rampur
-
గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’
లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది. యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్‌ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.దీంతో ఆయన రాంపూర్ మార్కెట్లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది. తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది. ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన -
మాజీ ఎంపీ జయప్రదకు షాక్
-
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
కోటాలో రాలిన మరో విద్యా కుసుమం.. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని..
కోటా(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్జోత్ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్’ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్జోత్కు అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు. విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్జోత్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు. మన్జోత్ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. -
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు భారీ ఊరట
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్‌వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు. అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది. కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్‌పై రాంపూర్‌లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్‌ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్‌పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది. చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం -
ఆ కత్తి.. ఒక కూడలి !
రామ్‌పూర్ (యూపీ): 1980 నాటి బాలీవుడ్ సినిమాల్లో రామ్‌పూర్ కత్తి అంటే ప్రేక్షకులకి ఒక పిడిబాకే. ఆ కత్తితో చేసే విన్యాసాలు హడల్ పుట్టించేవి. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఒకప్పుడు కత్తులకు, కటార్లకు బాగా ఫేమస్. అత్యంత నాణ్యమైన కత్తులు లభించేవి. ఫోల్డబుల్ కత్తులు ఎవరికైనా కావాలంటే రామ్‌పూర్ వెళ్లవలసిందే. ఎప్పుడైతే చైనా మార్కెట్ భారత్‌ను ముంచేసి తక్కువ ధరకే చాకులు లభ్యమయ్యాయో ఈ రామ్‌పూర్ చాకుల్ని జనం కొనడం మానేశారు. అయినప్పటికీ దానికుండే క్రేజ్ దానికి ఉంది. అందుకే రామ్‌పూర్ అధికారులు నైనిటాల్ నుంచి రామ్‌పూర్‌కు వచ్చే మార్గంలో ఒక కూడలిలో ఈ కత్తిని ఏర్పాటు చేశారు. దానికి రామ్‌పూర్ చాకు చౌక్ అని పెట్టారు. దాదాపుగా 20 అడుగుల ఎత్తైన రామ్‌పూర్ కత్తి ఇప్పుడు ఠీవీగా కనిపిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఈ కత్తి పేరు చెబితే హడలిపోయేవారే ఇప్పుడు దానినొక కళాకృతి కింద చూడడం విశేషం. -
అతని ఆట ఇక ముగిసింది: జయప్రద
లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని, చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది. చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె. ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన. -
రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్
మోరాదాబాద్: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలకు మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్, ఆయన కుటుంబం దూరం అయ్యింది. 1977 నుంచి ఈ నియోజకవర్గం ఖాన్ ఇలాకాగా రామ్‌పూర్ విరజిల్లుతోంది. అయితే.. విద్వేషపూరిత ప్రసంగం కేసులో.. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మూడేళ్ల శిక్ష పడింది అజామ్ ఖాన్‌కి. దీంతో.. ఆయన శాసన సభ సభ్యత్వం కోల్పోవడంతో రామ్‌పూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అజామ్ ఖాన్ భార్య తంజీన్ ఫాతిమాగానీ, ఆయన కోడలుగానీ బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ, ఎస్పీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసీమ్ రజా ఖాన్‌కు టికెట్ కేటాయించింది. రజా ఖాన్, అజామ్ ఖాన్‌ను అత్యంత సన్నిహితుడు. గతంలో ఆజామ్ ఖాన్ తన పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిగా రజా ఖాన్ పోటీ చేశారు. అయితే.. బీజేపీ ఘనశ్యామ్ లోథి చేతిలో ఓడిపోయారు. రామ్‌పూర్ నియోజక వర్గానికి 1997 నుంచి 2022 దాకా మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో.. పదిసార్లు ఆయన గెలుపొందారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. గతంలో అజామ్ ఖాన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఆ సమయంలో ఆయన భార్య తంజీన్ ఫాతిమా పోటీ చేసి.. గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సమాజ్‌వాదీ పార్టీ మొండి చేయి చూపించింది. అజామ్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబం న్యాయపరమైన కేసులు ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజామ్ ఖాన్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే కుట్రకు పాల్పడిన అభియోగాలపై ఆజామ్ ఖాన్ భార్య, ఆయన తనయుడిపై కేసు నమోదు అయ్యింది కూడా. ఇక బీజేపీ తరపున ఇక్కడ ఆకాశ్ సక్సేనా బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆకాశ్ పోటీ చేసి.. ఆజామ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. -
Bypoll Results 2022: ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
-
వైరల్: డాక్టర్ చెంప చెళ్లుమనిపించిన నర్సు..
-
వైరల్: డాక్టర్ చెంప చెళ్లుమనిపించిన నర్సు..
లక్నో: మహమ్మారి కరోనా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓవైపు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, మరోవైపు ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు విడుస్తున్న విషాద ఘటనలు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అనేక మంది ఫ్రంట్‌లైన్ వారియర్లు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు కరోనా కల్లోల పరిస్థితులు చూసి ఉద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ డాక్టర్, నర్సు ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రకారం... వైద్యుడికి వద్దకు వచ్చిన నర్సు ఏదో విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో విచక్షణ కోల్పోయిన సదరు నర్సు.. డాక్టర్‌పై చేయిచేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న డాక్టర్ సైతం వెంటనే స్పందించి, ఆమెను తిరిగి కొట్టారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్ రాంజీ మిశ్రా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘వారిద్దరితోనూ మాట్లాడాను. తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారు. ఏదేమైనా ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇక సోమవారం నాటి ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఓ పేషెంట్‌కు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,23,144 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, 2812 కరోనా మరణాలు సంభవించాయి. అయితే, 219272 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది. -
రాంపూర్ జిల్లాలో శివసేన కార్యకర్త దారుణ హత్య
రాంపూర్ : శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లోని జ్వాలానగర్‌లో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే శర్మను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. శర్మ నిన్న రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. కాగా శర్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. (పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య) -
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
లక్నో: సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా గతంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్ జారీ చేసింది. కాగా ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. A non bailable warrant has been issued by a Rampur court against veteran actor and BJP leader Jaya Prada in a violation of model code of conduct case of 2019. Next hearing is on April 20. (file pic) pic.twitter.com/CA3xesRwlU — ANI UP (@ANINewsUP) March 7, 2020 -
‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’
లక్నో : తనను అకారణంగా వేధిస్తున్నారని ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ ఎన్నికల ప్రచార సభలో గగ్గోలు పెట్టిన క్రమంలో ఆయన ప్రత్యర్థి, బీజేపీ నేత జయప్రద స్పందించారు. ఆజం ఖాన్ కారణంగా మహిళ కంటతడి పెట్టిన ఫలితమే ఇదని ఆమె మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రతిసభలో ఏడుస్తున్నారు. తనను ఆయన మంచి నటినంటూ ఎద్దేవా చేసేవారు..ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని జయప్రద ఆక్షేపించారు. రాంపూర్‌లో బీజేపీ తరపున ఎంపీగా జయప్రద పోటీచేసిన క్రమంలో ఆమెపై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ తన రాజకీయ కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించారని గతంలో జయప్రద ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్‌ను ఈనెల 5న సిట్ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయని ఆయన వాపోతున్నారు. ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై 80కి పైగా కేసులు నమోదయ్యాయి. -
22 కిలోల బరువు తగ్గాను : ఆజంఖాన్
రాంపూర్ : తనపై అక్రమంగా నమోదైన క్రిమినల్ కేసుల కారణంగా 22 కిలోల బరువు తగ్గినట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున ఆజంఖాన్ భార్య ఫాతిమా బరిలో నిలిచారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆజంఖాన్ తన ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. తాను ఎదుర్కొంటున్న కేసుల గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తను ప్రజల కోసం, సమాజం కోసం మాత్రమే పనిచేశానని తెలిపారు. ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు తనపై క్రిమినల్ అని ముద్ర వేశారని విమర్శించారు. జీవితంలో చాలా చూశానని చెప్పిన ఆజంఖాన్.. ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదని అన్నారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, పిల్లల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కిలో బరువు పెరగలేదని.. కానీ 22 కిలోలు తగ్గానని వ్యాఖ్యానించారు. కాగా, ఆజంఖాన్‌పై ల్యాండ్ మాఫియాకు సంబంధించి పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆజంఖాన్‌ను 2.30 గంటల పాటు విచారించింది. ఈ కేసుల తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 29కి వాయిదా వేసింది. -
జయప్రద వర్సెస్ డింపుల్!
లక్నో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్.. అదే స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన.. డింపుల్‌ను ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్‌లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు. అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 14 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద అనంతరం బీజేపీలో చేరి ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్‌ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు. -
‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’
లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి అజంఖాన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈయన ఈవ్యాఖ్యల చేశారు. కాగా వీవీప్యాట్లు,ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇదివరకే తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈవీఎంలను టాపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తేల్చిచెప్పింది. కాగా తాము ఓడిపోతే దానికి ఈవీంలే కారణమంటూ ఇటీవల బీస్పీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యూపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప్డడారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్‌లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు. -
వెండితెర రాణి.. వివాదాల రాజు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక రాంపూర్ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిరోజూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్‌రే నోరారా పొగిడిన భూలోక సుందరి (ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్) జయప్రద ఇక్కడి నుంచే పోటీ చేయడం రాంపూర్ ప్రత్యేకత. మరో అంశం.. స్త్రీలపై అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల వ్యవస్థనే కించపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ వ్యవహార శైలి కూడా రాంపూర్ నియోజకవర్గానికి మరో రకమైన అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఒకనాటి అన్నాచెల్లెలు బం«ధానికి ప్రతీకగా ఉన్న రాంపూర్.. ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. హోరాహోరీ ఎన్నికల పోరులో తాడోపేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఇటు బీజేపీ, అటు ఎస్పీ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే రాంపూర్ పోరులో మాత్రం పార్టీల కంటే పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో రాంపూర్ నియోజకవర్గంపై రాజకీయ నిపుణులు, విశ్లేషకులు దృష్టి సారించారు. పదకొండు సార్లు ముస్లింలకే పట్టం 1957లో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు, బీజేపీ మూడుసార్లు, ఎస్పీ రెండుసార్లు గెలిచాయి. భారతీయ జనతాదళ్ ఒకసారి (1977)లో గెలిచింది. మొత్తం 11 సార్లు ముస్లిం అభ్యర్థులే ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మహిళలకు సైతం నాలుగు సార్లు పట్టం కట్టారు. ఈసారి కూడా ‘సన్ ఆఫ్ ద సాయిల్’ ఆజంఖాన్‌కు గట్టిపోటీ ఇస్తూ, దక్షిణ భారత చిత్రసీమను ఏలిన ఒకనాటి అందాలతార జయప్రద ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎస్పీ నుంచి ఆజంఖాన్, కాంగ్రెస్ నుంచి సంజయ్ కపూర్ (బిలాస్పూర్ ఎమ్మెల్యే) పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ నాటి మిత్రులూ, నేటి బద్ధ శత్రువులైన జయప్రద – ఆజంఖాన్ మ«ధ్యనే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో కొద్దిలో గెలిచిన బీజేపీ ఈ లోక్‌సభ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో రెండు కాంగ్రెస్, రెండు ఎస్పీ, ఒకటి బీఎస్పీ ప్రాతినిధ్యంలో ఉన్నాయి. జయప్రద గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో జయప్రద బీఎస్పీ టికెట్‌పై రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రత్యర్థి ఆజంఖాన్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ నేపాల్ సింగ్, 2014లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నజీర్ అహ్మద్‌ఖాన్‌పై, 23 వేల స్వల్ప ఆధిక్యతతో గెలవగలిగారు. గత ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎస్పీ, బీఎస్పీ పొత్తుపెట్టుకుని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆజంఖాన్‌ని పోటీకి దింపాయి. వైరం ఎక్కడ మొదలైంది? పదిహేనేళ్ల క్రితం జయప్రదను ముంబై నుంచి రాంపూర్‌కి రప్పించిన వ్యక్తి, సమాజ్‌వాదీ పార్టీకి పరిచయం చేసిన మిత్రుడు ఈ రోజు ఆమెకు బద్ధ శత్రువుగా ఎలా మారిపోయాడన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తనను నాడు పరిచయం చేసిన ఆజంఖాన్‌ను జయప్రద గౌరవంగా అన్నా అని సంబోధించే వారు. ఆయనను గురువుగానూ భావించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉండగా ఆజంఖాన్ – అమర్‌సింగ్ మధ్య తలెత్తిన వైషమ్యాల సందర్భంగా జయప్రద అమర్‌సింగ్ పక్షం వహించడం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. అప్పటి నుంచి ఒకనాటి మిత్రులు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తదనంతర పరిణామాల్లో అమర్‌సింగ్, జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 ఎన్నికల్లో బిజ్నోర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరఫున పోటీ చేసి జయప్రద ఓడిపోయారు. ఆజంఖాన్కిది అలవాటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండటం ఆజంఖాన్ నైజం. అయితే ఈసారి జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల కారణంగా 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆజంఖాన్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే గతంలో సైతం తన చిత్రాలను మార్ఫింగ్ చేశాడంటూ ఆజంఖాన్‌పై జయప్రద ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు సైతం ఆమెపై వ్యక్తిగతంగా చౌకబారు వ్యాఖ్యలు చేయడం మరోమారు ఆజంఖాన్‌ని అభాసుపాలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమెపై ఆజంఖాన్ ‘పదిహేడేళ్లుగా చూసినా మీకర్థం కాని విషయం నాకు 17 రోజుల్లోనే అర్థమైంది. జయప్రద ఖాకీ నిక్కరు ధరించింది’ అంటూ అంతర్లీనంగా ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసింది. పైగా తనపై యాసిడ్ దాడికి ఆజంఖాన్ కుట్ర పన్నాడన్న జయప్రద ఆరోపణలు ఇక్కడి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి. సామాజిక సమీకరణలు పదకొండు సార్లు ముస్లింలకే పట్టంగట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా సగానికి పైగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57 శాతం ఉన్నారు. హిందువులు 45.97 శాతం, సిక్కులు 2.80 శాతంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాంపూర్ అక్షరాస్యత 53.34 శాతం మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ. రాంపూర్ ముఖచిత్రం మొత్తం ఓటర్లు 11,54,544 పురుషులు 6,22,769 స్త్రీలు 5,31,775 పురుషుల అక్షరాస్యత 61.50% మహిళల అక్షరాస్యత 44.44% -
నేను చస్తే.. నీ కళ్లు చల్లబడతాయా?: జయప్రద
లక్నో : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు.. ఒకప్పటి తన స్నేహితుడు, ప్రస్తుత ప్రత్యర్థి ఆజంఖాన్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, మహిళల రక్షణ కోసం ఆజంఖాన్‌ను ఎన్నికల్లో పోటీచేయనివ్వద్దన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చచ్చిపోతే.. నీవు సంతృప్తి పడతావా?’ అంటూ ఆజంఖాన్ ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నన్ను భయపడితే రాంపూర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నావ్.. కానీ ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ముచ్చటే లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనుమతించకూడదు. ఒక వేళ ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతోంది. మహిళల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఇక 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమె విజయానికి ఆజంఖాన్ కృష్టి చేశారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీని వీడారు. ఇటీవల బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలోకి దిగారు. దీంతో వీరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. (జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య) -
‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యాదవ్ భాయ్.. మీరు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్‌పై సోమవారం రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఆజం ఖాన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్ జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఆజాం ఖాన్ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
ఆజం ఖాన్‌పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను తను అన్నా అని పిలిస్తే.. అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు జయప్రద. ఆ తర్వాత ఎస్పీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీని వీడారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆజం ఖాన్.. నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను నాట్యగత్తె అన్నావు. నిజమైన సోదరులు ఎవరూ అలా మాట్లాడరు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అన్నారు. పద్మావత్ సినిమా చూసిన తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఖిల్జీ పాత్రను చూస్తే నాకు ఆజం ఖానే గుర్తుకు వచ్చాడు. గత ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సమయంలో అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు’ అని పేర్కొన్నారు. జయప్రద వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్ ఆమెను నాట్యగత్తె అని సంభోదించిన సంగతి తెలిసిందే. -
ఆజంఖాన్ నుంచి విముక్తికే పోటీ
లక్నో: తన ప్రత్యర్థి ఆజంఖాన్ నుంచి రామ్‌పూర్ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద అన్నారు. రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. ‘రామ్‌పూర్ ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నాను. ఆజం తాను పాల్పడుతున్న అక్రమాలను చట్టబద్ధం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ నేను ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను’ అని పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆజం తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఆయన ఏదైనా మాట్లాడగలడు. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు. అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. కానీ రామ్‌పూర్ ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఓట్ల ద్వారానే వారు ఆయనకు గట్టి సమాధానం చెప్తారు. 2004లో నేను ముంబై నుంచి పోటీ చేసినప్పుడు ఆయన నా తరపున ఆయన ప్రచారం చేశారు. అప్పుడు ఆయనకు నేనెవరో తెలీదా? ఇప్పుడు నన్ను ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు’అని అన్నారు. -
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన జయప్రద
లక్నో : బీజేపీ తరఫున రామ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు సినీ నటి జయప్రద. పుట్టినరోజు సందర్భంగా బుధవారం నామినేషన్ వేశారు జయప్రద. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ మూలాన నేను రామ్‌పూర్‌ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు. తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక ‘దేవున్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మరోసారి ఈ యుద్ధంలో నన్ను గెలిపించు.. జనాలకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుకుంటున్నట్లు’ తెలిపారు. గతంలో జయప్రద రెండు సార్లు 2004, 2009లో రామ్‌పూర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఆజం ఖాన్ మీద చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2004 ఎన్నికల్లో ఆజం ఖాన్ జయప్రద తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న వారు కొద్ది బద్ద శత్రువుల్లా మారారు. -
చిలుకను తెచ్చిస్తే రూ.20వేల నజరానా
లక్నో : ఓ రామచిలుకను పట్టిస్తే రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని ఓ రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన ఓ రాజకుటుంబ వారసురాలు సనమ్ అలీఖాన్ పౌలీ అనే రామచిలుకను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అది చెప్పే ముద్దుముద్దు మాటలంటే ఆమెతోపాటు ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం. వారి బంధువులు స్కైప్ ద్వారా దానితో మాట్లాడుతూ ముచ్చట పడిపోతుండేవారు. అయితే కొద్దిరోజుల కిందట కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లినప్పుడు కేర్ టేకర్ చిలుకను సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ చిలుక ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిలుక జాడ కోసం వెతకని ప్రదేశం లేదు. ప్రాణంగా పెంచుకున్న చిలుక అదృశ్యం కావడంతో యజమాని కుటుంబం చిన్నబోయింది. ఇల్లు బోసిపోయింది. తప్పిపోయిన ఈ చిలుక ఇప్పుడు యూపీలోని రామ్ పూర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇక లాభం లేదని చిలుక యజమాని సనమ్ అలీ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చిలుక జాడ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే చిలుక పట్టి తెస్తారో వారికి రూ.20వేల రివార్డు ఇస్తామంటూ ఆటో రిక్షాపై లౌడ్ స్పీకర్ తో చాటింపు వేయించారు. ప్రస్తుతం రామ్పూర్లోని అనేక వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఆ చిలక ఫోటోలు వైరల్‌గా మారాయి. చిలుక జీవితం ఆధారంగా వచ్చిన హాలీవుడ్ మూవీ పౌలీ (1998) చూసిన తర్వాత తాము పెంచుకునే చిలుకకు.. పౌలీ అని పేరు పెట్టినట్టు సనమ్ తెలిపారు.