highest majority
-
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 25 స్థానాలగానూ 22 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలిచారు. ఆరుగురు అభ్యర్థులు 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయాలు దక్కించుకున్నారు. ఎనిమిది మంది లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అత్యల్ప మెజారిటీతో గట్టెక్కారు. (అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు వీరివే..) అత్యధిక మెజారిటీ.. ♦ కడపలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి 380976 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై విజయం సాధించారు. ♦ రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి 268284 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ నంద్యాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డి 250119 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మంద్రా శివానందరెడ్డిపై గెలుపొందారు. ♦ తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లిదుర్గాప్రసాద్ 228376 ఓట్ల ఆధిక్యం సాధించారు. ♦ అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 224089 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌పై విజయం దక్కించుకున్నారు. ♦ ఒంగోలులో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 214851 ఓట్ల తేడాతో గెలిచారు. అత్యల్ప మెజారిటీ.. ⇔గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ⇔విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మాత్కుమిల్లి భరత్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4414 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ⇔శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై కె. రామ్మోహన్ నాయుడు 6653 ఓట్ల తేడాతో గెలిచారు. ⇔విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని 8726 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై విజయాన్ని దక్కించుకున్నారు. -
ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు
సాక్షి, అమరావతి: దేశమంతా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ పరంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. విజయవాడ సెంట్రలక్ష నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అతి స్వల్ప మెజారిటీలో గట్టెక్కారు. 21 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. నలుగురు అభ్యర్థులు వెయ్యిలోపు ఆధిక్యంతో బయటపడ్డారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు.. ఒకరు టీడీపీ, ఒకరు జనసేన పార్టీకి చెందిన వారు. ♦ పులివెందులలో సతీశ్‌కుమార్ రెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 90110 ఓట్ల భారీ మెజారిటీ ♦ గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డిపై అన్నా రాంబాబుకు 81035 ఓట్ల ఆధిక్యం ♦ సూళ్లూరుపేటలో పర్సా వెంకట రత్నయ్యపై కలివేటి సంజీవయ్య 61292 ఓట్ల ఆధిక్యం ♦ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి 55207 మెజారిటీ ♦ కడపలో అమీర్‌బాబు నవాజ్‌షాన్‌పై అంజాద్ భాషా 54794 ఆధిక్యం ♦ జమ్మలమడులో రామసుబ్బారెడ్డిపై మూలె సుధీర్‌రెడ్డికి 51641 మెజారిటీ ♦ గుంతకల్‌లో జితేంద్రగౌడ్‌పై వెంకటరామిరెడ్డికి 48532 ఆధిక్యం ♦ తంబళ్లపల్లెలో గొల్లల శంకర్‌పై పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 46938 మెజారిటీ ♦ శింగనమలలో బండారు శ్రావణిశ్రీపై జొన్నలగడ్డ పద్మావతికి 46242 ఆధిక్యం ♦ గంగాధర నెల్లూరులో అనగంటి హరికృష్ణపై కె. నారాయణస్వామికి 45594 మెజారిటీ ♦ గూడూరులో పాశిం సునీల్‌కుమార్‌పై వెలగపల్లి వరప్రసాదరావుకు 45458 ఆధిక్యం ♦ సత్యవోలులో జెడ్డా రాజశేఖర్‌పై కోనేటి ఆదిమూలంకు 44744 మెజారిటీ ♦ బద్దేల్లో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై జి. వెంకట సుబ్బయ్యకు 44734 ఆధిక్యం ♦ పాణ్యంలో గౌరు చరితారెడ్డిపై కాటసాని రాంభూపాల్ రెడ్డికి 43857 మెజారిటీ ♦ పుంగనూరులో అనీషా రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 43555 ఆధిక్యం ♦ ప్రొద్దటూరులో మల్లెల లింగారెడ్డిపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి 43148 మెజారిటీ ♦ పాడేరులో గిడ్డి ఈశ్వరిపై భాగ్యలక్ష్మి కొత్తగుల్లికి 42804 ఆధిక్యం ♦ పోలవరం బొరగం శ్రీనివాసులుపై తెల్లం బాలరాజుకు 42070 మెజారిటీ ♦ పత్తికొండలో కేఈ శ్యామ్‌కుమార్‌పై కంగటి శ్రీదేవికి 42065 ఆధిక్యం ♦ చంద్రగిరిలో పులివర్తి వెంకట మణి ప్రసాద్‌పై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 41755 మెజారిటీ ♦ నందికొట్కూరులో బండి జయరాజుపై తొగురు ఆర్థర్‌కు 40610 ఆధిక్యం ♦ కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై బుర్రా మధుసూదన్ యాదవ్‌కు 40903 మెజారిటీ అతికష్టంగా గట్టెక్కారు! ⇔విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు ⇔తిరుపతిలో టీడీపీ అభ్యర్థి సుగుణపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి 708 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ⇔రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ⇔గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఆధిక్యంతో బయటపడ్డారు. -
‘అందోల్’లో దామోదర్ దే రికార్డు
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.దామోదర రాజనర్సింహ కాగా అతితక్కువ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 1999 సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 ఓట్లతో దామోదర ఓటమి చెందగా 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్‌ను 24,846 ఓట్ల మెజార్టీతో ఓడించారు. అప్పట్లో దామోదరకు 67,703 ఓట్లు రాగా బాబూమోహన్‌కు 42,857 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో బాబూమోహన్ 2906 ఓట్లతో ఓటమి చెందగా 2014 ఎన్నికల్లో 3208 ఓట్లతో దామోదర రాజనర్సింహ ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో బాబూమోహన్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీదేవి 19,985 ఓట్లతో బస్వమాణయ్యపై, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ, లక్ష్మణ్‌కుమార్‌పై 13,901 ఓట్లతో, 1978లో రాజనర్సింహ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సదానంద్‌పై 738 ఓట్లతో, 1983లో లక్ష్మణ్ జీ స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరీ బాయిపై 10,515 ఓట్లతో, 1985లో దేశం అభ్యర్థి ఎం.రాజయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజనర్సింహపై 16,463 ఓట్లతో, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్యపై 3014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1998 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదరపై 10,554 ఓట్లతో గెలుపొందారు. అందోల్ అసెంబ్లీకి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు వెయ్యిలోపు, మూడు సార్లు 3వేల ఓట్లతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి డిమాండ్ మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: ఖరీప్ సీజన్ దగ్గరపడుతుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలకోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. -
ఆ ఇద్దరే కాదు, ఆ అయిదుగురూ బిజెపి వారే!
న్యూఢిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అత్యధిక, అత్యల్ప ఓట్ల మెజార్టీ సాధించిన ఇద్దరు లోక్‌సభ సభ్యులూ బిజెపి అభ్యర్థులే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్‌లోని వడోదర స్థానంలో దేశంలోనే అత్యధికంగా 5,70,128 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తుపస్థన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన మొదటి ఐదుగురు అభ్యర్థులు కూడా బీజేపీ వారే కావడం మరో విశేషం. వీరిలో ఆర్మీ మాజీ చీఫ్ వీకేసింగ్ మినహా మిగిలిన నలుగురూ గుజరాత్ నుంచి గెలిచారు. అధిక మెజార్టీ సాధించినవారు వరుసగా నరేంద్ర మోడీ(వడోదర) 5,70,128, వీకే సింగ్(ఘజియాబాద్) 5,67,260, సీఆర్ పాటిల్(నవ్‌రాసి)5,58,116, డీవీ జర్దోష్(సూరత్)5,33,190, ఎల్కే అద్వానీ(గాంధీనగర్)4,83,121 ఓట్ల మెజార్టీ సాధించారు. అత్యల్ప మెజార్టీ సాధించిన ఇద్దరు కూడా బిజెపివారే. తుపస్థన్ చెవాంగ్(లడఖ్) 36 ఓట్లు, చందూలాల్ సాహూ(మహాసముంద్)1,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
అత్యధిక మెజార్టీ ఖాయం
నరసరావుపేట ఈస్ట్, న్యూస్‌లైన్ :జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందనున్న నియోజకవర్గాల్లో నరసరావుపేట మొదటి స్థానంలో నిలుస్తుందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. మూడున్నరేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, సమస్యలపై ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన విషయం ప్రజలందరికి తెలుసని చెప్పారు. ప్రజలతో మమేకమైతేనే వాళ్లకు ఏం కావాలో తెలుసుకోగలుగుతామని, డబ్బుతో రాజకీయాలు చేయలేమని తెలిపారు. పట్టణం, గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని, పార్టీ అధికారంలో రాగానే పరిష్కరిస్తానని చెప్పారు. నరసరావుపేట ప్రజలు ఆత్మసాక్షిగా ఓటు వేయాలని, ప్రజల తరపున నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు ఏ విధంగా మళ్లీ పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నించారు. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని, అయినప్పటికీ వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జననేత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, పార్టీ పట్టణ యువజన విభాగం కన్వీనర్ రామిశెట్టి కొండ, ఎంఐఎం నాయకులు షేక్ మస్తాన్‌వలి, కాపు యువజన నాయకుడు ఎన్కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కనిష్ఠం 90 ఓట్లు.. గరిష్ఠం 64677
ఇంతకుముందు జరిగిన 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీ, అత్యంత ఎక్కువ మెజారిటీ ఎవరెవరికి వచ్చాయో తెలుసా? అలాగే, వెయ్యి ఓట్ల లోపు మెజారిటీ ఎంతమందికి వచ్చిందో తెలుసా? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. అయితే చూడండి. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి తన ప్రత్యర్థిపై 90 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. అలాగే, సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన తన్నీరు హరీష్ రావు 64677 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇది అత్యధికం. ఇక ఆ ఎన్నికల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతో గెలిచిన వాళ్లు ఏకంగా 21 మంది ఉన్నారు. వాళ్లలో నిన్న మొన్నటి వరకు రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, కొలుసు పార్థసారథి, తోట నరసింహం లాంటివాళ్లు సైతం ఉన్నారు. ఇలా వెయ్యిలోపు మెజారిటీతో నెగ్గిన వాళ్లు ఎవరెవరంటే.. ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి (నెల్లూరు సిటీ) 90, కె.తారకరామారావు (సిరిసిల్ల) 171; కొలుసు పార్థసారథి (పెనమలూరు) 177; ఎస్.వేణుగోపాలాచారి (ముధోల్) 183; యలమంచిలి రవి (విజయవాడ తూర్పు) 190; పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) 229; పొన్నాల లక్ష్మయ్య (జనగామ) 236; కె.మీనాక్షి నాయుడు (ఆదోని) 256; దిరిశం పద్మజ్యోతి (తిరువూరు) 265; ద్రోణంరాజు శ్రీనివాసరావు (విశాఖ దక్షిణం) 341; రేగా కాంతారావు (పినపాక) 349; సివిరే సోమా (అరకు లోయ) 402; అంబటి బ్రాహ్మణయ్య (అవనిగడ్డ) 417; పసుపులేటి బాలరాజు (పాడేరు) 587; బడుకొండ అప్పలనాయుడు (నెల్లిమర్ల) 597; జైపాల్ యాదవ్ (కల్వకుర్తి) 597; గొల్ల బాబూరావు (పాయకరావుపేట) 656; తోట నరసింహం (జగ్గంపేట) 789; మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్) 848; డాక్టర్ పి.రవి (పూతలపట్టు) 951; జయమంగళ వెంకటరమణ (కైకలూరు) 974.