
బళ్లారి సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాజ్‌నాథ్‌సింగ్. పక్కన యడ్యూరప్ప, శ్రీరాములు
బళ్లారి (కర్ణాటక) : ధైర్యముంటే ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన పార్టీ ప్రస్తుతం ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములు తరపున ప్రచారం నిర్వహించేందుకు ఈ రోజు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి చరిష్మా లేదని తేలడంతో, ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని చెప్పారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉత్తమ పాలన అందుతోందని, గుజరాత్‌లో నరేంద్ర మోడీ అద్భుత పాలన సాగిస్తున్నారని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ కితాబు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ సంస్థకు సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందేనన్నారు.