‘అందోల్’లో దామోదర్ దే రికార్డు | damodar record in andole | Sakshi
Sakshi News home page

‘అందోల్’లో దామోదర్ దే రికార్డు

Published Mon, May 26 2014 12:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

‘అందోల్’లో దామోదర్ దే రికార్డు - Sakshi

‘అందోల్’లో దామోదర్ దే రికార్డు

 జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.దామోదర రాజనర్సింహ కాగా అతితక్కువ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 1999 సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 ఓట్లతో దామోదర ఓటమి చెందగా 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్‌ను 24,846 ఓట్ల మెజార్టీతో ఓడించారు. అప్పట్లో దామోదరకు 67,703 ఓట్లు రాగా బాబూమోహన్‌కు 42,857 ఓట్లు వచ్చాయి.

 2009 ఎన్నికల్లో బాబూమోహన్ 2906 ఓట్లతో ఓటమి చెందగా 2014 ఎన్నికల్లో 3208 ఓట్లతో దామోదర రాజనర్సింహ ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో బాబూమోహన్ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీదేవి 19,985 ఓట్లతో బస్వమాణయ్యపై, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ, లక్ష్మణ్‌కుమార్‌పై 13,901 ఓట్లతో, 1978లో రాజనర్సింహ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సదానంద్‌పై 738 ఓట్లతో, 1983లో లక్ష్మణ్ జీ స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరీ బాయిపై 10,515 ఓట్లతో, 1985లో దేశం అభ్యర్థి ఎం.రాజయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజనర్సింహపై 16,463 ఓట్లతో, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్యపై 3014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1998 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదరపై 10,554 ఓట్లతో గెలుపొందారు. అందోల్ అసెంబ్లీకి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు వెయ్యిలోపు, మూడు సార్లు 3వేల ఓట్లతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.
 
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలి
టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి డిమాండ్

మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: ఖరీప్ సీజన్ దగ్గరపడుతుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలకోసం రైతులు  ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement