న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో ఉన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్‌లో సెరెనా అనుచితంగా ప్రవర్తించడంపట్ల యూఎస్ టెన్నిస్ అసోషియేషన్ తప్పుపట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో మూడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 17,000 యూఎస్ డాలర్ల జరిమానాను అసోషియేషన్ విధించింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని చైర్ అంపైర్ సెరెనాకు హెచ్చరిక జారీ చేయడంపట్ల విభేదించడం, అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు, తీవ్ర పదజాలంతో చైర్ అంపైర్‌ను దూషించినందుకుగాను జరిమాన విధిస్తున్నట్లు అసోషియేషన్ పేర్కొంది. ఇక కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్ భవిష్యత్ టెన్నిస్ తార నయోమి ఒసాకా(జపాన్) చేతిలో బోల్తా పడిన విషయం తెలిసిందే.
సెరెనాకు అనూహ్య మద్దతు..
యూఎస్ టెన్నిస్ అసోషియేషన్ సెరెనాకు జరిమాన విధించినప్పటకీ మహిళల టెన్నిస్ అసోషియేషన్, అభిమానుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. క్రీడల్లో అందరికి సమాన హక్కులు ఉండాలని.. పరుషు ప్లేయర్లు చైర్ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించనప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. క్రీడల్లో మహిళలకు, పురుషులకు వేరువేరు నిబంధనలు ఉండటం సమంజసం కాదని పలువురు మాజీ క్రీడాకారులు తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment