ballari
-
జైలులో దర్శన్.. కలిసేందుకు వచ్చిన అభిమానికి షాక్!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు."మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు. -
ఎన్నికల ఎఫెక్ట్: గుట్టలుగా కరెన్సీ కట్టలు.. కిలోల్లో బంగారం, వెండి..
సాక్షి, బెంగళూరు: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. #WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm — ANI (@ANI) April 8, 2024 అయితే, వీటిని హవాలా మార్గంలో తీసుకువచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. ఇక, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను రెండు దశల్లో ఏప్రిల్ 26న, మే నాలుగో తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
బళ్లారిలో 144 సెక్షన్...
-
బల్లారి ఉత్సవ్‌లో రూ.20 కోట్ల శునకం.. చూసేందుకు ఎగబడ్డ జనం..
బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన బల్లారి ఉత్సవ్‌లో ఓ శునకాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎందుకంటే ఇది మామాలు శునకం కాదు. దేశంలోనే అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క. దీని ధర రూ.20కోట్లు. కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం యజమాని బెంగళూరు వ్యాపారవేత్త సతీశ్. దీన్ని కొనేందుకు ఇటీవల కొందరు కళ్లు చెదిరే ధర ఆఫర్ చేసినా ఇతను తిరస్కరించాడు. ఈ శునకానికి కెడబామ్ హైదర్ అని పేరు పెట్టాడు సతీష్. దీని వయసు 14 నెలలు. నిలబడితే 6 అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు దాదాపు 100 కిలోలు. దీన్ని పోషించేందుకు రోజుకు రూ.2,000 ఖర్చు చేస్తున్నాడు. బల్లారి ఉత్సవ్‌లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి దీన్ని ఏసీ కారులో తీసుకెళ్లాడు. ఖరీదైన జాతులు.. ఇదే కాదు సతీష్ వద్ద మరో రెండు అరుదైన శునకాల జాతులు కూడా ఉన్నాయి. రూ.కోటి ధర ఉన్న కొరియన్ డొసా మస్టిఫ్, అలాగే రూ.8 కోట్ల ధర పలికే అలస్కన్ మలమ్యూట్ బ్రీడ్ శుకనం కూడా ఉంది. తన వద్ద కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు కూడా ఉన్నాయని, ఒక్కోదానికి రూ.5 కోట్లు ఇచ్చి కొంటామని ఆపర్లు వస్తున్నాయని సతీష్ పేర్కొన్నాడు. బల్లారి ఉత్సవాలు జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగాయి. నిర్వాహకులు ఇక్కడ శునకాల పోటీలు నిర్వహించారు. 50 రకాల బ్రీడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. సతీష్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన కాకేసియన్ షెఫర్డ్‌తో వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. దీంతో ఈ అరుదైన శునకాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. Meet Cadabom Hayder Royal dog Rs 20 crore🥰 pic.twitter.com/wQVKXB5bnD — Deepthy (@mani_deepthi) January 7, 2023 చదవండి: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో... -
ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు
ఊలు ఉన్నది వెచ్చని స్వెట్టర్లు అల్లడానికే కాదు. చక్కగా చిత్రంగా బొమ్మలు వేయడానికి కూడా. ఊలు బొమ్మలంటే ఊలుతో అద్దిన బొమ్మలు కాదు. ఊలుతో అల్లిన చిత్రాలు... ఉలెన్ ఆర్ట్ కళారూపాలు. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు. అది నవంబర్ 17. బెంగళూరు, కర్నాటక చిత్రకళా పరిషత్తోని దేవరాజ్ అర్స్లో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్. అది సోలో ఎగ్జిబిషన్. అందులో వినూత్నమైన చిత్రాల ప్రదర్శన. రంగు అద్దుకున్న కుంచె నుంచి కాన్వాస్ మీద రూపుదిద్దుకున్న రూపమేనా? సందేహం కలుగుతుంది. కళ్లు భ్రమకు గురి చేస్తున్నాయా అనే అనుమానం కూడా. భ్రుకుటి ముడిచి నిశితంగా చూస్తే తెలుస్తుంది అది దారాలు చేసిన మాయ అని. పోరింగ్ ఆర్ట్‌ను తలపిస్తూ రంగుల దారాలు పెయింటింగ్ ఫ్రేమ్ నుంచి కిందకు జాలువారి ఉన్నాయి. మొత్తం 14 చిత్రాలవి. అన్నింటిలోకి పెద్ద చిత్రం పదకొండు అడుగుల ఎత్తు, ఏడున్నర అడుగుల వెడల్పు ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌తో ఉన్నాయి. కానీ ప్రధానంగా ‘అమ్మ’ మనసును ప్రతిబింబిస్తున్నాయి. అమ్మ బొమ్మ కనిపించదు, నిద్రపోతున్న బిడ్డను సంతృప్తిగా చూసుకునే భావం బొమ్మల్లో ద్యోతకమవుతుంది. ఆ చిత్రాల రూపకర్త ఓ తెలుగు మహిళ. పేరు మానసప్రియ. ఆమె ఈ కళారూపాల కోసం ఐదేళ్లు నిరంతరంగా శ్రమించారు. పిన్నికి ఇచ్చిన మాట కోసం ఆమె జీవించి ఉండగానే ప్రదర్శించడం కోసం రెండేళ్ల పాటు నిద్రను త్యాగం చేస్తూ పని చేశారు. ఆమె పని చేస్తున్న వేగం కంటే పిన్నిని ఆవరించిన క్యాన్సర్ ఇంకా వేగంగా విస్తరించింది. పిన్నిని తీసుకువెళ్లి పోయింది. పిన్ని సీత ప్రథమ వర్థంతికి మానస ప్రియ ఇచ్చిన కన్నీటి కళాసుమాంజలి ఈ ప్రదర్శన. తాను ఆర్టిస్ట్ అయిన నేపథ్యాన్ని, చిత్రకళలో చేస్తున్న ప్రయోగాలను సాక్షితో పంచుకున్నారామె. ప్రకాశం నుంచి బళ్లారి ‘‘మా తాతలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నుంచి కర్నాటకలోని బళ్లారికి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను బళ్లారిలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. పెన్సిల్‌తో చక్కటి రూపాన్ని తీసుకురాగలిగేదాన్ని. స్కూల్లో ప్రైజ్‌లు కూడా వచ్చాయి. అయితే నాకు పెద్ద అడ్డంకి చదువే. ఎంత ప్రయత్నించినా మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. అందులో నా అదృష్టం ఏమిటంటే... మార్కులు రావడం లేదని చదువు మానిపించకుండా ఫైన్ ఆర్ట్స్‌లో (బి.ఎఫ్.ఏ) చేర్పించడం. హైదరాబాద్‌లో లాలాపేట నుంచి ఉదయం ఐదింటికి ఉప్పల్‌కి వెళ్లి అక్కడి ప్రకృతి దృశ్యాలను బొమ్మలు వేశాను. పదిరోజులు వైజాగ్‌లో కాలేజ్ బల్లల మీద పడుకుంటూ ప్రాజెక్ట్ చేశాను. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత బెంగళూరులో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందే లోపే పెళ్లి. పిల్లల కోసం కొంత గ్యాప్ తీసుకున్నాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రేఖ అనే ఫ్రెండ్ ఆహ్వానంతో కేరళ, ఫోర్ట్ కొచ్చిలో నా చిత్రాలను ప్రదర్శించాను. అప్పటికి ఉలెన్ పెయింటింగ్స్ మొదలు పెట్టలేదు. అయితే ఆర్టిస్ట్‌గా ఊరికే ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసేదాన్ని. అలా టెర్రారియమ్ అని గాజు సీసాల్లో మొక్కలను పెంచడం వంటి హాబీలు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత పెయింటింగ్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న ఉలెన్ ప్రయోగం మొదలు పెట్టాను. మా వారి ఉద్యోగరీత్యా ఇప్పుడు పూనాలో ఉంటున్నప్పటికీ నా ఆర్ట్ ప్రయోగాలు మానలేదు. నా పేరు మీద మొక్క బెంగళూరులో ఎగ్జిబిషన్ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు అరవై దాటిన మహిళలు ఐదుగురు వచ్చారు. ‘మేము అక్కాచెల్లెళ్లం. ఓ సిస్టర్ ఈ రోజే కెనడా నుంచి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ చూసి తీరాలని తనను నేరుగా తీసుకువచ్చాం’ అని చెప్పారు. అలాగే ఎగ్జిబిషన్ చివరి రోజు ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్‌గారు వచ్చి ‘వాళ్ల కాలేజ్‌లో రెండు రోజులు ఎగ్జిబిషన్ కావాల’ని అడిగారు. ఆరు వందల మంది విద్యార్థుల మధ్య నాతోనే ప్రారంభోత్సవం చేయించి, కాలేజ్ ప్రాంగణంలో నా పేరు మీద మొక్క నాటారు. ఐదేళ్లు నేను ఇంటి నాలుగ్గోడల మధ్య పడిన శ్రమ నాకో ప్రత్యేకతను తెచ్చింది. నేను అభ్యసించిన కోర్సుకి మరో కొత్త ఆర్ట్ ఫార్మ్‌ను జత చేయగలుగుతున్నాననే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు మానస ప్రియ. నా బొమ్మల్లో అమ్మ ఉంది నేను ఆర్టిస్ట్‌ని, తల్లిని. ఉలెన్ ఆర్ట్ మాధ్యమంగా అమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లలు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉలెన్ ఆర్ట్‌లో పిల్లల ముఖంలో ప్రసన్నత కోసం నేను శ్రద్ధగా పని చేయడాన్ని మా సీత పిన్ని చాలా ఇష్టంగా చూసేది. ‘ఈ కళాఖండాలతో ఎగ్జిబిషన్ పెడితే చూడాలని ఉంది’ అని చెప్పిందోసారి. ‘అలాగే చూస్తావు పిన్నీ’ అన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తెలిసింది పిన్నికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని. అప్పటి వరకు మామూలుగా ప్రాక్టీస్ చేసిన నేను త్వరగా పూర్తి చేయాలని చాలా దీక్షగా పనిచేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటలే నిద్రపోయాను. నేనెంత ఆత్రుత పడినప్పటికీ పిన్ని ఉండగా ఆ పని చేయలేకపోయాను. గత ఏడాది పిన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. పిన్ని తొలి వర్ధంతి నాటికి ఎగ్జిబిషన్ పెట్టి తీరాలని ఈ ఏడాది నవంబర్‌లో ఆ పని చేయగలిగాను. ఈ ప్రక్రియలో నాకు చాలా మంది సహాయం చేశారు. అంజలి పట్వర్ధన్ నా ప్రతి బొమ్మకు ఒక పోయెమ్ రాశారు. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటులో ఫ్రెండ్ తేజస్విని సహాయం చేసింది. – ధూళిపాళ్ళ మానస ప్రియ, ఉలెన్ ఆర్టిస్ట్ – వాకా మంజులారెడ్డి -
Crime News: ప్రేమించానంటూనే నరరూప రాక్షసుడిలా..
సాక్షి,బళ్లారి: ప్రేమించానన్నాడు. ప్రాణంగా చూసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. పైగా ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా మాత్రం లేడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదని, ఆమె వేరొకరి సొంతం కాకూడదని రగిలిపోయాడు. చివరికి.. నరరూప రాక్షసుడిలా మారిపోయి ఘోరానికి పాల్పడ్డాడు. మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు స్టేషన్‌కు ఆ తలను తీసుకెళ్లాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో సంచలనం రేకెత్తించింది. గురువారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కేబీ హట్టి (కన్నబోరయ్యనహట్టి) గ్రామంలో నిర్మలా (23) అనే అమ్మాయిని.. భోజరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. యువతి తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయారు. నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. పరీక్షలు ఉన్న కారణంగా స్వంత ఊరులో చదువుకోవడానికి వచ్చింది. మాట్లాడాలని పిలిచి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు భోజరాజు. కొన్నాళ్ల కిందట ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఆమె వెంటపడ్డాడు. స్నేహం ముసుగులోని అతని ప్రేమను ఆమె ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టి పెద్దలతో పెళ్లి కుదర్చాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వేరే యువతిని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు కూడా. అయితే.. నిర్మలను కిరాతకంగా హతమార్చిన ఉన్మాదిని నడిబజారులో ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై కూడ్లిగి తాలూకా ఖానాహొసళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి
సాక్షి, బళ్లారి(కర్ణాటక): సాధారణ, మధ్య తరగతి మహిళలే ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో ఒక ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుందనే విషయాన్ని చాటిచెప్పారు. కర్ణాటకలో బళ్లారి జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎ.నందిని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నెలవారీ చికిత్సలు పొందారు. చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సహజ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఐఏఎస్ అధికారులతో పాటు సామాన్యులకు కూడా ఇదే రకమైన వైద్యం అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి డా.బసిరెడ్డి తెలిపారు. గతంలో బళ్లారి కలెక్టర్ నకుల్ సతీమణికి, అలాగే జెడ్పీ సీఈవో రాజేంద్ర సతీమణికి కూడా ఇక్కడే ప్రసవాలు చేశామని చెప్పారు -
‘అధికారంలోకి వస్తే అఖండ బళ్లారి’
సాక్షి, బళ్లారి అర్బన్(కర్ణాటక): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విడిపోయిన విజయనగరను తిరిగి కలిపి అఖండ బళ్లారిగా ఒకే జిల్లాను చేస్తామని ఎమ్మెల్యే నాగేంద్ర తెలిపారు. ఆదివారం స్థానిక మోకా రోడ్డు ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన విధాన పరిషత్ ఎన్నికల బళ్లారి గ్రామీణ ప్రచార సభను ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞుడైన అభ్యర్థి కేసీ కొండయ్యను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అల్లం వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
జాయిన్ ఇమీడియట్లీ
జీవితం ఎప్పటికప్పుడు నియామక పత్రం పంపుతుంది. గృహిణిగా.. ఉద్యోగినిగా.. అమ్మగా.. అత్తగారిగా.. అమ్మమ్మగా.. ‘జాయిన్ ఇమీడియట్లీ’ అని అపాయింట్మెంట్ లెటర్. అరవై ఏళ్లకు అన్ని ‘ఉద్యోగాల’ విరమణ! తర్వాతేంటి?! మనమే ఇచ్చుకోవాలి.. సెల్ఫ్ అపాయింట్మెంట్ లెటర్. సేవకు.. సంతృప్తికి.. సంతోషానికి.. సఫలతకు. అరవై ఏళ్లంటే మహిళలు తమను తాము దూరం చేసుకునే వయసు. గృహిణి విషయానికి వస్తే... పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి ఉంటాయి. పిల్లల జీవితంలో తన అవసరం కనిపించకపోవడం ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పిల్లల జీవితంలో జోక్యం చేసుకుంటూ సలహాలు ఇస్తుంటారు. అకారణంగా అభద్రత ఆవరిస్తుంది. కోడలు ఉద్యోగానికి వెళ్లే హడావుడిలో పెరుగు తోడు పెట్టి చిన్న గిన్నె మీద పెట్టిన పెద్ద మూత కూడా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పుకోవడానికి కూతురికి ఫోన్ చేసి చెప్పడం అలవాటు అవుతుంది. కాలక్షేపం కోసం సాయంత్రాలు గుడికి వెళ్తున్నా అక్కడా తన వయసు వాళ్లతో ఇంటి అసంతృప్త కబుర్లలోనే గడిపేస్తుంటారు. మొత్తానికి ఏదో వెలితి. సంతోషంగా జీవించలేరు. ఇకపై ఏం చేయాలి? ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్లది మరొక సమస్య. అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసిన అలవాటుకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పడుతుంది. ఆ ఖాళీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇబ్బంది పడేవాళ్లు ఎందరో. నిజానికి జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు అరవై అనేది మంచి సమయం. అప్పటి వరకు కుటుంబం కోసం పని చేసి ఉంటారు. అప్పటి నుంచి సమాజం కోసం పని చేయడానికి అరవై ఏళ్లవయసు అనువైన సమయం. అరవై నిండిన మహిళలను సామాజిక వ్యక్తులుగా మార్చడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. అలాంటి ఓ ప్రయత్నమే మిసెస్ ఇండియా సిక్స్టీ ప్లస్ పోటీలు. మిస్, మిసెస్ పోటీలనగానే కాస్మటిక్ కంపెనీలు నిర్వహించే అందాల పోటీలే గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న పోటీలు. ఒకసారి పోటీలో పాల్గొన్న తర్వాత ఆ మహిళలు సామాజికంగా పదిమందికి అవసరమైన కార్యక్రమాల్లో తమవంతు సేవలందించడానికి ముందుకు వస్తున్నారు. నిజానికి మనం సంఘజీవులం అని తెలియచేసే ప్రయత్నమే ఈ మలివయసు పోటీలు. అయితే అరవై అనగానే దేహం మోకాళ్ల నొప్పులు, బీపీ, డయాబెటిస్ల నిలయం అనుకునే వాళ్లే ఎక్కువ. ఈ వయసులో మనకు మనమే బరువు, ఇక సమాజానికి ఏం చేస్తాం... అని నిర్లిప్తంగా ఉండే వాళ్లలో స్ఫూర్తి రగిలించడమే ఈ పోటీల ఉద్దేశం అని చెబుతున్నారు ‘మిసెస్ ఇండియా కర్నాటక’ పోటీల నిర్వహకురాలు ప్రతిభ. ఆమె గతంలో మిసెస్ ఇండియా పురస్కారగ్రహీత. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ పోటీలను ఈ ఏడాది కర్నాటకలోని పట్టణాలకు తీసుకెళ్లారామె. ఈ ఏడాది పట్టణస్థాయి పోటీల్లో ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’గా రజని లక్కా అనే మన తెలుగింటి మహిళ ఎంపికయ్యారు. అనంతపురం నుంచి బళ్లారికి వెళ్లి అక్కడే స్థిరపడిన కుటుంబం వాళ్లది. మలి సంధ్య పూదోట నా వయసు మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే. కుటుంబానికి మీరు చేయాల్సిన పనులు కనిపించడం లేదంటే... ఇక మీరు సమాజం కోసం పని చేయాల్సిన సమయం మొదలైందని అర్థం. ఇతరుల కోసం మీకు చేతనైన పని చేయండి. వంట చేయడం తప్ప మరేమీ రావనుకుంటే... మీ చుట్టుపక్కల కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు వంటలో మెళకువలు నేర్పించండి. పిల్లలకు కథలు చెప్పడం మీకిష్టమైన వ్యాపకం అయినట్లయితే చుట్టుపక్కల పిల్లలకు కథలు చెప్పండి. కొత్తతరానికి ఈ అవసరాలున్నాయి. ఆ అవసరాన్ని మీరు నెరవేర్చండి. అరవైల తర్వాత జీవితం అంటే మీకోసం మీరు పెంచుకోగలిగిన చక్కటి పూలతోట. ఇంకా పాతికేళ్లు జీవించాల్సి ఉంటుంది. పాతికేళ్ల కాలాన్ని వృథాగా గడిపేయకూడదు. ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి – రజని లక్కా, ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’ విజేత నవ్వు వెనుక నమ్మకం నలభై లోపు, నలభై పై బడిన వారు, అరవై నిండిన వాళ్లు... ఈ మూడు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. టాలెంట్, స్మైల్, ఫిట్ అవార్డులు కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం స్థాయిలే ఇందులో ప్రధానమైన కొలమానం. మొన్నటి పోటీలో.. ‘మీ గురించి మీరు చెప్పండి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పోటీలో పాల్గొన్న చాలామంది తడబడ్డారు. ‘‘నిజానికి వాళ్లలో చాలామంది తమకంటూ చెప్పుకోగలిగిన కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవాళ్లే. అయినా వాటిని ఎలా చెప్పాలో తెలియక పోవడమే వారి తడబాటుకు కారణం. ఈ పోటీలో విజేత కాలేక పోయినప్పటికీ ఇందులో పాల్గొన్న తర్వాత వాళ్లు ఆ ప్రశ్నకు జవాబు కోసం తమను తాము శోధించుకుంటారు. మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైతే దీటుగా బదులివ్వగలుగుతారు. ఇందులో పాల్గొన్న వాళ్లకే కాదు, చూసిన వాళ్లలో కూడా ఆలోచన స్థాయిని విస్తృతపరుస్తాయి ఈ పోటీలు. నాకు ఈత వచ్చు. వికలాంగులకు ఈత నేర్పిస్తున్నాను. సమాజానికి నేను ఇస్తున్న సహకారం ఇది. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్న పనిలో నాకు కలుగుతున్న సంతోషాన్ని కొలవడానికి కొలమానాలు ఉండవు. సమాజానికి నేను చేయాల్సిన పని ఇంకా ఉందనే ఆలోచనే నన్ను నిత్యం పనిలో నిమగ్నం చేస్తోంది. అదే నాకు ఆరోగ్యం. అదే నాకు ఫిట్నెస్. నా నవ్వులో ప్రతిబింబించే ఆత్మవిశ్వాసం వెనుక ఇవన్నీ ఉన్నాయి’’ అన్నారు రజని లక్కా. తొలిదశ పోటీలు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్ర స్థాయి పోటీలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరిగితే అప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు’ రజని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి
బెంగుళూరు(కర్ణాటక): ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన చెందారు. ఆయన దావణగెరెలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017–19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించారు. దీనికి తాను నిరాకరించడంతో అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. అందుకే ఆటోడ్రైవర్నయ్యా అవినీతి ఆరోపణలు అంటగట్టి సస్పెండ్ చేశారని, కొన్నాళ్లకు తాలూకా వైద్యాధికారిగా బదిలీ చేశారని వాపోయారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో లోపాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏ పనైనా చేసి జీవితం సాగించవచ్చని చాటేందుకు 4 రోజుల నుంచీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నానన్నారు. మళ్లీ పోస్టింగ్ రాకపోతే చివరి వరకు ఆటో డ్రైవర్‌గానే కొనసాగుతానని డాక్టర్ తెలిపారు. తన దుస్థితికి కారకులైన అధికారులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చదవండి: బబిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి -
సోనూ సూద్ మనసు బంగారం
సాక్షి, బళ్లారి : ప్రముఖ నటుడు, సినిమాల్లో విలన్‌గా అందరినీ విసిగించే సోనూ సూద్ నిజజీవితంలో దాతృత్వానికి ఎల్లలు లేకుండా పోతున్నాయి. ఎక్కడ కష్టం ఉందని తెలిసినా నేనున్నానని సహాయ హస్తం అందిస్తున్నారు. గత శనివారం కన్నడనాట యాదగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేద మహిళ పద్మ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. పూట గడవక కష్టాలు పడుతున్న పద్మ– నాగరాజ్ దంపతులకు ముగ్గురు బిడ్డలను పోషించడం తలకు మించిన భారమైంది. పాడుబడిన చిన్న ఇంటిలో బతికేదెలా అని ఆ దంపతులు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పత్రికలు, టీవీ చానెళ్లలో వచ్చిన వార్తలు సోనూ సూద్ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే మానవతను చాటుకున్నారు. ఆ ముగ్గురు శిశువులను దత్తత తీసుకుంటానని, వారి పోషణకు, పద్మ ఇల్లు మరమ్మతులకు ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. -
అర్ధరాత్రి నడి రోడ్డులో మొసలి కలకలం
కర్ణాటక,బళ్లారి టౌన్: నగరంలోని సెకండ్ రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి ఓ మొసలి నడిరోడ్డు పైకి వచ్చి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉంటున్న కాంగ్రెస్ నేత మోహన్‌బాబు ఆ సమయంలో తన కారులో వెళుతుండగా రోడ్డుపై మొసలి కనిపించింది. దీంతో కారును ఆపి కొద్ది సేపు అది దూరంగా వెళ్లేంత వరకు అలాగే ఉండి వెళ్లి పోయారు. కాగా ఇదే ప్రాంతంలో జూ కూడా ఉంది. అందులో నుంచి ఏమైనా తప్పించుకొని వచ్చి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా మొసలి ఒక్కసారిగా నడి రోడ్డుపైకి రావడం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేసింది. -
ఖననం.. మానవత్వం హననం
సాక్షి, బళ్లారి: కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండగా మరింత క్షోభించేలా అధికార సిబ్బంది వ్యవహరించారు. కరోనా బాధితుల మృతదేహాలను పెద్ద గొయ్యి తీసి అందులో విసిరివేయడం అందరినీ నివ్వెరపరచింది. బళ్లారిలో సోమవారం జరిగిన ఘటన వీడియోలు మంగళవారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారిలోని విమ్స్ కోవిడ్ విభాగంలో కోవిడ్‌కు చికిత్స పొందుతూ బళ్లారికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, సిరుగుప్పకు చెందిన 31 ఏళ్ల యువకుడు, కొప్పళ జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన ఇద్దరు (41, 52ఏళ్లు) వ్యక్తులు, చిత్రదుర్గంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, శ్రీరంగాపురం క్యాంప్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తి, హŸసపేటకు చెందిన ఇద్దరు కన్నుమూశారు. తొమ్మిది మంది మరణాలతో ఆస్పత్రి ప్రాంగణంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కరోనా మృతుల అంత్యక్రియలను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉన్నందున అంబులెన్సుల్లో నల్లరంగు బ్యాగ్‌లలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. విడిగా సమాధి చేయకుండా పొక్లెయినర్‌తో పెద్ద గొయ్యిని తీసి అన్నిటినీ గొయ్యిలో విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను సస్పెండ్ చేసినట్లు మంత్రి శ్రీరాములు చెప్పారు. -
తల్లీకూతురు సజీవ దహనం
సాక్షి, బళ్లారి: తల్లీకూతుళ్ల కిరోసిన్ పోసుకుని నిప్పుటించుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం బళ్లారి తాలూకా సంజీవరాయనకోట ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న తల్లి పార్వతమ్మ(60), కూతురు హులిగమ్మ(35) కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు గమనించేలోగా ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. మంటలను ఆర్పేందుకు యత్నించగా అప్పటికే తీవ్రగాయాలతో ఇద్దరు మృతి చెందారు. పిల్లలు పుట్టలేదని చింత పార్వతమ్మ కుమార్తెను అదే గ్రామానికి చెందిన వ్యక్తితో 20 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. తన కుమార్తెకు సంతానం కలగలేదని తల్లి బాధపడేది. భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడు. ఈ సమయంలో తల్లీకూతుళ్లు ఇద్దరూ కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామీణ పోలీసులు అక్కడకి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా, మొదట గ్యాస్ సిలిండర్ పేలి మరణించారని ప్రచారం జరిగింది. పోలీసులు వచ్చిన పరిశీలించగా వారే నిప్పంటించుకున్నట్లు తేలింది. -
డ్రామాలు చేయకండి.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, బెంగళూరు : మైనార్టీలపై బీజేపీ బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో హిందువులు 80 శాతం మంది ఉన్నారు. మైనార్టీల కేవలం 17శాతం మాత్రమే ఉన్నారు. హిందువుల తలచుకుంటే ఏమైనా చేయగలరు. వారితో చాలా జాగ్రత్తగా మెలగండి. లేకపోతే అందరినీ కట్టగట్టి పాకిస్తాన్‌కు పంపుతాం. మేం కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతోంది. డ్రామాలు చేయకుండా సైలెంట్‌గా ఉండండి.’ అంటూ మైనార్టీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శనివారం బళ్లారిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళన చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలను సోమశేఖరరెడ్డి ఇడియట్స్గా వర్ణించాడు. దేశంలో నివసించాలి అనుకునే వారు ఇక్కడి ప్రభుత్వం చెప్పినట్టు వినాలని అన్నారు. అలాగే మైనార్టీలు (ముస్లిం) కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగుళూరులో జరిగిన నిరసనల్లో పోలీసులు కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి మరణించాడు. -
శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం
అమ్మ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన మరో ఘటన ఇది. ఇల్లు కూలి శిథిలాలు తన ప్రాణాన్ని కబళిస్తున్నా, నెలరోజుల బిడ్డ బతుకును కాపాడడానికి ఆ తల్లి విశ్వప్రయత్నం చేసింది. బిడ్డను కాపాడుకున్నా తాను మాత్రం విధికి బలైంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించగా, శిథిలాల కింద తల్లి ఒడిలో శిశువు క్షేమంగా ఉంది. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు : బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో ఆదివారం రాత్రి పాత మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను ఇమామ్‌బీ (40), ఆమె కూతురు హసీనా(25), మనవడు ఇమ్రాన్(3)గా గుర్తించారు. వివరాలు... హసీనాకు రాయచూరు జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన బాషాతో వివాహమైంది. నెల క్రితం రెండవ కాన్పు కోసం హసీనా కొడుకు ఇమ్రాన్‌ను తీసుకుని నాడంగలోని పుట్టింటికి వచ్చింది. నెలకిందట మగపిల్లాడు జన్మించాడు. రాత్రి భోజనం చేసి నిద్రిస్తుండగా ఇటీవల వర్షాలకు నానిన ఇంటి మిద్దె కూలి మీద పడింది. తల్లి హసీనా శిశువుకు అపాయం లేకుండా ఒడిలో దాచుకుని తాను శిథిలాల కింద ప్రాణాలను విడిచింది. భారీ శబ్ధం రావడంతో అనుమానంతో గ్రామస్తులు స్థలానికి చేరుకొని కూలిన మట్టిని, కర్రలను తొలగించి చూడగా శిశువు మాత్రం కొన ఊపిరితో బతికి ఉండగా, ముగ్గురు అక్కడికక్కడే విగతజీవులై ఉన్నారు. వెంటనే బిడ్డను ఆస్పత్రికి తరలించారు. తన ప్రాణం పోతున్నా బిడ్డను కాపాడుకున్న తల్లి త్యాగాన్ని చూసి గ్రామస్తులు సైతం కన్నీరుకార్చారు. ఉపాధి కోసం వెళ్లిన ఇంటిపెద్ద నిరుపేదైన ఇమామ్‌బీ భర్త ఖాదర్ జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. అయితే ఈ దుర్ఘటన సమాచారం తెలుసుకొని బోరున విలపిస్తూ స్వగ్రామానికి చేరుకొన్నాడు. విధి ఒకేసారి అవ్వ, తల్లి, అన్నను కబళించడంతో నెల శిశువు ఒంటరివాడయ్యాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సోమలింగప్ప సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై సిరుగుప్ప పోలీస్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మౌనేష్ పాటిల్ తెలిపారు. -
బళ్లారి ముద్దుబిడ్డ
బళ్లారి ముద్దుబిడ్డగా కీర్తిగాంచిన బీజేపీ అగ్ర నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మృతి జిల్లవాసులతో పాటు యావత్ కర్ణాటకలో అశేష అభిమానులకు తీవ్ర శోకాన్నిమిగిల్చింది. రాష్ట్రం నుంచి ఎంతో మంది బీజేపీ నాయకులు, అభిమానులు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు.కన్నడనాటతో బలమైన అనుబంధం ఉన్న ఆమె అస్తమయం బళ్లారి ప్రాంతానికి తీరనిలోటుగా అభిమానులు ఆవేదనచెందుతున్నారు. సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో, ముఖ్యంగా బళ్లారిలో బీజేపీకి, నాయకులకు సుష్మాస్వరాజ్ వెన్నుదన్నుగా ఉండేవారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో ఆమెపై పోటీకి సుష్మాస్వరాజ్ సై అన్నారు. దీంతో బళ్లారిలో ఒక్కసారిగా బీజేపీకి గట్టి పునాది ఏర్పడింది. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, హరపనహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకరరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిలు ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ వెంట నడిచి ఆమె గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయడంతో పాటు సోనియాగాంధీ గెలుపొందడంతో సుష్మాస్వరాజ్ ఓటమి చెందారు. ఆమె ఓటమి పాలైనా నిరుత్సాహ పడక బళ్లారిపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. పేదల పెళ్లిళ్లకు పెద్ద అతిథి ఈక్రమంలో గాలి సోదరులు, శ్రీరాములుకు సుష్మాస్వరాజ్ అండ లభించింది. సుష్మస్వరాజ్‌ను గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తల్లిగా భావిస్తూ ఆమెకు అమితమైన గౌరవం ఇవ్వడంతో పాటు ఆమె ఆధ్వర్యంలో బళ్లారిలో ఏటా వరమహాలక్ష్మీ పూజను చేయడం ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి బళ్లారిలో వరమహాలక్ష్మీ వ్రతం రోజున గాలి కుటుంబం జరిపించే ఉచిత సామూహిక వివాహాల్లో సుష్మాస్వరాజ్ పాల్గొంటూ వేలాది పేద జంటలకు ఆశీస్సులు అందించారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారు. సుష్మాస్వరాజ్ ఇక లేరన్న వార్త బళ్లారిలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. -
‘ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో లేను’
సాక్షి, బళ్లారి: తాను ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, పార్టీ అధినాయకత్వం అప్పగించే ఏ బాధ్యత అయినా స్వీకరిస్తానని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, మొళకాల్మూరు ఎమ్మెల్యే బి.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం బళ్లారిలో రాఘవ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఏ ఒక్క జిల్లాకో చెందిన వ్యక్తిని కానని, అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత సంకీర్ణ సర్కార్‌పై జనం విసిగిపోయారన్నారు. ఆరు కోట్ల మంది కన్నడిగులు మద్దతు ఇవ్వడంతో యడియూరప్ప మళ్లీ సీఎం అయ్యారన్నారు. యడియూరప్ప సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసిన అంశం కోర్టు విచారణలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అయితే అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే రాజీనామాలు చేసిన వారి బంధువులే ఎన్నికల బరిలో దిగుతారన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమన్నారు. బళ్లారి రాఘవ పేరుపై అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తామని శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టైర్ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు
సాక్షి, బళ్లారి: సరదాగా సాగుతున్న ప్రయాణంపై ఒక్కసారిగా మృత్యువు పంజా విసిరింది. ఏం జరిగిందో తెలుసుకునే లోగానే ఐదుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇన్నోవా కారు, లారీ ఢీకొనడంతో డ్రైవర్, ముగ్గురు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం జరిగింది. చిత్రదుర్గం సమీపంలోని జాతీ య రహదారిలో మహాలింగప్ప పెట్రోల్ బంక్ సమీపంలో ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరులోని ఆర్ఆర్ నగరలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం ఇన్నోవాలో చిత్రదుర్గానికి పని మీద వచ్చింది. చిత్రదుర్గం నుంచి బాదామిలో పర్యాటక ప్రదేశాల వీక్షణకని బయల్దేరారు. కొంతసేపటికే మృత్యువు వెంటాడింది. ఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు నుజ్జయిన కారు కారు వేగంగా వెళ్తుండగా టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుకాగా, కారు డ్రైవర్‌తో పాటు అందులోని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని ఐదుమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను డ్రైవర్ అశోక్ (35), శ్యామల (64), శోభ (45), సుకన్య (67)గా గుర్తించారు. పవిత్ర (30), మంజుల (45), శ్రేష్ట (7), అథార్థ్ (2), మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్రదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. -
బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్
రాజశేఖరరెడ్డి.. ఈ పేరు వినగానే ప్రతి తెలుగు హృదయం సంతోషంతో పులకిస్తుంది. మల్లెపువ్వు వంటి చిరునవ్వు, నిష్కల్మషమైన హృదయానికి నిలువెత్తు రూపం ఆయనదని ప్రతి గుండే కొనియాడుతుంది. సంక్షేమ పథకాల రారాజుగా తెలుగునాట ప్రతి ఇంటా భోగభాగ్యాల కోసం అహరహం శ్రమించిన మహానేత పుట్టినరోజు నేడు. ఆ మహా వ్యక్తి నేడు మన మధ్య లేకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించి అపారమైన ప్రజాసంక్షేమ పథకాలు, రైతు స్నేహి ఆలోచనలతో ఆయన కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కర్ణాటకలో కూడా ప్రజలపై వైఎస్సార్‌ది చెరగని ముద్ర. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. వైఎస్సార్ 7వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)తో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్.. ఇలా ఆరేళ్ల పాటు బళ్లారి నగరంలో చదువుకున్నారు. ఎంతో మంది మిత్రులు ఉన్నారు. సాక్షి, బళ్లారి: పువ్వు పుట్టగానే పరమళిస్తుందని పెద్దలు అంటారు. మహానుభావులు, మహానేతలు కూడా బాల్యం నుంచే సత్ప్రవర్తన, ఆదర్శభావాలతో అందరి మన్ననలు అందుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొంటారు. తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రాజకీయ నేతల్లో అగ్రస్థానం అలంకరించే మహాపురుషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. కడప జిల్లా స్వస్థలమైనప్పటికీ, ఆ ప్రాంతం తరువాత కర్ణాటకలోని బళ్లారితో మహానేతకు అంతటి అనుబంధం పెనవేసుకుని ఉంది. చిన్ననాడే గొప్ప వ్యక్తిత్వం చదువుకున్న రోజుల్లోనే ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో తోటివారికి సేవచేయాలనే తపన, ఉత్సాహం ఆయ నలో పువ్వులోని పరిమళంలా వెన్నంటే ఉండేవి. ఎన్నో సుగుణాలు కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి బళ్లారిలో చదవడంతో బళ్లారి ఖ్యాతి కూడా దశదిశ లా వ్యాపించింది. ఆయనతో పాటు చదివినవారు, మిత్రులు తమ స్నేహితున్ని గురించి నిత్యం గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. 1958వ సంవత్సరంలో బళ్లారికి వచ్చారు. సెయింట్‌జాన్స్ పాఠశాలలో హైస్కూల్ చదువులను çపూర్తి చేసుకొని, అనంతరం 1964లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ బళ్లారిలో చదివారు. కోట ప్రాంతంలో ఇల్లు తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పని చేసు ్తన్న సమయంలో ఆయన పిల్లల చదువుల కోసం బళ్లారిలోనే కోట ప్రాంతంలో కొంతకాలం నివసిం చారు. వైఎస్సార్‌తో పాటు ఆయన సోదరులు వైఎస్ జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, సోదరి విమలమ్మను బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. వైఎస్ రాజారెడ్డి సంతానంలో అందరి కంటే ఎంతో చురుకైనవానిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్నప్పటి నుంచి తన ప్రతిభను చూపేవారు. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా తోటి వి ద్యార్థులకు ఎంతో అండగా ఉండేవారు. తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉ న్నాయన్నారు. అంతే కాదు నాయకత్వ లక్షణాలు ఆయనలో చిన్నప్పటి నుంచే పుష్కలంగా ఉన్నాయి. అవే లక్షణాలు ఆయన మునుముందు చరిత్ర పుట ల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా దోహదం చేశాయి. అలనాడు బళ్లారిలో కాలేజీ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డితో మిత్రులు వీరశైవ కాలేజీలో డిగ్రీ, గుల్బర్గాలో మెడిసిన్ బళ్లారిలో ఎస్ఎస్ఎల్సీ ముగిసిన తర్వాత ఇంటర్మీడియేట్ను విజయవాడలోని లయోలా కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం డిగ్రీని బళ్లారి నగరంలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే ఎంబీబీఎస్ సీటు రావడంతో గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ అయ్యారు. ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలోనే కొనసాగింది. మహానేత వైఎస్సార్ ఎంతఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడు గుర్తు చేసుకునేవారు. ఆ జ్ఞాపకాలు ఆయన మదిలో పచ్చని పొదలా ఉండేవి. సంక్షేమానికి పర్యాయపదంగా మారిన మహానేత జయంత్యుత్సవం సందర్భంగా ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలను బళ్లారిలో మిత్రులు సాక్షితో గుర్తుచేసుకున్నారు. ఆయనంటే అందరికీ ఇష్టం వైఎస్సార్ అంటే అందరూ తరగతి గదిలో ఇష్టపడేవాళ్లం. ఎస్ఎస్ఎల్సీలో కూడా మంచి పార్కులతో పాసయ్యారు. ఆయన బళ్లారిలో విద్యనభ్యసించిన తర్వాత విజయవాడ, గుల్బర్గాలో విద్యాభాస్యం పూర్తి చేశారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు, మా అందరికి మిత్రుడు దివంగత లెనార్డ్ గొంజాల్వెజ్ మాత్రమే వైఎస్సార్‌ను కలుస్తుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకోవడంతో తాము ఆయన్ను పలకరించేందుకు వెళితే ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడడం చూసి సంభ్రమానికి గురయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ను హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్ బిజీగా ఉన్నారు.కలవడం ఇబ్బందిగా ఉంటుందని అక్కడ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు తమతో చెప్పారు. అయితే ఎంతో కష్టంతో తమ పేర్లను వైఎస్ఆర్కు చేర్చాం. తమ పేర్లు వైఎస్సార్‌కు చేరిన ఐదు నిమిషాల్లో తమ వద్దకే ఆయన లోపల నుంచి వచ్చి పలకరించడంతో పాటు తన వెంట లోపలికి తీసుకెళ్లడంతో తమనేకాకుండా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్మేట్ పేరు, పేరును గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళితే ముందుగా తమకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు. అపారమైన జ్ఞాపకశక్తి ఉండటంతోనే ప్రతి ఒక్కరిని పేరు పేరును పలకరించేవారు. చిన్నప్పుడు హాస్టల్, పాఠశాలలో ఎలా మాట్లాడేవారో, అప్పుడూ అలాగే మాట్లాడారు. ఏ కష్టమొచ్చినా తనకు చెప్పాలని కోరారు. ప్రజలకు సేవ చేసే గుణం, నమ్మకం, స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ధీరత్వం ఆయనది. ఆయన మృతి చెందిన వార్త విని మా కుటుంబంలో ఒకరిని కోల్పోయామన్న బాధ కలిగింది. ఆయన ఈ లోకాన్ని వీడి 10 సంవత్సరాలు అయినా నేటికీ తమ మదిలో నిలిచిపోయారు. -
విషాదం; ఉపాధికెళ్తే ఊపిరే పోయింది
బళ్లారి : కుటుంబానికి ఆసరాగా ఉందామని, వేసవి సెలవుల్లో నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఉపాధి పనులు చేస్తున్న ఇద్దరు యువకులను పిడుగుపాటు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. సోమవారం బళ్లారి జిల్లా హరపనహళ్లి తాలూకా చిగటేరి గ్రామంలో పిడుగుపాటుకు గురై అరవింద్ (18), కిరణ్ (20) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద స్వగ్రామం చిగటేరి చెరువులో కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఉదయమే భారీ ఎత్తున ఈదురుగాలులతో పాటు వర్షం ప్రారంభమైంది. ఈ సమయంలో వారికి దగ్గరగా పెద్దశబ్ధంతో పిడుగుపడింది. దీంతో చెరువులో పనులను చేస్తున్న అరవింద్, కిరణ్‌లు కుప్పకూలిపోయారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని యువకులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే విగతజీవులు కావటంతో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను సేకరించారు. ఉపాధి కూలీ పనుల కోసం వెళ్లి మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు అధికారులను విన్నవించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కోసం 4 రోజులుగా శిథిలాల కిందే..
సాక్షి, బళ్లారి: ధార్వాడ నగరంలో నూతన బస్టాండు సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఐదంతస్తులు భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. నాలుగు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర సహాయ సిబ్బంది రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తూ పలువురిని రక్షించినా 17 మంది విధిరాతకు తలవంచక తప్పలేదు. అయితే నాలుగు రోజుల నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శుక్ర వారం సహాయ బృందాలు గాలిస్తుండగా ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. శిధిలాల కింద చిక్కుకున్న సోమనగౌడ అనే వ్వక్తి మృత్యుంజయుడుగా బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం అక్కడ పలువురిని తీవ్రంగా కలిచివేసింది. దిలీప్, సంగీత అనే దంపతులు శిథిలాల కింద చిక్కుకుని నాలుగు రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. భర్త దిలీప్‌ను రక్షించేందుకు సహాయక సిబ్బందికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన చేయి అందించకపోవడంతో సహాయ సిబ్బందిని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. సహాయక సిబ్బంది దిలీప్‌ను రక్షించాలని చేయి ఇవ్వాలని కోరగా, తన భార్య కాలు విరిగి తన ముందు చావుబతుకుల మధ్య ఉందని, తనను రక్షిస్తే ఇద్దరం బయటకు వస్తామని, లేకపోతే దేవుడు ఎలా రాసి ఉంటే అలాగే జరగని అని సమాధానం ఇస్తూ చేయి ఇవ్వకపోవడం పలువురిని కలిచివేయగా మరో వైపు భార్యభర్తల బంధం ఎంత గొప్పదో అని చర్చించుకోవడం కనిపించింది. -
బళ్లారి ఆత్మీయుడు వివేకా
అత్యంత సౌమ్యుడు, వినయశీలి, నిరాడంబరుడు, అందరికీ ఆత్మీయుడు.. ఇలా ఎన్నో సుగుణాలు కలబోసిన వైఎస్ వివేకానందరెడ్డి ఇక లేరు అన్న విషాద వార్తతో బళ్లారిలోని ఆయన మిత్రులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవల వచ్చి కలిశారు, పాత మధురాలను తల్చుకుని మురిసిపోయాం, అంతలోనే ఇంత ఘోరం ఎలా జరిగిందని ఆవేదన చెందుతున్నారు. సాక్షి, బళ్లారి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మికంగా కన్నుమూయడం బళ్లారిలోని సన్నిహితుల్ని, స్నేహితుల్ని తీరని విషాదానికి గురిచేసింది. అన్నయ్యతో కలిసి పాఠశాలకు వివేకా అన్నయ్య వైఎస్సార్‌తో కలిసి బళ్లారిలో విద్యాభ్యాసం చేసేటప్పుడు నగరంలోని విడదీయని బంధం ఏర్పడింది. తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పనిచేసేటప్పుడు బళ్లారిలోనే కొంతకాలం కుటుంబం నివసించింది. వైఎస్ రాజారెడ్డి అప్పట్లో తన కుమారులైన జార్జిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, కుమార్తె విమలను బళ్లారిలోనే చదివించారు. మహానేత రాజశేఖరరెడ్డితో కలిసి 1959 సంవత్సరంలో బళ్లారిలోని కోట ప్రాంతంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో చేరారు. అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ వరకే ఉండటంతో అంతవరకు బళ్లారిలోనే చదివారు. కోట ప్రాంతం నుంచి అన్న వైఎస్సార్‌తో కలిసి కాలినడకన, సైకిల్‌పై పాఠశాలకు వచ్చేవారని తోటి స్నేహితులు గుర్తు చేసుకున్నారు. బళ్లారిలో వైఎస్ వివేకానందరెడ్డి చదివిన సెయింట్జాన్ పాఠశాల అండ్ కాలేజీ వారం కిందటే సమాగమం వారం రోజుల కిందటే బళ్లారికి విచ్చేసిన వైఎస్ వివేకానందరెడ్డి ఆయన స్నేహితులు పవన్ హోటల్ యజమాని రాందాసరెడ్డి, సుధాకరరెడ్డి, రామకృష్ణ, విరుపాక్షప్పలను కలిసి ముచ్చటించడాన్ని వారు కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. గతంలో ఆయన బళ్లారిలో జీన్స్ ఫ్యాక్టరీలను సందర్శించి, బళ్లారి జీన్స్ తరహాలోనే పులివెందులలో కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావించారు. ఇంతలోనే ఆయన మరణవార్త వినాల్సి వస్తుందనుకోలేదని స్నేహితులు, క్లాస్‌మీట్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే హుటాహుటిన పలువురు పులివెందులకు వెళ్లారు. బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి కూడా పులివెందులకు వెళ్లారు. తరచూ బళ్లారికి రాక బళ్లారిలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్న అనంతరం విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకుని, మళ్లీ బళ్లారిలో వీరశైవ కళాశాలలో బీఎస్సీ చేరారు. కొద్దిరోజులకు తిరుపతిలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేసినట్లు ఆయన స్నేహితులు తెలిపారు. బళ్లారిలో విద్యాభ్యాసం చేసేటప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి స్నేహతులతో ఎంతో సఖ్యతతో, వినయంగా ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఆయన స్నేహితులను కలిసేందుకు ఏడాదిలో పలుమార్లు వచ్చేవారంటే ఆయనకు చిన్ననాటి స్నేహితులంటే ఎంత అభిమానమో అర్థమవుతుందన్నారు. -
‘గాలి’ ప్రచారానికి వీల్లేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బళ్లారి నియోజకవర్గంలో జనార్దన్ సోదరుడు సోమశేఖర రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తరపున బళ్లారిలో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాలి జనార్దన్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెయిల్ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దానిని తిరస్కరించింది. మైనింగ్ కేసులో గాలికి సుప్రీంకోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదన్న నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం అందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. -
కాంగ్రెస్ చివరి కోట కూలిపోతుంది: మోదీ
సాక్షి బళ్లారి: కాంగ్రెస్ పాలనలో బ్రాండ్ కర్ణాటక పూర్తిగా దెబ్బతిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక విలువలతో కూడిన కర్ణాటకను కాంగ్రెస్ ఇప్పుడు చూపించగలదా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బళ్లారిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రజల ఉత్సాహంతో కాంగ్రెస్ చివరి కోట కూడా కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో బ్రాండ్ కర్ణాటక అనేది పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. విజయనగర రాజుల పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీ నాశం చేసిందంటూ మండిపడ్డారు. సిద్దరామయ్య ప్రభుత్వం తీరుతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేటికీ కర్ణాటక ప్రజల్ని మోసం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాటకాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్.. దళితులు, ఓబీసీలకు శత్రువుగా మారిందన్నారు. అక్రమ మైనింగ్‌లతో ఎంతో దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాషాయ పార్టీకి ఓటేసి, బళ్లారి ప్రజలను ఎన్నో అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మోదీ అభిప్రాయపడ్డారు.