న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సెరెనా 6–4, 6–0తో మగ్ధా లినెట్టి (పోలాండ్)పై గెలిచింది. 70 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. వీనస్ విలియమ్స్ (అమెరికా), డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేతలు డెల్‌పొట్రో (అర్జెంటీనా), ఆండీ ముర్రే (బ్రిటన్) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)తో జరిగిన తొలి రౌండ్‌లో నాదల్ 6–3, 3–4తో ఆధిక్యంలో ఉన్న దశలో ఫెరర్ గాయం కారణంగా వైదొలిగాడు. డెల్‌పొట్రో 6–0, 6–3, 6–4తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై, ముర్రే 6–7 (5/7), 6–3, 7–5, 6–3తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. మరో మ్యాచ్‌లో మాజీ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 6–2, 7–5తో ఎనిమిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు.
సెరెనా శుభారంభం
Published Wed, Aug 29 2018 1:25 AM | Last Updated on Wed, Aug 29 2018 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment