వీకే సింగ్, అద్వాని, మోడి
న్యూఢిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అత్యధిక, అత్యల్ప ఓట్ల మెజార్టీ సాధించిన ఇద్దరు లోక్సభ సభ్యులూ బిజెపి అభ్యర్థులే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్‌లోని వడోదర స్థానంలో దేశంలోనే అత్యధికంగా 5,70,128 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తుపస్థన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన మొదటి ఐదుగురు అభ్యర్థులు కూడా బీజేపీ వారే కావడం మరో విశేషం. వీరిలో ఆర్మీ మాజీ చీఫ్ వీకేసింగ్ మినహా మిగిలిన నలుగురూ గుజరాత్ నుంచి గెలిచారు.
అధిక మెజార్టీ సాధించినవారు వరుసగా నరేంద్ర మోడీ(వడోదర) 5,70,128, వీకే సింగ్(ఘజియాబాద్) 5,67,260, సీఆర్ పాటిల్(నవ్‌రాసి)5,58,116, డీవీ జర్దోష్(సూరత్)5,33,190, ఎల్‌కే అద్వానీ(గాంధీనగర్)4,83,121 ఓట్ల మెజార్టీ సాధించారు.
అత్యల్ప మెజార్టీ సాధించిన ఇద్దరు కూడా బిజెపివారే. తుపస్థన్ చెవాంగ్(లడఖ్) 36 ఓట్లు, చందూలాల్ సాహూ(మహాసముంద్)1,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.