Garbine Muguruza
-
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్ క్రీడాకారిణి.. మాజీ వరల్డ్ నెంబర్‌వన్ గార్బిన్ ముగురజా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముగురజా.. బెల్జియంకు చెందిన 26వ సీడ్ ఎలిస్మార్టెన్స్ చేతిలో 3-6, 7-6(3), 6-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న ముగురజా రెండో సెట్లో మాత్రం తడబడింది. ఎలిస్ మార్టెన్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో మార్టెన్ విజయం సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడోసెట్లో మాజీ నెంబర్‌వన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1-6 తేడాతో ఎలిస్ మార్టెన్ సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇక ముగురజా గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌ను గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను దక్కించుకుంది. ఇక 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచింది. Comeback complete ✅@elise_mertens holds off Muguruza 3-6 7-6(3) 6-1.#AusOpen • #AO2023 pic.twitter.com/prPvmXPxc2 — #AusOpen (@AustralianOpen) January 17, 2023 ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే.. నాలుగో సీడ్ కరోలిన్ గార్సియా కెనడాకు చెందిన అన్‌సీడెడ్ కాథరిన్ సెబోవ్‌పై 6-3, 6-0తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక సొంతగడ్డపై ఫెవరెట్‌గా కింబర్లీ బిర్రెల్.. 31వ సీడ్ కాయా కనేపిని 7-6(4), 6-1తో ఓడించి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో డొమినిక్ థీమ్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో 6-3, 6-4,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. -
డిఫెండింగ్ చాంపియన్‌కు చుక్కెదురు
లండన్: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజాకు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ముగురుజా 7-5, 2-6, 1-6 తేడాతో బెల్జియంకు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి వాన్ వుయ్‌త్వాంక్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్‌ను గెలిచిన ముగురుజా.. ఆపై రెండు సెట్లలో దారుణంగా వైఫల్యం చెందడంతో ఓటమి తప్పలేదు. మరొకవైపు సంచలన విజయాన్ని నమోదు చేసిన వుయ్‌త్వాంక్... తన కెరీర్లోనే తొలిసారి టాప్-10 ప్రత్యర్థిపై గెలిచిన ఘనతను సైతం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వుయ్‌త్వాంక్ నాలుగు ఏస్‌లు సంధించగా, ముగురుజా మూడు ఏస్‌లకు మాత్రమే పరిమితమైంది. మరొకవైపు ముగురుజా 3 డబుల్ ఫాల్ట్స్ చేయగా,, వుయ్త్వాంక్లు రెండు చేసింది. ఇక ఏడు బ్రేక్ పాయింట్లను వుయ్‌త్వాంక్ గెలవగా, నాలుగు బ్రేక్ పాయింట్లను ముగురుజా గెలిచింది. మొత్తంగా 91 పాయింట్లను వుయ్‌త్వాంక్ గెలిస్తే, ముగురుజా 75 పాయింట్లను మాత్రమే సాధించి ఓటమి పాలైంది. -
హై హై హలెప్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్ సాధించే దిశగా మరో అడుగు వేసింది. మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో బుధవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–7 (2/7), 6–3, 6–2తో విజయం సాధించింది. 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో హలెప్ తొలి సెట్లో 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకుంది. అయితే టైబ్రేక్‌లో 12వ సీడ్ కెర్బర్ పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయినా హలెప్ విజయంపై ఆశలు వదులుకోలేదు. లోపాలను సరిదిద్దుకొని రెండుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ హలెప్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే ఊపులో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ‘తొలి సెట్ చేజార్చుకున్నా పట్టువదలకుండా పోరాడాలని నిశ్చయించుకున్నాను. తొలి సెట్ ఆరంభంలో ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా వ్యూహాల్లో మార్పు చేసి ఫలితాన్ని సాధించాను’ అని హలెప్ వ్యాఖ్యానించింది. షరపోవా చిత్తు... మరో క్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ధాటికి మాజీ విజేత, రష్యా స్టార్ షరపోవా హడలిపోయింది. ఆరేళ్ల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ముగురుజా 6–2, 6–1తో 28వ సీడ్ షరపోవాను చిత్తుగా ఓడించి హలెప్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 3–6, 0–6తో అజరెంకా (బెలారస్) చేతిలో ఓటమి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో షరపోవా ఏకపక్ష ఓటమిని చవిచూడటం ఇదే తొలిసారి. సెమీస్‌లో ముగురుజాపై గెలిస్తే హలెప్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంటుంది. ఒకవేళ హలెప్ ఓడిపోతే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ముగురుజా ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మరోవైపు హలెప్ రెండు సెట్లను చేజార్చుకుంది. నాదల్ మ్యాచ్ నేటికి వాయిదా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో గురువారానికి వాయిదా వేశారు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తొలి సెట్‌ను 4–6తో కోల్పోయి... రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్నాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డెల్ పొట్రో (అర్జెంటీనా) మధ్య మ్యాచ్‌లో ఇద్దరూ తొలి సెట్లో 6–6 పాయింట్ల వద్ద... టైబ్రేక్‌లో 5–5తో సమంగా ఉన్నారు. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. -
ఫ్రెంచ్ ఓపెన్: షరపోవా ‘ఖేల్’ ఖతం
పారిస్ : ఎన్నో ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్, మాజీ చాంపియన్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మూడో సీడ్, స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-2,6-1 తేడాతో పరాజయం పాలైంది. వరుస సెట్లలో షరపోవాపై ముగురుజా సునాయస విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ ఆడకుండానే షరపోవా క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన విషయం తెలిసింది. హలెప్ హవా.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ తన హవా కొనసాగిస్తోంది. జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-2(2/7), 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక హలెప్ సెమీ ఫైనల్లో స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో తలపడనుంది. -
ముగురుజాకు షాక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపరకొనసాగుతోంది. టోర్నీ నాలుగో రోజు గురువారం టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులురెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ గార్బిన్ ముగురుజా, తొమ్మిదో సీడ్ జొహనా కొంటా... పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్... తొమ్మిదో సీడ్, మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా రెండో రౌండ్లోనే ఓటమి చవిచూశారు. మెల్బోర్న్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన స్పెయిన్ స్టార్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజాకు నిరాశ ఎదురైంది. గతేడాది వింబుల్డన్ టైటిల్‌ను, 2016లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన ముగురుజా సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 88వ ర్యాంకర్, డబుల్స్ స్పెషలిస్ట్ సెయి సు వె (చైనీస్ తైపీ) అద్భుత ఆటతీరును ప్రదర్శించి 7–6 (7/1), 6–4తో ముగురుజాను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా ఎండ వేడిమికి తట్టుకోలేక తొలి సెట్లో మెడికల్ టైమ్ అవుట్ కూడా తీసుకుంది. తొలి సెట్లో ఒకదశలో 2–5తో వెనుకబడిన ముగురుజా ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్‌లో సెయి సు వె పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సెయి సు వె తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో బెర్నార్డా పెరా (అమెరికా) 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై... నవోమి ఒసాకా (జపాన్) 7–6 (7/4), 6–2తో 16వ సీడ్ వెస్నినా (రష్యా)పై, మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) 6–1, 7–6 (7/4)తో 14వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)పై గెలుపొందారు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హలెప్ 6–2, 6–2తో యుజిని బుషార్డ్ (కెనడా)పై, 21వ సీడ్ కెర్బర్ 6–4, 6–1తో వెకిచ్ (క్రొయేషియా)పై, ప్లిస్కోవా 6–1, 6–1తో హదాద్ మైయ (బ్రెజిల్)పై, గార్సియా 6–7 (3/7), 6–2, 8–6తో వండ్రూసోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించారు. ఫెడరర్ జోరు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఫెడరర్ 6–4, 6–4, 7–6 (7/4)తో స్ట్రఫ్ (జర్మనీ)పై, జొకోవిచ్ 4–6, 6–3, 6–1, 6–3తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 4–6, 6–3తో గొజోజిక్ (జర్మనీ)పై, థీమ్ 6–7 (6/8), 3–6, 6–3, 6–2, 6–3తో కుద్లా (అమెరికా)పై గెలుపొందారు. మరోవైపు 2014 చాంపియన్, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 2–6, 1–6, 4–6తో టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) చేతిలో... ఏడో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 1–6, 6–7 (4/7) బెనెట్యూ (ఫ్రాన్స్) చేతిలో... 13వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 4–6, 6–7 (6/8), 6–4, 2–6తో మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి) చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు. భారత ఆటగాళ్ల శుభారంభం పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో పేస్–పురవ్ రాజా (భారత్) జంట 6–2, 6–3తో బాసిలాష్విలి (జార్జియా)–హైదర్ (ఆస్ట్రియా) జోడీపై... బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 6–2, 7–6 (7/5)తో పోస్పిసిల్ (కెనడా)–హ్యారీసన్ (అమెరికా) జంటపై... దివిజ్–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–4తో ట్రయెస్కీ (సెర్బియా)–కోపిల్ (రొమేనియా) ద్వయంపై విజయం సాధించాయి. -
కోర్టులోనే కుప్పకూలి.. నిష్క్రమించింది
బ్రిస్బేన్: వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా అనూహ్య పరిణామాల నడుమ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. తీవ్ర వేడిమిని తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే ఆమె కోర్టులో కుప్పకూలిపోయారు. మంగళవారం సెర్బియా క్రీడాకారిణి అలెక్జాండ్రా క్రునిక్ తో రెండో రౌండ్ లో గార్బైన్ తలపడింది. మ్యాచ్ మధ్యలో వేడిమి తట్టుకోలేక ఆమె అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమెకు చికిత్స అందజేయగా.. మళ్లీ మ్యాచ్ కొనసాగింది. తర్వాత 2-1 తో సెట్స్ గెలుచుకున్న గార్బైన్.. మూడో సెట్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో మళ్లీ కుప్పకూలిపోయింది. ఈసారి కోలుకునే అవకాశాలు కనిపించకపోవటంతో ఆమె ఓటమిని అంగీకరించింది. దీంతో క్రునిక్ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్ ఫైనల్ లో క్రునిక్ సొరానా కిర్‌స్టియా లేక అనస్తాసిజా సెవాస్తోవాలో ఎవరో ఒకరితో తలపడనుంది. ఇక ప్రపంచ ర్యాంక్ 2 క్రీడాకారిణి అయిన ముగురుజా టోర్నీ నుంచి నిష్క్రమించటంతో.. నంబర్-1 ర్యాంకు సాధించాలన్న ఆమె కల క్లిష్టతరంగా మారింది. త్వరలో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఉన్న నేపథ్యంలో.. రిస్క్ చేసే ఉద్దేశం లేకనే వైదొలగినట్లు ముగురుజా ప్రకటించారు. కాగా, జనవరి 15 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. -
ముగురుజా మెరిసె...
♦ తొలి రౌండ్లో అలవోక విజయం ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ నేటి మ్యాచ్‌లు రాత్రి గం.8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం సెరెనా విలియమ్స్, అజరెంకా లాంటి స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో ఫేవరెట్‌గా మారిన మూడో సీడ్ గార్బిన్ ముగురుజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. గతంలో ఈ టోర్నీలో నాలుగుసార్లు ఆడినా, రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయిన ఈ స్పెయిన్ స్టార్ ఈసారి మాత్రం ఏకంగా టైటిల్‌పైనే గురి పెట్టింది.ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకొని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముగురుజా తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించి టైటిల్ వేటను మొదలుపెట్టింది. న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులు ముగురుజా (స్పెయిన్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), కరోలినా గార్సియా (ఫ్రాన్స్) బోణీ చేశారు. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా 6–0, 6–3తో వర్వారా లెప్చెంకో (అమెరికా)ను ఓడించగా... 13వ సీడ్ క్విటోవా 7–5, 7–5తో మాజీ నంబర్‌వన్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా)పై, 18వ సీడ్ గార్సియా 6–0, 6–1తో మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. లెప్చెంకోతో జరిగిన మ్యాచ్‌లో ముగురుజాకు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. యూఎస్ ఓపెన్‌లో అంతగా మెరుగైన రికార్డు లేని ముగురుజా ఈసారి మాత్రం ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉంది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ముగురుజా కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా కోల్పోని ఈ స్పెయిన్ స్టార్ రెండో సెట్లో మాత్రం తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకుంది. 16 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్దకు 17సార్లు దూసుకొచ్చి 15సార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న క్విటోవా ఈ టోర్నీలో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మాజీ నంబర్‌వన్ జంకోవిచ్తో జరిగిన పోరులో క్విటోవా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి గెలిచింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 28 విన్నర్స్ కొట్టిన ఈ చెక్ స్టార్ 31 అనవసర తప్పిదాలు చేసింది. అయితే కీలకదశలో జంకోవిచ్ సర్వీస్‌లను బ్రేక్ చేయడంద్వారా క్విటోవా మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్ (అమెరికా) 7–5, 7–5తో 32వ సీడ్ లారెన్ డేవిస్ (అమెరికా)పై, క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో ఎగుచి (జపాన్)పై, అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) 6–4, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మగ్దలీనా రిబరికోవా (స్లొవేకియా) 6–3, 6–4తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 32వ సీడ్ రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) 6–3, 7–5, 6–3తో హాస్‌ను బోల్తా కొట్టించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 12వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్) 6–3, 6–2, 7–6 (7/5)తో ఇవాన్ కింగ్ (అమెరికా)పై నెగ్గగా... కామెరూన్ నోరి (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో ఆధిక్యంలో ఉండగా అతని ప్రత్యర్థి తుర్సునోవ్ గాయం కారణంగా వైదొలిగాడు. నాలుగో సీడ్‌గా సానియా జంట మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జోడీకి నాలుగో సీడ్ లభించింది. తొలి రౌండ్లో ఈ జంట పెట్రా మార్టిక్–డోనా వెకిక్ (క్రొయేషియా)లతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జోడీకి పదో సీడింగ్ దక్కింది. తొలి రౌండ్లో ఈ ద్వయం బ్రాడ్లీ క్లాన్–స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంటతో ఆడుతుంది. -
సెరెనాపై ముగురుజా సంచలన విజయం
-
క్వార్టర్స్ కు చేరిన ముకుర్జా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాల్గో సీడ్ గార్బైన్ ముకుర్జా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో ముకుర్జా 6-3, 6-4 తేడాతో స్వితోలినా కుజ్నెత్సోవాపై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన ముకుర్జా.. రెండో సెట్లో మాత్రం స్వితోలినా నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయితే హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ను ముకుర్జా గెలుచుకుని క్వార్టర్స్ కు చేరింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడోసారి క్వార్టర్స్‌కు చేరిన క్రీడాకారిణిగా నిలిచింది. -
క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ 2-6, 6-3, 6-2 తేడాతో గార్బైన్ ముకుర్జాపై విజయం సాధించింది. తొలి సెట్ ను కోల్పోయిన సెరెనా వరుస రెండు సెట్ లను అవలీలగా గెలుచుకుని క్వార్టర్స్ కు చేరింది. ఈ మ్యాచ్ లో 17 ఏస్ లు సంధించిన సెరెనా తిరుగులేదని ఆధిపత్యాన్ని కనబరించింది.