ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్ క్రీడాకారిణి.. మాజీ వరల్డ్ నెంబర్‌వన్ గార్బిన్ ముగురజా తొలిరౌండ్‌లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముగురజా.. బెల్జియంకు చెందిన 26వ సీడ్ ఎలిస్‌మార్టెన్స్ చేతిలో 3-6, 7-6(3), 6-1 తేడాతో ఓటమి పాలైంది.
తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న ముగురజా రెండో సెట్‌లో మాత్రం తడబడింది. ఎలిస్ మార్టెన్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో మార్టెన్ విజయం సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడోసెట్‌లో మాజీ నెంబర్‌వన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1-6 తేడాతో ఎలిస్ మార్టెన్ సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.
ఇక ముగురజా గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌ను గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను దక్కించుకుంది. ఇక 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచింది.
Comeback complete ✅@elise_mertens holds off Muguruza 3-6 7-6(3) 6-1.#AusOpen • #AO2023 pic.twitter.com/prPvmXPxc2
— #AusOpen (@AustralianOpen) January 17, 2023
ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే.. నాలుగో సీడ్ కరోలిన్ గార్సియా కెనడాకు చెందిన అన్‌సీడెడ్ కాథరిన్ సెబోవ్‌పై 6-3, 6-0తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక సొంతగడ్డపై ఫెవరెట్‌గా కింబర్లీ బిర్రెల్.. 31వ సీడ్ కాయా కనేపిని 7-6(4), 6-1తో ఓడించి రెండోరౌండ్‌లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో డొమినిక్ థీమ్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో 6-3, 6-4,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment