
అమెరికా మహిళా టెన్నిస్ స్టార్, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ జనవరిలో జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదు. తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని... తన వైద్య బృందం సలహా మేరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడట్లేదని 40 ఏళ్ల సెరెనా తెలిపింది. గాయంతో ఈ ఏడాది వింబుల్డన్‌లో తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగిన సెరెనా ఆ తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment