Australian Open Grand Slam
-
Aryna Sabalenka: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు
ఐదేళ్ల క్రితం సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్ బరిలోకి దిగింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లోనే ఆమె స్థానిక స్టార్ యాష్లీ బార్టీతో తలపడాల్సి వచ్చింది. అయితే షాట్ ఆడే సమయంలో సబలెంకా చేస్తున్న అరుపులు వివాదాన్ని రేపాయి. ప్రేక్షకులు ఆమెను బాగా ఎగతాళి చేశారు. చివరకు ఓటమితో మొదటి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే గడ్డపై ఆమెపై అభినందనలతో చప్పట్ల వర్షం కురుస్తోంది. సబలెంకా దూకుడైన ఆట, పదునైన ఏస్‌లు తప్ప ఆమె అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. సబలెంకా ఎడమ చేతిపై పెద్దపులి టాటూ ఉంటుంది. ‘నేను నాలాగే ఉంటాను. ఎవరినీ లెక్క చేయను. నేను టైగర్‌ను’ అంటూ తనకు తాను చెప్పుకునే సబలెంకా అలాంటి ధీరోదాత్త ఆటను ప్రదర్శించింది. ఆరడుగుల ఎత్తు ఉన్న సబలెంకా బలం వేగవంతమైన సర్వీస్‌లో ఉంది. అయితే అదే బలం బలహీనతగా మారి గత టోర్నీలో నాలుగు రౌండ్లలోనే 56 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఈ సారి తన కోచింగ్ బృందంతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు 7 మ్యాచ్‌లలో కలిపి 29 డబుల్ ఫాల్ట్‌లే చేసింది. సబలెంకా టెన్నిస్‌ను చాలా ఆలస్యంగా మొదలు పెట్టింది. హాకీ ఆటగాడైన తండ్రి సెర్గీ ప్రోత్సాహంతో ఆటలోకి అడుగు పెట్టిన ఆమె 15 ఏళ్ల వయసు వరకు ఎలాంటి జూనియర్ టోర్నీలు ఆడనే లేదు. 16 ఏళ్ల వయసులో నేషనల్ టెన్నిస్ అకాడమీలో చేరిన తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2019లో తండ్రి ఆకస్మిక మరణం సబలెంకాను కలచివేసింది. ‘మా నాన్న నన్ను వరల్డ్నంబర్వన్గా చూడాలనుకున్నారు’ అని ఆమె గుర్తు చేసుకుంది. ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 58వ మహిళా ప్లేయర్‌గా నిలిచి రెండో ర్యాంక్‌కు చేరిన సబలెంకా నంబర్‌వన్ కావడానికి మరెంతో దూరం లేదు! Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 చదవండి: AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా -
AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా
ఒకరు 195 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేస్తున్నారు.... మరొకరు ఏమాత్రం తగ్గకుండా 192 కిలోమీటర్ల వేగంతో జవాబిస్తున్నారు... ప్రతీ పాయింట్ కోసం హోరాహోరీ సమరం... వీరి షాట్లతో బంతి పగిలిపోతుందేమో అనిపించింది... ఒకరు ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కాగా, మరొకరు తొలి టైటిల్ వేటలో పోరాడుతున్నారు...దూకుడు ఎలా ఉందంటే తొలి 13 పాయింట్లలో 7 ఏస్‌ల ద్వారానే వచ్చాయి... చివరి వరకు కూడా అదే ధాటి కొనసాగింది... గత కొన్నేళ్లుగా ఏకపక్షంగా జరుగుతున్న మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్‌లతో పోలిస్తే పోటీపోటీగా, అత్యుత్తమ స్థాయిలో ఈ తుది పోరు సాగింది. చివరకు 2 గంటల 28 నిమిషాల ఆట తర్వాత విజేత అవతరించింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ కొత్త చాంపియన్‌గా అరైనా సబలెంకా నిలిచింది. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన 29వ క్రీడాకారిణిగా అరైనా సబలెంకా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన తుది పోరులో సత్తా చాటిన 24 ఏళ్ల ఈ బెలారస్ స్టార్ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 22వ సీడ్ సబలెంకా 4–6, 6–3, 6–4 స్కోరుతో ఐదో సీడ్ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. మ్యాచ్‌లో సబలెంకా 17 ఏస్‌లు కొట్టగా, రిబాకినా 9 ఏస్‌లు బాదింది. ప్రత్యరి్థతో పోలిస్తే 51–31 విన్నర్లతో ఆమె పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 29 లక్షల 75 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.34 కోట్లు), రన్నరప్ రిబాకినాకు 16 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 9.47 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా గెలుపుతో సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. హోరాహోరీగా... ఫైనల్‌కు ముందు బలాబలాలు చూస్తే ఇద్దరు సమఉజ్జీలుగానే కనిపించారు. ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ గెలిచిన అనుభవంతో పాటు ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ విజేతలు స్వియాటెక్, ఒస్టాపెంకో, అజరెంకాలను ఓడించిన ఘనతతో రిబాకినా బరిలోకి దిగగా, ఈ ఏడాది ఓటమి ఎరుగని రికార్డుతో సబలెంకా నిలిచింది. తొలి సెట్లో రిబాకినా ఆధిక్యం ప్రదర్శిస్తూ 3–1తో ముందంజ వేసినా, ఆపై కోలుకొని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బెలారస్ ప్లేయర్ 4–4తో స్కోరు సమం చేసింది. అయితే బ్రేక్ సాధించిన రిబాకినా ఆపై సర్వీస్ నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో తన ఫోర్‌హ్యాండ్ పదును ప్రదర్శించిన సబలెంకా 4–1 వరకు వెళ్లింది. ఆపై కజక్ ప్లేయర్ ఎదరుదాడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు వరుస ఏస్‌లతో సబలెంకా సెట్ ముగించింది. మూడో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3కు చేరింది. అయితే ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో కీలకమైన ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన సబలెంకాకు మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది. Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 -
Novak Djokovic: వరుసగా 27వ విజయం.. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో
సెర్బియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ ఐదో ర్యాంకర్.. నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్స్‌కు వెళ్లడం ఇది పదోసారి. శుక్రవారం అమెరికాకు చెందిన 35వ ర్యాంకర్ టామీ పాల్‌ను 7-5, 6-1,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. తొలి సెట్ నుంచే జొకోవిచ్ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్ మ్యాచ్ మొత్తంలో ఏడు బ్రేక్ పాయింట్స్ సాధించడం విశేషం. ఇప్పటికే రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టిన జొకోవిచ్ 10వ టైటిల్‌పై కన్నేశాడు. అంతేకాదు 21 కెరీర్ గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ప్రతీసారి జొకోవిచ్ టైటిల్ కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లుగా ఓటమనేదే లేకుండా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ సిట్సిపాస్‌తో జొకోవిచ్ అమితుమీ తేల్చుకోనున్నాడు. #AusOpen semifinals: ✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️#AusOpen finals: 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆❓ Will X mark the spot for @DjokerNole on Sunday?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AO2023 pic.twitter.com/lcx6Wnm3dT — #AusOpen (@AustralianOpen) January 27, 2023 ఇంటిబాట పట్టిన కచనోవ్.. ఫైనల్‌కు సిట్సిపాస్ అంతకముందు జరిగిన మరో సెమీస్ పోరులో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెపానోస్ సిట్సిపాస్(ప్రపంచ నాలుగో ర్యాంకర్).. రష్యాకు చెందిన కచనోవ్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో సిట్సిపాస్.. కచనోవ్‌ను 7-6(7-2), 6-4,6-7(8-6), 6-3 తేడాతో మట్టికరిపించాడు. A sizzling semifinal ends in Greek glory 🇬🇷 @steftsitsipas overcomes a valiant Karen Khachanov to reach his first #AusOpen final. It ends 7-6(2) 6-4 6-7(6) 6-3 👏#AO2023 pic.twitter.com/jsik2uaovL — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి జోష్ మీదున్న జొకోవిచ్‌కు అతని తండ్రి రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా టోర్నీలో రష్యా, బెలారస్‌కు చెందిన జెండాలను నిర్వాహకులు నిషేధించారు. తాజాగా రష్యా జెండా.. జొకోవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్ను చిక్కుల్లో పడేసింది. స్టేడియాల్లోకి జెండాలు నిషేధం కావడంతో రష్యా మద్దతుదారులు.. స్టేడియం బయట తమ దేశ జెండాలతో నిరసనలు చేస్తున్నారు. ఇదే సమయంలో బుధవారం జొకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ చూసేందుకు అతని తండ్రి సర్డాన్ జొకోవిచ్ రాడ్లివర్ ఎరినాకు వచ్చాడు. ఈ సమయంలో రష్యా జెండాలు పట్టుకున్న అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేయడం.. మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించడం జొకోవిచ్ తండ్రిని మరింత వివాదంలోకి నెట్టింది. ఆ తర్వాత పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి''. జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గు చేటు'' అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు. ^Sorry, not half, 3/8 #AusOpen semifinalists are flagless since Rublev didn't make it...though obviously the debates over Rybakina's nationality and what it means in this context are well-worn. — Ben Rothenberg (@BenRothenberg) January 25, 2023 Seems he was not the only one. @TennisAustralia What’s going on there? https://t.co/ZuAQ1kNHmU — Alex Dolgopolov (@TheDolgo) January 25, 2023 చదవండి: Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' -
టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'
అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అదరగొడుతున్నాడు. బుధవారం క్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్‌ను టామీ పాల్ 7-6, 6-3, 5-7, 6-4తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ప్రదర్శనతో టామీ పాల్ భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇతని పోరాటం సెమీస్‌లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో టామీ పాల్ సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక టామీ పాల్ గర్ల్‌ఫ్రెండ్ పెయిజ్ లోరెన్జ్ మాత్రం అతని కంటే ముందే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆటతో అనుకుంటే పొరపాటే. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన ఈ అమ్మడు టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆడే మ్యాచ్‌లకు పక్కాగా హాజరవుతున్న పెయిజ్ లోరెన్జ్ ఖాళీ సమయంలో బీచ్‌కు వెళ్లి అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ టామీ పాల్.. బెన్ షెల్టన్‌తో ఆడిన క్వార్టర్స్ మ్యాచ్ ఫోటోలను కూడా పంచుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్ టాప్‌లెస్ ఫోజుపై టామీ పాల్ స్పందించాడు.. ''అలా నావైపు చూడకు ఏదో అవుతుంది నాకు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక పెయిజ్ లోరెన్జ్ టాప్‌లెస్ ఫోటోలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Paige Lorenze (@paigelorenze) -
నెంబర్‌వన్‌కు షాకిచ్చిన వింబుల్డన్ ఛాంపియన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా మహిళల టెన్నిస్ నెంబర్ వన్ ఇగా స్వియాటెకు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కజకిస్తాన్ సంచలనం.. 23వ ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రైబాకినా చేతిలో 6-4, 6-4 వరుస సెట్లలో ఖంగుతింది. గంటన్నర పోరులో స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని రైబాకినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌కు చేరడం రైబాకినాకు ఇదే తొలిసారి. కాగా స్వియాటెక్ ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు ఫ్రెంచ్ ఓపెన్ కాగా.. మరొకటి యూఎస్ ఓపెన్ ఉంది. కాగా స్వియాటెక్ గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. Letting her racquet do the talking 🤫 🇰🇿 Elena Rybakina • @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/o42uktZv5v — #AusOpen (@AustralianOpen) January 22, 2023 చదవండి: 'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా' -
‘మిక్స్డ్’ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ
తన కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ్రస్టేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా–రోహన్ బోపన్న (భారత్) జోడీ 7–5, 6–3తో జైమీ ఫోర్లిస్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–బోపన్న ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. జీవన్–బాలాజీ ద్వయం సంచలనం చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత డబుల్స్ జోడీ జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జీవన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–6 (8/6), 2–6, 6–4తో ఐదో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
మారథాన్ మ్యాచ్‌లో ఘన విజయం.. మూడో రౌండ్‌కు ముర్రే
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో అతను ఆస్ట్రేలియాకు చెందిన థనసి కొక్కినకిస్ను ఓడించాడు. 5 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో ముర్రే విజేతగా నిలిచాడు. 4-6, 6-7(4-7), 7-6(7-5), 6-3, 7-5తో థనసిను చిత్తు చేశాడు. ముర్రే కెరీర్లో ఇది సుదీర్ఘ మ్యాచ్. మెల్బోర్న్ కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం నాలుగు గంటలకు ముగిసింది. మ్యాచ్ గెలవడం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని మ్యాచ్ అనంతరం ముర్రే వ్యాఖ్యానించాడు. ఇక గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యంత ఆలస్యంగా ముగిసిన రెండో మ్యాచ్ ఇది. 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ మ్యాచ్‌లో మాజీ వరల్డ్ నంబర్ వన్ లిటన్ హెవిట్, సైప్రస్‌కు చెందిన మర్కోస్ బాఘ్దాటిస్ మధ్య జరిగిన మ్యాచ్ ఉదయం 4.34 గంటలకు ముగిసింది. ఈ మ్యాచ్‌లో హెవిట్ 4-6, 7-5, 7-5, 6-7 (4), 6-3తో విజయం సాధించాడు. Have you ever seen anything like that?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/PSIXFMIFcl — #AusOpen (@AustralianOpen) January 19, 2023 Is anyone else still thinking about last night? 💭💭#AusOpen • #AO2023 pic.twitter.com/Ve0ogzKhvJ — #AusOpen (@AustralianOpen) January 19, 2023 -
Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం..
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకాశంలో ఒక పిట్ట.. పోతూ పోతూ అతని తలపై రెట్ట వేసింది. ఒక్కక్షణం ఆగిన జ్వెరెవ్ ఏంటా అని తల నిమురుకుంటే పిట్ట రెట్ట అతని చేతులకు అంటింది. దీంతో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పక్కకు వెళ్లి తలను టవల్‌తో తుడుచుకొని మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు గొల్లుమని నవ్వారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి సెట్లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో ఖంగుతిన్నాడు. A perfect shot from the Australian Open bird 💩🤣 Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q — Eurosport (@eurosport) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? -
సంచలనం.. రెండోరౌండ్లోనే వెనుదిరిగిన టాప్‌స్టార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ మూడో ర్యాంకర్.. నార్వే సూపర్‌స్టార్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా గురువారం కాస్పర్ రూడ్, అమెరికాకు చెందిన 37వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్‌బై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రూక్స్‌బై కాస్పర్ రూడ్‌ను 6-3, 7-5,6-7(4), 6-2తో మట్టికరిపించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్‌లో తొలి రెండుసెట్లు బ్రూక్స్‌బై గెలుచుకొని ఆధిక్యం కనబరిచినప్పటికి.. మూడోసెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో విజృంభించిన కాస్పర్ రూడ్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లో తొలుత బ్రూక్స్‌బై తడబడినప్పటికి తిరిగి ఫుంజుకొని 6-2తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన కాస్పర్ రూడ్ ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు. కానీ అతని పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసిపోయింది. ఇప్పటికే వరల్డ్ నెంబర్ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో నాదల్ ఓటమి పాలయ్యాడు. అయితే ఎడమ కాలి తుంటి గాయంతో బాధపడుతున్న నాదల్ కోలుకోవడానికి 6-8 వారాలు పట్టే అవకాశం ఉందని స్వయంగా పేర్కొన్నాడు. ఇక నెంబర్‌వన్ ఆటగాడు జొకోవిచ్ మాత్రం దూసుకెళుతున్నాడు. A huge upset on Matchday 4️⃣ 😲 The No. 2️⃣ seed Casper Ruud is sent packing after an inspired performance from American Jenson Brooksby 😲🇺🇸#SonySportsNetwork #SlamOfTheGreats #AO2023 #JensonBrooksby pic.twitter.com/LhrYqBDNfa — Sony Sports Network (@SonySportsNetwk) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? 'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!' -
మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. చైర్ అంపైర్ చేసిన చిన్న తప్పిదం కారణంగా తాను మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ జెరెమీ కార్డీ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. పురుషుల సింగిల్స్‌లో గురువారం బ్రిటన్‌కు చెందిన డాన్ ఎవన్స్(27వ ర్యాంక్), జెరెమీ కార్డీ మధ్య రెండో రౌండ్ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో ఇరువురు 3-3తో సమానంగా ఉన్నారు. కీలకమైన టైబ్రేక్ పాయింట్ సమయం కావడంతో ఇద్దరు సీరియస్‌గా ఆడుతున్నారు. ఎవన్స్ బంతిని సర్వీస్ చేయగా.. జెరెమీ షాట్ ఆడాడు. ఆ తర్వాతి టర్న్‌లో జెరెమీ ఫోర్‌హ్యాండ్ షాట్ ఆడే సమయంలో అతని జేబు నుంచి బంతి కిందపడింది. ఇది గమనించిన జెరెమీ చైర్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవన్స్ కూడా గమనించకుండా షాట్ కొట్టడం.. జెరెమీ షాట్ మిస్ కావడంతో బంతి నెట్‌కు తగిలింది. దీంతో ఎవన్స్‌కు పాయింట్ లభించినట్లయింది. అయితే దీనిపై జెరెమీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చైర్ అంపైర్ మాత్రం పోనీలే అన్న తరహాలో ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో జెరెమీకి చిర్రెత్తుకొచ్చింది. ఎవన్స్ ఈ విషయంలో తాను దూరలేనని పక్కకి వెళ్లి కూర్చొన్నాడు. చైర్ అంపైర్‌తో జెరెమీ చాలా సేపు వాదించాడు. బంతి జేబులో నుంచి పడిందని సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్‌ను చూడకుండా పైనున్న ఆకాశం, పక్షులను చూస్తూ కూర్చొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కెరీర్లో మీ అంత బ్యాడ్ అంపైర్‌ను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆ తర్వాత టోర్నీ నిర్వాహకులు వచ్చి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో జెరెమీ కార్డీ ఓటమి పాలయ్యాడు. డాన్ ఎవన్స్ చేతిలో జెరెమీ కార్డీ 6-4, 6-4, 6-1తో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. చైర్ అంపైర్‌తో వివాదం తనను విజయానికి దూరం చేసిందని జెరెమీ కార్డీ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. Chardy and Evans lock horns over unclear tennis rule. 🤬 Which side are you on? 🤔 🖥 #AusOpen LIVE | https://t.co/80XjQpwKWh#9WWOS #Tennis pic.twitter.com/zY6EVp90Oq — Wide World of Sports (@wwos) January 19, 2023 -
Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(ప్రపంచ రెండో ర్యాంకర్) పోరు ముగిసింది. 23వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న కల తీరకుండానే నాదల్ రెండో రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా బుధవారం నాదల్.. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో 4-6,4-6,5-7 స్కోర్‌తో ఓటమి పాలయ్యాడు. నాదల్ నిష్రమణకు గాయం కూడా ఒక కారణం. ఎడమకాలికి గాయం అయినప్పటికి బై ఇవ్వడానికి ఇష్టపడని నాదల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. నొప్పితో సరిగా ఆడలేకపోవడంతో మెకంజీ తొలి రెండు సెట్లు ఈజీగా గెలిచేశాడు. మూడోసెట్ ఆడుతుండగా నాదల్ మరోసారి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటికే మెకంజీ మూడో సెట్లో 7-5తో స్పష్టమైన ఆధిక్యంలో నిలవడంతో నాదల్ సర్వీస్ చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో మెకంజీ మెక్‌డొనాల్డ్ మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. Mission accomplished for @mackiemacster 🇺🇸 The impressive American has beaten Nadal 6-4 6-4 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/fkaTpk11te — #AusOpen (@AustralianOpen) January 18, 2023 Always a pleasure, @RafaelNadal 🫶#AusOpen • #AO2023 pic.twitter.com/CdnOMzYDK0 — #AusOpen (@AustralianOpen) January 18, 2023 చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
రష్యా, బెలారస్ జాతీయ జెండాలపై నిషేధం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా రష్యా, బెలారస్ దేశాల జాతీయ జెండాలపై నిషేధం విధించారు. టోర్నమెంట్‌లోని ఓ టెన్నిస్ కోర్టులో జరిగిన ఘటన ఆధారంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మెల్బోర్న్ పార్క్‌లోకి జాతీయ జెండాలను తీసుకువచ్చేందుకు తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ ప్లేయర్ కేతరినీ బెయిడా, రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు రష్యా జెండాలను ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు తక్షణమే ఆ రెండు దేశాల జెండాలపై బ్యాన్ విధించారు. అంతేకాదు తమ ప్లేయర్‌ను రష్యన్లు వేధించినట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది. చదవండి: షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
కష్టపడి నెగ్గిన ముర్రే.. ఓడినా చుక్కలు చూపించాడు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బ్రిటన్ స్టార్.. ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ ఆండీ ముర్రే(66వ సీడ్) తొలి రౌండ్‌ను అతికష్టం మీద నెగ్గాడు. పురుషులు సింగిల్స్ తొలి రౌండ్లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని(13వ సీడ్)పై 3-3, 3-6, 6-4, 7-6(9-7), 6-7(6-10) ఓడించాడు. దాదాపు 4 గంటల 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రేకు బెరెట్టినీ చుక్కలు చూపించాడు. తొలి రెండు సెట్లను ఈజీగానే నెగ్గిన ముర్రేను మూడో సెట్లో మాత్రం బెరెట్టినీ ఖంగుతినిపించాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మరింత రసవత్తంగా మారింది. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో నాలుగో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌ను బెరెట్టినీ సొంతం చేసుకోవడంతో ఇద్దరు చెరో రెండు సెట్లు గెలిచారు. కీలకమైన ఐదో సెట్ కూడా టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక టై బ్రేక్‌లో జూలు విదిల్చిన ముర్రే 10-6తో సెట్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకొని రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. ఇక ముర్రేకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇది 50వ విజయం కావడం విశేషం. After nearly five epic hours @andy_murray has done it!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/00FgZbPb5g — #AusOpen (@AustralianOpen) January 17, 2023 Former #1 and five times #AusOpen runner up Andy Murray gets his biggest Grand Slam win in his metal hip Era, beating Matteo Berrettini 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-6) to reach the 2nd round. Saved one match point. 4 hours and 49 minutes. Legend. pic.twitter.com/tQdMjHf7WL — José Morgado (@josemorgado) January 17, 2023 Let’s hear it for @andy_murray!! 🗣️#AO2023 • #AusOpen pic.twitter.com/DyfgSs4kSN — #AusOpen (@AustralianOpen) January 17, 2023 -
షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం
రష్యన్ టెన్నిస్ స్టార్.. ఎనిమిదో సీడ్ డానిల్ మెద్వదెవ్ తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఆడుతున్న మెద్వదెవ్ మ్యాచ్ సందర్భంగా ఒక అభిమానిపై తిట్ల దండకం అందుకున్నాడు. విషయంలోకి వెళితే.. షార్ట్ టెంపర్‌కు మారుపేరుగా నిలిచిన మెద్వదెవ్ అప్పటికే రెండు సెట్లలో విజయం సాధించి దూకుడు మీద ఉన్నాడు. ఇక మూడో సెట్లోనూ 5-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న మెద్వదెవ్ సర్వీస్ మిస్ చేశాడు. ఇది గమనించిన ఒక అభిమాని కోర్టులోకి వచ్చి బంతిని మెద్వదెవ్ వైపు విసిరాడు. దీంతో సహనం కోల్పోయిన మెద్వదెవ్ అతనివైపు కోపంగా చూస్తూ రష్యన్ భాషలో బూతు పదం తిట్టాడు. మెద్వదెవ్ చర్య అక్కడి మైక్రోఫోన్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో చైర్ అంపైర్ మెద్వదెవ్‌ను మందలించి అభిమానికి క్షమాపణ చెప్పాలని కోరాడు. అంపైర్‌కు ఏం జవాబివ్వకుండానే మ్యాచ్‌ను కొనసాగించిన మెద్వదెవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానికి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. ఇక మెద్వదెవ్ దురుసుగా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ సందర్భంగా అభిమానులతో పాటు చైర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌కు హాజరైన అభిమానులను ఇడియట్స్ అని.. వాళ్లవన్నీ ఖాళీ బ్రెయిన్స్ అని తిట్టిపోశాడు. అటుపై చైర్ అంపైర్‌ను కూడా దూషించాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలి రౌండ్లో అమెరికాకు చెందిన మార్కోస్ గిరోన్‌పై 6-0, 6-1, 6-2తో వరుస సెట్లలో కంగుతినిపించిన మెద్వదెవ్ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. చదవండి: సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్ క్రీడాకారిణి.. మాజీ వరల్డ్ నెంబర్‌వన్ గార్బిన్ ముగురజా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముగురజా.. బెల్జియంకు చెందిన 26వ సీడ్ ఎలిస్మార్టెన్స్ చేతిలో 3-6, 7-6(3), 6-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న ముగురజా రెండో సెట్లో మాత్రం తడబడింది. ఎలిస్ మార్టెన్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో మార్టెన్ విజయం సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడోసెట్లో మాజీ నెంబర్‌వన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1-6 తేడాతో ఎలిస్ మార్టెన్ సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇక ముగురజా గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌ను గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను దక్కించుకుంది. ఇక 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచింది. Comeback complete ✅@elise_mertens holds off Muguruza 3-6 7-6(3) 6-1.#AusOpen • #AO2023 pic.twitter.com/prPvmXPxc2 — #AusOpen (@AustralianOpen) January 17, 2023 ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే.. నాలుగో సీడ్ కరోలిన్ గార్సియా కెనడాకు చెందిన అన్‌సీడెడ్ కాథరిన్ సెబోవ్‌పై 6-3, 6-0తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక సొంతగడ్డపై ఫెవరెట్‌గా కింబర్లీ బిర్రెల్.. 31వ సీడ్ కాయా కనేపిని 7-6(4), 6-1తో ఓడించి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో డొమినిక్ థీమ్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో 6-3, 6-4,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. -
కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్ స్టార్
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 తనకు డార్క్ పీరియడ్‌లా అనిపించిందని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగాయంటూ పేర్కొన్నాడు. నిక్ కిర్గియోస్ తన మెంటల్ హెల్త్ సమస్యలపై గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. ''ఇదంతా మూడేళ్ల కిందటి మాట. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ నాకు డార్క్ పీరియడ్ లాంటిది. పైకి మంచిగ కనిపిస్తున్నప్పటికి మానసికంగా చాలా దెబ్బతిన్నా. డ్రగ్స్ అలవాటు, విపరీతంగా తాగేయడం, ఫ్యామిలీ గొడవలు నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సరైన నిద్ర లేకపోవడం.. పడుకున్న మంచంపై నుంచి లేచినా ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించేది. మెంటల్ డిప్రెషన్లో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎవరిని నమ్మేవాడిని కాదు.. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇవన్నీ చూసి ఒక దశలో నాకు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి. మీరు నా కుడి చేయిని దగ్గరగా గమనిస్తే.. కత్తిగాట్లు కనిపిస్తాయి. ఆ గాట్లు నేనే పెట్టుకున్నా. పిచ్చి ఆలోచనల నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. ఒక పాజిటివ్ ఎనర్జీని పొందడానికి చాలా కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం ఒంటరి అనే భావన పూర్తిగా పోయింది. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా.. పాజిటివ్ మైండ్‌తో ఉండడం నేర్చుకున్నా. మనం ఉన్నంతకాలం చిరునవ్వుతో బతకాలి.. ఈ జీవితం చాలా అందమైనది'' అంటూ ముగించాడు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నిక్ కిర్గియోస్ మూడో రౌండ్లో వెనుదిరిగి కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆరునెలల పాటు సుధీర్ఘ బ్రేక్ తీసుకున్న కిర్గియోస్.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సింగిల్స్‌లో ఆకట్టులేకపోయినప్పటికి డబుల్స్‌లో మాత్రం తానఇస కొక్కినాకిస్తో కలిసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. కాగా ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నిక్ కిర్గియోస్ 38వ ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. చదవండి: 'పేరులోనే వ్లాదిమిర్.. ఉక్రెయిన్ తరపునే పోరాటమన్న బాక్సింగ్ లెజెండ్స్' Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు View this post on Instagram A post shared by Nick Kyrgios (@k1ngkyrg1os) -
అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొట్టాడు. మెద్వెదెవ్పై సంచలన విజయంతో కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడడం ఇది రెండోసారి. ఇంతకముందు 2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాదల్ ఓటమి పాలయ్యాడు. కానీ తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ విజృంభించాడు. వయసు మీద పడుతున్నప్పటికి తనలో సత్తువ తగ్గలేదని మరోసారి తన పదునైన ఆటతో రుచి చూపించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన మారథాన్ ఫైనల్లో 2-6, 6-7(5-7), 6-4, 6-4, 7-5తో నాదల్ విజయం సాధించాడు. దాదాపు 5 గంటల 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగానే సాగింది. తొలి సెట్‌ను 2-6తో కోల్పోవడం.. రెండో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. కాగా టై బ్రేక్‌ను మెద్వెదెవ్ గెలుచుకోవడంతో పాటు సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో నాదల్ ఓటమి ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ నాదల్ తన అసలు ఆటను మూడో సెట్ నుంచే చూపించాడు. తన పవర్ గేమ్‌ను రుచి చూపిస్తూ నాదల్ 6-4తో మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరి నడిచినప్పటికి నాదల్ మరోసారి విజృంభించి 6-4తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో 2-2తో సమానంగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. అయితే ఐదో సెట్ ఉత్కంఠంగా సాగినప్పటికి చివర్లో నాదల్ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 7-5తో సెట్‌ను కైవసం చేసుకొని 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జొకోవిచ్‌తో.. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ నాదల్, జొకోవిచ్‌ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో జొకోవిచ్ చివరికి పై చేయి సాధించాడు. ఆ మ్యాచ్‌లో నాదల్‌ను జొకోవిచ్ 5-7, 6-4, 6-2,6-7(5-7),7-5తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి అప్పటి మ్యాచ్‌లో నాదల్ తొలిసెట్‌ను గెలుచుకొని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో ఫుంజుకున్న జొకోవిచ్ 6-4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడోసెట్‌ను కూడా 6-2తో గెలిచి సత్తా చాటాడు. ఇంక ఒక్కసెట్ గెలిస్తే నాదల్ ఓటమి పాలవడం అనుకున్న తరుణంలో మ్యాచ్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్ అద్బుత పోరాటంతో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన ఐదో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చూపించి 7-5తో నాదల్‌ను ఓడించాడు. One for the books🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7 6-4 6-4 7-5 in a 5 hours and 24 minutes incredible match💪 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/gyTFieZWEr — ATP Tour (@atptour) January 30, 2022 -
యాష్లే బార్టీ.. మనకు తెలియని యాంగిల్ ఏంటంటే
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 టైటిల్‌ను యాష్లే బార్టీ తొలిసారి గెలిచిన సంగతి తెలిసిందే. డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. కాగా 2021 ఏడాదిని నెంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన బార్టీ.. స్టెఫీ గ్రాఫ్, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్, క్రిస్ ఎవర్ట్ సరసన నిలిచింది. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్.. ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్ ఒకటి దాగుంది. అదేంటో తెలుసా 2015లో కొన్ని రోజులు బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడింది. బార్టీ వుమెన్స్ క్రికెటర్‌గా మారడానికి ఒక కారణం ఉంది. 2014 యూఎస్ ఓపెన్ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్లాండ్ ఫైర్‌కు క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్ సబరబ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్ వుమెన్స్ ప్రీమియర్ టి20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున.. భారత్‌తో ఐపీఎల్ ఎంత పాపులరో.. ఆస్ట్రేలియా క్రికెట్లో బిగ్‌బాష్ లీగ్‌కు అంతే ప్రాధాన్యముంది. వెస్ర్టన్ సబ్రబ్స్ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్లో బ్రిస్బేన్ హీట్ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్ వేదికగా రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నమెంట్లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన నాదల్ ఆదివారం డానియెల్ మెద్వెదెవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. ఫైనల్లో నాదల్ గెలిస్తే గనుక టెన్నిస్‌లో పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, ఫెదరర్‌లతో సమానంగా ఉన్న నాదల్.. ఒక్క టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టించనున్నాడు. 21 గ్రాండ్‌స్లామ్‌లతో అత్యధిక టైటిళ్లు గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ నిలవనున్నాడు. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో మెద్వెదెవ్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైన నాదల్ ప్రాక్టీస్ సమయంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''రెండు నెలల క్రితం తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది. తరచూ గాయాల బారీన పడుతుండడంతో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. దాంతో ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించా. ఈ విషయమై తన టీమ్‌తో పాటు కుటుంబసభ్యులతో కూడా చర్చించాను. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి.. ఇలాగే కొనసాగితే విమర్శలు తప్ప విజయాలు దక్కవు అని కుమిలిపోయా.. అయితే ఇదంతా రెండు నెలల క్రితం. కట్ చేస్తే ఇప్పుడు బౌన్స్‌బ్యాక్ అయ్యాననిపిస్తుంది. మెద్వెదెవ్‌తో జరగబోయే ఫైనల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తానో లేదో తెలియదు కానీ.. నా ఆటపై ఆత్మవిశ్వాసం మరింతం పెరిగింది. ఆ ధైర్యంతోనే రేపటి ఫైనల్‌ను ఆడబోతున్నా'' అంటూ ముగించాడు. ఇప్పటివరకు టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్ ఖాతాలో 13 ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. టోర్నీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సొంతగడ్డపై చెలరేగి ఆడింది. ముఖ్యంగా డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. చదవండి: Australian Open: చరిత్రకు చేరువగా... తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్లో కొలిన్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో సెట్ 6-6తో టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే సెట్ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన బార్టీ మెయిడెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్ ఒక ఏస్ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఇక 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. ఈ విజయంతో బార్టీ 44 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో ఆస్ట్రేలియన్ మహిళా ప్లేయర్‌గా బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్ ఓనిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియన్ వుమెన్‌గా నిలిచింది. చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 Win a Grand Slam on home soil? Completed it mate 🇦🇺🏆@ashbarty defeats Danielle Collins 6-3 7-6(2) to become the #AO2022 women’s singles champion. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen pic.twitter.com/TwXQ9GACBS — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్
మ్యాచ్‌లో ఆటగాళ్లకు అంపైర్‌తో వివాదాలు సహజమే. ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. టెన్నిస్ కూడా దీనికి అతీతం కాదనే చెప్పొచ్చు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నెంబర్ రెండో ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండోసెట్ ముగిసిన తర్వాత ఇది చోటుచేసుకుంది. ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి వద్ద మ్యాచ్‌కు సంబంధించి సలహా తీసుకున్నాడు. చదవండి: Shoaib Akhtar: పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి ఇది గమనించిన మెద్వెదెవ్.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ చూస్తూ.. ''సిట్సిపాస్ తన తండ్రి సలహా తీసుకొని కోడ్ ఆఫ్ వయలేషన్ను ఉల్లఘించాడు.. ఇది నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు. అంపైర్ చెప్పేది వినిపించుకోకుండానే మెద్వెదెవ్ మరోసారి గట్టిగా అరిచాడు.''సిట్సిపాస్‌కు తన తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. ఆర్ యూ స్టుప్టిడ్.. అతని తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.. ఒక గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో ఇంత బ్యాడ్ అంపైర్ ఉంటారా.. ఓ మై గాడ్.. నీతోనే మాట్లాడుతున్నా నన్ను చూడు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరాడు. అంతకముందు ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫేల్ నాదల్, కెనడా టెన్నిస్ ఆటగాడు డెనిస్ షాపోవాలో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. చైర్ అంపైర్ నాదల్‌తో కుమ్మక్కయ్యాడని.. అవినీతి అంపైర్ అంటూ షాపోవాలో దూషించడం సంచలనంగా మారింది. ఇంతటితో ఊరుకొని షాపోవాలో... నాదల్కు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం ఇక పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డానిల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. గ్రీక్‌కు చెందిన నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్ ఫైనల్లో అడుగపెట్టాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో మెద్వెదెవ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. "If you don't call it, you are a small cat?" "Medvedev vs Tsitsipas pic.twitter.com/WS7yPXJGtb — Llama Says☄🌠🚀 (@funnyzeitgist) January 28, 2022 Medvedev vs the umpire, Round 2! 🛎️🥊#AusOpen - live on Channel 9, 9Now and Stan Sport. pic.twitter.com/XZgZ9qJgin — Wide World of Sports (@wwos) January 28, 2022 -
ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా శుక్రవారం తొలి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఇటలీకి చెందిన ఏడో సీడ్ మెట్టో బెర్రెట్టినిపై నాదల్ 6-3, 6-2, 3-6, 6-3తో గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఇక మెద్వదేవ్, సిట్సిపాస్ మధ్య విజేతతో నాదల్ ఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటివరకు నాదల్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌లతో సమానంగా ఉన్నాడు. చదవండి: ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గితే.. 21 టైటిళ్లతో నాదల్ చరిత్ర సృష్టించనున్నాడు. ఇక నాదల్ ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడడం ఇది 29వ సారి. తన కెరీర్లో 2009లో మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన నాదల్.. తర్వాత మరో ఆరుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికి నిరాశే ఎదురైంది. ఒకవేళ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకుంటే అన్ని మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు రెండుసార్లు గెలిచిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకముందు జొకోవిచ్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నాదల్ కోర్టులోనే కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభం దక్కింది. తొలి రెండు సెట్లు సొంతం చేసుకున్న నాకు మూడో సెట్లో బెర్రెట్టి గట్టిపోటీ ఇచ్చి సెట్‌ను గెలుచుకున్నాడు. నిజానికి బెర్రెట్టి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒక దశలో నాకు మంచి పోటీనిస్తూ మ్యాచ్‌ను నా నుంచి తీసుకునే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫైనల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో పోరాడాను.. అనుకున్నది సాధించాను. నిజాయితీగా చెప్పాలంటే ఈసారి ఫైనల్‌కు చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ తెలిపాడు. What it means to be back in an #AusOpen final 💙@RafaelNadal • #AO2022 pic.twitter.com/OF29zQkF9i — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు
ఫ్రెంచ్ వెటరన్ టెన్నిస్ ప్లేయర్ అలిజె కార్నెట్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తన 17 ఏళ్ల కెరీర్లో ఒక గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అలిజె కార్నెట్‌కు.. డేనియల్ కాలిన్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్.. కార్నెట్‌ను 7-5,6-1తో వరుస సెట్లలో ఖంగుతినిపించి సెమీఫైనల్లో అడుగపెట్టింది. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ ఇగా స్వియాటెక్, కాయ కనేపిల మధ్య జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను విజయం వరించింది. మ్యాచ్‌లో 4-6,7-6(7/2),6-3 తేడాతో స్వియాటెక్.. కనేపిపై విజయం సాధించిన తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం మూడు గంటల ఒక నిమిషం పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన స్వియాటెక్ రెండో సెట్లో ఫుంజుకుంది. ఇక ఆఖరిసెట్లో 6-3తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఇగా స్వియాటెక్, డేనియల్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. తొలి సెమీఫైనల్లో యాష్లే బార్టీ, కీస్ మాడిసన్లు తలపడనున్నారు. చదవండి: తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య -
సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌బుల్ రాఫెల్ నాద్ల్ అదరగొడుతున్నాడు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్.. కెనడాకు చెందిన డెనిస్ షాపోవలోవ్ను 6-3,6-4,4-6, 3-6,6-3తో ఓడించాడు. దాదాపు 4 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ గేమ్‌లో తొలి రెండు సెట్లను నాదల్ గెల్చుకోగా.. ఫుంజుకున్న డెనిస్ షాపోవలోవ్ తర్వాతి రెండు సెట్స్‌లో నాదల్‌ను మట్టికరిపించాడు. అయితే కీలకమైన ఆఖరి సెట్లో జూలు విదిల్చిన నాదల్ 6-3 తేడాతో సెట్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ హోంగ్రౌండ్లో దుమ్మురేపింది. 21వ సీడ్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-2తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 6-0తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని దర్జాగా సెమీస్‌కు చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బోరా క్రెజికోవాకు క్వార్టర్ఫైనల్లో గట్టిషాక్ తగిలింది. అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ చేతిలో 6-3,6-1తో క్రెజికోవా ఘోర పరాజయం పాలయింది. కేవలం గంటా 25 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో కీస్ మాడిసన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2015 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టిన మాడిసన్ మెయిడెన్ టైటిల్‌పై కన్నేసింది. ఇక సెమీస్‌లో కీస్ మాడిసన్.. ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీతో తలపడనుంది. చదవండి: Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్ రామ్-సానియా మీర్జా జోడీ ¡DALE RAFA!🇪🇸@RafaelNadal is through to the #AusOpen semifinals with a 6-3 6-4 4-6 3-6 6-3 victory over Denis Shapovalov🔥 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/9xsybToVTQ — ATP Tour (@atptour) January 25, 2022 Unstoppable 💯@Madison_Keys is into the #AusOpen quarterfinals for the first time since 2018, taking down Paula Badosa 6-3 6-1. #AO2022 pic.twitter.com/dIGsi7zf5q — #AusOpen (@AustralianOpen) January 23, 2022 -
'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'
ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ రొమేనియాకు చెందిన సిమోనా హలెప్‌ను 6–4, 3–6, 6–4తో ఓడించి సంచలనం సృష్టించింది. అయితే మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ఇంటర్య్వూలో కార్నెట్ ఎమోషనల్ అయింది. తనను ఇంటర్య్వూ చేసిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి జెలెనా డొకిక్కు మ్యాచ్ విజయాన్ని అంకితం చేసి ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేయడం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులను కంటితడి పెట్టించింది. చదవండి: Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు ''నేను క్వార్టర్స్‌కు చేరినందుకు మొదట నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ''డొకిక్ను ఉద్దేశించి..''.. నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లావో.. ఎంత ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. గాయాలతో కెరీర్‌ను అర్థంతరంగా ముగించినప్పటికి నువ్వు ఎంత గొప్ప ప్లేయర్ అనేది మాకు తెలుసు.. ఇప్పుడు కామెంటేటర్‌గా కూడా అంతే పేరు సంపాదిస్తున్నావు. ఈ విజయం నీకే అంకితం'' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి బదులుగా డొకిక్ మాట్లాడుతూ.. ''నీ మాటలు నన్ను ఏడిపించేశాయి.. ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. థాంక్యూ'' అని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకోవడంతో గ్యాలరీలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రొయేషియాకు చెందిన జెలెనా డొకిక్ వరుస గాయాల కారణంగా 2014లో 30 ఏళ్ల వయసున్నప్పుడు అర్థంతరంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అయితే ఇదే జెలెనా డొకిక్తో అలిజె కార్నెట్‌కు మంచి అనుబంధం ఉంది. ఆన్ కోర్టు.. ఆఫ్ కోర్టు ఇలా ఏదైనా అటు కెరీర్ గురించి.. ఆట గురించి మాట్లాడుకునేవారు. కార్నెట్ ఆటలో మెళుకువల కోసం జెలెనా సలహాలు చాలా తీసుకుంది. అలా తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్న కార్నెట్.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ చేరడం.. విజయం అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జెలెనా ఇంటర్య్వూ చేయడంతో ఎమోషన్‌ను ఆపుకోలేకపోయింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం No dry eyes in the house 😭😭😭 This on-court interview between @alizecornet and Jelena Dokic is everything. #AusOpen · #AO2022 pic.twitter.com/F3nN0XSHNX — #AusOpen (@AustralianOpen) January 24, 2022 -
కార్నెట్ పట్టు వీడని పోరాటం
మెల్బోర్న్: ఏళ్ల తరబడి టెన్నిస్ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్ స్టార్ అలిజె కార్నెట్ ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 32 ఏళ్ల కార్నెట్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడుతున్న ఈ ఫ్రాన్స్ స్టార్ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కార్నెట్ 6–4, 3–6, 6–4తో హలెప్‌పై విజయం సాధించి తన 63వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో సీడ్ సబలెంకాకు షాక్ మరో ప్రిక్వార్టర్స్‌లో కూడా మరో అలుపెరగని క్రీడాకారిణి కయా కనెపి సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఎస్తోనియాకు చెందిన 115వ ర్యాంకర్ కనెపి 5–7, 6–2, 7–6 (10/7)తో బెలారస్ స్టార్, రెండో సీడ్ సబలెంకాపై అద్భుత విజయం సాధించింది. 2007 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న కనెపి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కనెపి 15 ఏళ్ల కెరీర్లో మిగతా మూడు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో క్వార్టర్స్ చేరింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఈ ఏడాదే ఆ అవకాశం దక్కించుకుంది. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5–7, 6–3, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై, 27వ సీడ్ కొలిన్స్ (అమెరికా) 4–6, 6–4, 6–4తో 19వ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. చెమటోడ్చిన మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో 70వ ర్యాంకర్ మ్యాక్సిమ్ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, 11వ సీడ్ సినెర్ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా) 2–6, 7–6 (9/7), 6–2, 7–6 (7/4)తో సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
Australia Open: నాదల్ దూకుడు
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 14వ సారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 7–6 (16/14), 6–2, 6–2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2007 నుంచి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ నాదల్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 2013లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న నాదల్ 2016లో మాత్రం తొలి రౌండ్లో ఓడిపోయాడు. మనారినోతో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్కు తొలి సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 81 నిమిషాలపాటు సాగిన తొలి సెట్లో నాదల్ నాలుగుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకున్నాడు. 28 నిమిషాల 40 సెకన్లపాటు జరిగిన టైబ్రేక్‌లో తుదకు నాదల్ 16–14తో పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత నాదల్ జోరు పెంచగా, మనారినో డీలా పడ్డాడు. షపోవలోవ్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కెనడాకు చెందిన 14వ సీడ్ డెనిస్ షపోవలోవ్ 2 గంటల 21 నిమిషాల్లో 6–3, 7–6 (7/5), 6–3తో జ్వెరెవ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న షపోవలోవ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 7–5, 7–6 (7/4), 6–4తో 19వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై, 17వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–5, 7–6 (7/4), 6–3తో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. -
క్రికెట్లో ఆడాల్సిన షాట్ టెన్నిస్‌లో ఆడితే..
