సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్ | medak sp sumathi working like TRS worker: rajanarasimha | Sakshi
Sakshi News home page

సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్

Published Wed, Feb 10 2016 12:47 PM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్ - Sakshi

సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్

మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ సుమతి టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నిష్పాక్షికంగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీపీసీసీ సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలోకి దించింది. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement