Tennis Champ Garbine Muguruza Gets Engaged To Fan Who Once Asked Her For Selfie - Sakshi
Sakshi News home page

#GarbineMuguruza: సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్‌ స్టార్‌

Published Thu, Jun 1 2023 9:03 AM | Last Updated on Thu, Jun 1 2023 11:38 AM

Tennis Star-Garbine Muguruza Gets Engaged To Fan Who Asked For Selfie - Sakshi

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ గార్బిన్‌ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది.

గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్‌ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. అనంత‌రం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

సెల్ఫీతో మొదలైన ప్రేమకథ..
ముగురుజా, ఆర్థర్‌ బోర్జెస్‌ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ‌ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొద‌టిసారి చూసింద‌ట‌. ''నేను బ‌స చేసిన‌ హోట‌ల్ సెంట్రల్‌ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒక‌రోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామ‌ని బ‌య‌ట‌కు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొద‌టిసారి చూశాను. న‌న్ను గ‌మ‌నించిన అత‌ను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మ‌న‌సులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమ‌క‌థ మొద‌లైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది.

ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల త‌ర్వాత  బోర్జెస్‌ ముగురుజాకు ప్రపోజ్‌ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంట‌నే బోర్జెస్‌ ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలా బోర్జెస్‌ త‌న అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడ‌బోతున్నాడు. ముగురుజా ఇప్పటివ‌ర‌కు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్‌ చాంపియ‌న్‌గా నిలిచింది. 15 వ‌రల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది.

చదవండి: 'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement