fan
-
కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. -
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
పుష్పరాజ్ క్రేజ్.. అభిమాని కళకు ఫిదా అయిన బన్నీ!
ఇప్పుడంతా పుష్ప-2 ఫీవర్ నడుస్తోంది. విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండగానే హడావుడి మొదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్.ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నారు. దివ్యాండైనప్పటికీ పుష్పరాజ్ స్టైల్లో అల్లు అర్జున్ బొమ్మను గీశారు. తన కాళ్లతో అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ..'అల్లు అర్జున్ సార్ దయేచేసి నా కళను చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీశాను. మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉంది సార్. ఇట్లు ధీరజ్ సాత్విల్కర్' అంటూ రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. నా గుండెను టచ్ చేశావ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చారు బన్నీ.బన్నీ రిప్లై ఇవ్వడంతో ధీరజ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం సూపర్ ఆర్ట్ అంటూ ధీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Heart Touching . Thank you 🖤— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
ఖరీదైన అభిమానం.. సింగర్‌కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్!
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.బెంగాల్‌కు చెందిన ఇండియన్ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్ ఇటీవల యూఎస్‌లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ మికా సింగ్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..మికా సింగ్‌కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్ బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బన్నీకి అభిమాని రిక్వెస్ట్.. వెంటనే రిప్లై ఇచ్చేశాడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ అయిపోయింది. మరో కొద్ది రోజుల్లో థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. డిసెంబర్ 6న థియేటర్లతో పాటు పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ప్రస్తుతం పుష్ప టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఈ సంగతి పక్కన పెడితే బన్నీకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ఓ అభిమాని ఏకంగా యూపీ నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. బన్నీని కలిసి ఆనందం వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్)తాజాగా ఓ అభిమాని తన బర్త్ డే కావడంతో ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ పెట్టాడు. మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని.. ఇవాళ నా పుట్టినరోజు.. మీ నుంచి విషెస్ వస్తే నాకదే సంతోషం అంటూ అల్లు అర్జున్ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన బన్నీ వెంటనే అతనికి రిప్లై ఇచ్చాడు. హ్యాపీ బర్త్ డే అంటూ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది చూసిన అతను లవ్ యూ అన్న.. థ్యాంక్యూ సో మంచ్ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా పాన్ ఇండియా హీరో ఫ్యాన్ ట్వీట్‌కు స్పందించడం అంటే బన్నీ సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Happy Birthday 🖤— Allu Arjun (@alluarjun) October 24, 2024 -
అల్లు అర్జున్ కోసం అభిమాని సాహసం
-
పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సైతం అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం. ఇక విదేశాల్లోనే అంత క్రేజ్ ఉంటే మనదేశంలో ఏ రేంజ్లో ఉంటుందో చూస్తేనే అర్థమవుతోంది.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్ వాసి.దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. పుష్ప-2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని ఐకాన్ స్టార్ అతనితో అన్నారు. తనను కలిసిన అభిమానికి అల్లు అర్జున్ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది."DEMI GOD" for his fans. Apt 🙏🙏🙏A fan from north India uttarpradesh, aligarh city came to meet his hero on cycle.🙏He is trying to meet from last few days Finally A fan moment for him! ♥️LOVE YOU ICON @alluarjun 🙌 pic.twitter.com/WJdogwJxWQ— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) October 16, 2024 -
‘ఆయన దేవుడు’ వీరాభిమాని గుండెలపై శాశ్వతంగా రతన్ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు. ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితడు వైద్యం కోసం ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్ ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.దీంతో ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు. ఈ వీడియో లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mahesh Chavan (@themustache_tattoo) -
జైలులో దర్శన్.. కలిసేందుకు వచ్చిన అభిమానికి షాక్!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు."మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు. -
పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని
హుబ్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నడ వెండి తెరపై విరాజిల్లడంతో పాటు తన ఎనలేని సామాజిక సేవతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానంతోనే హావేరి జిల్లాలో ఆయన పేరిట నిలువెత్తు విగ్రహంతో కూడిన ఆలయాన్ని గురువారం ఆయన సతీమణి అశ్విని ప్రారంభించారు. హావేరి జిల్లాలోని యలగట్టి గ్రామంలో పునీత్ వీరాభిమాని నిర్మించిన ఈ ఆలయంలో గురువారం నుంచి పూజలు ప్రారంభంఅయ్యాయి. ప్రకాష్ అనే అభిమాని తన ఇంటి ఎదురుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. జనం మెచ్చిన పునీత్‌లాంటి నటులతో తమ పిల్లల నామకరణం చేయడం ఆనవాయితీ. పునీత్‌ను కన్నడిగులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో అభిమాని ప్రకాష్, ఆయన భార్య దీపాల బిడ్డకు అపేక్ష అనే పేరుని అశ్విని పెట్టారు. అప్పు సేవలను సహధర్మచారిణి అశ్విని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాని ప్రకాష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు.ఇలాంటి అభిమాని ఉండటం మా పుణ్యంఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రకాష్ అనే అభిమాని సొంత స్థలంలో అప్పు ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి అభిమాని ఉండటం తమ పుణ్యం, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె భావోగ్వేగానికి గురయ్యారు. అభిమాని సొంత డబ్బులతో సుమారు రూ.10 లక్షలు వ్యయం చేసి ఆలయాన్ని నిర్మించారు. పూజల ప్రారంభం సందర్భంగా వివిధ కళా బృందాలు, కుంభమేళా తదితర విశేష కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా పునీత్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చి తమ అభిమాన నటుడిని స్మరించుకున్నారు. అనంతరం స్కూల్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మఠాధిపతులు పాల్గొన్నారు. కాగా చివరి విశేషంగా అన్నదానం కూడా నెరవేర్చారు. -
మా అబ్బాయిని బ్రతికించండి
-
మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. Padma Vibhushan Chiranjeevi at Airport pic.twitter.com/sTvtP2qW3R— Milagro Movies (@MilagroMovies) July 30, 2024 -
‘మిస్టరీ గర్ల్’తో హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ
ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీ నేతను మెచ్చుకుంటే అది ఆసక్తికరంగా మారుతుంది. దీనివెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సరిగ్గా ఇటువంటిదే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాజస్థాన్‌లోని చురు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన రాహుల్ కశ్వాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత వసుంధరా రాజేకు వీరాభిమానినని పేర్కొన్నారు. ఆమెను తాను నూటికి నూరు శాతం అభిమానిస్తానని అన్నారు. బీజేపీని వీడిన తర్వాత కూడా తనకు వసుంధర రాజేపై పూర్తి గౌరవం ఉందని అన్నారు. రాజస్థాన్‌లో వసుంధరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె అద్భుతమైన నాయకురాలని పేర్కొన్నారు.తామంతా వసుంధర నాయకత్వంలో ముందుకు సాగామని, ఆమె రాష్ట్రానికి పలువురు సమర్థవంతమైన నేతలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాము వేర్వేరు పార్టీలలో ఉన్నామని, ప్రతిపక్ష ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని రాహుల్ తెలిపారు. ఇదిలావుండగా రాహుల్ బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన పలువురి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారారని ఆరోపించారు.తనకు లోక్‌సభ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ రాకపోవడానికి రాజేంద్రే కారణమని ఆరోపించారు. రాథోడ్ మొండి వైఖరికి వ్యతిరేకంగా తాను గళం విప్పానన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ కశ్వాన్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తదనంతరం చురు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. -
మోదీ మూడోసారి ప్రధాని కాగానే..
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన వెంటనే జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన వ్యక్తి తన అవతారాన్ని మార్చుకున్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పొడవాటి, జుట్టు గడ్డంను కత్తిరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌లోని గుమ్లాలో గల సిసాయి బ్లాక్‌లో నివసిస్తున్న ముఖేష్ శ్రీవాస్తవ డేవిడ్ ప్రధాని మోదీకి వీరాభిమాని. దీంతో ఆయన పలు సందర్భాల్లో మోదీ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాకనే తన జుట్టు, గడ్డం కత్తిరించుకుంటానని ప్రకటించాడు. మోదీ మూడోమారు ప్రధానిగా ఎంపికకాని పక్షంలో తన జీవితాంతం ఇలా గడ్డంతోనే ఉంటానని చెప్పాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల ముందు ప్రమాణం కూడా చేశాడు.నాటి సందర్భం గురించి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఒక రోజు తాను మార్కెట్లో ఉన్నప్పుడు, 2024లో నరేంద్ర మోదీ మరోమారు ప్రధాని కాలేరని ప్రతిపక్షానికి చెందిన కొందరు స్నేహితులు అన్నారని, అప్పుడు తాను వారితో మోదీ మూడోసారి ప్రధాని కాకపోతే తాను జీవితాంతం షేవింగ్ చేసుకోనని ప్రమాణం చేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తన కల నెరవేరిందని, మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఇప్పుడు తాను క్షవరం చేయించుకుంటానని డేవిడ్ తెలిపాడు. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
భానుడి భగభగలు: ట్రాన్స్ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అయితే వేడి కారణంగా ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ వేడెక్కితే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే ట్రిప్పింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహించడానికి వాటి మందు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. -
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024 -
చిన్న ఉపాయమే ఈ సోలార్ ఫ్యాన్.. నాన్స్టాస్ వ్యాపారం!
ఎండ వేడిని భరించాలంటే ఎవరికీ సాహసపడదు. ఆ వేడినుంచి తప్పుకోడానికే శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వ్యాపారాలు చేసేవాళ్లు, ఎండలో కష్టించి పనిచేసేవాళ్లు తప్పకుండా ఏదో ఒక ఉపాయమైతే చేస్తారు. అలాంటి ప్రయత్నమే.. ఓ హహిళ చేసింది. అదేంటో చూద్దాం. ఎండ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు పండ్లు అమ్ముతున్న ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. పైన గొడుగు ఉన్నా ఉక్కపోతనుంచి కాపాడుకునేందుకు బుల్లిఫ్యాన్ తెచ్చుకుంది.అందుకు సోలార్‌ప్యానెల్ తెచ్చి పక్కనే పెట్టి దానినుంచి వచ్చే విద్యుత్‌తో ఆ ఫ్యాన్ గిరాగిరా తిరుగుతుండగా చల్లని గాలిలో తన వ్యాపారం చేసుకుంటోంది. ఈ దృశ్యం జనగామ జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద శుక్రవారం కనిపించగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – ఫొటో: సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇవాళ్టి నుంచి బాలయ్య బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్‌లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త! -
IPL 2024 SRH Vs MI: ఆరెంజ్ఆర్మీతో సన్‌రైజర్స్.. బెస్ట్ ఫొటోలు
-
Summer: సీలింగ్ ఫ్యాన్.. క్లీనింగ్ ఇలా...!
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు. మరో పద్ధతి... పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్‌ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్‌గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి. ఇవి చదవండి: ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..! -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్‌లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
షర్మిలను నిలదీసిన వైఎస్సార్ అభిమాని
-
నాకు జీవితాన్ని ఇచ్చిన జగన్ కోసం జీవితాంతం నిలబడతా..!
-
మహానేతపై తరగని అభిమానం
బంగారుపాళెం(చిత్తూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రజాభిమానం తరగలేదు. బంగారుపాళెం మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన జిల్లా వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రఘుపతిరాజు వైఎస్సార్ వీరాభిమాని. చనిపోయిన తన తల్లిదండ్రుల చిత్ర పటాలతో పాటు తాను అమితంగా అభిమానించే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటం ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు పెట్టి పూజలు నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు. బంధువులు, స్నేహితులను పిలిచి మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. -
అభిమాని కలకలం
అహ్మదాబాద్: రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లక్ష పైచిలుకు అభిమానులున్న స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 6000 మందికి పైగా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కూడా... ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సానుభూతిపరుడు ఇన్ని అంచెలను దాటుకొని కోహ్లిని కలవడం, కౌగిలించుకోవడం కలకలం సృష్టించింది. ఇది భద్రత డొల్లతనాన్ని భయటపెట్టింది. వెంటనే అప్రతమత్తమైన భద్రత దళాలు వేన్ జాన్సన్ అనే ఆ్రస్టేలియన్ను నిర్బంధించాయి. అతన్ని చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాలస్తీనాలో హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే! -
30 అడుగుల అభిమానం
‘జవాన్’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్ బెనర్జీ మార్బుల్ స్టోన్ చిప్స్, పెయింట్ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్ పోట్రాయిన్ రూపొందించాడు. ఈ స్టన్నింగ్ పోర్ట్రయిట్ డ్రోన్ షాట్ అదిరిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్ టూ ది కింగ్‌ఖాన్. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ. -
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
బండి సంజయ్ తొలగింపు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం!
-
బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం: సంజయ్ అన్నా.. ఇక సెలవు అంటూ తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ అభిమాని చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఖమ్మం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి సంజయ్‌ను తొలగించడాన్ని తట్టుకోలేకే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు మరీ ప్రకటించుకున్నాడతను. కుటుంబ సభ్యులు స్థానికంగా టౌన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘అన్నా.. ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ తన సహచరులకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారని జిల్లా నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో లక్షలాది సంఖ్యలో తప్పుపడుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ ను తప్పించడాన్ని పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా? అంటూ నిలదీస్తున్నాయి. మరోవైపు బండి సంజయ్ అభిమానులు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. ఇదీ చదవండి: బండి సంజయ్‌ను అసలు ఎందుకు తొలగించారు? -
అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్‌రామ్ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకున్నారు. (ఇదీ చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో) కన్నడలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా.. ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్‌వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Raone Pavan (@raone_pavan) -
అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..
అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్ లేదా నటులపై ఉన్న ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అందుకు సంబంధించిన ఘటనలను ఎన్నో చూశాం. ఒక్కోక్కరిది ఒక్కోరకమైన పంథాలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. అచ్చం అలానే ఇక్కడో అభిమాని తనకు ఇష్టమైన క్రికెటర్‌పై తన ప్రేమను అదేవిధంగా ప్రేమను చూపించాడు. వివరాల్లోకెళ్తే..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లో కూడా ధోని నాయకత్వంలోని సీఎస్కేనే విజేతగా నిలిచింది కూడా. అలాంటి మిస్టర్ కూల్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచేలా తన ప్రేమను చాటుకున్నాడు. తన వెడ్డింగ్ కార్డ్‌కి ఇరువైపులా 'తలా'అనే పదం, ధోని ముఖ చిత్రం, జెర్సీ నెంబర్ తోపాటు అతని పేరుని కూడా ముంద్రించాడు. ఆ అభిమాని తన పెళ్లికి ఎంఎస్ ధోనిని ఆహ్వానించడానికి ఈ కార్డుని పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. CSK #yellove 💛 fever isn't over yet⁉️ A fan boy of @msdhoni from #chhattisgarh printed Dhoni face, #Jersey no 7 on his wedding card and invite to the #ChennaiSuperKings captain❤🔥 #MSDhoni𓃵 #thala #Dhoni pic.twitter.com/dZmAqFvI14 — Shivsights (@itsshivvv12) June 3, 2023 (చదవండి: జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు -
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
అభిమాని ఆఖరి కోరిక తీర్చిన హీరో ప్రభాస్
-
రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం
ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు. (ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?) తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే! -
కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ
ఇటీవల టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న మధ్యాహ్నం టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. హీరో సూర్యకి ఐశ్వర్య పెద్ద అభిమాని. (చదవండి: యుద్ధ భూమిలో కలుద్దాం తారక్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్ ) తన అభిమాని చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశాడు. ‘మిమ్మల్ని(ఐశ్వర్య పేరెంట్స్) ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి మనకు తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బతికే ఉంటుంది’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రును ఓదార్చాడు. అలాగే ఐశ్వర్య గురించి రాస్తూ.. ‘నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు.. ప్రేమను పంచే నీ గుణం.. ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది’ అని రాసుకొచ్చాడు. A man who respects his fans is a real star. Heartfelt note from @Suriya_offl to his fan #Aishwarya, who was shot at the Allen Mall shooting in Texas, USA. Such comforting words. pic.twitter.com/pfGJbM1fpl — Siddarth Srinivas (@sidhuwrites) May 19, 2023 -
గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ ఆన్సర్ అదిరిందిగా!
సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్. మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇలా ఇప్పటికే ఖుష్భూ, నిధి అగర్వాల్, హన్సిక, నమిత, మొన్నీ మధ్య సమంత.. ఇలా హీరోయిన్లకు గుడికట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభిమాని హీరోయిన్ డింపుల్ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా ఆమెనే అడిగేశాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో డింపుల్ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, మీమర్స్‌తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డింపుల్ ఆన్సర్‌కి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగనన్నపై ‘మహా’భిమానం.. ఎర్రటి ఎండను లెక్కచేయకుండా..
సాక్షి, హైదరాబాద్: జననేత మీద అతనికి ఉన్న అభిమానం.. అతని చేత సరిహద్దులు దాటించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం గుండా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయించింది. ఇండియన్ పాలిటిక్స్‌లో కింగ్ అంటూ మనస్ఫూర్తిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆరాధిస్తున్నాడతను. అందుకే దాదా అని పిల్చుకుంటూ ఆయన్ని కలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి. షోలాపూర్‌కు చెందిన కాకా కాక్డే.. రైతు. సీఎం జగన్ అంటే అతనికి ఎంతో అభిమానం. అందుకే ఆయన్ని ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. సైకిల్ యాత్ర చేపట్టారు. తద్వారా మీడియా దృష్టిని ఆకట్టుకున్నాడు. అంతేనా.. ఏపీ సీఎం జగన్ భవిష్యత్తులో దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాడు కూడా. కాకా కాక్డే షోలాపూర్‌లో సీఎం జగన్ పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ స్థాపించి.. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ జూన్-జులై మధ్య షోలాపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాడట. వీలైతే సీఎం జగన్‌ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని భావిస్తున్నాడతను. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారంటే.. సీఎం జగన్‌ను తాను దేవుడిగా భావిస్తానని, దేవుడి నుంచి ఏం ఆశిస్తామని, కేవలం ఆయన్ని కలిసి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కినా చాలని అంటున్నాడు కాకా కాక్డే. షోలాపూర్ నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే.. అతను ఏపీ గుంటూరు తాడేపల్లికి చేరుకోగలడు. ఎనిమిది రోజుల నుంచి పదిరోజుల ప్రయాణం లక్ష్యంగా పెట్టుకుని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నాడు. -
ఎండలకి ఆ మాత్రం ఉండాల్రా భయ్! బిగ్‌బీని ఆకట్టుకున్న వీడియో
-
అభిమాని నుంచి రష్మికకు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్.. నటి ఎమోషనల్
హీరోయిన్ రష్మికా మందన్నా అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌గా మారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా మారిపోయింది. సౌత్, నార్త్ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న రష్మికకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని నుంచి ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. సీతాకోకచిలుకల డిజైన్‌తో నిండి ఉన్న కలర్‌ఫుల్ బొకేను యూకేలో ఉండే ఓ ఫ్యాన్ రష్మిక కోసం పంపించాడు. ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో దాని గురించి రాసుకొచ్చింది. 'ఈ గిఫ్ట్ నా హృదయాన్ని కదిలిచింది. ఇందులో పేరు లేదు, కానీ ఇది ఎవరైనా వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నిజంగా నాలో సంతోషాన్ని నింపావు, బిగ్ టెడ్డీ బేర్ హగ్స్ టూ యూ' అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. -
హీరోను ముద్దుపెట్టుకోబోయిన లేడీ ఫ్యాన్.. షాక్ అయిన నటుడు
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలనుకుంటారు చాలామంది. ఇక అందులో తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే కొందరు తమ అభిమానాన్ని చూపించే క్రమంలో కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలే అతడికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆయన నైట్ మేనేజర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆదిత్య రాయ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఫోటో దిగుతుండగానే హీరోను హగ్ చేసుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ చర్యతో షాక్ అయిన ఆదిత్య రాయ్ నవ్వుతూనే ఆమె చర్యను ప్రతిఘటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @varindertchawla -
ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తాకిడి పెరుగుతుంది. ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండుతుండటంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. . ఉదయం 10 గంటల తర్వాత సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే నగరవాసులు కాస్త ఆలోచిస్తున్నారు. శనివారం గరిష్ఠంగా 35.4 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠంగా 16.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం సిటీజన్లు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. 57 ఎంయూలకుపైగా.. ► వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం తట్టుకోలేక పోతోంది. నిజానికి చలి కారణంగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్లు పెద్దగా వాడలేదు. ప్రస్తుతం ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏకంగా ఏసీలను ఆన్ చేస్తున్నారు. కేవలం గృహ విద్యుత్ మాత్రమే కాకుండా వాణిజ్య వినియోగం భారీగా నమోదవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ► ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో రోజు సగటు విద్యుత్ డిమాండ్ 52 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 57 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రెండో శనివారం విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే.. సెలవు దినాల్లో వినియోగం కొంత తగ్గాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి చివరి నాటికి 75 నుంచి 80 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. హీటెక్కుతున్న డీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయిల్ లీకేజీలను సరి చేయకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా శనివారం పాతబస్తీ దారుíÙఫాలోని ఓ డీటీఆర్ నుంచి మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వేసవి ప్రారంభానికి ముందే లైన్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, ఎర్తింగ్ ఏర్పాటు, లూజు లైన్లను సరి చేయడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారులు ఇప్పటి వరకు వాటిపై దృష్టిపెట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
తన బుల్లి ఫ్యాన్ కోరిక తీర్చిన రామ్ చరణ్, హీరోపై ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్నారి చివరి కోరిక తీర్చి ఉదారత చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్ అనే చిన్నారి రామ్ చరణ్‌కు వీరాభిమాని. అయితే అతడు కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్పర్శ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు హీరో రామ్ చరణ్‌ను కలవాలి అంటూ తన కోరికను తల్లిదండ్రులకు వెల్లడించాడు. దాంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు ఈ విషయాన్ని రామ్ చరణ్‌కు చేరవేయగా వెంటనే స్పందించాడు. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ తన బుల్లి ఫ్యాన్‌ని కలిసేందుకు స్వయంగా చరణ్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆ బాలుడితో కాసేపు సరదాగా గడిపాడు. అంతేకాదు ఆ బాలుడికి ఓ బహుమతిగా ఇచ్చాడు. అనంతరం అతడిలో ధైర్యం నింపాడు. అలాగే మణి త్వరలోనే కోలుకుంటాడని ఆ బాలుడి తల్లిదండ్రులు చరణ్ భరోసా ఇచ్చాడు. చెర్రి ఆ అభిమానిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ మూవీ ఆర్సీ15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్ Through #MakeaWishFoundation our #ManOfMasses Mega Power Star @AlwaysRamCharan garu met a 9yr old kid ailing from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. #ManOfMassesRamCharan #Ramcharan pic.twitter.com/vAPMAl9VdV — SivaCherry (@sivacherry9) February 9, 2023 -
అభిమానులకు అజిత్ సూచన.. ‘నిజాయితీగా నడుచుకోండి..’
హీరో అజిత్‌ది సినీ రంగంలో ప్రత్యేక స్థానం. నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్న ఆయన వివాద రహితుడు. తానేంటో తన పని ఏంటో అన్నట్టుగా ఉంటారు. సినిమా రంగంలో జరిగే విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. తన చిత్రాల విషయంలో కూడా ఏ ఇతర చిత్రాలతో పోటీగా భావించరు. అదే విధంగా ఇతర స్టార్ నటుల మాదిరిగా అభిమాన సంఘాలను ఇష్టపడరు. అభిమాన సంఘాల పేరుతో తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని, తమ కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపుతూ జీవితంలో ఎదగాలని తన అభిమానులకు సూచిస్తారు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇళ్లు మారేవాళ్లం: రష్మిక అలాంటి అజిత్ చాలా కాలం తరువాత అభిమానుల కోసం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో అభిమానులను ఉద్దేశించి ‘మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే వారిని స్పూర్తినిచ్చే వారిని మీ చుట్టూ ఉంచుకోండి.. ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు, అనవసర విషయాల జోలికి పోకండి. మీ లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ ఉన్నత స్థాయికి చేరుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. ఇది మంచి వాళ్ల కాలం. నిజాయితీగా నడుచుకోండి. మీలోని ప్రతిభను చాటుకోండి. మంచిగా జీవించండి.. జీవించనీయండి’ అని అజిత్ పేర్కొన్నారు. అయితే ఆయన సడన్‌గా ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేస్తోంది. అదే విధంగా నటుడు విజయ్ హీరోగా నటించిన వారీసు చిత్రం కూడా అదే సమయానికి తెరపైకి రాబోతుంది. సాధారణంగా వీరి సినిమాలు వేర్వేరు తేదీల్లో విడుదలైతేనే వారి అభిమానులు రచ్చ.. రచ్చ చేస్తారు. అలాంటిది చాలా కాలం తరువాత విజయ్, అజిత్ నటించిన చిత్రాలు ఒకేసారి తెరపైకి రాబోతున్నాయి. దీంతో ఎలాంటి గొడవలు జరగకూడదని అజిత్ తన అభిమానులకు ఇలాంటి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. pic.twitter.com/gt9iOY20z7 — Suresh Chandra (@SureshChandraa) November 17, 2022 -
కృష్ణ డైలాగ్ తో అదరగొట్టిన Jr కృష్ణ
-
నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: అతడి లేఖ వైరల్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొద్ది రోజులుగా వారల్లో నిలుస్తున్నాడు. ఇటీవల లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్‌తో ఆయన మాట్లాడిన ఆడియో కాల్ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. లైగర్ ఫ్లాప్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అయితే ఈ సినిమాకు పూరీ కూడా ఓ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్ ఫ్లాప్‌తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ పూరీని డిమాండ్ చేశారు. అయితే దీనికి అయినా కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జెర్సీ నటుడు, చెన్నైలో నేడు గ్రాండ్ వెడ్డింగ్ దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అసలు డబ్బు ఇవ్వనంటూ పూరీ వారిని వారించిన ఆడియో ఈమధ్య బయటకు వచ్చింది. దీంతో పూరీ పరువు తీసేందుకు కావాలనే ఈ ఆడియోను లీక్ చేశారని, కొంతమంది పని గట్టుకునిన ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పూరీ ఫ్యాన్ ఒకరు బహిరంగ లేఖ రాశారు. అవును డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! అంటూ అతడు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో అతడు డైరెక్టర్ పూరీ గురించి ఈ లొల్లి ఏందో నాకేం అర్థం కావట్లా..! పూరీ ఫ్యాన్‌గా కాదు. సాదాసీదా ఆడియన్‌గా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి! ‘‘అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి’’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు. పూరీకి మద్దతు తెలుపుతూ ఆయన పురువు తీయాలని చూసేవారిపై అసహనం వెల్లగక్కుతు ఈ సందర్భంగా అతడు ఒపెన్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
ఒంటిపై చేయి వేశాడని అభిమాని చెంపచెళ్లుమనిపించిన హీరోయిన్
అత్యుత్సాహంతో ఓ అభిమాని చేసిన పనికి హీరోయిన్ అతడి చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళలోని ఓ మాల్లో జరిగిన మూవీ ప్రమోషన్ ఈవెంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ప్రముఖ మలయాళ హీరోయిన్స్ సానియా అయ్యప్పన్, గ్రేస్ ఆంటోనిలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సాటర్డే నైట్. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కేరళలోని ఓ మాల్లో ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి అభిమానులు భారీగా తరలివచ్చారు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార ఈ కార్యక్రమం అనంతరం సానియా, గ్రేస్ ఆంటోనిలు మాల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులంత అత్యత్సాహంతో వారి వెంట కదిలారు. ఈ క్రమంలో కొందరు వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు ఏకంగా ఓ వ్యక్తి హీరోయిన్ గ్రేస్ ఒంటిపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన సానియా అయ్యప్పన్ వెనక్కి తిరిగి అతడి చెంప చెళ్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంటికి వెళ్లిన సానియా సోషల్ మీడియా వేదికగా ఈ సంఘటనపై స్పందించింది. ‘నేను, మూవీ యూనిట్ కలిసి మా తాజా చిత్రం సాటర్డే నైట్ ప్రమోషన్స్ నేపథ్యంలో కాళికట్లోని మాల్‌కు వెళ్లాం. అక్కడికి వచ్చి మాపై చూపించిన మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. చదవండి: హీరో విశాల్ ఇంటిపై దాడి కలకలం, ధ్వంసమైన కిటికి అద్దాలు అలాగే ‘ఈ సందర్భంగా మాల్ అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. దీంతో వారందరిని అదుపు చేసేందుకు బాడిగార్డ్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ ముగిసన అనంతరం నేను, నా కోస్టార్ గ్రేస్ బయటకు వస్తున్న క్రమంలో కొందరు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు ఓ వ్యక్తి నా కోస్టార్పై చేయి వేశాడు. అయితే ఆ రద్దిలో ఏం జరుగుతుంది, పరిస్థితిని కంట్రోల్ చేసే పరిస్థితి ఆమె చేతిలో లేదు. అందువల్లే నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయి ఎదురుకావద్దని కోరుకుంటున్నా. మహిళలకు వ్యతిరేకంగా అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా సానియా అయ్యప్పన్ మోహన్ లాల్ లూసిఫర్‌లో ఓ కి రోల్ పోషించింది. #Malayalam actresses #SaniyaIyappan, #GraceAntony sexually #harassed during #filmpromotions The incident took place when the two #actresses were promoting their upcoming film '#SaturdayNight' at the Hilite mall in #Kozhikode.https://t.co/OO6SgSmlK5#MalayalamActress #Shocking pic.twitter.com/OvBFiAsuz5 — Free Press Journal (@fpjindia) September 28, 2022 -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
సోనూసూద్‌కు రక్తంతో పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని
సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తూ నిజజీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేసి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్‌కి దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తాజాగా మధు గుర్జార్ అనే ఫ్యాన్ సోనూసూద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో సోసూసూద్ పెయింటింగ్ వేసి ఆయనకే బహుమతిగా ఇచ్చాడు. అభిమాని చేసిన పనికి షాక్ అయిన సోనూసూద్ రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సోనూసూద్ ట్విట్టర్లో షేర్చేస్తూ రక్తం వృథా చేయకుండా దానం చేయాలని కోరాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోసూసూద్ చివరగా చాంద్ బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. ख़ून दान करो मेरे भाई ख़ून से मेरी पेंटिंग बना कर व्यर्थ नहीं🙏 बहुत बहुत आभार ❤️🙏 https://t.co/6j6Pih36Fq — sonu sood (@SonuSood) September 9, 2022 -
క్లాస్‌రూమ్‌లో హఠాత్తుగా ఫ్యాన్ పడటంతో విద్యార్థినికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నాంగ్లోయ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా విద్యార్థిని పై పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం సదరు విద్యార్థిని నాంగ్లోయ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వాస్తవానికి క్లాస్ రూమ్ గదిలో పైన ఉన్న సీలింగ్ తడిగా ఉండి బొట్టుబొట్టుగా నీరు కారుతోందని విద్యార్థిని చెబుతుంది. దీంతో సీలింగ్ తడికి నానిపోయి విరిగి పోవడంతోనే ప్యాన్ పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆగస్టు 27న క్లాస్ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్యాన్ కుప్పకూలిపోయిందని వెల్లడించింది. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వం గానీ, స్కూల్ యాజమాన్యంగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని వాపోయింది. (చదవండి: నకిలీ బంగారం పెట్టి.. కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా) -
ప్రాణాపాయంలో అభిమాని.. అండగా నిలిచిన చిరంజీవి (ఫొటోలు)
-
ప్రాణాపాయంలో అభిమాని... అండగా నిలిచిన చిరంజీవి
ఎవరికి ఏ ఆపద వచ్చిన సాయం చేయడానికి ముందుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తన అభిమానులకు అయితే సొంత ‘అన్నయ్య’లా ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. గతంలో ఆపదలో ఉన్న అనేకమందికి సాయం చేసిన చిరంజీవి.. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి తోడుగా నిలిచాడు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌కు క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి ఆయనఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు. (చదవండి: వ్యూస్ కోసం అలా రాసి మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు: దిల్‌రాజు ఎమోషనల్) -
నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో
Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇందులో భాగంగానే కార్తీక్ తాజాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది. యూరప్ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్ ఆర్యన్. నమ్మడం లేదా? నా ఆధార్ కార్డ్ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు', 'కార్తీక్ మీ టైమింగ్ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్
Vijay Devarakonda Meets Fan Who Has His Tattoo Video Viral: సినీ నటీనటులను ప్రేక్షకులు ఎంతగానే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వారిని చూసిన, వారిని కలిసినా ఎక్కడలేని విధంగా ఎమోషనల్ అవుతారు. వారి ఆనందానికి అవధులు లేవని ఆనందభాష్పాల ద్వారా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటన తాజాగా జరిగింది. తన అభిమాన హీరోను చూసిన ఆ ఫ్యాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అతన్ని కలుసుకుని మాట్లాడటంతో సంతోషం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ హీరో ఎవరో కాదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్‌కు వీరాభిమాని అయిన చెర్రీతో పాటు మరో ఫ్యాన్ సోనాలి ఈ రౌడీ హీరోను కలిశారు. ఆ ఇద్దరితో సరదాగా ముచ్చటించి, కలిసి ఫొటోలు దిగాడు విజయ్ దేవరకొండ. అదే చోట ఉన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మినీ వారిద్దరికి పరిచయం చేశాడు. తన వీపుపై విజయ్ దేవరకొండ టాటూతో అభిమానాన్ని చాటుకున్నారు చెర్రీ. ఈ క్రమంలోనే ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. "SUPER FAN MOMENT" - Some FANS convey their affection in a most personal way and High Respect when they ink their Star on their Body Dr. Cherry - Hope you had best surprise meeting VD Sir and you cherish this moment@TheDeverakonda #VijayDeverakonda #TeamDeverakonda pic.twitter.com/8CuxiyJUbt — Team Deverakonda (@TeamDeverakonda) June 30, 2022 -
‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్ 24) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో పాటు హీరోయిన్, డైరెక్టర్ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్ అక్కడిక్కడే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ సదరు అభిమాని ఈవెంట్లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్‌పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్‌కు తను పెట్టుకున్న కూలిగ్గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్ మహేశ్ దాసరి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన అతడి ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్‌ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. Take good care of the Goggles bro … My spontaneous gift for ur love ❤️🙏🏽 #Karthikeya2 trailer event.. https://t.co/KKTHtuz264 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 25, 2022 -
చిలకలూరిపేటలో పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశ్రుతి
-
ఆ అమ్మ కథ కదిలించింది.. జాన్ సీనా కలుసుకున్నాడు
ఆ అమ్మ కథ.. ఓ స్టార్నటుడిని కరిగించింది. ఆ కథ తెలుసుకుని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తన వీరాభిమానిని ఎట్టకేలకు కలుసుకున్నాడు. పైగా ఆ అభిమాని ఉక్రెయిన్ శరణార్థి కావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 19 ఏళ్ల మిషా రోహోజైన్, డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న టీనేజర్. కొడుకు పరిస్థితి చూసి.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. అప్పటి నుంచి ఆ ఒంటరి తల్లే కొడుకు ఆలనాపాలనా చూసుకుంటోంది. ఉక్రెయిన్ మరియాపోల్ వాళ్ల స్వస్థలం. ఒకప్పుడు అతని ఇంటి నిండా జాన్ సీనా పోస్టర్లే. కానీ, యుద్ధంతో వాళ్ల ఇళ్లు నాశనం అయ్యింది. ప్రాణాలు అరచేతపట్టుకుని ఆ తల్లీకొడుకులు దేశం విడిచారు. అయితే.. ఇంటిని, ఇంట్లో ఉన్న జాన్ సీనా పోస్టర్లను వదిలి వెళ్లేందుకు మిషా ఇష్టపడలేదు. దీంతో జాన్ సీనాను కలిపిస్తాం అంటూ ఆ తల్లి ఆ కొడుకుని బతిమాలి దేశం దాటింది. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్నారు వాళ్లు. అప్పటి నుంచి మిషా, జాన్ సీనాను కలవాలని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. మే నెలలో నెదర్లాండ్స్‌కు జాన్ సీనా వస్తున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లారు. కానీ, ఆ సూపర్ స్టార్ రాలేదు. నిరాశగా వెనుదిరిగారు వాళ్లు. ఈ ఉక్రెయిన్ శరణార్థి కథ.. ఈ మధ్యే వాల్ స్ట్రీట్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. ఆ కథనం ద్వారా విషయం తెలుసుకున్న సీనా.. ఆ తల్లి సాహసానికి ఫిదా అయ్యాడు. అంతేకాదు తన వీరాభిమాని మిషాను కలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్న ఆ కుటుంబాన్ని కలుసుకున్నాడు జాన్ సీనా. శరణార్థి శిబిరం కావడంతో అనుమతులు దొరకడం ఇబ్బంది అయ్యింది. ఇబ్బందులు తలెత్తుతాయాన్న ఉద్దేశంతో డబ్ల్యూడబ్ల్యూఈ సైతం స్పానర్షిప్ చేయలేదు. దీంతో తన సొంత ఖర్చులతో రిస్క్ అయినా సరే జాన్ సీనా, ఆ తల్లీకొడుకులను కలుసుకున్నాడు. మిషాకు తన గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చాడు. What a wonderful way to spend a Saturday. Misha and his mother, Liana define #NeverGiveUp. Thank you to the @WSJ and @WWE who helped make this special visit possible. https://t.co/RpriCvjN3K — John Cena (@JohnCena) June 7, 2022 -
బంఫర్ ఆఫర్.. తెలుగు మీడియంలో చేరిన విద్యార్థులకు..
పళ్లిపట్టు(చెన్నై): ప్రభుత్వ పాఠశాలలో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంపొందించే లక్ష్యంతో అత్తిమాంజేరి తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. పళ్లిపట్టు మండలం అత్తిమాంజేరి ప్రభుత్వ ప్రాథమిక తెలుగు పాఠశాలలో 15 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా భూపతి, సహాయ ఉపాధ్యాయులుగా మునెమ్మ, మాధవన్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యపట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు మోజు పెరగడంతో పాటు నిర్భంద తమిళ విద్యా విధానం తెలుగు పాఠశాలలకు శాపంగా మారింది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయా లు మెరుపడడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించారు. హెచ్ఎం భూపతి సహాయ ఉపాధ్యాయులు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చేరే విద్యార్థుల కుటుంబాలకు రూ.వెయ్యి విలువైన టేబుల్ ఫ్యాన్‌ను అందిస్తున్నారు. దీంతో తొలిరోజు నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. వీరికి సర్పంచ్ ఝాన్సీ ప్రకాష్ బహుమతి ప్రదానం చేశారు. గతంలో తెలుగు మీడియంలో విద్యార్థులను చేర్చే ఆశయంతో అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థికి గ్రాము బంగారం ఉచితంగా ప్రధానోపాధ్యాయు డు భూపతి పంపిణీ చేయడం విశేషం. చదవండి: AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
సూర్య మంచి మనసు.. అభిమాని కుటుంబానికి భరోసా
చెన్నై సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని కుటుంబాన్ని సూర్య పరామర్శించి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా సూర్య అభిమాన సంఘం కార్యదర్శి జగదీశన్ ఇటీవల మోటార్ సైకిల్‌పై వెళుతుండగా నామక్కల్ పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ ఢీకొని మృతి చెందాడు. దీంతో నటుడు సూర్య శనివారం (మే 28) రాత్రి నామక్కల్‌లోని ఆ అభిమాని ఇంటికి వెళ్లి అతని భార్య, పిల్లల్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చి, వారి రెండున్నరేళ్ల కూతురు విద్యకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సూర్య వచ్చిన విషయం తెలిసి ఆ ప్రాంతం ప్రజలు ఆయన్ని చూడటానికి గుమిగూడారు. సూర్య ఉదారతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి:👇 సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్ ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్ -
చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా వరి పంటతో తయారుచేసి అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. సదరు అభిమానిని తాజాగా చరణ్ తన నివాసంలో కలిశాడు. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ అరుదైన కానుక ఇచ్చిన సదరు ఫ్యాన్‌కు చెర్రి ఆత్మీయ ఆహ్వానం పలికాడు. అయితే ఆ వ్యక్తి చరణ్‌ను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడిచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చరణ్ తన అభిమానికి ఆత్మీయ ఆహ్వానం పలికాడు.కాగా తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..? గట్టు మండలం ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. గత మార్చిలో ఈ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ఫొటోలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు జైరాజ్ 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్‌ను కలుసుకున్నాడు. చరణ్ నివాసంలో ఆయనను కలిసి బియ్యం గింజలతో తాను వేసిన చరణ్ బొమ్మ ఫొటోలతో పాటు, వరి వీడియోను కూడా చూపించాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయాడు. అతడి ఆర్ట్‌కి ఫిదా అయిన చెర్రి జైరాజ్‌ను ప్రశంసించాడు. -
గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని: కేజీఎఫ్ డైరెక్టర్
Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years: మామూలు సినిమాగా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం 'కేజీఎఫ్'. ఆ సినిమా చూసిన ఆడియన్స్ దానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి యశ్ యాక్టింగ్ ఒక కారణమైతే.. ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో ప్రధాన కారణం. ఈ ఒక్క సినిమాతో అటు యశ్, ఇటు ప్రశాంత్ నీల్ సూపర్ పాపులర్ అయ్యారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్’, ఆడియన్స్‌కి ప్రశాంత్ నీల్ డబుల్ ట్రీట్ ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ 'నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాక 10 - 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్ అని నన్ను అడగొద్దు' అని తెలిపాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. The only soil that is worth remembering is the one soaked in blood!! Cant wait to make this one with the one and only force @tarak9999#NTR31 it is!! Wishing you a safe birthday brother 💫 Wishing for a successful collaboration @MythriOfficial @NTRArtsOfficial.#HappyBirthdayNTR pic.twitter.com/jtfYbZ1LCE — Prashanth Neel (@prashanth_neel) May 20, 2021 చదవండి: ప్రభాస్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల ఖర్చు -
Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్
రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్‌కు ఫాలోవర్స్ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నార్త్ కరోలినాకు చెందిన రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు #DaBaby getting curved by fans 😂 pic.twitter.com/EiiP7NMfsX — No Jumper (@nojumper) April 7, 2022 అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్వచ్చాయి. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
ఆ సినిమా కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ నటుడు
Pakistani Actor Book Entire Theatre Alia Bhatt Gangubai Kathiawadi: బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఇటీవల నటించి మెప్పించిన చిత్రం 'గంగూబాయి కతియవాడి'. బీటౌన్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మాఫీయా క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. దీంతో అలియాకు ఉన్న అభిమానులు సంఖ్య ఎల్లలు దాటింది. భారత సరిహద్దులను దాటి మించిపోయింది. ఈ బ్యూటీ నటించిన 'గంగూబాయి కతియవాడి' చిత్రం చూసేందుకు ఒక అభిమాని ఏకంగా థియేటర్‌నే బుక్ చేశాడు. పాకిస్తాన్‌కు చెందిన మోడల్, యాక్టర్ మునీబ్ బట్ అలియా భట్‌కు వీరాభిమాని. ఈ అభిమానంతోనే 'గంగుబాయి కతియవాడి' మూవీని తన భార్యతో కలిసి చూసేందుకు మొత్తం థియేటర్‌నే బుక్ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. అనంతరం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో అలియా భట్ అనేక ఫ్యాన్ పేజీల్లో ఈ పోస్ట్ దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే కామాఠిపురలోని రెడ్‌లైట్ ఏరియాలో గంగూబాయి అనే యువతి మాఫీయా క్వీన్‌గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిందే 'గంగూబాయి కతియవాడి' చిత్రం. 'మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై' అనే పుస్తకంలోని 'గుంగూబాయి హర్జీవందాస్' నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతి
Puneet Rajkumar Fan Dies Of Heart Attack In Nanjangud: దివంగత పునీత్ రాజ్‌కుమార్ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు..పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ సినిమా విడుదల సందర్భంగా మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్ (22) పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్ గుండెపోటుతో మరణించాడు. -
ప్రభాస్ మంచితనం.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం
Prabhas Donated Two Lakh Rupees To Deceased Fan Family: పాన్ ఇండియా స్టార్, మనందరి డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన మంచి చాటుకున్నాడు. తన సినిమా విడుదల రోజు ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ ఫ్లెక్సీ కడుతున్నాడు. అనుకోకుండా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసి చలించిపోయిన ప్రభాస్ చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభాస్ తనవంతు సాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇదివరకు కేరళ, ఏపీ వరదల్లో చిక్కుకున్నప్పుడు ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఈసారి తన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నిజమైన డార్లింగ్ అనిపించుకున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాగా ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. చదవండి: రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిమాని ఆత్మహత్య -
అభిమాని కూతురి పెళ్లికి చిరంజీవి ఆర్థిక సాయం
Chiranjeevi Financially Helps His Fan Daughter Marraige: మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అభిమానులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరు తాజాగా కష్టాల్లో ఉన్న తన అభిమానికి చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే.. రాజం కొండలరావు అనే వీరాభిమాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలె ఆయన కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లక్షణనమైన పెళ్లికూతురు నీలవేణి కి మెగాస్టార్ ఆశీస్సుల లక్ష రూపాయలు విరాళం. రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని.ఆయన కూమార్తె నీలవేణి పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్న @KChiruTweets గారు లక్షరూపాయల ఆర్ధిక చేయూతనిచ్చి పెళ్లి సజావుగా జరిపించమన్నారు pic.twitter.com/YVmpUaSR4b — Ravanam Swami naidu (@swaminaidu_r) February 1, 2022 -
అన్నీ ఓకే కానీ, ఆ విషయంలో బ్రిటిషర్లకు ఇబ్బందులు.. అప్పుడే వచ్చిందో ఆలోచన!
Britishers Uncomfortable In India: ఇప్పుడంటే మనకు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ కరెంటు సౌకర్యం లేని వంద, రెండు వందల ఏళ్ల కింద పరిస్థితి ఏమిటో తెలుసా? బ్రిటిషర్లు ఉక్కపోత తట్టుకోవడానికి ఏం చేశారో తెలుసా..? గదిలో పైనుంచే వేలాడే వింజామర్లాంటి పంకాలను తయారు చేయించారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ బ్రిటిషర్లు ఇండియాకు వచ్చిన కొత్తలో ఇక్కడి చాలా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలిగారు. కానీ వారికి వచ్చిన చిక్కల్లా ఒక్కటే. మన ఎండాకాలం. బ్రిటిష్‌వారికి బాగా ఎండకొట్టడమంటే.. మనకు చలికాలంలో మధ్యాహ్నం ఉన్నట్టు ఉంటుందంతే. కానీ ఇక్కడి ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి వారు నానా తంటాలూ పడ్డారు. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు వాడలేరు. ఈ క్రమంలోనే భారీ ‘మ్యాన్యువల్ పంకా’లపై దృష్టిపెట్టారు. (చదవండి: సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..) వింజామరల నుంచి స్ఫూర్తి పొంది.. బ్రిటిష్ వాళ్లు వచ్చేప్పటికి మన దేశంలో రాజుల పాలన నడుస్తోంది. ఆ సమయంలో రాజులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నత స్థానాల్లో ఉండే పాలకులకు సేవకులు ‘వింజామర’లతో గాలి ఊపేవారు. వింజామరలు అంటే.. వస్త్రం, పక్షుల ఈకల వంటి వాటితో తయారై, పెద్దసైజు విసనకర్రల్లా ఉంటాయి. ఇక్కడి ఎండను, వేడిని తట్టుకోలేని బ్రిటిషర్లు.. ఆ వింజామరలను చూసి.. వాటి తరహాలో ‘పంకా’లను తయారు చేయించి వాడటం మొదలుపెట్టారు. గది నిండా గాలి వచ్చేలా.. నిజానికి ఒకరిద్దరికి అయితే వింజామరలు సరిపోతాయి. కానీ ఓ పెద్ద గది నిండా ఉండే వారికి గాలి రావాలంటే ఎలా? ఈ ఆలోచనతోనే పెద్ద పంకాలను తయారు చేయించేవారు. ► గది వెడల్పు కన్నా కాస్త తక్కువ పొడవున్న ఓ దూలాన్ని లేదా గట్టి వెదురు బొంగును తెచ్చి.. దానికి రెండు, మూడు అడుగుల మేర ఎత్తు వచ్చేలా అడ్డంగా వస్త్రాన్ని అమర్చేవారు. దీనిని గది మధ్యలో పైకప్పు నుంచి వేలాడదీసేవారు. ఆ దూలానికి తాళ్లు కట్టి.. ఏదో ఓ వైపు గోడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రంధ్రాల ద్వారా బయటికి వేసేవారు. బయట కొందరు కూలీలు/బానిసలను పెట్టి ఆ తాడును లాగుతూ, వదులుతూ ఉండేలా చూసేవారు. ఇవే పంకాలు! కూలీలు/బానిసలు తాడును లాగుతూ, వదులుతూ ఉన్న కొద్దీ (పిల్లలు పడుకున్న ఊయలను తాడుతో ఊపినట్టుగా..).. గదిలో పైన ఏర్పాటుచేసిన ‘పంకా’లు.. అటూ ఇటూ ఊగుతూ గదిలో గాలి వీచేది. ఇలా పంకాలు ఊపే కూలీలను ప్రత్యేకంగా ‘పంకా వాలా’లు అని పిలిచేవారు. ► అప్పట్లో బ్రిటిషర్లు మాత్రమేకాదు.. స్థానిక రాజులు, అధికారులు, ధనికులు తమ ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఇలాంటి ‘పంకా’లను ఏర్పాటు చేయించుకుని.. కూలీలు/బానిసలతో వినియోగించుకునేవారు. ఇంటి నిండా పంకాలే.. బాగా డబ్బున్నవారు, వ్యాపారులు, బ్రిటిషర్లలో కాస్త పైస్థాయి ఆఫీసర్ల నివాసాల్లో అయితే.. ఏకంగా హాలు, బెడ్రూంతో పాటు బాత్రూమ్లలోనూ పంకాలు ఏర్పాటు చేసుకునేవారు. ఒక్కోచోట నుంచి ఒక్కో తాడు ఇంటి బయటికి అమర్చేవారు. బయట ఉన్న పంకావాలాలు వాటిని లాగుతూ, వదులుతూ ఊపేవారు. 19వ శతాబ్దం మొదలయ్యాక.. విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఈ ‘పంకా’లు అంతర్థానమైపోయాయి. (చదవండి: కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
ఆమెను తాకొద్దు.. ఐరా బాయ్‌ఫ్రెండ్‌కు ఫ్యాన్ వార్నింగ్.. తర్వాత ?
Ira Khan Boyfriend Nupur Shikhare Gets Message From Her Fan: బాలీవుడ్ సూపర్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ తమపై ఒకరిపై ఒకరికున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించడంలో అస్సలు మొహమాటపడరు. గతేడాది వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా తాను నుపుర్ శిఖరేతో రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా తెలిపింది ఐరా. ప్రామిస్ డే సందర్భంగా నుపుర్‌తో కలిసి దిగిన ఫొటోలను 'నీతో ప్రామిస్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను; అంటూ షేర్ చేసింది. తర్వాత వీరు దీపావళి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నుపుర్ శిఖరే ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నాడు. అందులో అతనికి ఐరా అభిమాని పంపిన మెస్సెజ్ చూపించాడు. 'ఐరా నా ప్రేమ (నా ప్రేయసీ, ఐరా నాది), తనని తాకొద్దు' అంటూ ఐరా ఫ్యాన్ ఒకరు నుపుర్ శిఖరేకు సందేశం పంపాడు. ఇది చూసిన నుపుర్ కొద్దిసేపు ఆలోచించి పక్కనే పని చేసుకుంటున్న ఐరాను చేతివేలితో తాకుతాడు. అది అంతగా పట్టించుకోదు ఐరా. తర్వాత నుపుర్ వచ్చి ఐరాకు ముద్దు పెడతాడు. ఆ ముద్దుతో ఐరా నవ్వుతుంది. దీంతో ఆ వీడియో పూర్తి అవుతుంది. ఐరాను తాకద్దు అని వార్నింగ్ ఇచ్చిన ఆమె ఫ్యాన్‌కు ఐరాకు ముద్దు పెట్టి బదులిచ్చాడు నుపుర్ శిఖర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఎపిక్ రిప్లై అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) ఇదీ చదవండి: తండ్రిని పట్టుకుని బంధువా అన్నాడు.. ఐరా ఖాన్ స్ట్రాంగ్ రిప్లై -
అభిమాని మనస్సు గెలుచుకున్న సీఎం..
చెన్నై: సాధారణంగా తమకు నచ్చిన అభిమాన నాయకులు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ప్రియమైన నాయకుడితో సెల్ఫీదిగే ఏ అవకాశాన్ని వదులుకోరనే విషయం తెలిసిందే. ఒక్కోసారి అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం వలన నాయకులు, సెలబ్రిటీలు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో వీరిపట్ల సెక్యురీటి సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కొకొల్లలు. అయితే, దీనికి భిన్నంగా.. కొంత మంది నాయకులు తమ అభిమానుల చిన్నపాటి కోరికలను గమనించి తీర్చటానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో తమిళనాడు.. సీఎం స్టాలీన్ స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమానికి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలీన్ను కలవడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈక్రమంలో భద్రత సిబ్బంది అభిమానులందరిని ఒక క్రమపద్ధతిలో సీఎం వద్దకు పంపుతున్నారు. అప్పుడు ఒక ఎరుపు రంగు చొక్క ధరించిన ఒక వ్యక్తి సీఎం స్టాలీన్ను వద్దకు చేరుకున్నాడు. పాపం.. సీఎం తో కరచాలనం కూడా చేశాడు. ఆ తర్వాత.. తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి సీఎంతో సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు. అప్పుడు వెనుక నుంచి భద్రత సిబ్బంది ముందుకు తోసేశారు. అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని గమనించిన సీఎం స్టాలీన్.. అతడిని చేయిపట్టుకుని తనవైపులాగి సెల్ఫీ సరదా తీర్చారు. దీంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బైపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అభిమాని మనస్సు గెలుచుకున్నారు..’, ‘సీఎం .. అన్ని గమనిస్తూ ఉంటారు..’, ‘ మొత్తానికి యువకుడి సెల్ఫీ సరదా తీరింది’, అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
సీక్రెట్‌గా వీడియో రికార్డ్.. ఫోన్ లాక్కున్న స్టార్ హీరో
John Abraham Snatches Fans Phone Video Goes Viral: తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. వారితో ఒక్క ఫోటో అయినా దిగాలని తెగ ఆరాటపడుతుంటారు. మరికొందరైతే కనీసం వాళ్ల అనుమతి కూడా తీసుకోకుండా ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడిగా కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు. అనంతరం కెమెరా వైపు చూస్తూ.. హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అంటూ నవ్వుతూ మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరో అయ్యిండి కూడా అభిమానులను ఫన్నీగా ఆటపట్టించడం భలేగుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సత్యమేవజయతే-2 చిత్రంలో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
Prabhas : అభిమానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
Diehard Fan Gets Costly Gift From Darling Prabha: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే కొందరి అభిమానం హీరోలనే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ వీరాభిమాని ఒకరు ప్రభాస్‌కి షాక్చిచే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్ అయిన ప్రభాస్ సరదాగా అతడితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు ఒక్క రోజుకే అన్ని లక్షలా? అనంతరం తన వీరాభిమానికి ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఫాజిల్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రభాస్ తన అభిమానులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్‌తో సందడి చేయనున్నాడు ప్రభాస్. చదవండి: Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
విషాదంలో త్రిష.. గుండె బద్దలైందంటూ ఎమోషనల్ ట్వీట్
Trisha Krishnan Gets Emotional: సినీ ప్రపంచంలో తారలకు అభిమానులకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే కొందరు నటులకు వారి కెరీర్లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకుంటారు. అలాగే తమ హీరో, హీరోయిన్ కోసం ఏం చేయడానికైనా ఆ అభిమానులు రెడీగా ఉంటారు. ఈ క్రమంలో తారలు కూడా అంతే తమ ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అంతెందుకు ఒక్కోసారి తమ అభిమానులను బాధపెట్టే నిర్ణయాలు కూడా తీసుకోరు. ( చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ ) అంతటి బంధం ఉన్నా.. ఒకప్పుడు సినీ తారలను ఫ్యాన్స్ కలవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు పడేవాళ్లు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో స్టార్స్, ఫ్యాన్స్ మధ్య దూరం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నేరుగా మాట్లాడుకోవడం, చాట్ చేయడం సులువుగానే జరుగుతున్నాయి. తాజాగా తన అభిమాని గురించి త్రిష చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘గుండె బద్దలైంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర’ ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విటర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట. అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది. ఈ విషయంపై స్పందిస్తూ త్రిష ట్వీటర్లో.. తన గుండె బద్దలైందన్నట్టుగా చెబుతూ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన త్రిష తమిళంలో 96 సినిమాతో మంచి హిట్‌నే అందుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. I am so devastated about this💔 Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco — Trish (@trishtrashers) November 14, 2021 చదవండి: Tollywood Comedians: ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్ -
వైరల్: ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్.. నా చావుకి కారణం వాళ్లే అంటూ..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఆ సినిమా తరువాత కాస్త విరామం తీసుకున్నా, ఇటీవల మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు డార్లింగ్. అయితే సాహో తరువాత ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో.. సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమానిగా తన ఆవేదనను తెలిపాడు. @UV_Creations @director_radhaa #RadheShyam #Prabhas ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ fan అయ్యినా కానీ ప్రతీ యొక్క రెబెల్ స్టార్ ఆవేదన అది అని అర్ధం చేసుకోండి @director_radhaa @UV_Creations 🙏 pic.twitter.com/j2KyqoESXo — Vamsi (@Vamsi48324621) November 11, 2021 అంతటితో అభిమాని ఆగకుండా.. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది చదవండి: Allu Sirish: మర్చిపోలేని రోజు, సోషల్ మీడియాను వీడుతున్నా.. -
చిరు కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన మెగాస్టార్
ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయింది. తమకు నచ్చిన హీరోని ఒక్కసారైనా ప్రత్యేక్షంగా కలవాలనుకుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి వెనకడారు. ఇక హీరోలు సైతం తమ బిజీ షెడ్యూల్డ్‌ని పక్కనపెట్టి, ఇంటికి వచ్చిన అభిమానులను కలుస్తుంటారు. వారికి ఆర్థికంగా సాయం చేయడం చేస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమాని 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. (చదవండి: దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..) వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.ఈ వార్త తెలిసి చలించిపోయిన చిరంజీవి.. గంగాధర్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. నంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. -
దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా.. ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు.స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విటర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకటట్ భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
‘బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు
నెదర్లాండ్స్: మనం మన చేతుతలతో వాటర్ గ్లాస్‌లని ఒకేసారి రెండూ, మూడో మహా అయితే నాలుగు కూడా పట్టుకోవచ్చు. ఇంకా మరింత ప్రయత్నం చేసి ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కవ గాజు గ్లాస్‌లతో వాటర్ లేదా కూల్ డ్రింక్ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను తీసుకొచ్చేశాడు. (చదవండి: అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం) నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్గెరింగ్ ఫుట్‌బాట్ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం. కానీ క్రిస్టియాన్ ఓకేసారి ఐదు ట్రైలో బీరుగ్లాస్లను ఒకదానిపై ఒకటి పెట్టి మొత్తం 48 గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న స్టేడియంలోని ప్రేక్షక్షుల అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతను ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్ వావ్ యు ఆర్ సో గ్రేట్ అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి) View this post on Instagram A post shared by Veronica Inside (@veronica.inside) -
అఖిల్ సినిమా..! సోషల్ మీడియాను షేక్ చేసిన ఫ్యాన్..!
ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టేశాడు. ప్రేక్షకులముందుకొచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా విన్నర్‌గా నిలిచింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టిగ్ లవ్‌స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ హిట్ టాక్‌ను సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే అఖిల్ వీరాభిమాని అయ్యగారి ఫ్యాన్ పేరే ఎక్కువగా వినిపించింది. ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్ మామూలుగా లేదు...! కొంతమంది ప్రేక్షకులు అఖిల్ సినిమా కోసం ఎదురచూడగా.... మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం అఖిల్ హర్డ్ కోర్ ఫ్యాన్ ఎప్పుడూ వస్తాడనే కళ్లు కాయేలా కాసేలా ఎదురుచూశారు. సోషల్‌మీడియాలో అఖిల్ ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్‌ను చూసి యూజర్లు నివ్వెర పోయారు. అయ్యగారి ఫ్యాన్..‘ఓ థియేటర్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కటౌంట్‌కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప...పులీ..పులీ...కింగ్ కొడుకు.. అంటూ కేకలు వేశాడు. అయ్యగారి ఫ్యాన్ ఉత్సాహంతో ఇతర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. సోషల్‌మీడియాలో #ayyagareno1 అంటూ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది. View this post on Instagram A post shared by 👉 KIRRAK_MEMES_1 (🎯2k)❤️ (@kirrak_memes_1) View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) View this post on Instagram A post shared by b.techbabu😎 (@b.techbabu) View this post on Instagram A post shared by Telugu Meme Page (@lite_ba) View this post on Instagram A post shared by MATHU VADALARA😷 (stay home) (@mathu.vadalara) View this post on Instagram A post shared by Telugu Swaggers (@telugu_swaggers) చదవండి:బొమ్మరిల్లును గుర్తు చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్! -
The Alchemist: ఎల్లలు లేని అభిమానం.. ఓవర్‌నైట్ పాపులారిటీ
The Alchemist: పుస్తక ప్రియులకు పరిచయం అక్కర్లేని నవల ది ఆల్కెమిస్ట్. తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఓ గొర్రెల కాపరి పిల్లాడి జీవన ప్రయాణం, అతనికి ఎదురైన ఆటుపోట్లు అనుభవాల సారమే ఈ పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఈ పుస్తకం నుంచి స్ఫూర్తిని పొందారు. ఈ నవల రచయిత పాలో కోయిలోకి లక్షల మంది అభిమానులయ్యారు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన ప్రదీప్. కేరళలోని చెరాయ్కి చెందిన ప్రదీప్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పుస్తకాలు చదవడమంటే ప్రాణం. ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే అందులో అమితంగా ఆకట్టుకుంది ఆల్కెమిస్ట్. అందుకే తన అభిమానానికి గుర్తుగా తన ఆటో వెనుక ఆల్కెమిస్ట్ నవల పేరుని మళయాళంలో, దాని రచయిత పాలో కోయిలో పేరును ఇంగ్లీష్‌లో రాసుకున్నాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా ఎక్కడో బ్రెజిల్లో ఉన్న పాలోకోయిలోకి చేరింది. ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఓ ఆటో వెనుక తన పేరు రాసుకున్న ఫోటోను పాలో కోయిలో ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటో పంపినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ట్విట్టర్ అకౌంట్లో ప్రదీప్ ఆటో కనిపించడతో ఒక్కసారిగా అతనికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. స్థానిక మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. ఏదైనా ఒక రోజు బ్రెజిల్ వెళ్లి తన అభిమాన రచయితను తప్పకుండా కలుస్తానంటున్నాడు ప్రదీప్. Kerala, India (thank you very much for the photo) pic.twitter.com/13IdqKwsMo — Paulo Coelho (@paulocoelho) September 4, 2021 చదవండి: వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు -
గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర
ఆదిలాబాద్ టౌన్: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ జగనన్నకు గుండె నిండా అభిమానాన్ని చాటారు. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని 2018లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపడతానని ప్రతిజ్ఞ చేశాడు. జగన్ సీఎం కావడంతో ఇచ్చిన మాట ప్రకారం సైకిల్ యాత్ర చేపట్టాడు. 2020 ఫిబ్రవరిలో శ్రీనగర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి జమ్ము, పంజాబ్, హర్యాన, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌తో సైకిల్ యాత్ర నిలిపివేసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు ఆదిలాబాద్ నుంచే.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ పట్టణం నుంచి మళ్లీ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 33 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, మరో 20 రోజుల్లో 1,800 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఎల్సీ మెంబర్ బెజ్జంకి అనిల్‌కుమార్ ఈ సైకిల్ యాత్రను గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
మెగాస్టార్ కోసం సైకిల్‌పై 1200 కి.మీ ప్రయాణం, చిరు ఫిదా
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఓ వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12రోజులు ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా చిరంజీవి తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సాహసం సరికాదని వారించారు. చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్ లంబోర్ఘిని, చరణ్ ఫెరారీ.. అభిమానుల ఆశీస్సులతోనే మేం బావుంటాం.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా అభిమాని ఎన్. ఈశ్వరయ్యా బలుజుపల్లి గ్రామం నుంచి వచ్చాడు. తిరుపతి(అలిపిరి) నుంచి అతడు సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించాడు. నా పుట్టిన రోజు కోసం అతడు సైకిల్ యాత్రను చేపట్టి వచ్చి కలిశాడు. నా ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మాలను ధరించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచిస్తూ వచ్చారు. ఆగస్టు 10న బయల్దేరి 12 రోజుల పాటు 1200 కిమీ సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వచ్చారాయన. చాలా సందర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మనసు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించినట్టే మేం కూడా వారు వారి కుటుంబ సభ్యులు బావుండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను’ అని అన్నారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. చదవండి: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ -
రెక్కలు లేని ఫ్యాన్.. అంతేనా అదిరిపోయే మరో స్పెషాలిటీ కూడా..
రెక్కల్లేని మొండి ఫ్యాను చక్కనిదెలా అవుతుందనేగా మీ డౌటు? ఇది చూడచక్కనిది అవునో, కాదో ఈ ఫొటో చూసి మీరే తేల్చుకోవాలి గానీ, దీని పనితీరు మాత్రం చక్కగానే ఉంటుంది. పనులు చేసుకునే డెస్క్ మీద, లేదా ఏదైనా టేబుల్ మీద సులువుగా ఇమిడిపోయే ఈ ఫ్యాన్ భేషుగ్గా మనం కోరుకున్న రీతిలో గాలి వీస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, చల్లనిగాలులు వీస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే వెచ్చనిగాలులు వీస్తుంది. దాదాపుగా ఎయిర్‌కండిషనర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ రెక్కల్లేని ఫ్యాను. దీనిని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ రీసెర్చ్ అసిస్టెంట్ సోయంగ్ ఏన్ రూపొందించారు. ‘ఫ్లోడెస్క్ ఫ్యాన్’ పేరిట తయారు చేసిన ఈ ఫ్యాన్ గది వాతావరణానికి అనువుగా గాలులు వీచడమే కాదు, గాలిలోని దుమ్ము ధూళికణాలను పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. -
వైరల్: ‘నారప్ప’ సినిమా.. వెంకీ అభిమాని నిరాహార దీక్ష
కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ మూత పడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పరంగా కాస్త కుదుటపడగా, ప్రభుత్వాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టాయి. కానీ డెల్టా వైరస్ తాకిడి నేపథ్యంలో ధియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ వైపే అడుగులేస్తున్నాయి. తాజాగా వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపగా, వెంకి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు సుముఖంగా ఉండడంతో పాటు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్ సినిమా నారప్పను థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాడు. అందుకు బదులుగా అతను ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. వెంకీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలంటూ అతన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాడు. అందుకు ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోటోను కిరణ్ షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. A protest against... #Narappa OTT release by @VenkyMama Fan Please @SBDaggubati Sir.. We demand @SureshProdns #WeWantNarappaInTheatres@Alludukiran2@theVcreations pic.twitter.com/Mhjeh6TPHT — Krish Narappa (@Krish_kaval) June 29, 2021 చదవండి: ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్ -
ఆ అభిమానిని తప్పకుండా కలుస్తా : రష్మిక
'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. రష్మకి క్యూట్ లుక్స్‌కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రష్మిక నేషనల్ క్రష్‌గానూ మారిపోయింది. ఇటీవలె ఓ అభిమాని రష్మికను కలిసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకొని మరీ ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు హీరోయిన్ రష్మిక ఇంటిని మాత్రం కనిపెట్టగలిగాడు. అయితే రష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో ఆమెను కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ రష్మిక స్పందించింది. ఓ అభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు ఇప్పడే నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు బాధగా ఉంది. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు అతన్ని కలుస్తానన్న నమ్మకం ఉంది. అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ఇక రష్మిక ఇటీవలె ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ నేపథ్యంలో అక్కడకి షిఫ్ట్ అయినట్లు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న రష్మిక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తి కాకుండానే మరో బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది. Guys it just came to my notice that one of you had travelled super far and have gone home to see me.. Please don’t do something like that.. i feel bad that I didn’t get to meet you🥺 I really really hope to meet you one day❤️ but for now show me love here.. I’ll be happy! 🌸🥰 — Rashmika Mandanna (@iamRashmika) June 27, 2021 చదవండి : ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన రష్మిక చూపు కోల్పోయిన కత్తి మహేష్? -
రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ 900 కి.మీ ప్రయాణం
సినీ హీరో, హీరోయిన్లపైన అభిమానులు చూపే ప్రేమ అంత, ఇంత కాదు. వారికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు చాలానే ఉంటారు. తమకు నచ్చిన హీరో, హీరోయిన్లను వెండితెరపై చూస్తేనే పండగ చేసుకునే ఫ్యాన్స్... ఇక వారిని ప్రత్యేక్షంగా చూస్తే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. జీవితంలో ఒక్కసారైనా తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లను ప్రత్యేక్షంగా చూడాలని, సెల్ఫీ దిగాలని అనుకుంటారు. అవకాశం వస్తే వెళ్లి నేరుగా కలుస్తారు. కానీ పనిగట్టుకొని వారికోసం అయితే వెతకరు. అయితే అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్ ఒకరు అలాంటి పనే చేశాడు. ఎప్పుడూ తెరమీదేనా.. ఓ సారి రియల్‌గా చూద్దాం అనుకున్నాడో ఏమో.. ఆమెను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు. వివరాల్లోకి వెళితే... తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి.. రష్మికకు వీరాభిమాని. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలనుకున్నాడు. గూగుల్ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు వెళ్లాడు. . ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ… కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు.. రష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లిందని సదరు వ్యక్తిని వెనక్కిపంపారు. -
అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్ప్రైజ్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. తన నూతన ఇంటి గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించి సదరు అభిమాని ఫంక్షన్‌కు వెళ్లి అతడికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించాడు బెల్లంకొండ. అసలు విషయం ఎంటంటే.. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల అతడు నూతన ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా శ్రీనివాస్‌కు ఆహ్వానం అందించాడు. దీంతో అభిమాని కోరిక మేరకు శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు తండ్రి బెల్లంకోండ సురేశ్, తల్లి పద్మ, సోదరుడు గణేశ్‌ను కూడా తీసుకుని హైదరాబాద్ నుంచి కర్నూలుకు పయనమయ్యాడు. కరోనా కారణంగా కాలు బయటక పెట్టలేని పరిస్థితిలో కూడా అభిమాని ఫంక్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా ఆ అభిమాని కోరికను మన్నించి కుటుంబ సమేంతంగా ఆ ఫంక్షన్‌కు హాజరై అతడికి, అతడి కుటుంబానికి బెల్లంకొండ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. అది చూసి నెటిజన్లు, అభిమానులు బెల్లకొండ శ్రీనివాస్, అతడి ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అభిమానికి కరోనా..స్వయంగా ఫోన్ చేసిన చిరంజీవి
సాక్షి, కాకినాడ : కరోనాతో ఆసుపత్రిలో చేరిన తన అభిమానికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన చిరంజీవి అభిమాని ఒకరు కరోనాతో కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న చిరంజీవి నేరుగా అతడికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగానే తగ్గిపోతుందని, భయపడొద్దని చెప్పి అతడిలో ధైర్యాన్ని నింపారు. పెద్ద డాక్టర్‌తో మాట్లాడనని, త్వరగా కోలుకుంటావని చెబుతూ అభిమానికి అండగా నిలిచారు. అయితే తను ఎంతగానో ఆరాధించే చిరంజీవి స్వయంగా తనకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీయడంపై ఆయన అభిమాని ఎంతో సంతోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి నుంచి ఫోన్ రావడం మర్చిపోలేని అనుభవమని పేర్కొన్నారు. -
సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు
సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. ఈ మధ్య సోషల్ మీడియా, బిగ్‌బాస్ వంటి షోల ద్వారా కూడా కొందరు సెలబ్రిటీలుగా మారుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. వీరు బయట కనిపిస్తే చాలు వాళ్లతో సెల్ఫీ తీసుకోవాలని, మాట్లాడాలని, కనీసం దగ్గర నుంచైనా చూడాలని తెగ తాపత్రయపడతారు. కొన్ని సందర్భాల్లో ఆ అభిమానమే ముదిరి ఆకతాయి చేష్టలుగా మారి తారలను ఇబ్బందుల్లో పడేలా చేస్తుంది. ఇటువంటి చేదు సంఘటనే బిగ్‌బాస్ ఫేమ్ అర్షి ఖాన్‌కు విమానాశ్రయంలో ఎదురైంది. అర్షి ఖాన్ ముంబై విమానాశ్రయంలో కనపడే సరికి అక్కడ ఓ అభిమాని ఆమెను ఒక ఫోటో కావాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది కూడా. ఫొటోకు పోజిస్తుండగా సడన్‌గా అతడు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా అర్షిని షాక్‌కు గురిచేసింది. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత అర్షి ఖాన్ తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అర్షి ఖాన్ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లోని అత్యంత వివాదాస్పద పోటీదారులలో ఒకరు. ఆమె గతంలో బిగ్‌బాస్ 11వ సీజన్లో వికాస్ గుప్తా, శిల్పా షిండే, హీనా ఖాన్ వంటి సెలబ్రిటీలతో హౌస్‌లో తళుక్కున మెరిసింది. ( చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కొడుకు ఫొటోతో థియేటర్‌కు, కన్నీరు ఆగడం లేదు
శాండల్ వుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తాజా సినిమా 'యువరత్న' విడుదల కోసం కర్ణాటక సీఎం యాడ్యురప్ప జీవో సైతం మార్చిన సంగతి తెలిసిందే. పునీత్ తాజాగా నటించిన ‘యువరత్న’ సినిమా విడుదల కరోనా కారణంగా కొంత వివాదంలో పడింది. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ‘యువరత్న’ మూవీ విడుదల తేదీని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మూవీని విడుదలకు అనుమతించాల్సిందిగా చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు, శాండల్ వుడ్ ప్రేక్షకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై నిరసలు కూడా చేశారు. ఇక ఎన్నో వివాదాల మధ్య ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రీల్ 1వ తేదీన థీయేటర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పునీత్ ‘యువరత్న’ మూవీ చూసేందుకు ఓ వ్యక్తి తన కొడుకు ఫొటోతో థియేటర్‌కు వచ్చాడు. అది చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. చివరకు దాని వెనక ఉన్న కారణం తెలిసి అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా కర్ణాటకలోని మైసూర్ కువెంపు నగరంకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ నాలుగు నెలల కిందట మిత్రులతో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు విడిచాడు. యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రిలో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న సినిమా థియేటర్‌కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని మూవీని చూశారు. దీనిపై అతడు మాట్లాడుతూ.. కొడుకు హరికృష్ణన్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని అని, ఆయన సినిమాలన్నీ విడుదలైన మొదటి రోజే చూసేవాడని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు యువరత్న మూవీ విడుదలకు ముందే తన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. -
చరణ్‌కు ఇల్లు కట్టిన ఫ్యాన్.. స్వయంగా కలిసిన హీరో..
తాము ఇష్టపడే హీరో, హీరోయిన్లపై ఫ్యాన్స్ పిచ్చి అభిమానం చూపిస్తుంటారు. వారి పుట్టిన రోజులు, సినిమా రిలీజ్ అప్పుడు ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటారు. కానీ అలా చేసే అవకాశం రాకపోవచ్చు. అయితే బంజారాహిల్స్‌కు చెందిన బొడ్డు శ్రీమతి అనే మహిళకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అంటే అమితమైన అభిమానం. ఆయన అన్ని సినిమాలను తప్పకుండా ఫాలో అవుతుంటుంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు. దీంతో తన కోసం ఓ అందమైన బహుమతిని తయారు చేసింది. కొబ్బరి చీపురుతో చూడ ముచ్చటైన ఓ ఇంటిని నిర్మించింది. ఈ విషయం తెలుసుకున్న చరణ్ ఎంతో ఉప్పొంగిపోయాడు. అంతేగాక వారిని స్వయంగా కలుసుకొని ఆ ఇంటిని స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కెరీర్ పరంగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం,రణం,రుధిరం) చిత్రంలో నటిస్తున్నాడు. చరణ్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా, అజయ్ దేవ్గన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. అంతేగాక చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్యలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధ అనే పాత్రలో అలరించనున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: వైరలవుతున్న రామ్‌చరణ్- ఉపాసన ఫోటో Megapower Star @AlwaysRamCharan met his fan Smt. @BodduSrimathi who gifted him a house made of coconut broomsticks that she designed and built by herself. #RamCharan pic.twitter.com/HnToNjaHHQ — BARaju (@baraju_SuperHit) March 25, 2021 -
చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత
‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరుపుకుంటోంది. దీంతో షూటింగ్ సెట్స్‌కు అక్కినేని అభిమానులంతా క్యూ కడుతున్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కి గుంపులు గుంపులుగా చేరారు. దీంతో నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలు దిగాడు. అయితే అక్కడ నదిలో నాగచైతన్యతో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీరాభిమాని చైతును చూసేందుకు ఏకంగా నదిలోకే దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చిత్రీకరణ మధ్యలో అభిమాని నదిలో దూకడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డైరెక్టర్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత చైతు సదరు అభిమానిని కలిసి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు అతడితో మాట్లాడాడు. అనంతరం అభిమానితో ఫొటో దిగి తిరిగి పింపించాడు. ఇక తన అభిమాన హీరోని కలిసే అవకాశం వచ్చినందుకు సదరు అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. Neekuna fanism ki avadhulu levu Anna @chay_akkineni ❤️🙏 Ne cult fanism level veru anthe 💥🤙#ThankYouTheMovie#LoveStoryOnApril16th pic.twitter.com/ImJjKZ4HOj — Aarya Prasad (@Aaryaprasad) March 2, 2021 చదవండి: ‘ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా? -
మ్యాడీ షో స్పాయిలర్, ఛీ నిరుత్సాహపరిచాడు..
హీరో మాధవన్ (మ్యాడీ) తాజా చిత్రం ‘మారా’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో విడుదలైన సంగతి తెలిసిందే. మాలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన రోమాంటిక డ్రామా ‘చార్లీ’ని దర్శకుడు దిలీప్ కుమార్ తమిళంలో ‘మారా’ పేరుతో తెరకెక్కించాడు. జనవరి 8న అమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ సినిమాపై మూడుకు పైగా రేటింగ్‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా తాజాగా ఓ అభిమాని మాత్రం మ్యాడీపై విమర్శలు గుప్పించాడు. ఇక అది చూసి మ్యాడీ ఇచ్చిన సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘మారా బిలో యావరేజ్ మూవీ. చార్లీ సినిమా మొదటి 30 నిమిషాల తర్వాత కూడా ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడి ఉంటారు. నిజంగా మాధవన్ షో స్పాయిలర్, అంతగా ఆయన పాత్ర నిరుత్సాహపరిచింది’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: నెటిజన్‌కు రివర్స్ కౌంటరిచ్చిన హీరో) #Maara completely floored by its sheer magic. It’s poetic, feel good n brings a tear with a smile. @ActorMadhavan #MouliSir @ShraddhaSrinath n the entire team, What a show! Marvellous!!!! #Director @dhilip2488 you are brilliant 👏👏👏👏💐💐💐❤️❤️❤️❤️ — KhushbuSundar ❤️ (@khushsundar) January 11, 2021 ఇక దీనికి మాధవన్ ‘హో మిమ్మల్ని నిరుత్సాహపరిచినందకు క్షమిచండి. మరోసారి ఈ తప్పు జరకుండా చూసుకుంటా. తదుపరి సినిమాలో మంచి ప్రదర్శన ఇస్తాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీతో సమాధానం ఇచ్చాడు. అయితే మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘చార్లీ’ని డైరెక్టర్ దిలీప్ కుమార్ ‘మారా’ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. చార్లీలో హీరో దుల్కర్ సల్మాన్, పార్వతీలు లీడ్రోల్లు పోషించగా మారాలో మాధవన్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. కాగా ఓటీటీలో విడుదలైన మారా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో మ్యాడీ పాత్ర చాలా అద్బుతంగా ఉందని, మాధవన్ తన నటనతో ‘మారా’కు జీవం పోశాడంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేగాక ఇందులోని పలు సన్నివేశాల్లో మ్యాడీ ఎనర్జీటిక్, ఉల్లాసవంతమైన నటనతో హైలెట్‌గా నిలిచాడాని ప్రశంసిస్తున్నారు. ఇక మౌలీ, షీవాద నాయర్, అభిరామీ, అలెగ్జాండర్ బాబులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. (చదవండి: రతన్ టాటా బయోపిక్.. అది నేను కాదు..) -
బుల్లి అభిమాని కల నెరవేర్చిన బన్నీ
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కల నెరవేర్చడంతోపాటు అనాథబాలల్లో సంతోషాన్ని నింపారు. తన బుల్లి వీరాభిమానికి ఆయన ఆటోగ్రాఫ్ పంపించడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బిగ్‌బాస్ ఫేమ్ వితిక షేరు అభ్యర్థన మేరకు ఆటో గ్రాఫ్‌తోపాటు, శాంటా బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. వీటిని అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ స్వయంగా అనాథాశ్రమాన్ని సందర్శించి పిల్లలతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో కలిసిపోయి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు బహుమతులను అందజేయడం విశేషం. దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. థ్యాంక్యూ బన్నీ అన్నా అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా బన్నీ పిల్లలు అర్హ, అయాన్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తండ్రితో పోటీపడుతూ మరీ అభిమానులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ ట్రీ అలంకారం, మురిసిపోతున్న అల్లు అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్‌కు లక్షల సంఖ్యలో వ్యూస్ రావడమే ఇందుకు ఉదాహరణ. -
ఎన్టీఆర్ చొరవ, ఫ్యాన్స్ ఫిదా!
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్‌ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీంతో యంగ్ టైగర్ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన తన వీరాభిమాని దీనావస్థ గురించి విని చలించిపోయారు. వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్‌తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తరువాత వెంకన్న తల్లితో కూడా మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అభిమాని కల నెరవేర్చిన అల్లు అర్జున్!
సినిమా హీరోలకు, హీరోయిన్లకు చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే వీరిలో కొంతమంది సినిమా రిలీజైన మొదటి రోజు సినిమాలు చూస్తూ, కట్ అవుట్లు పెట్టే వారుంటే మరికొంతమంది వారి కోసం ఏదైనా చేసే వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఒక ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరో అల్లుఅర్జున్ కోసం ఏకంగా రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు కలవాలని ప్రయత్నిస్తున్న దక్కని అవకాశం ఈ సరైన దక్కుతుందా అని ఆశపడిన అతని కల నెరవేరింది. ఎట్టకేలకు తన అభిమాన హీరోను కలుసుకొని ఫోటో దిగి మురిసిపోతున్నాడు ఆ వీరాభిమాని. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని, దాంతో ఆయనను కలవడానికి నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాడు. అయితే ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయాడు. దీంతో ఆ వీరాభిమాని గత నెలలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయానని, ఈసారి బన్ని కోసం పాదయాత్ర చేసుకుంటూ వస్తానని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 14న నడుచుకుంటూ హైదరాబాద్‌కు బయలుదేరిన నాగేశ్వరరావు 22వ తేదీకి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అదే సమయంలో బన్ని తన కుటుంబంతో కలిసి గోవా టూర్‌కు వెళ్లారు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన అభిమానిని తన ఆఫీసులో కలిసి గంట సేపు మాట్లాడాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే బన్ని ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్ని కనిపించనున్నాడు. రష్మిక మందనా అల్లు అర్జున్ పక్కన హీరోయిన్గా కనిపించనుంది. చదవండి: సందేశాత్మక చిత్రం.. బాగా నచ్చింది: బన్నీ -
బన్నీని కలిసేందుకు అభిమాని పాదయాత్ర
-
నీకేం కాదు కన్నా.. ధైర్యంగా ఉండు..
చెన్నై: ‘నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను’ ఈ మాటల్ని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానిలో ధైర్యాన్ని నింపటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బాషాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారంతా ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కూడా కరోనా కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంట్లోనే ఉంటూ త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి సుదీర్ఘ చర్చల్లో మునిగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రజనీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన మురళి అనే అతను కరోనా వ్యాధితో ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇతనికి యూరిన్ సమస్య కూడా ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. (చదవండి: రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?) ఇలాంటి పరిస్థితుల్లో మురళి తన ట్విట్టర్లో రజినీకాంత్ గురించి ‘2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను’ అని పేర్కొన్నాడు. తన అభిమాని∙గురించి తెలిసిన రజనీకాంత్ అతనికి ఒక వీడియోను పంపారు. అందులో ‘మురళి నేను రజనీకాంత్‌ని మాట్లాడుతున్నాను. నీకేం కాదు కన్నా. ధైర్యంగా ఉండు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తావు. ఆ తర్వాత దయచేసి కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి. నేను మిమ్మల్ని చూస్తాను’ అంటూ రజనీకాంత్ తన అభిమానికి ధైర్యం చెప్పారు. -
అభిమానికి బ్రెయిన్ ట్యూమర్: చలించిపోయిన నాగ్
ఆమె పేరు లక్ష్మి, నెల్లూరువాసి. హీరో నాగార్జునకు వీరాభిమాని. అయితే ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. మరికొద్ది నెలల్లో చివరి సర్జరీ చేయించుకోనుంది. ఈ విషయం కాస్తా నాగ్ చెవిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఎలాగైనా తన అభిమానిని సంతోషపెట్టాలనుకున్నారు. ఆమెకు కొండంత ధైర్యం ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కాలం కాబట్టి ఆమె దగ్గరకు వెళ్లలేకపోయారు. వెంటనే మరో ఐడియా రచించి, అనుకున్నదే తడవుగా అమలు చేశారు. నేడు(శుక్రవారం) ఆమెకు సర్ప్రైజ్ కాల్ చేశారు. తాను ఆరాధించే హీరో తనకు కాల్ చేతనకే స్వయంగా కాల్ చేశారన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. నాగ్ గొంతు విని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది. (చదవండి: బిగ్‌బాస్ 4 ప్రోమో.. గోపి ఎవరు?) జూమ్ వీడియో కాల్లో అటు హీరో, ఇటు అభిమాని సరదాగా కాసేపటివరకు ముచ్చట్లాడుకున్నారు. 'ఈ జన్మకిది చాలు.. ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు' అని లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాగ్.. ఆమెకు తానున్నానంటూ ధైర్యాన్ని నూరిపోశారు. త్వరలోనే జబ్బు నయమవుతుంటూ భరోసా కల్పించారు. నాగ్‌తో మాట్లాడుతున్నంత సేపు లక్ష్మి ఈ లోకాన్నే మర్చిపోయింది. తనకసలు ఏ జబ్బు లేనట్లు, ఉన్నా అది చిటికెలో నయమైపోయినంత సంబరపడిపోయింది. ఇప్పుడు సర్జరీకి వెళ్లడానికి ఆమెకు కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే ఆమె వెనక నాగ్ ఇచ్చిన బలం, ధైర్యం జంటగా ఉందిప్పుడు. (చదవండి:ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్) -
దివ్య అగర్వాల్‌కి అభిమాని షాక్..
ముంబై: ప్రముఖ నటి దివ్య అగర్వాల్ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల ఓ అభిమాని తాను లంగ్ క్యాన్సర్‌తో చనిపోతున్నట్లు దివ్య అగర్వాల్‌కి ట్వీట్ చేశారు. కాగా తన అభిమాని మరణించాడన్న వార్త జీర్ణించుకోలేక ఎన్నో గంటలు పాటు ఏడ్చానని తెలిపింది. తన అభిమాని నిజంగా చనిపోయాడని అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి తాను ప్రయత్నం చేశానని, కానీ గాసిప్ కోసమే తన అభిమాని మరణించినట్లు అబద్ధం చెప్పాడని తెలుసుకొని షాక్‌కు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ నటి అభిమానులైనా తీవ్రంగా స్పందిస్తారని, ఇలాంటి పరిస్థితులే స్టార్స్ సీరియస్‌గా రియాక్ట్ కావడానికి తోడ్పడతాయని తెలిపారు. ఫేక్ వార్త చెప్పిన తన అభిమాని గురించి స్పందిస్తూ.. ఎవరైనా తనను అభిమానించే వాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటానని, నిరంతరం వారు సంతోషంతో పాటు సమాజంలో గౌరవంగా వ్యవహరించాలని అభిమానికి నటి సూచించింది. నిజంగా అభిమానించే వాళ్లను ఎప్పటికి మోసం చేయరాదని తన ఫ్యాన్‌కు దివ్య అగర్వాల్ సూచించింది. దివ్య అగర్వాల్ యాంకర్‌గా, మోడల్‌గా, రియాల్టీని షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. -
బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇకపై తనకు ఉద్యోగం దొరుకుందో లేదో అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేహం వ్యక్తం చేశారు. అయితే 65 ఏళ్లపైబడిన వారు అవుట్ డోర్ షూటింగ్లో పాల్గొనేందు వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీంలో మహరాష్ట్ర ఉత్తర్వులను ఉద్దేశిస్తూ బిగ్‌బీ సరదాగా చేసిన ట్వీట్‌కు ఓ అభిమాని చమత్కరించాడు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ) అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్ లెటర్‌ను ఆయన పోస్టుకు ట్యాగ్ చేశాడు. దీనికి అమితాబ్.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లేటర్‌ను పంచుకున్నారు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్... కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. ఇటీవల బిగ్ బీతో పాటు మహమ్మారి బారిన పడిన ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఆయన కోడలు, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యలు పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాను జయించిన అభిషేక్) -
కంప్యూటర్ కాలం.. కిరోసిన్ ఫ్యాన్
సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్‌ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్‌తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు. విదేశాలనుంచి దిగుమతి... నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్ ఫ్యాన్ కూడా ఇంగ్లండ్ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్ హనీఫ్ ఇల్యాస్ బాబా ఇంట్లో కిరోసిన్ ఫ్యాన్ ఇంకా పనిచేస్తోంది. డిజైన్ డిఫరెంట్.. దీనిని 1800లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. ఫ్యాన్ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి. నగరంలోనే అరుదుగా.. 1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్లో వచ్చాక దీనిగురించి ఆలోచించడం మానేశారు. పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్ తెలిపారు. -
పూజా కోసం ఐదు రోజులు ఫుట్‌పాత్‌పై..
కొందరు తమ అభిమాన సినీ తారలను కలుసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. షూటింగ్ ప్లేస్‌లకు, ఏదైనా ఈవెంట్లు జరిగే చోట్లకి వెళ్లి వారిని కలవాలని చూస్తారు. కానీ భాస్కర్ రావు అనే అభిమాని మాత్రం హీరోయిన్ పూజా హెగ్డేను కలిసేందుకు ఐదు రోజులు నిరీక్షించాడు. ఐదు రాత్రులు ఫుట్‌పాత్‌పైనే పడుకున్నాడు. ఈ విషయాన్ని పూజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. భాస్కర్‌రావుతో జరిపిన సంభాషణ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. డీజే సినిమా అప్పటినుంచి పూజా అంటే అభిమానమని భాస్కర్‌రావు చెప్పారు. ఐదు రోజులుగా రోడ్లపై పడుకున్నానని భాస్కర్‌రావు చెప్పడంతో.. ఇంకెప్పుడూ అలా చెయ్యవద్దని పూజా కోరారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని సూచించారు. అవసరమనుకుంటే సోషల్ మీడియాలో మెసేజ్ చేయవచ్చని చెప్పారు. ‘నన్ను కలవడానికి ముంబైకి వచ్చి ఐదు రోజుల పాటు వెయిట్ చేసినందుకు భాస్కర్ రావుకు థ్యాంక్యూ. ఈ విషయం నన్ను కదిలించింది.. కానీ నా అభిమానులు ఇలా ఇబ్బంది పడటం బాధ కలిగిస్తోంది. నా కోసం అభిమానులు ఇలా చేయడాన్ని నేనెప్పుడు కోరుకోను. మీరు ఎక్కడున్నా.. మీ ప్రేమను, అభిమానాన్ని నేను పొందుతూనే ఉంటాను. మీరే నాకు బలం. లవ్ యూ ఆల్.. ’ అని పూజా పేర్కొన్నారు. కాగా, అల్లు అర్జున్‌తో కలిసి పూజా నటించిన అల.. వైకుంఠపురములో.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పూజా బిజీబిజీగా గడిపారు. -
అభిమాని హద్దు మీరిన చర్య
-
హీరోయిన్ చేతిని ముద్దాడబోయిన అభిమాని
తమకు నచ్చిన సెలబబ్రిటీ కళ్లముందు కనబడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దొరికిందే చాన్స్ అనుకొని సెలబబ్రిటీల దగ్గర మితిమీరి ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల సిసీనటులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు కూడా ఇలాంటి చేదు ఘటన ఎదురైంది. జిమ్ నుంచి బయటకు వచ్చిన సారా అక్కడి మీడియా ప్రతినిధులను నవ్వుతూ పలకరించింది. కొన్ని ఫొటోలకు స్టిల్స్ ఇవ్వండి అంటూ ఓ మీడియా కోరగా దాన్ని సున్నితంగా తిరస్కరించింది. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో సెల్ఫీలు దిగి, షేక్‌హ్యాండ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తున్న సారా చేతిని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సారా తన చేయిని వెనక్కు తీసుకుంది. మితిమీరి ప్రవర్తించిన అభిమానిని అక్కడి సెక్యూరిటీ గార్డు కోపంతో కొట్టడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై సారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు ఓ బాడీగార్డును నియమించుకోవచ్చు కదా’ అంటూ సారాకు సలహాలిస్తున్నారు. ‘అభిమాని హద్దు దాటి ప్రవర్తించడం ఏమీ బాగోలేదు’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాగా సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కూలీ నం.1 రీమేక్, లవ్ ఆజ్ కల్ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: వధూవరులుగా సారా-వరుణ్‌లు! ఇక రెచ్చిపోతా! -
అరె ! ఫోటో భలే ఉందే : కోహ్లి
గువాహటి : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానాన్ని ఓ వ్యక్తి సరికొత్తగా చాటాడు. పాత మొబైల్ పోన్లతో కోహ్లి చిత్రపటాన్ని రూపొందించాడు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ అనే అభిమాని.. పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించి కోహ్లి చిత్రపటం రూపొందించాడు. ప్రస్తుతం కోహ్లి సేన శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 కోసం గువాహటిలో ఉంది. దీంతో అక్కడి హోటల్లో కోహ్లిని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు. తనకు వచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయిన కోహ్లి ఆ చిత్రపటంపై సంతకం చేశారు. అలాగే రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పారు. ‘ఇది చాలా అత్యుత్తమ క్రియేషన్.. వెల్ డన్.. బెస్ట్ విషెస్ ఫ్రమ్ కోహ్లి’ అని రాశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘కొద్ది నెలల కోసం కోహ్లి గువాహటిలో మ్యాచ్ కోసం వస్తున్నాడని నాకు తెలిసింది. దీంతో పాత మొబైల్ ఫోన్లు, వైర్లతో చిత్రపటాన్ని రూపొందించాను. ఇందుకోసం నాకు మూడు రోజుల పూర్తి సమయం పట్టింది. కోహ్లిని కలిసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆయన నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చార’ని తెలిపారు. Making art out of old phones. How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD — BCCI (@BCCI) January 5, 2020 -
సీఎం వైఎస్ జగన్ పర్యటనలో అరుదైన దృశ్యం
-
‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’
లక్నో: అభిమానుల గురించి తెలుసు.. వీరాభిమానుల గురించి తెలుసు.. కానీ ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి వీరందరిని మించిన వాడు. ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మీద అభిమానంతో తన ఇంటిని మ్యూజియంలా మార్చడమే కాక.. ఏకంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ డై హార్డ్ ఫ్యాన్ కథేంటో చూడండి.. సాధారణంగానే లతా మంగేష్కర్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువ. కానీ మీరట్‌కు చెందిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి లతాజీ గాత్రానికే కాక ఆమె జీవితంలో పడిన కష్టానికి కూడా అభిమాని అయిపోయాడు. లతా మంగేష్కర్ పాడిన ప్రతి పాటను కలెక్ట్ చేశాడు. కేవలం పాటలు మాత్రమే కాక దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కూడా సేకరించాడు. లతాజీ పేరు మీద ఉన్న ప్రతి దాన్ని సేకరించి తన ఇంటిని నింపేశాడు. మొత్తంగా తన ఇంటిని చిన్న సైజు లతా మంగేష్కర్ మ్యూజియంగా మార్చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. లతా మంగేష్కర్ మీద ఉన్న అభిమానంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని గురించి గౌరవ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి లతాజీ పాటలు అంటే పడి చచ్చేవాడిని. నాతో పాటు ఆమె మీద నా అభిమానం కూడా పెరిగి పెద్దవసాగింది. నా జీవితం అంతా ఆమెని ఆరాధించడానికే సరిపోతుంది. ఆమె నా గురువు, దైవం. నేను ఆమెకు శిష్యుడిని, భక్తుడిని. ఇక వేరే స్త్రీకి నా హృదయంలో, జీవితంలో చోటు లేదు’ అని తెలిపారు. లతా జీకి సంబంధించిన పాటలు, పుస్తకాలు, వస్తువులు మాత్రమే కాదు ఆఖరికి ఆమె చేసిన ట్వీట్లను కూడా కలెక్ట్ చేశాడు గౌరవ్. -
900 కిలోమీటర్లు నడిచిన అభిమాని
అక్షయ్ కుమార్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నాడు. ముఖ్యంగా దేశభక్తి అంశాలు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో అక్షయ్ ప్రస్తావన తప్పక వస్తోంది. ‘దేశంలో స్త్రీలకు శానిటరీ నాప్కిన్ లేదని ఉద్యమం వస్తే అక్షయ్ సినిమా చేస్తాడు. ఆడవాళ్లకు టాయిలెట్లు లేవంటే అక్షయ్ సినిమా చేస్తాడు. ఆడవాళ్లు మార్స్ గ్రహం మీదకు ఆర్బిటర్‌ను పంపితే అక్షయ్ సినిమా చేస్తాడు. ఇప్పుడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశారు... ఇక అక్షయ్ సినిమా చేస్తాడు’ అని నెట్లో వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధాని మోడీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి అతడు దేశ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిగా మారిపోయాడని కూడా అనవచ్చు. ఈ నేపథ్యంలో అక్షయ్ మీద అభిమానం పెంచుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మొన్నటి ఆదివారం ఉదయం వర్షం కురుస్తున్న సమయంలో ముంబైలోని అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఒక అభిమాని ప్రత్యక్షమయ్యాడు. రోజూ ఇది మామూలే కాని ఈ అభిమాని కొంచెం వేరుగా ఉన్నాడు. ఇతడు గుజరాత్‌లోని ద్వారకా నుంచి ఏకంగా 900 కిలోమీటర్లు నడిచి అక్షయ్‌ను చూడటానికి వచ్చాడు. పేరు పర్బత్. అక్షయ్ ఇతణ్ణి చూసి ఆశ్చర్యపోయి ‘ఎందుకు నడిచావు’ అని అడిగాడు. ‘నేను ఫిట్‌గా ఉన్నాను. మీ అభిమానులు ఫిట్‌గా ఉంటారు. నడవడం ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి నడిచాను’ అని జవాబు చెప్పాడు. అక్షయ్‌ను చూడటానికి పర్బత్ రోజుకు 18 నుంచి 21 కిలోమీటర్లు నడుస్తూ పద్దెమిది రోజుల్లో ఈ దూరం పూర్తి చేశాడు. అక్షయ్‌లా ఉన్న మజిద్ మీర్ ‘ఇంత అభిమానం మీ నుంచి పొందడం నా అదృష్టం’ అని అక్షయ్ ఆ అభిమాని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.అయితే మరోవైపు కాశ్మీర్లో తిరుగుతున్న ఒక పాత్రికేయునికి అచ్చం అక్షయ్ కుమార్‌ను పోలిన ఒక రైతు కనిపించాడు. అతడి పేరు మజిద్ మీర్. అయితే ఆ రైతు అక్షయ్ కుమార్ అభిమాని కాదు. సునీల్ గవాస్కర్ అభిమాని. రోజూ పొలానికి వెళ్లే ముందు సునీల్ గవాస్కర్‌లా తల మీద క్రికెట్ హ్యాట్‌ను ఆ రైతు పెట్టుకుంటాడట. సెలబ్రిటీలను ఇలా సామాన్యులు వార్తల్లో ఉంచుతూనే ఉంటారు. -
మార్కెట్లోకి కిడ్స్ ఫ్యాన్స్...
సాక్షి, హైదరాబాద్: కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ఉషా ఇంటర్నేషనల్ తాజాగా మార్కెట్లోకి కిడ్స్ ఫ్యాన్లను విడుదల చేసింది. ఈ ఫ్యాన్ల మీద బార్బీ, చోటా భీమ్, డొరేమన్ వంటి కార్టూన్ క్యారెక్టర్స్ బొమ్మలను ముద్రించి ఉంటాయి. రిమోట్ కంట్రోల్ ఆధారిత ఈ ఫ్యాన్ల ధర రూ.4,500 నుంచి ప్రారంభం. రెండేళ్ల వారంటీ ఉంటుంది. పిల్లల కళలు, అభిరుచుల ఆధారంగా 3 నుంచి 8 ఏళ్ల వయస్సు పిల్లల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించామని ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రిక్, ఫ్యాన్ అండ్ పంప్స్) రోహిత్ మథూర్ తెలిపారు. కిడ్స్ ఫ్యాన్ల విభాగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఎదుగుతున్నామని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర
-
లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ..
విద్యుత్ సామాజిక సంపద. దీని వినియోగాన్ని తగ్గించుకుంటే ఎంతో మేలు. అసలే వేసవి. ఆపై కరెంట్ వాడకం విరివిగా ఉంటుంది. విద్యుత్ అవసరాలకు– ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. బిల్లు ఎంత వచ్చినా చెల్లించేందుకు డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యుత్‌ను ఆదా చేయకపోవడంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందరికీ అన్ని రకాల విద్యుత్ అవసరాలు తీరాలంటే దీనికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలి. ఇవన్నీ సవ్యంగా అమలు కావాలంటే కరెంట్ ఆదాపై నగర వాసులు శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఆదా సామాజిక బాధ్యతగా భావించాలి. బస్తీల నుంచి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వాసుల వరకు గుర్తించాలి. విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకోవాలి. విద్యుత్‌ను ఎలా ఆదా చేయవచ్చో తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరో వాషింగ్ మెషిన్లు వినియోగిస్తున్నప్పుడు.. దుస్తులు ముందుగా నానబెట్టండి. వాషింగ్ మెషిన్లను ఫుల్ లోడ్‌తో వాడుతూ.. టైమర్‌ను తక్కువగా సెట్ చేసుకోవాలి. సరైన పాళ్లలో మాత్రమే నీరు, డిటెర్జంట్ వాడాలి. రిన్స్ చేయడానికి చల్ల నీరు మాత్రమే వాడాలి. ఎలక్ట్రిక్ డ్రయింగ్ ద్వారా కాకుండా వీలైనంత వరకు దుస్తుల ఆరుబయట ఆరబెట్టుకోవాలి. పీక్ లోడ్ సమయాల్లో (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటలు) మెషిన్ వాడవద్దు. రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు.. ఫ్రిజ్ డోర్ ఎక్కువసార్లు తెరవకూడదు. ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మీడియంలో సెట్టింగ్ చేసుకోవాలి. వేడిని ప్రేరేపించే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఫ్రిజ్ ఉండాలి. గోడకు అర అడుగు దూరంగా, గాలి బాగా వీచే ప్రదేశంలో ఫ్రిజ్ ఉంచాలి. స్టార్ సామర్థ్యమున్న ఫ్రిజ్‌లను వాడాలి. ప్రెషర్ ఆన్ అవుతున్నా, బాడీ అమితంగా వేడెక్కినా మెకానిక్‌తో చెక్ చేయించుకోవాలి. గీజర్లుఉపయోగించినప్పుడు.. అక్కర్లేని సమయాల్లో స్విచ్ఛాఫ్ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే గీజర్లను ఆన్ చేయండి. థర్మోస్టాట్ సెటింగ్‌ను 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి. గీజరు స్విచ్‌ను బాత్రూంలో ఏర్పాటు చేసుకోండి. తద్వారా వెంటనే ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటిన్లలో గీజర్లు విధిగా వాడాలి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో.. అంతగా అత్యవసరం కాని లోడ్‌ను, పీక్ లోడ్ సమయం నుంచి (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది) మిగిలిన సమయానికి మార్చాలి. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. పవర్ ఫేక్టర్ వీలైనంతవరకు 0.99 పైబడి మెయింటెన్ చేయాలి. నాన్ లీనియర్ లోడ్, అధికంగా ఉన్న పరిశ్రమల్లో హార్మోనిక్ ఫిల్టర్లు వాడాలి. బ్లోయర్లు, పంప్సెట్లు, ఎయిర్ కంప్రెషర్లు తదితర సాధనాలలో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్, ‘వి’ బెల్టులకు బదులు ప్లాట్ బెల్ట్స్, స్టార్–డెల్టా–స్టార్ స్టార్టర్లను, తక్కువ రాపిడి బేరింగులు మొదలైనవి వాడి విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. లోడుకు అనుగుణంగా కేబుల్ పరిమాణం, పరికరాల సామర్థ్యం, అధిక విద్యుత్ ఆదా గల మోటార్ల వినియోగం, పంప్సెట్ల వాడకం, ఆటోమెషన్ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థ పదార్థాలను తగ్గింపు, పునర్వినియోగంలో శ్రద్ధ వహించాలి. స్టార్ సామర్థ్యమున్న ట్రాన్స్ఫార్మర్లు ఎంపిక చేసుకోవడం, మూడు ఫేజ్లలోనూ సమానంగా లోడును సర్దుబాటు చేసుకోవడం ద్వారా సరఫరాలో మరింత నాణ్యత పొందవచ్చు. పరికరాల మన్నిక వృద్ధి చెందుతుంది. ఏసీ ఫిల్టర్‌ను శుభ్రపర్చుకోవాలి.. ఏసీ ఆన్‌లో ఉండగా తలుపులు, కిటికీలను మూసి ఉంచండి. కిటికీలకు సన్‌ఫిల్మ్, కర్టెన్లను వాడండి. ఇంటి టెర్రస్‌పై కూల్ హోమ్ పెయింట్ వేయడం, రూఫ్ గార్డెన్‌ను పెంచడం ద్వారా ఏసీపై లోడ్ తగ్గించవచ్చు. ఏసీకి దగ్గరలో టీవీ, లైట్లు వంటివి ఉంచకూడదు. ఏసీ యూనిట్‌పై చెట్ల నీడ పడేలా చూసుకోండి. స్టార్ సామర్థ్యమున్న ఎయిర్ కండిషనర్స్‌ను వాడండి. లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ.. వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లను ఆపివేయాలి. ఫిల్మెంట్ బల్బులకు బదులుగా ఎనిమిది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే, అంతే వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులను వాడాలి. ట్యూబ్‌లైట్లకు ఎలక్ట్రానిక్ చోక్ అమర్చుకోవచ్చు. కొత్తవి కొనేటప్పుడు విద్యుత్ ఆదా చేసే ట్యూబ్‌లైట్లు తీసుకోవచ్చు. నెలకోసారి బల్బులను శుభ్రపరచుకోవాలి. ఫ్యాన్లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను అమర్చుకోండి. బల్బులు, ట్యూబ్‌లైట్లకు దుమ్ము చేరకుండా శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో వినియోగించే వస్తువులు.. మిక్సీలో వేసే పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. పొడి పదార్థాలను సాధ్యమైనంత మేరకు గ్రైండింగ్ చేయకపోవడమే ఉత్తమం. ఇండక్షన్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్లు వాడితే 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడుగుభాగాన సమతలంగా ఉన్న స్టవ్‌లను వాడడం ద్వారా వేడి బాగా వ్యాపించి విద్యుత్ ఆదా అవుతుంది. సోలార్ వాటర్ హీటర్లు వాడాలి.. సాధ్యమైనంతవరకు సోలార్ వాటర్ హీటర్లనే వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీక్ లోడ్ సమయాల్లో వాడవద్దు. -
గాలి తగలదు.. ఊపిరాడదు!
తాగేందుకు నీళ్లుండవు... ఉక్కపోతలోనూ ఫ్యాన్ తిరగదు. ఆక్సిజన్ మాస్క్ మూతికి కట్టుకున్నా... గాలి ఆడదు. మంచాలు... స్ట్రెచర్ల సంగతి సరేసరి. ఆఖరుకు రాత్రివేళల్లో కరెంటు పోతే టార్చిలైట్లే గతి. కానీ ఇదే జిల్లాకంతటికీ పే...ద్ద ఆస్పత్రి. పాలకులు శ్రద్ధ చూపరు. ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోదు. అందుకే ఇక్కడికొచ్చే వారు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కనీస కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆస్పత్రి ఉన్నతాధికారి తన గది దాటి బయటకు రాకపోవడంతో రోగుల హాహాకారాలేవీ ఆయనకు వినపడటం లేదు. ఏపీ చాంబర్లో సంతకాలు చేస్తూ అంతా బాగుందంటూ ఆయన గొప్పలు చెబుతుండగా...వార్డుల్లోని రోగులు మాత్రం సౌకర్యాల లేమితో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచే ఫ్యాన్లు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఆస్పత్రిలో పేరుకు ఫ్యాన్లు ఉన్నా...అవి తిరగవు. ఎమర్జెన్సీ వార్డుల్లోని ఏసీలు పనిచేయడం లేదు. అందుకే రోగులు ఇళ్లనుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) యూనిట్‌లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో రోగులు ఉక్కపోతతో ప్రత్యక్షనరకం చూస్తున్నారు. వాస్తవానికి ఏఎంసీలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేసులుంటాయి. ఈ యూనిట్‌కు 24 గంటలూ నిరంతరాయంగా కరెంటు సరఫరా ఉండడంతో పాటు వెంటిలేటర్, ఏసీ, ఇతరత్రా మౌలిక సదుపాయాలుండాలి. కానీ సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేదు. వారం రోజులుగా కరెంటు సమస్య వెంటాడుతోంది. లోడింగ్ సరిగా రాకపోవడంతో యూనిట్లో ఉండే రెండు, మూడు ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. దీంతో రోగుల సహాయకులు విసనకర్రతో ఊపుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా...రోగుల ప్రాణాలే పోయేలా ఉన్నా అటు ఆస్పత్రి యాజమాన్యం గానీ, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు గాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అయినా ఓ సారి యూనిట్‌ను పరిశీలించి మెరుగైన వసతలు కల్పించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
అభిమానికి హరీశ్‌రావు బాసట
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు బాసటగా నిలిచారు. అధికారుల చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేకపోవడంతో తన సమస్యను విన్నవించుకునేందుకు వారం కింద సైకిల్ యాత్ర చేపట్టి శుక్రవారం నేరుగా హరీశ్ నివాసంలో ఆయనను కలిశాడు. ములుగు జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిల్ల తరుణ్.. సైకిల్‌పై హైదరాబాద్‌లోని హరీశ్ నివాసానికి వచ్చి కలిశాడు. ‘నేను మీ అభిమానిని అన్న. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ. అమె భూమిని వెంకటాపురానికి చెందిన కొంతమంది కబ్జా చేశారు. ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మిమ్మల్ని కలవాలని గత వారం క్రితం వెంకటాపురం నుంచి సైకిల్ యాత్రతో బయలుదేరి వచ్చాను. మీరే నన్ను ఆదుకోవాలి..’అని విన్నవించాడు. దీనిపై హరీశ్ వెంటనే స్పందించారు. అక్కడి సీఐ, ఎమ్మార్వోలతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పారు. తరుణ్ సమస్య పరిష్కారానికి హరీశ్ భరోసానిచ్చారు. రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. హరీశ్ ఆదేశాలతో ములుగు ఆర్డీవో వెంటనే స్పందించారు. తరుణ్ ఫిర్యాదు అంశంపై పత్రికా ప్రకటన జారీ చేశారు. విచారణ జరిపి తాజా పరిస్థితిని వివరించారు. దుర్గమ్మ భూమి విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు. -
‘హలో, నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను’
తిరువనంతపురం : అభిమాన సినీ తారలు, ఆటగాళ్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజంగా చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకుల కోసం గంటల తరబడి ఎదురుచూసే ఫ్యాన్స్ కాస్తా అరుదుగానే ఉంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఓ ఫేస్బుక్ పోస్ట్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ తొలిసారి దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ ప్రస్తుతం మూడు రోజుల పాటు కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ప్రియతమ నాయకుడిని కలవడం కోసం ఓ పదేళ్ల బాలుడు దాదాపు 5 గంటల పాటు ఎదురు చూశాడు. కానీ భద్రతా కారణాల వల్ల కలవలేకపోయాడు. పాపం నిరాశతో వెనుదిరిగాడు. ఆ చిన్నారి బాధ చూడలేక అతని తండ్రి ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తన కుమారినికి రాహుల్ గాంధీ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. దానిలో ‘నా కుమారుని పేరు నందన్. తన వయసు 10 సంవత్సరాలు. తను రాహుల్ గాంధీకి చాలా పెద్ద అభిమాని. ఈ రోజు రాహుల్ వయనాడ్‌లో పర్యటిస్తున్నారని తెలిసి తనను కలిసేందుకు ఉదయం 5 గంటలకే సభా ప్రాంగణానికి వచ్చాడు. నందన్‌తో పాటు నేను కూడా ఉన్నాను. అంతేకాక రాహుల్ గాంధీ అంటే తనకు ఎంత అభిమానమో తెలిపేందుకు ఓ లేటర్లో ‘మోస్ట్ ఫేవరెట్ పర్సన్’ అని రాసుకుని మరీ తీసుకువచ్చాడు. తన చొక్కా జేబుకు రాహుల్ గాంధీ ఫోటోను కూడా పెట్టుకున్నాడు. నందన్.. తన అభిమాన నాయకున్ని కలవడం కోసం దాదాపు 5 గంటల సేపు నిరీక్షించాడు. కానీ భద్రతా కారణాల వల్ల రాహుల్‌ని కలిసే అవకాశం లభించలేదు. దాంతో నా కుమారుడు చాలా నిరాశకు గురయ్యాడు’ అని పేర్కొన్నాడు. ఇలా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే.. ఈ స్టోరి తెగ వైరలయ్యింది. స్థానిక మీడియా సాయంతో ఈ విషయం కాస్తా రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. తన కోసం అన్ని గంటల పాటు ఎదురు చూసిన ఆ చిన్నారిని నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో రాహుల్.. నందన్ తండ్రికి కాల్ చేశారు. ‘హాయ్.. నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా’ అని అడిగారు. అనంతరం తన చిన్నారి ఫ్యాన్‌తో కాసేపు మాట్లాడి.. అతన్ని సంతోషపెట్టారు. రాహుల్ గాంధీ నందన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకురాలు రమ్య ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రాహుల్ చేసిన పనిని తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు. A young boy in Kannur waited to see Rahul ji but couldn’t, read what happened next or get a Malayalam speaking friend to translate :) I did too. Such a sweet gesture by @RahulGandhi https://t.co/M7Nl01Bn9U — Divya Spandana/Ramya (@divyaspandana) April 18, 2019 -
మోదీ అభిమానిపై దాడి
టీ.నగర్(చెన్నై): తంజావూరులో నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూరు సమీపంలోని ఒరత్తనాడు తెన్నమనాడు గ్రామానికి చెందిన వృద్ధుడు గోవిందరాజ్ (75) సామాజికవేత్త. వెటర్నరీ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. ప్రధాని మోదీ అంటే వల్లమాలిన అభిమానం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఒరత్తనాడు పరిసర ప్రాంతాల్లో మోదీకి ఓటేయండని ప్రాధేయపడేవాడు. ఒరత్తనాడు అన్నా విగ్రహం సమీపంలో శనివారం రాత్రి మెడలో మోదీ చిత్రపటాన్ని తగిలించుకుని దుకాణదారుల వద్ద ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గోపినాథ్ (33) అక్కడికి వచ్చారు. మోదీకి ఎలా ప్రచారం చేస్తావని గోవిందరాజ్‌తో తగాదాకు దిగాడు. వారి మధ్య వాగ్వాదం పెరగడంతో గోపీనాథ్ ఆగ్రహంతో గోవిందరాజన్‌పై దాడి చేశాడు. దీంతో గోవంద్‌రాజన్ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు ఒరత్తనాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీనిపై గోవిందరాజ్ కుమార్తె అర్బుతరసు ఒరత్తనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించారు. గోపీనాథ్.. డీఎంకే-కాంగ్రెస్ మద్దతుదారుడిగా భావిస్తున్నారు. -
వైఎస్ జగన్‌పై అభిమానంతో..
సాక్షి, కామారెడ్డి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నా.. ఆయన తనయుడు యువనేత జగన్మోహన్రెడ్డి అన్నా.. అతడికి వల్లమాలిన అభిమానం. వైఎస్సార్ సీఎంగా అందించిన సంక్షేమ పథకాలు ఆయనను వీరాభిమానిని చేశాయి. వైఎస్సార్ మరణంతో ఆయన ఎంతో కలత చెందాడు. అయితే వైఎస్సార్ ఆశయాల ను నెరవేర్చేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు రావడంతో ఆయన కోసం నిరంతరం తపిస్తున్నాడు. జగనన్న సీఎం కావాలని కోరుతూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. సీఎం అయ్యేదాక చెప్పులు తొడగనంటూ శపథం చేశాడు. ఆయనే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఆముదాల భానుచందర్. స్థానికంగా డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గడచిన 16 రోజులుగా చెప్పులు లేకుండా తన పనులు చేసుకుంటున్నాడు. మండుటెండలో కూడా ఆయన కాళ్లకు చెప్పులు తొడగడం లేదు. వివరాల్లోకి వెళ్తే భానుచందర్ ఐదో తరగతి చదివే సమయంలో దివంగత వైఎస్సార్ మహా పాదయాత్రను చూసి అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారాడు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ అంటే ఆయన కు విపరీతమైన అభిమానం పెరిగింది. వైఎస్సార్ మరణంతో కలత చెందిన భానుచందర్, ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్రెడ్డి జనం లో తిరుగుతుండడంతో జగన్‌లో వైఎస్సార్‌ను చూసుకుంటున్నాడు. ఏపీలో ఎన్నికలు రావడంతో జగన్ సీఎం కావాలంటూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. అప్పటిదాకా చెప్పులు ధరించనని శపథం చేశాడు. ఆరోజు నుంచి జగన్ సీఎం కావాలంటూ పూజలు చేస్తున్నాడు. జగన్ సీఎం కాగానే తిరుపతికి కాలినడకన వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. -
వైఎస్ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని
-
వైఎస్ జగన్‌కు చెక్కు ఇచ్చిన అభిమాని
సాక్షి, కడప: ఎన్నికల వేళ జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కొండంత అండగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ రాజన్న బిడ్డకు తోడుగా వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ జగన్‌ను కడప విమానాశ్రయంలో లింగాల మండలం పెద్ద కూడలకు చెందిన అనిల్ అనే అభిమాని కలిశారు. 5 లక్షల రూపాయల చెక్కును అందించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చిన విరాళం చాలా చిన్నదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల కష్టాల తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, దుర్మార్గపు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. కాగా, విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. -
చిన్నారి ఆకాంక్షను నెరవేర్చిన మహేశ్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన చిన్నారి అభిమాని ఆకాంక్షను నెరవేర్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పర్వీన్ అనే చిన్నారిని కలిసి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వీన్ అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. మహేశ్ బాబును అమితంగా ఇష్టపడే ఆమె.. తన ఫేవరేట్ హీరోను చూడాలని ఆరాటపడింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్.. ఆమెను కలిసి పరామర్శించారు. పర్వీన్‌తో కాసేపు గడిపిన మహేశ్.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తన అభిమాన నటుడు తన కోసం రావడంతో ఆ చిన్నారి ఆనందంతో పరవశించిపోయింది. ప్రస్తుతం మహేశ్ బాబు ఆ చిన్నారితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్ స్టార్ మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్గా అలరించనుంది. -
అభిమాని ట్వీట్‌పై స్పందించిన షారూఖ్
సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ముఖ్యంగా భారత్‌లో షారూఖ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులకు లెక్కే లేదు. ఇటీవల షారూఖ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం షారూఖ్ ఇప్పటికే టాప్‌లో ఉన్నాడు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అమృత్ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన సోదరుడికి షారూఖ్‌ని కలవాలనుందని రెండు రోజుల క్రితం ఓ వీడియోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాజు మీట్స్ షారూఖ్ (#RajuMeetsShahrukh) హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయిన ఈ వీడియో ఫైనల్‌గా షారూఖ్‌ను చేరింది. వెంటనే స్పందించిన షారూఖ్ ‘అమృత్ క్షమించాలి. మీ వీడియోను ఆలస్యంగా చూశాను. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి. త్వరలోనే నేను రాజును కలిసి మాట్లాడేందుకు వస్తాను’అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో షారూఖ్ స్పందించిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Sorry Amrit I hadn’t seen your video. Please give my regards to mummyji & I will figure out & speak to RAJU soon. https://t.co/hBQvmLqHgQ — Shah Rukh Khan (@iamsrk) 26 February 2019 -
ప్రీమియం ఫ్యాన్ల మార్కెట్లో ఆటంబర్గ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్, సమర్థవంతమైన మోటార్ల తయారీలో ఉన్న ముంబై కంపెనీ ఆటంబర్గ్ టెక్నాలజీస్ ప్రీమియం ఫ్యాన్ల మార్కెట్లో పోటీపడుతోంది. వచ్చే రెండేళ్లలో ప్రీమియం విభాగంలో 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ కో–ఫౌండర్ మనోజ్ మీన సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘బీఎల్డీసీ టెక్నాలజీతో రూపొందిన కంపెనీ ఫ్యాన్లు 65 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయి. ఖరీదు రూ.3,000 ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఫ్యాన్ల విపణి 6 శాతం వార్షిక వృద్ధితో రూ.10,000 కోట్లుంది. ఇందులో ప్రీమియం విభాగం వాటా 15 శాతం కాగా, వృద్ధి ఏకంగా 20 శాతముంది. గృహోపకరణాల్లో వాడేందుకు వీలుగా సమర్థవంతమైన మోటార్లకై గోద్రెజ్, వోల్టాస్లు మా కంపెనీతో చర్చిస్తున్నాయి. వచ్చే ఏడాది మిక్సర్ గ్రైండర్‌ను ప్రవేశపెట్టనున్నాం’ అని వివరించారు. -
బిగ్‌బాస్ విన్నర్‌కి శ్రీశాంత్ ఫ్యాన్ బెదిరింపులు
దీపికా కకార్ హింది బిగ్‌బాస్ 12 విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీపిక మీద యాసిడ్ పోస్తానంటూ శ్రీశాంత్ అభిమాని ఒకరు ట్విటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నరంట. దాంతో దీపిక అభిమానులు ఈ విషయాన్ని ముంబై పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి.. దీపికను రక్షించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు. దీని గురించి భువనేశ్వరి ‘శ్రీఫామ్ పేరు చెప్పి ఎవరో దీపిక మీద యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారనే విషయం గురించి నాకు తెలిసింది. ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. నేను, నా భర్త ఖచ్చితంగా చెప్పగలం శ్రీఫామ్కు చెందిన వారు ఎవరు ఇలాంటి పనులు చేయరు’ అంటూ ట్వీట్ చేశారు. My dear #SreeFam,came to know about the Acid attack news yesterday.We want to tell you all that Me and Sree are very sure that no one from #SreeFam can ever write such a thing & we believe You all. It could be any one portraying as Sreefam. — Bhuvneshwari Sreesanth (@Bhuvneshwarisr1) January 7, 2019 -
అభిమానికి నటుడు కిచ్చ సుదీప్ భరోసా
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ లేదనకుండా సహాయం చేయడంలో పైచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువ అభిమానిని కలిసి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చారు సుదీప్. బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల రాహుల్ అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్, రక్తస్రావం వ్యాధితో పడుతున్నాడు. బాలుడి శస్త్ర చికిత్సకు రూ. 8 లక్షలు ఖర్చువుతాయని వైద్యులు సూచించారు. రాహుల్ తల్లిదండ్రులు జలందర్ వెల్డర్‌గా పనిచేస్తూ రూ. 4 లక్షలు సమకూర్చుకున్నాడు. మరో మూడు లక్షల అవసరం ఉంది. అయితే రాహుల్ తన అభిమాన హీరో సుదీప్‌కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపాడు. దీనిని గమనించి సుదీప్ దానికి సమాధానమిస్తూ స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ తమకు దేవుడిలా వచ్చి సాయం చేస్తున్నారని అన్నారు. -
అభిమానాన్ని కొత్తగా ఎక్స్‌ప్రెస్ చేశాడు..
సినిమా: హన్సిక నా జీవితం అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది ఒక వీరాభిమాని నటి హన్సికపై కురిపించిన ప్రేమ. ఇప్పుడు పెద్దగా ఫేమ్‌లో లేకపోయినా ఒకప్పుడు యమ క్రేజీ హీరోయిన్ హన్సిక. అలాగని ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు లేవనికాదు. తమిళంలో మూడు, తెలుగులో బిజీగానే ఉంది. మరి అలాంటి బ్యూటీకి అభిమానుల సంఖ్య తక్కువేమీ ఉండదుగా. వారిలో వీరాభిమానులు ఉంటారు. అదుగో అలాంటి ఒక అభిమానినే ఇటీవల హన్సికపై తన అభిమానాన్ని కొత్తగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. అదెలాగంటే హన్సిక నా జీవితం అంటూ ఏకంగా 28 భాషల్లో రాసి అదే పేరుతో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి తన వీరాభిమానం హన్సికకు తెలిసేలా పోస్ట్ చేశాడు. అందులో హన్సిక నా జీవితం అంటూ తెలుగులో, హన్సిక మై లైఫ్ అని ఆంగ్లంలో, హన్సిక ఎన్ వాళ్క్కై అని తమిళంలో ఇలా ఇదే అర్థం వచ్చే విధంగా 28 భాషల్లో రాశాడు. దీంతో యమ ఖుషీ అయిపోయిన నటి హన్సిక వావ్ ఇది విభిన్నంగా బాగుంది. చాలా ధన్యవాదాలు అని ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది. హన్సిక స్పందనతో తెగ ఆనందపడిపోయిన ఆ అభిమాని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అంతే కాదు తన కోరికను వెలిబుచ్చాడు. హన్సిక ఇటీవల బాగా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది కానీ ఇంతకుముందు బొద్దుగా ముద్దుగా ఉండేది. అందుకే చిన్న కుష్బూ అని కూడా పిలిచేవారు. ఇప్పుడీ అభిమానికి హన్సిక సన్నగా బక్క చిక్కిపోవడం నచ్చలేదట. మునుపటిలానే ఉండాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరి తనపై అభిమానాన్ని 28 భాషల్లో రాసి మరీ వ్యక్తం చేసిన అభిమాని కోరికపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్రమ్‌ప్రభుతో జత కట్టిన తుపాకీ మునై చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది. అదే విధంగా 50వ చిత్రం మహా చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. -
మదినిండా పెద్దాయనే..
సాక్షి, చంద్రశేఖర్‌కాలనీ: ఆయన మదినిండా వైఎస్సారే కొలువయ్యారు.. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం తో తన స్కూటర్ రిపేరింగ్ దుకాణానికి వైస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ అని పెట్టుకున్నారు. ఆయనే నగరంలోని బడాబజార్‌కు చెందిన భిక్షపతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన చేసిన సేవలను ముగ్ధుడైన భిక్షపతి ఆయననే దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానం.. ఆయన చేసిన సేవలను నలుగురికీ చెబుతూ అందరినోటా ‘వైఎస్సార్ భిక్షపతి’గా నిలిచిపోయారు. నగరరంలోని బడాబజార్‌లో వైఎస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ పేరుతో షాప్ నిర్వహిస్తున్న నూరి భిక్షపతికి వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులక ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు ఇలా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించగా వాటిని ముగ్ధుడైన భిక్షపతి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పదిమందికీ వివరిస్తూ ఉంటారు. వైఎస్ పేరునే స్కూటర్ రిపేరింగ్ షాప్‌ను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 25ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్న భిక్షపతి తన షాప్‌లో ప్రతిఏటా వైఎస్ జయంతి, వర్ధంతులను సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ జయంతి, రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాడు. స్థోమత లేకున్నప్పటికీ తనకు ఉన్నదాంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌పై తన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పులివెందుల, హైదరాబాద్‌లో వైఎస్ కుటుంబసభ్యులతో, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన కలిశారు. -
ప్లీజ్.. నన్ను ఫాలో అవ్వొద్దు!
సౌత్‌లో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అజిత్‌తో కలిసి ఒకే ఫొటోలో బందీ అయిపోవాలని అభిమానులు కోరుకుంటారు. అజిత్ వీరాభిమాని ఒకరు అలానే అనుకున్నారు. అభిమాన హీరో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లిపోయాడు. ఓ ఫొటో దిగాలని ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ఇంతకుముందు కూడా నాలుగైదుసార్లు ఆ అభిమాని అజిత్‌తో ఫొటో దిగాలని ట్రై చేసినా వీలుపడలేదట. ఈసారి ఎలాగైనా అజిత్‌తో ఫొటో దిగాలనుకున్నాడట ఆ అభిమాని. అంతే.. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న అజిత్ కారును దాదాపు 18 కిలోమీటర్లు ఫాలో అయ్యాడు. ఇది గమనించిన అజిత్ కారు దిగి ఆ అభిమానితో ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ తర్వాత ‘‘మరోసారి ఇలా చేయవద్దు. ఫొటో కోసం నన్ను ఫాలో అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకోసం ఫొటో దిగడానికి వస్తున్నప్పుడు నీకు ఏమైనా జరిగితే నేను బాధపడతాను. అందుకే నన్నే కాదు.. ప్లీజ్.. ఎవరినీ ఇలా ఫాలో అవ్వొద్దు’’ అని అభిమానికి చెప్పారట అజిత్. -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
ముంబై: అభిమానులు తమ అభిమాన క్రికెటర్ కనిపిస్తే ఆటోగ్రాఫ్.. వీలుంటే సెల్ఫీలు తీసుకోవడం కామన్. కానీ తమ అభిమాన క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో ముద్దులు పెడుతూ ట్రెండ్ మార్చుతున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో సెక్యూరిటీ కళ్లు కప్పి మైదానంలోకి దూసుకరావడం ఇబ్బంది కలిగించే అంశం. ఇక మ్యాచ్ మధ్యలో తరుచుగా అభిమానులు మైదానంలోకి వస్తుండటంపై సెక్యూరిటీ వైఫల్యాలపై అందరూ వేలేత్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగి, ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అంపైర్లు, సెక్యూరిటీ అప్రమత్తవడంతో అభిమానిని బయటకి పంపించారు. అభిమానుల నుంచి ఊహించని ఇలాంటి ఘటనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. (ముద్దు మీరిన అభిమానం) ఆదివారం విజయ్‌హజారే ట్రోఫి తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా ముంబై-బిహార్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బిహార్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటింగ్‌కు దిగింది. అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నసమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. రోహిత్‌కు ముద్దు పెట్టే ప్రయత్నం చేసి, పాదాలను తాకబోయాడు. అనంతరం అభిమాని ఎగిరిగంతేసుకుంటూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అభిమాని ముద్దుపెడుతున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. రోహిత్‌ను అభిమాని ముద్దుపెట్టుకుంటే రితికా అసూయ పడుతున్నారు కావచ్చని అభిమానులు ఫన్నీగా స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. (మూడు సెక్షన్ల కింద కేసు నమోదు...) -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
-
కోహ్లిపై అభిమానంతో మైదానంలోకి దూసుకొచ్చి..
-
వెర్రి అభిమానంతో.. అభిమాని అత్యుత్సాహం!
-
వెర్రి అభిమానం.. క్రేన్‌కు వేళాడుతూ..!
కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు సినీ తారలను ఇబ్బందుల పాలు చేస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో అభిమానుల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట చెక్క చివంత వానం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించాడు. చాలా రోజులుగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న శింబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఓ అభిమాని అత్యుత్సాహంతో చేసిన పని విమర్శలకు కారణమైంది. శరీరానికి సీకులు కుచ్చుకొని క్రేన్‌కు వేళాడుతూ దాదాపు 25 అడుగుల ఎత్తున్న శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేశాడు అభిమాని. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. -
చిన్నారి కలను నిజం చేసిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక చిన్నారి చిత్రకారుడిని స్ఫూర్తినిస్తూ ప్రోత్సహించారు. విద్యార్థులకు, ప్రతిభావంతులకు సాయం చేయడంలోనూ, ప్రోత్సహించడంలోనూ నటుడు సూర్య ముందుంటారు. తాజాగా ఒక చిన్నారి చిత్రకారుడి కలను నిజం చేస్తూ అతనిలో మరింత స్ఫూర్తిని నింపారు. వివరాలు చూస్తే.. తేని గ్రామానికి చెందిన దినేశ్ అనే బాలుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తన సమస్యను జయించి మంచి చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన కుర్రాడికి నటుడు సూర్యను కలవాలన్నది చిరకాల కల అట. ఇదే విషయాన్ని దినేశ్ ఒక టీవీ చానల్ భేటీలో పేర్కొన్నాడు. అది సూర్య అభిమానుల దృష్టికి రాగా వారు దినేశ్‌ను తన కుటుంబసభ్యులు సహా బుధవారం చెన్నైలోని సూర్య ఇంటికి ఆయన ఆదేశాల మేరకు తీసుకొచ్చారు. దినేశ్ లక్కేమిటంటే తను నటుడు సూర్యను కలవాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఏకంగా సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ, వారి తండ్రి సీనియర్ నటుడు శివకుమార్లను ఒకే చోట చూసే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నటుడు సూర్య ఆ కుర్రాడికి కలలు కను. వాటిని సాధిస్తాననే నమ్మకం కలిగుండాలి. ఇప్పుడు నన్ను కలవాలని కలలు కన్నావు. అది నెరవేరిందిగా అంటూ దినేశ్లో స్ఫూర్తిని నింపారు. అంతే కాదు అతనికి పలు కానుకలు అందించారు. -
ధోని వీరాభిమాని!
హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగిన సమయంలో ఒక కుర్రాడి హావభావాలు చూశారా! తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అతను తన అసహనాన్ని ప్రదర్శించాడు. తాను కూర్చున్న కుర్చీని కూడా దాదాపు విరగ్గొట్టినంత పని చేసిన అతను ధోని ఔట్ కాగానే స్టాండ్స్‌లో ఎక్కడికో వెనక్కి వెళ్లిపోయి కూర్చున్నాడు. స్టార్ స్పోర్ట్స్ కూడా పదే పదే ఈ అబ్బాయి ఉద్వేగంగా అరుస్తున్న దృశ్యాలను చూపించింది. మ్యాచ్ ముగిశాక అతను స్థానిక మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లు కూడా అతడిని స్టూడియోకు పిలిపించి ‘అంత కోపం ఎందుకు’ అనే శీర్షికతో కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఆ అబ్బాయి పేరు కోటమర్తి ఆద్రిత్. వయసు 9 ఏళ్లు. స్వతహాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ధోనికి వీరాభిమాని. దుబాయ్‌లో స్వయంగా ధోని నెలకొల్పిన అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. తొలిసారి ధోని మ్యాచ్‌ను ‘లైవ్’గా చూసేందుకు వచ్చాడు. అయితే 3 బంతుల్లోనే తన ఆనందం ఆవిరి కావడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నాడు! -
అభిమాని ఆఖరి కోరిక తీర్చిన సూపర్ స్టార్
అభిమానులు లేనిదే హీరోలు లేరులే.. అన్న పాట రజనీకాంత్ నటించిన కుచేలన్ చిత్రంలో ఉంది. దీన్ని ఎంత మంది హీరోలు గ్రహిస్తారో గానీ, నటుడు రజనీకాంత్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన తరచూ తన అభిమానులను కలిసి వారికి సంతోషాన్ని కలిగిస్తుంటారు. నాగర్‌కోవిల్ సమీపంలోని కోట్టార్ వాగైయడి గ్రామానికి చెందిన అవినాష్ అనే 12 ఏళ్ల బాలుడు రజనీకాంత్‌కు వీరాభిమాని. 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని తల్లితండ్రులు స్వామినాథన్, లత కుమారుడి అవయవాలను దానం చేశారు. అవినాష్ తన అభిమాన నటుడు రజనీకాంత్ చిత్ర పటాన్ని పెన్సిల్‌తో చెక్కాడు. ఆ ఫొటోను రజనీకాంత్‌కు చూపించి దానిపై ఆయన సంతకం చేయించుకోవాలని ఆశ పడ్డాడు. ఆ కోరిక నెరవేకుండానే దుర్మరణం పాలయ్యాడు. తమ కుమారుడి ఆశను ఎలాగైనా నెరవేర్చాలని అతని తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా రజనీకాంత్‌కు తెలియజేశారు. ఆ లేఖ చదివిన రజనీకాంత్ ఇటీవల అవినాష్ తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు తమతో తీసుకొచ్చిన చిత్రపటాన్ని చూపించగా అందులో రజనీకాంత్ సంతకం చేశారు. అవయవదానం చేసిన మీ కుమారుడు ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి పంపారు. ఈ విషయం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి కోరికను నెరవేర్చామన్నారు. ఇప్పుడు ఆత్మశాంతిస్తుందని భావిస్తున్నామన్నారు. -
పవన్ కల్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్ కుమార్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని తల్వాకర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయే ముందు పవన్ కల్యాణ్‌కు అనిల్ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
తెలంగాణ ప్రజల గుండెల్లోనూ మహానేత వైఎస్ఆర్
-
అభిమాని ట్వీట్‌కు సమంత ఫన్నీ రిప్లై
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వటంతో పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ట్వీట్ చేసి ఫోటోపై సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్ లో ఎడిట్ చేసిన ఫొటోను అల్లు అర్జున్ అడిక్ట్ (Allu Arjun Addict) అనే ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఏంటిది..? అంటూ కామెంట్ చేశారు..? ఈ ఫొటోపై స్పందించిన సమంత ‘తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. సమంత ఇచ్చిన రిప్లై పై సినీ ప్రముఖులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఇటీవల యు టర్న్, సీమరాజ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసిన సమంత, సూపర్ డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. Eloped last week .. don’t know how this leaked .. It was love at first sight https://t.co/wJxvLBXbCc — Samantha Akkineni (@Samanthaprabhu2) 29 July 2018 -
అక్షరాలకు అందని అభిమానం
-
రష్యాలో భారత అభిమాని దుర్మరణం
సోచి: ఫిఫా వరల్డ్‌కప్ చూడటానికి రష్యాకు వెళ్లిన ఓ భారత అభిమాని అక్కడ జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం పోర్చుగల్, ఉరుగ్వే మ్యాచ్ చూసి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఆదిత్య రంజన్ అనే భారత అభిమాని మృత్యువాత పడినట్లు భారత అధికారులు వెల్లడించారు. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న సోచి నగరానికి సమీప ప్రాంతమైన కూబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత అభిమాని మరణించిన విషయాన్ని అక్కడ భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. కారును ఓ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు భారత పౌరుడైన రంజన్ కూడా మరణించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నోవోస్తి తెలిపింది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. బాధితుడి కుటుంబంతో ఎంబసీ టచ్‌లో ఉన్నదని ఆయన చెప్పారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
అభిమానం అంటే ఇదేరా!
తమిళసినిమా: హీరోలను అభిమానులే కాదు, హీరోయిన్లు అభిమానిస్తారు. అయితే కొందరు హీరోయిన్ల అభిమానంలో స్వప్రయోజనాలు ఉండవచ్చు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా అభిమానించే హీరోయిన్లు ఉండరా? అంటే నటి నయనతార లాంటి వారు ఉంటారని ఈ కింది విషయాన్ని చూస్తే మీరే అంటారు. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. ఆమె ఒక చిత్రంలో నటించాలంటే హీరోకు దీటుగా పాత్ర ఉండాలి. లేకపోతే హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినా అయ్యి ఉండాలి. అలాంటి కథా చిత్రాలైతేనే నయనతార అంగీకరిస్తారు. ఆమె అభిమానులు అలాంటి పాత్రలనే కోరుకుంటారు. ఈ అగ్రనటికి నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఎంతగానో. అజిత్‌తో నయనతార ఇప్పటికే మూడు చిత్రాల్లో కలిసి నటించింది. హిట్ పెయిర్‌గా పేరొందిన ఈ జంట తాజాగా విశ్వాసం చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిజం ఉన్న ఈ చిత్రంలో నటించడానికి నయనతార అంగీకరించడమే విశేషంగా భావిస్తున్నారు. ఎందుకంటే అజిత్ పెద్ద స్టార్. అందులోనూ విశ్వాసం చిత్రంలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ చిత్రంలో నయనతార పాత్రకు అంతగా ప్రాముఖ్యత ఉంటుందని ఆశించలేం. అయితే ఈ విషయం తెలిసి కూడా నయనతార విశ్వాసం చిత్రంలో నటించడానికి అంగీకరించింది. సాధారణంగా ఆమె కథ విని నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతుంది. ఇటీవల తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివతో కూడా తాను నటించే కథా పాత్రల గురించి చర్చించి సలహాలు తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఉండగా విశ్వాసం చిత్రంలో నటించమని దర్శకుడు శివ అడగ్గానే వెంటనే ఓకే అనేసిందట. కథేంటని, తన పాత్ర ఏంటని ఒక్క మాట కూడా అడగలేదట. ఇకపోతే ఈ సంచలన తార కోట్లల్లో పారితోషికం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటిది విశ్వాసం చిత్రంలో నటించడానికి పారితోషికం గురించి చర్చించలేదట. డేట్స్ కూడా సర్దుబాటు చేస్తానని చెప్పిందట. ఇంతగా విశ్వాసం చిత్రం కోసం రాయితీలు ఇవ్వడానికి ఒకేఒక్క కారణం నటుడు అజిత్ అట. తనకు నచ్చిన నటుడు అజిత్ అని నయనతార బహిరంగంగానే చెప్పింది. అయితే ఆయనంటే ఎంత అభిమానం అన్నది ఇప్పుడే అర్థం అవుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విశ్వాసం చిత్రం రెండో షెడ్యూల్‌ను ఈ నెల 22 నుంచి ముంబైలో చిత్రీకరించేందుకు రెడీ అవుతోంది. వివేగం తరువాత సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అజిత్‌తో నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది అన్నది గమనార్హం. -
నాగరాజు అకాల మృతి తీరని లోటు
తుని: కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాల్సిన నాగరాజు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం దురదృష్టకరమైన సంఘటన, నన్ను ఎంతగానో కలిచి వేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖజిల్లా పాయకరావుపేటలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఈనెల 5న ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో పర్యటన రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తుని పట్టణం తారక రామానగర్‌కు చెందిన తోలెం నాగరాజు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చిన్న వయస్సులోనే పసుపు కుంకుమ కోల్పోయిన నాగరాజు భార్య సత్యను ఓదార్చారు. ముగ్గురు పిల్లలను అక్కును చేర్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల బాలుడికి గౌరీ శంకర్‌గా నామకరణం చేశారు. భౌతికంగా నాగరాజు లేకపోయినా గౌరీ శంకర్‌లో చూసుకోవాలన్నారు. అభిమానులు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అందరినీ అప్యాయంగా పలకరించారు. నాగరాజు కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పిల్లలకు మంచి చదువును చెప్పించాలని సత్యకు సూచించారు. పాకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు గెడ్డం బుజ్జి, తుని నియోజకవర్గం నాయకుడు చోడిశెట్టి గణేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనుకున్న షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యమైనా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తుని గొల్ల అప్పారావుసెంటర్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. -
వైఎస్ జగన్‌కు టీ చేసి తీసుకొచ్చిన మహిళ
-
వీరాభిమానిని సత్కరించిన రజనీ
పెరంబూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను వయోభేదం లేకుండా ఆబాలగోపాలం అభిమానిస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 78 ఏళ్ల బామ్మ ఆయన వీరాభిమానే కాదు, త్వరలో నెలకొల్పనున్న రజనీకాంత్ రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు కోసం వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా తీవ్రంగా కృషి చేయడం విశేషం. ఆమె పేరు శాంత. తిరుత్తూర్కు చెందిన ఈ బామ్మ రజనీకాంత్ వీరాభిమాని అట. రజనీకాంత్ త్వరలో ప్రారంభించబోయే రాజకీయ పార్టీలో సభ్యులను చేర్చడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారట. ఈ విషయం గురించి రజనీ ప్రజా సంఘ నిర్వాహకులు రజనీకాంత్ దృష్టికి తీసుకురాగా ఆయన చాలా సంతోషపడ్డారు. శాంత చిరకాల కోరిక రజనీకాంత్‌ను ఒక్కసారి కలిసి ఆయనతో మాట్లాడాలన్నదట. విషయం తెలుసుకున్న రజనీకాంత్ శుక్రవారం బామ్మ శాంత పోయస్‌గార్డెన్‌లోని తన ఇంటికి పిలిపించి శాలువ కప్పి సత్కరించారు. -
అభిమానికి రజనీ సాయం
తమిళసినిమా: ఇటీవల రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న అభిమానికి నటుడు రజనీకాంత్ ఆర్థిక సాయం అందించారు. వివరాలు.. మధురై, తిరునగర్‌కు చెందిన కాశీవిశ్వనాథన్(32) వివాహితుడు. రజనీకాంత్ అభిమాని. అతను ఈనెల 9న చెన్నైలో జరిగిన కాలా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాడు. తిరిగి రైలులో ప్రయణిస్తుండగా తలుపు వద్ద కూర్చుని ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో అతని ఒక కాలు రైలు చక్రంలో ఇరుక్కుని నలిగిపోయింది. వెంటనే అతడిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రమాదానికి గురికావడంతో డాక్టర్లు ఆతని రెండో కాలు కూడా తొలగించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈ విషయం రజనీకాంత్ దృష్టికి రాగా.. తన ప్రజా సంఘ నిర్వాహకుడు సుధాకర్‌ని తన తరఫున కాశీవిశ్వనాథన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పంపారు. సుధాకర్ కాశీవిశ్వనాథన్ భార్య, తల్లిదండ్రులను మంగళవారం కలిసి పరామర్శించారు. వారికి రజనీకాంత్ తరఫున ఆర్థిక సాయం అందించారు. ఎటువంటి సహాయం కావాల్సినా వెంటనే ఫోన్ చేయమని వారికి తెలిపారు. -
‘గబ్బర్’కు స్వీట్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న ధావన్‌ను ఓ అభిమాని ఆశ్చర్యానికి గురిచేశాడు. బెంగుళూరుకు చెందిన శంకర్ అనే వ్యక్తి ధావన్‌కు పెద్ద అభిమాని. తన అభిమాన క్రికెటర్‌ను కలవడానికి శంకర్ ఆదివారం ఏకంగా కుటుంబ సమేతంగా బెంగుళూరు నుంచి వచ్చాడు. శంకర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రావడంతో ‘గబ్బర్’ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడిని నిరుత్సాహపరచకుండా అభిమాని కుటుంబంతో కలిసి ధావన్, అతడి భార్య ఆయేష ఫొటో దిగారు. ఈ ఫొటోను ధావన్ తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. ‘నా వీరాభిమాని శంకర్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవడానికి శంకర్ కుటుంబ సమేతంగా ఏకంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు మద్దతుగా నిలుస్తు, నన్ను అభిమానిస్తున్న శంకర్‌కు అలానే నా అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటు ధావన్ ట్వీట్ చేశాడు. ఢిల్లీకి చెందిన ఈ ఓపెనర్ ఈ ఐపీఎల్లో 8 మ్యాచ్‌లలో ఆడి 30.83 సగటుతో 185 పరుగులు సాధించాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. పోయిన వారమే బీసీసీఐ శిఖర్ ధావన్‌ను ఈ ఏడాదికి గాను అర్జున అవార్డుకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. నిలకడగా రాణిస్తున్న అతడిని సీ గ్రేడ్ నుంచి ఏ+ గ్రేడ్‌కు బీసీసీఐ ప్రమోట్ చేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 విజయాలు, 2 ఓటములతో ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. -
అల్లు అర్జున్ పెద్ద మనసు..!
విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లిలో నివసించే దేవసాయి గణేష్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. కొంత కాలంగా బోన్ కేన్సర్‌తో బాధపుడుతున్న గణేష్ తన అభిమాన కథనాయకుడ్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు. ఈ విషయం బన్నీకి వరకు వెళ్లింది. కొంతకాలంగా నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. సినిమా విడుదల కావటంతో ఫ్రీ అయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్న తన అభిమానిని కలిసేందుకు బన్నీ స్వయంగా తన ఇంటికి వెళ్లాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి ఆర్థిక సాయం కూడా అంధించాడు తన ఫేవరెట్ హీరో తన కోసం రావటంతో సాయి గణేష్ ఆనందానికి అవధుల్లేవు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. -
లేడీ ఫ్యాన్‌కు మహేష్ గ్రీటింగ్స్..
గతంలో మహేష్ బాబు పెద్దగా అభిమానులతో కలిసేవారు కాదు. తన సినిమా వేడుకల్లో తప్ప ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇటీవల మహేష్ తీరు మారుతోంది. సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా మీడియాను కలుస్తూ, సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు మహేష్. సురేఖ, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న మహేష్, నమత్రలు ఆమె పెళ్లి రోజున ఓ గ్రీటింగ్ కార్డును పంపించారు. మహేష్, నమ్రతలు స్వయంగా సంతకం చేసిన ఆ గ్రీటింగ్ కార్డును సురేఖ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరుగుతుండగా ఆమె చేతికందించారు. తన అభిమాన నటుడి నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ కార్డ్ రావటంతో సురేఖ తెగ సంబరపడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారాయి. భరత్ అనే నేను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.