Damodar raja narasimha
-
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలపై సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. పొట్టి శ్రీరాములును తక్కువగా చూడటం లేదు ‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు. వారి ప్రాణ త్యాగాన్ని అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునరి్వభజన తర్వాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొందరు కొన్ని వర్గాల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు.ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీకి వెళ్లగా తెలంగాణలో హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్‌ను అగౌరవపరిచినట్టు కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరును పెట్టుకున్నాం. ఇదే కోవలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టుకున్నాం. వ్యక్తులను అగౌరవ పరిచేందుకు కాదు.. ఏపీలో ఆ పాత పేర్లతో యూనివర్సిటీలు, సంస్థలు కొనసాగనున్నందున తెలంగాణలో కూడా అవే పేర్లతో ఉంటే పరిపాలనలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున మార్చుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కొందరు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవటం తప్పు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకు ఆయన పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు..’అని రేవంత్ చెప్పారు. నేచర్‌క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు ‘మాకు ఆర్యవైశ్యులపై, పెద్దలు పొట్టి శ్రీరాములుపై అపార గౌరవం ఉంది. ఆయన త్యాగాలు, ఆయన దేశభక్తిని సమున్నతంగా స్మరించుకునేలా.. ఇటీవలే ఘనంగా ప్రారంభించుకున్న చర్లపల్లి రైల్వే టెరి్మనల్‌కు ఆయన పేరు పెట్టుకుందాం. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖ రాస్తా. ఇక మాజీ సీఎం కె.రోశయ్య ఇంటికి చేరువలోనే ఉన్న ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టడంతో పాటు ఆవరణలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తాం. ఇక సురవరం ప్రతాపరెడ్డి మహనీయుడు. తెలంగాణలో కవులు లేరు అంటూ అపహాస్యం చేసిన పరిస్థితిలో 354 మంది ఉద్ధండ కవులతో సమావేశమై గోల్కొండ పత్రికలో వారి ప్రతిభకు పట్టం కట్టి తెలంగాణ కవుల గొప్పదనాన్ని చాటారు. నిజాంకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన ధీశాలి..’అని సీఎం వివరించారు. తెలుగుజాతి త్యాగాన్ని అవమానించడమే: బీజేపీతెలుగు వర్సిటీ పేరు మార్పును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘పొట్టి శ్రీరాములు ఓ ప్రాంత నేత కాదు. ఆయన గాం«దీజీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుడి పేరును తొలగించటం అంటే తెలుగు జాతి త్యాగాన్ని అవమానపరచటమే.సురవరం ప్రతాపరెడ్డి పేరును.. నిజాంకు గుర్తుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పేరును మార్చి దానికి పెట్టాలి..’అని బీజేపీ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్‌లోని స్టేడియానికి సర్దార్ పటేల్ పేరును తొలగించారన్న ఆరోపణ సరికాదని, స్టేడియం ప్రాంగణానికి ఆయన పేరే ఉందని, అక్కడి క్రికెట్ గ్రౌండ్‌కు మాత్రమే నరేంద్ర మోదీ పేరు పెట్టారని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
‘గాంధీ’లో డ్యూటీకి డాక్టర్ల డుమ్మా.. మంత్రి రాజనర్సింహ సీరియస్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. డాక్టర్ల హాజరుపై షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి.. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు. ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని.. మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డ్యూటీ సమయంలో డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. -
ఆధార్ లేకపోతే వైద్యం చేయరా?
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్: ఆధార్ కార్డు లేద న్న కారణంతో ఒక మహిళకు వైద్యం నిరాకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అనారోగ్యంతో ఉన్న ఆ మహిళకు వెంటనే మె రుగైన వైద్యం అందించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.నాగర్‌కర్నూల్ జిల్లా యడ్లపల్లి చెందిన ప్రమీల అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లగా, ఆమెకు ఆధార్‌కార్డు లేదని వైద్యం చేసేందుకు నిరాకరించినట్లు మీడి యాలో వచ్చిన వార్తలపై మంత్రి ఆదివారం స్పందించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి ఆధార్ లేకుంటే వైద్యం చేయరా? అని ప్రశ్నించారు. ఏదో ఉద్యోగంలా కాకుండా మానవత్వంతో రోగులకు చికిత్స అందించాలని హితవు పలికారు.ఆధార్ లేకున్నా ఉస్మానియాలో వైద్యం: డాక్టర్ రాకేశ్ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ఆధా ర్‌కార్డు తప్పనిసరి కాదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆసుపత్రి లో నిత్యం సుమారు 3,000 మందికి ఓపీ వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డు లేద న్న కారణంతో ప్రమీల అనే మహిళకు వైద్యం నిరాక రించిన ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధార్‌కార్డు నమోదు చేయడం వల్ల రోగులకు భవిష్యత్తులో అందించే వైద్య సేవలు, మందుల పంపిణీ, ఇతర మెరుగైన వైద్య సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ప్రమీ ళ ఈ నెల 8న ఉస్మానియాకు రాగా, అదే రోజు ఆధార్ కార్డు లేకున్నా వైద్యం అందించినట్లు తెలిపా రు. ఆమె ఆసుపత్రి బయట ఉండడంతో ఆరోగ్యం క్షీణించిందని, ఆదివారం ఉదయం అఫ్జల్‌గంజ్ పోలీసులు ఆమెను తీసుకురావడంతో ఇన్‌పేషంట్ గా చేర్చుకొని వైద్యం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరో గ్యంనిలకడగా ఉందని చెప్పారు. ప్రమీలను నాంపల్లి క్రిమినల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావేద్ పాషా ఆదివారం పరామర్శించారు. -
సీఐడీకి హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.హైదరాబాద్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు.మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆసుపత్రి ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు.ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
కుల, మత, వర్గాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం
-
సృజనకు పదును పెడితేనే ఆవిష్కరణలు
జడ్చర్ల/ జడ్చర్ల టౌన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తేనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులోని ఎస్‌వీకేఎంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదుపుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి ఇన్స్పైర్ 2023– 24 విభాగంలో 301.. 2024– 25 రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కింద 563 ఎంట్రీలు వచ్చాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు‡ పాల్గొన్నారు. సంజీవని హెలికాప్టర్సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైసూ్కల్ విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలికాప్టర్’ప్రయోగాన్ని ప్రదర్శించాడు. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ప్రూప్తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలికాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది. మొక్కజొన్న వ్యర్థాల నుంచి బయో ఆయిల్మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్ ఉత్పత్తి చేసే ఆవిష్కరణను నిజామాబాద్ విజయ హైస్కూల్ విద్యార్థులు విజిదేంద్రియ, శ్రీకర్ కలసి ప్రదర్శించారు. అ్రల్టాసోనిక్ హెల్మెట్వినికిడి లోపం ఉన్నవారితో పాటు వాహనదారులకు బైక్ నడిపే సమయంలో ప్రమాదాల నివారణకోసం అ్రల్టాసోనిక్ హెల్మెట్‌ను ఖమ్మం జిల్లా చెన్నారం జెడ్పీ హైసూ్కల్‌కు చెందిన విద్యార్థి ప్రియ రూపొందించింది. వాహనం నడిపేటప్పుడు సెన్సార్ల ఆధారంగా హెల్మెట్ గ్లాస్‌కు కంటికి కనిపించే విధంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ లైట్లను ఏర్పాటు చేశారు. దీని ఖర్చు కేవలం రూ.400 నుంచి రూ.1,000 వరకు అవుతుంది. -
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
హైదరాబాద్: హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్‌గా కో-ఆర్డినేట్ చేసుకుంటున్నారని, ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.కాగా, భారత్‌లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది. కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
గ్రామాల్లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో వచి్చన మార్పులు, ఒత్తిళ్ల నేపథ్యంలో గ్రామాల్లో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఎన్సీడీ వ్యాధులపై ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు. 30 సంవత్సరాల వయస్సు దాటిన 1.66 కోట్ల మందికి పరీక్షలు జరపగా, 22.94 లక్షల మందికి రక్తపోటు, 11.9 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో గురువారం మంత్రి రాజనర్సింహతో జరిగిన ఈ సమావేశంలో సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేసిన ఎన్సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్సీడీ క్లినిక్‌లలో అందుతున్న వైద్య సేవలపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ సర్వేను కొనసాగించాలని ఆయన సూచించారు. -
ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి..
రెంజల్ (బోధన్)/నిజామాబాద్ నాగారం: జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాలను నివారించేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా రెంజల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా 300 వరకు హెల్త్ సబ్‌సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కేన్సర్ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. జీజీహెచ్‌లో ఏం జరుగుతోందో నాకు తెలుసు.. ‘నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఏం జరుగుతోందో నాకు తెలుసు. 60 శాతం మంది వైద్యులు విధులకు గైర్హాజరు అవుతున్నారు. నా వద్ద పూర్తి సమాచారం ఉంది’అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. వందరోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోగా మార్పు రాకుంటే కఠిన చర్యలు ఉంటాయ న్నారు. ఆదివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో పైపులైన్ లీకేజీ, భవనాలపై పిచ్చిమొక్కలు పెరగడం, కిటికీల అద్దాలు పగిలిపోవడం, లిఫ్ట్‌లు చెడిపోవడం, ఎలు కలు తిరుగుతుండటాన్ని గమనించి సూపరింటెండెంట్ ప్రతి మారాజ్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీజీహెచ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ. 7 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఏఎన్ఎంలను తొలగించం
హైదరాబాద్: రెగ్యులర్ ఉద్యోగులను నియమించి నప్పటికీ, కాంట్రాక్టు ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసేయబోమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని ఏఎన్ఎంలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి తెలిపారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ పరీక్షకు హాజరయ్యే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని గుర్తుచేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో ఇచ్చిన 1,931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి, ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రానివారిని, చివరి వరకూ కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఏఎన్ఎంలు కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీకి టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు. దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్ రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు. ఎక్స్పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార భద్రతపై కలెక్టరేట్లలో ఫిర్యాదు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, రిజి్రస్టేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. గత పదేళ్లలో పెరిగిన హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం కాలేదని మంత్రి అన్నారు. తామిప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇవిగాకుండా కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచిపేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంచిగా బిజినెస్ చేసుకునే వారికి అండగా ఉంటూనే, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్...: వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను మంత్రి దామోదర అందజేశారు. హైజెనిక్ కండీషన్లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంసహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సరి్టఫికేషన్ ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై పోలీస్ నిఘా
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కమిటీ ఏర్పాటు ఇలా...ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్పర్స న్గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు. కమిటీలు ఏం చేస్తాయంటే?ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు. -
గాంధీ ఆస్పత్రిలో ‘ఐవీఎఫ్’ సేవలు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యవిద్యార్థుల వసతిగృహ భవన సముదాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి దామోదర రాజనర్సింహ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎంసీహెచ్ భవనంలోని ఐవీఎఫ్ సెంటర్‌ను వైద్య ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం గాం«దీఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిందని, తనకు తెలిసిన వెంటనే డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఎంబ్రయాలజిస్ట్లను నియమించి, రీఏజెంట్స్ కోసం నిధులు కేటాయించి, సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.సంతానలేమితో బాధపడుతున్న వారిక్కడ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లలో ప్రభుత్వ సెక్టార్లో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి లో ఐవీఎఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించారు. గాందీలో అదనపు విభాగాల ఏర్పాటు గాం«దీలో ప్రస్తుతం ఉన్న 34 విభాగాలతోపాటు అదనంగా మరో నాలుగు విభాగాలు, యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 కేన్సర్ కేర్, 74 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకే అనే అభిప్రాయం పోగొట్టాలని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రియా జ్, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ హేమంత్‌కుమార్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్డీహెచ్పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుమతి ఇస్తాం.. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్‌కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్‌కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్‌రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
చవకబారు విమర్శలు మానుకో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య వ్యవస్థపై చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఈహెచ్ఎస్పై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఈహె చ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్‌లను పదేళ్లు భ్రష్టు పట్టించి, ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల, పేదలకు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పో యాయన్నారు.ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చోద్యం చూశారని విమర్శించారు. ‘‘మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్యోగు లు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్ని కల ముందు హడావుడిగా డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాల’’ని మంత్రి హెచ్చరించారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం’ అని మంత్రి దామోదర తన ట్వీట్లో పేర్కొన్నారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
సాక్షి, వరంగల్/నర్సంపేట: ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం ఉండాలి.. అవి అమలు చేసేదిశగా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని వెల్లడించారు. 7 వేల మందికి నర్సింగ్ పోస్టింగ్‌లు ఇచ్చామని, త్వరలో ఇంకో 2,500 మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ‘సామాన్యులకు ఎక్కడి నుంచైనా 20 నుంచి 45 నిమిషాల్లో వైద్యచికిత్స అందేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా 108, 104, 102 ఆరోగ్యశ్రీ ట్రస్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ చార్జెస్ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచింది. దానికోసం రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చు చేశాం’అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని, రూ.46వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా, 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు. మంత్రుల నోట వైఎస్ అభివృద్ధి మాట దేశ చరిత్రలోనే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ కొనియాడారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ సేవలు మరచిపోలేమన్నారు. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
వైద్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని... వాటన్నింటికీ సమగ్రంగా వైద్యసేవలు అందించడానికి వీలుగా ఒకేచోట అన్నిరకాల వైద్యం చేసేందుకు ఈ ప్రాంతంలో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ సృశాంత్ లాంటి యువకులు ఈ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ ప్రజలకు తమవంతు సేవలు అందించాలని సూచించారు. ఈ దిశగా డాక్టర్ సృశాంత్, ఆయన బృందం మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడుతూ, “ఇప్పటికే కోకాపేటలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్న మేము.. ఇప్పుడు నగరవాసులకు కూడా సేవలందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగణంలో ఆస్పత్రిని ఏర్పాటుచేశాం. ఇక్కడ కేవలం ఒక్కరే కాకుండా.. అన్నిరకాల చర్మ, శరీర, జుట్టు సమస్యలకు సంబంధించిన వైద్యులు, మహిళా వైద్యులు, కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. అందువల్ల సాధారణ చర్మసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర సమస్యల వరకు.. అలాగే జుట్టు రాలడం, పూర్తిగా ఊడిపోవడండ లాంటి తీవ్రమైన ఇబ్బందుల వరకు అన్నింటికీ చికిత్సలు అందిస్తాం. అలాగే కాస్మెటిక్ చికిత్సలు కూడా ఇక్కడ అందించగలం. శరీరంలోని గుప్తభాగాలకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటికి సైతం సమర్థవంతంగా చికిత్సలు చేయగల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.గతంలో 50-60 ఏళ్లు దాటిన తర్వాతే జుట్టు రాలడం, ఊడిపోవడం, బట్టతల ఏర్పడటం లాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడవి 18-20 ఏళ్ల వయసులో కూడా వస్తున్నాయి. దీనివల్ల చాలామంది యువతీ యువకులు ఇబ్బంది పడుతూ కాలేజీలకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. ఇలాంటివారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చేసి, వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపడం, వారిని మళ్లీ కాలేజీకి పంపడం లాంటివి చేస్తున్నాం. ఇక్కడ మా ఆస్పత్రిలో పీడియాట్రిక్ డెర్మటాలజీ నుంచి.. అంటే పదేళ్ల వయసు వారికి వచ్చే సమస్యల నుంచి మొదలుపెట్టి జేరియాట్రిక్ సమస్యలు.. అంటే వయోవృద్ధులకు వచ్చే చర్మ సంబంధిత, ఇతర సమస్యల వరకు అన్నింటికీ చికిత్సలు అందించడానికి అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించి వ్యక్తిగతీకరించిన చికిత్సలు అందించడం ఇక్కడ మా ప్రత్యేకత.చర్మ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. డెంగ్యూ, చికున్ గన్యా లాంటివాటిలో కూడా చర్మసమస్యలు కొన్ని వస్తాయి. రోజూ తడిలో పనిచేసే గృహిణులకు కాళ్ల వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఇలాంటివాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చర్మవైద్యులకు చూపించుకుని దానికి తగి చికిత్స తీసుకోవాలి. మొటిమలకు కూడా ఏవి పడితే ఆ క్రీములు వాడటం కాకుండా.. సరైన చికిత్స చేయించుకోవాలి” అని తెలిపారు. -
గ్యారంటీలను అందిస్తాం.. పేదవారిని ఆదుకోవడమే మా లక్ష్యం: మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.కాగా, మంత్రి దామెదర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దయతోనే మాకు పదవులు వచ్చాయి. మా కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమంతో పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ప్రతీఏటా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం ద్వారా రూ.580 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోంది. అయినా పేదల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోంది.అవసరం ఉన్న చోట డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలోని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రికి మంజూరుకి అనుమతులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి పండుగను తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
సనత్‌నగర్ (హైదరాబాద్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వాదన లు వినిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను పంపించి బలమైన వాదనలు వినిపించేలా చేశారని గుర్తు చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ–మాదిగల భవిష్యత్తు’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మాదిగ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేధావుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ జి.మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావే శానికి హాజరైన దామోదర రాజనర్సింహ మాట్లాడు తూ, రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను చేసుకో వచ్చని తీర్పు రావడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. న్యాయనిపుణులతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసిన నివేదిక సీఎంకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక కమిటీ వేయాల్సిందిగా కోరతామని, ఆ కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకు రావాలన్నారు. అంతేకాకుండా త్వరలో పెద్దఎత్తున మాదిగల సమ్మేళనం పేరుతో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి సీఎంను ఆ సభకు ఆహ్వానించి సన్మా నించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు జాతి పెద్దలుగా అందరం కలసిక ట్టుగా ముందుకుసాగుదామన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ లకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి నేత ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు పుష్పలీల, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దామోదర రాజనర్సింహ రియాక్షన్
-
ఫుడ్ కల్తీ చేసే సంస్థల లైసెన్స్ రద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇదే సమయంలో దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించింది. దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ లాబ్స్ లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను బలోపేతం చేస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లుకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాం. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్‌ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నాం.ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లలను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఆహారం కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎంఐడీసీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు. గురువారం నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పాల్గొన్నారు. -
వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు, డీన్లు, ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో తెలంగాణకు అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు తేవడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతోపాటు డెంటల్ కాలేజీలలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య, డెంటల్ కళాశాలల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, వాటిల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎయిమ్స్‌లో 100, ఈఎస్ఐలో 125 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,320 పీజీ సీట్లున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ సీట్లు 179 ఉన్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోని 28 మెడికల్ కళాశాలల్లో 4,600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు. సమావేశంలో వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డాక్టర్ వాణి, వైద్య విద్య స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమల థామస్ పాల్గొన్నారు.నేడు 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలుజూన్ 20న నులిపురుగుల నివారణ దినం సందర్భంగా 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ రోజు వేయించుకోని వారికి 27న మాప్ అప్ రౌండ్లో వేస్తామని చెప్పారు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్‌్కఫోర్స్‌లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు ఓ టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్‌పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్‌ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్‌్కఫోర్స్‌లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు. ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు. 65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కార్పొరేషన్‌తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్‌లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు. ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు. డీహెచ్ పనితీరుపై అసంతృప్తి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు. యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. -
హైదరాబాద్ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్‌కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు. -
ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరన్న నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. సత్వరమే ‘టిమ్స్’పూర్తి చేయాలి... వరంగల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో చేపడుతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ కార్డులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునీక్ నంబర్‌తో అనుసంధానించాలని.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందిండానికి వీలవుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్... బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ చెప్పారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని... తద్వారా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులు సీఎంకు వివరించగా ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఫార్మా కంపెనీల సీఎస్ఆర్... మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని సీఎం కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు, ఆశ వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపై వాకబు చేసిన సీఎం.. అవి మరింత మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డీజీ కమలహాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్
సంగారెడ్డి, సాక్షి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, అలాగే.. తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దీంతో మంత్రి అనుచరులు స్పందించారు. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ నుంచి సందేశాలు వస్తే స్పందించవద్దని కార్యకర్తలను కోరుతున్నారు. -
TS: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర
జోగిపేట,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదీచదవండి..కీచక తండ్రి..తప్పించుకుని వెళితే మరో దారుణం -
తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందనున్న మహమ్మారి మరోసారి విస్తరిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణం సంభవించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు. కోవిడ్ మరణం నమోదు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ మరణాలను కో మార్బిడ్ అంటారని చెప్పారు. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్టంరలో కోవిడ్ టెస్టులను రోజుకి 4 వేలకు పెంచామని తెలిపారు. మెడికల్ డిపార్ట్మెంట్ను అలెర్ట్ చేశామని తెలిపారు. కోవిడ్ మరణం అనే అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన మంత్రి.. మహమ్మారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం సమీక్ష చేయనున్నారు. పూర్తిస్థాయి కరోనా వివరాలతో రావాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచినట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించిన్లు సమాచారం. చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ -
వైద్యారోగ్యశాఖపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనిచేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్‌లలో 16,500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వంతోపాటు 84 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి 6 వేలకు పైగా నమూనాలను సేకరించామని చెప్పారు. కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని కనీసం రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. కోవిడ్ 19 రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల సీఎస్ఆర్ విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు. చదవండి: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్ -
కోవిడ్‌పై అప్రమత్తంగా ఉందాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరంలేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ శివరామప్రసాద్, ఉస్మానియా, గాందీ, ఛాతీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావు, డాక్టర్ మహబూబ్ ఖాన్, టీస్ఎంఎస్ఐడీసీ సంచాలకులు కౌటిల్య, చీఫ్ ఇంజనీరు రాజేంద్ర కుమార్, స్పెషల్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్సకు అవసరమైన పరికరాలు, ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెట్టి, వెంటనే ఆయా వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ను వెంటనే పూర్తిచేయాలని, ఆస్పత్రుల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు అందజేయాలని సూచించారు. ఈ 9 కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవు: తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రులు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కి పంపాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ తొమ్మిది కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవని, బాధితులంతా హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 319 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ కేసుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై నిఘా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు రాష్ట్రంలో బుధవారం మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలోనే ఈ ఆరు కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది ఆస్పత్రుల్లో లేదా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.44 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు 4,111 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారంతా రికవరీ అయ్యారు. -
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్‌వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్‌వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్‌లు అవసరం లేదు కానీ... మాస్క్‌లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్ జేఎన్1 ఒమిక్రాన్‌కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ కిరణ్‌మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. హస్తానికి దామోదర రాజనర్సింహ గుడ్ బై!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక, కాంగ్రెస్‌లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. దీంతో, తుది వరకు టికెట్ ఆశించి భంగపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ. ఇక, టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. అయితే, నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మరోవైపు.. పటాన్చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. కాగా, కాంగ్రెస్‌లో కొనసాగడంపై నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ -
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో దామోదర?
-
టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా?
రాజకీయాల్లో అన్న దమ్ముల సవాళ్ళు చూశాం. తండ్రీ కొడుకుల సవాళ్ళు చూశాం. తాజాగా తెలంగాణలో తండ్రీ కూతుళ్ళ సవాళ్ళు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామని తన నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే నియోజకవర్గానికి ఆయన కుమార్తె కూడా దరఖాస్తు చేశారు. ఇప్పుడు టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా? పార్టీ నాయకత్వానికి పరీక్ష పెట్టిన ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. ✍️ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు సీటు. ఇక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మూడు సార్లు విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హవా నడిచినా..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దామోదరకు కాలం కలిసి రావడంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ రాజనర్సంహకు ఓటమి ఎదురైంది. అందుకే ఈ సారి ఎలాగైనా తన తండ్రిని గెలిపించాలన్న పట్టుదలతో దామోదర రాజనర్సింహ కూతురు త్రిష నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ✍️ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని గెలిపించాలని కాంగ్రెస్ కేడర్‌కు నూరి పోస్తున్నారు. అయితే ఇటీవల గాంధీభవన్‌లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నవారిలో తండ్రి రాజనర్సంహతో పాటుగా ఆయన కుమార్తె త్రిష కూడా దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తండ్రికి పోటీగా బిడ్డ కూడా పార్టీలో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గాంధీభవన్‌లో కలకలం రేపింది. ✍️గత కొంత కాలంగా దామోదర కుమార్తె త్రిష ఆందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతే కాదు నియోజకవర్గంలో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజల్లో ఉంటూ..స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలకు హాజరు కావడంలేదు. అదే సమయంలో ఆయన కుమార్తె త్రిష ఉత్సాహంగా ప్రజల్లో తిరగుతుండటం..ఆయనేమో దూరంగా ఉండటం..ఇప్పుడు ఇద్దరూ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ✍️పార్టీలో సీనియర్ నేత అయిన రాజనర్సింహను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సిడబ్లుసి సభ్యత్వం కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సహం నింపింది. అయతే ఆయన మాత్రం ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోగా..కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు దామోదర అధికార పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహిరాబాద్ ఎస్సి రిజర్వుడ్ స్థానం నుంచి దామోదర పోటీ చేస్తారని కూడా ఆందోల్‌లో ప్రచారం సాగింది. ✍️ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆందోల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా లేదా ఆయన కుమార్తె త్రిష పోటీ చేస్తారా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్ని పీడిస్తోంది. మరి ఆందోల్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరిదనే సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో చూడాలి.. -
ఆయనంతే అదో టైపు.. మౌనం వెనుక వ్యూహం ఏంటి?
ఆయనంటేనే అదో టైపు.. అందులో సీనియర్... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత.. మీడియా ముందే బాహాటంగానే కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని పార్టీలో నెలగడం కష్టమని ఆరోపించారు.. కానీ ఇప్పుడు ఆ నేత ఇంట్లో నుంచే ఒకే నియోజకవర్గానికి... రెండు దరఖాస్తులు చేసుకున్నారు.. దీంతో టికెట్ తండ్రికి వస్తుందా, కూతురును వరిస్తుందా అంటూ పార్టీ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకు ఒకింట్లో రెండు టికెట్ల పంచాయతీ ఏంటి? సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోల్ నుండి ఐదు సార్లు పోటీ చేయగా మూడు సార్లు విజయం సాధించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ, మార్కెట్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహను హైకమాండ్ నియమించింది. ప్రజలు ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన.. తెలంగాణ రాష్టం ఏర్పడినప్పటి నుంచి ఆయనకు రాజకీయాలు కలిసిరావడం లేదు. ఈ సారి ఎలాగైనా గెలవలన్నా పంతంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ దామోదర రాజనర్సింహ కూతురు త్రిష.. నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో భరోసానిస్తూ నూతన ఉత్సహన్ని కల్గిస్తుంది. అయితే ఇటీవల గాంధీభవన్‌లో అందోల్ సీటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కూతురు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అందోల్ కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. గత కొంతకాలం నుంచి త్రిష అందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజలకు దగ్గరవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేకపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత అయోమయానికి లోనవుతున్నారు. రాజనర్సింహకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ సీడబ్ల్యుసీ శాశ్వత పదవి కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపిన.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం, నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముక్కునవేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ టికెట్లు ప్రకటించక ముందు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో దామోదర రాజనర్సింహ అక్కడి నుండి పోటీ చేస్తారన్న వినికిడి కూడా జోరుగా వినిపించింది. ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా, కూతురు త్రిష బరిలో ఉంటారా అన్న సందిగ్ధం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రస్తుతం నెలకొంది. చదవండి: ‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది? -
సంగారెడ్డి కాంగ్రెస్ తొలి జాబితాలో ఈ ముగ్గురు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ము గ్గురు నేతలకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జాబితాలో అందోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ పేరు కూడా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఉండే అవశాలున్నాయి. అందోల్ టిక్కెట్ కోసం దామోదర రాజనర్సింహతోపాటు ఆయన కూతురు త్రిష మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డితో పాటు మరో నలుగురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జగ్గారెడ్డి పేరు తొలిజాబితాలో చోటు దక్కనుంది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్‌తో పాటు స్థానికంగా ఉండే ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టిక్కెట్ హామీతోనే చంద్రశేఖర్ పార్టీలో చేరడంతో తొలిజాబితాలోనే ఆయన పేరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసే ప్రక్రియను ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టింది. ఆయా నియోజకవర్గాల టికెట్ల కోసం గతనెల 25 వరకు అందిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది. ఆ రెండు చోట్ల పీటముడి.. పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల విషయంలో పీటముడి నెలకొంది. పటాన్చెరువు నియోజకవర్గం టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ ఆశిస్తున్నారు. తొలి జాబితాలోనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాటా శ్రీనివాస్‌గౌడ్ కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గాలి అనిల్ కూడా నర్సాపూర్ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ గాలి అనిల్‌కు నర్సాపూర్ టికెట్ ఖరారైతే పటాన్చెరు టికెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పటాన్చెరులో కాటా తోపాటు శశికళాయాదవ్‌రెడ్డి, ఎం.సప్పాన్దేవ్.. ఇలా మొ త్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి గాలి అనిల్‌తో పాటు, ఆవుల రాజిరెడ్డి, శివన్నగారి ఆంజనేయులుగౌడ్, రవీందర్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు. మలిజాబితాలో.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి మధ్య పంచాయితీ తేలితే ఇక్కడి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదక్‌లో నియోజకవర్గానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చౌదరి సుప్రభాత్రావు, మ్యాడం బాలకృష్ణలతో కలిసి ఏకంగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కొత్త నాయకుడు పార్టీలో చేరే అవకాశాలుండటంతో మెదక్ అభ్యర్థిత్వం తొలిజాబితాలో ఉండే అవకాశం లేదు. ఆ నాలుగు చోట్ల.. దుబ్బాక టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ కత్తి కార్తీకగౌడ్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారికే సాధారణ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలనే పార్టీ నిబంధన ఉన్నందున తనకే టికెట్ తనకే దక్కుతుందని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ద్వారా శ్రావణ్‌కుమార్‌రెడ్డి ప్రయ త్నాలు చేస్తున్నారు. సిద్దిపేట టిక్కెట్ కోసం ఏకంగా 15 మంది దరఖాస్తు చేసుకోగా, గజ్వేల్ టికెట్‌కూ పోటాపోటీ నెలకొంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోటీ చేసే అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ ఆచీతూచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తొలి జాబితాలో మూడు పేర్లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ నేతతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించగా.. కొందరు సిట్టింగ్‌లకు సీటు ఖరారు కాలేదు. దీంతో, సదరు నేతలు గుర్రుగా అధిష్టానంపై సీరయస్ అవుతుండగా.. మరికొందరు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. పొలిటికల్ గేమ్ ప్లాన్.. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసంతృప్త నేత టీ.రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, హన్మకొండ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహతో కలిసి రాజయ్య పాల్గొన్నారు. దీంతో, వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న రాజయ్య.. కాంగ్రెస్‌లో చేరేందుకే దామోదరతో భేటీ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్ కూడా ఇందుకు బలాన్ని చేరుకూరుస్తున్నాయి. కడియం వర్సెస్ రాజయ్య.. ఇక, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సీటు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. దీంతో, రాజయ్య.. కడియం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. సమయం దొరికిన ప్రతీ సందర్భంలో కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేఖా నాయక్ సవాల్.. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే తన టార్గెట్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇది కూడా చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. అయితే కాంగ్రెస్ కోటాలోనే.! -
సీడబ్ల్యూసీలోకి దామోదర
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన వర్కింగ్ కమిటీలో తెలంగాణ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చోటు దక్కించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన నూతన కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. మొత్తం 84 మందితో ఏర్పాటు చేసిన నూతన సీడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. రాష్ట్రం నుంచి సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు శాశ్వత ఆహ్వానితుడిగా, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా సీడబ్ల్యూసీలో అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యుడిగా, సీనియర్ నేతలు సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులను శాశ్వత ఆహ్వానితులుగా, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు. సీడబ్ల్యూసీ సభ్యులు వీరే..: మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ, అ«దీర్రంజన్ చౌదరి, ఏకే ఆంటోని, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, తారీఖ్ అన్వర్, లాల్ తన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్ చవాన్, అజ య్ మాకెన్, చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగం, ఎన్.రఘు వీరారెడ్డి, శశిథరూర్, తామ్రధ్వజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, జి తేంద్ర సింగ్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, సచిన్ పైలె ట్, దీపక్ బాబరియా, జగదీశ్ ఠాకూర్, జి.ఎ.మీర్, అవినాశ్ పాండే, దీపాదాస్ మున్షీ, మహేంద్రజిత్ సింగ్ మాల్వియా, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కమలేశ్ పటేల్, కేసీ వేణుగోపాల్. శాశ్వత ఆహ్వానితులు..: వీరప్ప మొయిలీ, హరీశ్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాశ్, రమేశ్ చెన్నితల, బీకే హరిప్రసాద్, ప్రతిభాసింగ్, మనీశ్ తివారీ, తారిఖ్ హమీద్ కర్రా, దీపేంద్ర సింగ్ హుడ్డా, గిరిశ్ రాయ చోదంకర్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాజు, చంద్రకాంత్ హందోరే, మీనాక్షి నటరాజన్, పూలోదేవి నేతం, దామోదర రాజనర్సింహ, సుదీప్ రాయ్ బర్మన్, డా.ఎ.చెల్లకుమార్, భక్త చరణ్ దాస్, అజోయ్ కుమార్, హరీశ్ చౌదరి, రాజీవ్ శుక్లా, మాణిక్కం ఠాగూర్, సుఖ్విందర్ రంధావా, మాణిక్‌రావ్ ఠాక్రే, రజినీ పటేల్, కన్హయ్య కుమార్, గురుదీప్ సప్పల్, సచిన్ రావ్, దేవేందర్ యాదవ్, మనీశ్ ఛాత్రత్ ప్రత్యేక ఆహ్వానితులు..: పళ్లంరాజు, పవన్ ఖేరా, గణేశ్ గొడియాల్, కొడిక్కునిల్ సురేశ్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనాథే, పరిణీతి షిండే, అల్కా లాంబ, చల్లా వంశీచంద్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు..: బీవీ శ్రీనివాస్, నీరజ్ కుందన్, నెట్టా డి.డిసౌజా, లాల్జీ దేశాయ్ -
కుటుంబ ఒత్తిడి!.. బీజేపీలోకి టీకాంగ్రెస్ సీనియర్ నేత?
ఆ నేత ఒకప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు. ఆవేశం పాళ్ళు కూడా ఎక్కువే. తెలంగాణ వచ్చాక ఆయనకు రాజకీయాలు కలిసిరావడంలేదట. అందుకే ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారా? రాజకీయాల్ని వదిలేయాలనుకుంటున్నారా? లేక పార్టీ మారదామనుకుంటున్నారా? ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు..? దామోదర రాజనరసింహ. ఉమ్మడి ఏపీకి ఆఖరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన తీరే వేరు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ సరైన దారిలో నడవడంలేదని ఆయన ఆరోపణ. జనం దగ్గరికి వెళ్ళడంలో ఉద్యమాలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఆయన ఎన్నో మార్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు ఒక్కోసారి వెళతారు..మరోసారి వెళ్ళరు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలవడం దామోదర రాజనర్సింహను కొంత కుంగ దిసిందని పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఒక వైపు బీఆర్ఎస్..ఇంకో వైపు బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నా పట్టించుకోవడం లేదని తనను కలిసిన వారితో వాదిస్తున్నారట. రాహుల్ గాంధీ జోడో యాత్రలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో చురుకుగా పాల్గొన్న దామోదర రాజనర్సింహ ఆ తరువాత పార్టీలో పరిణామాల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆయనపై మీడియా ముఖంగానే నిప్పులు చెరిగారు. దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని, కూతురు త్రిష కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చెరుదామని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దామోదర రాజనర్సింహ తమ్ముడు రామచందర్ నెల రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలోనే దామోదర సతీమణి పద్మిని కూడా ఉదయం బీజేపీలో చేరి సాయంత్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దామోదర రాజనర్సింహ బీజేపీ నేతలతో టచ్ ఉన్నారనే భావన రాష్ట్ర నేతలు, స్థానిక కార్యకర్తల్లో ఉందని సమాచారం. రాహుల్ గాంధీ ఎంపీ సీటుపై అనర్హత విషయంలో దామోదర రాజనర్సింహ స్పందించకపోవడం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం నుండి దామోదర రాజనర్సింహ ఎనిమిది సార్లు పోటీ చేయగా మూడు సార్లు గెలుపొందారు. దివగంత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు ఓడిపోయిన దామోదర అందోల్‌లో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో ఉన్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా దామోదర రాజనర్సింహ వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరపునే పోటీ చేస్తారా? లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కాషాయ తీర్థం తీసుకుంటారా అనే చర్చ ఆందోల్‌లో జరుగుతోంది. -
దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి పార్టీ పరిస్థితులపై మాట్లాడారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన జబ్బు సోకిందని, వెంటనే ప్రక్షాళన చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టి కి తీసుకెళ్ళడం కోసమే వచ్చాను. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. కానీ, పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారింది. కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు బతికిస్తాయనే ఆశతో ఇన్ని రోజులు క్యాడర్ ఎదురు చూస్తుంది. కానీ, కాంగ్రెస్‌లో లోపాలు ఉన్నాయి. అవి ఎక్కడ? అనే దానిపై కసరత్తు జరగాలి. ఎందుకనో అలా జరగడం లేదు. కొత్త కమిటీలను చూస్తే.. ఆ విషయం స్పష్టమవుతుంది. పీసీసీ డెలిగేట్స్ నుంచి ఇదే విధంగా తప్పులు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇచ్చారు. ఏ లెక్క ప్రకారం కొత్త వారికి పదవులు ఇచ్చారు? 84 మంది జనరల్ సెక్రటరీలు అవసరమా? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు లేరు.. అని ప్రశ్నించారాయన. కమిటీలలో అనర్హులకు చోటు కల్పించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో తెలియని వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో.. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పార్టీ కే ప్రమాదం. పార్టీలో కష్టపడ్డవారికి గుర్తింపు లేదు. కోవర్టులకే గుర్తింపు ఉంటోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు కోవర్ట్ ఇజం అనే ప్రమాదకరమైన జబ్బు సోకింది. ఎనిమిదేళ్లుగా.. కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం పట్టుకుంది. కొందరు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పాటపాడుతూ ప్రభుత్వానికి మద్ధతు పలుకుతున్నారు. బీఆర్ఎస్కు కొన్ని అనుకూల శక్తులు పని చేస్తున్నాయి. అదే సమయంలో.. కోవర్టులకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటోంది. రాబోయే పరిస్థితులు బాగా లేవు.. కాంగ్రెస్ అలెర్ట్ గా పనిచేయాలి. లోపం ఎక్కడ ఉంటుందో పార్టీలో చర్చ జరగడం లేదు.ఇప్పటికే తప్పిదాలు చాలా జరిగాయి. వ్యక్తి స్థాయిని బట్టి పార్టీ లో పదవులు ఇవ్వాలి. అసలు కాంగ్రెస్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఉందా.. లేదంటే ఎవరి సొంత ఎజెండా వారికి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరైతే.. ఇతరులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? అనిపిస్తోంది. సిద్ధిపేట జిల్లాలో కోవర్టులకు పోస్టులు ఇచ్చారు. ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేది తేలాలి. తెలంగాణ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలి. ఇక నైనా జాగ్రత్తగా పనిచేయాలి. కోవర్ట్ ల వివరాలు ఆధారాలతో సహా సమాచారం ఏఐసీసీ కి ఇచ్చాం. . కోవర్ట్ లను గుర్తించే బాధ్యత హైకమాండ్ కు ఉంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడం లేదు. నేను హైకమాండ్ ను గౌరవిస్తున్నా. కానీ ఆత్మగౌరవం తో బతుకుతా అంటూ వ్యాఖ్యానించారు దామోదర రాజనర్సింహ. -
ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు విరుద్ధమంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)లకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. భూమి హక్కు లు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ చట్టం లో లోపాలు ఉన్నాయని, వ్యవసాయ భూముల విషయంలో సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్సే్ఛంజ్ మినహా డీడ్ రద్దు, భాగాన్ని వదులుకునే (రీలిక్విష్‌మెంట్ డీడ్) అవకాశం కల్పించలేద ని పిటిషనర్ తరఫున న్యా యవాది ఎల్.వాణి వాదన లు వినిపించారు. ఓఆర్సీ ద్వారా హక్కులు పొందితే రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయడానికి వీల్లేదని తెలిపారు. కొత్త చట్టం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తి స్తుందని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. -
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు గిరిజనులు గుర్తుకు వస్తారు
-
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Huzurabad Bypoll: ‘రాజేందరన్న నువ్వు బాధపడకు.. గెలిచేది మనమే’ -
హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
-
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈ ఇద్దరి నాయకుల కీలక పాత్ర
Huzurabad Bypoll: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హుజురాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ మారింది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు అగ్రనేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు హుజురాబాద్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలను అందోల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించింది. దీంతో ఈ ఉపఎన్నికలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఆయన ముందుండి నడిపించారు. అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలను పకడ్బందీగా ఆచరణలో పెట్టగల సమర్థుడిగా పేరున్న హరీశ్‌రావు ఇప్పటికే ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక రంగంలో దిగారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక నిర్వహణ బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో దామోదరకు కీలక పదవి వరించిన విషయం విదితమే. -
హుజురాబాద్: కాంగ్రెస్ దూకుడు.. ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. అదే విధంగా... వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలు ►వీణవంక - ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ ►జమ్మికుంట - విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ►జమ్మికుంట మున్సిపాలిటి - సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య ►హుజురాబాద్ - తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ►హుజురాబాద్ మున్సిపాలిటీ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు ►ఇల్లందకుంట - నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ►కమలాపూర్ - కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య -
ఎడ్ల బండిపై నుంచి కిందపడ్డ దామోదర రాజనర్సింహ్మ
-
ఎడ్ల బండిపై నుంచి కిందపడ్డ దామోదర రాజనర్సింహ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది. పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్‌లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ను తొలగిస్తున్నాం... కొత్త వారిని నియమిస్తాం అని సీఎం కేసీఆర్ అహాంకార పూరితంగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం అధికార మదంతో మట్లాడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్ నేతలు దామోదర్ రాజనర్సింహ్మా, షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 19 లోపు సమస్య పరిష్కరించాలి.. ‘పోలీసులతో కలిసి కార్మికులపై సీఎం పెత్తనం చేస్తున్నారు. బేషజాలకు పోకుండా ప్రభుత్వం చర్చలు జరపాలి. గత పదిరోజుల పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలన్నీ బంద్ లో పాల్గొంటాయి. 19 తారీఖులోపు ఆర్టీసీ సమస్య పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం. గత నెల ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోయిందని సంబందిత డాక్టర్‌కు 5 ఏళ్ల శిక్ష పడేలా కేసు నమోదు చేశారు. కుక్కకు ఉన్న విలువ మనిషికి లేదా. కార్మికులెరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది’ అని రేవంత్ అన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రులు : షబ్బీర్ అలీ ‘సీఎం మీ ఉద్యోగాలు పోయినయి అంటరు. మంత్రులు ఉద్యోగాలలో చేరాలని అంటరు. ఈ డబుల్ గేమ్ ఏంది. మోటార్ సైకిల్ తోలరానోనికి బస్సు ఇస్తే.. వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తున్నరు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తా అంటున్నారు. సీఎం ఆదేశాల మేరకే మాట్లాడుతున్నారా. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల అందరం ఒకే సారి సమ్మె కు మద్దతు తెలపలేదు. బంద్‌లో అందరం పాల్గొంటాం’ అని షబ్బీర్ అన్నారు. ఇలాంటి పాలన ఎక్కడా లేదు : దామోదర రాజనర్సింహ ‘దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి దొర పాలన లేదు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలకు స్వేచ్ఛ నిచ్చింది. కేంద్రం ఆర్టీసీ సమస్యపై స్పందించాలి. ఢిల్లీ కి వెళ్లిన గవర్నర్, కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపుతురాని ఆశిస్తున్నాం. కేకే లేఖలో పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ ఖండిస్తోంది. వ్యతిరేకిస్తోంది’అన్నారు. -
‘16 లేదు.. కారు లేదు.. సారు లేడు’
సాక్షి, సంగారెడ్డి : పదహారు లేదు.. కారు లేదు.. సారు లేడు ఇవి జాతీయ ఎన్నికలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజ నరసింహ్మ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు మద్దతుగా సోమవారం రాజ నరసింహ్మ అధ్వర్యంలో పుల్కల్ మండలం శివ్వంపేట నుంచి అల్లాదుర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ నరసింహ్మ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి.. నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు. చౌకీదార్ నరేంద్ర మోదీ ఒక చోర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత సింగూర్ నీటిని దొంగిలించి కొడుకు, కూతురు జిల్లాలకు తీసుకుపోయిన నీటి దొంగ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేసే యువ నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయనస స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటుతో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని తెలిపారు. దగాచోర్ బి. బి. పాటిల్ : మదన్ మోహన్ రావు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బి. బి. పాటిల్ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎంపీ హోదాలో ఉండి భూ కబ్జాలు చేసి.. మూడు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ధగా చోర్ బి. బి. పాటల్ అని ఆరోపించారు -
‘దొరతనానికి చరమగీతం పాడాలి’
సంగారెడ్డి: ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఘనత జహీరాబాద్ ప్రజలదని, నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఓట్లు ఎటూ పోవని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుతో కలిసి మునిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమన్నారు. విద్యా, సమాచార హామీ హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. 14 మంది ఎంపీలతో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం పార్లమెంటులో ఏ ఒక్క రోజు మాట్లాడని వారు, ఇప్పుడు 16 ఎంపీ స్థానాలు గెలిపించమని అడగడానికి సిగ్గు అనిపించడం లేదా అని అన్నారు. 30 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్పై నామినేషన్లతో రైతులు తిరగబడ్డారని అన్నారు. దొరతనం, దురహంకారానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్‌లో అభద్రత ఉంది.. అందుకే కాంగ్రెస్ నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఎన్నిక ప్రజాస్వామ్యానికి ఊపిరి అని వ్యాఖ్యానించారు. పెన్షనర్లను భయపెట్టడం, రైతుబంధు పథకం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు సిద్ధాంతం ఉందని, కార్యకర్తలకు ధైర్యం ఉందని చెప్పారు. సింగూరు నుంచి 16 టీఎంసీల నీటిని కూతురు కోసం తీసుకెళ్లాడని ఆరోపించారు. కారు..సారు.. పదహారు కాదు..దోచుకో..దాచుకో..దాటిపో అన్నదే కేసీఆర్ సిధ్ధాంతమన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటారా.. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..ప్రాజెక్టులు కట్టిందని వ్యాఖ్యానించారు. ఏటా రూ.72 వేల సహాయం: మదన్ కాంగ్రెస్ బడుగుల పార్టీ అని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు కొనియాడారు. కనీస ఆదాయ పథకం ద్వారా ఏటా రూ.72 వేల సహాయం అందిస్తామన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్, రైతు రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. బీబీ పాటిల్ పనికి రాని అసమర్థ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయలేని అసమర్థ ఎంపీ బీబీపాటిల్ అని విమర్శించారు. ప్రజల సమస్యలు తీర్చడం మరిచి తన సొంత వ్యాపార పనులు చక్కదిద్దుకున్నాడని ఆరోపించారు. నిరుద్యోగులు లేని జహీరాబాద్‌ను చూడాలనేదే తన కల అన్నారు. అద్దంలా జహీరాబాద్‌ను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. -
‘ఓటరు ఆలోచన మారింది..పార్టీ థింకింగ్ కూడా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్‌లో సమీక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. -
అటెన్షన్ ప్లీజ్..
అందోల్ ,కొడంగల్ ,గద్వాల ,పాలేరు ,మధిర, జనగామ ,నాగార్జునసాగర్ ములుగు ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న అగ్రనేతలు గెలుపు కోసం ప్రయత్నాలు.. ఆఖరి వ్యూహాల్లో నాయకులు అందరి దృష్టి ఆ నియోజకవర్గాలపైనే... రాష్ట్రంలో నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కొందరు రాజకీయ దిగ్గజాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు పలువురు సొంత నియోజకవర్గాల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇలా ముఖ్యనేతలకు వారి రాజకీయ ప్రత్యర్థులకు మధ్య హోరాహోరీ పోటీతో కొన్ని సెగ్మెంట్లలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అందోల్, కొడంగల్, గద్వాల, పాలేరు, మధిర, జనగామ, నాగార్జునసాగర్, ములుగులో పోటీ రసవత్తరంగా మారింది. – సాక్షి, హైదరాబాద్ అందోల్ - దామోదర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరఫున మరోసారి అందోల్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా చంటి క్రాంతి కిరణ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాజ నర్సింహపై విజయం సాధించిన బాబూమోహన్ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బాబూమోహన్‌కు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్యపై ఆధారపడి ఇక్కడి తుది ఫలితాలు ఉండనున్నాయి. కొడంగల్ - రేవంత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మూడోసారి కొడంగల్ నుంచి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ సైతం ఇదే తరహాలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలతో ఇక్కడి ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. గద్వాల - అరుణ కాంగ్రెస్‌లో మరో కీలక నేత డి.కె.అరుణ మళ్లీ గద్వాల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున రెండోసారి బరిలో ఉన్నారు. పాత ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అరుణ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపుపై ధీమాతో ఉండగా, కృష్ణమోహన్‌రెడ్డి ఈసారి విజయం సాధిస్తానని అంటున్నారు. పాలేరు - తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి బరిలోకి దిగారు. మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రచార అంశాలుగా తుమ్మల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్‌కు బలమైన సెగ్మెంట్ కావడంతో ఉపేందర్‌రెడ్డి ఫలితంపై సానుకూల అంచనాతో ఉన్నారు. మధిర- భట్టి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క మధిర నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన లింగాల కమల్‌రాజ్ ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విక్రమార్కకు పోటీగా టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తుండటంతో ఈ సారి ఫలితంపై ఆసక్తి పెరుగుతోంది. జనగామ - పొన్నాల పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మరోసారి జనగామ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. పొన్నాలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ముత్తిరెడ్డి మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్ ఫలితం ఆసక్తికరంగా మారింది. నాగార్జునసాగర్ - జానారెడ్డి కాంగ్రెస్ కీలకనేత కుందూరు జానారెడ్డి మరోసారి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. సీనియర్ నేతగా జానారెడ్డికి ఉన్న పోల్ మేనేజ్మెంట్ అనుభవం పనికి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. టీఆర్ఎస్ సైతం ఈ సారి ఇక్కడ గెలుపు తమదే అంటోంది. ములుగు- చందూలాల్ మంత్రి అజ్మీరా చందూలాల్ ములుగు నుంచి మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసిన ధనసరి అనసూయ (సీతక్క) ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చందూలాల్, సీతక్క మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. -
రానున్నది రాజన్న రాజ్యమే
టేక్మాల్(మెదక్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన అందిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని పలు గ్రామాల్లో దామోదర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 58 ఏళ్లకే అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో జరిగిన రైతు ఏకకాల రుణమాఫీ మాదిరిగానే ప్రస్తుతం కూడా రూ.2 లక్షల వరకు అమలు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల పేరుతో కోట్లాది రూపాయలను వృథా చేసిన కేసీఆర్ ఇంటింటికీ నీరిచ్చే వరకు ఓట్ల అడగనని చెప్పి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. పాత ఇళ్ల బకాయిలను చెల్లిస్తూ ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలను ఇళ్లు నిర్మించుకోవడానికి అందిస్తామని దామోదర అన్నారు. మహిళలకు అభయహస్తం, ఆమ్ ఆద్మీ, పేద కుటుంబాలకు జనశ్రీ బీమా యోజన పథకాలతో పాటు ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లను అందజేస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ మాఫీ చేయడంతో పాటు రూ. లక్ష ఉచిత గ్రాంట్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీతో పాటు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. -
సబ్బండ వర్గాలకు 'పండగే'!
‘‘నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలి నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనంతా మోసపూరిత మాటలు, దగాకోరు వాగ్దానాలతో సాగింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్ నిలబెట్టుకోలేదు. హామీల పేరుతో ప్రజలను నిలువునా వంచించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరినీ పరామర్శించే తీరిక కేసీఆర్‌కు లేకపోయింది. ఇలాంటి పోకడ అప్పుడు నిజాంకు ఉంటే, అదే వైఖరిని కేసీఆర్ పుణికి పుచ్చుకున్నారు. మేం కేసీఆర్‌లా ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. ఏకకాలంలో రుణమాఫీ, లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చాం. సబ్బండ వర్గాలకు సమ్మతమయ్యేలా, వారి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించేలా మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం’’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ చెప్పారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రజల ఆకాంక్షలు తెలిశాయి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రజల ఆకాంక్షలేమిటి? ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో ప్రజల నుంచే ప్రత్యక్షంగా తెలుసుకున్నా. 600కు పైగా విజ్ఞప్తులు స్వీకరించాను. పది వేల మందితో మాట్లాడా. సబ్ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై అన్ని వర్గాల నుంచి జిల్లాలన్నీ తిరిగి వినతులు స్వీకరించారు. అందరి ఆకాంక్షలకు తగ్గ ప్రజా మేనిఫెస్టో తయారు చేశాం. రైతుల కోసం ఎంతైనా చేస్తాం.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం కావడంతో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబాన్నీ కేసీఆర్ పరామర్శించలేదు. మేం రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తాం. ఈ విషయంలో కేసీఆర్‌లా రైతులను మోసం చేయం. కౌలు రైతులకూ రైతుబంధును వర్తింపజేస్తాం. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వరి, మొక్కజొన్నకి క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.7 వేలు, మిర్చి, పసుపుకు రూ.10 వేలు ఇచ్చేలా మేనిఫెస్టోలో చేరుస్తున్నాం. ఏకకాల రుణమాఫీ అసాధ్యమేమీ కాదు. దీనిపై ఆర్థిక నిపుణులతోనూ చర్చించాం. వెల్నెస్ కేంద్రాలను పెంచి ఉద్యోగులు, జర్నలిస్టులకూ ఉచిత వైద్యం కల్పిస్తాం. సర్కార్ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం. రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,500 కోట్లు చెల్లించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. మేం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తాం. బడ్జెట్లో 20 శాతం విద్యారంగానికే కేటాయిస్తాం. కేసీఆర్‌లా మోసం చేయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియమాకాల్లో నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. ఓ పక్క నోటిఫికేషన్లు ఇచ్చి, మరోపక్క కోర్టుల్లో కేసులు వేయించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడింది. హోంగార్డు పోస్టులను భర్తీ చేసి వాటిని ప్రభుత్వోద్యోగాలుగా చూపారు. ఇలా ప్రజలు, నిరుద్యోగులను మోసం చేసే వైఖరి కాంగ్రెస్‌కు లేదు. ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయకుండా దిగిపోయిన ప్రభుత్వం చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. రాష్ట్రంలో 2.80 కోట్ల బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే 7 కిలోల సన్నబియ్యం, ఏటా 6 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పాం. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రేషన్ అందిస్తాం. 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలు బలంగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. వీటికి పునర్వై భవం తెచ్చి.. రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు, 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు, అభయహస్తం, జనశ్రీ యోజన, ఆమ్ఆద్మీ యోజన పునప్రారంభం వంటి కార్యక్రమాలు చేపడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. దీంతో ఏటా రూ.14 వేల కోట్ల మేర నిధులు మురిగిపోయాయి. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మాట తప్పింది. మేం చేసి చూపిస్తాం. ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి నిధులు వెచ్చిస్తాం. ఎస్సీల్లో లంబాడాలకు ఒకటి, కోయ, గోండులను కలిపి ఇంకొకటి, ఇతర తెగలకు కలిపి మరొక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. బీసీలకూ ఇదే మాదిరి చేస్తాం. వీరికి ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ అమలు చేస్తాం. నిమ్న వర్గాలను ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దగా చేశారు. వారి ఇళ్ల నిర్మాణాలకు చేయూతనిస్తాం. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం.. పాత బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండగగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. భూములు గుంజుకుంటే ఊరుకోం.. అవసరం లేనిచోట సైతం పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించి ప్రజలను నిర్వాసితులను చేస్తామంటే కాంగ్రెస్ ఊరుకోదు. నిజంగా అవసరమైతే.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి వారిని గౌరవంగా చూసుకోవాలి. భయపెట్టి, బాధపెట్టి, వాతలు పెట్టి భూములు గుంజుకుంటామంటే చూస్తూ ఊరుకోం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా లాక్కుంటే కోర్టులున్నాయి. అక్కడే తేల్చుకుంటాం. ఇన్నాళ్లూ కేసీఆర్ మూడెకరాలు, ఇళ్లనీ, ఉద్యోగాలనీ ప్రజలను మోసం చేశారు. మేం మాత్రం చెప్పింది చేసి చూపిస్తాం. మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. మీడియా, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రజలకు కొంత చేరువ చేశాం. మా అధినేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతోనూ చెప్పిస్తాం. మేనిఫెస్టో అంశాలతోనే టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు అని ప్రకటించగానే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. అందుకే హడావుడిగా పాక్షిక మేనిఫెస్టో అని కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని ప్రకటించారు. నిజంగా భృతి ఇవ్వాలని ఉంటే, నాలుగేళ్లుగా ఎందుకు ఇవ్వలేదని మేం ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం లేదు. డీఎస్సీ విషయంలో మేం క్లియర్. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. దీనిద్వారా 20వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తొలి సంతకం దీనిపైనే ఉంటుందన్న మాటకు కట్టుబడి ఉంటాం. ఏటా యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాని ఆధారంగానే నోటిఫికేçషన్లు ఇచ్చి, నిర్ణీత కాలపరిమితితో ఉద్యోగ నియమాకాలు చేపడతాం. ఖాళీ అయిన ప్రతి పోస్టునూ భర్తీ చేస్తాం. అనేక మంది యువతీ యువకులు పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. వారిని కేసీఆర్‌లా మేం మోసం చేయం. కోర్టుల్లో కేసులు వేయం. రూ.2 లక్షల కోట్లుదాటే బడ్జెట్లో నిరుద్యోగ భృతి పెద్ద భారం కాదు. సాగునీటి ప్రాజెక్టులకు మేం అడ్డుకాదు. వాటిపేరు చెప్పి అంచనాలు పెంచుతాం, నిర్వాసితులను రోడ్డునపడేస్తాం, ఇష్టారీతిన దోచుకుంటామంటేనే వ్యతిరేకిస్తాం. మా హయాంలోనే 33 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి 2014 నాటికే 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చాం. మేం చేపట్టిన ప్రాజెక్టుల కిందే ఈ నాలుగున్నరేళ్లలో మరో 8 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చినా, అది తన ఘనతగా టీఆర్ఎస్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే రెండేళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు–రంగారెడ్డి ఏమైంది? జూన్‌లోనే నీళ్లిస్తామన్న కాళేశ్వరం ఏమైంది?. వైద్యానికి సంబంధించి వైఎస్ ప్రభుత్వ హయాంలోనే కీలక సంస్కరణలు తెచ్చాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలను ఆదుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికో వంద పడకలు, మండలానికో 50 పడకల ఆస్పత్రంటూ చెప్పి మోసం చేసింది. కానీ మేం అధికారంలోకి రాగానే నియోజకవర్గానికో వంద పడకల ఆస్పత్రి, మండలానికో 20–30 పడకల ఆస్పత్రి నిర్మించి తీరుతాం. రాజధానిలో వెయ్యి పడకలతో మెడికల్ కాలేజీని నిర్మిస్తాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులనూ తీసుకొస్తాం.. -
ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్.. సామాజిక సమీకరణాలపై తర్జనభర్జన పడుతోంది. కూటమిపక్షాలు సూచిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటూనే సామాజిక వర్గాల వారీగా సీట్లను ఎవరికి కేటాయించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తం 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 స్థానాలు మాదిగలకు, 7 స్థానాలు మాలలకు కేటాయించాలని యోచిస్తున్న కాంగ్రెస్, జిల్లాల సమీకరణలు, ఆయా కులాల జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ అభ్యర్థిని బరిలో నిలపాలన్న దానిపై విస్తృతంగా చర్చిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధర్మపురి, బెల్లంపల్లి, మానకొండూరు, చెన్నూర్, చొప్పదండి, జూకల్, అంధోల్, జహీరాబాద్, చేవెళ్ల, వికారాబాద్, కంటోన్మెంట్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, తుంగతుర్తి, నకిరేకల్, ఆలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 5 నుంచి 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉండగా, 13 లేక 14 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఇందులో ఆంధోల్‌లో దామోదర రాజనర్సింహ, మధిరలో భట్టి విక్రమార్క, ఆలంపూర్లో సంపత్‌కుమార్, మానుకొండూర్లో ఆరేపల్లి మోహన్, జహీరాబాద్‌లో గీతారెడ్డి, వికారాబాద్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున అక్కడ కూటమి పక్షాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. మిగతా వాటిలో సత్తుపల్లిలో టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉంది. ఇవి పోనూ మిగతా స్థానాల్లో ఏ పార్టీకి ఏయే సీట్లు ఇవ్వాలి.. ఇక్కడ మాల, మాదిగ వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వర్ధన్నపేట, జూకల్‌లో మాదిగ, తుంగతుర్తి, అచ్చంపేట, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో నిలపాలని ఇప్పటికే కూటమి పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. స్టేషన్ ఘన్పూర్, చొప్పదండి, కంటోన్మెంట్ విషయంలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరి బలమెంత.. ఏ మేరకు విజయవకాశాలు ఉంటాయన్న దానిపైనా బుధవారం సైతం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చర్చించారు. -
600 వినతులు... 36 అంశాలు..130 పేజీలు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలలో ప్రజలకివ్వాల్సిన హామీలతో రూపుదిద్దుకుంటున్న కాం గ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తయారీలో కీలకఘట్టం ముగిసింది. కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని బృందం గత 20 రోజు లుగా చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి చేరింది. కమిటీకి వివిధ వర్గాలనుంచి వచ్చిన 600కు పైగా వినతిపత్రాలను పరిశీలించి 36 విభాగాలుగా విభజించి 130 పేజీలతో సబ్‌కమిటీలు తయారుచేసిన నివేదికను శనివారం కమిటీ చైర్మన్ రాజనర్సింహకు సభ్యులు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను రాష్ట్ర నేతలు రాజేశ్వర్‌రావు, పవన్, మధు, హరీశ్‌లు ఒక నివేదిక రూపంలో తయారు చేశారు. ఈ నివేదికను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌లతో కూడిన బృందం రాజనర్సింహకు అందజేసింది. ఈ ప్రతులను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. నివేదికపై మేనిఫె స్టో కమిటీ మళ్లీ సమావేశమై చర్చించనుంది. వా రం రోజుల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తుది రూపుకు వస్తుందని, రాహుల్ పర్యటన తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. -
కేసీఆర్ ఓ నియంత.. దగాకోరు!
టేక్మాల్(మెదక్): ‘కేసీఆర్ బట్టేబాజ్.. ఓ నియంత.. దగాకోరు.. మోసగాళ్లల్లో నంబర్‌వన్, అతను నోరు విప్పితే అన్నీ అబద్ధాలే’అని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం ఎల్లుపేటలో మెదక్ జిల్లా జేఏసీ కన్వీనర్ మామిడి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీని అమలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందించిందని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లకే రూ.2 వేలు ఆసరా పింఛన్ అందిస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన హమీ ఇచ్చారు. కేసీఆర్ తన కుమారుడిని సీఎం చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
‘పద్మినీ రెడ్డి బీజేపీ సానుభూతిపరురాలు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి వ్యవహారంలో అభాసుపాలైన బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం తమ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపబోదని చెప్పుకొచ్చింది. పద్మినీ రెడ్డి తమ పార్టీ సానుభూతిపరురాలని బీజేపీ శాసనసభ పక్ష మాజీ నేత జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా పార్టీలో చేరాలనుకుని వచ్చిన ఆమెను స్వాగతించాం. ఏమి ఇబ్బంది అయిందో తెలియదు. తర్వాత ఆమె మనసు మార్చుకున్నార’ని పేర్కొన్నారు. (చదవండి: మధ్యాహ్నం బీజేపీకి జై.. రాత్రి సొంతగూటికి..) ప్రత్యేక తెలంగాణ వద్దన్న మజ్లిస్ పార్టీని భుజాన వేసుకున్న టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీఠ వేసి పాలన చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు కచ్చితంగా తెలంగాణ ప్రజలు తమ చైతన్యాన్ని రుచి చూపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు తగిన శాస్తి చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, మహిళా మంత్రిలేని కేబినెట్ చూసి ప్రజలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు, గిరిజన రిజర్వేషన్ల వ్యవహారంలో కేసీఆర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ టూ కాంగ్రెస్ వయా బీజేపీ
-
దామోదర సమేత పద్మిని..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి పార్టీ మార్పు అంశం లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యకర పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్న పద్మిని.. రాత్రికల్లా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. నిర్ణయం మార్చు కున్నారు. తన భర్త దామోదర రాజనర్సింహ, కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకొని తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అటు, పద్మిని పార్టీ మార్పుతో కలవరం చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. కథ సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా బీజేపీలోకి! రాజకీయంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అనూహ్యంగా పద్మినీరెడ్డి గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికపై మీడియా, బీజేపీలోని కీలక నేతలు, జిల్లా నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ వార్తలు మొదట బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రముఖ ఆ«ధ్యాత్మికవేత్త, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పద్మినీ రెడ్డి.. బీజేపీలో చేర్చే దిశగా పావులు కదిపినట్టు సమాచారం. పద్మిని చేరిక సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆమె చేసిన సేవలను కొనియాడారు. సామాజిక సేవలో ముందుండే పద్మినీ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని, సేవా రంగంలో ఆమెకు మంచి పేరుందని ప్రశంసించారు. ఆమె రాకతో పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆమె సేవలను బీజేపీ తప్పకుండా వినియోగించుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. కొండగట్టులో మొక్కులు తీర్చుకొని, బీజేపీ గెలుపు కోసం ప్రార్థించి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి పద్మినీ రెడ్డి తమ పార్టీలో చేరారని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో పద్మిని చేసిన కృషి మరువలేమన్నారు. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతందన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాల, ప్రజోపయోగ కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరానని పద్మినీ రెడ్డి వెల్లడించారు. గతంలో తాను కాంగ్రెస్ టికెట్ అడిగిన మాట వాస్తవమేనని.. అయితే ఈసారి మాత్రం టికెట్ ఆశించట్లేదన్నారు. సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘అవకాశం ఇస్తే పోటీ చేస్తాన’న్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన తన భర్త (రాజనర్సింహ)పై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయమై మాట్లాడబోనన్నారు. కాంగ్రెస్‌లో కలకలం.. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురిచేసింది. అటు పార్టీ వర్గాలు కూడా విస్మయానికి గురయ్యాయి. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, మేనిఫెస్టో తయారీలో దామోదర బిజీగా ఉన్న సమయంలో ఈ పరిణామం చోటచేసుకోవడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగాలని పద్మిని భావించారని.. అది కుదిరే అవకాశాలు లేకపోవడంతోనే (కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవ్వాలన్న అధిష్టానం నిర్ణయంతో) ఆమె బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామం వ్యక్తిగతంగా దామోదరకు, పార్టీకి ఇబ్బంది పెట్టే అంశమేనని గాంధీభవన్‌లో చర్చ జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆందోల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న దామోదరతో పార్టీ సీనియర్లు మాట్లాడారు. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలను ఆయన వద్దకు పంపి పార్టీకి నష్టం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై వివరణ ఇచ్చిన దామోదర.. ఆమెది తొలి నుంచీ స్వతంత్రంగా వ్యహరించే మనస్తత్వమని పేర్కొన్నారు. అయినా పార్టీకి నష్టం జరుగకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యకర్తల ఒత్తిడితోనే ఈ అంశమై వెంటనే రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో ఉన్న పద్మినితో ఫోన్లో మట్లాడారు. కీలక సమయంలో పార్టీ మార్పుతో వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. ఇదే సమయంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వాహనాల్లో హైదారాబాద్‌లోని పద్మిని నివాసానికి చేరుకొని ఆమె వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా కార్యకర్తలు కన్నీరుపెట్టుకున్నారు. కీలక సమయంలో పార్టీ మార్పు సరైన నిర్ణయం కాదని.. కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీయొద్దని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ సహా కొందరు మహిళా నేతలు ఆమెకు విన్నవించారు. పద్మిని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే.. ఆత్మహత్యలకు వెనుకాడబోమని కొందరు యువకులు హెచ్చరించినట్లుగా తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన పద్మిని ఫోన్లో దామోదరతో మాట్లాడారు. ఆయన సూచన మేరకు సంగారెడ్డి చేరుకొని తన పార్టీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పద్మినీ తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరడంలో ఆమె కూతురు త్రిష పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నా: పద్మినీరెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీలో చేరాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని వెల్లడించారు. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆమె గురువారం రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘కార్యకర్తల మనోవేదనను దృష్టిలో పెట్టుకుని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు. అదంతా (బీజేపీలో చేరడం) అనుకోకుండా జరిగింది. కార్యకర్తల బాధను చూడలేకపోతున్నా’ అని పద్మిని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పద్మిని వెంట టీపీసీసీ నాయకురాలు ఇందిర శోభన్, కాటా సుధారాణి ఉన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్
-
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ వర్గల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువాతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరార’ని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ బీజేపీలోకి పద్మినీ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేం కాదని, ఆ స్వేచ్చ వారికి ఉందని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఉంటుందని వెల్లడించారు. దామోదరకు సంకటం కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఏంటని చర్చించుకుంటున్నారు. తన సతీమణి ప్రత్యర్థి పార్టీలో చేరడంతో మున్ముందు దామోదరకు ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ఆయన ఏవిధంగా కాచుకుంటారో చూడాలి. అయితే బీజేపీలో చేరేందుకు పద్మినీ రెడ్డి తన భర్తను అనుమతి తీసుకున్నారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైయ్యాం
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల సంఘం కాంగ్రెస్ పార్టీకి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహంను కలిసి వారు వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని, రాష్ట్రం ఏర్పడిన తరువాత తమకు పూర్తిగా స్థాయి న్యాయం జరగలేదని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎంతో వివక్ష గురయ్యామని, హైకోర్టు నియామకాల్లో కూడా తాము ఎంతో నష్టపోయామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగుపడాయని ఆశించామని, ఆ మేరకు న్యాయం జరగలేదని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, జూనియర్ లాయర్లకు ఉపకార వేతనంగా ఐదేళ్లపాటు నెలకు రూ.10 వేలు అందించాలని కోరారు. న్యాయవాదుల కుటుంబానికి కూడా వర్తించే విధంగా ఐదు లక్షల ఇన్సురెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు న్యాయవాదుల సంఘం వినతి పత్రాన్ని సమర్పించారు. దానితోపాటు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిసి మ్యానిఫెస్టోలో తమ డిమాండ్లను పొందుపర్చాలని కోరారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీ దామోదర్ రెడ్డి, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే అనంత్ రెడ్డితోపాటు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి, బీ శంకర్, ఎంపీ భార్గవ్, పీ విష్ణువర్ధన్‌రెడ్డి, టీ హనుమంత్ రెడ్డి, బీ కొండారెడ్డి, ఆర్ జితేందర్ రెడ్డి.. కోదండరామ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
మరో హైదరాబాద్‌గా వరంగల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దీటుగా ఉత్తర తెలంగాణలోని ప్రధాన నగరమైన వరంగల్‌ను తీర్చిదిద్దాలని, వరంగల్ అభివృద్ధి నమూనాను పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నా యి. మౌలిక వసతుల కల్పనతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందేలా వరంగల్‌కి ప్రాధాన్యమిచ్చేలా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టు సమాచారం. వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం నగరాలను కూడా ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేయాలనికూడా కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ 3 నగరాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలను ఏర్పాటు చేయడం, ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేలా ప్రాధాన్యతనివ్వడం లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని కౌలురైతులకు 2011లో ఇచ్చిన విధంగా మళ్లీ గుర్తింపు కార్డులిచ్చే ప్రతిపాదనపైనా మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తే చేస్తోంది. పర్యాటకరంగం అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ముగిసిన గడువు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వినతులు వెల్లువలా వచ్చాయి. గత 10–12 రోజులుగా ఈ కమిటీకి వివిధ రంగాల్లోని సమస్యల పరిష్కారం కోరుతూ, తమ తమ సమస్యలను మేనిఫెస్టోలో ప్రస్తావించాలంటూ 2,500 వరకు వినతులు వచ్చాయని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క సోమవారం రోజే 200 వరకు విజ్ఞాపనలు వచ్చినట్టు సమాచారం. మేనిఫెస్టో కమిటీకి దరఖాస్తులు సమర్పించే గడువు సోమవారంతో ముగిసిందని దామోదర రాజ నర్సింహ వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులపై కమిటీ సమీక్ష, అధ్యయనం జరుపుతోందని ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. నేటి నుంచి మేనిఫెస్టో కమిటీ నియమించిన సబ్కమిటీల వారీగా భేటీలుంటాయని వెల్లడించారు. మంగళవారం కిసాన్‌సెల్ సబ్‌కమిటీ భేటీ అయి వ్యవసాయ రంగానికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అం శాలపై చర్చించనుంది. ఈ నెల 10న మరో సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను అం దించనుంది. కాగా, చివరి దరఖాస్తును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజనర్సింహకు అందజేశారు. వారం రోజుల్లోగా కాంగ్రెస్ మేనిఫెస్టోకు తుదిరూపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మేనిఫెస్టో కమిటీకి పలు విజ్ఞప్తులతో కూడిన దరఖాస్తును అందజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు వడ్డీలేని రుణాలి ప్పించాలని, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని కోరినట్టు తెలిపారు. -
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం
పటాన్చెరు: వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్‌రోడ్డు శివారులోని ముత్తంగి గ్రామ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వడ్డెర లక్ష్య సాధన ఆత్మ గౌరవ సభ కు దామోదరతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వడ్డెరలకు న్యాయం చేస్తుందని దామోదర హామీ ఇచ్చారు. 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. 1976కు ముందు వడ్డెరలకు డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) రిజర్వేషన్ అమల్లో ఉండేదని, ఆ విధానంతో పాటు ఎస్టీ జాబితాలో ఆ కులాన్ని చేర్చే అంశంపై కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన కులంగా వడ్డెరలు ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎర్రటి ఎండలో బండలను, కొండలను పిండి చేసే వారు తమ సంపాదనలో సగం వరకు బెల్టు షాపులకే వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండలు కొట్టే వారి భవిష్యత్ తరతరాలు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. -
‘వైఎస్సార్ శిష్యుడినని గర్వంగా చెప్పుకుంటా’
జోగిపేట (అందోల్)/ సంగారెడ్డి క్రైమ్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ , 108 అంబులెన్స్ పథకాలు చరిత్రలో మిగిలిపోతాయని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం డాకూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో దివంగత నేత వైఎస్సార్ గురించి ప్రస్తావించారు. తాను వైఎస్సార్ శిష్యుడినని సగౌరవంగా చెప్పుకుంటానని అన్నారు. రాజకీయంగా ఓనమాలు నేర్పిన ఆయన నుంచి కొన్ని సిద్ధాంతాలు కూడా నేర్చుకున్నానని చెప్పారు. మాట ఇస్తే దానిపై నిలబడాలని, ప్రజలను మోసం చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని, వాగ్దానం చేస్తే నిలబెట్టుకోవాలని సూచిస్తుండే వారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను అదే మార్గంలో నడుస్తున్నట్లు చెప్పారు. హామీలంటే వైఎస్సార్ ఇచ్చిన హామీల లాగే ఉండాలన్నారు. పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తానని, ఉచిత కరెంటు ఇస్తానని, బకాయిల మాఫీకి సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం పెడతానని చెప్పి చేసిన వాగ్దానాలు నెరవేర్చారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం.. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని రాజనర్సింహ అన్నారు. సమాన పనికి సమాన వేతనం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, మెగా డీఎస్సీ, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా మేనిఫెస్టో ఉంటుందన్నారు. -
సీపీఎస్ రద్దు..రూ.4వేల కోట్లతో రైతు కార్పస్‌ఫండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షే మమే ధ్యేయంగా ఎన్నికల వరాలను ప్రకటిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరో 2 కీలక ప్రకటనలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్ల డించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రూ.4వేల కోట్లతో రైతు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గాంధీభవన్‌లో రాజనర్సింహ అధ్యక్షతన గురువారం జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్ ఎం.కె.గౌడ్, సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, గంగారాం, కూన శ్రీశైలం గౌడ్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. రాజనర్సింహ విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ వర్గాల్లో చాలా డిమాండ్ ఉందని, ఈ సమస్యపై మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించి మధ్యంతర భృతిని వారికి అనుకూలంగా ప్రకటిస్తామని, పీఆర్సీ విషయంలో న్యాయం చేస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి భాగస్వాములతో మాట్లాడి, నివేదికలు తీసుకున్న తర్వాతే ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. వారం పదిరోజుల్లో మేనిఫెస్టో సిద్ధం చేసి అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్నారు. వందలాది వినతులు వస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ గత మూడు రోజులుగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తోందని, వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయని రాజనర్సింహ చెప్పారు. ఏపీ కార్మిక సంక్షేమ మండలి తరహాలో అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలని, ఈబీసీ కార్పొరేషన్, వికలాంగులకు పింఛన్లు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, ఇళ్లు, రిజర్వేషన్లు ఇవ్వాలని, విదేశీవిద్యకు నిధుల కేటాయింపు, సాక్షరతా భారత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జూనియర్, డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గురుకుల పాఠశాలల్లో వార్డెన్ వ్యవస్థ ఏర్పాటు, కమలనాథన్ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన 600 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 350 మందికి పైగా నాన్‌గెజిటెడ్ అధికారులు మళ్లీ తెలంగాణకు రాక లాంటి అంశాలపై గురువారం మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష మేనిఫెస్టో కమిటీ భేటీలో భాగంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష జరిగింది. బీసీ, ఈబీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, పారిశ్రామిక విధానం, మైనార్టీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీలతో పలు ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించిన అనంతరం మరోమారు ఆ ప్రతిపాదనలపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 700 వీఆర్వో పోస్టులకు 11లక్షల మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 4.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ మేనిఫెస్టో తయారవుతోందన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసి వారికి ఉపాధి కల్పించేందుకు గాను మండల స్థాయిలో నైపుణ్య వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ రంగ పరిశ్రమలు, ఎంఎన్‌సీలు ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తే ఆయా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా డీఎస్సీ లేక, ఉద్యోగ భర్తీలు లేక యువత అల్లాడిపోతోందని, యువత త్యాగాల పునాదుల మీదే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ మరచిపోయిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. -
కేసీఆర్‌ను జైలుకు పంపుతాం..
సాక్షి, హైదరాబాద్ : ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు, ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మొన్న నన్నూ, సంపత్‌ను.. నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టి వేదిస్తున్నార’ని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో దామోదర రాజనరసింహతో కలిసి గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నియంతృత్వానికి కాలం చెల్లిందనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌పై ఉన్న కేసులను తిరగదోడి జైలుకు పంపుతామన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. ఉద్యోగుల కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేస్తామని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ తెలిపారు. ఉద్యోగులకు అనుకూలంగా ఐఆర్, పీఆర్సీని అమలు చేస్తామని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు నష్టపోకుండా 4వేల కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ ఇవ్వాలనే విజ్ఞప్తులు వచ్చాయనీ, అధికారంలోకి రాగానే అనుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రాకు వెళ్లిన తెలంగాణ ఉద్యోగుల గోడును టీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వెల్లువలా వినతులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వివిధ సంఘాలు, వర్గాల నుంచి వినతులు, అర్జీలు వెల్లువలా వస్తున్నాయి. తమకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చి న్యాయం చేయాలని ఆయా సంఘాల నేతలు విన్నవిస్తున్నారు. బుధవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, కన్వీనర్ మహేశ్‌కుమార్‌గౌడ్, సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, సుధాకర్‌యాదవ్, ఇందిరా శోభన్‌లు గాంధీభవన్‌లో 6 గంటల పాటు వివిధ సంఘాల నేతల నుంచి వినతులు స్వీకరించారు. ఎంపీటీసీ అధికారాల్లో కోత, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీటీసీలు వినతిపత్రం అందజేశారు. రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, నేతలు మాసాని శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి నేతృత్వంలో రెడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వారికి ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరారు. పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, 30 ఏళ్లుగా సర్వీసు చేసి కానిస్టేబుళ్లుగానే రిటైర్ అవుతామని నేతలకు పోలీసు కానిస్టేబుళ్ల అసోసియేషన్ మొరపెట్టుకుంది. ఆటో డ్రైవర్స్, జర్నిలిస్టుల అసోసియేషన్లు, నిరుద్యోగ జేఏసీ, టీచర్స్ జేఏసీ, ఫార్మాసిస్ట్ ఉద్యోగులు కూడా వినతులు సమర్పించారు. టీఆర్ఎస్ మోసం చేసింది.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని రాజనర్సింహా అన్నా రు. వైఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని, తాము అధికారంలోకి రాగానే వెంటనే స్థలాలు కేటా యిస్తామన్నారు. ఇప్పటికే 16 వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టులు, మరో లక్ష మంది అన్ అక్రెడిటెడ్ జర్నలిస్టుల సంక్షేమంపై అనేక వినతులు వచ్చాయన్నా రు. జర్నలిస్టుల సంక్షేమంపై మరోసారి పూర్తి స్థాయి లో చర్చించి మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. మెయిల్ ద్వారా వెయ్యికి పైగా అర్జీలు వచ్చాయని, టోల్‌ఫ్రీ నంబర్‌కు వందల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారని, వాటన్నింటినీ క్రోడీకరించి 2 వారాల్లో ప్రజా రంజక మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. త్వరలో సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించేం దుకు జిల్లాలో పర్యటిస్తామని చెప్పారు. -
యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే ఏటా యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, పకడ్బందీగా ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి, దాని ఆధారంగానే నోటిఫికేçషన్లు ఇస్తామని, నిర్ణీత కాలపరిమితితో ఉద్యోగ నియమాకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో రాజనర్సింహతో పాటు మేనిఫెస్టో కమిటీ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, ఇందిరా శోభన్‌లు వివిధ విద్యార్థి, కుల, ఉద్యోగ, సంఘాల నేతల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు వందకు పైగా సంఘాలు తమ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ కమిటీకి వినతి పత్రాలు ఇచ్చాయి. నిరుద్యోగ సంఘాలు, టీఆర్టీకి అర్హత సాధించిన అభ్యర్థులు వందల సంఖ్య లో దామోదరతో భేటీ అయ్యారు. తమను ప్రభు త్వం ఘోరంగా మోసం చేసిందని, డీఎస్సీ ద్వారా ఒక్క టీచర్‌పోస్టును కూడా భర్తీ చేయకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పినట్లు వంద రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ ఇప్పటికే ప్రకటించినట్లు కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియమాకాల విషయంలో దారుణంగా నిరుద్యోగలను మోసం చేసిందని, ఓ పక్క నోటిఫికేషన్లు ఇచ్చి, మరోపక్క కోర్టుల్లో కేసులు వేయించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందని దుయ్యబట్టారు. ప్రజలు, నిరుద్యోగులను మోసం చేసే వైఖరి కాంగ్రెస్‌కు లేదని, ఆరునూరైనా మెగా డీఎస్సీనే తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. తొలి ఏడాదిలోనే మరో లక్ష ఉద్యోగాల భర్తీ కోసం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. పలు సంఘాల వినతులు రేషన్ డీలర్లు తమ కమీషన్ పెంచడంతో పాటు గౌరవవేతనాలు ఇవ్వాలని, వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని హెచ్ఎండీఏ హౌజింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించాలని ప్రైవేటు టీచర్లు, ఔట్‌సోర్సింగ్‌లో çపనికి తగిన వేతనం ఇవ్వాలని సాక్షర భారత్, సెర్ప్ ఉద్యోగులు, ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించి గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మాదిగ విద్యావంతుల వేదిక, ఓసీ జనజాగృతి సంస్థలు తదితరులు వినతిపత్రాలు అందజేశారు. కస్తూర్బా ఉద్యోగులు, జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, స్పైనల్‌కార్డ్ ఇంజురీస్ అసోసియేషన్, కిడ్నీ రోగుల సంక్షేమ సంఘం, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల జేఏసీ, బంజారా సమితి, ఫార్మాసిటీ సంఘాలు, హోంగార్డులు, హౌజింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, దివ్యాంగులు, బోడ బుడగ జంగాల నేతలు కలసి తమ సమస్యలను పరిష్కరించేలా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పక్షాన భరోసా కల్పించాలని కోరాయి. ప్రైవేటు వర్సిటీ బిల్లు రద్దు? ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేసే ఆలోచన చేస్తున్నామని, దీనిపై మేనిఫెస్టో కమిటీ విస్తృతంగా చర్చిస్తోందని దామోదర రాజనర్సింహ చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మేనిఫెస్టో కమిటీకి 200కుపైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఒక్కొక్కరి సమస్యలు వింటుంటే చాలా బాధగా ఉందని, టీఆర్ఎస్ను ప్రజలు నెత్తికెక్కించుకుని ఓట్లేస్తే ఇంత అన్యాయం చేసిందా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వీరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ కల్పన ప్రయత్నాలు చేస్తామని, ఇంకా అనేక సంస్థలు, వ్యవస్థలను అధ్యయనం చేయాల్సి ఉందని, ఆయా ప్రాంతాల సమస్యలను బట్టి ప్రత్యేక దృష్టితో పరిశీలించి మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మేనిఫెస్టో కమిటీ నాలుగైదు జిల్లాల్లో పర్యటిస్తుందని చెప్పారు. 2017 భూసేకరణ బిల్లును పునఃపరిశీలిస్తామని, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలన్న విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అహం పెరిగి, కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, గత చరిత్ర చూసుకుని కేటీఆర్ మాట్లాడాలని హితవు పలికారు. -
