సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్‌కి అహం పెరిగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్ దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని విమర్శించారు. మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నాయన్నారు. వారి సమస్యలు వింటుంటే బాధ కలుగుతుందన్నారు. వారికి ఏ రకంగా న్యాయం చేయాలనే అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు.
ఎక్కువగా విద్య, వైద్యంపై విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ఓ క్యాలెండర్ ఉండేలా చూస్తామన్నారు. అక్టోబర్‌లో నిర్వహించిన డీఎస్సీకి అతీగతీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించారు. వడ్డెర కులాన్ని ఎస్టీలలో చేర్చాలని తమకు విజ్ఞప్తులు అందాయన్నారు. అన్ని వర్గాలతో చర్చించి అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామని రాజనర్సింహా స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతామని, ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment