కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు ఇంటికే పరిమిమైనప్పటికీ తమ రోజువారి విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. తాజాగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సెరెనా తన గారాల పట్టి అలెక్సిస్ ఒలింపియా ఓహానియన్‌తో కలిసి బోంజోర్ చిత్రంలోని ఒక పాటను పాడుతూ డాన్స్ చేశారు. తల్లీకూతుళ్లు ఒకే రకం డ్రెస్ ధరించి ఇళ్లంతా తిరుగుతూ సందడి చేశారు. సెరెనా డాన్స్ చేస్తుంటే.. అలెక్సిస్ తల్లిని అనుసరించింది.