‘కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్‌కి అహం పెరిగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్ దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని విమర్శించారు. మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నాయన్నారు. వారి సమస్యలు వింటుంటే బాధ కలుగుతుందన్నారు. వారికి ఏ రకంగా న్యాయం చేయాలనే అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఎక్కువగా విద్య, వైద్యంపై విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ఓ క్యాలెండర్ ఉండేలా చూస్తామన్నారు. అక్టోబర్‌లో నిర్వహించిన డీఎస్సీకి అతీగతీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించారు. వడ్డెర కులాన్ని ఎస్టీలలో చేర్చాలని తమకు విజ్ఞప్తులు అందాయన్నారు. అన్ని వర్గాలతో చర్చించి అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామని రాజనర్సింహా స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతామని, ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. -
పాఠశాల విద్యార్థులకు ఫీజుల పథకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని, కనీసం 25 శాతం ఫీజు చెల్లించినా పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయంపై చర్చించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీలో ఈ మేరకు చర్చ జరిగినట్లు సమాచారం. కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలన్న దానిపై చర్చించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని అసాధ్యమైన హామీలు ఇవ్వకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని పలువురు నేతలు సూచించారు. కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత చదువుకునే పేద విద్యార్థుల సంఖ్య పెరిగిందని, సాంకేతిక విద్యా రంగంలో మంచి మార్పు వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా వర్తింపజేస్తే డ్రాపౌట్లు లేకుండా నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే, లక్షలాది మందికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అందుబాటులో ఫోన్ నంబర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కోసం అన్ని వర్గాల ప్రజలు, యూనియన్ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలోని ఎవరైనా 8523852852కు ఫోన్ చేయవచ్చని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. manifestotpcc@gmail.com, tcongressmanifesto అనే ఫేస్బుక్ ఐడీకి కూడా సలహాలు పంపవచ్చన్నారు. వివిధ వర్గాల ప్రజలు నేరుగా గాంధీభవన్‌కు వచ్చి కూడా విజ్ఞాపనలు ఇవ్వవచ్చని, దీనికోసం సోమవారం నుంచి ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటల మధ్య నేతలు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా మేనిఫెస్టో... పార్టీ మేనిఫెస్టోను.. ‘తెలంగాణ ప్రజా మేనిఫెస్టో’పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా, ఆయా పథకాలతో వారి జీవితాల్లో మార్పులు వచ్చేలా మేనిఫెస్టోను అందించాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం వివిధ రంగాల సమస్యలపై అధ్యయనం చేసేందుకు 8 మంది నేతృత్వంలో 8 సబ్‌కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా కమిటీలు వివిధ రంగాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు, అందుకు అవసరమైన పథకాలపై అధ్యయనం చేసి కమిటీకి నివేదిక ఇవ్వనున్నాయి. ఇందుకోసం మేనిఫెస్టో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయికి వెళ్లాలని, గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడాలని, నిపుణులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. మరో 10 రోజుల పాటు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో కమిటీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద 15 రోజుల్లోగా కసరత్తు పూర్తి చేసి పక్కా మేనిఫెస్టోను తయారు చేయాలని కమిటీ తొలి సమావేశం నిర్ణయించింది. కాగా, తొలి సమావేశానికి కమిటీ కో–చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాలేదు. దీనిపై టీపీసీసీ వర్గాలు వివరణ ఇస్తూ.. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని, ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉండటంతో హాజరు కాలేదని చెప్పాయి. -
తొలి నిర్ణయం మెగా డీఎస్సీనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నిర్ణయం మెగా డీఎస్సీనే ఉంటుందని, 20 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని టీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కమిటీ తొలి సమావేశం అనంతరం సభ్యులు ఆబిద్ రసూల్ ఖాన్, మల్రెడ్డి రంగారెడ్డి, విజయ్, ఇందిరాశోభన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల కోసం ప్రజల మేని ఫెస్టో తయారు చేస్తామని, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వివిధ ప్రభు త్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.2 లక్షలు, ఖాళీ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు యూనిట్‌కు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్, బీపీఎల్ కుటుంబాల్లో మనిషికి 7 కేజీల సన్నబియ్యం, 9 రకాల నిత్యావసరాల అందజేత లాంటి హామీలన్నింటినీ మేనిఫెస్టో కమిటీ ఆమోదించిందని చెప్పారు. అవే కాకుండా మరో 50–60 అంశాలపై అధ్యయనం చేస్తున్నామని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కౌలు రైతులను ఆదుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రైతు బంధు తరహాలోనే.. అంతకన్నా మెరుగైన పథకాన్ని రైతుల కోసం తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 16వేల మంది జర్నలిస్టులకు కూడా న్యాయం చేస్తామని ఆయన వెల్లడించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి... అంతకుముందు జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకమని, ఒక హామీ ఇచ్చామంటే అమలు చేస్తామనే విశ్వాసం ప్రజలకు కలగాలని, ఆర్థికంగా, సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా, అమలు చేసేందుకు అవకాశం ఉన్న హామీలనే మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. తొలి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కమిటీ కన్వీనర్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కాగా, జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో విరాహత్ అలీ, తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరుఫున గంగు భానుమూర్తి తదితరులు రాజనర్సింహను కలసి తమ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలని వినతిపత్రాలు అందజేశారు. -
స్ర్కీనింగ్ కమిటీ ‘చేతి’లో అభ్యర్థుల భవితవ్యం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, ఇప్పటివరకు 1076 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు నుంచి అభ్యర్థుల స్క్రూటినీ మొదలు పెడతామని తెలిపాయి. ప్రతి నియోజక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్నట్టు ముఖ్య నేతలు చెప్పారు. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, ప్రజాబలం పరిగణలోకి తీసుకుని.. సర్వేల ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా టీడీపీ, వామపక్ష పార్టీలతో దోసీ కట్టిన కాంగ్రెస్.. ఎన్నికల పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు అనంతరమే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. ప్రజాభిప్రాయాలతోనే మేనిఫెస్టో గాంధీభవన్‌లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ప్రజల అభిప్రాయాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీకి అనుబంధంగా మరో 5 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ 5 కమిటీలు రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి.. ఆయా సమావేశాల్లో వివిధ సంఘాల నుంచి వినతులను స్వీకరిస్తాయని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశంపై వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచతామని వెల్లడించారు. ఆర్థికపరంగా ఆమోదయోగ్యమైనవి, న్యాయపరంగా చిక్కులు లేనివి, ప్రజా బాహుళ్యం మెచ్చిన అంశాలు మేనిఫెస్టోలో చేర్చుతామని అన్నారు. -
కుట్రపూరితంగానే అరెస్టులు
పటాన్చెరు టౌన్/ సంగారెడ్డి టౌన్/ పుల్కల్: ప్రభుత్వం కుట్ర పూరితంగానే తమ పార్టీ నేతలపై కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంటోందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి మం గళవారం సంగారెడ్డి వెళ్తున్న ఆయనను పటాన్చెరు మండలం ముత్తంగి టోల్గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజనర్సింహ మాట్లాడుతూ తోటి రాజకీయ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేయడంతో కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు యంత్రగాన్ని వాడుకుంటూ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జగ్గారెడ్డి పాస్‌పోర్టు అంశం గుర్తుకురానిది ఇప్పుడు గుర్తుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీ, మియాపూర్ భూ కుంభకోణం వంటివి బయటకు రాకుండా వారి నేతలను కాపాడుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీమంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జయప్రకాశ్‌రెడ్డిని పరామర్శించడానికి వచ్చి న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నేను ఎక్కడికి పోను.. కాంగ్రెస్‌లోనే ఉంటా
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారతానంటూ చాలా పుకార్లు వస్తున్నాయని, ఎక్కడికి పోనని కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బుధవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతి యాదవ్, డీకే అరుణ, రేవంత్ రెడ్డిలు మాజీ మంత్రి ముఖేష్ ఇంటిలో సమావేశమయ్యారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటే బలమే కదా అన్నారు. టీడీపీ కూడా ఒక రాజకీయపార్టీ అని చెప్పారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కాంగ్రెస్‌లోకి రావడాన్ని ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఎవరన్నా కాంగ్రెస్‌లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. పొత్తులు, సీట్లు అధిష్టానం నిర్ణయస్తుందని తేల్చిచెప్పారు. -
టీఎస్‌జీఆర్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడిగా విశ్వాస్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈయూ) రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఆర్.విశ్వాస్‌రెడ్డి, జి.దామోదర్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో గురువారం సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు విశ్వాస్‌రెడ్డి ప్యానెల్, గోపాల్‌రెడ్డి ప్యానెల్లు పోటీపడగా విశ్వాస్‌రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 380 ఓట్లకు 281 ఓట్లు పోలయ్యాయి. అందులో విశ్వాస్‌రెడ్డికి 216 ఓట్లు, గోపాల్‌రెడ్డికి 65 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి జి.దామోదర్‌రెడ్డి, మురళీధర్‌లు పోటీపడగా దామోదర్‌రెడ్డికి 241 ఓట్లు, మురళీధర్‌కు 38 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన వారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. టీఎస్‌జీఆర్‌ఈయూ కార్యవర్గం ఇదే.. మిగతా కార్యవర్గాన్ని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో కోశాధికారిగా రామ్మోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పీఆర్.మోహన్, ఉపాధ్యక్షుడిగా కె.ఎల్లారెడ్డి, బొక్కారెడ్డి, ఆర్.సాయిలు, కె.నర్సింగ్‌రావు, కార్యదర్శులుగా శ్యాంరావు, కె.మల్లేశం, సుబ్బయ్య, పబ్లిసిటీ కార్యదర్శిగా డి.విష్ణువర్ధన్‌రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బి.మారయ్యగుప్తా, ఎం.శ్రీనివాస్, నర్సింగ్‌రావు, జాయింట్ సెక్రటరీలుగా ఎ.గంగారెడ్డి, వి.యాదవరెడ్డి ఉన్నారు. -
దామోదరకు భద్రత ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు పోలీసు భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ శనివారం దామోదర వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఉపసంహరణకు సంబంధించి దామోదరకు జిల్లా పోలీసులు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న దామోదరకు ప్రస్తుతం వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయనకు ఇద్దరు గన్మన్లు రక్షణగా ఉంటున్నారు. భద్రత ఉపసంహరణ తమ పరిధిలోని అంశం కాదని, ఇంటెలిజెన్స్ సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. దామోదరకు భద్రతను ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం జోగిపేటలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. -
‘రైతుబంధు నాకొద్దు’
జోగిపేట(అందోల్): రైతుబంధు పథకం పేరుతో తన తల్లి జానాబాయి పేర ఉన్న వ్యవసాయ భూమికి వచ్చే చెక్కును తీసుకోనని, దానిని గౌరవంగా తిరస్కరిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సింగూరు పర్యటన సందర్భంగా దామోదర తల్లి జానాబాయి పేర ఉన్న 20 ఎకరాలకు పెట్టుబడి పథకం కింద రూ.1.60 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం తమకు వద్దన్నారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే పంటలను పండించుకుంటున్నారన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. బడా రైతుల గురించి కాకుండా చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌లో ఎన్నికల టీం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో త్వరలోనే ఎన్నికల టీం రెడీ కానుంది. ఒడిశాలో ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణలోనూ పార్టీ కమిటీల నియామకానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, కోర్ కమిటీలను వచ్చే నెలలో ప్రకటించే దిశగా ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ యోచిస్తున్నారని సమాచారం. సామాజిక సమతుల్యత ఆధారంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారని, ఎస్సీ, బీసీ నాయకులకు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆశావహుల జాబితా చాంతాడంత పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్‌లో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికల టీంను నియమించేందుకు కసరత్తు చేస్తుండడంతో ఈ పోటీ మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే ప్రచార, మేనిఫెస్టో, కో ఆర్డినేషన్, కోర్ కమిటీల పగ్గాల కోసం, ఆ కమిటీల్లో స్థానం కోసం టీపీసీసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతుండగా.. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను ఈ కమిటీలతో పాటు ప్రకటించనున్నారు. ఈ నెల19న విడుదల చేసిన ఒడిశా కమిటీలతోపాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అదే తరహాలో రాష్ట్రంలోనూ ముగ్గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి ఈ హోదాలో ఉండగా.. కొత్తగా నియమించే ఇద్దరిలో ఒకరిని ఓసీ, మరొకరిని బీసీ వర్గం నుంచి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని ఎప్పట్నుంచో అంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌కు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. యాష్కికి కీలక బాధ్యతలు ఏఐసీసీలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో రాహుల్ ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న యాష్కికి ఈసారి పదోన్నతి వస్తుందని పీసీసీ వర్గాలంటున్నాయి. ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలకు ఇచ్చే ఈ హోదాను ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట వేశామనే సంకేతాలు పంపాలన్నది రాహుల్ యోచనగా కనిపిస్తోంది. యాష్కికి పదోన్నతి రాకపోతే ఆయన్ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఒకవేళ పదోన్నతి వస్తే ప్రచార కమిటీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు అప్పగించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సీనియర్ నేత జైపాల్‌రెడ్డికి చోటు ఖాయమని తెలుస్తోంది. సీడబ్ల్యూసీలో జైపాల్‌కు చోటివ్వకపోతే రాష్ట్ర పార్టీ సలహాదారుగా లేదా పార్టీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి రాజనర్సింహ ఇతర కమిటీల విషయానికి వస్తే.. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధా న్యం పెంచాలనే కోణంలో హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈయన నేతృత్వంలో ఉండే ఈ కమిటీకి కన్వీనర్‌గా ఓసీ సామా జిక వర్గ నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కో ఆర్డినేషన్ కమిటీలో పార్టీ సీనియర్ నేతలందరికీ స్థానం కల్పించనున్నారు. కోర్‌కమిటీలో సభ్యుల సంఖ్య తక్కువే అయినా.. చైర్మన్, కన్వీనర్లుగా ఓసీ, బీసీ నేతలను ఎంపిక చేయనున్నా రని టీపీసీసీ వర్గాలంటున్నాయి. టీపీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ కమిటీల ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చ జరిగినా.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఆక్రోశ్ర్యాలీకి వెళ్లే సందర్భంగా టీపీసీసీ ముఖ్యులతో కమిటీల ఏర్పాటుపై రాహుల్, గెహ్లాట్ చర్చలు జరపనున్నారు. -
బ్రాహ్మణులు బిచ్చగాళ్లు అంటూ వ్యాఖ్యలు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ నోటి దూకుడుకు పెట్టింది పేరు. ఆయన నోట జారిన మాటలు తరచూ కలకలం రేకెత్తిస్తాయి. మనోభావాల్ని యథాతథంగా మాటల్లో వ్యక్తీకరించేందుకు మంత్రి దామోదర్ రౌత్ ఏమాత్రం సంకోచించరు. ఇదే పంథాలో బ్రాహ్మణుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ వ్యాఖ్యలకు నిరసనగా ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు నడుం బిగించింది. ఈ ఉద్యమాన్ని శ్రీ జగన్నాథుని క్షేత్రం పూరీ నుంచి ప్రారంభించారు. బ్రాహ్మణుల పట్ల మంత్రి చేసిన తేలికపాటి వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకునేంత వరకు బ్రాహ్మణ వర్గం శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఎదురుగా ముక్తి మండపం బ్రాహ్మణ మహా సభ, ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడిగా బుధవారం నిరసన ప్రదర్శించాయి. మంత్రి దిష్టి బొమ్మల్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరకుంటే ఆందోళన అంచెలంచెలుగా ఉధృతం అవుతుందని ఈ సంఘాలు స్పష్టం చేశాయి. క్షమాపణ చెప్పేది లేదు, తప్పు చేస్తేగా: మంత్రి బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ కూడా విజృంభించారు. వీరి డిమాండుతో క్షమాపణ చెప్పేది లేనే లేదు. తప్పు చేయని పరిస్థితుల్లో క్షమాపణ కోరడం ఎందుకని మంత్రి ఎదురు తిరిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ దుమారం వెనక బాగోతం మీడియాకు వివరించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పను. కొంత మంది స్వార్థపర రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. శ్రీ జగన్నాథుని దేవస్థానంలో భక్తులు, యాత్రికులు, పర్యాటకుల నుంచి బ్రాహ్మణులు గుంజు తున్న వ్యవహారం ఏమి టో వివరించాలని ఎదురు దాడిని మరింతగా ప్రేరేపించారు. బ్రాహ్మణులు గుంజుతున్న ఈ సొమ్ము దేవస్థానానికి చెల్లిస్తున్న సుంకమా! ప్రత్యక్షంగా చేయి చాచి అడుక్కోవడమా! అని ప్రశ్నించారు. పూర్వాపరాలిలా ఉన్నాయి మల్కన్‌గిరి ప్రాంతం మారుమూల దళిత ప్రభావిత గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ ప్రసంగించారు. దళితుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వృత్తిపట్ల ప్రగాఢ అంకిత భావంతో దళితులు ఎన్నడు దేనిని యాచించరు. ఆకలితో అలమటించే భయానక పరిస్థితుల్లో కొండ కోనల్లో ప్రవహించే సెలయేటి నీటి తాగుతు ప్రాణాల్ని అర్పించేందుకైనా సిద్ధం అవుతారు కాని యాచించేందుకు(భిక్షాటన) అంగీకరించరు. బ్రాహ్మణులు మాత్రం సమయానుకూలంగా దానధర్మాల ప్రేరణతో యాచిస్తారు. హిందు ఆధ్యాత్మిక భావాల నేపథ్యంలో వీరికి దానం చేసేందుకు అంతా ముందుకు వచ్చి గౌరవిస్తారు. ఈ వ్యాఖ్య బ్రాహ్మణ వర్గంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. రైతుల ఆత్మ స్థైర్యాన్ని కొనియాడుతూ బ్రాహ్మణుల యాచనని బేరీజు వేయడంతో వివాదం అలముకుంది. పంట నష్టం వగైరా సందర్భాల్లో రైతులు ఆత్మ హత్యలకు పాల్పడే సంఘటనల్ని ఆయన ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగం ఆత్మ హత్యలకు పాల్పడే బలహీనులు కారు. వారి గుండెల్లో ఆత్మ స్థైర్యం నిండి ఉంది. బ్రాహ్మణుల్ని కించ పరిచే యోచన రంగు పులిమి దుమారం రేపడం విచారకరం. హిందు వర్గంలో బ్రాహ్మణులది అత్యున్నత స్థానం. వారిపట్ల ప్రతి హిందువుకు గౌరవాభిమానం ఉంటుంది. ఈ సంప్రదాయం పట్ల తనకు సానుకూలత ఉందని మంత్రి వివరించారు. కష్ట పరిస్థితుల్లో రైతు వైఖరిని విషదీకరించే క్రమంలో చోటుచేసుకున్న మాటల్లో భావాన్ని వక్రీకరించి క్షమాపణ కోరమంటే కుదరని పనిగా మంత్రి తెగేసి చెప్పేశారు. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరంలో బ్రాహ్మణులు సొమ్ము గుంజుకోవడం యాచన కాకుండే సుంకం వసూలు చేయడమా! అని మంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో వ్యాఖ్యానించారు. -
లక్ష్మీ దేవికి అవమానం
భువనేశ్వర్: వరి పంటకు చీడపీడలు ఆవరించడంతో కలవరపడుతున్న రైతాంగం పొలాల్లో పంటకు నిప్పు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తప్పు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ అన్నారు. వరి పంట సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వర్థమాన పరిస్థితుల దృష్ట్యా పంటకు నిప్పు పెట్టడం అంటే లక్ష్మీ దేవిని దహించినట్లే అవుతుందన్నారు. ఇటువంటి తప్పిదానికి పాల్పడరాదని అన్నదాతను అభ్యర్థించారు. నకిలీ మందుల విక్రేతలపై చర్యలు తప్పవు రైతులకు నకిలీ క్రిమి సంహారక మందుల్ని విక్రయించిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. బాధ్యుల్ని ఖరారు చేసిన మేరకు విభాగం వీరి వ్యతిరేకంగా చర్యల్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని ప్రకటిం చారు. ముగ్గురు స భ్యుల బృందాన్ని వ్యవసాయ విభా గం ప్రభావిత ప్రాం తాలకు పంపించి ందన్నారు. క్షేత్ర స్థా యిలో వాస్తవ స్థితిగతుల్ని క్షుణ్ణంగా ప రిశీలించిన మేరకు వీరితో సంప్రదించి భావి కార్యాచరణ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. బర్గడ్, సంబల్పూర్, రాయగడ, గంజాం జిల్లాల్లో రైతులు వరి పంటకు నిప్పు పెడుతున్నట్టు విభాగానికి ఇప్పటివరకు సమాచారం అందినట్టు మంత్రి చెప్పారు. -
దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు
కేసీఆర్ నియంత.. నిరసనలను జీర్ణించుకోలేరు: దామోదర రాజనర్సింహ సాక్షి, హైదరాబాద్: సుందిళ్ల బ్యారేజీ కోసం గోలివాడలో రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా సేకరిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వమే దళారీగా మారిపోయి, రైతుల భూములను దోచుకుంటున్నదన్నారు. రైతుల పట్టా భూములపై ప్రభుత్వ పెత్తనం ఏందని ఆయన ప్రశ్నించారు. ఏ చట్టం ద్వారా తమ భూములు తీసుకుంటున్నారో, రైతులకు ఇస్తున్న పరిహారం ఏమిటో చెప్పాలని అడుగుతుంటే ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం తాబేదారుగా మారిందని దామోదర విమర్శించారు. కేసీఆర్ ఒక నియంత అని విమర్శించారు. నియంతలే నిరసనలను జీర్ణించుకోలేరని, అందుకే ధర్నాచౌక్‌ను తరలిస్తున్నారని విమర్శించారు. -
అప్రజాస్వామికంగా భూసేకరణ: దామోదర
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఓ విద్యుత్ కేంద్రం కోసం భూసేకరణ విషయంలో చట్టాన్ని గౌరవించకుండా, హైకోర్టు స్టే పట్టించుకోకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరి స్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గొలివాడ గ్రామానికి చెందిన రైతులతో కలసి గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్కడ భూములు కోల్పోతున్న నిర్వాసితులు 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారని దామోదర చెప్పారు. భూనిర్వాసితుల మొరను ఆలకించిన హైకోర్టు 240 ఎకరాల పట్టా భూముల్లో ఎలాంటి చర్యలను తీసుకోవద్దని, పరిహారంపై స్పష్టత వచ్చేదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిందన్నారు. కానీ, అంతర్గాం మండల రెవెన్యూ అధికారి రెండ్రోజుల క్రితం ఇళ్లకు నోటీసులను అంటించారన్నారు. ఆ వెంటనే 300 మంది పోలీసులతో ఓ కాంట్రాక్టు సంస్థవారు పట్టా భూముల్లోనే పనులను ప్రారంభించారన్నారు. ఇది ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమా, లేక ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్రభుత్వమా అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలతో కలసి ఉద్యమిస్తామని దామోదర హెచ్చరించారు. -
'శ్వేతపత్రం విడుదల చేయాలి'
రేగోడ్(మెదక్ జిల్లా): మీకు దమ్మూ దైర్యం, సత్తా ఉంటే ఉద్యోగ ఖాళీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి ఆదివారం విచ్చేసన ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాలకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వండని అడగడం లేదని..ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందు, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో శ్వేత పత్రం స్పష్టంగా విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. -
దామోదర్ కృషితోనే తెలంగాణ
మునిపల్లి: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నారంటే సోనియాగాంధీ, రాహుల గాంధీ పుణ్యమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీ జన్మదినాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి ఉండగా కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కనిపించడం లేదన్నారు. రైతులకు పంట నష్టం మంజూరు చేయడం లేదన్నారు. రైతులకు రుణమాఫీని ఒకేసారి అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో సదాశివపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, పిల్లోడి సర్పంచ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మల్లన్నసాగర్ వెళ్లకుండా అడుగడుగునా పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటూ హైకోర్టును మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒక్కోనేత వెంట నలుగురు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. -
అష్టదిగ్బంధం
- మెదక్ జిల్లా బంద్‌కు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు - మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా కదలిన నేతలు, ప్రజాసంఘాలు సాక్షి నెట్వర్క్ : పోలీసుల అష్టదిగ్బంధం.. ఎక్కడికక్కడ అరెస్టులు.. మల్లన్నసాగర్ బాధితులకు సంఘీభావంగా తరలివచ్చిన నేతల ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ముంపు గ్రామాలకు వెళ్లనీయకుండా మధ్యలోనే అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించా రు.దీనిపై నేతలు, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ప్రతిపక్షాలు సోమవారం మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ను కలిసేందుకు బయల్దేరిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జిల్లా సరిహద్దు శా మీర్‌పేట వద్దే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘‘గాయపడిన నిర్వాసితులను పరామర్శించి, వారితో మాట్లాడి కార్యాచరణ రూపొందించుకుందామనుకున్నాం. అంతలోనే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని కోదండరాం అన్నారు. చర్చల ద్వారానే మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు పరిష్కారం కనుగొనాలన్నారు. గజ్వేల్ ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శిస్తామని చెప్పినా వినకుండా పోలీసులు తమను గంటన్నరపాటు వాహనంలో తిప్పారన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూము లు లాక్కోవద్దని ప్రభుత్వానికి సూచించారు. లాఠీచార్జిలో గాయపడినవారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించి, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలతో చర్చించి ప్రభుత్వం న్యాయపరంగా భూములు సేకరించాలన్నారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు కోదండరాంతో పాటు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డిని కూడా తరలించారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రాజెక్టులు నిర్మించడం సమంజసం కాదని, రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని ఆమె దుయ్యబట్టారు. అనంతరం వారిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నియంతలా వ్యవహరిస్తున్నారు.. సీఎం కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. సోమవారం గజ్వేల్ చేరుకున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి తూప్రాన్ స్టేషన్ కు తరలించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం దళారుల కోసం జీవో 123 తెచ్చిందని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా నుంచే యుద్ధం ప్రారంభమైందన్నారు. ఇక సిద్దిపేటలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. భూనిర్వాసితులను కలిసేందుకు వెళ్తుంటే తమను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తుంటే తాము ప్రేక్షకపాత్ర వహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా ఫోన్ లో ‘సాక్షి’తో మాట్లాడారు. బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయల్దేరిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను పోలీసులు కుకునూర్‌పల్లి సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బంగారం పండే భూములు పోతుంటే కడుపుమండదా? న్యాయం చేయండని అడిగితే లాఠీచార్జీ చేస్తారా?’ అని ఆమె ప్రశ్నించారు. ఆమెతో పాటు అరెస్టయిన ఫ్రంట్ కార్యదర్శి దాసు తదితరులను సాయంత్రం విడుదల చేశారు. నాడు టీఆర్ఎస్ నాయకులు బైఠాయించలేదా? భూనిర్వాసితులకు సంఘీభావం తెలిపేందుకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రహస్యంగా హైదరాబాద్ నుంచి పల్లెపహాడ్‌కు, అక్కడ్నుంచి వేములఘాట్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులు రోడ్లపై బైఠారుుంచి వంటావార్పులు చేయలేదాఅని తమ్మినేని ప్రశ్నించారు. లాఠీచార్జీకి కారణమైన సిద్దిపేట డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. బంగారు తెలంగాణ అంటే రెండు పంటలు పండే భూమలను బలవంతంగా లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ను రద్దు చేసి కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్న పోలీసులకు తీవ్రవాదుల్లా కనిపించా రా అని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో ఈ 14 గ్రామాల ప్రజలను బతకనివ్వారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని గజ్వేల్‌లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు. -
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రీ డిజైన్లు
► 2013 చట్టమే రైతులకు శ్రీరామరక్ష ► మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్: ‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే సోయి లేని ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకునేందుకు దళారీగా మారి భూ దోపిడీకి పాల్పడుతోంద’ని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసిత రైతాంగంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతుల జీవితాలను కాపాడాలన్న సంకల్పంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి నిరంకుశ ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్య నాలుగు పేజీల జీఓ నం. 123ని తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగ రక్షకుడే భక్షకుడిగా మారి పేద రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రూ.వేల కోట్లలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి 2013 భూ సేకరణ ప్రకారం పేద రైతులకు పరిహారం వచ్చే వరకు వారి ముందుండి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులను పెడుతున్న ఇబ్బందులు చూస్తే నాటి రజాకార్ల జమానా గుర్తుకు వస్తుందని చెప్పారు. తరతరాలుగా నమ్ముకున్న భూమిని సాదా కాగితాలపై సంతకాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, భూములు పోతాయన్న బాధతో గిరిజన, హరిజన రైతాంగం గుండెపోటుతో మృతి చెందిన ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పేదల రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కర్వెన సభలో ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి మొదటి నెల జీతం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని రైతులను బెదిరించే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అద్దంకి దయాకర్, పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, జెడ్పీటీసీలు సుధాపరిమళ, మణెమ్మ, నాయకులు బాలరాజుగౌడ్, మాన్యనాయక్, సంపత్‌రెడ్డి, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితుల పొట్టకొడితే ఊరుకోం
-2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరపాలి -మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కొండపాక మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పొట్టకొడితే ఊరుకునేది లేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా కొండపాకకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన టీఆర్ఎస్ సర్కార్ భూనిర్వాసితుల పొట్టకొట్టేలా 123 జీఓను తేరమీదికి తెచ్చిందని విమర్శించారు. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం లేనిపోని విమర్శలు చేసిందని, అయినా బెదిరేది లేదన్నారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల కోసం భూముల కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసేందుకు యూపీఏ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని అమలు చేసి చట్టబద్ధత కల్పించిందన్నారు. అలాంటి చట్టాన్ని పక్కన పెట్టడం దారుణమన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల అనుమతి మేరకే భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామంటూ ముందుకు రావడం వెనుక మరో రకమైన కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. డబ్బులు అందిన తరువాతే భూములు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన నిర్వాసితులకు సూచించారు. ప్రాంతీయేతరులు మోసం చేస్తే పొలిమెరల దాకా తరిమి కొట్టండి... తెలంగాణ వారే మోసం చేస్తే పాతి పెట్టండి... అంటూ భూనిర్వాసితులకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి చిలువేరి రాంరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే మల్లన్నసాగర్ రా..!
హరీశ్‌కు దామోదర సవాల్ సంగారెడ్డి రూరల్: ముంపు బాధితులకు న్యాయం చేయకపోతే జిల్లాలో మంత్రులను అడుగుపెట్టనీయబోమని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి చౌరస్తాలోని 65వ నంబరు జాతీయ రహదారిని ముట్టడించారు. దామోదర మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందా లు కాదు.. దమ్ముంటే మంత్రి హరీశ్‌రావు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటిం చాలని సవాల్ చేశారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టులను చేపట్టడం మంచిది కాదన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ భూ బాధితులకు పరిహారం చెల్లించడంపై రైతుల పక్షాన చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ముంపు బాధితుల పక్షాన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై ఆందోళన కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. -
కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు అరెస్ట్
ఏటూరు నాగారం-తాడ్వాయి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు సిద్ధబోయిన శివరాజ్ పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు అతని వద్ద నుంచి 4 డిటోనేటర్స్, 4 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. -
దామోదరను అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్
సంగారెడ్డి : జర్నలిస్టుల ఆత్మగౌవరం దెబ్బతినేలా అనుచిత వాఖ్యలు చేసి, జర్నలిస్టులపై దాడి చేయించిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాల నాయకులు ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి వినతి పత్రం అందించారు. జైలు మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన్ను జర్నలిస్టులు కలిసి ఏటి గడ్డ కిష్టాపూర్‌లో జరిగిన సంఘటనను వివరించారు. కాంగ్రెస్ పార్టీ సభ వార్తలను కవరేజ్ చేయడం కోసం పిలిపించి దాడి చేశారని, తిరిగి తమపైనే అక్రమంగా కేసులు పెట్టారని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను హోం మంత్రికి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ... కేసును విచారించాల్సిందిగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు. హోం మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, నేతలు పరశురాం, యోగానందరెడ్డి, విష్ణు, ప్రసన్న, సునీల్, మెదక్ జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సాయినాథ్ ఉన్నారు. -
దామోదరపై జర్నలిస్టుల ఫైర్..
♦ ఆయనను వెంటనే అరెస్టు చేయాలి ♦ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ♦ జర్నలిస్టు సంఘాల నేతల వినతి ♦ నేటి నుంచి ఆందోళనబాట సంగారెడ్డి జోన్ : మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అనుచరులతో దాడి చేయించడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆయనను వెంటనే అరెస్టు చేసి క్షమాపణలు చెప్పించే వరకు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోనియా గాంధీ కృతజ్ఞత సభను కూడా జర్నలిస్టులు బహిష్కరించారు. అనంతరం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి చంద్రశేఖర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. రాజనర్సింహ సహా దాడికి పాల్పడిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు సంఘాల నేతలు తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, తహాసీల్దార్లకు వినతిపత్రం, 4న మండల కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు, 6న డివిజన్ కేంద్రాల్లో రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రంగాచారితో పాటు సంఘాల నేతలు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, పరశురాం, యోగానందరెడ్డి, రవిచంద్ర, దుర్గారెడ్డి, శ్రీనివాస్, విష్ణు, వేణు, సునీల్, ప్రసన్న, అశోక్, శ్యామ్ సుందర్, పివి.రావు, శ్రీధర్‌తో పాటు విలేకరులు, కెమెరామెన్లు పాల్గొన్నారు. ఖేడ్‌లో దిష్టిబొమ్మ దహనం.. నారాయణఖేడ్: దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఖేడ్‌లో జర్నలిస్టులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్, బసవేశ్వర చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్‌లో దిష్టిబ్మొను దహనం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. రాజనర్సింహకు బాబూమోహన్ సవాల్.. జోగిపేట: దామోదర రాజనర్సింహ ...రా చూసుకుందాం...మాటలు కాదు...ఏదైనా చేతల్లోనే చూపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ సవాల్ విసిరారు. గురువారం జోగిపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాజనర్సింహ వ్యాఖ్యలపై త్రీవంగా స్పందించారు. దామోదర వాఖ్యలను ఖండిస్తూ విలేకరులు చేపట్టబోయే ఏ ఉద్యమానికైనా తన మద్దతు ఉంటుందన్నారు. తొగుటలో దిష్టిబొమ్మ దహనం తొగుట : విలేకరులపై జరిగిన దాడికి నిరసనగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం దామోదర రాజనర్సింహ దిష్టిబొమ్మను విలేకరులు ద హనం చేశారు. రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విలేకరులు బాల్‌నర్సయ్య, కిష్టాగౌడ్, స్వామి, నర్సింలు, శ్రీకాంత్, సాయి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దామోదర దురుసుప్రవర్తన పట్ల భట్టి విచారం
మీడియా ప్రతినిధులపై దామోదర రాజనరసింహ అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపురం గ్రామంలో బుధవారం ఓ కార్యక్రమం సందర్భంగా కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై దామోదర తిట్ల పురాణం అందుకున్న సంగతి తెలిసిందే. దామోదర అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీనిపై మీడియా ప్రతినిధులు తోగుట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా దామోదర వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. క్షమాపణలు చెబితేనే కార్యక్రమాన్ని కవర్ చేస్తామని తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేయడంతో వారు శాంతించారు. -
మీడియా కొడుకులు 3 కెమెరాలే పెట్టారు!
నా వీడియోలు తీసినా పబ్లిష్ చేయడం లేదని దామోదర ఫైర్ తొగుట: ‘మీడియా నా.. కొడుకులు మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు. నా ప్రోగ్రాంలో నేను మాట్లాడే వీడియోలు తీసి పబ్లిష్ చేయడం లేదు’ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు. బుధవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితుల సమావేశానికి హాజరైన ఆయన మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా ప్రతి నిధులు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించిన దామోదర అనుచరులు పరుషపదజాలంతో దూషిస్తూ భౌతిక దాడులకు దిగారు. పలు కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పలువురు మీడియా ప్రతినిధులూ గాయపడ్డారు. మీడియా ప్రతినిధులు తొగుట పోలీస్ స్టేషన్లో దామోదరపై ఫిర్యాదు చేశారు. -
మీడియాపై దాడి హేయమైన చర్య
సంగారెడ్డి జోన్: తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, కెమెరాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, పర్శరాం ఖండించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలో దామోదర రాజనర్సింహ దిష్టిబొమ్మను జర్నలిస్టులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ప్రోద్భలంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు మీడియాపై దాడి చేసి చేశారని ఆరోపించారు. దామోదర మీడియాకు క్షమాపణలు చెప్పే వరకు జిల్లాలో కాంగ్రెస్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో హజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు యోగనందరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, విష్ణు, సునీల్, ప్రసన్న, వీడియో జర్నలిస్టు నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, మెదక్ జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సాయినాథ్, నజీర్ అహ్మద్, దేవదాస్, విల్సన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మగాడంటే.. మాట మీద నిలబడాలి
కేసీఆర్ పై దామోదర ధ్వజం టేక్మాల్: ‘మగాడంటే.. మాట మీద నిలబడాలె. నపుంసకుడిలా మాటలు మారుస్తూ కాలం గడిపేయడం సరికాదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ దర్గాలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. మోసగాని చేతిలో తెలంగాణను పెట్టారని, టీఆర్ఎస్ పాలనలో అధికారులు బానిస బతుకులు బతుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 1,500 మంది రైతులు మరణించినా, ఏ ఒక్కరోజు కూడా వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. -
మధ్యప్రదేశ్‌లో గురువుల దారుణం..
భోపాల్: ప్రపంచమంతా అభివృద్ధి, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్నా కొందరి మనస్తత్వాలు మారడం లేదు. వారిని పట్టుకున్న కులజాడ్యం వీడటం లేదు. ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది. ఇలా నిరక్షరాస్యులు చేశారంటే లోకజ్ఞానం ఎక్కువగా లేదనుకోవచ్చు.. కానీ సాక్షాత్తు పాఠాలు చెప్పే గురువులే చేస్తే.. మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది. దామోహ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచినీటికోసం స్కూళ్లో చేతిపంపు వద్దకు వెళ్లిన ఓ దళిత బాలుడిని అందుకు అనుమతించకపోవడంతో అతడు బావిలో పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి విచారణ ఆదేశించారు. -
‘రాష్ట్రం కల్వకుంట్ల రాజ్యంగా మారింది’
అల్లాదుర్గం (మెదక్) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో లబ్ది పొందుతున్నది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, కూతురికి కేంద్ర మంత్రి పదవి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు, వారసత్వంగా కొడుకు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ విమర్శించారు. అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాజ్యంగా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత నిరంతరం పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకుంటే, కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తూ ఫలితం పొందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, లేకుంటే మెడ కోసుకుంటానన్న కేసీఆర్ అధికారం రాగానే ఇచ్చిన మాట మర్చిపోయారని ఎద్దేవా చేశారు. -
ఫాంహౌస్‌లో రూ. కోట్లు దాచిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి దామోదర రాజనర్సింహ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రికి పోలీసు రక్షణ కల్పిస్తూ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని విమర్శించారు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎస్పీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఓ డిక్టేటర్లా తయారయ్యారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా ? కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో రూ.కోట్లు దాచారని, వాటి గురించి మాత్రం పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్ఎస్ శాసనసభ్యులే డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని రాజనర్సింహ అన్నారు. ఈ విషయాలను మీడియా ప్రజలకు తెలియజేయాలన్నారు. గంగాధర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనింట్లో సొంత డబ్బు దాచుకుంటే పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఇంట్లోకెళ్లి బీరువా ధ్వంసం చేసి డబ్బులు లాక్కొచ్చారని ఆరోపించారు. -
సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ సుమతి టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నిష్పాక్షికంగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీపీసీసీ సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలోకి దించింది. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. -
ఇరవై నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర డిమాండ్ నారాయణఖేడ్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇరవై నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు ఒకేమారు రుణమాఫీ చేయలేని ప్రభుత్వం.. రూ.30 వేల కోట్లు మిషన్ భగీరథకు టెండర్లు పిలువకుండా కట్టబెట్టారని విమర్శించారు. 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవడానికి డబ్బులు ఉండవు కానీ, భగీరథ పైపుల కొనుగోలుకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఎన్నింటిని భర్తీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అని అడిగారు. గిరిజనులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ అమలు ఏమైందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి, మిషన్ భగీరథ పైపుల కొనుగోళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దామోదర డిమాండ్ చేశారు. -
నారాయణఖేడ్‌లో గెలుపే లక్ష్యం: రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని పార్టీ సీనియర్లు సునీతా లక్ష్మారెడ్డి, జె.గీతారెడ్డి, సురేశ్ షేట్కార్, టి.జయప్రకాశ్‌రెడ్డి వంటివారితోపాటు మండల స్థాయి నాయకులతోనూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతను ఆయనే భుజాలకెత్తుకున్నారు. టీపీసీసీ సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలోకి దించింది. ఈ నియోజకవర్గంలో పార్టీ నేతల సమన్వయం, గెలుపు బాధ్యతను దామోదరకు అప్పగించింది. ఇక మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం నారాయణఖేడ్‌లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వ్యూహంపైనా పార్టీ ముఖ్యులతో చర్చిం చారు. పార్టీ నేతల మధ్య సమన్వయంలో ఎదురైన సమస్యలనూ పరిష్కరించారు. మొత్తంగా ఖేడ్‌లో గెలుపు అనివార్యమనే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. -
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కేతు దామోదర్ (45) ఆదివారం ఉదయం పొత్తిపాడు-అర్కటవేముల రహదారిలో వెళుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడికి దిగాయి. రక్షణగా వస్త్రాన్ని కప్పుకున్నా అవి వదలిపెట్టలేదు. వళ్లంతా ముళ్లు దిగబడిపోవడంతో దామోదర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. -
ఆయనలో మృగాడు మేల్కొన్నాడు
లీగల్ కౌన్సెలింగ్ ఉమ్మడి గృహాన్నీ విభజించమనచ్చు మా పెళ్లయ్యి ఆరేళ్లయింది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మాది. మంచి ఉద్యోగాలు మావి. మాకు పిల్లలు లేరు. అయినా నా భర్త నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. మా పక్కింట్లో ఉండే దంపతులకు ముద్దులు మూటగట్టే పాప. ఎనిమిదేళ్లుంటాయి. మాకు బాగా చేరిక అయింది. రోజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నేను ఇంట్లోలేని సమయంలో పాప వచ్చిందట. మా వారికి ఏమైందో ఏమో ఆయనలో మృగాడు మేల్కొన్నాడు. ముక్కుపచ్చలారని పాపను పాశవికంగా చిదిమి వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. నేను తీవ్రమైన మానసిక వేదనకు గురై, ప్రస్తుతం మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాను. వైద్యశాలలో ఇన్‌పేషెంట్‌గా ఉండి లెటర్ రాస్తున్నాను. నాకు వాడి ముఖం చూడ్డం కూడా ఇష్టం లేదు. దయచేసి మార్గం సూచించండి. సునీత, రాజమండ్రి మీకు నా సానుభూతి తెల్పుతున్నాను. మీ భర్త పైశాచికానికి మీ మనసెంతగా విలపిస్తున్నదో అర్థమవుతోంది. మీరు విడాకులు తీసుకోండి. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(2) (జీఠి) భార్య మాత్రమే విడాకులు పొందడానికి గల అదనపు గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. భర్త ఇతర స్త్రీల మీద అత్యాచారం చేసినా, పశువులతో సంపర్కం చేసినా, అసహజ లైంగిక చర్యలకు పాల్పడినా (సొడోమి) భార్య విడాకులు పొందవచ్చు. మీరు ఏ సంఘటన వల్ల ఆయన జైలు పాలయ్యాడో కోర్టువారికి వివరిస్తూ, వెంటనే విడాకులకు అప్లై చేయండి. నా వయసు 36 సంవత్సరాలు. నేను పుట్టు వికలాంగురాలిని కావడంతో పెళ్లి చేసుకోకుండా మా పుట్టింట్లో అన్నదమ్ముల కుటుంబాలతో కలసి ఉంటున్నాను. మాకు ఒక పెద్ద మండువా ఇల్లు ఉంది. నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారు. నాకైతే నా పోర్షన్ నాకిస్తే దాన్ని చక్కగా ఆధునీకరించుకోవాలని ఉంది. అయితే అందుకు మా అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు. ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు నాకు లేదా? - ఒక సోదరి, అనకాపల్లి మీకు ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు ఉంది. ఈ హక్కు హిందూ వారసత్వ చట్టం 2005 కేంద్ర సవరణను అనుసరించి వచ్చింది. పాత చట్టం ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం 1986 ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులున్నప్పటికీ ఉమ్మడి నివాసగృహంలో విభజన కోరే హక్కు వారికి లేదు. కొడుకులు ఆస్తి విభజన కోరే వరకు కూతుళ్లు ఆగవలసి వచ్చేది. కేంద్రసవరణ చట్టం ఈ కట్టడిని రద్దు చేసింది. దీని ప్రకారం ఆ గృహాన్ని విభజించమని కోరి, మీ భాగాన్ని మీ ఇష్టం వచ్చినట్లు మార్పులు, చేర్పులు చేయించు కోవచ్చు. ముందు మీ సోదరులను చట్టప్రకారం విభజించమని అడగండి. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, పార్టిషన్ సూట్ వేసుకోండి. మా అన్నయ్యు తన వాటాలోని ఒక ఎకరం భూమిని 1994లో అవుు్మకున్నాడు. వద్దు అంటున్నా, ‘‘నాకు డబ్బు అవసరం ఉంది’’ అని అవుు్మకున్నాడు. అప్పుడు ఆ భూమి విలువ రూ.26,000. ఇప్పుడు దాదాపు కోటిన్నరకుపైగా పలుకుతోంది. వూ అన్నయ్యు భూమి అమ్మినప్పుడు నేను సంతకం చేయులేదు. కాబట్టి ఇప్పుడు నేను కోర్టు ద్వారా ఆ భూమిని వెనక్కి తీసుకునే హక్కు ఉందా? ఉంటే ఎంత డబ్బు చెల్లించాలి? అప్పుడు వాళ్ళు కొన్నప్పటి రేటులో డబ్బులివ్వాలా? తెలియుజేయుగలరు. - కృష్ణకౌసిక్, విజయవాడ ఒకపక్క మీ అన్నయ్యు తన వాటాలో ఎకరం భూమి అవుు్మకున్నాడంటున్నారు. రెండో వైపు ‘‘నేను ఆ భూమిని అడిగి వెనక్కి తీసుకోవచ్చా’’ అని అడుగుతున్నారు. మీరు, మీ అన్నయ్యు 1994 పూర్వమే భాగాలు పంచుకున్నారా? భాగాలు పంచుకుంటే ఆయునకి డబ్బు అవసరమై అవుు్మకుంటే మీ అనువుతి అవసరం లేదు. భాగాలు పంచుకున్న తర్వాత ఆస్తి స్వభావం వూరి పోతుం ది. మీ చర్యలు కూడా అందుకు తగినట్లు వూర్పు చెందుతారుు. పంపకాలు జరిగిపోతే మీరు విక్రయు దస్తావేజులపై సంతకం పెట్టకపోరుునా అవ్ముకం చెల్లే అవకాశం ఉంది. ఒక వేళ అప్పటికి పంపకాలు జరగలేదనుకున్నా 1994లో అమ్మితే మీరు ఇప్పటి వరకూ ఎందుకు సవాలు చేయులేదనే ప్రశ్న తలెత్తుంది. 15ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు వివాదం రేపడానికి అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంటుంది. మీరు 94లో జరిగిన అవ్ముకాన్ని సవాలు చేయూలన్నా కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పైగా ఫలితం దక్కుతుందనే నవ్ముకం లేదు. ఇక ఖర్చు అంటారా... మీరు కోరే పరిష్కారంపై అధారపడి ఉంటుంది. ఒక్కో పరిష్కారానికి కోర్టు ఫీజు వేరుగా ఉంటుంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
పది మందిలో పాము..
పది మందిలో పాము చావదన్న సామెత తమ పార్టీకి సరిగ్గా అన్వయించవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీఎం పదవి తనకంటే తనకంటూ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనంతరం పలువురు నేతలు పోటీపడటంతో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని వాపోతున్నారు. సీఎంగా పార్టీ నేత ఎవరైనా ఉండి ఉంటే ఎన్నికల ఫలితాలు ఇంత నిరాశాజనకంగా వచ్చి ఉండేవి కావంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చిందని తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ కోసం సీఎం పదవిని తాను వదిలేశానంటే... తాను వదిలేశానని సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి వారు సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అంటూ ప్రకటన లు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. మరో నేత దామోదర రాజనర్సింహ తాను సీఎం కాకుండా అగ్రకుల నేతలు అడ్డుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారని వారు గుర్తుచేస్తున్నారట. ఎవరో ఒకరు సీఎం పదవిని తీసుకుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేది కాదంటున్నారు. అయితే సమస్యంతా.. ఇప్పటికీ ఈ నేతల తీరు మారకపోవడమేనని నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే ఉన్నా.. మళ్లీ తామే సీఎం అభ్యర్థి అంటూ దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహా, సర్వే సత్యనారాయణ, వివేక్, భట్టి విక్రమార్క, రెడ్డి సామాజిక వర్గం నుంచి జై పాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, బీసీ వర్గాల నుంచి పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పోటీపడుతుండడంతో ఏమీ చేయాలో తెలియక హైకమాండ్‌కు సైతం జుట్టుపీక్కునే పరిస్థితి ఏర్పడిందట! -
అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తారా!
-
'అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారా'
వరంగల్ : దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి, వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక తెచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య పోకడలే లేవంటూ ఆయన మండిపడ్డారు. అసాధ్యపు హామీలు ఇచ్చి ప్రజలను ఆగం చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేయని సీఎం, రూ.40 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో తెలపాలన్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో ఇప్పటికే రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని, దాన్ని నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. నిరూపించకపోతే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. వంచన, మోసం, దగా అనే సిద్ధాంతాలతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, కేసీఆర్ నియంత అని, మాట, మూట, వేట అనేవి ఆయన విధానాలని దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. -
దొరల గడీలో తెలంగాణ తల్లి బందీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దామోదర ధ్వజం పటాన్చెరు: ‘దొరల గడీలో తెలంగాణ తల్లి బందీ అయింది.. ఆమె విముక్తి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేయాలి’ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతిపక్షాల నోరు మెదపనివ్వకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక దృష్ట్యా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బును పంపిణీ చేస్తున్నారన్నారు. దొర పంపిన ఆ డబ్బులను తీసుకుని టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. మోసం, దగా, వంచన, మాట, మూట, వేట.. ఇవి సీఎం కేసీఆర్ విధానాలు అని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పటమే కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు ఉన్నా ఓపికతో ఉన్నారన్నారు. తిరగబడే స్వభావం తెలంగాణ సమాజానిదని.. ఆ విషయం సీఎం కేసీఆర్ మరువరాదని దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా సూచించారు. -
అలాంటి పరిశ్రమలపై త్వరలో చర్యలు
న్యూఢిల్లీ: గంగా నదిలోకి వ్యర్థాలతో కూడిన కలుషిత నీటిని వదులుతూ మురికి కూపంగా మారుస్తున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ఉమా భారతి గురువారం ప్రకటన చేశారు. గంగా శుద్ధి కార్యక్రమంపై తాము తయారు చేసిన ప్రణాళిక తుది మెరుగులకు చేరిందని, త్వరలోనే కేబినెట్‌కు పంపించి ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే గంగా శుద్ధి కోసం నమామి గంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గంగా నది శుద్ధి కార్యక్రమాన్ని తాము ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నామని, ఇది విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు కూడా తాము విడుదల చేస్తున్న వ్యర్థాల విషయంలో మరోసారి పునరాలోచన చేసుకోవాలని, నదిలోకి విడుదల చేయకుండా ప్రత్యామ్నాయాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆయనకిదే తొలి పుష్కరస్నానం..
నవీపేట(నిజామాబాద్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన స్నేహితులతో కలిసి పుష్కర స్నానం ఆచరించేందుకు గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని తుంగిని పుష్కర ఘాట్‌లో దామోదర తన స్నేహితులతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం మీడియా ఆయనను సంప్రదించగా.. గోదావరి పుష్కరాలపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి పుష్కర స్నానమని చెప్పడం గమనార్హం. -
టీఆర్ఎస్ సినిమా కొన్నిరోజులే..
జోగిపేట: ‘ఎన్నికల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రజలను మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.. టీఆర్ఎస్ సినిమా ఇక కొన్నిరోజులే’ అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ మండిపడ్డారు. శనివారం మెదక్ జిల్లా అందోల్ మండలం తాడ్మన్నూర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఏ పనులూ చేయలేదని, మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి.. నిలుపుకొనే పార్టీ అనీ, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గ్రామ పెద్దలు, ప్రజలు దామోదర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు ప్రభుత్వానికి బానిసలుగా మారొద్దని సూచించారు. జిల్లాలో ఐఏఎస్ అధికారుల నుంచి కిందిస్థాయి అధికారులను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అక్రమంగా కేసులు పెట్టొద్దు.. ఇది మంచి సంస్కృతికాదని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారుల బాధ్యతన్నారు. -
తెగిన అనుబంధం
వారిది అన్యోన్య దాంపత్యం.. భర్తే లోకంగా ఆమె, భార్యే ప్రపంచంగా ఆయన బతికారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా తనయ పుట్టింది. ప్రజాసేవకు అవకాశం కలసిరావడంతో ఆయన ప్రోత్సహించారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికై తమ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించేవారు. అయితే ఆ దంపతులపై విధి కన్నుకుట్టింది. వారం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకుని ఇంటికి బయలుదేరారు. మరి కాసేపటిలో ఇంటికి చేరుకుంటామనగా జరిగిన ప్రమాదంలో ఆమెను మృత్యువు కబళించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగిరి/ప్యాపిలి : వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ-1 సభ్యురాలు బోరెడ్డి శ్రీలత(26) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ వద్ద వారం కిందట జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి భర్తను డిశ్చార్జ్ చేసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు భర్తతో కలసి ఆమె ప్యాపిలిలో ఆటో ఎక్కారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో మార్గమధ్యంలోని బోమ్మిరెడ్డిపల్లె సమీపానికి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. సంఘటనలో శ్రీలత అక్కడికక్కడే మరణించారు. అదే ఆటోలోని భర్త గోపీనాథ్‌రెడ్డి, బావ రఘునాథరెడ్డి గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న వె ల్దుర్తి ఎస్ఐ నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చివరి చూపు కోసం.. తమ ప్రజాప్రతినిధి రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడినట్లు తెలియగానే ప్యాపిలి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. డోన్ ప్రభుత్వస్పాత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీలత భౌతికకాయాన్ని ప్యాపిలికి తీసుకురాగానే ఆమెను కడసారి చూసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్యాపిలి సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే రాజారెడ్డి పీఓ అంకిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా నారాయణమూర్తి, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బషీర్, సురేంద్ర, ఎస్కే వలి, రమణ తదితరులు శ్రీలతకు నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ అభిమానిగా.. ప్యాపిలికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోరెడ్డి శ్రీరామిరెడ్డి కుమారుడు గోపీనాథరెడ్డితో కర్ణాటకలోని బళ్లారి సమీపంలో గల కొర్లగొందికి చెందిన జ్యోతి, గోవిందరెడ్డి దంపతుల కుమార్తె శ్రీలత వివాహం ఏడేళ్ల కిందట అయింది. వారికి తనయ అనే కుమార్తె పుట్టింది. వారి కుటుంబం మొత్తం వైఎస్సార్ సీపీ అభిమానులే. ఆ అభిమానమే శ్రీలతను గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. ఆమె ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఎంపీపీ రేసులో ఉన్న ఆమెకు, రాజకీయ పరిస్థితులు అనుకూలించలేకపోయాయి. తనయను చూసి తల్లడిల్లి.. రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీలతకు రెండేళ్ల కుమార్తె తనయ ఉంది. ఆమెను తాత బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఎత్తుకుని బిగ్గరగా ఏడ్వడం అందరినీ కలచివేసింది. ఇక తన తల్లి రాదని తెలియని ఆ చిన్నారి బిత్తర చూపులు చూస్తుండగా, ‘కన్నా.. మీ అమ్మ ఇక రాదమ్మా’ అంటూ తాత ఆ పసి కూనను గుండెలకు హత్తుకోవడం అక్కడికి వచ్చిన వారి హృదయాలను బరువెక్కించింది. లతా.. ఒక్కసారి పలకవా.. తన కళ్లెదుటే భార్య రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలొదలడం చూసి శ్రీలత భర్త గోపీనాథరెడ్డి రోదించిన తీరు పిండేసింది. విగతజీవిగా మారిన భార్యను చూసి ఆయన ‘లతా.. ఒక్కసారి మాట్లాడవా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే.. ఒక్కదానివే ఎలా వెళ్లిపోయావురా.. ఇక మన బిడ్డ తనయకు దిక్కెవర్రా... ఆ బిడ్డ అమ్మేదని అడిగితే.. నేనేమని చెప్పగలనురా... అంటూ గోపీనాథరెడ్డి పిచ్చివాడిలా రోదించడం ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది. అతన్ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
మంచి ‘రోజ్’లెప్పుడో!
ప్రారంభం కాని రోజ్‌గార్డెన్ సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరాన అందమైన ‘రోజా పూల’ లోకాన్ని సృష్టించింది మహా నగరాభివృద్ధి సంస్థ. అయితే.. ఆ సుందర ప్రపంచాన్ని వీక్షించే అవకాశం జనానికి దొరకడం లేదు. నెక్లెస్ రోడ్‌లోని దామోదర సంజీవయ్య పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ గులాబీ నందన వనాన్ని (రోజ్ గార్డెన్) అద్భుతంగా తీర్చిదిద్దింది. వివిధ రంగుల్లో 612 రకాల ‘రోజా’లకు ఇక్కడ చోటు కల్పించారు. దేశవాళీ, హైబ్రీడ్‌లో దాదాపు అన్ని రకాల గులాబీలు ఈ గార్డెన్లో కొలువుదీరాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీన్, ఫ్లోరిబండాస్, రాంబ్లర్స్, క్రిపర్స్, స్క్రాబ్రోజ్స్, మినేజర్స్, గ్రౌండ్ కవర్ రోజెస్, మినీ ఫ్లోరిబండాస్ రకాలుకనువిందు చేస్తున్నాయి. సుమారు 12వేల మొక్కలతో అలరారుతోన్న రోజ్‌గార్డెన్‌లో ఇంజినీరింగ్ అధికారులు అందమైన ల్యాండ్ స్కేప్‌ను తీర్చిదిద్దడం అదనపు హంగుగా మారింది. దీని నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా అధికారికంగా ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాయంత్ర వేళల్లో సేదదీరేందుకు సంజీవ య్య పార్కుకు వచ్చే సందర్శకులు రోజ్ గార్డెన్ ఎంట్రీ ప్లాజా వరకు వెళ్లి... లోనికి అనుమతించకపోవడంతో ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ప్రశంసలు... రాజధాని నగరంలో అద్భుతమైన రోజ్గార్డెన్ను ఆవిష్కరించిందన్న కీర్తిని హెచ్ఎండీఏ దక్కించుకొంది. ‘ఇంటర్నేషనల్ రోజ్ గార్డెన్ సొసైటీ’ ప్రతినిధులు ఇటీవల ఈ గార్డెన్‌ను సందర్శించి హెచ్ఎండీఏపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలోనే ఇదో ‘బెస్ట్ గార్డెన్’గా ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ల్యాండ్ స్కేప్ పార్కుకు అదనపు హంగును అద్దిందని కొనియాడారు. ఈ గార్డెన్లో అందమైన గులాబీలతో పాటు వాటర్ ఫాల్స్, ఫౌంటెన్లు, శిల్పాలు, వాక్ వేలు వంటివి మరింత శోభను తీసుకొస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధం ‘రోజ్ గార్డెన్ ప్రాంభించేందుకు అన్ని ఏర్పాటు చేశాం. మొక్కదశలో పూలు రానందున ఎలా ప్రారంభించాలన్న మీమాంస తలెత్తింది. దీంతో ప్రారంభోత్సవాన్ని కొద్దికాలం వాయిదా వేశాం. ఇప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పూర్తిస్థాయిలో పూలు ఉన్నాయి.త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ప్రారంభించాకే సందర్శకులను అనుమతిస్తాం. - వి.కృష్ణ, బుద్ధపూర్ణిమ ఓఎస్డీ భవితవ్యం ఏమిటి? ఆకాశహర్మ్యాలతో హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో గల 96 ఎకరాల విస్తీర్ణంలోనూ అద్భుతమైన నిర్మాణాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... ఇప్పటికే రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోజ్‌గార్డెన్ (గులాబీ తోట) భవితవ్యం ఏమిటన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నిర్మాణం పూర్తయి 6నెలలు గడిచినా ఇంతవరకు అధికారికంగా ప్రారంభించకపోవడం సందేహాలకు తావిస్తోంది. -
'అహం, అహంకారం తప్ప సహనం లేదు'
హైదరాబాద్: తెలంగాణ సర్కారు పయనిస్తున్న దశాదిశ చూస్తే భయమేస్తోందని మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భవిష్యత్ లో తెలంగాణ యువత అజ్ఞాతంలోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాటాలు చేసే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి అహం, అహంకారం తప్ప ఓపిక, సహనం లేదని కేసీఆర్ ను విమర్శించారు. ఇలాంటి నేతను తెలంగాణ సమాజం ఊహించుకోలేదన్నారు. తెలంగాణ సమస్యలకు ఆంధ్రా పాలకులే కారణమనడం ఊతపదంగా మారిందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పెట్టుబడులన్నీ సీమాంధ్రులవి కావా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల సమస్యలపై ఇద్దరు సీఎంలు కూర్చుని ఎందుకు చర్చించుకోకూడదని రాజనర్సింహ అన్నారు. -
యువత దారి తప్పితే...
చిన్నప్పట్నుంచీ స్నేహితులైన ముగ్గురు యువకులూ, ముగ్గురు యువతులూ పై చదువుల కోసం నగరానికి వచ్చి ఒకచోట కలిసి ఉంటారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గున్నమామిడి కొమ్మ మీద’. విక్కీ, విజయ్, దామోదర్, ప్రియాంక, శిరీష, స్పందన నాయకా నాయికలు. అల్లీపురం దామోదర్ దర్శకత్వంలో కేశవ సిరి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘యువత దారి తప్పితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? అనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. వినోదం మాత్రమే కాదు.. యువతకు చక్కని సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ముస్తఫా, కెమెరా: సాయి, ఎడిటింగ్: కిశోర్. -
కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు?
ఎన్నికల సమయంలోను, అంతకుముందు ఉద్యమం చేస్తున్నప్పుడు తానిచ్చిన లెక్కలేనన్ని హామీలలో ఒక్కదాన్ని కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలబెట్టుకోలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మండిపడ్డారు. తెలంగాణకు దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. టీఎన్జీవోలకు సంబంధించి అసలు ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా లేవా అని ఆయన నిలదీశారు. ఇక తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటే కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయనేత కుంతియా అన్నారు. -
కోతల.. కూతల ప్రభుత్వం
అలంపూర్: టీఆర్ఎస్ కోతల.. కూతల ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతు ఘోషపట్టడం లేదన్నారు. అప్పులబాధతో ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. శుక్రవారం ఆయన దక్షిణకాశీ అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డులు, వృద్ధాప్య, వితంతువుల, వికలాంగుల పింఛన్లలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ఒక జిల్లాను సింగపూర్, మరో జిల్లాను మలేషియాలా, ఇంకొక జిల్లాను న్యూయార్క్‌లా మారుస్తానని మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి దశదిశా ఉందా..? అని ప్రశ్నించారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలు కేటాయిస్తామని చెప్పారని, వీటికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడున్నాయని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పట్ల ఒక్క మంత్రి కూడా స్పందించడం లేదన్నారు. కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని.. సభా మర్యాదలను పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యమపార్టీగా చెప్పుకుని టీఆర్ఎస్లోకి వలసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న వారిలో 30శాతం ఉద్యమకారులు ఉంటే 70 శాతం వలసవాదులే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు స్ఫూర్తిదాయమని, అలాంటి వారినే కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, అసలు సిద్ధాంతమే లేదన్నారు. ఆయన వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ నాయకులు ఉన్నారు. జోగుళాంబ మాతనే రాష్ట్రాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రాన్ని జోగుళాంబ మాతనే కాపాడాలని ప్రార్థించినట్లు మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు.దక్షిణకాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆయన శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్పర్సన్ లక్ష్మి అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు జరిపించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట మాజీ మంత్రులు ప్రసాద్, చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పీసీసీ నేతలు అద్దంకి ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
పాత నేరస్తుడే కిడ్నాపర్
విశాఖపట్నం: వారం రోజుల క్రితం చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి దామోదర్(9)ను కిడ్నాప్ చేసినవారిలో ఒకడు పాత నేరస్తుడేనని పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి బాలుడిని నిన్న సురక్షితంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు హాజరుపరిచారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులలో ఒకడు శ్రీకాకుళంకు చెందిన కింతాల కేశవరావు కాగా, రెండవవాడు విశాఖపట్నం చంద్రశేఖర్ అని చెప్పారు. వీరిలో కేశవరావు 2005లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని తెలిపారు. పోలీసులు చాలా కష్టపడి ఈ కేసుని ఛేదించినట్లు తెలిపారు. బాలుడు సురక్షితంగా దొరకడం తమ విజయంగా చెప్పారు. కిడ్నాపర్ల నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ** -
కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
వారం రోజుల ఉత్కంఠకు తెర పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పెందుర్తి : వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. దామోదర్(9) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కొరుబిల్లి దామోదర్ క్షేమంగా బయటపడ్డాడు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సోమవారం చాకచక్యంగా ఛేదించారు. దీంతో బాలుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. జరిగిందిదీ: చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు యామిని, దామోదర్ సంతానం. శ్రీనివాసరావు ఫైనాన్స్ వ్యాపా రం చేస్తున్నారు. గత సోమవారం రాత్రి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ స్థాని క వినాయక మండపం వద్దకు వచ్చిన సమయంలో కొందరు దుండగులు ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. బుధవారం ఉదయం శ్రీనివాసరావుకు కొత్తపాలెం సమీపంలోని కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసి రూ.30 లక్ష లు డిమాండ్ చేశారు. దీనిపై గత బుధవా రం సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పో లీసులు రంగంలోకి దిగారు. ఆరు రోజుల పాటు డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్, నార్త్ ఏ సీపీ సీ.ఎం నాయుడు జిల్లావాప్తంగా బృం దాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చాకచక్యంగా: ఈ కేసు ఛేదనలో పోలీసు లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. బాలు డ్ని అపహరించుకుపోయిన వారు తరుచూ కాయిన్బాక్స్ల నుంచి ఫోన్లు చేయడంతో నగరంలో ఉన్న కాయిన్బాక్స్ల వద్ద ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపాలపట్నం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల వద్దకు వచ్చిన ఓ కిడ్నాపర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు అతడ్ని పట్టుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిందితుడ్ని విచారించగా పెందుర్తి వుడా కాలనీ సమీపంలో రెల్లి కాలనీ కొండపై ఓ తాటాకుల పాకలో దామోదర్‌ను ఉంచినట్టు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు బాలుడ్ని గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో ఒకరు చింతలగ్రహారం వాసి కాగా, మిగిలిన వారు పెందుర్తి ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. తండ్రి ఆర్థిక లావాదేవీలే దామోదర్ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆనందోత్సాహాలు: వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న దామోదర్ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దామోదర్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. బాలుని తల్లి మాట్లాడుతూ కేసును ఛేదించిన పోలీసులకు, సహకరించిన మీడియాకు, ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు దామోదర్‌ను కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం బాలుడి తండ్రి శ్రీనివాసరావుతో కలసి డీసీపీ చింతలగ్రహారం వెళ్లారు. అక్కడ దామోదర్‌ను వారికి అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెల్లి కాలనీలోని ఓ పాకలో దామోదర్‌ను ఉంచడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ వారం రోజు ల పాటు కిడ్నాపర్లు పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించినట్టు గుర్తించారు. బాలుడికి ఆహారం కూడా పోలీస్‌స్టేషన్ సమీపంలోని దుకాణాల నుంచే తీసుకువెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసేందుకు మాత్రం గోపాలపట్నం వెళ్లేవారు. -
కిడ్నాపర్ల అరెస్ట్ : బాలుడు సురక్షితం
-
కిడ్నాపర్ల అరెస్ట్ : బాలుడు సురక్షితం
విశాఖపట్నం: ఎనిమిది రోజుల క్రితం కిడ్నాప్ అయిన దామోదర్ అనే బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులకు నిద్రలేకుండా చేసిన కిడ్నాపర్లను పట్టుకున్నారు. పోలీసుల వ్యూహం ఫలించింది. బాలుడు సురక్షితంగా ఉన్నాడు. గోపాలపట్నంలో కాయిన్ బాక్స్ వద్ద ఫోన్ చేస్తుండగా ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్కి తరలించారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు యమున అనే కుమార్తె, దామోదర్(9) అనే కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. దామోదర్ పెందుర్తి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దగ్గర కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకుంటే దామోదర్‌ను చంపుతామంటూ బెదిరించారు. ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 310 మంది పోలీసులు, 20 బృందాలుగా ముమ్మర గాలింపు చేపట్టారు. శివారు ప్రాంతంలో తనిఖీలు చేశారు. కాయిన్ బాక్సుల వద్ద నిఘాపెట్టారు. పోలీసులు ఊహించినట్లే ఇద్దరు కిడ్నాపర్లు ఈ రోజు గోపాలపట్నంలో కాయిన్ బాక్స్ వద్ద దొరికారు. ** -
తొమ్మిదేళ్ల బాలుడు కిడ్నాప్
చింతలగ్రహారంలో ఘటన కిడ్నాపర్ల నుంచి తండ్రికి ఫోన్.. రూ.30 లక్షలు డిమాండ్ పెందుర్తి: పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఓ బాలు డు కిడ్నాపయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు కుమార్తె యమున, కుమారుడు దామోదర్(9) సంతానం. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. దామోదర్ స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దరి కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్ వ చ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని..లేకుంటే మీ కుమారిడ్ని చంపుతామంటూ బెదిరించారు. ఆయా ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు.పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి కేసును అత్యంత వేగంగా ఛేదిస్తామని నార్త్ ఏసీపీ సీఎం నాయుడు విలేకరులకు చెప్పారు. నాలుగు బృందాలతో ముమ్మర గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ వెనుక ఆర్థిక పరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వివాదాలు లేవని తండ్రి చెబుతున్నా ఈ వ్యవహారంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఆస్తి అమ్మకంలో శ్రీనివాసరావు వద్ద కొంత మొత్తం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం తెలిసిన ఎవరైనా దామోదర్‌ను కిడ్నాప్ చేశారా అని అనుమానిస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్.. 30 లక్షల డిమాండ్
అభం శుభం ఎరుగని తొమ్మిదేళ్ల బాలుడు విశాఖపట్నంలో కిడ్నాప్ అయ్యాడు. దామోదర్ అనే ఈ బాలుడిని కిడ్నాప్ చేసినవాళ్లు తల్లిదండ్రులను రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని చింతల అగ్రహారం గవరకాలనీకి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారి కొడుకు దామోదర్.. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మేడ మీద నుంచి కిందకు దిగి వెళ్లాడు. తర్వాత ఎంతకీ పైకి రాకపోవడంతో పిల్లాడు కనిపించడం లేదని పోలీసులకు పెందుర్తి పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే.. ఆ తర్వాత తండ్రి ఫోన్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రూ. 30 లక్షలు ఇస్తేనే పిల్లాడిని విడిచిపెడతానంటూ డిమాండ్ చేశాడు. దాంతో పోలీసులు ఈ కేసును కిడ్నాప్ కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. దామోదర్ తండ్రి తనకు వచ్చిన ఫోన్ కాల్‌ను రికార్డు చేయడంతో.. ఆ కాల్ ఎక్కడినుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. తండ్రిది ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఆర్థిక లావాదేవీలు, తగాదాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లలో తీర్చాల్సిన వాళ్లు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోననే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రచారం
సంగారెడ్డి మున్సిపాలిటీ : మెదక్ ఉప ఎన్నికలను మాజీ డిప్యూటీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంగారెడ్డి నియోజక వర్గ ప్రచార బాధ్యత దామోదర పైనే ఉంచడంతో ఆయన మరింత బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పాటు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండడంతో దామోదర సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో కార్యకర్త్తలున్నా, నాయకులు లేకపోవడంతో ప్రచారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ జగ్గారెడ్డి వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట మండల, పట్టణ సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. సదాశివపేటలో పార్టీకి ప్రజలకు సన్నిహిత సంబంధాలున్న మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణతో పాటు రామాగౌడ్లను పార్టీలో చేర్చుకొని పార్టీకి దూరమైన వారిని చే రదీశారు. ఇదే వ్యూహంతో సంగారెడ్డిలో సైతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రయత్నాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అనుచరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ బీజేపీలో చేరకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా దామోదర ఒప్పించారు. మైనార్టీ వర్గాల ఓట్లపై ప్రభావం చూపే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సాబెర్ కూడా కాంగ్రెస్‌ను వీడకుండా బుజ్జగించారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోరిక మేరకు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు వంటి వాటిలో పాల్గొంటూ వారిని ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికి సంగారెడ్డి మండలంతో పాటు మున్సిపల్ పరిధిలోని మెజార్టీ వార్డులలో ప్రచారం పూర్తిచేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనే అభ్యర్థి అనే భావంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు సాధించాలనే పట్టుదలతో దామోదర అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని కేడర్‌కు నూరిపోస్తున్నారు. -
కేసీఆర్ మాయల మరాఠీ
సంగారెడ్డి రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని మాజీ డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతానన్న కేసీఆర్, హామీలు నెరవేర్చకుండా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం సంగారెడ్డి మండలంలోని కంది, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జుల్కల్లో నిర్వహించిన బహిరంగ సభలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటు, రుణమాఫీపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు అడిగిన రైతులపై లాఠీచార్జి చేయించారన్నారు. అందువల్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతాలకా్ష్మరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, తెల్ల రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, మాయమాటలు చెబుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వంద రోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకోసం చేతి గుర్తుకు ఓటువేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, మహబూబ్‌పాషా, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ లోకసభ టికెట్ రేసులో నేనున్నా: సర్వే
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల్లో రేసు మొదలైంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ రేసులో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటికి సిద్దంగా ఉన్నామంటూ అధిష్టానానికి సంకేతాలిచ్చారు. అయితే తాజాగా మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఓటమి పాలైన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూడా మెదక్ లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ టికెట్ రేసులో నేనున్నా అంటూ సర్వే సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. హైకమాండ్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మాజీ మంత్రి సర్వే అన్నారు. -
ఆ టికెట్ ఎవరిదో?
మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావాహులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సముఖత వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ను ఆయన కోరినట్టు తెలిసింది. అయితే టీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. ఒకవేళ పోటీకి కోదండరాం నిరాకరిస్తే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్జీఓస్) అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావు ముందుకు వచ్చారు. సోనీ ట్రావెల్స్ అధినేత కే. ప్రభాకర్ రెడ్డి, మహిధర కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ ప్రశాంత్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పేరు వినబడుతోంది. ఎం రఘనందన్ కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ ఉప ఎన్నికలో ఎవరెవరు బరిలో ఉంటారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. -
‘అందోల్’లో దామోదర్ దే రికార్డు
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.దామోదర రాజనర్సింహ కాగా అతితక్కువ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 1999 సాధారణ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి బాబూమోహన్ చేతిలో 513 ఓట్లతో దామోదర ఓటమి చెందగా 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్‌ను 24,846 ఓట్ల మెజార్టీతో ఓడించారు. అప్పట్లో దామోదరకు 67,703 ఓట్లు రాగా బాబూమోహన్‌కు 42,857 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో బాబూమోహన్ 2906 ఓట్లతో ఓటమి చెందగా 2014 ఎన్నికల్లో 3208 ఓట్లతో దామోదర రాజనర్సింహ ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో బాబూమోహన్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీదేవి 19,985 ఓట్లతో బస్వమాణయ్యపై, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ, లక్ష్మణ్‌కుమార్‌పై 13,901 ఓట్లతో, 1978లో రాజనర్సింహ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సదానంద్‌పై 738 ఓట్లతో, 1983లో లక్ష్మణ్ జీ స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరీ బాయిపై 10,515 ఓట్లతో, 1985లో దేశం అభ్యర్థి ఎం.రాజయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజనర్సింహపై 16,463 ఓట్లతో, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్యపై 3014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1998 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాబూమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదరపై 10,554 ఓట్లతో గెలుపొందారు. అందోల్ అసెంబ్లీకి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు వెయ్యిలోపు, మూడు సార్లు 3వేల ఓట్లతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి డిమాండ్ మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: ఖరీప్ సీజన్ దగ్గరపడుతుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలకోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. -
జోగిపేట నగర పంచాయతీ పీఠం దక్కేదెవరికో!
జోగిపేట,న్యూస్‌లైన్ : జోగిపేట నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులను గెలుచుకోగా, టీఆర్ఎస్ 4, టీడీపీ 2, బీజేపీ ఒక అభ్యర్థి గెలుపొందారు. చైర్పర్సన్ రేసులో మాత్రం ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కవిత సురేందర్ గౌడ్, శోభా నారాయణ గౌడ్, ప్రవీణ రామాగౌడ్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ధైర్యంగా తనకు చైర్పర్సన్ పదవి కావాలంటూ అడగలేకపోతున్నారు. మొదటినుంచి కవిత సురేందర్ గౌడ్ చైర్పర్సన్ తానే నంటూ ప్రచారం చేసుకున్నా, పార్టీలో తానే సీనియర్‌నని తనకే అవకాశం ఇవ్వాలని డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్.నారాయణ గౌడ్ తన భార్య కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీపీ రామాగౌడ్ కూడా చైర్పర్సన్ పదవిని ఆశించి తన భార్యను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. ఆయన కూడా తన సన్నిహితులతో ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న శోభ, ప్రవీణ తోటికోడళ్లు కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేట నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువ రావడంతో దామోదర రాజనర్సింహ స్థానిక నాయకులపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నాయకుల అసమర్థత కారణంగానే స్థానికంగా పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత మున్సిపల్ ఎన్నికల నూతన పాలకవర్గాల ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. ఈ ముగ్గురితో పాటు పట్టణానికి చెందిన మరో మహిళ అభ్యర్థి కూడా చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. దామోదర మదిలో ఎవరో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయాన్ని ఊహించడం కష్టమని చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎవరిని చైర్‌పర్సన్‌గా ఎన్నిక చేస్తే బాగుంటుందనే విషయంపై ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఎప్పటిలాగే సీల్డ్ కవర్లో పంపుతారా? లేక ముందుగానే ప్రకటిస్తారో తెలియడంలేదు. ఏది ఏమైనప్పటికీ దామోదర నిర్ణయించిన అభ్యర్థే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రయత్నాలు జోగిపేట పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థి చైర్పర్సన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చైర్పర్సన్ ఎన్నికకు సరిపోను వార్డు సభ్యులు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల వార్డు సభ్యులు ఎంత వరకు సహకరిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. -
గాంధీభవన్‌లో మళ్లీ రెచ్చిపోయిన కార్యకర్తలు
హైదరాబాద్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తల మధ్య రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలే కారణమంటూ కార్యకర్తలు మరోసారి విరుచుకుపడ్డారు. దాంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అనుచరులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు నిన్న ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది. పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్‌లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు. -
సిగ్గులేకుండా ఎందుకొచ్చారు?
మీ వల్లే పార్టీ నాశనమైంది.. మా నోట్లో మట్టికొట్టారు పొన్నాల, దామోదర్, ఉత్తమ్‌పై కార్యకర్తల ఫైర్ తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి టీపీసీసీ నేతలను తూర్పారబట్టిన పార్టీ వర్గాలు కార్యకర్తల తిట్ల ధాటికి తలవంచుకుని జారుకున్న నేతలు హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది. పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్‌లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు. అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసేందుకు పొన్నాల ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో మంగళవారం అందుబాటులో ఉన్న టీపీసీసీ ముఖ్య నేతలు సమావేశ మయ్యారు. ఉత్తమ్, దామోదరతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రేణుకా చౌదరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. టీపీసీసీ తీర్మానాన్ని దామోదర రాజనర్సింహ చదివి విన్పించగా.. మిగిలిన వారు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శులు బొల్లు కిషన్, బొట్టు వెంకన్న, జ్ఞానసుందర్ తదితరులు లేచి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వేదికపైనున్న నేతలు మైకు ఇవ్వకుండా సమావేశం ముగిసినట్లు ప్రకటించి వేదిక దిగబోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘‘మీవల్లే కాంగ్రెస్ నాశనమైంది. ముమ్మాటికీ నాయకత్వ లోపమే. ఈ వాస్తవాన్ని మీరేందుకు ఒప్పుకోవడం లేదు? పాతికేళ్లుగా పార్టీని నమ్ముకుని రక్తం ధారపోసిన మా నోట్లో మన్నుకొట్టారు. తెలంగాణ ఇచ్చినా జనంలోకి వెళ్లలేక పార్టీని సర్వనాశనం చేశారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఘోరంగా ఓడిపోయిన పొన్నాల ఆ పదవిలో ఉండటానికి వీల్లేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉంటూ సొంత జిల్లాకే పరిమితమైన దామోదర రాజనర్సిహ... తనకు, తన భార్యకే టికెట్లు తెచ్చుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. దీంతో ఖిన్నులైన టీపీసీసీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. వారిని చుట్టుముట్టిన కార్యకర్తలు.. పొన్నాల, దామోదర, ఉత్తమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేణుకాచౌదరి, పొంగులేటి తదితరులు వారిని బుజ్జగించేందుకు య త్నించినా ఫలితం లేకపోయింది. ఒకదశలో ఆ ముగ్గురు నేతలను ఉద్దేశించి పత్రికలో రాయలేని పదాలతో తిట్ల దండకం చదివారు. అయినప్పటికీ చేసేదేమీ లేక పొన్నాల, దామోదర సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం వారి వెంట బయటకు వచ్చి తీవ్ర పద జాలాన్ని ఉపయోగిస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఒక దశలో సహనం కోల్పోయిన దామోదర అక్కడి వారిపై రుసరుసలాడారు. ‘ఏం కిషన్.. మీడియా ముందు హీరో కావాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పో..’ అని వ్యాఖ్యానించారు. ‘అవసరం తీరాక ఇట్లనే ఉంటుంది. నువ్వు దళితుడివై ఉండి సాటి దళితుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? మేం టికెట్ అడిగితే మమ్మల్ని కాదని పార్టీకి సంబంధం లేని అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇప్పించుకున్నవ్. నీలాంటోడివల్లే పార్టీ నాశనమైంది’ అని అక్కడి నేతలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. అదే సమయంలో కొందరు నగర కార్యకర్తలు మాజీ మంత్రి దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న దానం అనుకూలవర్గం వారిపై దాడికి దిగింది. పరిస్థితి ఉద్రిక్తమవుతుందని గ్రహించిన టీపీసీసీ ముఖ్యులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం కిషన్, జ్ఞాన సుందర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. పొన్నాల, దామోదర, ఉత్తమ్ తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు.. పార్టీ కార్యకర్తలకు ఎలా మనోధైర్యాన్నిస్తారని ప్రశ్నించారు. కార్యకర్తల ఆవేదనకు అర్థముంది: పొంగులేటి కార్యకర్తల ఆవేదనలో అర్థముందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. పదేళ్లుగా కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే పార్టీ ఓడిపోయిందన్నారు. ఓటమికి తామంతా సమష్టి బాధ్యత వహించడంతోపాటు కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యకర్తల ఆవేదనను అర్ధం చేసుకున్నామని, ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి అన్నారు. నోరు మెదపని పొన్నాల గాంధీభవన్‌లో జరిగిన ఘటనపై మాట్లాడేందుకు పొన్నాల లక్ష్మయ్య నిరాకరించారు. ఎన్నికల ఫలితాలపై జూన్ మొదటి వారం నుంచి జిల్లాలవారీగా సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు. హంగ్ నెలకొన్న మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లను కైవసం చేసుకునేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించామన్నారు. డీకే అరుణకు మహబూబ్‌నగర్, రాజనర్సింహకు మెదక్, సబితా ఇంద్రారెడ్డికి మెదక్ జెడ్పీ చైర్మన్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. ఓటమికి టీపీసీసీదే ఉమ్మడి బాధ్యత సోనియా, రాహుల్ నాయకత్వంలోనే పనిచేస్తాం టీపీసీసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ఉమ్మడిగా బాధ్యత వహిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పేర్కొంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చేసిన రాజీనామాలను తిరస్కరిస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సోని యా, రాహుల్ నాయకత్వంలోనే పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో మంగళవారం గాంధీభవన్‌లో అందుబాటులో ఉన్న టీపీసీసీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి కె.జానారెడ్డి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, అమోస్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధాకరమైనప్పటికీ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రాజనర్సింహ టీపీసీసీ రూపొందించిన తీర్మానాన్ని చదివి విన్పించగా నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం సారాంశమిదే... ‘‘2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాజీనామాకు సిద్ధపడటాన్ని మన్మోహన్సింగ్ సహా సీడబ్ల్యూసీ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఓటమికి ప్రభుత్వపరంగా బాధ్యత తీసుకుంటానని మన్మోహన్సింగ్ చెప్పడాన్ని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ టీపీసీసీ తీర్మానించింది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్టీని తిరిగి బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది. రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. తెలంగాణలో పార్టీ ఓటమికి తనదే బాధ్యతగా పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. అయితే దేశంలో ఏర్పడిన రాజకీయ కారణాల వల్లే పార్టీ ఓటమి పాలైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రాథమికంగా అంచనా వేస్తూ అందుకు ఉమ్మడి బాధ్యత స్వీకరిస్తుంది. భవిష్యత్తులో సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, రాహుల్‌గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజాపక్షాన నిలబడాలని టీపీసీసీ తీర్మానించింది’’ -
మట్టి కరిచిన దిగ్గజాలు
కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ * పరాజితుల్లో డీఎస్, పొన్నాల, దామోదరతోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు *ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకూ *షాక్ ఇచ్చిన ఓటర్లు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేతలు ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థులతో పాటు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, పార్టీ మాజీ అధ్యక్షుడు, మంత్రుల వంటి పలువురు ఓడిన వారిలో ఉన్నారు. టీఆర్ఎస్ దెబ్బకు హేమాహేమీలు సైతం కొట్టుకుపోయారు. జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయ్యాయి. అధికారంలోకి రాకున్నా... మెజారిటీ దగ్గరలోకి వస్తామని భావించిన కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. పరాజయంపాలైనవారిలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతోపాటు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, విజయశాంతి, సురేష్‌రెడ్డి, జగ్గారెడ్డి, జయసుధ, ముఖేష్‌గౌడ్, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు, సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, షబ్బీర్ అలీ, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు పార్లమెంట్ కు పోటీ చేసిన జైపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజగోపాల్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు ఉన్నారు. ఇతర పార్టీల్లో కూడా.. ఇతర పార్టీల్లో కూడా కొందరు ప్రముఖులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఈసారి ఓడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆయన పరాజయం చవిచూశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి కూడా ఓట మిని చవిచూశారు. టీఆర్ఎస్ తరఫున నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మందా జగన్నాధం కూడా ఓటమిపాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ప్రముఖుల్లో తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సీహెచ్ విద్యాసాగర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి వంటివారు ఓటమి చవిచూశారు. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న నాగం జనార్దన్‌రెడ్డికి కూడా ఈసారి భంగపాటు తప్పలేదు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని వదిలి పెట్టి బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. నారాయణ.. నారాయణ.. ఖమ్మం లోక్‌సభకు పోటీ చేసిన సీపీఐ నేత కె.నారాయణ పరాజయం పాలయ్యారు. కనీసం రెండో స్థానం కాకుండా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పోలింగ్ ముగిసిన ఆయన సీపీఎంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్కడు.. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన దొంతు మాధవరెడ్డి విజయదుందుభి మోగించారు. తెలంగాణలో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచింది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి తిరిగి రద్దు చేయడంతో మాధవరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 19 వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కత్తి వెంకటస్వామి ఇక్కడ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. నోటాకు ఓటు.. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంట్ స్థానంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భువనగిరి, నల్లగొండ, మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, వరంగల్ వంటి స్థానాల్లో సుమారు 10 వేలకు పైగా ఓట్లు నోటాకు పడ్డాయి. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 1592 మంది ఓటర్లు నోటా మీట నొక్కారు.