knife
-
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కత్తితో దాడి.. ముగ్గురు మృతి
షాంఘై: చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురు హతమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ వివరాలను షాంఘై పోలీసులు మీడియాకు తెలిపారు.చైనా 75వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షాంఘై నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల లిన్ అనే వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని పట్టుకున్నారు. కాగా సూపర్మార్కెట్లో కత్తి పట్టుకుని తిరుగుతున్న లిన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.దాడికి పాల్పడిన లిన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తితో దాడులు జరుగుతున్న ఘటనలు అధికమయ్యాయి. గత మే నెలలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కత్తి దాడికి గురైన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.ఇది కూడా చదవండి: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి -
డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్
నాగ్‌పూర్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే సిక్కు పైలట్ ఆనంద్‌సింగ్ డ్యూటీలో తన వెంట కిర్పన్(చిన్నకత్తి)ని తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టుకెక్కారు. కిర్పన్‌ను క్యారీ చేయడం సిక్కు సంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద కిర్పన్ తీసుకెళ్లడం తన ప్రాథమిక హక్కు అని నాగ్‌పూర్ హైకోర్టు బెంచ్ ముందు వేసిన పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు తనకు అనుమతిచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పైలట్ కోరారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు నోటీసులు పంపింది. ‘విమానాల్లో కిర్పన్‌ను తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతిస్తూ విమానయాన శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులకు మాత్రం కిర్పన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని అందులో తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధం’ అని పైలట్ న్యాయవాది చెప్పారు. సంప్రదాయంలో భాగంగా సిక్కులు ధరించే వాటిలో కిర్పన్ కూడా అతి ముఖ్యమైనది. చిన్న సైజులో ఉన్న కిర్పన్‌ను సిక్కులు తమ వెంటే ఉంచుకుంటారు. ఇదీచదవండి..గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం.. కారణం అదేనా? -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
పరామర్శకు వెళ్తే పొడిచేశాడు..
సాలూరు: గాయాలపాలైన స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఓ మహిళపై దాడి జరిగిన సంఘటన సాలూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కిరణ్మయి, తండ్రి ఈశ్వరరావు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు... పట్టణంలోని చిట్లువీధిలో నివసిస్తున్న లలితకుమారి రామభద్రపురం మండలం తారాపురం యూపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు భర్త ప్రసాద్‌తో విభేదాలుండడంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల లలితకుమారిపై ప్రసాద్ దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న కిరణ్మయి స్నేహితురాలిని పరామర్శించేందుకు సోమవారం లలితకుమారి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో లలితకుమారి భర్త ప్రసాద్ రావడంతో అతనికి, కిరణ్మయికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన ప్రసాద్ కిరణ్మయి పొట్టపై కత్తితో దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కిరణ్మయిని స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! సీనియర్ నటి సలహాలు
డైనింగ్ ఎటికేట్లో భాగంగా కొన్ని రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో ఫోర్క్, నైఫ్‌లతో తినడం తప్పనిసరి అవుతుంది. అయితే అది అందరికీ సులభం కాకపోవచ్చు. పొరపాట్లు దొర్లవచ్చు. ఎవరైనా గమనిస్తున్నారేమో... అనే ఆలోచనతో కూడా భోజనాన్ని సరిగ్గా తినలేకపోవచ్చు. ‘ఇదంతా ఎందుకు... ఫోర్క్, నైఫ్‌లతో సరిౖయెన పద్ధతిలో ఎలా తినాలో నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్యుటోరియల్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఫోర్క్, నైఫ్‌లతో ఎలా తినాలో చూపించింది నీనా గుప్తా. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లితే... ఒకప్పుడు నీనా కూడా ఫోర్క్, నైఫ్‌లతో తినడం రాక చాలా ఇబ్బంది పడేది. దీంతో పట్టుదలగా తినే పద్ధతిని నేర్చుకుంది. ‘నాకైతే చేతులతో తినడమే ఇష్టం’ అని నీనా గుప్తా చెప్పడం కొసమెరుపు. -
ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. వాటర్ మిలన్ కట్ చేస్తుండగా..
సందీప్, పూజ నాలుగేళ్లుగా లివ్ ఇన్‌లో ఉన్నారు. సందీప్ హరియాణాలోని హిసార్ ప్రాంతానికి చెందినవాడు. పూజ ఢిల్లీకి చెందిన యువతి. పూజ సిఎస్ఎస్బీలో సిపాయిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె చికిత్స కోసం సందప్ను ఆసుపత్రికి తీసుకు వచ్చింది. సందీప్ ఛాతీలో చాకుతో అయిన తీవ్ర గాయం ఉంది. చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఛాతీలో చాకు దిగబడిన నేపధ్యంలో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ యువకుడిని అతని లివ్ ఇన్ పార్ట్నర్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనుమానాస్పద స్థితిలో ఆ యువకుడు మృతిచెందడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా భావిస్తూ, అతని లివ్ఇన్ పార్ట్నర్ను అరెస్టు చేసి, పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. డిఎల్ఎప్ పేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 35 ఏళ్ల సందీప్‌ను చికిత్స కోసం నారాయణ సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంద్భంగా సందీప్ లివ్ ఇన్ పార్ట్నర్ పూజాశర్మ(25) పోలీసులతో మాట్లాడుతూ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా సందీప్ ఛాతీలో చాకు దిగబడిందని తెలిపింది. దీంతో అతను తీవ్రంగా గయాపడ్డాడని, తాను వెంటనే ఆసుపత్రికి తీసుకు వచ్చానని, అయినా ఫలితం లేకపోయిందని తెలిపింది. తాను, సందీప్ గత నాలుగేళ్లుగా లివ్ ఇన్‌లో ఉంటున్నామని, సందీప్ వాహనాల కొనుగోలు- అమ్మకాల వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. కాగా సమాచారం తెలిసిన వెంటనే సందీప్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎసీపీ డీఎల్ఎఫ్ వికాస్ కౌశిక్ మాట్లాడుతూ సందీప్ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా, చాకు గుచ్చుకుని చనిపోయాడని పూజ చెబుతున్నదని అన్నారు. అయితే తాము పూజ చెబుతున్న దానిలో నిజా నిజాలు తేల్చేందుకు ఆమెను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
ఇంగ్లండ్‌లో కత్తితో దుండగుడు వీరంగం
లండన్: సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు మంగళవారం తెల్లవారుజామున కత్తి చేత పట్టుకొని కనిపించిన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ సహా ముగ్గురు మరణించారు. గ్రేస్ ఒ మలే కుమార్ (19) అనే భారతీయ విద్యార్థికి క్రికెట్, హాకీ క్రీడలంటే ప్రాణం. కుమార్‌తో పాటు క్రికెట్ ఆడే అతని స్నేహితుడు బార్నబి వెబ్బర్ కత్తి పోట్లకు గురై ప్రాణాలు విడిచాడు. మరో 60 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయడంతో అతనూ మృతి చెందాడు. ఆ వ్యక్తి దగ్గర నుంచి వ్యాన్‌ను దొంగలించిన దుండగుడు మరో ముగ్గురుపై నుంచి వాహనాన్ని తోలుకుంటూ వెళ్లాడు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశంలో బుధవారం ప్రధాని సునాక్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చదవండి: వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి? -
అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?
లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్‌ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది. దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్‌కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హోటల్లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
ఆ కత్తి.. ఒక కూడలి !
రామ్‌పూర్ (యూపీ): 1980 నాటి బాలీవుడ్ సినిమాల్లో రామ్‌పూర్ కత్తి అంటే ప్రేక్షకులకి ఒక పిడిబాకే. ఆ కత్తితో చేసే విన్యాసాలు హడల్ పుట్టించేవి. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఒకప్పుడు కత్తులకు, కటార్లకు బాగా ఫేమస్. అత్యంత నాణ్యమైన కత్తులు లభించేవి. ఫోల్డబుల్ కత్తులు ఎవరికైనా కావాలంటే రామ్‌పూర్ వెళ్లవలసిందే. ఎప్పుడైతే చైనా మార్కెట్ భారత్‌ను ముంచేసి తక్కువ ధరకే చాకులు లభ్యమయ్యాయో ఈ రామ్‌పూర్ చాకుల్ని జనం కొనడం మానేశారు. అయినప్పటికీ దానికుండే క్రేజ్ దానికి ఉంది. అందుకే రామ్‌పూర్ అధికారులు నైనిటాల్ నుంచి రామ్‌పూర్‌కు వచ్చే మార్గంలో ఒక కూడలిలో ఈ కత్తిని ఏర్పాటు చేశారు. దానికి రామ్‌పూర్ చాకు చౌక్ అని పెట్టారు. దాదాపుగా 20 అడుగుల ఎత్తైన రామ్‌పూర్ కత్తి ఇప్పుడు ఠీవీగా కనిపిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఈ కత్తి పేరు చెబితే హడలిపోయేవారే ఇప్పుడు దానినొక కళాకృతి కింద చూడడం విశేషం. -
కాకినాడలో రవాణాశాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు
కాకినాడ క్రైం: ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసినందున వాహనాన్ని సీజ్ చేసేందుకు యత్నించిన అధికారి, అతని డ్రైవర్‌పై వాహన యజమాని హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన పెంటా వెంకట దుర్గాప్రసాద్ ఆటోపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక ఫెలోషిప్ సెంటర్లోని దేవదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం సమీపాన శుక్రవారం ఉదయం ఆటో నిలిపి వ్యాపారం చేసుకుంటున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా విధులు నిర్వర్తిస్తున్న మిద్దే చిన్నారావు అక్కడకు వెళ్లారు. దుర్గాప్రసాద్ ఆటో నంబరు తనిఖీ చేసి, గతేడాది నవంబర్లోనే వాహనం ఫిట్నెస్ ముగిసిందని, ఇన్స్రూెన్సు కూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆటోను సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వద్దని దుర్గాప్రసాద్ వారించాడు. తాను ఆటో నడుపుతూ వ్యాపారం చేయడం లేదని, కేవలం రోడ్డు పక్కన నిలిపి మాత్రమే జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారావు ఆటోను సీజ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో దుర్గాప్రసాద్ ఆటో వద్దకు వెళ్లి కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చాడు. కారులో ఉన్న చిన్నారావును బెదిరించేందుకు కారు అద్దంపై కత్తితో వేటు వేశాడు. ‘ఏంటి చంపుతావా?’ అంటూ చిన్నారావు బయటకి రాబోయారు. అప్పటికే వర్షం పడుతుండడంతో కారు దిగిన వెంటనే చిన్నారావు కాలు జారి పడిపోయాడు. ఆయనపై దుర్గాప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిని నిలువరించేందుకు ఏఎంవీఐ కారు డ్రైవర్ గుత్తుల వీర వెంకట సత్యనారాయణ యత్నించగా దుర్గాప్రసాద్ అతడి పైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారావు మెడ, తల, చేయి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేలు తెగి పడింది. పెద్దపేగు పూర్తిగా బయటికి వచ్చేసింది. డ్రైవర్ సత్యనారాయణకు రెండు చేతులపై గాయాలయ్యాయి. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. కాగా కత్తి దాడిలో తెగిపడిన చిన్నారావు చేతి వేలిని అతికించేందుకు జీజీహెచ్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారావు శరీరంపై మొత్తం 34 కత్తిపోట్లు, గాయాలు గుర్తించామని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌లో బాధిత కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పరామర్శించారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశామని టూ టౌన్ సీఐ నాయక్ తెలిపారు. -
‘డబుల్’ ఇల్లు ఇవ్వడంలేదని...
కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో భూమిని కోల్పోయానని, అయినా ఇల్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలం మేదీనీపూర్లో చోటుచేసుకుంది. మేదినీపూర్‌కు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వస్థలం అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ విరుపాక లావణ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి స్థానికుడైన నంగి కనకయ్య దంపతులకు చెందిన కొంతస్థలాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారు. ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కనకయ్యకు ఒక డబుల్ బెడ్రూం ఇంటిని అందిస్తామని తీర్మానించారు. కాగా, 2022 జూన్ 27న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా 48 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తనకు ఇల్లు కేటాయించలేదని ఆగ్రహించిన కనకయ్య మిగిలిన రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆక్రమించుకొని 6 నెలలుగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రెవెన్యూ అధికారులు కనకయ్య ఉంటున్న ఇంటికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూంల నిర్మాణంలో 14 గుంటల భూమిని కోల్పోయానని, అయినా తనకు ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లమంటారా అంటూ మనస్తాపం చెంది కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కలవారు అప్రమత్తమై అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పరాజ్ ఘటనాస్థలానికి చేరుకొని కనకయ్యకు నచ్చజెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ ఆశాజ్యోతిని వివరణ కోరగా సమాధానం దాటవేశారు. సమాఖ్య భవనంలో ఉంటున్నాం... డబుల్ బెడ్రూం నిర్మాణాల్లో ఇంటి స్థలంతోపాటు 12 గుంటల భూమిని కోల్పోయాం. లబ్ధిదారుల జాబితాలో పేరు రావడంతో అధికారులు పట్టా సర్టిఫికెట్ అందజేశారు. కానీ, ఇప్పటివరకు ఇంటిని అప్పగించలేదు. దీంతో మహిళా సమాఖ్య భవనంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. అధికారులు స్పందించి త్వరగా ఇంటిని కేటాయించాలి. – మరో బాధితురాలు నంగి ఐలవ్వ -
కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ (ఐనైఫ్) గర్భాశయ కేన్సర్‌ను సెకండ్లలో పసిగట్టేస్తోంది. కేన్సర్ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. -
ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ‘ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి..!, ఏం పీకుతారో చూస్తాను’అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడి అంతిమ యాత్రలో కత్తితో హల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాట్సప్‌లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నగరంలో వైరల్ అయింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న పూర్ణామార్కెట్ దరి గాజులవీధికి చెందిన నాయన తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్ వేడుకలు నిర్వహించుకున్నారు. 18న తెల్లవారుజామున అరకు వెళ్లారు. మంగళపాలెం వద్ద నాయన తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. తరుణ్ తండ్రి మాలవేసి ఉండడంతో 20న శవ పంచనామా చేసి సాయంత్రం అప్పగించారు. మార్చురీ నుంచి ఊరేగింపుగా శవయాత్ర నిర్వహిస్తూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కొబ్బరితోట వద్ద తరుణ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల వినయ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారు మద్యం మత్తులో తరుణ్‌కు జేజేలు పలికారు. ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం మాత్రం ఓ ఇద్దరి వ్యక్తుల భుజాలపై ఎక్కి మాంసం కత్తిని చేతితో చూపిస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. చదవండి: (తిరుమల: ఆన్లైన్లో ప్రత్యేక, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు) నిందితుల అరెస్ట్: కత్తులు, మారణాయుధాలతో హల్చల్ చేస్తూ నగర ప్రజలను భయాందోళనలకు గురి చేసిన 9 మందిని టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు కల్లుపాకలు, పండావీధి, కొబ్బరితోటకు చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు. కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్ అలియాస్ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్ అలియాస్ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారంతా పోలీసుల విధులకు అడ్డు తగిలారు. నిందితులపై నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. -
తాత మందలించాడని.. మనమడు ఎంతకు బరి తెగించాడంటే..
కర్నూలు: ‘బాగుపడే లక్షణాలు లేవు.. సెల్‌ఫోన్ మీద ఉన్న ధ్యాస వృత్తి(పౌరోహిత్యం)పై ఉండటం లేదు. ఇలాగైతే ఎలా ’ అంటూ మందలించిన తాతను.. సొంత మనుమడే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. స్థానిక మాధవీనగర్‌లో నివాసముంటున్న మేడవరం సుబ్రహ్మణ్య శర్మ (83) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1996లో పదవీ విరమణ పొందాడు. సుబ్ర హ్మణ్య శర్మ భార్య శాంతమ్మ 13 ఏళ్ల క్రితం, పెద్ద కుమారుడు సతీష్ శకర్మ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో కోడలు అరుణ(పెద్ద కొడుకు భార్య), మనుమడు దీపక్ శర్మ ఉంటున్నారు. దీపక్ శర్మ చదువు మధ్యలోనే ఆగిపోవడంతో కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకోమని కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక ఘాట్ దేవాలయంలో వదిలారు. అయితే పూజా కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండటంతో తాత తరచూ మందలించేవాడు. రెండు రోజుల క్రితం మహానందిలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తుండగా బస్సులో వెళ్లమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వృత్తిపని నేర్చుకునేందుకు వెళ్లకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో తాత మరో సారి మందలించాడు. దీంతో ఆలయానికి వెళ్లి కాసేపటికే తిరిగి ఇంటికి వచ్చాడు. ‘ఎందుకంతలోనే వచ్చావు.. వృత్తిపై ధ్యాస లేదా’ అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనై కూరగాయల కత్తి తీసుకొని మంచంపై పడుకోబెట్టి గొంతు కోసి హత్య చేశాడు. దుస్తులకు రక్తం అంటడంతో బాత్రూమ్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకుని బాబాయి రమేష్‌శర్మకు ఫోన్ చేసి తాతను ఎవరో హత్య చేశారంటూ సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడివున్న సుబ్రహ్మణ్య శర్మను చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ తబ్రేజ్, ఎస్ఐలు జయశేఖర్, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నేరం జరిగిన తీరును చూసి దీపక్ శర్మపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా తనకు తెలియదంటూ బుకాయించడంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. స్టేషన్‌కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
-
కోర్టు ఆవరణలోనే భార్యపై కత్తితో దాడి...
పెద్దలు కుదిర్చిన వివాహమైన లేదా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా జంటలు ఏవో చిన్న సమస్యలతో విడిపోతున్నారు. అంతవరకు భాగానే ఉంది. కానీ కక్ష్య పెంచేసుకుని చంపుకునేంత కిరాతకానికి ఒడిగట్టి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన సంతానం అనాథలుగా మిగిలిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....కర్ణాటకకు చెందిన చైత్ర, శివ కుమార్ అనే ఒక జంట విడిపోవాలనుకుని కోర్టులో కేసులు వేసుకున్నారు. వీరికి పెళ్లై ఏడేళ్లయింది, ఒక పాప కూడా ఉంది. ఐతే తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలను ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసం ఆ జంట శనివారం లోక్ అదాలత్‌ని సంప్రదించారు. దీంతో ఆ జంటకి శనివారం అక్కడున్న అధికారులు ఒక గంటపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ తదనంతరం చైత్ర కోర్టు ఆవరణలో ఉన్న వాష్‌రూమ్‌కి వెళ్తుండగా శివకుమార్ ఆమె వెంటపడి కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. అతను అక్కడితో ఆగక ఆమె వద్ద ఉన్న చిన్నారి పై కూడా కత్తి దూసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఈ జంట విడాకుల కేసును విచారిస్తున్న హోలెనరసిపుర టౌన్ కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఐతే ఈ హఠాత్పరిణామానికి పక్కనే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే చైత్రకు తీవ్రగాయాలు కావడంతో హోలెనర్సిపుర నుంచి అంబులెన్స్‌లో హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. (చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) -
నల్లగొండలో కలకలం రేపిన ప్రేమోన్మాది దాడి ఘటన
-
చైనాలో గ్యాంగ్‌స్టర్ కత్తులతో దాడి...ముగ్గురు మృతి
బీజింగ్: చైనా జియాన్స్ ప్రావిన్స్‌లోని కిండర్‌గార్డెన్‌లో ఒక గ్యాంగస్టర్ కత్తులతో దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్యాగ్‌స్టర్ టోపీ, ముసుగు ధరించి ఉదయం 10 గంటలకు దక్షిణ చైనాలోని కిండర్ గార్డెన్‌లోకి చొరబడి ఈ దాడులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. చైనాలో ఇలాంటి నేరాలు జరగడం అత్యంత అరుదు. పౌరులు తుపాకీలను కలిగి ఉండడాన్ని చైనా కఠినంగా నిషేధిస్తుంది. కానీ చైనాలో గతకొంకాలంగా ఈ దాడులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్ నెలలో కూడా ఇదే కిండర్‌గార్డెన్ కత్తుల దాడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని, సుమారు 16 మంది దాక గాయపడ్డారని చెప్పారు. అంతేకాదు షాంఘై ప్రభుత్వాస్పత్రుల్లో కూడా నలుగురు వ్యక్తులు కత్తిపోటుకు గురయ్యరని, గతేడాది జూన్‌లో పాదాచారుల పై కూడా ఇలానే ఒక వ్యక్తి కత్తుల దాడులకు తెగబడటంతో ఆరుగురు మృతి చెందారని, సుమారు 14 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ చైనాలో కిండర్‌గార్డెన్‌లో దాడులకు పాల్పడ్డా 48 ఏళ్ల వ్యక్తి పరారీలోనే ఉన్నాడని, అతని ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు) -
ప్రేమించాడని నజీర్ అనే యువకుడిపై కత్తులతో దాడి
-
మద్యం మత్తులో ఘాతుకం.. తండ్రిని నరికిన కొడుకు
సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు పంచాయతీ కొత్తపేట కాలనీలో గురువారం కన్నతండ్రిని కుమారుడు నరికిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యాల నారాయణకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు కొయ్యల పోలయ్య గురువారం ఉదయం 8 గంటల సమయంలో మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్య లక్ష్మిని అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న తండ్రి నారాయణ కలగజేసుకోవడంతో కోపోద్రిక్తుడైన పోలయ్య.. తండ్రి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. తల వెనుక, ఇతర శరీర భాగాల్లో నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కత్తితోనే బయటకు వచ్చి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలయ్యను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నారాయణను 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. జిల్లా క్లూస్‌టీం సభ్యు లు రమేష్, ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. -
కాపు కాసి కడ తేర్చారు..
జీడిమెట్ల: తన అక్కతో తరచు గొడవ పడుతున్నాడనే నెపంతో బావమరుదులు బావతో పాటు అతని సోదరుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటన స్థానికులను భయాందోళను గురిచేసింది. ►జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కె.బాలరాజు వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన మోక వెంకటేష్(32) ఏడేళ్ల క్రితం ఉప్పల్ చిలకానగర్‌కు చెందిన తనకంటే పెద్దదైన రేఖ(40)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప(4), బాబు(2) ఉన్నారు. వెంకటేష్ పెయింటర్‌గా పని చేస్తుండగా రేఖ ఇంటి వద్దనే ఉంటుంది. కాగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ►గురువారం ఉదయం వెంకటేష్ రేఖల మధ్య గొడవ జరిగింది. ఆమెపై చేయి చేసుకుని సుభాష్‌నగర్‌లోనే ఉండే తల్లి వద్దకు వెళ్లాడు. తన భర్త వెంకటేష్ గొడవపడి తనను కొట్టాడని రేఖ చిలుకానగర్‌లో ఉండే తన తమ్ముళ్లకు చెప్పింది. ►దీంతో బావ వెంకటేష్‌పై కోపంతో రగిలిపోయిన రేఖ సోదరులు వినయ్(25), మధు(22)లు రాత్రి సుభాష్‌నగర్‌కు వచ్చి వెంకటేష్ కోసం కాపు కాస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్ తన సొంత సోదరుడైన పోతురాజు(25), తన చెల్లెలి భర్త కృష్ణ(25)లతో కలిసి మద్యం తాగి రాత్రి 10గంటలకు ఇంటికి వస్తున్నాడు. వీరు ముగ్గురు సుభాష్‌నగర్ పోచమ్మ గుడి వద్దకు చేరుకోగానే వినయ్ వారిస్తూ ఒక్కసారిగా దాడికి దిగాడు. ►తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ కడుపులో పొడుస్తుండగా అతని తమ్ముడు మధు వెంకటేష్‌ను పట్టుకున్నాడు. తన అన్న వెంకటేష్‌ను పొడుస్తుండగా అడ్డుగా వెళ్లిన వెంకటేష్ సోదరుడు పోతురాజును సైతం వినయ్ విచక్షణ రహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటేష్ బావ కృష్ణను సైతం పొడవడానికి ప్రయత్నించగా వెంకటేష్ సోదరి అనిత తన భర్తను చంపవద్దని ప్రాధేయపడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోతురాజు అక్కడికి అక్కడే మృతిచెందగా వెంకటేష్ అస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల అదుపులో నిందితులు.. ఘటనాస్థలికి వెళ్లిన జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, గౌతమ్‌లు పంచనామా నిర్వహించి వినయ్, మధు, రేఖలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పోతురాజుపై 32కేసులు.. హత్య కాబడ్డ వెంకటేష్ సోదరుడు మృతుడు పోతురాజుపై వివిధ పోలీస్స్టేషన్లలో 32కేసులు ఉన్నాయి. ఇతను తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇంటి ఆడపడుచు పసుపుకుంకాలతో సంతోషంగా ఉండాలని ఏ అన్నదమ్ములైన కోరుకుంటారు. కానీ వీరి విషయంలో అది రివర్స్‌గా ఉంది. అక్కను కొట్టాడనే కోపంతో రగిలిపోయిన బావమర్దులిద్దరూ కలసి సొంత బావ ఉసురుతీశారు. అంతేకాకుండా అడ్డుకోవడానికి వచ్చిన బావ తమ్ముడిని సైతం కడ తేర్చారు. బంధాలు, బాంధవ్యాలు మరచి సొంతవాళ్లను చంపుకుంటున్న నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం. -
టిఫిన్ లేదని చెప్పినందుకు కత్తి తీసుకుని..
పాతపట్నం(శ్రీకాకుళం): టిఫిన్ ఇవ్వలేదనే కోపంతో నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన సరియాపల్లి అప్పారావు.. మెళియాపుట్టి మండలం పరశురాంపురం పంచాయతీ తూముకొండ రామచంద్రాపురం గ్రామానికి చెందిన బురిడి సుందరమ్మపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూముకొండ ప్రధాన రహదారిపై బురిడి సుందరమ్మ టిఫిన్ సెంటర్(షాపు) నడుపుతోంది. గురువారం ఉదయం పదిగంటల సమయంలో టిఫిన్ కోసం అప్పారావు అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే టిఫిన్ అయిపోందని సుందరమ్మ చెప్పి డబ్బులు లెక్కపెట్టుకుంటోంది. మద్యం మత్తులో ఉన్న అప్పారావు కోపంతో తన వద్ద ఉన్న కత్తితో సుందరమ్మపై దాడి చేశాడు. మెడపై, తలపై తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్న సుందరమ్మ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సిబ్బంది టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్ఐ వి.సందీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. క్లూస్ టీం చేరుకుని కత్తిని స్వాధీనం చేకున్నారు. నిందితుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: Hyderabad Woman Drunken Drive: మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే -
పాతబస్తీలో కత్తిపొట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అన్నాతమ్ముల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తిపోట్ల వరకు దారితీసింది. ఈ ఘటన చంద్రయాణాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓమర్ గుల్షాన్ ఫంక్షన్ హాల్ షైక్ జావీద్ (అన్న) షైక్ అసిఫ్ (తమ్ముడు)కి ఏదో విషయమై వివాదం తలెత్తింది. వారి మధ్య మొదలైన వాగ్వాదం పెరగడంతో అన్న షైక్ జావీద్ కోపంతో చాకు తీసుకుని షైక్ అసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో అసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ అసిఫ్‌ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షేక్ జావిద్‌ని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! ) -
తాగిన మత్తులో కత్తితో రోడ్డుపై యువకుడి వీరంగం
-
ఎంఎంటీఎస్ రైలులో కత్తితో హల్చల్
సాక్షి, నాంపల్లి: ఎంఎంటీఎస్ రైలులో ఓ ఆగంతుకుడు హల్చల్ సృష్టించాడు. కత్తితో మహిళా బోగీలోకి దూరి బెదిరింపులకు దిగాడు. సెల్‌ఫోన్, నగదుతో పరారైన ఘటన నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం.. మణికర్ణ అనే మహిళ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంలో (సీఆర్ఐఎస్) సీనియర్ ప్రాజెక్టు ఇంజినీరుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బేగంపేట రైల్వే స్టేషన్‌కు వచ్చారు. చదవండి: Hyderabad RRR: అలైన్మెంట్.. ఆల్రైట్! రాత్రి సుమారు 10.37 గంటలకు లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ఎక్కారు. ఆమెతో పాటు ఆ బోగీలో మరో మహిళ ఉన్నారు. సదరు మహిళ ఫతేనగర్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. రైలు బోరబండ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే గుర్తు తెలియని ఆగంతుకుడు మహిళా బోగీలోకి ప్రవేశించి మణికర్ణను కత్తితో బెదిరించాడు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను, నగదును లాక్కెళ్లాడు. బాధితురాలు చందానగర్ రైల్వే స్టేషన్లో దిగి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ -
చపాతీలు కోసం చంపేశారు..!
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!
కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది. కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది. సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..! -
స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది .. యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో.. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. ‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్‌తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు. వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్‌లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. -
గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై..
ముంబై: రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలని ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తిదాడికి గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం థానే జిల్లాలోని ఉల్హసన్నగర్ పట్టణానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే నరేష్ లెఫ్టీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోవటంతో సంజయ్‌ను డబ్బులు త్వరగా ఇవ్వాలని నరేష్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరేష్, సంజయ్‌లు తమ మిత్రులతో ఉల్హసన్నగర్లో 4లో కలుసుకున్నారు. సంజయ్ తనతో పాటు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అవినాష్‌ను తీసుకువచ్చాడు. అతడు మరో మూడు నెలలు ఆగాల్సిందిగా నరేష్‌కు చెప్పాడు. దీంతో ఇంకా ఎన్ని నెలలు ఆగాలంటూ కోపంతో నరేష్ కత్తితో అవినాష్, సంజయ్‌పై దాడి చేశాడు. గొడవ గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు కానిస్టేబుల్ గణేష్ దమాలే, ఒక సహోద్యోగితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. గణేష్ దమాలే ఈ గొడవను ఆపడానికి జోక్యం చేసుకున్నప్పుడు, నరేష్ అతని ముఖంపై కూడా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. తరువాత, మరి కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నరేష్, శశి చిక్నా అలియాస్ సుఖీ, ఓమీలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు -
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
మటన్ కత్తి తగిలి బాలుడు మృతి
బహదూర్‌పురా: ప్రమాదవశాత్తు మటన్ షాపులో ఉన్న కత్తి తగిలి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి తన ఇంటి వద్ద మటన్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన మహ్మద్ ఖురేషి కుమారుడు రియాజ్ ఖురేషి (13) మటన్ షాపులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కత్తి కాలుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా... రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మహ్మద్ ఖురేషి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! ) -
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
-
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
సాక్షి, నెల్లూరు: కోవూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సురేష్.. ఓ మహిళపై కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ షేకున్ (35) కారణమని అనుమానంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి !
సాక్షి, జగిత్యాల : పందెం కోడి వ్యవహారం పోలీసులకు తలనొప్పిని తెచ్చింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఈ నెల 22న కొందరు కోడిపందేలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సంతోష్ సైతం లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట వద్ద కోడిపందెంలో పాల్గొన్నాడు. సతీశ్ తన కోడికి కత్తులు కట్టి వదిలేందుకు వంగగా.. అది ఒక్కసారిగా లేచి తన్నడంతో సతీశ్ మర్మాంగాలకు గాయమై మృతిచెందాడు. గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయేందుకు కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత సంరక్షణ కోసం కోళ్ల ఫారానికి తరలించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడిని ఫొటో తీసి పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన ప్రాంతంలో కోడి ఉండటంతో సంరక్షించేందుకే పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తర్వాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడిపందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో... తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా -
గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి
భోపాల్: కంట్లో నలుసు పడితేనే కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో ఓ కత్తి దిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా అనిపిస్తోంది కదూ! కానీ మధ్యప్రదేశ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛత్తర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు సెంటిమీటర్ల పొడవున్న కత్తిని గుటుక్కుమని మింగేశాడు. దాన్ని మింగేటప్పుడు ఎక్కడా గుచ్చుకోలేదు కానీ, తిన్నగా ఆహారనాళంలోకి ప్రవేశించాక మొదలైంది అసలు సమస్య. (చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి) గుటక వేస్తే చాలు కత్తి కొన త్రిశూలంలా గొంతును పొడుస్తోంది. ఈ బాధను తాళలేకపోయిన సదరు వ్యక్తిని భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు జనవరి 26న అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆహార నాళంలో ఉండిపోయిన కత్తిని తీసివేశారు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే అతడు ఇలా ఏది పడితే దాన్ని గుటకాయ స్వాహా అనిపించడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం కూడా అతడు పలు వస్తువులను మింగేయగా ఎయిమ్స్ వైద్యులు వాటిని పొట్టలో నుంచి బయటకు తీశారు. (చదవండి: సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?) -
తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్‌కు విషయాన్ని తెలిపింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్‌పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య) -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్‌పాట్) -
20 సెం.మీ. కత్తినే మింగేశాడు..అయినా ఏం కాలేదు
ఢిల్లీ : డ్రగ్స్‌కి బానిసైన ఓ 28 ఏళ్ల యువకుడు లాక్డౌన్ కారణంగా డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కత్తినే మింగేసాడు. అంతేకాకుండా నెలన్నరకు పైగా పొట్టలో పదునైన కత్తి ఉన్నా చాలా సాధారణంగా గడిపాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎక్స్‌రే తీయగా 28 సెంటీమీటర్ల పదునైన కత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కాగా యువకుడు వంటింట్లోని కత్తిని మింగేశాడన్నా విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. (కుటుంబంతో డిన్నర్.. ఫొటో షేర్ చేసిన ఎమ్మెల్యే!) గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడటం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిస్ లాంటి చిన్న వస్తువులు మింగినవారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్‌రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ కేసుసు చాలా చాలెంజింగ్ తీసుకొని విజయవంతంగా శస్ర్తచికిత్స చేశామని డాక్టర్ దాస్ తెలిపారు. (పెళ్లి మండపంలో కోవిడ్ విలయం) -
బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!
లండన్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ఫ్లాయిడ్ మరణంతో ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు. ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్ యార్డ్ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్ ఫ్లాయిడ్‌ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు. -
30 గంటలపాటు మహిళ ఛాతీలో కత్తి
చెన్నై: తమిళనాడులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మహిళ ఛాతీలోకి దిగిన కత్తిని వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం మహిళ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరిలోని హోసూర్‌కు చెందిన మహిళను మే25న ఓ దుండగుడు కత్తితో పొడిచారు. ఆ పదునైన కత్తి ఛాతీలోకి లోతుగా చొచ్చుకెళ్లడంతో ఆమె నొప్పి తాళలేక విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెను సేలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. (పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!) అప్పటికే ముప్పై గంటలు గడిచిపోగా ఆమెను కోయంబత్తూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు ఛాతీ లోపల ఉన్న కత్తి ఊపిరితిత్తులకు కొద్దిగా ఆని ఉందని గుర్తించారు. కానీ గుండెకు మాత్రం తాకనందున బతికే అవకాశముందని భావించారు. దీంతో డా. ఈ శ్రీనివాసన్ నేతృత్వంలో వైద్య బృందం మూడు గంటలపాటు శ్రమించి ఆమె ఛాతీలో నుంచి ఆరు ఇంచుల పొడవున్న కత్తిని తీసివేశారు. (మరదలిని చంపిన బావ) -
విశాఖలో కత్తితో యువకుడి హల్చల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద కలకలం చోటు చేసుకుంది. కమిషనరేట్ ముందు ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడు కత్తితో కమిషనరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. రిసెప్షన్ వద్ద నిర్వహించిన తనిఖీలో యువకుడి వద్ద కత్తిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తితో కమిషనరేట్లోకి చొరబడేందుకు యత్నించిన యువకుడిని మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి యువకుడు అనుమానాస్పదంగా సీపీ కార్యాలయం వద్ద తిరగటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని ఆపి తనిఖీలు చేశారు. మెటల్ డిటెక్టర్‌లో ఆ యువకుడి వద్ద కత్తి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారని పోలీసులు తెలిపారు. -
భర్త మందలించాడని..
అనంతపురం, ధర్మవరం అర్బన్: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ పేతో అడ్డంగా దొరికిపోయాడు
న్యూఢిల్లీ : మెడికల్ షాపులో దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. ఈ వింత ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా వీధిలో ఉన్న ఒక ఫార్మసీ షాపులో గౌరవ్‌కుమార్ పనికి కుదిరాడు. అయితే పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోమవారం కుమార్ తన ముఖాన్ని టవల్‌తో చుట్టుకొని టోపీని అడ్డుపెట్టుకొని ఒక కస్టమర్‌లాగా షాపులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సేల్స్‌మెన్ కస్టమర్‌కు మందులను అమ్ముతున్నాడు. షాపులో సేల్స్‌మెన్ తప్ప ఎవరు లేకపోవడంతో దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించి కస్టమర్ వెళ్లిపోయాక కుమార్ షాపు షెట్టర్‌ను మూసేశాడు. తర్వాత సేల్స్‌మెన్ చేతులను కట్టేసి, నోటిలో గుడ్డను కుక్కి రూ. 75 వేల నగదు, రూ. 3వేలు విలువ చేసే మందులను ఎత్తుకెళ్లాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న షాపు ఓనర్ క్లోజ్ చేసిన షెటర్‌ను తెరవగానే సేల్స్‌మెన్‌ను షాక్‌కు గురయ్యాడు. తర్వాత సేల్స్‌మెన్ చేతులకున్న కట్లను విప్పేసి అసలు విషయం తెలుసుకొని తమకు సమాచారమందించాడని అల్ఫోన్స్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న తమకు మొదట ఏం ఆధారాలు దొరకలేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కవర్‌ను షాపు ముందు పడేయడం గమనించాము. వెంటనే ఆ కవర్‌ను పరిశీలించగా దాని మీద ఒక బార్కోడ్ ఉండడంతో స్కాన్ చేసి చూడగా 21 స్టోర్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. అన్ని స్టోర్స్‌కు వెళ్లి విచారించగా నిందితుడు ఆ కత్తిని ఫోన్ పే ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిసిందని అల్ఫోన్స్ వెల్లడించారు. విచారణలో నిందితుడి ఫోన్ నెంబర్ వివరాలను సేకరించి అతన్ని పట్టుకొని రూ. 65వేల నగదు, మందులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పేర్కొన్నారు. కాగా మిగతా రూ.10 వేలను నిందితుడు తన అవసరాలకు వాడినట్లు తెలిపాడు. నిందితుడి మీద కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీసీపీ అల్ఫోన్స్ వెల్లడించారు. కాగా, నిందితుడు గౌరవ్‌కుమార్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్పత్ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంతకముందు 2010లో దంపతుల హత్య కేసులో జైలుకెళ్లిన కుమార్ 8 సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించి 2018లో విడుదలయ్యాడని తెలిపారు. -
కలకలం: ఎమ్మెల్యేపై కత్తితో దాడి
సాక్షి, బెంగళూరు: ఎమ్మెల్యేపై కత్తితో డాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి మైసూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే పక్కనున్న సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యేను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఫర్హన్ పాషాగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన్వీర్ ప్రస్తుతం నరసింహారాజ్ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ తన్వీర్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసింందే. అప్పట్లో ఆయనపై పెద్ద దుమారమే చెలరేగింది. pic.twitter.com/NH813Fic50 — ANI (@ANI) November 18, 2019 -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
విశాఖ ఎయిర్‌పోర్టులో వేట కత్తితో వ్యక్తి కలకలం
-
విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం రేగింది. శుక్రవారం ఓ వ్యక్తి వేట కత్తి చేతిలో పట్టుకుని ఎయిర్‌పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్ నుంచి ఇన్‌గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. ఆ వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎయిర్‌పోర్ట్‌కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. -
గుంటూరులో కత్తితో యువకుడు హల్చల్
-
గుంటూరులో జనతా గ్యారేజ్!
సాక్షి, గుంటూరు : ‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది..జనతా గ్యారేజ్‘ ఇది జూ.ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలోని డైలాగ్. అచ్చం ఆ సినిమా తరహాలోనే ‘మీ వెనుక నేనున్నాను.. మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అంటూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నాడు ఓ యువకుడు. అంతే కాకుండా కత్తి పట్టుకొని నడిరోడ్డుపై వచ్చి హడావుడి చేశాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ యువకుడు సోమవారం ఉదయం కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపైకి వచ్చాడు.తన జనతాగ్యారేజ్‌కి సమస్యలు చెప్పాలంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాడు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. అతన్ని చూసి ఒక్కసారిగి పరుగులు తీశారు. ఆ యువకుడు కత్తి పట్టుకొని ఫోన్ మాట్లాడూతూ.. ‘నా దగ్గరకి రా. క్షణాల్లో పరిష్కరిస్తా’ అంటూ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జనతా గ్యారేజ్ గ్రూప్ అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ‘ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్‌లో పెట్టండి. జనతా గ్యారేజ్ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా ’అంటూ మెస్సేజ్ చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయ్యడంటూ ఓ నెంబర్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి పేరు ప్రదీప్ అని, గ్రూప్‌లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
పోలీస్‌స్టేషన్‌లోనే భార్యపై దాడి
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ఆవరణలో జరగడం గమనర్హం. వివరాలు..యాప్రాల్‌కు చెందిన రెహమాన్, రసూల్ పురాకు చెందిన కౌసర్ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్ బేగం బేగంపేట పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. రెహమాన్ మద్యానికి బానిస కావడంతో కౌసర్ బేగం భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బేగం పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. భార్యపై కోపంతో కత్తితో పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశాడు. అడ్డొ చ్చిన కుటుంబసభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘటన
-
హైదరాబాద్‌లో మిర్యాలగూడ తరహా ఘటన
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. బైక్‌పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా నరికాడు. కత్తి వేటుకు సంఘటనా స్థలంలోనే ఆమె చేయి తెగిపడిపోయింది. ఆమె దడవ చీలిపోయింది. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా మనోహరచారి బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రేమజంటను సనత్‌నగర్‌లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసి యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఐదేళ్లుగా ప్రేమించికుంటున్న సందీప్, మాధవి ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. మేనమామతో మాధవికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మాధవి పారిపోయి పెళ్లిచేసుకుంది. ఈ నేపథ్యంలో దాడి జరగడం సంచలనం రేపింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన సందీప్‌ను కూతురు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవ జంటను పిలిచి దారుణాతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. బట్టలు పెడతామని పిలిచి యువ జంటపై కత్తితో దాడికి దిగాడు. పోలీసుల అదుపులో నిందితుడు? మాధవి తండ్రి మనోహర చారి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మాధవి పరిస్థితి విషమం: వైద్యులు ‘మాధవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెడపై బలంగా కత్తితో దాడి చేయడంతో మెదడుకు దారి తీసే నరాలు దెబ్బతిన్నాయి. ఎడమ చెయ్యిపై కత్తితో దాడి చేయడంతో సగభాగం కట్ అయి తీవ్రంగా రక్త స్రావం అయింది. ప్రసుతం మూడు గంటల పాటు వైద్యం అందించాల్సి ఉంటుంది. ఎనిమిది గంటలు గడిస్తేగాని ఏమి చెప్పలేమ’ని యశోద ఆస్పత్రి వైద్యులు దేవేందర్ సింగ్ తెలిపారు. -
అనుమానంతో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి కాళ్లు చేతులు నరికేశాడు. వివరాలు..తుంగతుర్తి గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్(35)కు 13 ఏళ్ల క్రితం రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానం శ్రీనివాస్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ మంగళవారం భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అనంతరం కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రజితకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడలో నడిరోడ్డుపై దారుణ హత్య
-
బెజవాడలో మరో దారుణం
సాక్షి, విజయవాడ: బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్టీఎస్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్ మెన్ ట్రైనింగ్ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు పల్సర్ బైక్ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం రాజుని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాజు చికిత్స పొందుతూ.. చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నింధితుడు తీసుకొచ్చిన బైక్ ఆధారంగా అతను పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడికి చెందిన శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు బావమరిదే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కత్తిలాంటి ఆలోచన
అడవిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస అవసరాలకు సరిపడా వస్తువులను సమకూర్చుకోవడమే కాదు... ఆయుధాలను కూడా తోడు తీసుకెళ్లాలి. లేకపోతే ప్రమాదం పలకరించిన ప్రతిసారి తప్పించుకోవడం కష్టం. అందుకే హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తన వెంట పదునైన కత్తిని తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆమె ఎదో కత్తిలాంటి పదునైన ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ.. ఆండ్రియా అడవిలోకి ఎందుకెళ్లారో చెప్పలేదు కదూ! తన కొత్త సినిమా కోసం. ఆండ్రియా ముఖ్య తారగా నాన్‌జిల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కా: ది ఫారెస్ట్’. ఆదివారం సినిమా షూటింగ్ మొదలైంది. ‘‘చాలా టైమ్ వెయిట్ చేసిన తర్వాత ‘కా: ది ఫారెస్ట్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ మూవీ నా కంఫర్ట్ జోన్‌కి పూర్తి డిఫరెంట్ అని తెలుసు. కానీ ప్రయత్నిస్తా’’ అన్నారు ఆండ్రియా. ఈ సినిమాలో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కాకుండా కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘విశ్వరూపం 2’, ధనుష్ హీరోగా రూపొందిన ‘వడ చెన్నై’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారామె. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
భర్తను చంపిన భార్య
రామగుండం: నిత్యం భార్యను వేధింపులకు గురి చేయడంతో ఓ భార్య భర్తను హతమార్చిన ఘటన రామగుండం పట్టణంలో జరిగింది. రామగుండం సీఐ సాగర్, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆయలం ఎదుట ఎత్తరి మల్లేశ్–సరిత దంపతులు నివసిస్తుంటారు. వీరికి కుమారుడు భాస్కర్, కూతురు సరిత ఉన్నారు. ఇతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వీరి ఇంటి పక్కనే తమ్ముడు విజయ్‌కుమార్ నివాసం ఉంది. కాగా మల్లేశ్ తరచూ వివిధ కారణాలతో భార్య సరితను వేధిస్తుంటాడు. భార్య సరిత తల్లిగారు వరంగల్ జిల్లాలోని మడికొండ మండల పరి«ధిలో రాంపూర్ గ్రామంలో ఒక ఆస్తిని రాసిచ్చారు. దానిని విక్రయించి డబ్బులు తీసుకురమ్మని భార్య సరితపై చేయి చేసుకుంటూ అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీంతో భార్య సహనం కోల్పోయి తన మరిది విజయ్‌తో కలిసి ఆదివారం రాత్రి మల్లేశ్ నిద్రిస్తున్న సమయంలో విచక్షణారహితంగా కత్తులు, గడ్డపారతో పొడిచి హతమార్చారు. స్థానికులు గుర్తించి రామగుండం పోలీసులకు సమాచారమివ్వడంతో గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి, రామగుండం సీఐ, ఎస్సైలు ఘటన స్థలిలో విచారించారు. అక్కడే ఉన్న గడ్డపార, రెండు కత్తులను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య సరిత, మృతుడి తమ్ముడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకున్న యువతి
-
కత్తితో విద్యార్థినిపై యువకుడి దాడి
ఖమ్మం జిల్లా : పోలీసులు, ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా ఆడవారిపై దాడులు ఆగటం లేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా ప్రేమసైకోగాళ్లకు భయమే లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులోని ఓ సినిమా హాలు వద్ద జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న యమున(17) అనే విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమించమంటూ రామలింగయ్య అనే యువకుడు వేధిస్తున్నాడు. తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో గురువారం కత్తితో యమునపై దాడి చేశాడు. ఈ ఘటనలో యమునకు ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రగాయాలు అయ్యాయి. రామలింగయ్య గతంలో లైంగిక వేధింపుల కేసులో పోస్కో చట్టం కింద అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే కత్తులతో బెదిరించి
-
మందు పార్టీకి పిలిచి...
సాక్షి, తిరువొత్తియూరు: పేకాట సందర్భంగా ఏర్పడిన ఘర్షణ ఒక యువకుని హత్యకు దారితీసింది. నలుగురి ఎదుట ఘర్షణకు దిగడంతో అవమానంగా భావించిన యువకుడు స్నేహితుడిని మందు పార్టీకి పిలిచి కత్తితో పొడిచి హత్యచేశాడు. ఈ సంఘటన తమిళనాడులో సోమవారం చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండికు తరలించారు. చెన్నై ఐసీఎఫ్ కక్కన్జీ నగర్‌కు చెందిన దిలీప్ కుమారుడు ప్రకాశ్ (20) విల్లివాక్కంలో ప్రవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సూర్య (22)తో ఇతనికి స్నేహం ఉంది. వీరిద్దరూ రెండు రోజుల కిందట పేకాట ఆడుతుండగా ఘర్షణ ఏర్పడింది. ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పక్కనున్నవారు సర్దిచెప్పి పంపారు. అయితే ప్రకాశ్‌పై సూర్య కక్ష పెంచుకున్నాడు. ఈ స్థితిలో సోమవారం ఉదయం 7.00 గంటలకు ప్రకాశ్ ఇంటికి వెళ్ళిన సూర్య కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుందాం రమ్మని పిలిచాడు. ఇద్దరూ ఐసీఎఫ్ సమీపంలో ఉన్నముళ్ల పొదల్లోకి వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో సూర్య తాను తెచ్చుకున్న కత్తితో ప్రకాశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సూర్య అనుమానాస్పదంగా పరిగెత్తడం గమనించిన స్థానికులు ముళ్లపొదల్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ప్రకాశ్ ప్రకాశ్ పడిఉండడాన్ని చూసి ఐసీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రకాశ్ మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సూర్యను అరెస్టు చేశారు. ప్రకాశ్ తనపై దాడి చేయడంతో అవమానంగా భావించి హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. -
‘ఆత్మరక్షణ కోసం కత్తి తెచ్చుకున్నా’..
సాక్షి, అన్నానగర్: తిరుచ్చి కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో వినతి అందజేసేందుకు వృద్ధురాలు కత్తితో రావడం సంచలనం కలిగించింది. తిరుచ్చి కాట్టూరు బిలోమినాల్ నగర్‌కు చెందిన పదవీ విరమణ పొందిన నర్సు మేరి(68). ఈమె సోమవారం గ్రీవెన్స్‌డేలో పాల్గొనేందుకు కలెక్టరేట్ చేరుకుంది. భద్రతా అధికారులు ఆమె వద్ద ఉన్న సంచిలో తనిఖీ చేయగా అందులో కత్తి లభించింది. ఆత్మరక్షణ కోసం తాను కత్తిని వెంట తెచ్చుకున్నట్టు వృద్ధురాలు తెలిపింది. పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేరి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అందులో.. తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఇంటిని కూల్చేస్తామని, హత్యా బెదిరింపులు చేస్తున్నట్టు వివరించింది. దీనిపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ఘోరం: కూర్చున్న వారిపై కత్తితో దాడి
ఒడిశా: గంజాం జిల్లా హింజిలికాట్ నియోజకవర్గం పరిధి బదిఅంబొ గ్రామంలో ఆదివారం ఘోరం జరిగింది. ఒకరి దాడిలో చిన్నారి, వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన నేరస్తుడిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు. సమాచారం తెలుసుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నేరస్తుడికి రక్షణ కల్పించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఐఐసీ ప్రశాంత్ కుమార్ సాహు, గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. హింజిలికాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బదిఅంబొ గ్రామంలో వృద్ధురాలు కోమ్మ సెఠి(67) తన ఇంటి బయట అరుగుపై శనివారం ఉదయం కూర్చొని ఉంది. ఆమె పక్కనే ఆమె మనుమరాలు శ్రీయా సెఠి(4) ఆడుకుంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన రంజన్ సెఠి ఒక్కసారిగా కోమ్మ సెఠిపై కత్తితో దాడి చేసి తీవ్రగాయాల పాలుచేశాడు. తర్వాత శ్రీయాసెఠిపై కూడా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలతో పడివున్న నాయనమ్మ, మనుమరాలిని గ్రామస్తుల సహాయంతో బంధువులు హింజిలికాట్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్సలు జరిపారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా కోమ్మసెఠి, శ్రీయాసెఠి మృతి చెందారు. జరిగిన సంఘటనపై బదిఅంబో గ్రామస్తులు ఆగ్రహానికి గురై నేరస్తుడు రంజన్ సెఠిని పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలు పెట్టారు. సమాచారం అందుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నేరస్తుడు రంజన్ సెఠికి రక్షణ కల్పించారు. అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి కారణాలు పాతకక్షలు లేదా వైవాహిక సంబంధం ఉండవచ్చునని ఐఐసీ అధికారి ప్రశాంత్ కుమార్ సాహు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
కూకట్‌పల్లిలో ఉన్మాది కత్తితో వీరంగం
-
మహిళపై కత్తితో దాడి బంగారం అపహరణ
-
భార్యను కత్తితో నరికిన భర్త
అమరావతి : మండల పరిధిలోని నరుకుళ్లపాడులో గురువారం భార్యను కత్తి నరికి భర్త గాయపరిచిన సం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన మామిడి వెంకటేశ్వరరావుకు నరుకుళ్లపాడుకు చెందిన లక్ష్మీకి కొన్నేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా లక్ష్మి తల్లిదండ్రుల ఊరైన నరుకుళ్లపాడులో ఉంటోంది. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరరావు ఆవేశంతో నరుకుళ్లపాడు చేరుకున్నాడు. పొలం వెళ్లిన లక్ష్మిని గ్రామ శివారులో తనతో తెచ్చుకున్న కత్తితో నరికాడు. ఆమె ఎడమ చెవి, కుడి గడ్డం పైన, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అమరావతి పోలీ సులు కమ్యూనిటీ హెల్త్ సెంట ర్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ మీద ప్రేమతో.. చిన్నమ్మను..!
చెన్నై: తన తల్లిని వదిలేసి తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఆ మహిళపై కత్తితో దాడి చేయటంతోపాటు ఆమె కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సెయ్తుంగనల్లూర్ సమీపంలో ఉన్న నాట్టూరుకుళం గ్రామానికి చెందిన చెల్లపాండి(50) కేరళ రాష్ట్రంలో హోటల్ నడుపుతున్నాడు. ఇతని భార్య వండి మలైచ్చి. వీరి కుమారుడు వండి మలైయాన్(21). అయితే భార్యతో విభేదాలు తలెత్తటంతో కొన్నేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. దీంతోపాటు వల్లనాడు సమీపం పాలైకాడు గ్రామానికి చెందిన రాజేశ్వరిని(38) రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నందిని అనే నెలన్నర పాప ఉంది. ఇటీవలే భార్య, కూతురును చూసేందుకు పారైక్కాడ్కు వచ్చిన చెల్లపాండి మంగళవారం ఉదయం కేరళకు వెళ్లాడు. తన తండ్రి రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి వండిమలైయాన్ ఆగ్రహాంతో ఉన్నాడు. మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. నిద్రపోతున్న పసికందు నందినిని ఎత్తి నేలకు కొట్టడంతో చనిపోయింది. అయినా ఆవేశం తీరక వెంట తెచ్చుకున్న కత్తితో రాజేశ్వరిని పొడిచాడు. ఆమె అరుపులకు ఇరుగుపొరుగు వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపుమడుగులో ఉన్న రాజేశ్వరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో మురప్పనాడు పోలీసులు మలైయాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
బ్యాంకు ఉద్యోగి ఘాతుకం
పావగడ(అనంతపురం): పట్టణంలోని రెయిన్ గేజ్ వీధిలో స్థానిక ఎస్బీఎం(ఐ) ఉద్యోగి రాఘవేంద్రాచారి(50) ఘాతుకం సృష్టించాడు. తల్లి వెంకటలక్ష్మమ్మ(70), భార్య మాధవి(45) కూతురు ప్రవల్లిక(12) లపై విచక్షణా రహితంగా మచ్చు కత్తితో దాడి జరిపి తీవ్ర గాయాల పాలుచేశాడు. ఈ దుర్ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ దాడిలో తల్లి తలకు బలమైన దెబ్బలు తగలడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. భార్య, కూతురు చేతులు, వీపు కు దెబ్బలు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ముగ్గురు బెంగుళూరు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు రాఘవేంద్రాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నిందితుడు ఎస్బీఎం బ్యాంకులో సీనియర్ హెడ్ క్యాషియర్ గా పని చేస్తున్నాడు. సంఘంటన జరిగిన రాత్రి సుమారు 1 గంటకు ఇంటికి చేరుకున్నాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావని తల్లి అడగడంతో కోపోద్రిక్తుడై అందుబాటు లో ఉన్న మచ్చుకత్తితో తల్లి పై దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. అడ్డొచ్చిన భార్య , కూతురి పై కూడా దాడి చేసి నరికాడు. అయితే తల్లి తలను బలంగా నరకడంతో రక్త సిక్తమైంది. భార్య వీపుకు, కూతురి చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను రాత్రికి రాత్రే బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నిందితుడు చాలా కాలం నుండి మానసిక వ్యాధితో బాధ పడుతుండే వాడని, సైకలాజిస్టుతో చికిత్స పొంది ఔషధాలు వాడుతుండేవాడని తెల్సింది. ఈ నేపథ్యంలో 2 నెలల నుండి మాత్రలు వాడక పోవడంతో సైకో రీతిలో ప్రవర్తించే వాడని తెల్సింది. -
రూ. వెయ్యి కోసం ఎంత పని చేశాడు !
మదనపల్లె: అప్పుగా తీసుకున్నరూ.వెయ్యి సకాలంలో ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి కత్తితో యువకుడి గొంతు కోశాడు. ఈ సంఘటన ఆదివారం చౌడేపల్లె మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పందిళ్లపల్లె పంచాయతీ బాల సముద్రానికి చెందిన రాయల అంజప్ప కుమారుడు రమేష్(35) కొంత కాలంగా చౌడేపల్లెలో ఇళ్లు అద్దెకు తీసుకుని తన స్నేహితులతో కలిసి మార్బుల్ పనులు చేస్తున్నాడు. అతని గదిలోనే కర్ణాటకకు చెందిన అప్పి(35) అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని వద్ద రమేష్ చేబదులుగా రూ.వెయ్యి తీసుకున్నాడు. తిరిగి ఆ డబ్బులు అప్పికి ఇవ్వలేదు. దీనిపై ఇద్దరు ఆదివారం ఉదయం గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో అప్పి గదిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తితో రమేష్‌పై దాడి చేసి గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని సహచరులు హుటా హుటిన కారులో స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతికి రెఫర్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
‘కత్తి’లాంటి మసాజ్
చాలా రకాల మసాజ్లను మనం చూశాం.. కానీ ఇలాంటిది ఎక్కడైనా చూశామా? మటన్ కత్తులతో మసాజ్.. కీమా కొట్టినట్లు లయబద్ధంగా మన శరీరంపై అవి నాట్యం చేస్తుంటే..కొందరికైతే.. టెన్షన్ తగ్గడానికి బదులు మరింత పెరుగుతుందేమో.. ఈ కత్తిలాంటి మసాజ్ మీకూ కావాలంటే తైవాన్‌లోని తైపీకి వెళ్లాల్సిందే.. అక్కడ హియో మీ ఫాంగ్ అనే మహిళ తమ సెంటర్లో ఈ చిత్రమైన మర్దన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2,500 ఏళ్ల క్రితం నుంచి ఈ తరహా మర్దన కార్యక్రమం ఉందట. చైనాలో ఫస్ట్ టైం చేశారట. తొలుత చాలా మంది ఇదేదో సరదా కోసం చేస్తున్నదని భావించినా.. మసాజ్ పూర్తయిన తర్వాత దాని ఫలితాలను చూశాక.. ఇది చేయించుకోవాలని తమకు తెలిసినవారికి సిఫార్సు చేస్తున్నారని ఆమె తెలిపారు. దీని వల్ల కణాలు పునరుజ్జీవం కావడంతోపాటు శరీరం అంతా రిలాక్స్‌గా అయిపోతుందని చెప్పారు. ఇది చేయించుకున్నప్పుడు శరీరంలో కరెంటు ప్రవహిస్తున్నట్లు అనిపించిందని ఓ వ్యక్తి తెలిపారు. దీని వల్ల తన మెడనొప్పి తగ్గిందన్నారు. -
‘గాంధీ’లో కత్తితో వ్యక్తి హల్చల్
► వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందని.. హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి మరణించిందంటూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. తన తల్లికి చికిత్స చేసిన వైద్యులను చంపుతానంటూ కొన్ని రోజులుగా భయ భ్రాంతులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఫిర్యా దు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేద ని బాధితులు వాపోతున్నారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సిరిగిరిపేటకు చెందిన శకుంతల (55) పలు రుగ్మతలతో మార్చి 24న ఆస్పత్రిలో చేరింది. కుమారుడు బధ్రు ఆమెకు సహాయకునిగా ఉన్నాడు. ప్రాణాపాయస్థితి లో ఉన్న ఆమెను కాపాడేందుకు వైద్యులు రెండుమార్లు సర్జరీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 19న శకుం తల మరణించడంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన తల్లి మృతి చెందిందంటూ కొడుకు బధ్రు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీనిపై 5 రోజులైన పోలీసులు స్పందించ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కు మార్ మంగళవారం తెలిపారు. -
సైకో వీరంగం
– కత్తి చేతపట్టుకుని, రాళ్లు విసురుతూ వీరంగం – నాలుగు గంటలపాటు ఉద్రిక్తత – అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు చింతకుంట (ఆళ్లగడ్డ): నగర పంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామానికి చెందిన పుల్లిగాల్ల మహమ్మద్వలికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గత కొంత కాలం క్రితం భార్య, పిల్లలు అతడిని వదిలి వెళ్లి పోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము నుంచి మహమ్మద్‌వలి మానసిక పరిస్థితి అదుపు తప్పి సైకోగా మారాడు. చేతిలో కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ గ్రామస్తులపై రాళ్లు రువ్వుతూ, బూతులు తిడుతూ దాడి చేసెందుకు వెంట పడ్డాడు. ప్రజలు భయపడి ఇంటికి తలుపులు వేసుకున్నారు. పని మీద బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు. ఈ క్రమంలో ఐదారు మందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి యత్నించాడు. దాదాపు నాలుగు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సైకోను కోర్టు అనుమతితో మెంటల్ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
భర్త చేతిలో కన్ను కోల్పోయిన భార్య మృతి
బనశంకరి(బెంగళూరు): భర్త చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహిళ గురువారం ఉదయం మృతి చెందింది. వివరాలు...పక్షం రోజుల క్రితం జీవనోపాధి కోసం ఒడిస్సా నుంచి వచ్చిన రాధా, మున్నా ఇక్కడి నాగేనహళ్లిలో నివాసం ఉంటున్నారు. ఇక్కడి మంత్రి డెవలపర్స్ కంపెనీలో ఇద్దరు హౌస్‌కీపింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అందగా ఉన్న రాధాను అందరు చూస్తుంటాన్ని సహించలేని మున్నా, భార్యను అందవిహీనంగా మార్చాలని బుధవారం మధ్యాహ్నం రొట్టెకాడ తీసుకుని ఆమె కంటిని పీకేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని బాప్టిస్ట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మొగుడు కాదు.. రాక్షసుడు
► భార్యపై కత్తితో దాడి చేసిన భర్త ► భార్య చనిపోయిందనుకుని తానూ గొంతుకోసుకున్న వైనం ► ముస్కాన్‌పేటలో సంఘటన ► గర్భం ఎలా వచ్చిందని అనుమానం ► డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని పట్టు ► పెళ్లయిననాటి నుంచి చిత్రహింసలే బాధితురాలు ప్రియాంక ఇల్లంతకుంట(మానకొండూర్): పచ్చటి పెళ్లిపందిరి.. వేదపండితులు... అగ్నిగుండం సాక్షిగా ఏడడుగులు నడిచి తాళికట్టి జీవితాంతం తోడుంటానని బాస చేసిన మొగుడే అనుమానంతో ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాలని పథకం పన్నాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. భార్య మృతి చెందిందని భావించి అదే కత్తితో గొంతుకోసుకుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర మహేష్(26)కు ఏడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొండ శ్రీనివాస్–లావణ్య దంపతుల పెద్ద కూతురు ప్రియాంక(22)తో వివాహమైంది. పెళ్లయిన నాటినుంచి మహేశ్ భార్యను అనుమానిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. అయినా ఓపికగా భరించింది. ఈ క్రమంగలో ప్రియాంక గర్భందాల్చింది. పది రోజుల క్రితం భార్యను పుట్టింటికి పంపించాడు. మూడు రోజుల క్రితం మళ్లీ ఫోన్ చేయడంతో ప్రియాంక మెట్టింటికి వచ్చింది. ‘నీకు వచ్చిన కడుపు నాతో రాలేదని, ఇంకెవరితోనో వచ్చిందని మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని వేధించాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కరెంటుషాక్ పెట్టేందుకు మహేశ్ ప్రయత్నించగా తీగలను ప్రియాంక లాగేసింది. దీంతో కోపోద్రిక్తుడై కత్తితో దాడిచేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియాంకను అత్త వీరమ్మ గమనించి పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు సమాచరమందించింది. అతను ద్విచక్రవాహనంపై సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ప్రతిమా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రియాంక మృతిచెంది ఉంటుందనే భయంతో మహేశ్ అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. స్థానికులు మహేశ్‌ను భార్య చికిత్స పొందుతున్న ఆస్పత్రికే తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రియాంక ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. రక్తం బాగా పోయిందని, కడుపులో బిడ్డను తీసేస్తేనే ప్రియాంక ప్రాణాలు దక్కుతాయని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు గుక్కెడు నీళ్ళివ్వమన్నా దగ్గరకు రాలేదు.... తన భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా కేకలు వేసుకుంటూ ఇంటి ముందు వాకిట్లో రక్తపు మడుగులో కొట్టుకుంటూ గుక్కెడు నీళ్ళివ్వమన్నా ఊళ్లోవారెవరూ దగ్గరకు రాలేదని దాహంతో అల్లాడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రియాంక రోదిస్తూ తెలిపింది. అనుమానంతో సైకోగా మారి తన ప్రాణాల్ని తీయాలనుకున్న భర్త మహేశ్‌ను వదిలిపెట్టొద్దని ఎస్సైని వేడుకుంది. -
గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య
కొత్తకోట: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్దుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘంటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక బుడగజంగాల కాలనీకి చెందిన రామస్వామి(70), అచ్చమ్మలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రామస్వామి మానసికస్థితి సరిగా లేక జీవసమాధి అవుతానంటూ కుటుంబీకులను బెదిరించేవాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు శివ, కోడలు పద్మలతో రామస్వామి తరచూ గొడవపడేవాడు. మూడు రోజుల క్రితం పద్మను రామస్వామి గాయపరచడంతో పెద్దలు మందలించారు. ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రామస్వామి కూరగాయలు తరిగే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో వనపర్తికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే రామస్వామి మృతిచెందాడని ఏఎస్సై సత్తార్ తెలిపారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
పుట్లూరు (శింగనమల) : పుట్లూరు మండలంలోని గొల్లపల్లిలో సర్వస్వతి అనే మహిళపై ఆమె భర్త దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. మద్దలపల్లి గ్రామానికి చెందిన రమేష్, గొల్లపల్లి గ్రామానికి చెందిన సరస్వతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా సరస్వతి పుట్టింటి వద్దే ఉంటోంది. భార్యపై అనుమానంతో రమేష్ ఆదివారం కత్తితో దాడి చేశాడు. దాడిని అడ్డుకోబోయిన సరస్వతి అక్క చంద్రకళ కూ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సరస్వతిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం అనంతపురానికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పీక కోస్తా!