Ashleigh Barty Pefect Square Leg Glance With Tennis Racquet: యాష్లే బార్టీ.. ఈ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ప్రస్తుతం మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్. అందుకు తగ్గట్టే యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తుంది. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటికే క్వార్టర్స్ చేరుకున్న బార్టీ మరో టైటిల్‌పై కన్నేసింది. ప్రి క్వార్టర్స్‌లో 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. ఈ ఏడాది బార్టీకి ఇది వరుసగా ఏడో విజయం. ఈ ఏడుసార్లు ఆమె ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక క్వార్టర్ ఫైనల్లో బార్టీ.. ఒసాకాను మట్టికరిపించిన అమండా అనిసిమోవాతో తలపడనుంది. చదవండి: 'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు' కాగా బార్టీ క్రికెట్లో ఆడాల్సిన షాట్‌ను టెన్నిస్‌లో ఆడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవతలి ఎండ్ నుంచి వచ్చిన బంతిని బార్టీ తన రాకెట్‌తో లెగ్స్వేర్ దిశగా కట్ చేయడం కనిపించింది. వీడియో గమనిస్తే.. అసలు మ్యాచ్‌లో అయితే అందుకు ఆస్కారం లేదు కాబట్టి వార్మప్ సందర్భంగా బార్టీ ఈ షాట్ ఆడి ఉంటుంది. అయితే ఆమె సరదాగా కొట్టినప్పటికి.. టెన్నిస్‌లో క్రికెట్ షాట్ ఆడడం చూసేవాళ్లకి మాత్రం కొత్తగా ఉంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: Syde Modi Tourney: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. Ash Barty tucking one off the hips for a single pic.twitter.com/NBX9qe5z8T — Henry Moeran (@henrymoeranBBC) January 22, 2022 -
'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు'
ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ డబుల్స్ నెంబర్ వన్ జంట నికోలా మెక్టిక్, మేట్ పావిక్లు మాతో ఫైట్ చేయడానికి భయపడ్డారంటూ పేర్కొనడం సంచలనం రేపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్, తానాసి కొక్కినకిస్ జంట క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్, మేట్ పావిక్ జంటను 7-6, 6-3 ఓడించింది. ఈ మ్యాచ్‌ను గెలిచిన నిక్ కిర్గియోస్.. ప్రత్యర్థిపై తన మాటలతోనూ మానసికంగానూ పైచేయి సాధించాలనుకున్నాడు. చదవండి: Australian Open 2022: డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చిన అన్‌సీడెడ్ ప్లేయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం లాకర్ రూమ్‌కు వెళ్లిన కిర్గియోస్.. అక్కడ నికోలా మెక్టిక్, మేట్ పావిక్ల కోచ్, ట్రైనర్ కనిపించారు. వారి వద్దకు వెళ్లిన కిర్గియోస్ డిబేట్ చేశాడు. ''ఆ ఇద్దరు మా ఆటను చూసి భయపడిపోయారు.. ఇంకేం ఫైట్ చేస్తారు'' అంటూ పేర్కొన్నాడు. ఇక కిర్గియోస్ ప్రవర్తనపై టెన్నిస్ అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మొన్న సింగిల్స్ మ్యాచ్‌లో డేనియల్ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన కిర్గియోస్.. ఆ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి చేతలు కాల్చుకున్నాడు. తాజాగా డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించగానే తనలోని మరో కోణాన్ని బయటకు తీశాడు. సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నాననే గర్వం కిర్గియోస్లో కనిపిస్తుంది.. అదే అతని పతనానికి కారణమవుతుందని కామెంట్స్ చేశారు. అయితే లాకర్ రూమ్‌లో కిర్గియోస్ పెట్టిన డిబేట్ వీడియో ప్రత్యక్షమవడం.. క్షణాల్లో వైరల్ కావడం జరిగిపోయింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం Things got HEATED in the locker room after Nick Kyrgios and Thanasi Kokkinakis' doubles win 😳 Grothy got the inside word 🌶️#AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/iD26iHnUW1 — Wide World of Sports (@wwos) January 21, 2022 -
అయ్యో ఒసాకా...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదో రోజు పెను సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 14వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్, 20 ఏళ్ల అమండా అనిసిమోవాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 6–4, 3–6, 6–7 (5/10)తో ఓడిపోయింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో సెట్లో ఒసాకా 5–4తో ఆధిక్యంలో ఉండి, అనిసిమోవా సర్వ్ చేసిన పదో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించింది. అయితే ఈ రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అనిసిమోవా తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమై టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి ఒసాకాను ఇంటిముఖం పట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా తలపడుతుంది. మూడో రౌండ్లో బార్టీ 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–0, 6–2తో 15వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–4తో ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శ్రమించిన నాదల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. 2 గంటల 50 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 6–3, 6–2, 3–6, 6–1తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచాడు. -
మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న సానియా మీర్జా టోర్నీలో శుభారంభం చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- రాజీవ్ రామ్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో వీరి జోడి సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా క్రూనిక్- నికోలా కాకిక్ జోడిపై 6-3,6-7(3) తేడాతో నెగ్గి రెండో రౌండ్లో అడుగెపెట్టింది. కేవలం 69 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన సానియా మీర్జా జోడి తొలి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం -
గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పరుషుల ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డేనియల్ మెద్వదెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు పదేపదే మెద్వదేవ్‌ను తమ మాటలతో అవమానపరచడం అతన్ని బాధించింది. ఈ విషయాన్ని మెద్వదేవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం కోర్టులో కామెంటేటర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు లో ఐక్యూ. ఒక క్రీడాకారుడితో ఎలా ప్రవర్తించాలన్న కనీస పరిజ్ఞానం లేదు. ఒకప్పుడు నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు ఇలా అవమానించడం కరెక్టు కాదు. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మనషులమన్న సంగతి మరిచి రోబోల్లా ప్రవర్తించారు..'' అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్రమంలో డేనియల్ మెద్వదేవ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం చూపించాడు. మ్యాచ్ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ.. తన చర్యలతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టించాడు. అప్పట్లో ఈ ఘటన మెద్వదేవ్‌ను విలన్‌గా మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రెండోరౌండ్ మ్యాచ్‌లో లోకల్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు నిక్ కిర్గియోస్ పదే పదే ప్రేక్షకుల వైపు చూస్తూ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టండంటూ ఎంకరేజ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసేవరకు సైలెంట్‌గా ఉన్న మెద్వదేవ్... ఆ తర్వాత కామెంటరీ ఇంటర్వ్యూలో తన ఆగ్రహాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేనియల్ మెద్వదేవ్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్‌పై 7-6, 6-4,4-6,6-2తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ముర్రే రెండో రౌండ్లోనే వైదొలగడంతో.. నాదల్ తర్వాత మెద్వదేవ్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెద్వదేవ్ 2021 యూఎస్ ఓపెన్ విజేత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునన్న మెద్వదేవ్ కెరీర్లో 13 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. "Show some respect." 😡😡 Daniil Medvedev was NOT happy with the crowd behaviour tonight and he let them know in the on-court interview! 😳 #AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/5UKAFOuV9v — Wide World of Sports (@wwos) January 20, 2022 -
Australian Open 2022: యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు దిమ్మతిరిగే షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ ఓపెన్ చాంపియన్.. బ్రిటీష్ టీనేజర్ ఎమ్మా రాడుకానుకు ఊహించని షాక్ ఎదురైంది. మోంటెనెగ్రోకు చెందిన 98వ ర్యాంకర్ డంకా కోవినిక్ చేతిలో 6-4,4-6,6-3తో ఓడిన ఎమ్మా రాడుకాను రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి సెట్లో 3-0తో ఆధిక్యంలో కనిపించిన రాడుకాను ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి సెట్ కోల్పోయింది. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? సర్వీస్ చేసే సమయంలో కుడిచేతికి గాయం కావడంతో ట్రీట్మెంట్ చేయించుకొని బరిలోకి దిగిన రాడుకాను రెండో సెట్ గెలిచినప్పటికి..మూడో సెట్లో డంకా కోవినిక్ ఫుంజుకొని 6-3తో ఓడించి సెట్‌ను కైవసం చేసుకుంది. ఒక ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్‌లో కోవినిక్ మూడో రౌండ్ చేరడం ఇదే తొలిసారి. మూడో రౌండ్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సిమోనా హలెప్ లేదా బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయీయాతో తలపడనుంది. రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఆండీ ముర్రే మరోవైపు పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన టారో డేనియల్ చేతిలో 6-4, 6-4,6-4 వరుస సెట్లలో ఓడి ఇంటిదారి పట్టాడు. దాదాపు 2 గంటల 48 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అన్ని సెట్లలోనే టారో.. ముర్రేపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. జొకోవిచ్, ఫెదరర్ లాంటి ఆటగాళ్లు దూరమైన వేళ ఈసారి టైటిల్ ఫెవరెట్‌గా భావించిన ముర్రే రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఆసక్తి కలిగించింది. -
పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు?
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం బహిష్కరించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకోకుండా గ్రాండ్‌స్లామ్ ఆడతానంటే కుదరదని ఆసీస్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనిపై కోర్టుకెళ్లిన జొకోవిచ్ తొలిసారి ఊరట కలిగినప్పటికి.. రెండోసారి భంగపాటు ఎదురైంది. వీసా రద్దు కారణంగా... జొకో మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పోతూపోతూ జొకోవిచ్ విచారణ బిల్లు రూపంలో ఆ దేశ పన్ను బేరర్లకు 265,000 ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చి వెళ్లాడు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్ల 68 లక్షలు విలువ ఉంటుంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ పలువురు పేర్కొనగా.. దీనిపై టెన్నిస్ ఆస్ట్రేలియా స్పందించింది. జొకోవిచ్ విచారణ బిల్లును తామే భరిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక జొకోవిచ్ రగడ అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండానే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడేందుకు జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే ఆ దేశ ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆడేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఇక్కడ మొదలైన సమస్య 11 రోజుల పాటు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కోర్టుకెక్కి విజయం సాధించాడు. అయితే ఆ దేశ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. -
Australian Open 2022: ఎదురులేని నాదల్.. మూడో రౌండ్‌కు జ్వెరెవ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. 21వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన నాదల్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. బుధవారం జర్మనీకి చెందిన యానిక్ హాన్ఫ్మన్ను 6-2, 6-3, 6-4తో వరుస సెట్లో ఖంగుతినిపించిన నాదల్ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటరయ్యాడు. స్విస్ సూపర్‌స్టార్ రోజర్ ఫెదరర్‌తో సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్కు ఇది మంచి అవకాశం. ఫెదరర్, జొకోవిచ్ లాంటి దిగ్గజాలు ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరంగా ఉన్నారు. ఇక మూడోరౌండ్లో నాదల్.. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌ను 6-4,6-4,6-0తో ఓడించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. -
అదరగొట్టిన ముర్రే.. ఐదేళ్ల నిరీక్షణకు తెర
బ్రిటన్ టెన్నిస్ స్టార్.. మాజీ ప్రపంచనెంబర్వన్ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఘనంగా ఆరంభించాడు. జార్జేరియాకు చెందిన 21వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-1, 3-6,6-4,6-7(5), 6-4 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరు దాదాపు 3 గంటల 52 నిమిషాల పాటు హోరాహోరిగా తలపడినప్పటికి.. ముర్రే ఆద్యంతం ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెట్‌ను 6-1 తేడాతో గెలిచిన ముర్రే రెండో సెట్‌ను మాత్రం 3-6తో ప్రత్యర్థికి కోల్పోయాడు. అయితే తనదైన గ్రౌండ్స్ట్రోక్స్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించిన ముర్రే మూడో సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు. ఇక నాలుగో సెట్ టై బ్రేక్‌కు దారి తీసినప్పటికి కీలకమైన ఐదో సెట్‌ను 6-4తో గెలుచుకొని ముర్రే రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో టోర్నీ నిర్వాహకులు ట్విటర్లో షేర్ చేసుకున్నారు. మ్యాచ్ విజయం అనంతరం ముర్రే భావోద్వేగానికి లోనవ్వడం వైరల్‌గా మారింది. చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి ఇక 2017లో ఆఖరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన ముర్రే.. 2018లో గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్నాడు. ఇక 2019లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడాడు. అయితే తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన ముర్రే భావోద్వేగానికి గురయ్యాడు. అప్పటికే తుంటి ఎముక గాయం బాధిస్తుండడంతో తాను ఇక టెన్నిస్ ఆడనేమోనని.. ఇది చివరిదని ఎమోషనల్ కావడం అభిమానులను బాధించింది. తుంటి ఎముకకు సంబంధించి సర్జరీ చేయించుకున్న ముర్రే తన ఆటలో పదును పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఐదుసార్లు ఫైనల్ చేరిన ముర్రేకు అన్నిసార్లు భంగపాటే ఎదురైంది. ఒక ఫైనల్లో రోజర్ ఫెదరర్ చేతిలో ఓడిన ముర్రే.. మిగతా నాలుగు ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను కొట్టాలన్న కసితో ఉన్న ముర్రే.. తొలి రౌండ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇక ముర్రే ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన ముర్రే.. ఆ తర్వాత 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన బ్రిటీష్ ప్లేయర్‌గా ముర్రే చరిత్రకెక్కాడు. మళ్లీ 2016లోనూ ముర్రే వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చదవండి: అలా అయితే నువ్వు మాకొద్దు! Murray magic ✨@andy_murray outlasts Nikoloz Basilashvili 6-1, 3-6, 6-4, 6-7(5), 6-4 after nearly four hours of tennis!#AusOpen · #AO2022 🎥: @wwos · @espn · @Eurosport · @wowowtennis pic.twitter.com/lr9xMN8f9M — #AusOpen (@AustralianOpen) January 18, 2022 -
ఒసాకా అలవోకగా...
మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్ కెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మెల్బోర్న్: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్, 13వ సీడ్ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్ సీడ్ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచారు. ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయింది. నాదల్ బోణీ... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్తో మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన నాదల్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న సెబాస్టియన్ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గారు. కెనిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 18వ సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
జొకోవిచ్ లడాయి
కరోనా అనంతర ప్రపంచంలో దేశాల మధ్య తలెత్తగల విభేదాల గురించి నిపుణులు కొన్నాళ్లక్రితం చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. టెన్నిస్ చాంపియన్ జొకోవిచ్ వ్యవహారం ఆ విభేదాలను బయటపెట్టింది. ఈ నెల మొదట్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన జొకోవిచ్‌ను ఆ దేశ సరిహద్దు భద్రతా దళం అడ్డగించింది. అతని వీసా రద్దయినట్టు ప్రకటించి, వెనక్కు పంపించేందుకు ప్రయత్నించింది. దానికి ముందు బోలెడు ప్రశ్నలతో వేధించింది. దీన్ని అక్కడి న్యాయస్థానం ఈ నెల 10న తోసిపుచ్చి జొకోవిచ్‌ను అనుమతించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం శుక్రవారం మరోసారి వీసాను రద్దు చేసింది. మూడేళ్ల నిషేధం విధించేందుకు సిద్ధపడుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై జొకోవిచ్ అభిమానులతోపాటు అతని మాతృదేశమైన సెర్బియా కూడా తీవ్రంగానే స్పందించడం గమనించదగ్గ అంశం. జొకోవిచ్ ఇప్పటికి తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెల్చుకున్నాడు. పదోసారి సైతం సొంతం చేసుకొనేందుకు తగిన అనుమతులతోనే అడుగుపెట్టాడు. ఇతర టెన్నిస్ దిగ్గజాలైన నాడల్, రోజర్ ఫెదరర్‌లకు భిన్నంగా మైదానంలోనూ, వెలుపలా తన దురుసు ప్రవర్తనతో జొకోవిచ్ పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ కరోనా వ్యాక్సిన్ విష యంలో అతని అభిప్రాయాలు ఎక్కువమందికి మింగుడుపడనివి. అవి ఎందుకూ పనికిరావనీ, పైపెచ్చు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనీ అతని నిశ్చితాభిప్రాయం. సైన్సును కూడా జొకోవిచ్ కొట్టిపారేస్తాడు. అయితే ప్రస్తుత వివాదం వ్యాక్సిన్‌పై కాదు. ఈమధ్యే కోవిడ్ వచ్చి తగ్గిందని, కనుక వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటున్నాడు. కానీ కోవిడ్ వచ్చిందని చెబుతున్న తేదీల్లో అతను వివిధ కార్యక్రమాల్లో మాస్క్ సైతం లేకుండా పాల్గొన్నట్టు చూపే వీడియోలున్నాయి. వ్యాక్సిన్ల విషయంలో వ్యతిరేకత ప్రదర్శించేవారు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగానే ఉన్నారు. కానీ జొకోవిచ్ లాంటి సెలబ్రిటీ ఆ మాట అంటే దానికుండే ప్రభావం వేరు. నిజానికి వ్యాక్సిన్ల పని తీరుపై శాస్త్రవేత్తల అంచనాలకూ, వాస్తవ పరిస్థితులకూ పొంతన లేని స్థితి ఉండటం ఎవరూ కాదనలేనిది. వైరస్ కారణంగా తలెత్తే వ్యాధులను ఎదుర్కొనే క్రమంలో ఇది వింతేమీ కాదు. కొరకరాని కొయ్యలాంటి కరోనా సంపూర్ణంగా అర్థం కావడానికి, దాన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి మరికొంత సమయం పట్టినా ఆశ్చర్యంలేదు. మొత్తం జనాభాకు రెండు డోస్‌ల వ్యాక్సిన్లతోపాటు బూస్టర్ డోస్ కూడా అందించిన ఇజ్రాయెల్ వంటి దేశాలను ఈ మహమ్మారి పోకడ అయోమయంలోకి నెట్టింది. తాజాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి జనాభాకు నాలుగో డోస్ కూడా ఇవ్వకతప్పడం లేదు. బూస్టర్ డోస్ సైతం వేయించుకున్నవారిని మాత్రమే అనుమతించిన ప్రదేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్టు పలు దేశాల్లో గుర్తిం చారు. అందుకే మనతోపాటు అనేక దేశాలూ పౌరులకు మరోసారి వ్యాక్సిన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. అయితే జొకోవిచ్ వ్యవహారం పూర్తిగా వ్యాక్సిన్‌కు సంబంధించిందేనా, కాదా అనే అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. వచ్చే మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కావాలని దీన్నొక సమస్యగా మార్చారన్న ఆరోపణలున్నాయి. ఆ సమయానికల్లా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగితే, జొకోవిచ్ విషయంలో కఠినంగా ఉన్న తనకు అది లాభిస్తుందన్న అభిప్రాయం ఉందంటున్నారు. కరోనా నియంత్రణకు అనుసరించే విధానాలు ప్రపంచమంతటా ఒకే మాదిరి లేవు. అలాంటి ప్రొటోకాల్ అవసరమని అనేక దేశాలు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. అయినా పట్టించుకునేవారు లేరు. ఆస్ట్రేలియా ప్రస్తుత వీసా నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. తన పౌరులతోపాటు విదేశాలనుంచి వచ్చేవారి విషయంలోనూ ఆస్ట్రేలియా చాలా నిర్దయగా ఉంటుందన్న పేరుంది. అక్కడ వివిధ రాష్ట్రాల మధ్య కూడా వ్యత్యాసాలున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అడుగుపెట్టినవారు పశ్చిమ ఆస్ట్రేలియాకు లేదా విక్టోరియాకు వెళ్లాలనుకుంటే మధ్యలో ప్రతి రాష్ట్రంలోనూ క్వారంటైన్ పాటించక తప్పదు. ఇలా పాటిస్తూ గమ్యస్థానం చేరాలంటే ఒకటి రెండు నెలలు పడుతుంది. విదేశీయుల సంగతలా ఉంచి వేరే దేశాల్లో చిక్కుబడిన పౌరులు స్వదేశం రావడానికి కూడా అవకాశంలేని స్థితి ఏర్పడింది. అలాగని క్వారంటైన్ కేంద్రాలు సక్రమంగా ఉంటున్నాయన్న నమ్మకం లేదు. మెల్బోర్న్లోని ఒక క్వారంటైన్ కేంద్రం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ప్రధాన కారణమైందని తేల్చారు. ఇప్పుడు జొకోవిచ్‌ను ఆ కేంద్రంలోనే ఉంచారు. తమ పౌరులు సురక్షితంగా ఉండాలని, అందుకు అనువుగా విదేశీయులను నియంత్రించాలని ఆస్ట్రేలియా భావిస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచీకరణ తర్వాత దేశాలమధ్య రాకపోకలు పెరిగిన వర్తమానంలో ఇది అంత సులభమేమీ కాదు. ఆ మాదిరి ఆంక్షలు దేశాల మధ్య అపోహలకూ, అపార్థాలకూ దారితీస్తాయి. అవి ముదిరి వైరంగా కూడా మారొచ్చు. ఇప్పుడు సెర్బియా వైఖరి ఆవిధంగానే ఉంది. జొకోవిచ్ ను అడ్డగించడం ద్వారా తమ ఆత్మాభిమానాన్ని ఆస్ట్రేలియా దెబ్బతీసిందని సెర్బియా భావిస్తోంది. వ్యాక్సిన్ల విషయంలో తలెత్తుతున్న సందే హాలు, వివిధ దేశాల వీసా నిబంధనలపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు మున్ముందు ఇంకా పెరగ వచ్చు. కనుక ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన నిబంధనలు రూపొందించుకోవటం మేలు. -
యూకీ బాంబ్రీ శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరగా... రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో యూకీ బాంబ్రీ 6–4, 6–2తో జావో డొమింగెస్ (పోర్చుగల్)పై నెగ్గగా... రామ్‌కుమార్ 3–6, 5–7తో మార్కోమొరోని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకిత రైనా 0–6, 1–6తో సురెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. -
జొకో కేసు గెలిచాడు... కానీ ఆట ముగిసిపోలేదు
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి 21వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకునేందుకు వచ్చిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ముందుగా ప్రభుత్వంపై కోర్టు కేసు గెలిచాడు. వ్యాక్సినేషన్‌పై వైద్యపరమైన మినహాయింపు ఇచ్చాకే వచ్చిన ఆటగాడి నిలిపివేత, బహిష్కరణ సరి కాదన్న ఫెడరల్ సర్క్యూట్ కోర్టు... తక్షణం నిర్బంధ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంథోని కెల్లీ తన తీర్పులో వెల్లడించారు. మినహాయింపు కోసం జొకోవిచ్ కావాల్సిన పత్రాలన్నీ సమర్పించాడని...ఇంకా ఏం చేయాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆట ముగిసిపోలేదు... అయితే ఇక్కడితో సెర్బియన్ స్టార్‌కు ఊరట లభిం చినట్లేనని సంతోషించడానికి వీల్లేదు. ఫెడరల్ కోర్టు తీర్పుతో డిఫెండింగ్ చాంపియన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆడటం ఇంకా ఖాయం కాలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వీసాను రెండోసారి రద్దు చేసే విశేషాధికారం ప్రభుత్వానికే ఉంది. ఒక వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమపై కోర్టుకెక్కిన జొకోవిచ్పై ప్రతిష్టకు పోయి వీసాను రెండోసారి రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే సెర్బియన్ చేయగలిందేమీ లేదు! -
గ్రాండ్‌స్లామ్ ఆడతాడా లేదా?.. తేలిపోనుంది
మెల్బోర్న్: సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది నేడు తేలిపోనుంది. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సమర్పించిన కారణాలు సహేతుకంగా లేవని అతడిని ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి, వీసాను రద్దు చేశారు. దీనిపై జొకోవిచ్ కోర్టులో కేసు వేయగా... నేడు ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు దీనిని విచారించనుంది. -
జకోవిచ్‌పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా చిచ్చు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్బోర్న్కు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా జకోను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అతని వీసా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, స్పానిష్ బుల్ రఫేల్ నదాల్ జకో తీరును తప్పుపట్టాడు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో రూల్స్ అందరూ తప్పక పాటించాల్సిందేనని, టీకాలు తీసుకోకుండా జకో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. జకో విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును తప్పుపట్టలేమని అన్నాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన నుంచి జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు తీసుకున్నాడు. ఇందుకు నిర్వాహకులు సైతం అంగీకరించారు. అయితే వాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించకపోవడంతో జకోను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ సైతం స్పందించాడు. జకో.. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చూపితే టోర్నీలో పాల్గొంటాడని స్పష్టం చేశాడు. చదవండి: హార్ధిక్ నుంచి ఆశించింది శార్ధూల్ నెరవేరుస్తున్నాడు..! -
జొకోవిచ్‌కు ఊహించని షాక్.. విమానాశ్రయంలోనే నిలిపివేత
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఇక్కడికి వచ్చిన డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఒక్క డోసు తీసుకోకపోయినా... ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా టోర్నీ నిర్వాహకులు అనుమతించారు. అయితే మినహాయింపు కోసం అతను జతచేసిన ధ్రువపత్రాల్లో సహేతుక కారణాలు ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వీసా కోసం ఇవన్నీ స్క్రూటినీ చేశాకే వీసా మంజూరు చేస్తారు. ఇప్పుడు వీసా పొరపాటు కారణంగానే అతన్ని మెల్బోర్న్ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ అంశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కూడా స్పందించారు. టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలుంటేనే వీసాగానీ, ఆడనిచ్చేదిగానీ జరుగుతుందని లేదంటే ఎంతవారైనా తిరుగు పయనం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తం మీద జొకో టైటిల్ వేటలో ఉండేది లేనిది నేడు తేలే అవకాశముంది. -
Australian Open: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూరం
అమెరికా మహిళా టెన్నిస్ స్టార్, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ జనవరిలో జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదు. తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని... తన వైద్య బృందం సలహా మేరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడట్లేదని 40 ఏళ్ల సెరెనా తెలిపింది. గాయంతో ఈ ఏడాది వింబుల్డన్‌లో తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగిన సెరెనా ఆ తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. -
వ్యాక్సిన్ వేసుకున్న ప్లేయర్లకే ఆడే అవకాశం.. జొకోవిచ్‌ను ఉద్దేశించి
Players Must Vaccinated To Play Australian Grand Slam.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆడాలంటే ప్లేయర్లందరూ తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని టోర్నీ చీఫ్ క్రెయిగ్ టిలీ శనివారం స్పష్టం చేశాడు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించని వారిని టోర్నీలో ఆడనిచ్చేది లేదంటూ ఆయన తెలిపారు. క్రెయిగ్ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాలనుకుంటే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నాడు. దాంతో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ ఈసారి టోర్నీలో ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకం టే గతంలో అతడు వ్యాక్సిన్ వేసుకోవడంపై విముఖత వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించాడు. -
'ఆస్ట్రేలియన్ ఓపెన్’పై ఇప్పుడే చెప్పలేను
Novak Djokovic Confuse About Playing Australian Open Grandslam 2022.. ఆస్ట్రేలియాలో కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో వచ్చే ఏడాది టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ తెలిపాడు. తన తదుపరి లక్ష్యం ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించడమేనని 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అయిన జొకోవిచ్ తెలిపాడు. ఈ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తే అత్యధికంగా ఏడుసార్లు ఈ ఘనత సాధించిన పీట్ సంప్రాస్ (అమెరికా) రికార్డును జొకోవిచ్ సమం చేస్తాడు. -
Australian Open 2021: ఒసాకాదే ధమాకా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఆరంభ రౌండ్లలో సంచలనాలు నమోదైనా... చివరకు ఫైనల్లో మాత్రం కొత్త చాంపియన్గానీ, కొత్త చరిత్రగానీ లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. అమెరికన్ బ్రాడీ సంచలనానికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండే సెట్లలో ఆటను ముగించింది. నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం మహిళల సింగిల్స్‌లో తుదిపోరు జరిగింది. కానీ చూసేవాళ్లెవరికీ ఇది ఫైనల్‌గా కనిపించనే లేదు. ఓ సాదాసీదా మ్యాచ్‌లా ఏకపక్షంగా ముగిసింది. జపాన్ స్టార్ మూడో సీడ్ నయోమి ఒసాకా టైటిల్ పోరుకు తన రాకెట్ పవర్‌తో వన్‌సైడ్ వార్‌గా మార్చేసింది. ఫైనల్లో ఆమె 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. గంటా 17 నిమిషాల్లోనే బ్రాడీ పనైపోయింది. ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. జపనీస్ భామ 2019లో కూడా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫటాఫట్‌గా ముగించింది... ఒసాకా బుల్లెట్లా దూసుకొచ్చే ఏస్‌లతో బ్రాడీని చేష్టలుడిగేలా చేసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని ఒక పాయింట్ అయినా గెలువనీయలేదు. మరుసటి గేమ్‌లో బ్రాడీ శ్రమించి సర్వీస్‌ను నిలబెట్టుకుంది. కానీ తర్వాత జపాన్ స్టార్ సర్వీస్‌తో పాటు బ్రేక్ పాయింట్ సాధించింది. బ్రాడీ కూడా తర్వాతి గేముల్లో దీటుగా బదులివ్వడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో ఒసాకా చకచకా రెండు పాయింట్లు సాధించి 41 నిమిషాల్లో 6–4 స్కోరుతో తొలిసెట్‌ను ముగించింది. ఇక రెండో సెట్లో ఒసాకా పదునైన షాట్లకు బదులివ్వలేకపోయిన బ్రాడీ సర్వీస్‌లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఒసాకా 4–0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌నే కోల్పోయే దశలో ఉన్నప్పటికీ అమెరికా స్టార్ కుంగిపోలేదు. ఐదో గేమ్‌లో చక్కని పోరాటం చేసి ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ గేమ్ సుదీర్ఘంగా సాగింది. తర్వాత తన సర్వీస్‌ను కొనసాగించిన బ్రాడీ కేవలం రెండు నిమిషాల్లోపే రెండో పాయింట్ సాధించింది. జాగ్రత్త పడిన ఒసాకా ఏడు, తొమ్మిదో గేముల్ని గెలుపొందడం ద్వారా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. ఓవరాల్‌గా 6 ఏసుల్ని సంధించిన ఒసాకా రెండు సార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 16 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన బ్రాడీ ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేయడంతో మ్యాచ్‌లో చిత్తయింది. మెర్టెన్స్–సబలెంక జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో టైటిల్ మెట్టుపై చతికిల బడిన క్రెజికొవా మిక్స్డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది. జొకోవిచ్ వర్సెస్ మెద్వెదెవ్ ► నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ ►మ.గం.2 నుంచి సోనీలో ప్రత్యక్షప్రసారం రెండేళ్లుగా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ నిలబెట్టుకుంటున్న టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు ‘హ్యాట్రిక్’ వేటకు సిద్ధమయ్యాడు. ఆసీస్ ఓపెన్‌లో ఈ టాప్‌సీడ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఓవరాల్‌గా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో దాదాపు సగం (8) టైటిల్స్ ఇక్కడే గెలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డును, సూపర్ ఫామ్‌లో ఉన్న మేటి ఆటగాడైన నొవాక్‌ను ఓడించడం రష్యన్ స్టార్ మెద్వెదెవ్కు అంత సులువేమీ కాదు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. నాలుగో సీడ్ మెద్వెదెవ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడేదే మొదటిసారి. సెర్బియన్ దిగ్గజానికి ఎందులోనూ సరితూగని ప్రత్యర్థి. అయితే ఫైనల్ చేరేందుకు అతను బాగానే కష్టపడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను, సెమీస్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్లను ఓడించి టైటిల్ బరిలో నిలిచాడు. కానీ కొండంత ప్రత్యర్థి ముందు ఈ కష్టం ఏమాత్రం నిలుస్తుందో మరి... ఎందుకంటే టైటిళ్ల పరంగా చూసినా... ఫైనల్స్ పరంగా చూసినా కూడా నొవాక్... మెద్వెదెవ్ కంటే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా
మెల్బోర్న్: జపనీస్ టెన్నీస్ స్టార్ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బార్డీ(22వ సీడ్)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్) కెరీర్లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్(2018, 2020)టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్(2019,2021) టైటిల్స్ ఉన్నాయి. కాగా నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. 𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉. When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh — #AusOpen (@AustralianOpen) February 20, 2021 -
మెద్వెదెవ్ మొదటిసారి...
మెల్బోర్న్: రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి అర్హత సాధించాడు. ఆదివారం వీరిద్దరి మధ్య పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–2, 7–5తో ఐదోసీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ కానుంది. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న ఈ రష్యన్ స్టార్ ఏనాడు నాలుగోరౌండ్నే అధిగమించలేకపోయాడు. మొత్తం గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన యూఎస్ ఓపెన్ (2020)లో సెమీస్ చేరడమే! ఈ సారి మాత్రం మెల్బోర్న్లో మరో అడుగు ముందుకేశాడు. టైటిల్ దారిన పడ్డాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ ప్రతీ సెట్లోనూ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ను అలవోకగా గెలుచుకున్న నాలుగో సీడ్ ఆటగాడికి చివరి సెట్లో ప్రత్యర్థి సిట్సిపాస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 5–5 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకున్న మెద్వెదెవ్ తర్వాత గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో అధిక్యంలోకి వచ్చాడు. మరుసటి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 7–5 స్కోరుతో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో రష్యన్ స్టార్ ఏస్‌లతో చెలరేగాడు. మూడు సెట్ల ఆటలో అతను 17 ఏస్‌లు సంధించగా... ప్రత్యర్థి 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 21 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదెవ్ 46 విన్నర్లు కొట్టాడు. మరోవైపు సిట్సిపాస్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 09 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. అయితే రష్యన్ ఆటగాడికి ఫైనల్ మాత్రం కొండను ఢీకొట్టడమే! ఎందుకంటే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది టైటిళ్లను ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే గెలవడం మరో విశేషం. ఇంతటి మేరునగధీరుడ్ని తొలిసారి ఫైనల్ చేరిన మెద్వెదెవ్ ఏ మేరకు ఎదుర్కొంటాడో ఆదివారం జరిగే ఫైనల్లో చూడాలి. -
గట్టెక్కిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అమెరికా యువతార, 27వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/1), 6–4, 3–6, 4–6, 6–2తో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో సెట్ తొలి గేమ్ సందర్భంగా జొకోవిచ్ జారి పడ్డాడు. మెడికల్ టైమ్అవుట్ తీసుకొని కోర్టులోనే చికిత్స చేయించుకొని జొకోవిచ్ ఆట కొనసాగించాడు. నొప్పితోనే ఆడిన జొకోవిచ్ మూడో సెట్, నాలుగో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ ఐదో సెట్లోని ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 4–6, 4–6, 6–3, 6–4, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 3–6, 3–6, 3–6తో క్వాలిఫయర్ కరాత్సెవ్ (రష్యా) చేతిలో... 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 5–7, 5–7, 3–6తో ఆలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయారు. సెరెనా ముందుకు... మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 6–2తో పొటపోవా (రష్యా)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–3తో కుదర్మెతోవా (రష్యా)పై, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో ఆన్స్ జబుయెర్ (ట్యూనిసియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో ఆన్ లీ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సెరెనా ‘జూ’కు... జొకోవిచ్ పార్క్‌కు...
అడిలైడ్: 14 రోజుల క్వారంటైన్... మరో చోట అయితే మామూలుగా గడిచిపోయేదేమో! కానీ కఠిన ఆంక్షలు ఉన్న ఆస్ట్రేలియాలో అదంత సులువు కాదు. ఇక ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆటగాళ్ల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చి క్వారంటైన్లో ఉన్న టెన్నిస్ స్టార్లు తమ రెండు వారాల క్వారంటైన్ ముగియడంతో ఒక్కసారిగా స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు. మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తన మూడేళ్లు కూతురు ఒలింపియాతో కలిసి ‘జూ’కు వెళ్లి సరదాగా గడిపింది. ‘ఒక్క గదిలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా కష్టం. అయితే పాపతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. ఇప్పుడు బయటకు రావడం సంతోషంగా ఉంది. అందుకే క్వారంటైన్ ముగియగానే జూకు వెళ్లొచ్చాం’ అని సెరెనా చెప్పింది. వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ క్వారంటైన్ ముగియగానే స్థానిక పార్క్‌లో చెప్పులు లేకుండా నడిచి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ‘ఇన్ని రోజులుగా నాకు అవకాశం రాని పని చేయాలననుకున్నా. ఇప్పుడు ఇలా పచ్చగడ్డిపై పాదాలు పెట్టగానే హాయిగా అనిపించింది’ అని జొకోవిచ్ అన్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో నయోమి ఒసాకాపై సెరెనా విలియమ్స్, యాష్లే బార్టీపై సిమోనా హలెప్, డొమినిక్ థీమ్‌పై రాఫెల్ నాదల్ విజయం సాధించారు. జన్నిక్ సిన్నర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్లో ఫిలిప్ క్రనోవిక్ తలపడగా... రెండో సెట్లో క్రనోవిక్ స్థానంలో జొకోవిచ్ వచ్చి ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో క్రనోవిక్–జొకోవిచ్ గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్లో ఫిబ్రవరి 8న మొదలవుతుంది. -
గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్బోర్న్కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రాక్టీస్‌కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్‌గా మార్చుకుంది. బీరువాకు బంతి కొడుతూ షాట్లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
కేవలం 2500 మందికే అనుమతి
మెల్బోర్న్: కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వహణ తీరుతెన్నులపై ఇప్పటి నుంచే నిర్వాహకులు దృష్టి సారించారు. పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో, పరిమిత సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతించి టోర్నీ జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సీజన్ యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలు ముగిస్తే తదుపరి సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెగ్ టిలీ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి జరిగే ఈ టోర్నీలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రేక్షకులతో కలిపి కేవలం 2500 మందిని మాత్రమే అనుమతించే అవకాశముందని తెలిపారు. యూఎస్, ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనడం అనేది ఆసీస్ ఆటగాళ్ల వ్యక్తిగత విషయమన్న ఆయన వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు అంత సులువుగా దేశం దాటి వెళ్లలేరని, క్వారంటైన్ నిబంధనలతో ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పుడుతుందని క్రెగ్ సూచించారు. -
ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన ఫెడరర్
ప్రత్యర్థి అనుభవలేమి... సులువుగా ఓటమిని అంగీకరించకూడదన్న నైజం... కాస్తంత అదృష్టం... వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మళ్లీ బతికిపోయాడు. తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఈ మాజీ చాంపియన్ గట్టెక్కాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్‌తో మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ ఐదు సెట్లలో విజయాన్ని అందుకొని 15వసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో అడ్డంకిని అధిగమించాడు. మంగళవారం 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 2–6, 2–6, 7–6 (10/8), 6–3తో అన్‌సీడెడ్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై తీవ్రంగా చెమటోడ్చి గెలుపొందాడు. ఈ టోరీ్న లోని మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్... క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. తన 22 ఏళ్ల కెరీర్లో ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2003లో సిన్సినాటి టోర్నీలో స్కాట్ డ్రెపర్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనూ ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్ గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో తలపడతాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)తో వావ్రింకా (స్విట్జర్లాండ్); ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆడతారు. సాండ్‌గ్రెన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ నాలుగో సెట్లో స్కోరు 4–5 వద్ద తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను... అనంతరం ఇదే సెట్లోని టైబ్రేక్‌లో 3–6 వద్ద మూడు మ్యాచ్ పాయింట్లను... 6–7 వద్ద మరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. స్కోరు 8–8తో సమంగా ఉన్నపుడు సాండ్‌గ్రెన్ వరుసగా రెండు తప్పిదాలు చేయడంతో చివరకు ఫెడరర్ టైబ్రేక్‌ను 10–8తో గెలిచి సెట్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం ఐదో సెట్లో సాండ్‌గ్రెన్ ఆటతీరుపై ప్రభావం చూపింది. చివరి సెట్లో సాండ్‌గ్రెన్ పూర్తిగా డీలా పడ్డాడు. ఆరో గేమ్‌లో సాండ్‌గ్రెన్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చివరకు 6–3తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్నాడు. ►ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య 102. తాజా గెలుపుతో ఫెడరర్ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును (వింబుల్డన్‌లో 101 విజయాలు) సవరించాడు. ►ఓవరాల్‌గా ఫెడరర్ తన కెరీర్లో 46వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్–15; వింబుల్డన్–13; ఫ్రెంచ్ ఓపెన్–8; యూఎస్ ఓపెన్–10 సార్లు) సెమీఫైనల్ చేరాడు. ►కెన్ రోజ్‌వెల్ (42 ఏళ్ల 68 రోజులు–1977లో) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (38 ఏళ్ల 178 రోజులు) గుర్తింపు పొందాడు. జొకోవిచ్ ఎనిమిదోసారి... మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (7/1)తో 32వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 26–23తో ఆధిక్యంలో ఉన్నాడు. తొలిసారి సెమీస్‌లో బార్టీ, సోఫియా మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్టీ 7–6 (8/6), 6–2తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై... సోఫియా 6–4, 6–4తో ఆన్స్ జెబూర్ (ట్యూనిషియ)ఫై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్–ఒస్టాపెంకో జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పేస్–ఒస్టాపెంకో ద్వయం 2–6, 5–7తో జేమీ ముర్రే (బ్రిటన్)–బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఆడాలంటే ఇంకో రెండు నెలలు ఆగాలి
తాను మళ్లీ రాకెట్ పట్టేందుకు కనీసం రెండు నెలలు సమయం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సానియా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఆటకు దూరమవడం... గత అక్టోబర్ నుంచి విశ్రాంతికే పరిమితమవడం తనకు అసహనం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. -
సాకేత్ శుభారంభం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 6-1తో ప్రపంచ 206వ ర్యాంకర్, భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను అలవోకగా ఓడించాడు. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు రామ్‌కుమార్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. శుక్రవారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 261వ ర్యాంకర్ లొరెంజో గిస్టినో (ఇటలీ)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-2, 1-6, 4-6తో ఓడిపోయాడు. తొలి రోజు ఎండ తీవ్రత (41.6 డిగ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సాయంత్రం వేళలో నిర్వహించారు.