సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ బరిలో అత్యధిక అభ్యర్థులను బరిలో నిలపనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకుగాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు 408 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 30 స్థానాలకు గెలుపుగుర్రాల కోసం అన్వేషిస్తోంది. దీంతో బీజేపీ చరిత్రలో అత్యధికంగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికగా రికార్డు సృష్టించనుంది. దేశ వ్యాప్తంగా గల 543 స్థానాలకు గత ఎన్నికల్లో 428 మంది బరిలో నిలపిన విషయం తెలిసిందే.
అంతకుముందు 2009 ఎన్నికల్లో 433, 2004లో 364, 1999 ఎన్నికల్లో 339 అభ్యర్థులను కమలం పార్టీ బరిలో నిలపింది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు.. ఏడు లోక్‌సభ స్థానాలు గల ఢిల్లీలో టికెట్ కోసం ఎంతోమంది పోటిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో సరైన అభ్యర్థుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. 80 లోక్‌సభ స్థానాలు గల యూపీలో కూడా మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
పంజాబ్, హర్యానాలో శిరోమణీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మధ్యప్రద్‌శ్‌లో మరో ఎనిమిది స్థానాలకు పెండింగ్‌లో ఉంచింది. ఏపీ, తెలంగాణలో గత ఎన్నికల్లో కేవలం 12 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఈసారి ఒంటరిగా మొత్తం 42 స్థానాల్లోనూ బరిలో నిలిచింది. గత ఎన్నికల మాదిరీగానే ఈసారి కూడా కే్ంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుంతుందని ఆ పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. కాగా 2014 ఎన్నికల్లో 280పైగా స్థానాలను కైవసం చేసుకుని తొలిసారి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment