Serena Williams Withdraws From US Due To Torn Hamstring Injury - Sakshi
Sakshi News home page

US Open 2021-Serena Williams: యూఎస్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌

Published Wed, Aug 25 2021 7:58 PM | Last Updated on Thu, Aug 26 2021 12:43 PM

Serena Williams Withdraws From US Open Due To Hamstring Injury - Sakshi

న్యూయార్క్: ఈ ఏడాది  యూఎస్‌ ఓపెన్‌ కు టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. తన ఎడమ కాలి మడమ గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని సెరెనా తెలిపింది. దీనికోసం ఆమె ఇదివరకే చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయారు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.

ప్రపంచంలో తనకు ఇష్టమైన నగరం న్యూయార్కేనని, అక్కడ యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఆడటం కంటే ఇష్టమైనది మరొకటి లేదని సెరెనా విలియమ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా , ఇప్పటికే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. మరో వైపు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌ యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు లేవ‌ని సోష‌ల్ మీడియాలో తెలిపాడు.

చదవండి: IND Vs ENG 3rd Test Day 1: ఇంగ్లండ్‌ పేసర్ల విశ్వరూపం.. 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement