మగాడంటే.. మాట మీద నిలబడాలి | Damodar rajanarsimha fires on kcr | Sakshi
Sakshi News home page

మగాడంటే.. మాట మీద నిలబడాలి

Published Mon, May 30 2016 6:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మగాడంటే.. మాట మీద నిలబడాలి - Sakshi

మగాడంటే.. మాట మీద నిలబడాలి

కేసీఆర్ పై దామోదర ధ్వజం

 టేక్మాల్: ‘మగాడంటే.. మాట మీద నిలబడాలె. నపుంసకుడిలా మాటలు మారుస్తూ కాలం గడిపేయడం సరికాదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ దర్గాలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.

మోసగాని చేతిలో తెలంగాణను పెట్టారని, టీఆర్‌ఎస్ పాలనలో అధికారులు బానిస బతుకులు బతుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 1,500 మంది రైతులు మరణించినా, ఏ ఒక్కరోజు కూడా వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement