
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు.
"మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.
కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment