రామ్‌పూర్ (యూపీ): 1980 నాటి బాలీవుడ్ సినిమాల్లో రామ్‌పూర్ కత్తి అంటే ప్రేక్షకులకి ఒక పిడిబాకే. ఆ కత్తితో చేసే విన్యాసాలు హడల్ పుట్టించేవి. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఒకప్పుడు కత్తులకు, కటార్లకు బాగా ఫేమస్. అత్యంత నాణ్యమైన కత్తులు లభించేవి. ఫోల్డబుల్ కత్తులు ఎవరికైనా కావాలంటే రామ్‌పూర్ వెళ్లవలసిందే. ఎప్పుడైతే చైనా మార్కెట్ భారత్‌ను ముంచేసి తక్కువ ధరకే చాకులు లభ్యమయ్యాయో ఈ రామ్‌పూర్ చాకుల్ని జనం కొనడం మానేశారు.
అయినప్పటికీ దానికుండే క్రేజ్ దానికి ఉంది. అందుకే రామ్‌పూర్ అధికారులు నైనిటాల్ నుంచి రామ్‌పూర్‌కు వచ్చే మార్గంలో ఒక కూడలిలో ఈ కత్తిని ఏర్పాటు చేశారు. దానికి రామ్‌పూర్ చాకు చౌక్ అని పెట్టారు. దాదాపుగా 20 అడుగుల ఎత్తైన రామ్‌పూర్ కత్తి ఇప్పుడు ఠీవీగా కనిపిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఈ కత్తి పేరు చెబితే హడలిపోయేవారే ఇప్పుడు దానినొక కళాకృతి కింద చూడడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment