కేటీఆర్‌ గెలిచింది బాబు దయతోనే | Mruthyunjayam Said Development Only With KK | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ గెలిచింది బాబు దయతోనే

Published Wed, Dec 5 2018 4:24 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Mruthyunjayam Said Development Only With KK - Sakshi

మాట్లాడుతున్న కటుకం మృత్యుంజయం

సాక్షి, సిరిసిల్లటౌన్‌: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సీఎం కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని తొమ్మిది నెలలు ముందుగానే రద్దు చేశారని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుం జయం ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లాకేంద్రం లోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో అంటకాగేందుకే కేసీఆ ర్‌ ముస్లింల ఓట్ల కోసం ముందస్తు నాటకానికి తెరలేపారన్నారు. గతంలో ఎన్నడూలేని దిక్కుమాలిన ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఛీత్కరిం చుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్షాలపై, తెలంగాణ ప్రదాత సోనియాగాంధీపై దిక్కుమాలిన భాష మాట్లాడుతున్నాడని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నాలుగేళ్లుగా ఏఒక్క ఎకరాకి కూడా నీరు పారలేదని, మంత్రి కేటీఆర్‌ సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కార్మికరంగాల్లో వెనుకబాటుకు టీఆర్‌ఎస్‌ కారణ మన్నారు. కేకే మహేందర్‌రెడ్డితోనే సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 


కేటీఆర్‌ గెలిచింది బాబు దయతోనే..   
2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని, ఆఎన్నికల్లో చంద్రబాబు దయతోనే కేటీఆర్‌ గెలిచారని, ఆవిషయాన్ని మరిచి మాట్లాడడం సరికాదని సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురా లు నేరెళ్ల శారద మాట్లాడుతూ, మహిళా సంక్షేమాన్ని నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ కాలరాసిందన్నారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప్ర జాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, ఓ యూ జేఏసీ చైర్మన్‌ దరువు ఎల్లం, నాయకులు గు డ్ల మంజుల, ఆకునూరి బాలరాజు, గుడ్ల మంజు ల, ఆడెపు చంద్రకళ, నాగుల సత్యనారాయణ, బైరినేని రాము, టోనీ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement