
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద కలకలం చోటు చేసుకుంది. కమిషనరేట్ ముందు ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడు కత్తితో కమిషనరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. రిసెప్షన్ వద్ద నిర్వహించిన తనిఖీలో యువకుడి వద్ద కత్తిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కత్తితో కమిషనరేట్‌లోకి చొరబడేందుకు యత్నించిన యువకుడిని మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి యువకుడు అనుమానాస్పదంగా సీపీ కార్యాలయం వద్ద తిరగటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని ఆపి తనిఖీలు చేశారు. మెటల్ డిటెక్టర్‌లో ఆ యువకుడి వద్ద కత్తి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment