tan beats Serena Williams in a first round epic#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/IQst8AzXxv— Wimbledon (@Wimbledon) June 28, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తోనే వింబుల్డన్ అరంగేట్రం చేసిన హార్మొనీ టాన్ అద్భుతమై పోరాటపటిమ కనబర్చి దిగ్గజ క్రీడాకారిణిని మట్టికరిపించింది. పవర్ గేమర్పై గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ మ్యాచ్ అనంతరం టాన్ భావోద్వేగానికి లోనైంది. కాగా, సెరీనా గతేడాది వింబుల్డన్‌లోనూ మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా ఆమె వింబుల్డన్ 2021 నుంచి రిటైర్డ్ హార్ట్‌గా వైదొలిగింది. చదవండి: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
Wimbledon 2022 Draw: 113వ ర్యాంకర్‌తో సెరెనా తొలిపోరు
లండన్: గత ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ తొలి రౌండ్లోనే గాయంతో వైదొలిగిన సెరెనా విలియమ్స్... ఏడాది తర్వాత మళ్లీ అదే టోర్నీతో పునరాగమనం చేయనుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి శుక్ర వారం ‘డ్రా’ విడుదల చేశారు. తొలి రౌండ్లో ప్రపంచ 113వ ర్యాంకర్ హార్మనీ టాన్ (ఫ్రాన్స్)తో సెరెనా తలపడుతుంది. కెరీర్లో మొత్తం 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టోర్నీలు నెగ్గిన 40 ఏళ్ల సెరెనా ఏడుసార్లు వింబుల్డన్ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. గాయం కారణంగా సెరెనా ఏడాదిపాటు ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ కూడా పడిపోయి ప్రస్తుతం 1,204 స్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్ ప్రకారమైతే సెరెనా ఈ టోర్నీలో ఆడే అవకాశమే లేదు. అయితే ఆమె గత రికార్డులను దృష్టిలో పెట్టుకొని వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ ఎంట్రీని కేటాయించారు. చదవండి: Skating: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట -
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా:సెరెనా విలియమ్స్
-
'మా అక్కకు, నాకు తేడా తెలియడం లేదా?'
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వార్త విషయంలో సెరెనా ఫోటోను ప్రచురించకుండా.. తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న సెరెనా విలియమ్స్ న్యూయార్క్ టైమ్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. 40 ఏళ్ల టెన్నిస్ స్టార్ ఈ మధ్యనే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్స్‌ను ప్రారంభించింది. దాదాపు 111 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని సేకరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడిస్తూ సెరెనాపై ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. విషయం సరిగ్గానే ఉన్నప్పటికి ఫోటో విషయంలో మాత్రం పెద్ద పొరపాటే చేసింది. సెరెనా ఫోటోకు బదులు తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు. అప్పటి సెరెనా అనుకొని.. వీనస్ ఫోటోను పబ్లిష్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టికల్తో పాటు ఫోటోను ట్యాగ్ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా స్పందించింది. ''జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి. అందుకే సెరెనా వెంచర్స్ పేరుతో క్యాపిటల్ వెంచర్‌ను ప్రారంభించాం. దానిపై దాదాపు 111 మిలియన్ యూఎస్ డాలర్ల నిధిని సేకరించాం. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడడం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన సెరెనా ఇటీవలే పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ర్యాంకింగ్స్‌లో 2006 తర్వాత తొలిసారి టాప్ 50లో సెరెనా చోటు దక్కించుకోలేకపోయింది. 2021 నుంచి చూసుకుంటే సెరెనా కేవలం ఆరు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంది. వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సెరెనా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఫిట్నెస్ కారణాలతో తప్పుకుంది. చదవండి: Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్ Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..! No matter how far we come, we get reminded that it's not enough. This is why I raised $111M for @serenaventures. To support the founders who are overlooked by engrained systems woefully unaware of their biases. Because even I am overlooked. You can do better, @nytimes. pic.twitter.com/hvfCl5WUoz — Serena Williams (@serenawilliams) March 2, 2022 -
Australian Open: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూరం
అమెరికా మహిళా టెన్నిస్ స్టార్, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ జనవరిలో జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదు. తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని... తన వైద్య బృందం సలహా మేరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడట్లేదని 40 ఏళ్ల సెరెనా తెలిపింది. గాయంతో ఈ ఏడాది వింబుల్డన్‌లో తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగిన సెరెనా ఆ తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. -
వారెవ్వా ఎమ్మా: యూఎస్ ఓపెన్‌లో సంచలనం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్, టీనేజర్ ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్ వేటలో ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. తద్వారా మారియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా గుర్తింపు దక్కించుకుంది. కాగా గురువారం నాటి(స్థానిక కాలమానం ప్రకారం) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్ ప్లేయర్ మారియా సకారిని 6-1, 6-4 తేడాతో ఓడించి ఎమ్మా తుది పోరులో నిలిచింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఆమె.. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఫైనల్లో మరో టీనేజర్, 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండెజ్‌తో ఆమె తలపడనుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులు.. ‘‘ఆ ఒక్క పాయింట్ ఎమ్మా రెడుకాను జీవితాన్నే మార్చేసింది. మీరిప్పుడు యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఉన్నారు తెలుసా’’ అంటూ ఆమెను విష్ చేసింది. తన అద్బుత విజయం గురించి ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను ఫైనల్ చేరుకున్నాను. అసలు నేనిది నమ్మలేకపోతున్నాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైనా ఊహించారా? నేను ఇప్పుడు టెక్నికల్‌గా ఫైనల్లో ఉన్నాను. షాకింగ్‌గా, సంతోషంగా ఉంది’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక 1999 తర్వాత ఇలా యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక శనివారం ఎమ్మా, లేలా మధ్య ఆసక్తికపోరు జరుగనుంది. The point that changed @EmmaRaducanu's life. pic.twitter.com/k65yVd7xMo — US Open Tennis (@usopen) September 10, 2021