సమంతలాంటి సుకుమారి సున్నితంగా మల్లెపువ్వునో, గులాబీలనో కోస్తే చూడ్డానికి బాగుంటుంది కానీ, మనిషి పీక కోస్తే? అలాంటి సీరియస్ రోల్లో ఈ బ్యూటీని చూడబోతున్నాం. ప్రస్తుతం సమంత చేస్తున్నవాటిలో ఓ తమిళ సినిమా ఉంది. ఆ చిత్రంలోనే ఆమె ఇలాంటి పాత్రలో కనిపించనున్నారు. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అనీది కథైగళ్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. ఇక్కడ ఫొటోలో సమంత చేత్తో కత్తితో ఓ వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నిçస్తున్న దృశ్యం ఆ సినిమాలోదే. ‘ఇంద్ర’లో ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అని చిరంజీవి అన్నట్లు.. ఈ చిత్రంలో ‘నాతో పెట్టుకుంటే పీక కోస్తా’ అని సమంత అంటారేమో. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో సమంత క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని దర్శకుడు అంటున్నారు. స్టిల్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది కదూ. -
కత్తులతో తెలుగు తమ్ముళ్ల బెదిరింపు
ఆలూరు: తమకు మామూళ్లు ఇవ్వాలని విండ్ పవర్ కంపెనీల సిబ్బందిని టీడీపీ నాయకులు కత్తులతో బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇవీ. ఆలూరు నియోజకవర్గంలోని మొలగవెల్లి, హత్తిబెళగళ్, పెద్ద హోతూరు, ఆస్పరి, చిన్నహోతూరు, పెద్దహోతూరు ఆలూరు తదితర గ్రామాల పరిధిలో గమేషా, లోటర్, సుజనా తదితర విండ్ పవర్ కంపెనీలు.. ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందు కోసం వీరు రైతుల వద్ద వ్యవసాయ భూములను కొనుగోలు చేసేవారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదని గత నెలలో టీడీపీ నాయకులు కంపెనీ సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేయడంతో పంచాయితీ జరిగింది. పనులకు ఇసుక, రాయి తామే సరఫరా చేస్తామని టీడీపీ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం.. విండ్ పవర్ కంపెనీలు తమకు మామూళ్లు ఇవ్వడం లేదని దాదాపు 12మంది టీడీపీ నాయకులు ఫూటుగా తాగి కత్తులు, పిడిబాకులతో సిబ్బందిని బెరించారు. సెక్యూరిటీ గాడ్స్ ఆలూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడి చేరుకొనే సరికి టీడీపీ నాయకులు వెళ్లిపోయారు. -
తపంచా విక్రయిస్తూ ఇద్దరు అరెస్ట్
ఆత్మకూరు: తపంచా విక్రయిస్తూ ఓ వ్యక్తి పట్టుబడగా, కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వినోద్ కుమార్ మీడియాకు వివరించారు. శ్రీపతిరావుపేట గ్రామ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వెంకట సుబ్బయ్య సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా తపంచా లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇందిరేశ్వరం గూడెంకు చెందిన చెంచుగల్లి శివ అనే వ్యక్తి గత ఏడాది అడవిలోకి వెళ్లిన సమయంలో తపంచా దొరికింది. దానిని శుక్రవారం తనకు తెలిసిన కరుణాకర్‌కు రూ. వెయ్యికి విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. -
‘వేధించిన వ్యక్తులను కత్తితో నరికింది'
తడ: తనను వేధించిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిపై ఓ యువతి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. రాష్ట్ర సరిహద్దులో తమిళనాడు పరిధిలోని గుంపిలి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఆరంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంపిలి గ్రామంలో జీవిత అనే యువతి పట్ల అదే గ్రామానికి చెందిన ఇద్దరు బుధవారం అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె ఆరంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు రాజీ చేస్తూ ఒకే గ్రామానికి చెందినవారు కాబట్టి సర్దుకు పోవాలని చెప్పి పంపారు. పోలీసులు, గ్రామపెద్దలు తమకు న్యాయం చేయలేదని బాధితురాలి కుటుంబం ఆవేదన చెందింది. ఈ విషయమై గురువారం గ్రామంలో మళ్లీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో జీవిత తన కుటుంబసభ్యులతో కలసి కత్తితో దాడిచేసింది. ఈ దాడిలో ఓ మహిళ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళను చెన్నై ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని పొన్నేరికి తరలించారు. తమిళనాడు పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. -
యువతి గొంతు కోసి పరారైన యువకుడు
-
కత్తితో భార్యపై దాడి
కర్లపాలెం: మద్యానికి బానిసైన భర్త అనుమానంతో భార్యపై కత్తితో దాడిచేసి గాయపరిచిన సంఘటన శుక్రవారం సాయంత్రం పేరలి గ్రామంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... పేరలి గ్రామానికి చెందిన ఏసుదయానందరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన జోగి రజనితో పదేళ్ళక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్రమ సంబంధానికి, మద్యానికి బానిసైన ఏసుదయానందం భార్యను అనుమానించి తరచూ గొడవపడుతుండేవాడు. భర్త హింసలు భరించలేని రజని గత కొంతకాలంగా భర్తకు దూరంగా వేరే ఇంట్లో నివసిస్తోంది. ఈనేపథ్యంలో రజని శుక్రవారం తన బావ కుమారుడు మహేంద్రతో కలసి తన పొలంలో వరికోత కోస్తుండగా ఏసుదయానందరావు ఆవేశంగా పొలం వద్దకు వచ్చి నాకు తెలియకుండా కోత కోస్తావా అంటూ ఆమెపై కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న మహేంద్ర అడ్డుకున్నాడు. ఈ ఘటనలో రజనికి తీవ్రగాయాలవటంతో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలందించేందుకు గుంటూరు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. నిందితుడు ఏసుదయానందరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
కత్తితో బెదిరించి...
కర్నూలు : నగర శివారుల్లోని మాసమసీదు వద్ద గురువారం అర్ధరాత్రి కత్తితో బెదిరించి ఓ రైతు వద్ద నుంచి దుండగులు డబ్బులు లాక్కొని ఉడాయించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. జి.సింగవరం గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని మున్సిపల్ ఆఫీసు వద్ద స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్నాడు. ముగ్గురు యువకులు కూడబలుక్కొని అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ నాగన్నను మాటల్లో పెట్టారు. తాము కూడా సింగవరానికి వెళ్తున్నామని నమ్మించి, ఆటోలో ఎక్కించుకొని నగర శివారుల్లోని వాగు వద్ద తుంగభద్రనది వైపు ఆటోలో తీసుకెళ్లి అరవకుండా నోటికి బట్టకట్టి దాడి చేసి గాయపరిచారు. రైతు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా కత్తితో బెదిరించి అడ్డపంచతో పాటు డబ్బులు లాక్కున్నారు. రైతు కేకలు వేసుకుంటూ డ్రాయర్తో మెయిన్ రోడ్డుకు పరిగెత్తి మునగాలపాడుకు నడుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బైక్ తెప్పించుకొని స్వగ్రామానికి చేరుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరించారని బాధితుడు సాక్షితో తన గోడును చెప్పుకున్నాడు. -
భార్యపై కత్తితో దాడి
-
సైకో బీభత్సం..ప్రజల దేహశుద్ధి
-
ఉన్మాది బీభత్సం.. ప్రజల దేహశుద్ధి
► విశాఖలో ఏడుగురిని కత్తి, బ్లేడుతో గాయపరిచిన సైకో ► కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులతో ప్రజలను భయభ్రాంతులను చేసిన ఉన్మాదికి దేహశుద్ధి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. వివరాలు.. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతంలో బిహార్‌కు చెందిన ఓ ఉన్మాది (సైకో) శుక్రవారం రాత్రి స్థానిక ప్రజలపై చిన్నపాటి కత్తి, బ్లేడుతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఐటీఐ కూడలి నుంచి కంచరపాలెం ఫ్లైఓవర్ వంతెన కూడలి వరకు ఏడుగురికి గాయాలు పడేలా కత్తులతో పొడుచుకుంటూ వీరంగం సృష్టిం చాడు. దీంతో ప్రజలు తలోదిక్కు పారిపోయారు. వారిని తరుముకుంటూ కంచరపాలెం మెట్టు వరకూ వెళ్లిన ఉన్మాదిపై స్థానిక ప్రజలు, పాదచారులు, వాహనదారులు కర్రలతో దాడి చేశారు. దీంతో ఉన్మాది స్పృహతప్పి కుప్పకూలి పోయాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదో పట్టణ, ఎయిర్‌పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న అతనిని 108 లో కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్మాది మృతి చెందాడు. -
ఆస్తి కోసం పిన్నిపై హత్యాయత్నం
దర్శి(ప్రకాశం): ఆస్తి కోసం పిన్ని (చిన్నాన్న భార్య)పై ఓ యువకుడు హత్యాయత్నం చేశాడు. దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఈ సంఘటన జరిగింది. మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన పిచ్చాల ఈశ్వరరెడ్డి, పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి అన్నదమ్ములు. అన్న వెంకటేశ్వరరెడ్డి దొనకొండ మండలం గుడిపాడులో నివాసం ఉంటున్నారు. తమ్ముడు ఈశ్వరరెడ్డి, అతని భార్య పోలమ్మ అబ్బాయిపాలెం గ్రామంలోనే ఉంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈశ్వరరెడ్డికి చెందిన ఆస్తిలో తమకు కూడా హక్కు ఉందని వెంకటేశ్వరరెడ్డి కుమారుడు కోటిరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. మధ్యలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా చేశారు. అయినప్పటికీ ఇద్దరి మధ్యా సయోధ్య కుదరలేదు. వివాదాలు చోటుచేసుకోవడంతో కోర్టు ఎలా తీర్పు ఇస్తే అలా చేద్దామని పోలమ్మ చెప్పింది. తమకు ఆస్తి రాకుండా పిన్ని పోలమ్మ అడ్డుపడుతుందని భావించిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను హత్యచేస్తే ఆస్తి వస్తుందని భావించాడు. సరుకుల కోసం ఆటోలో దర్శి వచ్చిన పోలమ్మపై స్థానిక గడియార స్తంభం సెంటర్లో కొబ్బరి బోండాల కత్తితో తల, మెడపై కోటిరెడ్డి దాడిచేసి గాయపరిచాడు. ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. పట్టపగలే ఓ మహిళపై కత్తితో దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కత్తితో ముగ్గురిపై దాడి
ఒకరి పరిస్థితి విషమం– ఇద్దరికి స్వల్ప గాయాలు కొత్తగూడెం క్రైం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తగూడెం మండల పరిధిలోని కారుకొండపంచాయతీ తెలగ రామవరం ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ బూర రాజగోపాల్ కథనం ప్రకారం... ఎస్సీ కాలనీకి చెందిన జక్కం రాజేందర్‌కు మెుదటి భార్యతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చాడు. 2015లో లక్ష్మిదేవిపల్లికి చెందిన జక్కం సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరి మధ్య కూడా గొడవల కారణంగా సుజాత పుట్టింటికి వెళ్లింది. జీవనధారం కోసం ఓ షాపులో గుమస్తాగా పని చేస్తున్న సుజాతను రాజేందర్ కొద్ది రోజులుగా షాపు వద్దకు వెళ్లి వేధించసాగాడు. ఈ క్రమంలో ఇరువురు ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుద్దామని ఒప్పందం కుదుర్చుకొని, పెద్ద మనుషుల సమక్షంలో మట్లాడారు. అయితే రాజేందర్ పెద్ద మనుషుల మాట వినకపోవడంతో సుజాత ఇంకా కొన్ని రోజులు పుట్టింటిలోనే ఉందామని నిర్లయించుకుంది. ఇంట్లో ఉన్న దుస్తులు తెచ్చుకోవడానికి సుజాత ఇంట్లోకి వెళ్లగా భర్త రాజేందర్ వెనుక నుంచి ఇనుప రాడ్డు తీసుకువచ్చి కుడి భుజంపై కొట్టడంతో గమనించి చెల్లెలు కళ్యాణి, తల్లి లక్ష్మిలు ఇంట్లోకి రాగా వారిని కూడా కత్తితో బలంగా దాడి చేశాడు. వెంటనే సుజాత తన చెల్లి, తల్లిని ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించింది. అనంతరం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తితో యువకుడి దాడి: 19 మంది మృతి
-
కత్తితో యువకుడి దాడి: 19 మంది మృతి
టోక్యో: జపాన్‌లోని టోక్యోలో ఓ 26 ఏళ్ల యువకుడు కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ చెప్పుకుంటూ నల్ల దుస్తులు ధరించి వికలాంగుల సౌకర్యార్ధం కేటాయించబడిన సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి విచక్షణ లేకుండా దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలయినట్టు తెలిసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 50 మందికి పైగా అతడి దాడిలో గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. (భారత్ కాలమానం ప్రకారం) 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రమకు పదును..!
– ఆరు పదుల వయసులోనే అలుపెరగని యోధుడు – సానపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న జమాల్‌షా బనగానపల్లె: చదివిన చదువుకు సరైన పని దొరకక ఇబ్బంది పడేవారిని మనం చూసే ఉంటాం. వత్తిలో ఒడిదుడుకులను తట్టకోలేక వేరే వృత్తికి మారే వారిని గమనించి ఉంటాం. పనినే దైవంగా భావించి.. ఆ పనితోనే కుటుంబాన్ని చక్కగా పోషించే వారు అరుదుగా తారసపడతారు. ఇలాంటి కోవకు చెందిన వారే బనగానపల్లె మండలం మీరాపురం గ్రామానికి చెందిన జమాల్‌షా(65). కత్తులు, కత్తెర్లు సానలు పట్టడంలో ఈయన మంచి దిట్ట. రోజుకు 8–10 గంటలు శ్రమించి కుటుంబ పోషణకు అవసరమయ్యే మొత్తాన్ని సంపాదిస్తాడు. ఈ విషయం గ్రామప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా తెలుసు. గత 30 సంవత్సరాలుగా తాను నమ్ముకున్న వత్తి ద్వారానే తన కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. తాను ఈ వత్తిని ఎంచుకున్న విధానంపై జమాల్‌షా మాటల్లోనే..‘‘ మాది పేద కుటుంబం. చిన్న వయసులోనే బరువైన పనులు చేయాల్సి వచ్చేది. పని చేయకుంటే అమ్మానాన్న తిట్టేవారు. వారి తిట్టు భరించలేక హైదరబాద్ పారిపోయాను. అక్కడ నాయిబ్రాహ్మణ కులానికి చెందిన వెంకటస్వామి నన్ను ఆదరించారు. సానపట్టు మిషన్ వద్ద మెలకువలు నేర్చుకున్నాను. అప్పట్లో పది వేల రూపాయల పెట్టుబడితో సాన పట్టు మిషన్ కొన్నాను. అదే నాకు ఇప్పుడు బువ్వ పెడుతోంది. కత్తెర సానకు రూ 20, కత్తి సానకు రూ. 15 తీసుకుంటాను. ఎన్నో ప్రాంతాలు తిరిగాను. సుదూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో నెలలో 20 రోజులు అక్కడే ఉండి మరో పది రోజులు ఇంటి వద్ద ఉంటాను. నాకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశాను, పెద్ద కుమారుడు ఆటో నడుపుతున్నాడు. రెండో కుమారుడు ఆర్మీలో పనిచేస్తుండగా, మూడవ కుమారుడు స్వతహాగా జీవనం సాగిస్తున్నాడు. పనిని నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయను. ఇదే నా కుమారులకు, కుమార్తెకు కూడా చెప్పాను.’’ -
దంపతులను కత్తితో పొడిచి..
రూ. 5 వేల దోపిడీ ఆత్మకూర్(ఎం)లో దుండగుడి హల్చల్ ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఓ దుండగుడు హల్చల్ సృష్టించాడు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి రూ. 5 వేలు దోచుకుపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లోడి సోమయ్య, లోడి రాములమ్మ దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రిదుండగుడు ప్రహరీ ఎక్కి స్లాబ్ మీదుగా ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశాడు. రూ. 5 వేల నగదును అపహరించాడు. తర్వాత మంచంపై పడుకున్న రాములమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు పుస్తెల తాడును లాక్కొనే ప్రయత్నం చేస్తుండగా ప్రతిఘటించింది. దీంతో దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో మెడపైభాగాన పోడిచాడు. సమీపంలోనే మంచం మీద పడుకున్న సోమయ్య మేల్కొని అడ్డురావడంతో అదే కత్తితో చాతి, మెడపై భాగాన పొడిచాడు. కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారి అలికిడి విని ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి. శివనాగప్రసాద్ అక్కడకు వచ్చారు. తీవ్ర గాయాలు అయిన సోమయ్య, రాములమ్మలను చికిత్స నిమ్తితం 108 అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. జాగిలాలతో గాలింపు దుండగుడి ఆచూకీ కోసం క్లూస్‌టీంను రంగంలోకి దిగారు. బీరువాపై ఉన్న వేలు ముద్రలను సేకరించారు. దుండగుడు అక్కడే వదిలేసిన చెప్పుల వాసనతో పోలీసు జాగీలంతో గాలింపును మొదలు పెట్టారు. పోలీసు జాగిలం మొరిపిరాల రోడ్డు మార్గాన పరిగెత్తి అక్కడ నుంచి ఇసుక ట్రాక్టర్ల బాట గుండా బిక్కేరు వాగు మీదుగా చిన్న గూడెం నుంచి మొరిపిరాల మీదుగా కాల్వపల్లి రోడ్డు వైపు అటు నుంచి తిరిగి మొరిపిరాల బండ వరకు వచ్చి ఆగిపోయింది. సంఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. శ్రీదర్‌రెడ్డి, ఎస్ఐ పి. శివనాగప్రసాద్ సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
కత్తి ఎవరు దించారు?
పట్టుకోండి చూద్దాం ‘జానకి రామయ్యను ఎవరో హత్య చేశారట...’ ‘చీమకు కూడా ఆపద తలపెట్టని వ్యక్తిని హత్య చేశారా?’ ‘ఈ రోజుల్లో ఒక నీతి అంటూ ఉందా? హంతకులకు... మంచివాళ్లు ఏమిటి? చెడ్డవాళ్లు ఏమిటి?’ ‘ఇంతకీ ఈ హత్య ఎవరు చేసి ఉంటారు?’ ‘అది ఎవరూ చెప్పలేకపోతున్నారు!’ ‘ఆయనకు వ్యాపారప్రత్యర్థులు కూడా ఎవరూ లేరు. అందరితో స్నేహంగా ఉంటారు’ ‘ఇంతకీ ఇది హత్యేనా? లేక ఆత్మహత్యా?’ ‘ఖచ్చితంగా హత్యే... డౌటే లేదు’ కేసు దర్యాప్తు చేయడానికి ఇన్స్పెక్టర్ నరసింహ రంగంలోకి దిగాడు. ‘‘నరసింహ ఎన్నో మిస్టరీలను ఛేదించవచ్చుగాక... ఈ మిస్టరీని మాత్రం ఛేదించలేడు. ఒక్క క్లూ కూడా దొరకడం లేదట’’ అనుకున్నారు నరసింహ అంటే గిట్టని వాళ్లు. నరసింహ కళ్లలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు... మిస్టరీని ఛేదిస్తాననే ఆత్మవిశ్వాసం తప్ప. జానకిరామయ్య పీఏ ప్రియను ఇంటరాగేట్ చేశాడు నరసింహ. ఇక్కడ ప్రియను గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ప్రియ చాలా నమ్మకంగా జానకిరామయ్య దగ్గర పనిచేస్తోంది. ఈ ప్రియ ఎవరు అనే దానిపై కూడా రకరకాల గాసిప్‌లు ప్రచారంలో ఉన్నాయి. తన భార్యకు తెలియకుండా జానకిరామయ్య వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు కలిగిన సంతానమే ప్రియ అనే వాళ్లు లేకపోలేదు. అదెంత వరకు నిజమో, అబద్ధమో తెలియదుగానీ... హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రియ కీలక వ్యక్తిగా మారింది. ఇన్స్పెక్టర్తో ఆమె చెప్పిన విషయాలు: 1. ఒక ఫైల్ ఇవ్వడానికి జానకి రామయ్యగారి క్యాబిన్లోకి వెళ్లాను. వెంటనే పెద్దగా అరిచాను. ఆయన వెన్నులో కత్తి దిగి ఉంది. 2. హత్యకు ముందు ఆయన ఎవరితోనో గొడవపడి ఫైట్ చేసినట్లు ఉన్నాడు. టేబుల్ మీద ఫైల్స్ చిందరవందరగా పడి ఉన్నాయి. రిస్ట్‌వాచ్ పగిలిపోయింది. 3. మధ్యలో ఒకసారి పెద్దగా అరుపులు వినిపించాయి. అలా అరవడం ఆయనకు అలవాటు కాబట్టి ఎప్పటిలాగే నేను పెద్దగా పట్టించుకోలేదు. 4. టేబుల్‌పై కాఫీ మరకలు కనిపించాయి. నిజానికి ఆయనకు కాఫీ తాగే అలవాటు లేదు. 5. ఛాంబర్లో ఒక మూల ఒక జత గ్లోవ్స్ కనిపించాయి. 6. నాగరాజు, విజయ్, రమణ, శ్రీనివాస్, రాఘవ... విజిటర్స్ బుక్‌లో చాలామంది పేర్లే నమోదై ఉన్నాయి. ప్రియ క్యాబిన్లోకి వచ్చాడు ఇన్స్పెక్టర్. ఓ మూలన ఉన్న డస్ట్‌బిన్‌లో రెండు కాఫీ కప్పులు కనిపించాయి. ఇన్స్పెక్టర్: ఈ కప్పుల్లో ఎవరు కాఫీ తాగారు? ప్రియ: ఒక కప్పులో నేను తాగాను... రెండో కప్పు నాగరాజుది. ఇన్స్పెక్టర్: నాగరాజు ఎవరు? ప్రియ: జానకిరామయ్యగారికి బాగా క్లోజ్ ఇన్స్పెక్టర్: నాగరాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ప్రియ: ఏదో నెంబర్ అడగడం కోసమని వచ్చాడు. మరిచిపోయి... కాఫీ కప్పు నా టేబుల్ మీదే పెట్టి వెళ్లిపోయాడు... ఆ తరువాత నేనే ఈ కప్పును డస్ట్‌బిన్‌లో పడేశాను. మరి కొద్దిసేపు దర్యాప్తు జరిపిన తరువాత ఇన్స్పెక్టర్ నరసింహ... ‘‘ప్రియా... ఈ హత్య నువ్వే చేశావు’’ అన్నాడు. ‘‘నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. ‘‘నిన్ను అనుమానించడానికి బలమైన కారణాలు ఇవి...’’ అంటూ చెప్పుకుపోయాడు ఇన్స్పెక్టర్. ప్రియ నేరం ఒప్పుకోక తప్పలేదు. ప్రియను ఇన్స్పెక్టర్ అనుమానించడానికి కారణం ఏమిటి? Ans:- 1. జానకిరామయ్యను వెనక నుంచి పొడిచారు. కాబట్టి ఫైట్ జరిగే అవకాశం లేదు. 2. ఫైట్ జరగలేదు కాబట్టి... రిస్ట్‌వాచ్ పగిలిపోయే అవకాశమే లేదు. ఇది కావాలనే చేసింది. 3. గ్లోవ్స్ వేసుకొని జానకిరామయ్యను పొడిచి ఉంటే... హంతకుడు ఆ గ్లోవ్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లడు. 4. రెండు కాఫీకప్పులపై ఒక్కరివే ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఈ కారణాలతో ప్రియ చెప్పినవన్నీ అబద్ధాలనే విషయాన్ని కనిపెట్టాడు ఇన్స్పెక్టర్. -
భార్యపై కత్తితో దాడి
చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాహీన్‌నగర్‌కు చెందిన నహిమా(21)కు ఉస్మాన్‌పూర్‌కు చెందిన వాజిద్ అలీ(25)తో 2014లో వివాహం జరిగింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పండుగకు పుట్టింటికి వెళ్లిన నహీమాకు శుక్రవారం సాయంత్రం వాజిద్ అలీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరాడు. ఈ మేరకు ఆమె అత్తింటికి చేరుకుంది. చిన్న విషయమై ఆమెకు అత్తతో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న వాజిద్ అలీ భార్యను కత్తితో పొడిచాడు. భుజంపై నహిమాకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్తయ్య తెలిపారు. -
గొంతులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు..
నంద్యాల(కర్నూలు): అత్యంత రద్దీగా ఉండే కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రం సెంటర్లో ఆటో డ్రైవర్ కిశోర్‌పై హత్యాయత్నం జరిగింది. కత్తి గొంతులోకి దిగడంతో గాయపడిన వ్యక్తి అలాగే స్టేషన్‌కు వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. నూనెపల్లెకు చెందిన కిశోర్గౌడ్కు కల్లుగీత కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా కొందరితో విభేదాలు తలెత్తాయి. మరికొందరితో ఆస్తి తగాదా కూడా ఉంది. ఆటో నడపడంతో పాటు అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం బొమ్మలసత్రంలో ఉండగా అతనిపై ఐదుగురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. వీరిలో ఒకరు కత్తితో గొంతుపై పొడిచాడు. వెంటనే అందరూ పరారయ్యారు. రక్త మోడుతూనే కిశోర్‌గౌడ్ సమీపంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనను వివరించాడు. వెంటనే అతన్ని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొంతులో కత్తితోనే కర్నూలుకు రెఫర్ చేశారు. అంతకు ముందు మేజిస్ట్రేట్ రామ్మోహన్ బాధితుని ఫిర్యాదు స్వీకరించారు. కిశోర్గౌడ్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల గుర్తింపునకు చర్యలు చేపట్టామని డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు. -
అన్న గొంతు కోసిన తమ్ముడు
హైదరాబాద్ : నగరంలోని గాంధీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో.. తమ్ముడు సొంత అన్న గొంతు కోశాడు. అన్న శ్రీధర్ యాదవ్‌కు తమ్ముడు శేఖర్‌యాదవ్‌కు మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు కత్తితో అన్నపై దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మేన కోడలిపై అత్యాచారం.. ఫొటోలతో బెదిరింపులు!
హైదరాబాద్: ఓ యువతిపై ఆమె సొంత మేనమామే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అజయ్ అనే యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న తన మేనకోడలిని కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక ఆమె నగ్న ఫొటోలను సెల్ఫోన్లో తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికినైనా చెబితే ఫొటోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
దాడిని అడ్డుకున్న 'విశ్వాసం'
పెంపుడు జంతువులు యజమానుల పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన శునకం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాటి విశ్వాసానికి తార్కాణంగా ఇప్పుడు యూట్యూబ్ లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన యజమానిపై దాడి చేయబోయిన వ్యక్తిపై ప్రతాపం చూపించిన ఆ పెంపుడు జంతువు వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాకుతో దాడికి దిగబోయిన వ్యక్తిని అడ్డుకొని.. తన యజమాని ప్రాణాలు నిలబెట్టిన ఓ పెంపుడు జంతువు వీడియో యూట్యూబ్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. కెన్యాకు చెందిన ఓ శిక్షణ పొందిన శునకం.. స్నేహానికి, హానికి మధ్య తారతమ్యాన్ని ఇట్టే పసిగట్ట గలిగింది. యజమానితోపాటు కూర్చొని హాయిగా కబుర్లు చెబుతున్న వ్యక్తి ప్రవర్తనలో మార్పును సెకన్లలోనే గమనించగలిగింది. యజమానిపై కత్తి దూయాలనుకున్న అతడ్ని... చాకచక్యంగా అడ్డుకొని యజమాని ప్రాణాలను కాపాడటంతోపాటు, విశ్వాసాన్ని చాటుకుంది. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు తోడ్పడుతూ, ఇళ్లలో కాపలాగా కూడా ఉపయోగపడుతున్న శునకాలు... తమ బాధ్యతను సవ్యంగా నిర్వర్తించడంతోపాటు... శిక్షణ ఇచ్చిన వారిపట్ల, యజమానిపట్ల చూపించే అత్యంత విశ్వాసం ప్రస్తుత వీడియోలో మరోమారు సాక్షాత్కరించింది. కెన్యాలో ఇటువంటి తర్ఫీదు పొందిన శునకాలు 20 వరకూ ఉన్నాయి. ప్రమాదాలను తప్పించుకునేందుకు, దొంగల బాధ నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తగా ఇటీవల షాపింగ్ మాల్స్, హోటల్స్, చర్చిలు వంటి వాటిలో కాపలా కోసం స్నిఫర్ డాగ్స్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి శునకాలను వైట్ కాలర్ జాబ్ డాగ్స్ అని కూడా అంటున్నారు. వీటి బ్రీడ్ ను బట్టి సుమారు వీటి ఖరీదు 20 లక్షల రూపాయలకు పైగా పలుకుతోంది. వీటిలో కేవలం కాపలాకు వినియోగించే డాగ్స్ సుమారు 12 వేల రూపాయలనుంచి, లక్షన్నర వరకూ ఉంటాయి. -
కత్తిపోటు... కనిపెట్టిందెవరు?
పట్టుకోండి చూద్దాం పోలీసు జీపు హాస్పిటల్ ముందు ఆగింది. ‘‘ఏమైంది?’’... జీపు దిగుతూనే అడిగాడు ఇన్స్పెక్టర్ సుభాష్. ‘‘వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎవరో పొడిచేసి పారిపోయారంట సర్’’ అన్నాడు కానిస్టేబుల్ కోటేశ్వర్రావ్. ‘‘పేషెంట్ మాట్లాడుతున్నాడా?’’ ‘‘ఇంకా లేదు సర్.’’ ‘‘మరి ఈ విషయం నీకెలా తెలుసు?’’ ‘‘అతని ఫ్యామిలీ మెంబర్స చెబుతున్నారు సర్. పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు.’’ తల పంకించాడు సుభాష్. ‘‘పద... అతని ఫ్యామిలీ మెంబర్సతో మాట్లాడుదాం’’ అంటూ లోనికి నడిచాడు. కానిస్టేబుల్ వెంబడించాడు. ఐసీయూ ముందు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఓ పెద్దాయన, ఓ యువకుడు, ఓ మహిళ. ఇన్స్పెక్టర్ని చూస్తూనే లేచి నిలబడ్డారు. ‘‘ఈ సంఘటన ఎలా జరిగింది?’’ అడిగాడు సుభాష్. ఆ ప్రశ్న వింటూనే బావురుమంది మహిళ. ‘‘ఊరుకోమ్మా’’ అన్నాడు యువకుడు. ‘‘ఆయన మా నాన్నగారు సర్. రోజూ ఉదయం వాకింగుకి వెళ్తారు. ఇవాళ కూడా అలాగే వెళ్లారు. వెళ్లిన కాసేపటికే మాకు ఫోన్ వచ్చింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి చేశాడు. వాకింగ్ చేస్తోన్న మా నాన్నగారిని ఎవరో కత్తితో పొడిచి పారిపోయారని చెప్పాడు. అందరూ కలిసి అంబులెన్సును పిలిచి నాన్నగారిని ఆస్పత్రికి పంపించారని చెప్పాడు’’... వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడతను. సుభాష్ ఏదో అడగబోతుండగా డాక్టర్ బయటికి వచ్చాడు. ‘‘ప్రాణాపాయం లేదు. కాకపోతే కత్తి కడుపులో బలంగా దిగింది. స్పృహలోకి రావడానికి టైమ్ పడుతుంది. మీరు ఆయన్ని చూడొచ్చు’’ అనేసి వెళ్లిపోయాడు. అందరూ లోనికి వెళ్లారు. సుభాష్ మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకు కావలసిన వివరాలు రాసుకున్నాడు. నిందితుడిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మనసులో మెదిలాడు... ఆ అపరిచిత వ్యక్తి. అతడైతే ఏమైనా క్లూస్ ఇవ్వగలడు. వెంటనే వెళ్లి బాధితుడి కొడుకుని అతని గురించి అడిగాడు. ‘‘అతనెవరో నాకూ తెలియదు సర్. తనూ వాకింగ్ చేస్తున్నాడట. అతని కళ్లెదురుగానే ఇదంతా జరిగిందట. నాన్న నా నంబర్ చెప్పి ఫోన్ చేయమనడంతో వెంటనే ఫోన్ చేశానని అన్నాడు. అతని పేరు... పేరు... నాగరాజు అని చెప్పినట్టు గుర్తు.’’ ‘‘అతను నీకు ఫోన్ చేసిన నంబర్ ఇవ్వు. తనని అడిగితే మరిన్ని వివరాలు తెలియవచ్చు’’ అన్నాడు సుభాష్. యువకుడు ఆ నంబర్ చెప్పాడు. వెంటనే నాగరాజుకి ఫోన్ చేసి అరగంటలో స్టేషన్‌కి రమ్మని చెప్పాడు సుభాష్. ‘‘మీరేం చేస్తుంటారు నాగరాజుగారూ’’... అడిగాడు సుభాష్. ‘‘మెహదీపట్నంలో హోటల్ నడుపుతున్నాను సర్.’’ ‘‘ఆ సంఘటన మీరు కళ్లారా చూశారా?’’ ‘‘చూశాను సర్. ఆయన నడచుకుంటూ వస్తున్నారు. నేను ఆయనకు ఎదురుగా వెళ్తున్నాను. ఇద్దరి మధ్యా కొంత దూరం ఉంది. అంతలో ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి ఆయన వెనుకగా వచ్చాడు. వెనుక నుంచి ఆయన్ని కత్తితో పొడిచేసి పారిపోయాడు. అందరం కలిసి ఆయన్ని అంబులెన్సులో హాస్పిటల్‌కి పంపించాం. అంతే సర్’’ అనేసి నిట్టూర్చాడు నాగరాజు. ‘‘ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు కదా? కరెక్ట్‌గానే చెప్తున్నారు కదా?’’ ‘‘అస్సలు లేదు సర్. కావాలంటే రాసి ఇస్తాను’’ అన్నాడు నాగరాజు కాన్ఫిడెంట్‌గా. ‘‘అయితే యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ నాగరాజూ’’ అన్నాడు సుభాష్. నాగరాజుతో పాటు కానిస్టేబుళ్లు కూడా అవాక్కయిపోయారు. ‘‘బాధితుడు కూడా మెహదీపట్నంలో ఈ మధ్యనే హోటల్ పెట్టాడు. అదీ నీ హోటల్ పక్కనే. నీ బిజినెస్ దెబ్బ తింటోందన్న అక్కసుతో నువ్వే అతణ్ని చంపాలనుకున్నావ్. అంతే కదా?’’ అన్నాడు సుభాష్. తడబడ్డాడు నాగరాజు. తన నేరం బయట పడిపోయింది అన్న తడబాటు అది. ఇంతకీ అతడే నేరస్థుడని సుభాష్ ఎలా కనిపెట్టాడు??? జవాబు: నాగరాజు సంఘటనను వివరిస్తూ... ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి వెన్నులో పొడిచాడని చెప్పాడు. కానీ కత్తి కడుపులో దిగిందని డాక్టర్ ముందే సుభాష్‌కి చెప్పాడు. అంటే నాగరాజు అబద్ధం చెబుతున్నాడు. దాన్నిబట్టి సుభాష్ ఓ రాయి వేశాడు. కరెక్ట్‌గా తగిలింది. -
వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు
మాస్కో: మొన్న భారతీయ వనిత. నేడు రష్యా వనిత.. వెలుగులోకి రానివారు ఇంకెందరో. ఎవరైతేనేం.. మొత్తానికి మహిళలు 'ధైర్యే సాహసే లక్ష్మీ' అన్నట్లుగా దూసుకుపోతున్నారు. కత్తులకు జంకకుండా, బాంబులకు బెదరకుండా దొంగల ఆటకట్టిస్తున్నారు. మున్ముందు మహిళలు ఉన్న షాపుల్లోకి వెళ్లాలంటేనే దొంగలు ఓ పదిసార్లు ఆలోచించుకుంటారేమో. అది రష్యాలోని ఓరెన్ బర్గ్.. అక్కడ ఓ పెద్ద ఫ్యాన్సీ, బేకరి, షాపు ఉంది. అందులో ఓ యువతి సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆమె వస్తువులు సర్దుకునే పనిలో ఉండగా ఓ దొంగ మంకీక్యాప్ కోటుతో లోపలికి వచ్చాడు. ఆమె ఏం కావాలి అని అడుగుతుండగానే కత్తి తీసి పొడిచేస్తా అని బెదిరించాడు. దీంతో ఆమె కొంచెం లోపలికి పరుగెత్తింది. ఆ దొంగ ఆమె భయపడిపోయిందిలే అనుకొని ఎంచక్కా క్యాష్ కౌంటర్లోకి తొంగిచూస్తూ చేత్తో అందులో క్యాష్ బుక్ డబ్బులు అందుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే ఆ యువతి ఒక పెద్ద పింగాణి కప్పు తీసుకొని వచ్చి అతడి తలపై బలంగా కొట్టింది. దాంతో బిత్తరపోయిన ఆ దొంగ వెంటనే తేరుకొని చేతికందినకాడికి తీసుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయాడు. -
కత్తితో వ్యక్తి హల్చల్
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సమీపంలో సోమవారం ఒక వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం కత్తితో గొంతుపై పొడుచుకుని, పడిపోయాడు. దీంతో అటుగా వెళ్లేవారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడిపేరు మధు అని తెలుస్తోంది.మహారాష్ట్రకు చెందిన వాడని భావిస్తున్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : ఏలూరు పట్టణంలోని చేపలతూము సెంటర్ వద్ద చిన్నికృష్ణ(34) అనే వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కత్తితో దాడి చేశారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు తెలిసింది. ఈ దాడిలో ఓ కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్‌తో పాటు మీసాల దుర్గారావు, మేకల కిట్టు, చిప్పాడ సాయి, జగదీశ్ అనే నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన చిన్నికృష్ణను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
రాజాపేట (నల్లగొండ) : ఓ కుటుంబ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ భర్త.. భార్యపై హత్యాయత్నం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేటలోని పాముకుంట గ్రామంలో మంగళవారం జరిగింది. వీరాస్వామి, రమా అనే దంపతులు పాముకుంటలో నివాసం ఉంటున్నారు. వారి మధ్య ఓ చిన్నపాటి వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో ఉన్న భర్త.. భార్యపై కత్తితో దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. చికిత్స కోసం అమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తితో సీఎం ఇంటిలో ప్రవేశానికి విఫలయత్నం!
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరిలోకి ఓ వ్యక్తి నిన్న (సోమవారం)కత్తితో ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. టీ. నరసీపురానికి చెందిన లింగరాజు (54) కొన్ని వ్యాఖ్యలు రాసిన తెల్లకాగితాన్ని పట్టుకుని ‘కావేరి’ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. అనుమానం వచ్చిన అక్కడి పోలీసులు అతడిని తనిఖీ చేయగా దుస్తుల లోపల దాచుకున్న కత్తి బయటపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మానసిక అస్వస్థతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, స్థానిక గ్రేహౌండ్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి, కొడుకుపై కత్తితో దుండగుల దాడి
-
ప్రమాదవశాత్తూ కత్తిపీటపై పడ్డ విద్యార్థి
ఆత్మకూర్(మహబూబ్‌నగర్): ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కత్తిపీటపై పడి గొంతు దగ్గర కాస్త తెగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన గొల్లశేఖర్(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పక్కనే ఉన్న కత్తిపీటపై పడటంతో గొంతుభాగం కొద్ది వరకు తెగింది. కుటుంబసభ్యులు అతడిని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తితో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నర్సలపల్లిలో ఓ వ్యక్తి కత్తితో ఆత్మహత్యాయత్నం చేయగా, తీవ్ర గాయాలపాలయ్యాడు. చింతపల్లికి చెందిన వాకిటి యాగయ్య (45) శనివారం నర్సలపల్లిలోని తన బావ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, మధ్యాహ్న సమయంలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వాహనంలో తరలిస్తున్నారు. -
కడుపులో కత్తి పెట్టి కుట్టేసిన డాక్టర్
-
ప్రాణాలకు తెగించిన కస్టమర్
-
గొంతుపై కత్తి పెట్టి దోపిడీ
అల్వాల్ (హైదరాబాద్) : ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడపై కత్తి పెట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని అల్వాల్ సూర్యానగర్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి.జయ(30) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి తలుపు తట్టారు. ఆమె తలుపు తీసిన వెంటనే ఒక దుండగుడు మెడపై కత్తి పెట్టగా, మరో దుండగుడు బీరువాలో ఉన్న లక్ష నగదును, పుస్తెలతాడు సహా 20 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన గృహిణి జయను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
విజయవాడ : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారి ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన విజయవాడ లబ్బిపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ లబ్బిపేటకు చెందిన నాగరాజు(30) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా భార్య రాజకుమారి(24)పై నాగరాజు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతంగా మారి గురువారం భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వివాహితపై ఓ వ్యక్తి కత్తితో దాడి
-
పీకలదాకా తాగి..పీక కోసుకున్నాడు
-
క్యాన్సర్‌ను ఇంట్లోనే చంపేయండి
క్యాన్సర్ వస్తే హాస్పిటల్ వరకూ వెళ్లాలి గానీ... అసలు రాకుండా ఉంచడానికి మన ఇల్లే చాలు. మరీ మాట్లాడితే దాన్ని చంపేయడానికి కిచెన్‌లోని కత్తి చాలు. ఆ కత్తితో ఆకుపచ్చటి ఆకుకూరలు కోసి వండటం, కూరగాయలు కట్ చేసి తినడం, మాంసాహారం తినే వేళ వెజిటబుల్ సలాడ్స్‌ను తయారు చేయడం వంటి చాలా తేలిక మార్గాలున్నాయి. సులువైన ఈ మార్గాలు అవలంబిస్తే చాలు... క్యాన్సర్ ఇంట్లోనే హతమైపోతుంది. పక్కాగా చెప్పాలంటే ఇవి నివారణలన్నమాట. చికిత్స కంటే నివారణ చాలా మంచిదని అంటారు కదా. అలాంటప్పుడు ఇంత తేలికైన మార్గాలున్నప్పుడు అనుసరించడమే మేలు కదా. క్యాన్సర్ నివారణకు సులువైన సూచనలివిగో...! ఇంట్లో సిగరెట్ పొగ వద్దు, బయటా వద్దు క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో పొగతాగడం ఒకటి. అది సిగరెట్, బీడీ, చుట్ట... ఇలా ఏ రూపంలోనైనా కావచ్చు. మొదట్లో అసలు పొగాకు దక్షిణ అమెరికాలోని స్థానికులకే పరిమితమై ఉండేది. అక్కడివాళ్లు పొగాకును ఒక ‘దివ్యమైన’ (ఎంథియోజెనిక్) అనుభూతి కోసం వాడుతుండేవాళ్లు. బ్రిటిష్ వాళ్లు దీన్ని తాము పాలించే అన్ని దేశాలకూ వ్యాప్తి చేశారు. మొదట్లో స్టైలిష్‌గా అనిపించే కనిపించే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని తెలుసుకున్న తర్వాత అదే పాశ్చాత్యులు దాన్ని వదిలేశారు. దాంతో అక్కడ పొగతాగడం వల్ల తగ్గిన మరణాల రేటు 24 శాతం. అదీ దాదాపు పదిహేనేళ్ల వ్యవధిలో. అంటే నాలుగోవంతు మరణాలు తగ్గాయన్నమాట. ఎందుకంటే పొగలో 4000కు పైగా రసాయనాలున్నాయి. అందులో క్యాన్సర్‌ను కలిగించేవి (కార్సినోజెనిక్) దాదాపు 50కు పైగా ఉన్నాయి. అందుకే పొగతో కలిగే ఎంథియోజెనిక్ అనుభూతి అబద్ధం. కానీ కార్సినోజెనిక్ ప్రమాదం మాత్రం నిజం అన్న వాస్తవం తెలుసుకుంటే చాలు. క్యాన్సర్‌కు మొదటి నివారణ ప్రారంభమైనట్టే. ఇక పొగ వెలువరించే సిగరెట్, బీడీ, చుట్టల తర్వాత పొగాకును గుట్కా, ఖైనీ, పాన్మసాలలా రూపంలో వాడటం అంటే క్యాన్సర్ కలిగించే విషాన్ని నేరుగా నోట్లోకి తీసుకుంటున్నట్టే అని గుర్తుంచుకోండి. పొగ ఏ రూపంలోనైనా ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిపేందుకు మరో ఉదాహరణ... మాంసాహారానికి మంచి రంగునూ, ఫ్లేవర్‌నూ, రుచినీ కలిగించేందుకు మాంసానికి పొగచూరించే ప్రక్రియ ఉంది. దీన్నే ‘స్మోకింగ్ ద మీట్’ అంటారు. ఇలా స్మోక్ చేసిన మాంసాహారం వల్ల పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. అంటే... పొగ ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రక్రియ ద్వారా దాన్ని తీసుకున్నా అది క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. అంటే పొగకు ఎంత దూరం ఉంటే క్యాన్సర్ నుంచి అంత దూరంలో ఉన్నట్లన్నమాట. కిచెన్ కత్తితో ఆకుకూరలు కోయండి పొగాకు క్యాన్సర్‌కు ఎంత దగ్గరి సంబంధం ఉందో... కూరలుగా ఉపయోగించే మిగతా ఆకులకు ఆ వ్యాధితో అంత శత్రుత్వం ఉంది. ఆకుపచ్చగా ఉండే ఏ ఆకుకూరలలోనైనా క్యాన్సర్‌తో పోరాడగల పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే పొగ... ఆకును దూరం చేసుకోండి. మిగతా ఆకులను కూరల రూపంలో దగ్గరకు తీసుకోండి. రుచి కోసం తప్పనిసరిగా మాంసాహారం తీసుకోవాలనే కోరిక ఉన్నవారు, చిహ్వచాపల్యాన్ని అణచుకోకుండా ప్రతి నాన్‌వెజ్ ముక్కతో పాటు, ఉడికించిన ఆకుకూరల సలాడ్స్‌ను తీసుకుంటే ఆ మాంసాహారపు ప్రమాదాలను ఈ ఆకుకూరల సలాడ్లు నివారిస్తూ ఉంటాయి. క్యాన్సర్ నివారణ- చాక్లెట్ లాంటి సూచన కోకో పాళ్లు ఎక్కువగా ఉండే ‘డార్క్ చాక్లెట్లు’ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఎందుకంటే కోకోలో ‘పెంటామెర్’ అనే ఫ్లేవనాయిడ్ ఉంది. దీనికి క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంది. అందుకే అప్పుడప్పుడూ ‘డార్క్ చాక్లెట్లు’ తింటూ ఉండండి. అలాగని అదేపనిగా తింటే దీని దుష్పరిణామాలు మళ్లీ మరోరూపంలో అంటే స్థూలకాయాన్ని పెంచడం ద్వారా పరోక్షంగా క్యాన్సర్‌కు దోహదపడటం రూపంలో కనిపించవచ్చన్నమాట. ఆ తీపి మేలు... ఈ తీపి చేదు : ముందు అనుకున్నట్లు డార్క్ చాక్లెట్ల తీపి క్యాన్సర్‌ను నివారిస్తుంది కదా. అలాగే చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి అంత మేలు కాదు. ఈ తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్‌ను కలిగించకపోయినా, బరువు పెంచడానికి తీపి పదార్థాలు దోహదం చేస్తుంటాయి. తీపితో చాలా వేగంగా బరువు పెరిగిపోతారు. అది చాలా రకాల క్యాన్సర్లకు రిస్క్ ఫ్యాక్టర్. అందుకే తీపిని ఒక రుచి కోసం చాలా పరిమితంగా మాత్రమే వాడుకోండి. చక్కెర ఎక్కువైతే మొహం మొత్తినట్లుగా... తీపి ఎక్కువైతే అది చేదు అనిపిస్తుంది. చేటు చేస్తుందని గుర్తుంచుకోండి. పోషకాహారం... క్యాన్సర్ వినాశకాహారం మంచి పోషకాహారం తీసుకోవడం క్యాన్సర్‌కు వినాశకరం. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న కూరగాయలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అవి క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి. ఉదాహరణకు టొమాటోలోని లైకోపిన్ అనే పోషకం క్యాన్సర్‌తో పోరాడుతుంది. అలాగే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటే క్యారట్ కూడా క్యాన్సర్‌తో మరింత శక్తిమంతంగా ఎదుర్కొంటుంది. అంందుకే ఆరోగ్యకరమైన పోషకాలు ఉండే తాజా ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఆ ఆహారం బెస్ట్... ఈ ఆహారం వేస్ట్ ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన ఆహారాలు, కృత్రిమ రసాయనాలు కలిపి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసే జంక్‌ఫుడ్ లాంటి ఆహారాలు క్యాన్సర్‌ను కలిగించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇందులోని కృత్రిమ రసాయనాలకు మన హార్మోన్లను ఉత్తేజితం చేసే గుణం. ఏదైనా సాధారణం కంటే ఎక్కువ ఉత్తేజితం అవుతున్నప్పుడు క్యాన్సర్ కణం పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆహారాల్లో పోషకాహారం ఎంత మంచిదో, ప్రాసెస్డ్ ఆహారాలు అంత హానికరమని గుర్తుంచుకోండి. వ్యాయామం చేయండి... క్యాన్సర్ నుంచి దూరంగా ఉండండి : మనం రోజూ నడుస్తున్నామంటే క్యాన్సర్ నుంచి దూరంగా నడుస్తున్నామని అర్థం. ఒక మనం రోజూ జాగింగ్ చేస్తున్నామంటే... క్యాన్సర్ నుంచి దూరంగా పరుగు తీస్తున్నామన్నమాట. శరీరానికి కదలికలు లేకుండా ఉంచడం వల్ల కొవ్వులు పేరుకుపోయి బరువు పెరుగుతుంది. ఇది క్యాన్సర్‌కు పరోక్ష కారణం అన్న సంగతి తెలిసిందే కదా. అందుకే మనలో కొవ్వులను తగ్గించడంతో పాటు, క్యాన్సర్‌తో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంచుకుంటున్నామని అర్థం. క్యాన్సర్‌తో పోరాడే శక్తిని పుంజుకుంటున్నామని అర్థం. అందుకే రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటైనా నడక, మెల్లగా పరుగు, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మీరూ నిద్రపోండి... క్యాన్సర్‌నూ నిద్రపుచ్చండి : వేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటుతో పాటు కంటి నిండా నిద్రపోవడం క్యాన్సర్‌నూ నిద్రపుచ్చుతుంది. ఎందుకంటే కంటినిండా నిద్రపోయినప్పుడు మనలో రకరకాల ఎంజైములనూ, హార్మోన్లనూ స్రవింపజేసే ‘ఎండోక్రైన్’ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. క్రమబద్ధంగా పనిచేస్తుంది. అదే కంటినిండా నిద్రలేకపోతే అది హార్మోన్ల స్రావాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. దాంతో కొన్ని హార్మోన్లు ఉత్తేజితమై అధికంగానైనా పనిచేయవచ్చు లేదా తగ్గనైనా తగ్గవచ్చు. దీంట్లో ఏది జరిగినా వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ నిద్రలేవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ను నిద్రపుచ్చడానికైనా కనీసం ఏడుగంటల పాటు మనం కంటినిండా నిద్రపోవాలి. ఇందులో పాటించడానికి ఏదీ కష్టమైన అంశం కాదు. అన్నీ ఇంట్లోనే అనుసరించదగిన సూచనలే. కాబట్టి క్యాన్సర్ నివారణ ఎంత సులువో తెలుసుకోండి. క్యాన్సర్‌ను తేలిగ్గా తీసుకోకండి. కానీ దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న తేలిక మార్గాలను మాత్రం అనుసరించండి. డాక్టర్ పి. విజయానంద్ రెడ్డి డెరైక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో హెల్త్ సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
కలికిరిలో నలుగురికి కత్తిపోట్లు..ఒకరి మృతి
చిత్తూరు(కలికిరి): చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుంటివీరన్నగాలిపల్లెలో సోమవారం నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. వీరిలో రమేశ్(18) అనే యువకుడు చనిపోగా, వెంకటేశ్, రాజశేఖర్, ఈశ్వరయ్య అనే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఓ యువతితో అసభ్యకరంగా మాట్లాడరనే విషయంలో అదే గ్రామానికి చెందిన అరిఫ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి యువకులపై దాడి చేసినట్టు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బర్త్‌డే వేడుకలకు పిలిచి బ్లేడుతో దాడి
-
ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు
హైదరాబాద్ సిటీ: నగరంలోని చిలకలగూడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడిచేసి అతడిని గాయపరిచింది. ప్రియురాలు తన లవర్ని వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో జరిగింది. ప్రియురాలి దాడిలో గాయాలపాలైన ప్రియుడిని స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. -
అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
గోల్నాక: ఇంట్లో మేకలు పెంచడం వల్ల దుర్వాసన వస్తుంది... వాటిని బయట కట్టేయాలని చెప్పిన అన్నను కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట ఆకాష్నగర్లో అర్షద్సయీద్, ఇఫ్తికర్ సయీద్, ఇంతియాజ్ సయీద్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో నివాసముంటున్నారు. ఇఫ్తికర్ ఇంట్లో మేకలను పెంచుతున్నాడు. మేకలు పెంచడంతో దుర్వాసన వస్తోంది బయట కట్టేయాలని చాలా రోజులుగా అర్షద్ తన తమ్ముడు ఇఫ్తికర్‌కు చెబుతున్నాడు. గురువారం కూడా మరోసారి ఇదే విషయమై అన్న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇఫ్తికర్ ఇంట్లోకి వెళ్లి గడ్డికోసే కత్తిని తీసుకొచ్చి అర్షద్‌పై దాడి చేశాడు. దీంతో అతని చేతికి గాయాలయ్యాయి. వెంటనే అతను అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో ఉన్మాదిగా మారి...
-
మనస్తాపంతో ఉన్మాదిగా మారి...
హైదరాబాద్ సిటీ : మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా భార్యాభర్తలపై కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా భర్త ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ వెంకటయ్య, కురువమ్మ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్ క్రిస్టియన్ కాలనీలో నివాసముంటూ కూలీ పని చేస్తున్నారు. గురువారం కూలీపనికి వెళ్లి వచ్చిన వెంకటయ్య దంపతులు బీఎన్‌రెడ్డినగర్‌లోని సాగర్ రహదారిపై ఉన్న కల్లు కాంపౌండుకి వెళ్లాడు. సరిగా అదే సమయంలో సరూర్‌నగర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన భువనగిరి ఆంటోని (38) కల్లు కాంపౌండ్‌లోకి వచ్చి తన దగ్గరున్న కత్తితో మద్యం మత్తులో భార్యాభర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో భార్యాభర్తల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక డెల్టా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య కురువమ్మ(35) మృతి చెందగా, భర్త వెంకటయ్య (40) చికిత్స పొందుతున్నాడు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నిందితుడు ఆంటోని సంతోష్‌నగర్‌లో ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాజత్సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 12 సంవత్సరాల క్రితం ఆంటోనిని భార్య వదిలి వెళ్లిపోయిందని, ఇటీవలే ఆంటోని మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె కూడా వదిలి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఆంటోని తన వెంట కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. తాగిన మైకంలోనే అన్యోన్యంగా ఉన్న వెంకటయ్య దంపతులపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడు ఆంటోనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మార్కెట్లో షాపుల గొడవ : కత్తులతో దాడి!
-
పండ్లవ్యాపారి దారుణ హత్య
గిద్దలూరు: గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని కత్తితో అతిదారుణంగా గోంతు కోసి చంపారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు హార్టికల్చర్ ఫాం వద్ద సోమవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఎస్కే జాకీర్‌హుస్సేన్(27) అరటిపండ్ల వ్యాపారం చేసేవాడు. సోమవారం కూడా ఎప్పటిలాగే ఆటోతో బేరానికి వెళ్లాడని అతని తల్లదండ్రులు చెప్తున్నారు. తన కొడుకుకు ఎవరితోనూ గొడవలు లేవని మృతుడి తండ్రి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!
నెల్లూరు జిల్లాలో కోళ్ల వ్యాపారిపై దుండగుల దాడి వరదయ్యుపాళెం: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. కడుపులో కత్తితో రక్తమోడుతున్న ఓ వ్యాపారి మోటార్‌సైకిల్‌పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించటం సోమవారం చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో కలకలం సృష్టించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కోళ్ల వ్యాపారి చంద్రమౌళి కొన్నేళ్లుగా శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుకండ్రిక, వరదయ్యపాళెం, తడ, తమిళనాడులోని ఆరంబాకం ప్రాంతాలకు బాయిలర్ కోళ్లు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి డబ్బు వసూలు చేసుకుని వెళుతుంటాడు. ఆ కోవలోనే సోమవారం దుకాణాల నుంచి వసూలు చేసుకున్న పెద్ద మొత్తంతో బయలుదేరాడు. వుధ్యాహ్నం 1.20 గంటల సవుయుంలో వరదయ్యుపాళెం - బత్తలవల్లం గ్రావూల వుధ్య అటవీ ప్రాంతమైన ఎనవూలగుంట సమీపంలో ఆయనను ముగ్గురు దుండగులు అడ్డగించి కత్తితో దాడి చేశారు. మెడపై కత్తితో నరికి, చాకుతో కడుపులో, చేతిపై పొడిచారు. అదే సవుయుంలో రోడ్డుపై వాహనాలు రావడం గమనించిన ఆ యువకులు పరారయ్యారు. పొట్టలో చాకు దిగబడి, తీవ్ర గాయూలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా చంద్రమౌళి తన మోటార్‌సైకిల్‌పై సంఘటన స్థలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు జిల్లా తడలోని ఓ కోళ్ల దుకాణం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనను వివరించి సృ్పహ కోల్పోయూడు. రక్తమోడుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వరదయ్యుపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య
-
నయీం హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్ బోలక్ నగర్ లో అర్థరాత్రి జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ వివాదం కారణంగా నయీంఖాన్ అనే వ్యక్తిపై నలుగురు యువకులు దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. ఇందుకు సబంధించి ఇద్దరు నిందితులు రబ్బానీ, షరీఫ్‌లను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి రియల్ మాఫియా బుసలు కొట్టింది. ఓ స్థల వివాదం విషయంలో ఎక్స్ సర్వీస్‌మెన్ నయీం ఖాన్‌పై ముగ్గురు దుండగులు దాడిచేశారు. కత్తి నయీం కణతలో దిగడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బోలక్ నగర్‌లోని 600 గజాల స్థలం విషయంలో మృతుడు నయీంకు స్థానికంగా ఉండే ఇమ్రాన్‌కు ఏడాది కాలంగా గొడవ జరుగుతుంది. ప్రస్తుతం ఆ కేసు వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న అక్కసుతోనే నయీంను చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏలూరు హైవేపై దొంగల బీభత్సం!
-
అధికారులమంటూ ఏలూరు హైవేపై దోపిడి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై దుండగులు మరోసారి తెగబడ్డారు. ఆర్టీఏ అధికారుల ముసుగులో వచ్చిన దుండగులు .... ఓ లారీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి నగదుతో పరారయ్యారు. కోల్కటా నుంచి చెన్నై వెళ్తున్న లారీని అర్థరాత్రి బైక్‌లతో వెంబడించిన అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దుగ్గిరాల సమీపంలోకి రాగానే లారీని ఆపారు. డ్రైవర్ సందీప్‌ను కిందకు దింపి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.25వేల నగదును దోచుకెళ్లారు. వెనుకాలే వస్తున్న అదే కంపెనీకి చెందిన మరో లారీ డ్రైవర్ రక్తపు మడుగులో పడివున్న సందీప్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. తీవ్రంగా గాయపడిన సందీప్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఏలూరు త్రీ టౌన్ సీఐ తెలిపారు. -
మద్యం మత్తులో భార్య గొంతు కోసాడు!
-
వివాహేతర బంధాన్ని బయట పెట్టిందని...
-
ప్రేమించలేదని చంపేశాడు
న్యూఢిల్లీ: ప్రేమించడంలేదనే ఒకేఒక్క కారణంతో యువతిని హతమార్చాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని వెల్కమ్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లి సుహానాతో కలిసి ఓ గదిలో నిద్రిస్తున్న ఫర్హా(20)పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తల్లి చూస్తుండగానే కత్తితో పొడిచాడు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సుహానాను కూడా తీవ్రంగా గాయపర్చాడు. కాగా ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రేమించమంటూ తన వెంట పడుతుం డడంతో ఫర్హా అతనిపై కేసు పెట్టిందని, దీంతో జైలుపాలై, బెయిల్‌పై వచ్చి, మళ్లీ ఫర్హా వెంట పడడంతో గురువారం ఆమె తల్లితో కలిసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫర్హాపై కక్ష పెంచుకొని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో ఫర్హా అక్కడికక్కడే మరణించగా ఆమెను కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, దారుణానికి పాల్పడిన వ్యక్తి కోసం వేట ప్రారంభించామని పోలీసులు తెలిపారు. -
ప్రేమించాలంటూ విద్యార్థినిపై కత్తితో దాడి!
-
ప్రేమించాలంటూ విద్యార్థినిపై కత్తితో దాడి
నిజామాబాద్: ప్రేమించాలంటూ ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి కత్తితో చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆర్కే డిగ్రీ కాలేజీలో బుధవారం చోటుచేసుకుంది. డిగ్రీ సెకండియర్ చదువుతున్న స్నేహపై సహ విద్యార్థి సాయికుమార్ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె మెడ, చేతికి గాయాలు అయ్యాయి. అనంతరం సాయి కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ...వారిద్దర్నీ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జ్యోతి కాదు..అపరకాళిక
కత్తితో దాడికి యత్నించిన దుండగుడిపై తిరగబడిన యువతి కళ్యాణదుర్గం : దుండగుడు కత్తితో దాడి చేసినా ఆ యువతి వెరవలేదు. భయపడలేదు. అందరి ఆడపిల్లల్లా దౌర్జన్యానికి తలొగ్గలేదు. ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూడలేదు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చాకచక్యంగా దుండగుడి చేతిలోని కత్తి లాక్కొని అపరకాళికగా మారింది. దీంతో దుండగుడు కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దొడ్డగట్టరోడ్డులో నాగరాజు, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కుమార్తె జ్యోతి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జ్యోతి.. దొడ్డగట్ట రోడ్డులోని పూర్ణానంద స్వామి ఆశ్రమం వద్దకు రోజు పాలు ఇచ్చి ఇంటికి వచ్చేది. రోజువారి తరహాలోనే శనివారం సాయంత్రం ఆశ్రమంలో పాలు ఇచ్చి బయల్దేరింది. ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని యువకుడు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని కత్తితో దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన జ్యోతి..ఆ వ్యక్తిని ఒక చేత్తో గొంతుపట్టుకుని మరో చేతితో కత్తి గుంజుకుంది. దీంతో దుండగుడు జ్యోతి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న కంపచెట్లలోకి పరుగులు తీశాడు. అనంతరం జ్యోతి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
విద్యార్థిని గొంతు కోసి పరారైన ఆగంతకులు
నల్లొండ జిల్లాలో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్కూల్‌కి వెళ్తున్న దివ్యపై కొంత మంది ఆగంతకులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతు కోసి పరారైయ్యారు. దాంతో దివ్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే దివ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దివ్యపై దాడి ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
అక్కాచెల్లెళ్ల నుంచి ఆభరణాల దోపిడీ
మొయినాబాద్, న్యూస్‌లైన్: ప్యాసింజర్ ఆటోలాగా నమ్మించి అక్కాచెల్లెళ్లను ఎక్కించుకుపోయారు. కత్తితో బెదిరించి ఆభరణాలను దోచుకుపోయారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోల్కట్ట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామానికి చెందిన విజయలక్ష్మి, పరమేశ్వరి అక్కాచెల్లెళ్లు. వీరు మంగళవారం ఉదయం మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు మొయినాబాద్ బస్‌స్టాప్‌లో నిరీక్షిస్తున్నారు. కాగా వీరిని ముందునుంచే గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ ఆటోలో వచ్చారు. ఆటో చేవెళ్లకు వెళ్తుంది.. వస్తారా..? అని అడిగారు. దీంతో అక్కాచెల్లెళ్లు ప్యాసెంజర్ ఆటోగా భావించి అందులో ఎక్కారు. ఆటో మార్గంమధ్యలో ఆపకుండా నేరుగా మండలంలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వైపు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. దీంతో వారికి అనుమానం వచ్చి అడిగారు. పక్కనే కూరగాయలు ఉన్నాయని, వాటిని తీసుకొని చేవెళ్లకు వెళ్దామని చెప్పడంతో వారు మిన్నకున్నారు. కొద్దిదూరం లోపలికి తీసుకెళ్లి ఆటో ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు నగలు (కమ్మలు, గొలుసులు)తో పాటు 30 తులాల వెండి పట్టాలు దోచుకొని మహిళలను అక్కడే వదిలేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోడ్డుపైకి వచ్చారు. స్థానికుల సాయంతో చేవెళ్ల పోలీసులను ఆశ్రయించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరిధి మొయినాబాద్ ఠాణాలోకి వస్తుందని తెలిపారు. దీంతో బాధితులు సీఐ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.