తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో లబ్ది పొందుతున్నది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, కూతురికి కేంద్ర మంత్రి పదవి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు, వారసత్వంగా కొడుకు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ విమర్శించారు.
అల్లాదుర్గం (మెదక్) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో లబ్ది పొందుతున్నది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, కూతురికి కేంద్ర మంత్రి పదవి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు, వారసత్వంగా కొడుకు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ విమర్శించారు. అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాజ్యంగా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత నిరంతరం పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకుంటే, కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తూ ఫలితం పొందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, లేకుంటే మెడ కోసుకుంటానన్న కేసీఆర్ అధికారం రాగానే ఇచ్చిన మాట మర్చిపోయారని ఎద్దేవా చేశారు.